
North Korea’s Kim Jong-un uses hidden heaters: క్రూరమైన పాలనకు పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ ఎప్పుడు ఏదోఒక విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉంటారు. ఆయన తీసుకునే వింతవింత నిర్ణయాలతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాలా చేసి వివాదాస్పద నాయకుడిగా పేరుగాంచాడు. ఇదిలా ఉండగా తాజగా కిమ్ దురాగతం మరోసారి బయటపడింది.
వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి 80వ జయంతి సందర్భంగా సంజియోన్ నగరంలోని ఆరుబయట గడ్డకట్టే చలిలో తన తండ్రి విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో వేలాది ప్రజలను గడ్డకట్టే చలిలో బ్లౌజులు, టోపీలు ధరించకుండా నిలబడి తన తండ్రికి సంబంధించిన ప్రసంగం వినేలా చేశాడు. అయితే జోన్ తన అధికారులతో పాటు కూర్చొన్న డెస్క్ వద్ద హీటర్లు వినియోగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాదు అక్కడ ఉన్న రెడ్ కార్పెట్ వద్ద ఉన్న వైర్ల గుంపును బట్టి అంచనా వేయొచ్చని మీడియా ప్రతినిధులు అన్నారు.
అంతేకాదు కిమ్ ఇంతకుముందు డిసెంబర్ 2019లో కూడా గడ్డకట్టే చలిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడూ కూడా హీటర్ల వినియోగించినట్లు బయటపడింది. 2011లో కిమ్ జోంగ్-ఇల్ మరణానంతరం అధికారం చేపట్టిన కిమ్ జోంగ్-ఉన్ తన దివంగత తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 'డే ఆఫ్ షైనింగ్ స్టార్' కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏది ఏమైన కిమ్ ప్రజలను బాధించేలా తీసుకునే క్రూరమైన చర్యలు కారణంగానే ఆయన తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
(చదవండి: యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు)
Comments
Please login to add a commentAdd a comment