భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద 2021 ఏడాదిలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లూ భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఏడాదిలో ఏ మేరకు లాభపడ్డాయో ఎన్ఎస్‍డీఎల్ సమస్య తర్వాత నాలుగు రోజుల్లోనే అంతేస్థాయిలో కుప్పకూలాయి. దీంతో కేవలం నాలుగు సెషన్‌లలో స్టాక్స్ పతనం కావడంతో కొన్ని కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. దీంతో గౌతమ్ ఆదానీ సంపద, అదానీ గ్రూప్ సంపద వేగంగా కరిగిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టపోవడంతో ఈ 58 ఏళ్ల బిలియనీర్ సంపద నాలుగు రోజుల్లో 14 బిలియన్ డాలర్ల(రూ.1,03,737 కోట్ల) మేర కరిగిపోయింది.
ఈ ఏడాదిలో ఎంత వేగంగా అదానీ గ్రూప్ షేర్లూ పెరిగాయో అంతకంటే వేగంగా తగ్గాయి. ప్రపంచంలోనే ఈ వారంలో అత్యంత సంపద కోల్పోయిన వ్యాపారవేత్తగా ఆదానీ నిలిచారు. ఆయన సంపద ఏకంగా 62.1 బిలియన్ డాలర్స్(రూ.4,60,143 కోట్ల)కు తగ్గింది. ప్రపంచ కుబేరుల్లో అత్యధికంగా నష్టపోయింది కూడా అదానీయే. దీంతో ఆయన ఆసియా ధనికుడి స్థానంలో రెండు నుంచి మూడవ స్థానానికి పడిపోయారు. చైనా టైకూన్ జోంగ్ షాన్ తిరిగి రెండవ స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికీ మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోని అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment