Heaters
-
Beijing Cold Wave: రికార్డులు బ్రేక్ !
బీజింగ్:చైనాను చలి గడ్డ కట్టిస్తోంది.1951లో ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభించినప్పటి నుంచి బీజింగ్‌లో డిసెంబర్ నెలలో అతి ఎక్కువ రోజులు కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి జీరో దాటి మైనస్‌లోకి వెళ్లిన ఉష్ణోగ్రతలు ఆదివారం జీరో డిగ్రీకి చేరుకున్నాయి. మొత్తం చైనాను ఈ నెలలో కోల్డ్ వేవ్ కమ్మేసింది. దేశవ్యాప్తంగా హీటర్లు పనిచేస్తుండడంతో పవర్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో పవర్ ప్లాంట్లు వాటి పూర్తి సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. సామర్థ్యానికి మించి పని చేస్తుండటంతో సెంట్రల్ ప్రావిన్స్ హెనాన్‌లో పలు పవర్ ప్లాంట్లు ఫెయిల్ అయ్యాయి. ఆస్పత్రులు, స్కూళ్లు, గృహాల్లో హీటర్లు పనిచేయడానికే మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కంపెనీల్లో హీటర్లు నిలిపివేశారు. తీవ్రమైన మంచు కురవడం వల్ల బీజింగ్‌లో ఈ నెల మొదటి వారంలో రెండు మెట్రో రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న డజన్ల కొద్ది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర చైనాలోని గన్సు ప్రావిన్సులో ఇటీవల సంభవించిన భూకంప రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది. ఇదీచదవండి..ఆ విమానం ఎట్టకేలకు టేకాఫ్ ! -
‘సోలో స్టవ్ టవర్’..చలి భయమే అక్కర్లేదు
‘సోలో స్టవ్ టవర్’.. ఇది ఔట్‌డోర్ హీటర్. చలికాలంలో ఆరుబయట పిక్నిక్లు వంటివి జరుపుకోవాలంటే, వణికించే చలికి జంకుతారు చాలామంది. ‘సోలో స్టవ్ టవర్’ వెంట ఉంటే ఆరుబయట చలి భయమే అక్కర్లేదు. ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకుపోవచ్చు. ఆరుబయట పిక్నిక్ పార్టీలు చేసుకునే చోట దీనిని వెలిగించుకుంటే చాలు, నిమిషాల్లోనే పరిసరాలను వెచ్చబరుస్తుంది. దీనిని వెలిగించిన మూడు నిమిషాల్లోనే పదడుగుల వ్యాసార్ధం పరిధిలోని పరిసరాలను వెచ్చబరుస్తుంది. దీనిలోకి ఇంధనంగా కలప పొట్టుతో తయారైన ‘వుడెన్ పెల్లెట్స్’ వాడాల్సి ఉంటుంది. అమెరికన్ కంపెనీ ‘సోలో స్టవ్’ ఈ టవర్ హీటర్‌ను ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 1000 డాలర్లు (రూ.82 వేలు) మాత్రమే! -
కిమ్ దురాగతం.. గడ్డకట్టే చలిలో అరగంట సేపు నిలబెట్టి..
North Korea’s Kim Jong-un uses hidden heaters: క్రూరమైన పాలనకు పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ ఎప్పుడు ఏదోఒక విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉంటారు. ఆయన తీసుకునే వింతవింత నిర్ణయాలతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాలా చేసి వివాదాస్పద నాయకుడిగా పేరుగాంచాడు. ఇదిలా ఉండగా తాజగా కిమ్ దురాగతం మరోసారి బయటపడింది. వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి 80వ జయంతి సందర్భంగా సంజియోన్ నగరంలోని ఆరుబయట గడ్డకట్టే చలిలో తన తండ్రి విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో వేలాది ప్రజలను గడ్డకట్టే చలిలో బ్లౌజులు, టోపీలు ధరించకుండా నిలబడి తన తండ్రికి సంబంధించిన ప్రసంగం వినేలా చేశాడు. అయితే జోన్ తన అధికారులతో పాటు కూర్చొన్న డెస్క్ వద్ద హీటర్లు వినియోగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాదు అక్కడ ఉన్న రెడ్ కార్పెట్ వద్ద ఉన్న వైర్ల గుంపును బట్టి అంచనా వేయొచ్చని మీడియా ప్రతినిధులు అన్నారు. అంతేకాదు కిమ్ ఇంతకుముందు డిసెంబర్ 2019లో కూడా గడ్డకట్టే చలిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడూ కూడా హీటర్ల వినియోగించినట్లు బయటపడింది. 2011లో కిమ్ జోంగ్-ఇల్ మరణానంతరం అధికారం చేపట్టిన కిమ్ జోంగ్-ఉన్ తన దివంగత తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 'డే ఆఫ్ షైనింగ్ స్టార్' కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏది ఏమైన కిమ్ ప్రజలను బాధించేలా తీసుకునే క్రూరమైన చర్యలు కారణంగానే ఆయన తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. (చదవండి: యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు) -
వైరల్: ఇక నుంచి పులిరాజాకు చలిపెట్టదు
కాస్త చలి పెడితే చాలు.. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి వందసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఎప్పుడూ బయటే తిరుగాడే మూగ జంతువులకు చలి పెట్టదా అంటే పెడుతుంది. అవి కూడా మనుషుల్లానే చలి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాయి. మరి జూలో ఉండే జంతువుల మాటేమిటి? అవి ఎలాంటి చలిలోనైనా వణుకుతూ బాధపడాల్సిందేనా అనిపించక మానదు. కానీ అస్సాంలోని గౌహతి జూ అధికారులకు కూడా సరిగ్గా ఈ ప్రశ్నే తట్టింది. వాటి కోసం ఏదైనా చేయాలని భావించిన అస్సాం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ అధికారులకు చక్కని ఐడియా తట్టింది. బోనులో ఉన్న పులుల, సింహాలు వెచ్చదనాన్ని అనుభూతి చెందేందుకు ఎన్‌క్లోజర్ వెలుపల హీటర్లను ఏర్పాటు చేశారు. అయితే అన్ని జంతువులకు హీటర్ అంత మంచిది కాదు. దీంతో పచ్చిక బయళ్లపై తిరుగాడే జింక, తదితర జంతువుల కోసం ప్యాడీ స్ట్రాలను అక్కడి గడ్డిపై పరిచారు. పాపం.. మూగ జీవాలకు ఎంత కష్టం వచ్చిందని కొందరు నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. జంతువులను బంధించకుండా వదిలేస్తే అయిపోయేది కదా అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
జాదవ్... ప్రయోగాలు ఆదుర్స్
నార్నూర్: వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ పట్నం పిల్లలకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు గ్రామీణ విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని రాజులాగూడకు చెందిన 8వ తరగతి గిరిజన విద్యార్థి జాదవ్ సాయికిరణ్ పలు ప్రయోగాల ద్వారా హీటర్లు, మీక్సీలు తయారుచేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. నడ్డంగూడ గ్రామానికి జాదవ్ గణేశ్, శారదబాయిలకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. సాయికిరణ్ తండ్రి అనారోగ్యంతో మూడేళ్లక్రితం మరణించారు. తల్లి శారదబాయి రాజులాగూడలోని తల్లి కౌసల్యబాయి ఇంట్లో ఉంటూ చిన్న కిరాణం దుకాణం నడుపుతూ ఇద్దరు పిల్లలను చదిస్తోంది. ఆమె వీరికి మార్కెట్ నుంచి రిమోట్లతో నడిచే కారు, జీపులు, విమనాలాంటి ఆట బొమ్మలను ఆడుకోవడానికి తీసుకొవచ్చేది. సాయికూమార్ వీటితో ఆడుతూ అందులో ఉండే మోటర్లను ఉపయోగించి హీటర్, మీక్సీలు తయారుచేశాడు. అతను తయారు చేసిన మీక్సీతో అరకిలో వరకు ఏదైనా పొడిని మిక్సీ పట్టవచ్చంటున్నాడు. హీటర్ ద్వారా 5 లీటర్ల వరకు నీళ్లు వేడి చేసుకోచ్చని ఆయన చేసి చూపెడుతున్నాడు. హీటర్ తయారీ.. పొడవువైన రేకును తీసుకోని, సగం విరగ్గొట్టి రెండు రంధ్రాలు చేయాలి. అందులో విద్యుత్ వైర్లను అమర్చి, బ్యాటరీ సెల్స్‌కు పెట్టినట్లైతే అది వే డెక్కి గిన్నెలో ఉన్న 5 లీటర్ల నీళ్లు వేడి చేస్తుంది. మిక్సీ తయారీ.. ఒక డబ్బాను తీసుకొని, కింద రంధ్రం చేయాలి. దానికి కిందభాగంలో ఆట వస్తువులకు వాడే రిమోట్ కారు మోటర్‌ను బిగించాలి. మోటర్ పై భాగాన లేజర్ బ్లెడ్‌ను అమర్చిన తరువాత మోటర్‌కు విద్యుత్ తీగలతో కనెక్షన్ ఇచ్చి, ఆ తీగలను బ్యాటరీ సెల్‌కు పెడితే మిక్సీ పనిచేస్తుంది. దీంతో అరకిలో ధనియాల పొడి పట్టవచ్చు. ఇలాంటి ప్రయోగాలు చేసి చూపెడుతూ.. అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్న సాయికిరణ్.. భవిష్యత్‌లో ఈ ప్రయోగాలతో రాణించాలన్నదే తన లక్ష్యమంటున్నాడు.