freezing
-
World IVF Day ఎగ్ ఫ్రీజింగ్‌పై మహిళల్లో ఆసక్తి : అటు పురుషుల్లో కూడా!
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మారుతున్న జీవనశైలి లాంటివి సంతానలేమి పెరగడానికి కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్స కోసం 35 ఏళ్లు పైబడిన మహిళలు వస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22-23 సంవత్సరాలే ఉండటం ఆందోళనకరంగా ఉంది. అయితే, గత దశాబ్దంలో పురుషులలో సంతానరాహిత్య సమస్యను అంగీకరించడంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.తెలంగాణలోనూ పురుషులు, మహిళల్లో సంతానరాహిత్యం పెరుగుతోంది. సంతానసాఫల్య రేటు రాష్ట్రంలో తగ్గుతోంది. ఒక్కో మహిళకు సగటున 2.1 మంది పిల్లలు ఉండాలి గానీ, 1.8 మంది ఉంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల మాట్లాడుతూ. “పదేళ్ల క్రితం కొంతమంది పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇది తీవ్రంగా మారింది. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణం చాలా తక్కువగా ఉంటోంది. మహిళల్లో, అండం నాణ్యతలో తగ్గుదల గమనించినా, అడెనోమైయోసిస్ కేసులు కూడా ఉంటున్నాయి. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కలిగించే సమస్య. ఒక దశాబ్దం క్రితం, సమాజానికి భయపడి సంతానసాఫల్య చికిత్్లకు అంతగా ముందుకు వచ్చేవారు కారు, ప్రజలను ఒప్పించలేకపోయేవాళ్లం. ఇప్పుడు మా వద్దకు వచ్చేవారిలో 30% మంది ఈ చికిత్సకు ఆమోదం తెలుపుతున్నారు. పదేళ్లతో పోలిస్తే ఇది మంచి మార్పు. గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) లాంటి పరీక్షలను ఉపయోగించి ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆవిష్కరణలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరగడానికి దోహదపడతాయి.సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి వల్ల సంతానసాఫల్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పిల్లలు పుట్టని జంటలకు కొత్తఆశ, మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దాంతోపాటు.. క్రియోప్రిజర్వేషన్ వల్ల ఇప్పుడు అండాలు, వీర్యం, పిండాలను కూడా సమర్థంగా నిల్వచేయగలుగుతున్నాం. దీనివల్ల ఎవరైనా కొంత వయసు తర్వాత పిల్లలు కావాలనుకున్నా అది సులభమే అవుతుంది” అని వివరించారు.నోవా ఐవీఎఫ్‌లో మరో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “సంతానసాఫల్య చికిత్సలో సాంకేతికపరమైన అభివృద్ది చాలా వచ్చింది. తమ జీవ గడియారం గురించి, సంతానసాఫల్యంలో దాని పాత్ర గురించి మహిళలకు అవగాహన పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 50 నంచి 100 మంది దీనికోసం అడిగేందుకు వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అస్సలు అడిగేవారే కారు. పిల్లలు తర్వాత కావాలనుకుంటే, తమ అండాలు, వీర్యం, లేదా పిండాలను కూడా ఫ్రీజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది” అని తెలిపారు.పురుషుల సంతానరాహిత్య అంగీకారంలో మార్పుసంతానరాహిత్య సమస్యలకు పరీక్షలు చేయించుకోవడంలో పురుషుల ఆలోచనా విధానం గణనీయంగా మారిందని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు చెబుతున్నారు. ఒక దశాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేషణ చేయించుకోవడానికి వెనకాడేవారు. పురుషుల వల్ల కూడా సంతానరాహిత్య సమస్యలు వస్తాయని గుర్తించడానికే ఇష్టపడేవారు కారు. కానీ ఇప్పుడు వీర్యం విశ్లేషణ విషయంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తద్వారా పురుషుల సంతానసాఫల్య ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలతో, సంతాన సాఫల్య చికిత్సలను అందించడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న సమగ్ర సంతాన సాఫల్య చికిత్సా కేంద్రం. -
గుజరాతీ కుటుంబం మృతి కేసు.. యూఎస్‌లో భారత సంతతి వ్యక్తి అరెస్ట్!
రెండేళ్ల క్రితం(2022) జరిగిన మావన అక్రమ రవాణా ఘటనలో విచారించేందుకు భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికాలోని చికాగోలో అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులు గల గుజరాతీ కుటుంబం కెనడా నుంచి చట్టవిరుద్ధంగా యూఎస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా వారు చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అమెరికా అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో భారత సంతతికి చెందిన హర్షకుమార్ రామన్‌లాల్ పటేల్‌ను చికాగోలోని ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. రామన్ ఫిబ్రవరి 28న నిర్బంధ విచారణకు హాజరుకానున్నారని చికాగో ట్రిబ్యూన్ పేర్కొంది. డర్టీ హ్యారీ, పరంసింగ్, హరేష్ రమేశ్‌లాల్ పటేల్ తదితర పేర్లతో చలామణీ అవుతున్న పటేల్.. విదేశీయులను అక్రమంగా రవాణా చేయడం, ఇందుకు కుట్ర పన్నడం లాంటి అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. మానవ అక్రమ రవాణా కుట్రలో పటేల్ ప్రమేయంపై మిన్నెసోటా జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. 2022, జనవరి 19న జరిగిన మానవ అక్రమ రవాణాపై ఈ కోర్టులో విచారణ జరుగుతోంది. భారత్‌లోని గుజరాత్‌కు చెందిన జగదీష్ పటేల్( 39)తో పాటు అతని కుటుంబ సభ్యులైన వైశాలిబెన్ పటేల్ (37), విహంగీ పటేల్ (11), ధార్మిక్ పటేల్ (3)లు కెనడా సరిహద్దులోని ఎమర్సన్, మానిటోబా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ, చలికి తట్టుకోలేక గడ్డ కట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు, స్వాధీనం చేసుకుని, ఈ కేసుతో సంబంధమున్న స్టీవ్ షాండ్ (47)ను అరెస్ట్ చేశారు. హర్షకుమార్ పటేల్, షాండ్ మధ్య కమ్యూనికేషన్ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని గ్యాంబ్లింగ్ నిర్వహణకు హర్షకుమార్ రామన్‌లాల్ పటేల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడని షాండ్ తెలిపాడు. వీరిద్దరూ ఫోన్లో పలు విషయాలు మాట్లాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2022, జనవరి 19న నార్త్ డకోటా, మిన్నెసోటాలలోని చలి వాతావరణం గురించి వీరు ఫోనులో చర్చించుకున్నారు. మంచు తుఫాను పరిస్ధితులు ఉన్నందున జగదీష్ పటేల్ కుటుంబ సభ్యులంతా తగిన దుస్తులు ధరించారో లేదో చూడాలని షాండ్‌కు పటేల్ ఓ సందేశంలో సూచించాడు. ఈ కేసు విచారణకు సంబంధించి ఢిల్లీలోని హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) అధికారి గుజరాత్ పోలీసులతో సమావేశమైనట్లు మిన్నెసోటా జిల్లా కోర్టు పేర్కొంది. -
ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?
నాకిప్పుడు 32 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. నా కెరీర్ వల్ల పిల్లలను ప్లాన్ చేసుకోవడం లేట్ అవుతోంది. ఒకవేళ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్‌కి వెళితే.. ఇప్పటికిప్పుడు నా ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఒక అయిదారేళ్ల తర్వాత పిల్లల్ని కనాలనుకుంటే సాధ్యమేనా? అప్పటికీ ఎగ్స్ ఇంతే క్వాలిటీతో ఉంటాయా? ప్రెగ్నెన్సీ క్యారీ చేయడంలో అయిదారేళ్ల తర్వాత నా ఏజ్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయా? నా డౌట్స్ క్లియర్ చేయగలరు. మీ ఆన్సర్స్ మీదే నేను పిల్లలను ప్లాన్ చేసుకోవడం డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే నా హజ్సెండ్ సహా మా ఇంట్లో వాళ్లంతా ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ని ఒప్పుకోవట్లేదు. పేరు, ఊరు రాయలేదు. ఎగ్ ఫ్రీజింగ్ని oocyte cryopreservation అంటారు. ఈ ప్రొసీజర్‌లో అండాశయాల నుంచి అండాలను తీసి ఫ్రీజ్ చేసి అన్ఫర్టిలైజ్డ్ స్టేట్‌లో ఉంచుతారు. భవిష్యత్‌లో గర్భందాల్చాలి అనుకున్నప్పుడు ఆ ఎగ్స్‌ని ఫర్టిలైజేషన్కి ఉపయోగించి.. ఐవీఎఫ్ ద్వారా గర్భందాల్చేలా చేస్తారు. ఇంతకుముందు 38–40 ఏళ్ల స్త్రీలు ఈ ప్రక్రియను ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో oocyte క్వాలిటీ చాలా త్వరగా తగ్గిపోతోంది. ఇప్పుడు 30–35 ఏళ్లక్కూడా ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేవాళ్లు ఈ ప్రక్రియ ద్వారా ఆరోగ్యకరమైన అండాలను ఫ్రీజ్ చేసుకునే సౌకర్యాన్ని చాలా ఆసుపత్రులు కల్పిస్తున్నాయి. ఇలా ఫ్రీజ్ చేసిన అండాలను పదేళ్ల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే 35 ఏళ్లు దాటితే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి దీన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాదు ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలోనూ కొన్ని రిస్క్స్ ఉన్నాయి. ఫ్రోజెన్ ఎగ్స్ cryo freezing ప్రాసెస్‌లో కొన్నిసార్లు డామేజ్ కావచ్చు. కంటామినేషన్ రిస్క్ కూడా ఉంటుంది. అండాశయాల నుంచి అండాలను తీసే సమయంలో ఆ ప్రక్రియకు సంబంధించి అంటే బవెల్ గాయపడడం, రక్తనాళాలు గాయపడడం వంటి రిస్క్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువ అండాలను తీయడానికి ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్కి కొంతమందికి పొట్టలో నొప్పి, ఛాతీ నొప్పి రావచ్చు. వీటిని మందులతో తగ్గించవచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ 5 శాతం కేసెస్‌లో కనపడతాయి. 0.1 శాతం కేసెస్‌లో బ్లడ్ క్లాట్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్ వంటివాటితో కాంప్లికేషన్స్ తీవ్రంగా ఉంటాయి. బిడ్డకు బర్త్ డిఫెక్ట్స్ విషయానికి వస్తే.. నేచురల్ ప్రెగ్నెన్సీలో ఎంత శాతం రిస్క్ ఉంటుందో ఫ్రోజెన్ ఎగ్స్‌తో వచ్చే ప్రెగ్నెన్సీలోనూ అంతే రిస్క్ ఉంటుంది. అదనంగా ఏమీ ఉండవని అధ్యయనాల్లో ప్రూవ్ అయింది. ఫ్రోజెన్ ఎగ్స్‌తో ప్రెగ్నెన్సీ 30 – 60 శాతం వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఎగ్ ఫ్రీజింగ్ సమయంలోని మీ వయసు మీద ఆధారపడి ఉంటుంది. --డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: 'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'! ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!) -
బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
బ్రెడ్‌ని మిగతా ఆహార పదార్థాల్లానే ఫ్రిజ్‌లో పెడుతుంటారు చాలమంది. అయితే ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన బ్రెడ్‌ని ఆహారంగా తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిందటూ చాలా షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎలా ప్రిజ్‌లో ఉంచిన నిల్వ బ్రెడ్ మంచిది? ఎలా ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది? నిజానికి బ్రెడ్ వంటివి ఎక్కువ తీసుకోవద్దని డాక్టర్లు చెబుతుంటారు. వాటిలో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని, పైగా బేక్ చేసే బేకరీ పదార్థాలని అస్సలు వద్దనే చెబుతారు. అలాంటిది ప్రిజ్‌లో నిల్వ ఉంచిన బ్రెడ్‌ని మాత్రం తీసుకుంటే మంచిదని వైద్యులు ఎలా చెబుతున్నారు?. పైగా పరిశోధనలో ఇలాంటి బ్రెడ్ తీసుకున్న వారిలో మంచి ఫలితం కనిపించిందంటూ ఆశ్చర్యకర విషయాలు చెబుతున్నారు పోషకాహార నిపుణుడు డాక్టర్ అమీ షా. ఎందువల్ల మంచిందంటే..? తాజా వైట్ బ్రెడ్ కంటే నిల్వ ఉంచిన బ్రెడ్ మంచిది. అదికూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉన్నది మంచిదని అంటున్నారు. ఇలా ఫ్రీజర్‌లో నిల్వ ఉండటం వల్ల గ్లైసమిక్ ఇండిక్స్ తగ్గి ఆరోగ్యకరమైన స్టార్చ్‌గా మారుతుందని చెబుతున్నారు. ఇలా నిల్వ ఉండటం వల్ల శరీరానికి అవసరమైన గట్ బ్యాక్టీరియా దీని వల్ల లభిస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై 2008లో జరిపిన పరిశోధనలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని షా చెప్పారు. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ పరిశోధన బృందం దీని గురించి సుమారు 22 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న పదిమంది పురుషులు, మహిళలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారికి ఇంట్లో తయారు చేసిన బ్రెడ్, మార్కెట్లో దొరికే బ్రెడ్లను వేర్వేరుగా నిల్వ చేసి ఇచ్చారు. కొందరికి తాజా బ్రెడ్ ఇవ్వగా, మరికొందరికి నిల్వ చేసింది ఇచ్చారు. మిగతా వారికి నిల్వ ఉంచి, రోస్ట్ చేసింది ఇచ్చారు. తాజాగా ఇంట్లో తయారుచేసిన బ్రెడ్‌తో పోలిస్తే, బ్రెడ్‌ను నిల్వ చేసి రోస్ట్ చేసినప్పుడూ బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా మార్కెట్లో కొన్న వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రెడ్‌ని రోస్ట్ చేసిందే బెటర్ అని తేలింది. అలాగే ఈ బ్రెడ్‌ని కూడా నిల్వ చేసి రోస్ట్ చేసి తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని చెప్పారు. దీన్ని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు. ఇలా ఈ నిల్వ ఉండటం వల్ల వాటిలో కిణ్వన ప్రక్రియ జరిగి శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా అంది షుగర్ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కాకుండా చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం వైట్ బ్రెడ్‌ని తినేందుకు జంకకండి. చక్కగా తెచ్చుకుని ఒక రాత్రి ఫ్రిజ్‌లో పెట్టి రోస్ట్ చేసుకుని హాయిగా ఆస్వాదించండి. View this post on Instagram A post shared by Dr. Amy Shah (@fastingmd) (చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
కిమ్ దురాగతం.. గడ్డకట్టే చలిలో అరగంట సేపు నిలబెట్టి..
North Korea’s Kim Jong-un uses hidden heaters: క్రూరమైన పాలనకు పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ ఎప్పుడు ఏదోఒక విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉంటారు. ఆయన తీసుకునే వింతవింత నిర్ణయాలతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాలా చేసి వివాదాస్పద నాయకుడిగా పేరుగాంచాడు. ఇదిలా ఉండగా తాజగా కిమ్ దురాగతం మరోసారి బయటపడింది. వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి 80వ జయంతి సందర్భంగా సంజియోన్ నగరంలోని ఆరుబయట గడ్డకట్టే చలిలో తన తండ్రి విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో వేలాది ప్రజలను గడ్డకట్టే చలిలో బ్లౌజులు, టోపీలు ధరించకుండా నిలబడి తన తండ్రికి సంబంధించిన ప్రసంగం వినేలా చేశాడు. అయితే జోన్ తన అధికారులతో పాటు కూర్చొన్న డెస్క్ వద్ద హీటర్లు వినియోగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాదు అక్కడ ఉన్న రెడ్ కార్పెట్ వద్ద ఉన్న వైర్ల గుంపును బట్టి అంచనా వేయొచ్చని మీడియా ప్రతినిధులు అన్నారు. అంతేకాదు కిమ్ ఇంతకుముందు డిసెంబర్ 2019లో కూడా గడ్డకట్టే చలిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడూ కూడా హీటర్ల వినియోగించినట్లు బయటపడింది. 2011లో కిమ్ జోంగ్-ఇల్ మరణానంతరం అధికారం చేపట్టిన కిమ్ జోంగ్-ఉన్ తన దివంగత తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 'డే ఆఫ్ షైనింగ్ స్టార్' కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏది ఏమైన కిమ్ ప్రజలను బాధించేలా తీసుకునే క్రూరమైన చర్యలు కారణంగానే ఆయన తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. (చదవండి: యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు) -
మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ...
కొన్ని ప్రమాదాలు చాలా భయానకంగా ఉంటాయి. కొంతమంది అలాంటి అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో సైతం వారు ఏమాత్రం తమ ధైర్యాన్ని కోల్పోకుండా ప్రాణాలతో బయట పడేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలానే యూఎస్‌లోని ఒక మహిళ కారు యాక్సిండెట్ అయ్యి ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో జీవచ్ఛవంలా పడి ఉన్నప్పటికీ ఏమాత్రం తన స్థైర్యాన్ని కోల్పోకుండా అత్యంత తెగువను ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. (చదవండి: 200 ఏళ్ల చర్రిత.. పిండి, కోడి గుడ్లతోనే ఎందుకంటే..) అసలు విషయంలోకెళ్లితే....అమెరికాకు చెందిన 65 ఏళ్ల లిన్నెల్ మెక్‌ఫార్లాండ్ రిటైర్డ్ నర్సు. ఆమె ఒక రోజు తన బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా వాషింగ్టన్ పాస్ సమీపంలోని యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఒక పక్క వర్షం కారణంగా సరిగా కనిపించడకపోవడంతో మంచు మీద టైర్లు జారిపోయి సుమారు 100 అడుగుల గుంటలో కారు తలకిందులుగా పడిపోయింది. దీంతో ఆమె కాళ్లకు, చేతులకు గాయాలైయ్యాయి.అంతేకాదు ఆమె ఒంటరిగా గడ్డకట్టే మంచు ఉష్టోగ్రతోలో ఐదురోజులగా కారులోనే పడి ఉంటుంది. ఈ మేరకు ఆమె నర్సు కావడంతో ఆమె తన గాయాలకు ప్రథమ చికిత్స చేసుకోవడమే కాక వర్షపు నీటితో దాహాన్ని తీర్చకుంటూ తన శరీరం డీహైడేట్ కాకుండా చూసుకుంది. పైగా ఎవరైన తనను రక్షించికపోదురా అనుకుంటూ కారు వెనుక సీటులో ఉండి ఆశగా చూడసాగింది. అయితే మరోవైపు మెక్‌ఫార్లాండ్ కూతురు వాళ్ల అమ్మ ఇంకా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోగా రాష్ట్ర రవాణా శాఖ సిబ్బంది ఆ కారు యాక్సిడెంట్‌ని గుర్తించి రక్షించేందుకు యత్నించారు. హైపోథర్మియా సంకేతాలతో ఆమె స్పృహలోనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెను శస్త్ర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట తెగవైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: వికటించిన పెడిక్యూర్.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం) -
అవన్నీ తప్పుడు కథనాలు : అదానీ
సాక్షి,ముంబై: ఎన్ఎస్డీఎల్ అదానీ గ్రూపునకు చెందిన మూడు విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్న వార్తలపై అదానీ గ్రూపుస్పందించింది. ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించడానికే ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందని వివరించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. ఇలాంటి వార్తలు పెట్టుబడులకు , సంస్థలకు ఆర్థికపరంగా నష్టం వాటిల్లుతుందని ఆరోపించింది. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేయలేదని వెల్లడించింది. మైనారిటీ పెట్టుబడిదారుల ఆసక్తిని కాపాడేందుకే ఈ ప్రకటనను జారీ చేస్తున్నామని తెలిపింది. మైనారిటీ పెట్టుబడిదారులపై ఈ వార్తలు ప్రతికూల ప్రభావాన్ని చూస్తే, ఆయా డిమాట్ ఖాతాల స్టేటస్ కో పద్ధతిని పాటించాలని రిజిస్ట్రార్ , ట్రాన్స్ఫర్ ఏజెంట్లను ఇ-మెయిల్ ద్వారా కోరింది. కాగా ఖాతాల లావాదేవీల నిలిపివేత వార్తలతో సోమవారం నాటి మార్కెట్లో అదానీ గ్రూపు మొత్తం ఆరు లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇంట్రా-డే ట్రేడ్‌లో 5నుంచి 20 శాతం వరకు పడిపోయాయి. నాలుగు గ్రూప్ కంపెనీల్లో సుమారు 45 వేల కోట్ల విలువైన షేర్లను మూడు విదేశీ ఫండ్ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపజేసిందని మీడియాలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. చదవండి: ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ -
ఫ్రీజింగ్.!
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రెండు మాసాలుగా చెల్లింపులన్నీ ఆగిపోయాయి. ఖజానా ఖాళీ అవడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బిల్లులను ఆపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, కార్మికులకు రావాల్సిన జీతాలను కూడా ఈనెల 13వ తేదీ విడుదల చేశారు. గత ఏడాది నుంచి అన్ని బిల్లులు మాన్యువల్‌గా కాకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్లైన్లో మంజూరు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, ఇతర శాఖల్లోని బిల్లులన్నీ దీని ద్వారానే జారీ చేస్తున్నారు. ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే రూ.100కోట్లకు పైగా బిల్లులు సీఎఫ్ఎంఎస్లో ఆగిపోయినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. మున్సిపాలిటీల్లో అయితే 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ సబ్‌ప్లాన్, బీపీఎస్ నిధుల కింద చేపట్టిన పనులకు కూడా బిల్లులు రావడం లేదు. ఒక్క కడప కార్పొరేషన్లోనే సుమారు రూ.3కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో రూ.35కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. అగ్రిమెంట్ మేరకు గడువు లోపు పనులు చేయాలని ఒత్తిడి చేసి పనులు చేయించారని, అప్పులు సప్పులు చేసి పనులు చేస్తే ఇప్పుడు బిల్లులు రాకుండా ఆపేశారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఐసీడీఎస్, ఉపాధి హామీ, మున్సిపాలిటీల్లోనే సుమారు రూ.100 కోట్ల బిల్లులు రావాల్సి ఉంటే ఇక మైనర్, మేజర్ ఇరిగేషన్, ఆర్అండ్బి, ఆర్‌డబ్లు్యఎస్, పంచాయితీరాజ్, హౌసింగ్, పబ్లిక్ హెల్త్, వైద్య, ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఎస్ఎస్ఏ, జిల్లా పరిషత్ వంటి ఇతర శాఖల్లో మరో రెండువందల కోట్లు రావాల్సి ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ఖాజానా ఖాళీ అవడం వల్లే చెల్లింపులన్నీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. బడ్జెట్లో కేటాయించకపోయినా చాలా పనులను ప్రభుత్వం చేసేస్తోంది. వచ్చిన ఆదాయమంతా జీతాలకే సరిపోతుండటంతో మిగిలిన వ్యయానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రుణం ఇచ్చేందుకు బ్యాంకుల నుంచి కూడా ఆశించినంత స్పందన రాకపోవడంతోనే ప్రభుత్వం చెల్లింపులన్నీ ఆపేసినట్లు తెలుస్తోంది. అంగన్వాడీలకు 3 మాసాలుగా అందని వేతనాలు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, హెల్పర్లకు మూడు మాసాలుగా జీతాలు ఇవ్వలేదు. దీంతో ఇటీవల వారు రెండు రోజులు సమ్మె చేపట్టారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు. జిల్లాలో 3621 అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 7242 మంది కార్యకర్తలు, హెల్పర్లు పనిచేస్తున్నారు. వీరికి మూడుమాసాలుగా రూ.16.29కోట్లు వేతనాలు రావాల్సి ఉంది. అన్నిశాఖల్లోని ఉద్యోగులు, కార్మికులకు ప్రతినెలా జీతాలిస్తున్న ప్రభుత్వం అంగన్వాడీలకు మాత్రమే ఇలా జీతాలు ఆపేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కూలీ దక్కలేదు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కూడా మూడు మాసాలుగా వేతనాలు అందలేదు. జిల్లాలో 5,62,899 కుటుంబాల్లో 11,12,279 మంది కూలీలు ఉన్నారు. వీరికి మూడు నెలలుగా సుమారు రూ.39కోట్ల కూలీ డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై నెపం వేయడానికే ఐసీడీఎస్, డ్వామా నిధులు ఆపేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ... ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు ప్రకటిస్తుండటం పట్ల ఆర్థిక వేత్తలు విస్తుపోతున్నారు. జీతాలు, ఉన్న బిల్లులు ఇవ్వడానికే నిధులు లేకుంటే కొత్తగా పింఛన్లు రూ.2వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇంకా కొత్తవి కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
టీవీ ప్రియులకు పెనుముప్పు
వాషింగ్టన్: గంటల కొద్దీ టీవీల ముందు కూర్చునేవారి సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. టీవీలు చూస్తూ కూర్చోవటం వల్ల కాళ్లకు రక్తప్రసరణ పూర్తిస్థాయిలో జరగక సిరల్లో రక్తం గడ్డలు(వీన్స్ థ్రోమ్బోంబోలిజం–వీటీఈ) ఏర్పడే అవకాశముందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటా శాస్త్రవేత్తలు తేల్చారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు సైతం టీవీ చూడడం, కదలకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం వంటివాటికి దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు. -
సంక్షేమాన్ని ఫ్రీజ్ చేసి పండుగా?
టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్ : సంక్షేమ నిధులపై ఫ్రీజింగ్ విధించి, కేటాయింపులు అమలు చేయలేని అసమర్థ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజలు సంబురాలు చేసుకోమనడం దారుణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కొత్త బట్టలు కొనడానికి డబ్బుల్లేక, పండగ వంటకాలకు దిక్కులేక ప్రజలు పస్తులుంటుంటే సీఎం సంబురాలు, సోకులకు ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ, ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలు, వృద్ధులు, వితంతు,వికలాంగుల పెన్షన్ల బకాయిలు, ఇలా అనేక సంక్షేమపథకాల బకాయిలు పేరుకుపోతున్నాయన్నారు. డి గ్రీ,పీజీ కాలేజీల ఫీజు బకాయిల కోసం యాజమాన్యాలు సమ్మె బాట పట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ఆర్థిక అసమర్థతను దాచి పెట్టి, పండగలు సంతోషంగా జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునివ్వడం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని తన ప్రకటనలో పేర్కొన్నారు. -
గందరగోళం
–ప్రభుత్వ ఉద్యోగులవేతనాల విషయంలో సందిగ్ధం –ఇప్పటికే అన్ని నిధులపై ఫ్రీజింగ్ ఆదేశాలు –జీతాలు కూడా ఫ్రీజ్ అయ్యాయని ప్రచారం –మధ్యాహ్నానికి ట్రెజరీ నుంచి బ్యాంకులకు బిల్లులు –సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ ఫ్రీజింగ్ ఆదేశాలు –కొందరికి మంగళవారమే జమ... మరికొందరికి బుధవారం వచ్చే అవకాశం –26 తర్వాత బిల్లులు పంపిన వారి స్యాలరీలకు మరో 3, 4 రోజులు? సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల వేతనం విషయంలో గందరగోళం ఏర్పడింది. సోమవారం సెలవు ఉన్న కారణంగా మంగళవారం కల్లా వేతనాలు తమ అకౌంట్లలో జమ అవుతాయని ఉద్యోగులు భావించారు. కానీ, జిల్లాలో పనిచేస్తున్న అందరు ఉద్యోగుల బ్యాంకు అకౌంట్లలో మంగళవారం వేతనాలు జమ కాలేదు. దీనిపై జిల్లాలోని ఉద్యోగ వర్గాల్లో పలు రకాల ప్రచారం జరిగింది. ఇప్పటికే పెన్షన్లు, పెన్షనర్ల బెనిఫిట్లు, గ్రామపంచాయతీల నిధులు, కాంట్రాక్టు బిల్లులకు సంబంధించి ట్రెజరీలో ఫ్రీజింగ్ అమలవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలపై కూడా ఫ్రీజింగ్ విధించారని జోరుగా ప్రచారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల వేతనాలపై ట్రెజరీలో ఫ్రీజింగ్ విధించడమేమిటనే చర్చ జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు అటు ట్రెజరీ అధికారులు, ఇటు బ్యాంకర్లను ఆరా తీశారు. అయితే, ఉద్యోగుల వేతనాల కోసం ట్రెజరీ ఫ్రీజింగ్‌ను మంగళవారం ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో ఈనెల 26వ తేదీలోపు బిల్లులు ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు బ్యాంకులకు వెళ్లాయి. అయితే, వీరిలో కొందరికి మాత్రం వేతనాలు మంగళవారం అకౌంట్లలో జమకాగా, మరికొందరికి బుధవారం జమ అవుతాయని బ్యాంకు వర్గాలంటున్నాయి. కానీ, 26 తర్వాత బిల్లులు చేసి పంపిన ఉద్యోగులకు మాత్రం మళ్లీ ప్రభుత్వం ఫ్రీజింగ్ ఆదేశాలకు ఉపశమనం ఇస్తేనే జమ అవుతాయని ట్రెజరీ అధికారులు అంటున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్లీ అన్ని రకాల నిధులపై ఫ్రీజింగ్ ఆదేశాలు వచ్చాయని, ఈ కారణంగా మళ్లీ ఆదేశాలను ఉపసంహరించుకునేంతవరకు వారి వేతనాలు జమకావని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 35వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 15వేల మంది టీచర్లున్నారు. వీరిలో కనీసం 10 శాతం మందికి సంబంధించిన బిల్లులు 26 తర్వాత ట్రెజరీలకు పంపినా 5వేల మంది ఉద్యోగులకు వేతనాలు వచ్చేందుకు 3,4 రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ ప్రభుత్వ ఫ్రీజింగ్‌ను ఎత్తివేస్తేనే వారి జీతాలు వస్తాయని, ఈలోపు తాము బిల్లులు చేసి బ్యాంకులకు పంపుతామని ట్రెజరీ వర్గాలంటున్నాయి. అన్నీ ఫ్రీజింగే.. ఉద్యోగుల వేతనం విషయం అలా ఉంటే, జిల్లాలో ఒక్క హాస్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలు తప్ప ఏ ఒక్క బిల్లుకు సంబంధించిన నిధులు విడుదలయ్యే పరిస్థితి లేదని, అన్ని రకాల బిల్లులపై జూన్ 15 నుంచే ఫ్రీజింగ్ ఉందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ రాబడి శాఖలకు సంబంధించిన ఆదాయం తగ్గిపోవడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని కార్యక్రమాలకు నిధులు మళ్లించాల్సి రావడంతో ట్రెజరీ నుంచి ఇతర బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ముఖ్యంగా గ్రామపంచాయతీలకు సంబంధించిన సిబ్బంది వేతనాలను కూడా ఇవ్వడం లేదు. దీంతో దాదాపు 50–60 కోట్ల రూపాయలవిలువైన బిల్లులు నిలిచిపోయాయని తెలుస్తోంది. అయితే, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బిల్లులు ఆగిపోవడం సహజమేనని, ఉద్యోగుల వేతనాలపై ఫ్రీజింగ్ విధించడం ఇదే మొదటిసారని, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని జిల్లాలో ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
గల్లాపెట్టెకు తాళం..
45 రోజులుగా ఫ్రీజింగ్ - నిలిచిన ‘కల్యాణలక్ష్మి, షాదిముబారక్’ - బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలోనూ అదే పరిస్థితి - పెండింగ్‌లో సుమారు రూ.10 కోట్ల చెల్లింపులు - జిల్లా ట్రెజరీ ఆఫీస్ చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు - ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ తప్పని తిప్పలు నక్కలగుట్ట : జిల్లా ఖజానా పెట్టెకు రాష్ట్ర ప్రభుత్వం తాళం వేసింది. జూన్ నుంచి తాత్కాలిక ఫ్రీజింగ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు పథకాల అమలుకు బ్రేక్ పడింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితంగా లబ్ధిదారులు జిల్లా ట్రెజరీ కార్యాలయం, దళిత, గిరిజన అభివృద్ధి శాఖలు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల బిల్లులు కూడా ట్రెజరీలో చెల్లింపులకు నోచుకోకుండా పడి ఉన్నాయి. లబ్ధిదారులకు దాదాపుగా రూ.9.92 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. సుమారు 45 రోజులు కావొస్తున్నా.. ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయకపోవడంతో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ‘కల్యాణలక్ష్మి’లో... దళిత అభివృద్ధి శాఖ : జిల్లా దళిత అభిృృద్ధి శాఖ ద్వారా కల్యాణలకిృ్ష్మ పథకంలో మొత్తం 389 మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరైనా.. ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే నిలిచిపోయాయి. ఈ శాఖ ద్వారా మొదటి విడతలో 285, రెండో విడత 104 కల్యాణలక్ష్మి బిల్లులు దాఖలయ్యాయి. ఇవన్నీ ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు జిల్లా దళిత అభివృద్ధి శాఖ జిల్లా కార్యాలయంృ ఏఎస్డబ్ల్యూఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గిరిజన సంక్షేమశాఖ : జిల్లా గిరిజన సంక్షేమశాఖ ద్వారా కల్యాణలక్ష్మి పథకంలో 410 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల విచారణ పూర్తయి, ట్రెజరీలో బిల్లులు దాఖలు చేసినా... ఫ్రీజింగ్ అమలు కారణంగా చెల్లింపులకు నోచుకోకుండా నిలిచిపోయాయని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి సీహెచ్.రాంమూర్తి తెలిపారు. రెండు శాఖలు కలిపి 799 మందికి సుమారు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘షాదిముబారక్’ అంతే.. ముస్లిం నిరుపేద కుటుంబాల్లోని అవివాహిత యువతుల వివాహానికి ఆర్థికసాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న షాదిముబారక్ పథకం పరిస్థితి కూడా కల్యాణలక్ష్మిలాగే తయారైంది. ఫ్రీజింగ్ కారణంగా చెల్లింపులు నిలిచిపోయాయి. 2014-15లో షాదిముబారక్లో 333 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే.. 332 మందికి సర్కారు బిల్లులు మంజూరు చేసింది. 2015-16లో 570 మంది షాది ముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకోగా.. 394 మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. ఇంకా 169 మంది లబ్దిదారులకు ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు చెల్లించలేదు. షాదిముబారక్ కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.86 లక్షలు పెండింగ్‌లో పడ్డాయి. ఎస్సీ కార్పొరేషన్లో... జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 400 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందజేసింది. ఫ్రీజింగ్ అమలు కారణంగా మరో 170 మంది లబ్ధిదారులకు సబ్సిడీ చెల్లించలేదు. లబ్ధిదారులకు సుమారు రూ.1.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. బీసీ కార్పొరేషన్లో... జిల్లా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన 830 మంది లబ్ధిదారులకు బ్యాంకులు రుణాల చెల్లిస్తే, బీసీ కార్పొరేషన్ సబ్సిడీ మంజూరు చేయాల్సి ఉంది. నిధుల లేమి కారణంగా బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించకపోవడంతో అటు రుణాలు, ఇటు సబ్సిడీ విడుదల కాక లబ్ధిదారులు బీసీ కార్యాలయంచుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. లబ్ధిదారులకు సుమారు రూ.2 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కూడా.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి జీతాల బిల్లులు కూడా ఫ్రీజింగ్ కారణంగా ట్రెజరీలో నిలిపివేశారు. దీంతో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క కలెక్టరేట్లో ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులు 1,500 మంది ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన వారికి సుమారు రూ.1.27 కోట్లు చెల్లించాలి. -
బ్యాంకు అకౌంట్లు నిలిపేయడం దారుణం: గంటా
విశాఖపట్నం: ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు అకౌంట్లు నిలిపివేయడం దారుణమని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. కేసీఆర్ కు అభివృద్ధికంటే వివాదాలంటేనే ఇష్టమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్నింటినీ అంగీకరిస్తున్నామన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఏది ఏమైనా ముందుగా ప్రకటించిన తేదీలోనే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఐఐఎమ్ కు గంభీరంలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. భూములు నష్టపోయిన రైతులకు సరైన పరిహారం అందిస్తామన్నారు. ఆర్టీఏ డ్రైవింగ్ ట్రాక్ ను వేరొక చోటుకు తరలిస్తామన్నారు. -
నిధులు ఫ్రీజింగ్!
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కోశాధికారి కార్యాలయం నుంచి నిధుల చెల్లింపుపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం సాయంత్రం ట్రెజరీ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. జీతాలతోపాటు కొన్ని అత్యవసర బిల్లులు తప్పితే మిగతా అన్ని చెల్లింపులు నిలిచిపోనున్నాయి. ఈనెల 12 వరకు బిల్లుల చెల్లింపులు ఉన్నప్పటికీ ప్రభుత్వంపై రెవెన్యూ భారం పడకుండా తాత్కాలికంగా ఈ ఫ్రీజింగ్ విధించినట్లు సమాచారం. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. ఉద్యోగుల జీతాలు, ఆస్పత్రి, జైలు, హాస్టల్ డైట్ చార్జీలు, జీపీఎఫ్, లోన్స్ అండ్ అడ్వాన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, పెన్షన్స్, వడ్డీ చెల్లింపులు మినహా మిగతా అన్నింటిపై ఫ్రీజింగ్ విధించారు. గురువారం నుంచి ఇది అమల్లోకి రానుంది. పలు బిల్లుల చెల్లింపులు జరగవు. ప్రయాణ భత్యం, ఆఫీసు సాధారణ నిర్వహణ ఖర్చులు, టెలిఫోన్, విద్యుత్ శాఖ బిల్లులు, కార్యాలయ భవనాల అద్దెలు, వాహన అద్దె, పెట్రోల్‌కు సంబంధించి బిల్లుల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనని తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉండగా మార్చి 31లోగా మిగులు బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయాలి. -
ట్రెజరీలో వసూళ్ల దందా
సాక్షి, సంగారెడ్డి: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏడాది కాలానికి సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ ఒక్కసారీ ట్రెజరీ కార్యాలయాకు వెళ్లాయి. ఎప్పటిలాగే చివర్లో బిల్లుల చెల్లింపు నిలపివేత(ఫ్రీజింగ్) అమలు చేస్తారేమోనని 15 రోజులుగా కుప్పలు తెప్పలుగా బిల్లుల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, హాస్టళ్ల వార్డెన్లు, చోటాబడా కాంట్రాక్టర్లు అందరూ ట్రెజరీ కార్యాలయాల ముందూ క్యూకట్టారు. ఎప్పటిలాగే అక్కడి అధికారులు, సిబ్బందికి పర్సెంటేజీలు చెల్లిస్తేనే బిల్లులు పాస్ చేస్తున్నారు. లేకుంటే కొర్రీలు వేసి బిల్లులను వెనక్కి పంపిస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. కలెక్టర్ స్మితా సబర్వాల్ గత నెలలో ఉద్యోగ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ట్రెజరీలో వసూళ్లు బాగోతంపై ఉద్యోగ సంఘాలన్నీ ముక్తకంఠంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. కలెక్టర్ హెచ్చరించినా ట్రె జరీల అధికారులు, ఉద్యోగుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. సాక్షాత్తు కలెక్టర్, డీఆర్వో, ఏఓలు మంజూరు చేసిన బిల్లులకు సైతం పర్సెంటేజీలు అడుగుతుండడం గమనార్హం. టోకెన్లకు టోకరా నిబంధనల మేరకు ట్రెజరీలకు వెళ్లే ప్రతి బి ల్లును మూడు రోజుల్లో మంజూరు చేయా లి. ఒక వేళ తిరస్కరించాల్సి వస్తే ఆ మేరకు కారణాలు చూపుతూ మూడు రోజుల్లోపే తిరస్కరించాలి. ఈ మేరకు బిల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఓ టోకెన్‌ను అందజేయా లి. కానీ, ఈ నిబంధనలు ప్రస్తుతం ఎక్కడా అమలు కావడం లేదు. బిల్లు ఫైలు అకౌంటెంట్, ఆడిటర్, ఎస్టీఓ.. ఇలా ఒకరి నుంచి ఇంకొకరి వద్దకు చేరాలంటే చేతులు తడపాల్సిన వస్తోంది. లేకుంటే వారాల తరబడి మోక్షం లభించడం లేదు. కోరిన పర్సెం టేజీ ఇవ్వలేని వ్యక్తులు బేరసారాలకు దిగి ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోంది. అందరూ బాధితులే.. {పభుత్వ అధికారులు, ఉద్యోగులు టీఏ, డీఏ, జీపీఎఫ్ అడ్వాన్స్, రిటైర్మెంట్ బెనిఫి ట్స్, జీఐఎస్ సేవింగ్స్, మెడికల్ రీయింబ ర్స్మెంట్, కాంటిజెన్సీ నిధులు, ఇంక్రిమెంట్ అరియర్స్, పే ఫికేజషన్, సరేండర్ లీవ్, వాహనం అద్దె, బిల్డింగ్ గ్రాంట్ బిల్లు లకు ట్రెజరీ కార్యాలయాలకు వెళ్తే 5 నుంచి 10 శాతం కమీషన్ చెల్లించాల్సి వస్తోంది. {పభుత్వ వసతి గృహాల సంక్షేమ అధికారుల బాధలైతే వర్ణణాతీతం. విద్యార్థుల మెస్ చార్జీలు, మెయింటనెన్స్ బిల్లుల్లో 5 శాతం వరకు వదులుకోవాల్సి వస్తోంది. మునిసిపాలిటీలు, పంచాయతీలతో పాటు ఆయా ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి బిల్లు మొత్తంలో 3 నుంచి 5 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్నారు.