photo credit: HINDUSTAN TIMES
బీజింగ్:చైనాను చలి గడ్డ కట్టిస్తోంది.1951లో ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభించినప్పటి నుంచి బీజింగ్‌లో డిసెంబర్ నెలలో అతి ఎక్కువ రోజులు కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి జీరో దాటి మైనస్‌లోకి వెళ్లిన ఉష్ణోగ్రతలు ఆదివారం జీరో డిగ్రీకి చేరుకున్నాయి.
మొత్తం చైనాను ఈ నెలలో కోల్డ్ వేవ్ కమ్మేసింది. దేశవ్యాప్తంగా హీటర్లు పనిచేస్తుండడంతో పవర్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో పవర్ ప్లాంట్లు వాటి పూర్తి సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. సామర్థ్యానికి మించి పని చేస్తుండటంతో సెంట్రల్ ప్రావిన్స్ హెనాన్‌లో పలు పవర్ ప్లాంట్లు ఫెయిల్ అయ్యాయి. ఆస్పత్రులు, స్కూళ్లు, గృహాల్లో హీటర్లు పనిచేయడానికే మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కంపెనీల్లో హీటర్లు నిలిపివేశారు.
తీవ్రమైన మంచు కురవడం వల్ల బీజింగ్‌లో ఈ నెల మొదటి వారంలో రెండు మెట్రో రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న డజన్ల కొద్ది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర చైనాలోని గన్సు ప్రావిన్సులో ఇటీవల సంభవించిన భూకంప రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment