కొన్ని ప్రమాదాలు చాలా భయానకంగా ఉంటాయి. కొంతమంది అలాంటి అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో సైతం వారు ఏమాత్రం తమ ధైర్యాన్ని కోల్పోకుండా ప్రాణాలతో బయట పడేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలానే యూఎస్‌లోని ఒక మహిళ కారు యాక్సిండెట్ అయ్యి ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో జీవచ్ఛవంలా పడి ఉన్నప్పటికీ ఏమాత్రం తన స్థైర్యాన్ని కోల్పోకుండా అత్యంత తెగువను ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
(చదవండి: 200 ఏళ్ల చర్రిత.. పిండి, కోడి గుడ్లతోనే ఎందుకంటే..)
అసలు విషయంలోకెళ్లితే....అమెరికాకు చెందిన 65 ఏళ్ల లిన్నెల్ మెక్‌ఫార్లాండ్ రిటైర్డ్ నర్సు. ఆమె ఒక రోజు తన బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా వాషింగ్టన్ పాస్ సమీపంలోని యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఒక పక్క వర్షం కారణంగా సరిగా కనిపించడకపోవడంతో మంచు మీద టైర్లు జారిపోయి సుమారు 100 అడుగుల గుంటలో కారు తలకిందులుగా పడిపోయింది.
దీంతో ఆమె కాళ్లకు, చేతులకు గాయాలైయ్యాయి.అంతేకాదు ఆమె ఒంటరిగా గడ్డకట్టే మంచు ఉష్టోగ్రతోలో ఐదురోజులగా కారులోనే పడి ఉంటుంది. ఈ మేరకు ఆమె నర్సు కావడంతో ఆమె తన గాయాలకు ప్రథమ చికిత్స చేసుకోవడమే కాక వర్షపు నీటితో దాహాన్ని తీర్చకుంటూ తన శరీరం డీహైడేట్ కాకుండా చూసుకుంది. పైగా ఎవరైన తనను రక్షించికపోదురా అనుకుంటూ కారు వెనుక సీటులో ఉండి ఆశగా చూడసాగింది.
అయితే మరోవైపు మెక్‌ఫార్లాండ్ కూతురు వాళ్ల అమ్మ ఇంకా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోగా రాష్ట్ర రవాణా శాఖ సిబ్బంది ఆ కారు యాక్సిడెంట్‌ని గుర్తించి రక్షించేందుకు యత్నించారు. హైపోథర్మియా సంకేతాలతో ఆమె స్పృహలోనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెను శస్త్ర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట తెగవైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి.
(చదవండి: వికటించిన పెడిక్యూర్.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం)
Comments
Please login to add a commentAdd a comment