అవన్నీ తప్పుడు కథనాలు : అదానీ | Adani Group clarifies freezing of 3 FPI accounts blatantly erroneous | Sakshi
Sakshi News home page

ఆ ఖాతాలు ఫ్రీజ్‌ కాలేదు: అదానీ స్పందన

Published Mon, Jun 14 2021 3:57 PM | Last Updated on Mon, Jun 14 2021 5:00 PM

 Adani Group clarifies freezing of 3 FPI accounts blatantly erroneous - Sakshi

సాక్షి,ముంబై: ఎన్‌ఎస్‌డీఎల్‌  అదానీ గ్రూపునకు చెందిన మూడు విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్న వార్తలపై  అదానీ గ్రూపుస్పందించింది. ఇన్వెస్టర్లను  తప్పుదారి పట్టించడానికే  ఉద్దేశపూర‍్వకంగా కుట్ర జరిగిందని వివరించింది. ఈ మేరకు  అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. ఇలాంటి వార్తలు  పెట్టుబడులకు , సంస్థలకు ఆర్థికపరంగా నష్టం వాటిల్లుతుందని ఆరోపించింది. అల్బులా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్‌  ఫ్రీజ్‌ చేయలేదని వెల్లడించింది.  మైనారిటీ పెట్టుబడిదారుల ఆసక్తిని కాపాడేందుకే ఈ ప్రకటనను జారీ చేస్తున్నామని తెలిపింది. మైనారిటీ పెట్టుబడిదారులపై  ఈ వార్తలు ప్రతికూల ప్రభావాన్ని చూస్తే,  ఆయా  డిమాట్ ఖాతాల  స్టేటస్‌ కో పద్ధతిని పాటించాలని రిజిస్ట్రార్ , ట్రాన్స్ఫర్ ఏజెంట్‌లను ఇ-మెయిల్ ద్వారా కోరింది.

కాగా  ఖాతాల లావాదేవీల నిలిపివేత వార్తలతో సోమవారం నాటి మార్కెట్‌లో అదానీ గ్రూపు మొత్తం ఆరు లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇంట్రా-డే ట్రేడ్‌లో 5నుంచి 20 శాతం వరకు పడిపోయాయి. నాలుగు గ్రూప్ కంపెనీల్లో సుమారు 45 వేల కోట్ల విలువైన షేర్లను మూడు విదేశీ ఫండ్ల ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్ స్తంభింపజేసిందని మీడియాలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. 

చదవండి: ఎన్ఎస్‌డీఎల్: అదానీకి భారీ షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement