NSDL
-
డీమ్యాట్ సెక్యూరిటీలు రూ. 500 లక్షల కోట్లు
డీమెటీరియలైజ్డ్(డీమ్యాట్) రూపంలో ఉన్న మొత్తం సెక్యూరిటీల విలువ రూ. 500 లక్షల కోట్లను తాకినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్) వెల్లడించింది. 2024 సెప్టెంబర్‌కల్లా 6 లక్షల కోట్ల డాల ర్లకు చేరినట్లు తెలిపింది.తొలి రూ. 100 లక్షల కోట్ల మార్క్‌ను 18ఏళ్లలో అంటే 2014 జూన్‌లో అందుకున్నట్లు తెలియజేసింది. తదుపరి ఆరేళ్ల కాలంలో 2020 నవంబర్‌కల్లా విలువ రెట్టింపై రూ. 200 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో డీమ్యాట్ సెక్యూరిటీలు 4ఏళ్లలోనే రూ. 500 లక్షల కోట్లయ్యింది. కృతజ్ఞతలుఈ చరిత్రాత్మక మైలురాయికి కారణమైన ఇన్వెస్టర్లు, మార్కె ట్ పార్టిసిపెంట్లు, నియంత్రణ సంస్థలు తదితరులకు కృతజ్ఞతలు. – ఎస్.గోపాలన్, ఎన్ఎస్డీఎల్ ఎండీ -
ఎన్ఎస్డీఎల్, స్టాండర్డ్ గ్లాస్, జింకా లాజిస్టిక్స్.. ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవల దిగ్గజం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) పబ్లిక్ ఇష్యూకి లైన్ క్లియర్ అయ్యింది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ, జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సైతం సెబీ నుంచి లిస్టింగ్‌కు అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం..ఎన్ఎస్డీఎల్ ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్ఎస్డీఎల్ 2023 జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే 14 నెలల తదుపరి అనుమతులు సాధించడం గమనార్హం! ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో 5.72 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌సహా కంపెనీలో వాటాదారు సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ప్రధానంగా ఐడీబీఐ బ్యాంక్ 2.22 కోట్ల షేర్లు, ఎన్ఎస్ఈ 1.8 కోట్ల షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 56.25 లక్షల షేర్లు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 లక్షల షేర్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 40 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో ద్వారా ఎన్ఎస్డీఎల్కు ఎలాంటి నిధులు అందబోవు! ఇదీ బ్యాక్‌గ్రౌండ్ సెబీ వద్ద రిజిస్టరైన్ ఎన్ఎస్డీఎల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులందించే కంపెనీ. దేశీయంగా ఫైనాన్షియల్, సెక్యూరిటీస్ మార్కెట్లో వివిధ సర్వీసులు, ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. 1996లో ప్రవేశపెట్టిన డిపాజిటరీల చట్టం ప్రకారం అదే ఏడాది నవంబర్‌లో సెక్యూరిటీల డీమ్యాట్ సేవలకు తెరతీసింది. కాగా.. డిపాజిటరీ సేవలందించే మరో కంపెనీ సెంట్రల్ డిపాజిటరీ సరీ్వసెస్(సీడీఎస్ఎల్) 2017లో ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. దీంతో పబ్లిక్‌గా ట్రేడయ్యే రెండో డిపాజిటరీగా ఎన్ఎస్డీఎల్ నిలవనుంది. జింకా లాజిస్టిక్స్ వస్తు రవాణా రంగ కంపెనీ జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.16 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అమ్మకాలు, మార్కెటింగ్ వ్యయాలకు, భవిష్యత్ అవసరాలరీత్యా బ్లాక్‌బక్ ఫిన్సర్వ్ మూలధన పటిష్టతకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా? స్టాండర్డ్ గ్లాస్ హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 350 కోట్ల విలువైన 1.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో వినియోగించే స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్ పరికరాల తయారు చేస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో సెబీ, ఎన్ఎస్డీఎల్కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబరు 20న సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తన ఖాతాదారుల షేర్లను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ కుంభకోణం బయటపడడంతో సెబీ, ఎన్ఎస్డీఎల్ రంగంలోకి దిగి ఆ షేర్లను మళ్లీ ఖాతాదారులకు బదిలీ చేయించాయి. యాక్సిస్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ విషయాన్ని శాట్‌లో సవాల్ చేశాయి. ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! ఫలితంగా కార్వీ తనఖాపెట్టిన షేర్ల విలువకు సమాన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని శాట్ గత ఏడాది డిసెంబరులో సెబీ, ఎన్ఎస్డీఎల్ను ఆదేశించింది. ఈ సంస్థలు సంబంధిత అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా శాట్ తీర్పుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. -
వావ్.. మార్కెట్లో భారీగా పెరుగుతున్న ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి
సాక్షి, ముంబై: దేశంలో స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. ఆగస్టులో తొలిసారిగా 100 మిలియన్ల మార్కును టచ్ చేయడం విశేషం. కోవిడ్‌కు ముందు ఈ సంఖ్య 41 మిలియన్లకంటే తక్కువే. డిపాజిటరీ సంస్థలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (డీసీఎస్ఎల్) విడుదల చేసిన డేటా ప్రకారం, 2.2 మిలియన్లకు పైగా కొత్త ఖాతాలు వచ్చాయి. ఈ నాలుగు నెలల్లో మరీ ముఖ్యంగా గత నెలలో కొత్తగా వచ్చిన ఖాతాలతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 100.5 మిలియన్లకు చేరింది. కోవిడ్-19 మహమ్మారికి ముందు కోవిడ్-19 మహమ్మారికి ముందు అంటే మార్చి 2020లో ఈ సంఖ్య 40.9 మిలియన్లుగా ఉండటం గమనార్హం. బుల్లిష్ మార్కెట్ కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.అలాగే మార్కెట్లో డీప్ కరెక్షన్ కారణంగా జూన్‌లో కొత్త డీమ్యాట్ ఓపెనింగ్స్ 1.8 మిలియన్ల వద్ద 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే మార్కెట్లు అంతే వేగంగా రీబౌండ్ కావడంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని భావిస్తున్నారు. అలాగే 100 మిలియన్ల డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలోని ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్యకు ప్రాతినిధ్యం వహించదని చాలా నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందని మార్కెట్ పెద్దల మాట. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ పలు బ్రోకరేజీల వద్ద డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి అనుమతి ఉన్న నేపథ్యంలో చాలా వరకు నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందంటున్నారు -
శభాష్.. నిర్మలా సీతారామన్!.. నెటిజన్ల మెచ్చుకోలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ అధికారి పట్ల ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హోదా, ప్రోటోకాల్ వంటి అంశాలను పక్కన పెట్టి మనసున్న మనిషిగా వ్యవహరించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 2022 మే 8 ఆదివారం న్యూఢిల్లీలో మార్కెట్ కా ఏకలవ్య పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరు పద్మజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మజా చుండూరు ప్రసంగించడం ప్రారంభించారు. అయితే మార్కెట్‌కు సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తున్న క్రమంలో ఆమెకు ఇబ్బంది కలగడంతో మధ్యలో ప్రసంగం ఆపి, మంచి నీళ్ల బాటిల్ ఇవ్వాలంటూ అక్కడున్న హోటల్ సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగిస్తున్నారు. పద్మజా చుండూడుకు ఎదురైన ఇబ్బందిని గమనించిన మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే తన దగ్గరున్న బాటిల్లో నీటిని ఓ గ్లాసులో పోసి తన కుర్చీ నుంచి లేచి.. పద్మజా దగ్గకు వెళ్లింది. గ్లాసులో నీళ్లు అందించి తాగాలంటూ సూచించింది. ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగిన ఘటనతో పద్మజతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిర్మలా సీతారామన్ చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. This graceful gesture by FM Smt. @nsitharaman ji reflects her large heartedness, humility and core values. A heart warming video on the internet today. pic.twitter.com/isyfx98Ve8 — Dharmendra Pradhan (@dpradhanbjp) May 8, 2022 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గంటల తరబడి గుక్కతిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వడం దిట్ట. అందరికీ అది అంత సులువైన విషయం కాదు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్డడంతో పాటు ఆర్మ నిర్భర్ ప్యాకేజీని సైతం ఆమె గంటల తరబడి సునిశితంగా వివరించారు. అందువల్లే మాట్లాడేప్పుడు వచ్చే ఇబ్బందిని గమనించి.. వెంటనే అక్కడ చాలా సేపుగా మాట్లాడుతున్న మహిలా ఉద్యోగి తాగేందుకు నీళ్ల బాటిల్ అందించారు. చదవండి: ఒకప్పుడు స్టార్టప్‌ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్‌ల రాజ్యం -
5 నిమిషాల్లో పాన్కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!
ఆధార్ కార్డుతో పాటు పాన్‌కార్టు ఇప్పుడు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి వస్తుంది. ఆర్థికపరమైన లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల కోసం, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి పాన్‌కార్డు కచ్చితంగా ఉండాలి. అయితే ఒక్కసారి పాన్‌కార్టు తీసుకున్నామంటే పాన్ నంబర్‌ను ఎప్పటికీ మార్చలేం. అయితే పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని అప్డేట్ చేసుకునే అవకాశం ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీ వంటి పలు వివరాలను ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా మార్చుకోవచ్చు. అయితే ప్రస్తుతం అందరూ సులభమైన పద్దతి ఆన్లైన్లోనే మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, ఈ సేవలు ఉచితం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎన్ఎస్డిఎల్ పోర్టల్‌లో తెలిపిన వివరాల ప్రకారం రూ.100 వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీని ఎలా సరిచేయాలి? ముందుగా ఎన్ఎస్డిఎల్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ పేజిలో Application Typeపై క్లిక్ చేసి Changes or Correction in existing PANS Data/Reprint of PAN Card ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత Individual పై క్లిక్ చేసి పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ పూర్తిచేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ నమోదు చేయండి. కొత్త పేజిలో టోకెన్ నంబర్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకోండి. Submit digitally through e-KYC & e-sign (paperless) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దాని తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసి వ్యక్తిగత వివరాలను నింపి Next బటన్ మీద క్లిక్ చేయాలి. అందులో మీరు మార్చాలనుకుంటున్న వ్యక్తిగత వివరాలు, అడ్రస్‌ను తప్పులు లేకుండా నింపాలి. మీ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని మార్చాలని అనుకున్నా దీనిలో మార్చుకోవచ్చు. అడ్రస్, కాంటాక్ట్ డిటైల్స్ అన్ని సరిగ్గా ఇచ్చిన తర్వాత పేజి కింద ఉన్న next బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజిలో ఐడెంటిటీ, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అలాగే ఫొటో, సంతకం కూడా మార్చాలనుకున్నా.. స్కాన్ చేసి jpeg ఫార్మట్‌లో అప్లోడ్ చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ కాగానే.. అకనాలెడ్జ్మెంట్ స్లిప్ జనరేట్ అవుతుంది. ఫోన్ నెంబర్‌కు, మెయిల్‌కు మెస్సెజ్ కూడా వస్తుంది. అనంతరం ఆ స్లిప్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్‌ను ప్రింట్ తీసి, మీరు ప్రూఫ్ కింద సబ్మిట్ చేసిన వాటిని ఎన్ఎస్డిఎల్ ఆఫీస్((Building-1, 409-410, 4th Floor, Barakhamba Road, New Delhi, PIN: 110001))కు పంపించాలి. (చదవండి: దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్.. ఎక్కడో తెలుసా?) -
మీ పాన్ కార్డు పోయిందా? ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!
Download e-PAN Card: మన దేశంలో ఆధార కార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత పాన్ కార్డుకు ఉంది. అధిక మొత్తంలో నిర్వహించే ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు తప్పనిసరి అనే విషయం మన అందరికీ తెలుసు. అలాగే, ఆదాయపు పన్ను రిటర్నుల(ఐటీఆర్) ఫైలింగ్ మొదలుకొని బ్యాంక్ ఖాతా తెరవడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు దరఖాస్తు చేసుకోవడం, వివిద పథకాలలో పెట్టుబడి పెట్టాలి అన్న పాన్ కార్డు అవసరం. అయితే, ఇలాంటి ముఖ్యమైన పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటే, ఇక నుంచి భయడాల్సిన అవసరం లేదు. మీ పాన్ కార్డు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఆదాయపు పన్ను శాఖ విభాగం కల్పిస్తోంది. పాన్ కార్డు పోతే కొత్త ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా? మొదట ఈ ఎన్ఎస్డీఎల్ పోర్టల్ లింకు ఓపెన్ చేయండి. ఇప్పుడు పోగొట్టుకున్న మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్లీ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, పిన్ కోడ్ నమోదు చేయాలి. మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీరు ఈ-పాన్ కార్డు పీడీఎఫ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. (చదవండి: రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు..!) -
18 ఏళ్లలోపు వారికి కూడా పాన్ కార్డు.. పొందండి ఇలా?
మన దేశంలో ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా చాలా ముఖ్యం. ఏదైనా అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలంటే పాన్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బు బదిలీకి, అలాగే బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి, ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి పాన్ కార్డు అవసరం. పాన్ కార్డు సాధారణంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికి ఇస్తారు. అయితే, చాల మందికి తెలియని విషయం ఏమిటంటే 18 ఏళ్లలోపు వారు కూడా ఈ కార్డు పొందవచ్చు. మీరు మీ పిల్లల పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మైనర్లు ఎవరైనా సరే సొంతంగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోలేరని గుర్తించుకోవాలి. పాన్ కార్డు ధరఖాస్తు విధానం మీరు ఆన్లైన్లో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మొదట ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సంబంధిత అభ్యర్థి కేటగిరీని ఎంచుకునేటప్పుడు వ్యక్తిగత సమాచారం మొత్తం వెల్లడించాలి. మీరు ఇప్పుడు మైనర్ వయస్సు రుజువును, తల్లిదండ్రుల ఫోటోతో సహా అనేక ఇతర కీలక పత్రాలను అప్లోడ్ చేయాలి. ఈ సమయంలో తల్లిదండ్రుల సంతకాన్ని మాత్రమే అప్లోడ్ చేయాలి. రూ. 107 ఛార్జీ చెల్లించిన తర్వాత మీరు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు ఒక రసీదు నెంబరు వస్తుంది. దాని సహాయంతో మీ అప్లికేషన్ స్థితిని చెక్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ-మెయిల్ వస్తుంది. విజయవంతంగా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 15 రోజుల్లోగా మీ పాన్ కార్డును ఇంటికి వస్తుంది. పాన్ కార్డు ఈ డాక్యుమెంట్లు అవసరం పాన్ కార్డు అప్లికేషన్ కోసం అనేక పేపర్లను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. మైనర్ తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు ధృవీకరణ అవసరం దరఖాస్తుదారుడి చిరునామా, గుర్తింపు రుజువు అవసరం. మైనర్ సంరక్షకుడు గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడిలలో ఏదో ఒకదానిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చిరునామా ధృవీకరణ కోసం మీ ఆధార్ కార్డు, పోస్టాఫీసు పాస్ బుక్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా ఒరిజినల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాపీ అవసరం. మీ పిల్లవాడు డబ్బు సంపాదించినప్పుడు, మీ బిడ్డ మీ పెట్టుబడికి నామినీ కావాలని మీరు కోరుకుంటే, పిల్లల పేరిట పెట్టుబడి పెట్టిన సమయంలో వారికి పాన్ కార్డు అవసరం అవుతుంది. (చదవండి: మెటావర్స్‌తో మహిళలు, పిల్లలకు ప్రమాదం) -
కేవైసీ పెండింగ్‌లో ఉంటే.. డీమ్యాట్ ఖాతా కట్..
జులై 31 లోగా తమ KYC డిటెయిల్స్ పూర్తి చేయని డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు నిలిపేస్తామంటూ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లు సర్క్యులర్ జారీ చేశాయి. ఈ ఖాతాలు నిలిపేయకుండా ఉండాలంటే వెంటనే కేవైసీలో అవసరమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కేవైసీకి సంబంధించి పేరు,అడ్రస్, పాన్‌కార్డు వివరాలు, ఉపయోగంలో ఉన్న ఫోను నంబరు, ఈ మెయిల్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో లింకైన పాన్‌కార్డునే కేవైసీ గుర్తిస్తుంది. కాబట్టి పాన్‌కార్డును ముందుగా ఆధార్‌లో లింక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వడం ఉత్తమం. వ్యక్తిగత వివరాలతో పాటు వార్షిక సంపాదన అంశాలను కేవైసీలో పొందు పరచాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి ఐదు కేటగిరీలు, వ్యక్తిగతేతర ఆదాయానికి సంబంధించి నాలుగు కేటగిరీలు ఉన్నాయి. వీటిని అనుసరించి డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ హోల్డర్లు .. తమ ఆదాయ వివరాల ఆధారంగా తగు కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది. -
అదానీ షేర్లు మళ్లీ పరుగులు పెడుతున్నాయ్
ముంబై: అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన మూడు ఫండ్లకు సంబంధించిన గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) ఖాతాలను మాతమ్రే స్తంభింపచేసినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) వివరణ ఇచ్చింది. దానికి అనుగుణంగానే తమ వెబ్సైట్లో తగు మార్పులు చేసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లయిన ఎబ్యులా ఇన్వెస్ట్మెంట్స్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్, క్రెస్టా ఫండ్ వీటిలో ఉన్నాయి. తాజా వివరణతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం గణనీయంగా లాభపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. అదానీ గ్రూప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన ఆరు మారిషస్ ఆధారిత ఫండ్స్‌లో మూడింటి ఖాతాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపచేసిందన్న వార్తలతో జూన్ 14న అదానీ సంస్థల షేర్లు ఏకంగా 25 శాతం దాకా పతనమయ్యాయి. అదానీ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి కాకుండా 2016 జూన్ నాటి జీడీఆర్‌ల విషయంలోనే ఆ ఫండ్స్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు ఎన్ఎస్డీఎల్ అప్పట్లోనే తెలిపింది. కానీ తమ వెబ్సైట్లో స్తంభింపచేసిన 9,444 ఖాతాల జాబితాలో వీటిని కూడా కొనసాగించడం సందేహాలకు తావిచ్చింది. తాజాగా ఆయా ఫండ్స్ ’జీడీఆర్’లను మాత్రమే ఫ్రీజ్ చేసినట్లు పోర్టల్లోనూ మార్చడంతో స్పష్టత ఇచ్చినట్లయింది. దీంతో బుధవారం అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ చెరి 4 శాతం, అదానీ పవర్ 2 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 0.76 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ 0.29 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 0.24 శాతం పెరిగాయి. -
నాలుగు రోజుల్లో భారీగా నష్టపోయిన గౌతమ్ అదానీ.. ఎంతంటే?
భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద 2021 ఏడాదిలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లూ భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఏడాదిలో ఏ మేరకు లాభపడ్డాయో ఎన్ఎస్డీఎల్ సమస్య తర్వాత నాలుగు రోజుల్లోనే అంతేస్థాయిలో కుప్పకూలాయి. దీంతో కేవలం నాలుగు సెషన్లలో స్టాక్స్ పతనం కావడంతో కొన్ని కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. దీంతో గౌతమ్ ఆదానీ సంపద, అదానీ గ్రూప్ సంపద వేగంగా కరిగిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టపోవడంతో ఈ 58 ఏళ్ల బిలియనీర్ సంపద నాలుగు రోజుల్లో 14 బిలియన్ డాలర్ల(రూ.1,03,737 కోట్ల) మేర కరిగిపోయింది. ఈ ఏడాదిలో ఎంత వేగంగా అదానీ గ్రూప్ షేర్లూ పెరిగాయో అంతకంటే వేగంగా తగ్గాయి. ప్రపంచంలోనే ఈ వారంలో అత్యంత సంపద కోల్పోయిన వ్యాపారవేత్తగా ఆదానీ నిలిచారు. ఆయన సంపద ఏకంగా 62.1 బిలియన్ డాలర్స్(రూ.4,60,143 కోట్ల)కు తగ్గింది. ప్రపంచ కుబేరుల్లో అత్యధికంగా నష్టపోయింది కూడా అదానీయే. దీంతో ఆయన ఆసియా ధనికుడి స్థానంలో రెండు నుంచి మూడవ స్థానానికి పడిపోయారు. చైనా టైకూన్ జోంగ్ షాన్ తిరిగి రెండవ స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికీ మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోని అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు. చదవండి: వర్షాకాలంలో కారు ఇంజిన్ పాడైతే బీమా వర్తిస్తుందా? -
అదానీ షాక్! ట్విటర్లో ప్రముఖ జర్నలిస్ట్ పేరు ట్రెండింగ్..!
ముంబై: దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లు మొదలైన కొన్ని గంటలకే సూచీలు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా అదానీ కంపెనీ షేర్లు సుమారు 25 శాతం మేర నష్టాన్ని చవిచూసాయి. అదానీ గ్రూప్స్‌కు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) షాక్ ఇవ్వడంతో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఎన్ఎస్డీఎల్ అదానీ కంపెనీలకు చెందిన సుమారు రూ. 43,500 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. దీంతో అదానీ కంపెనీ మార్కెట్ క్యాప్ 1,40,500.74 కోట్లకు పడిపోయింది. అదానీ గ్రూప్స్ కంపెనీ షేర్లు భారీగా పతనమవ్వడానికి కారణం ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ అంటూ ట్విటర్లో మారుమోగుతుంది. సుచేతా దలాల్ జూన్ 12న చేసిన ట్విట్ ప్రస్తుతం ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. సుచేతా దలాల్ తన ట్విట్లో ‘ఓ కంపెనీకు చెందిన షేర్ వాల్యూను రిగ్గింగ్ చేస్తూ వస్తోంది. సెబి ట్రాకింగ్ సిస్టమ్‌లతో లభ్యమయ్యే సమాచారంతో.. ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించడం కష్టమని తెలిపింది.’ నెటిజన్లు ఈ ట్విట్‌ను రీట్విట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ట్విటర్లో ఓ నెటిజన్ తన ట్విట్లో ‘ ఎలన్ మస్క్ ఒక్క ట్విట్‌తో క్రిప్టోకరెన్సీ వాల్యూను పెంచగలదు.. కానీ సుచేతా దలాల్ కంపెనీ పేరు బయటకు చెప్పకుండానే చేసిన ట్విట్‌తో అదానీ కంపెనీ షేర్ విలువ భారీగా నష్టపోయింద’ని తెలిపాడు. కాగా సుచేతా దలాల్ అంతకుముందు హర్షద్ మెహతా స్కామ్-1992 ను వెలుగులోకి తెచ్చింది. ఈ స్కామ్ అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఎన్ఎస్డీఎల్ అదానీ గ్రూప్‌కు చెందిన విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్న వార్తలను అదానీ ఖండించింది. ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించడానికే ఉద్ధేశపూర్వకంగా కుట్ర జరిగిందని వివరించింది. Another scandal hard to prove outside the black box of information available with SEBI tracking systems is the return of an operator of the past who is relentlessly rigging prices of one group. All through foreign entities! His speciality & that of a former FM. Nothing changes! — Sucheta Dalal (@suchetadalal) June 12, 2021 Elon Musk tweet about #dogecoin leads to 15 percent price spike 😵 Le* :- one tweet by #SuchetaDalal without any names & all Adani stocks hit lower circuits 😏 pic.twitter.com/vGzoVAx3JQ — Jatin Raghuwanshi (@JatinRa94724745) June 14, 2021 Adani Share Prices Were Going Up. Sucheta Dalal-#SuchetaDalal pic.twitter.com/w5egDDVq24 — PROF- MADHAV 🇮🇳 (@madhav_ghodekar) June 14, 2021 చదవండి: ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ -
అవన్నీ తప్పుడు కథనాలు : అదానీ
సాక్షి,ముంబై: ఎన్ఎస్డీఎల్ అదానీ గ్రూపునకు చెందిన మూడు విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్న వార్తలపై అదానీ గ్రూపుస్పందించింది. ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించడానికే ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందని వివరించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. ఇలాంటి వార్తలు పెట్టుబడులకు , సంస్థలకు ఆర్థికపరంగా నష్టం వాటిల్లుతుందని ఆరోపించింది. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేయలేదని వెల్లడించింది. మైనారిటీ పెట్టుబడిదారుల ఆసక్తిని కాపాడేందుకే ఈ ప్రకటనను జారీ చేస్తున్నామని తెలిపింది. మైనారిటీ పెట్టుబడిదారులపై ఈ వార్తలు ప్రతికూల ప్రభావాన్ని చూస్తే, ఆయా డిమాట్ ఖాతాల స్టేటస్ కో పద్ధతిని పాటించాలని రిజిస్ట్రార్ , ట్రాన్స్ఫర్ ఏజెంట్లను ఇ-మెయిల్ ద్వారా కోరింది. కాగా ఖాతాల లావాదేవీల నిలిపివేత వార్తలతో సోమవారం నాటి మార్కెట్లో అదానీ గ్రూపు మొత్తం ఆరు లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇంట్రా-డే ట్రేడ్‌లో 5నుంచి 20 శాతం వరకు పడిపోయాయి. నాలుగు గ్రూప్ కంపెనీల్లో సుమారు 45 వేల కోట్ల విలువైన షేర్లను మూడు విదేశీ ఫండ్ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపజేసిందని మీడియాలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. చదవండి: ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ -
ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్
సాక్షి, ముంబై: అదానీ గ్రూప్‌నకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)భారీ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన మూడు విదేశీ ఫండ్ల ఖాతాలను స్తంభింపజేసింది. నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలల రూ.43,500 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. డిపాజిటరీ వెబ్సైట్ ప్రకారం అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్,క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ఫండ్ ఖాతాలుమే 31న లేదా అంతకుముందే వీటిని స్తంభింపజేసినట్టు తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సరైన సమాచారాన్ని బహిరంగ పరచడంలో ఈ 3 కంపెనీలు విఫలమైనట్టు తెలుస్తోంది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఖాతాలను స్తంభింపజేయవచ్చు. దీంతో ఈ ఫండ్స్ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలలో దేనినీ విక్రయించలేవు లేదా కొత్త సెక్యూరిటీలను కొనలేవు. అదానీ గ్రూప్‌లో ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. మారిషస్‌కు చెందిన మూడుకంపెనీలు అదానీ ఎంటర్ ప్రైజెస్ 6.82 శాతం, అదానీ ట్రాన్మిషన్ 8.03 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5.92 శాతం, అదానీ గ్రీన్ 3.58 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. అదానీ గ్రూప్ గత ఏడాదిలో 200శాతం నుంచి 1,000 శాతం మధ్య లాభపడింది. అయితే దీనిపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు. తాజా వార్తతో స్టాక్మార్కెట్లో అదానీ గ్రూపు షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 25 శాతం క్షీణించి ఇంట్రాడే కనిష్టానికి 1,201.10 డాలర్లకు చేరుకుంది.దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 1,40,500.74 కోట్లకు పడిపోయింది. అదానీ పోర్టు 19 శాతం క్షీణించి, ఇంట్రాడే కనిష్టానికి 681.50 రూపాయలకు చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ 1,46,444.65 రూపాయలకు పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ , అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం పతనమై లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. చదవండి: stockmarket: అదానీ షాక్, భారీ నష్టాలు -
కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లు సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వ్యవహారంలో సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో (శాట్) బ్యాంకులకు చుక్కెదురైంది. తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించకుండా తక్షణం ఆదేశాలివ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను శాట్ తోసిపుచ్చింది. దీనిపై డిసెంబర్ 6లోగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే ఆశ్రయించాలని ఆదేశించింది. అలాగే ఆయా బ్యాంకుల వాదనలు విని, డిసెంబర్ 12లోగా తగు ఆదేశాలివ్వాలని సెబీకి సూచించింది. దీంతోపాటు, కార్వీ ట్రేడింగ్ లైసెన్సును రద్దు చేసిన అంశానికి సంబంధించి డిసెంబర్ 6లోగా తగు నిర్ణయం తీసుకోవాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ)ని ఆదేశించింది. కాగా, కార్వీ తనఖా పెట్టిన షేర్లపై రుణదాతలు మొత్తం రూ.1,400 కోట్ల మేర రుణాలిచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 95,000 క్లయింట్లకు చెందిన దాదాపు రూ. 2,800 కోట్ల విలువ చేసే షేర్లను తనఖా పెట్టి కార్వీ పెద్దమొత్తంలో రుణాలు తీసుకుందన్న ఆరోపణలు రావటం తెలిసిందే. ఈ షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించాలన్న సెబీ ఆదేశాలను ఎన్ఎస్డీఎల్ అమలు చేస్తోంది. సుమారు 83వేల మంది క్లయింట్లకు ఇప్పటికే షేర్ల బదిలీ జరిగింది. అయితే, కార్వీ తనఖా ఉంచిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయరాదని, వాటిని ఎస్క్రో ఖాతాలోకి మళ్లించాలని కోరుతూ బజాజ్ ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. ఐసీఐసీఐ బ్యాంక్ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం శాట్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!
సొంతిల్లు చాలా మంది స్వప్నం. సొంతింటితో పెనవేసుకున్న జ్ఞాపకాలను మధురంగా పరిగణించే వారు ఎందరో... అయితే, ఎంతో ఖర్చు చేసి కొన్న ఇంటిలో నివాసం ఉండేవారు కొందరు అయితే... అద్దెకు ఇచ్చేవారు కూడా కొందరు ఉంటారు. సొంతంగా నివాసం ఉండేవారు, అద్దెకు ఇచ్చిన వారిపై ఆదాయపన్ను చట్టం కింద పలు బాధ్యతలు ఉన్నాయి. వాటిని తప్పక తెలుసుకోవాలి. సొంతిల్లు ఉండి, ఉద్యోగ సంస్థ నుంచి హెచ్ఆర్ఏ పొందుతూ పన్ను మినహాయింపు పొందడం కుదరదు. రెండుకు మించిన ఇళ్లను సొంత వినియోగంలో ఉంచుకున్నా కానీ దానిపై అద్దె వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల మేరకు ఇంటి చుట్టూ ముడిపడిన పన్నుల అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే ఈ కథనం ఉద్దేశం. ఇంటిని కొంటుంటే...? మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంటే... సంబంధిత లావాదేవీ పన్ను అధికారుల దృష్టికి వెళుతుందని గ్రహించాలి. ఇంటి కొనుగోలుపై మీరు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం అందుబాటులో ఉంది. అంతేకాదు, ఇంటి కొనుగోలుతో ఓ వ్యక్తి పన్నుల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ బహుమతిగా తీసుకుంటుంటే మాత్రం ఆ ఇంటి విలువ మీ ఆదాయంలోనే కలుస్తుందని గుర్తుంచుకోవాలి. దానిపై పన్ను కూడా చెల్లించాల్సి రావచ్చు. కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఈ టీడీఎస్‌ను ఎన్ ఎస్డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫామ్ 26బిక్యూ ను ఫిల్ చేసి, కొనుగోలుదారు పాన్ , విక్రయదారు పాన్ వివరాలు ఇచ్చి చెల్లించాలి. లావాదేవీ జరిగిన నెల చివరి నుంచి 30 రోజుల్లోపు టీడీఎస్‌ను చెల్లించా ల్సి ఉంటుంది. అంతేకాదు మీకు విక్రయించిన వ్యక్తి కి టీడీఎస్ సర్టిఫికెట్ (ఫామ్ 16)ను ఇవ్వాలి. ట్రేసెస్ వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్‌ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎన్ ఆర్ఐ నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే, అప్పుడు ఇంటి విలువ ఎంత ఉన్నా గానీ దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకుని చెల్లింపులు చేయాలి. అయితే, ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. బహుమతి అయితే పన్ను పడుద్ది మీ బంధువు లేదా స్నేహితులు మీకు ఇంటిని బహుమతిగా ఇస్తే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. బహుమతి విలువ రూ.50,000 దాటితే గిఫ్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. స్టాంప్ డ్యూటీ విలువను మీ ఆదాయంలో ఇతర మూలాల (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) నుంచి వచ్చినట్టు చూపించాలి. ఆదాయపన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నిబంధనలోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలుసు కదా. అలాగే, గిఫ్ట్ ట్యాక్స్‌లోనూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒకవేళ ఇంటిని మీ వివాహ సందర్భంలో బహుమతిగా పొందుతుంటే లేదా వీలునామా కింద మీకు దక్కుతున్నా లేదా వారసత్వంగా లేదా కొన్ని ప్రత్యేకంగా పేర్కొన్న ఇనిస్టిట్యూషన్ల నుంచి తీసుకుంటున్నా దానిపై పన్ను చెల్లించక్కర్లేదని చట్టం చెబుతోంది. ఇక అత్యంత సమీప బంధువుల నుంచి గిఫ్ట్‌గా తీసుకున్నా పన్ను భారం ఉండదు. ఈ పరిధిలోకి జీవిత భాగస్వామి, మీ సోదరులు, సోదరీమణులు లేక సంతానం, అలాగే మీ భార్య సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు వస్తారు. స్టాంప్ డ్యూటీపై పన్ను మినహాయింపు ఇంటిని కొనే సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముల భారం భరించక తప్పదు. ఇవన్నీ కలసి ప్రాపర్టీ కొనుగోలు విలువలో గరిష్టంగా 10 శాతం వరకూ ఉంటుంటాయి. అయితే దీనిపై ఆదాయపన్ను చట్టం కింద కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంది. ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందేందుకు ఆదాయపన్ను చట్టం అనుమతిస్తోంది. కానీ, ఇక్కడే ఓ చిన్న తిరకాసు కూడా ఉంది. ఒకవేళ మీరు కొన్న ఇంటిపై ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొంది, ఐదేళ్లు పూర్తి కాకముందే సంబంధిత ఇంటిని విక్రయిస్తే... గతంలో పొందిన మినహాయింపు మొత్తాన్ని తిరిగి మీ ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుందని మరవొద్దు. ఇంటిపై పెట్టుబడితో తగ్గనున్న పన్ను దీర్ఘకాల పెట్టుబడుల రూపంలో ఉన్న బంగారం లేదా ఈక్విటీ షేర్లు లేదా రియల్ ఎస్టేట్ లేదా ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తంతో తిరిగి ఇంటిని కొనుగోలు చేస్తే... క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం తగ్గుతుంది. నూతనంగా సమకూర్చుకున్న మొదటి ఇల్లు... దీర్ఘకాలిక పెట్టుబడులను విక్రయించడానికి ఏడాది ముందు లేదా తర్వాత రెండేళ్లలోపు సమకూర్చుకున్నప్పుడే ఈ ప్రయోజనం సిద్ధిస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ దీర్ఘకాల పెట్టుబడుల విక్రయం ద్వారా పొందిన మూలధన లాభాల మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం రిటర్నులు ఫైల్ చేసే గడువు నాటికి నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయకపోతే, అదే సమయంలో చట్టంలో ఇచ్చిన గడువు లోపు నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు అయితే... అప్పుడు ఆ మొత్తాన్ని పన్ను మినహాయింపు కోసం నిర్దేశిత బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్‌కు బదలాయించాల్సి ఉంటుంది. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపును తిరిగి ఒక ఇంటి కొనుగోలుకే పరిమితం అన్నది ప్రస్తుత నిబంధన కాగా, దీన్ని కేంద్రం సడలించి 2020 ఏప్రిల్ 1 నుంచి రెండు ఇళ్ల కొనుగోలుకూ వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటి విక్రయంపై రూ.2 కోట్లు దాటకుండా వచ్చిన మూలధన లాభాల మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండు ఇళ్ల కొనుగోలుపై ఇన్వెస్ట్ చేసినా గానీ పన్ను భారం నుంచి ఊపిరి పీల్చుకోవచ్చన్న విషయం ఇక్కడ గమనార్హం. ఇంటి యజమాని అయితే... ఓ ఇంటికి యజమాని అయితే ఇందుకు సంబంధించి నిబంధనలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. సొంతంగా నివాసం ఉంటున్న ప్రాపర్టీయా లేక అద్దెకు ఇచ్చారా..? ఒకవేళ అద్దెకు ఇస్తే అద్దె ఆదాయంపై ఇంటి యజమాని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అద్దె ఎవరి చేతికి వెళ్లినా కానీ, ఈ ఇంటి యజమానిగా రికార్డుల్లో ఉన్న వారే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తమ ఇంట్లో తామే నివాసం ఉంటుంటే దాన్ని సెల్ఫ్ ఆక్యుపెయిడ్ ప్రాపర్టీ (ఎస్వోపీ)గా చట్టం పరిగణిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇంటిపై ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎస్వోపీలపై పన్ను ఉండదు. అయితే, సొంత నివాసం కోసం ఉంచుకునే ఇళ్ల విషయంలో ఐటీ చట్టం పరిమితి విధించింది. 2019–20 నుంచి ఒక వ్యక్తి రెండు ఎస్‌వోపీలను కలిగి ఉండొచ్చు. అంటే, మూడో ఇల్లు, అంతకంటే ఎక్కువ ఇళ్లను తమ పేరిట కలిగి ఉండి, వాటిని అద్దెకు ఇచ్చినా, లేక సొంత వినియోగానికి ఉంచుకున్నా గానీ వాటిపై అద్దె అదాయం వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక నోషనల్ రెంట్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇలా మూడు, అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న వారు వాటిల్లో తమ వంతు రెండు ఎస్‌వోపీలు ఏవన్నది ఎంపిక చేసుకునే స్వేచ్చ ఉంటుంది. అంటే ఎక్కువ అద్దె విలువ వచ్చే వాటిని తమ పేరిట ఉన్నట్టు చూపించుకోవచ్చు. పొందొచ్చు. రుణం తీసుకుని కొన్న ఇంటిపై... ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలుపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక ఇంటి రుణంపై అసలుతోపాటు ఏటా చేసే వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులకు మినహాయింపు అన్నది... ఆ ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది లేదా దాన్ని సమకూర్చుకున్న ఏడాదిగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఒకవేళ రుణాన్ని 1999 ఏప్రిల్ 1కి ముందు తీసుకుని, ఆ రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నాటి నుంచి ఐదేళ్లలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం పూర్తి కాకపోయి ఉంటే... వడ్డీ చెల్లింపులపై గరిష్టంగా రూ.30,000 వరకే పన్ను మిహాయింపు చూపించుకునే పరిమితి విధించారు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. అంటే మొత్తం రూ.2.5 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. నిర్మాణంలో ఉన్న సమయంలో రుణంపై చేసిన వడ్డీ చెల్లింపులకూ మినహాయింపు పొందొచ్చు. రుణం తీసుకున్న నాటి నుంచి నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకునే నాటి వరకు చేసిన వడ్డీ చెల్లింపుల మినహాయింపునకు చట్టం అనుమతిస్తోంది. నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాతి నుంచి 5 వాయిదాల్లో ఈ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. హెచ్ఆర్ఏ... పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు దానిపై ఐటీ మినహాయింపు పొందవచ్చు. 1. సంస్థ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో పొందిన మొత్తం హెచ్ఆర్ఏ. 2. మెట్రో నగరాల్లో వేతనంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారి వేతనంలో 40 శాతం. 3. వాస్తవంగా మీరు చెల్లించిన ఇంటి అద్దె నుంచి... మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని మినహాయించగా వచ్చేది. ఈ మూడింటిలో ఏది తక్కువగా ఉంటే ఆదాయపన్ను చట్టం ప్రకారం దానిపైనే పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు ఉద్యోగి అయి ఉండి, హెచ్ఆర్ఏ పొందుతూ... సొంత ఇంట్లోనే నివాసం ఉంటుంటే అప్పుడు మీరు పొందే హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు తీసుకోవడానికి చట్టం అనుమతించదు. అయితే, దీనికి బదులు మీరు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకున్న రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులకు పైన చెప్పుకున్న మేర పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇక సొంతిల్లు ఉన్నప్పటికీ దాన్ని అద్దెకు ఇచ్చి, మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి విషయంలో... ఇంటి రుణంపై అసలు, వడ్డీ చెల్లింపులకూ, మరో వైపు హెచ్ఆర్ఐపైనా పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఉదాహరణకు నోయిడాలో ఇల్లు ఉండి, దాన్ని అద్దెకు ఇచ్చి ఆఫీసుకు దగ్గర్లో ఉంటుందని ఢిల్లీలో నివాసం ఉంటున్నట్టు అయితే అటు ఇంటి రుణంపై చెల్లింపులు, మరోవైపు హెచ్ఆర్ఏపైనా పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. ఇంటిని విక్రయిస్తుంటే... ఐటీ చట్టం ప్రకారం నివాస భవనం క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తుంది. కనుక ఇంటిని విక్రయించినప్పుడు పొందిన లాభం, నష్టం క్యాపిటల్ గెయిన్ రూపంలో పన్ను పరిధిలోకి వస్తుంది. ఇంటిని కొనుగోలు చేసిన నాటి నుంచి 24 నెలలలోపు విక్రయించినట్టయితే అది స్వల్ప కాల మూలధన లాభం (ఎస్టీసీజీ), 24 నెలలు దాటిన తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్టీసీజీ)గా చట్టం పరిగణిస్తోంది. ఇంటి విక్రయ సమయంలో అయ్యే వ్యయాలను మూలధన లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. బ్రోకరేజీ, స్టాంప్ పేపర్ చార్జీలను ఇందులో నుంచి తగ్గించుకోవచ్చు. అలాగే, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వీటిని తీసివేయగా మిగిలిన దీర్ఘకాలిక మూలధన లాభంపై 20 శాతం పన్నుకు అదనంగా సర్‌చార్జ్, సెస్సు చెల్లించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణ సూచీ ప్రభావ ప్రయోజనం, ఎస్టీసీజీకి ఉండదు. ఇంటి విక్రయం రూపంలో వచ్చే ఎస్టీసీజీని ఆ వ్యక్తి సంబంధిత ఆర్థిక సంవత్సరం తన ఆదాయానికి కలిపి తన శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి విక్రయ విలువపైనే మూలధన లాభార్జన ఆధారపడి ఉంటుంది. ఆదాయ పన్ను భారం తగ్గించుకునే ఉద్దేశ్యంతో విక్రయదారులు విక్రయ విలువను తక్కువ చేసి చూపడాన్ని నిరోధించేందుకు ఆదాయపన్ను శాఖ సెక్షన్ 50సీని ప్రవేశపెట్టింది. స్టాంప్ వ్యాల్యూ కంటే 5 శాతానికి మించి తక్కువ చేసి విలువ చూపించినప్పుడు ఈ చట్టం వర్తిస్తుంది. అటువంటి సందర్భాల్లో పన్ను అధికారులు స్టాంప్ వ్యాల్యూషన్ నే పరిగణనలోకి తీసుకుంటారు. మూలధన లాభాలపై పన్ను భారం పడకుండా... మూలధన లాభాల పన్ను చెల్లించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఇంటి విక్రయం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాన్ని పొందిన వారు.. నూతనంగా మరో ఇంటి కొనుగోలుకు వెచ్చించడం లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేదా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా పవర్ ఫైనాన్స కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. రూ.50 లక్షల వరకూ మూలధన లాభాన్ని ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంటిని విక్రయించిన తర్వాత ఆరు నెలల్లోపే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఐదేళ్ల తర్వాతే తిరిగి ఆ బాండ్లను రిడీమ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ మీ ఇంటిని వారసత్వంగా మరొకరికి బదలాయించినా లేదా గిఫ్ట్‌గా ఇచ్చినా, అటువంటి సందర్బాల్లో విక్రయం జరిగినట్టుగా చట్టం పరిగణించదు. కనుక దీనిపై మూలధన లాభాల పన్ను ఉండదు. అయితే వారసత్వంగా లేదా బహుమానం రూపంలో పొందిన ఇంటిని, విక్రయించడం ద్వారా మూలధన లాభాలు వస్తే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వారసత్వంగా లేక బహుమతిగా వచ్చి సందర్భాల్లో పూర్వపు యజమాని సంబంధిత ఆస్తి సమకూర్చుకున్న మొత్తం కొనుగోలు వ్యయంగా చట్టం పరిగణిస్తుంది. స్వల్ప కాల మూలధన లాభం లేక దీర్ఘకాలిక మూలధన లాభమా అన్నది నిర్ధారించేందుకు పూర్వపు యజమాని స్వాధీనంలో ఉన్న కాలాన్ని కూడా ప్రస్తుతం విక్రయించిన యజమాని స్వాధీనంలోని వచ్చిన కాలానికి కలుపుకోవచ్చు. -
ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంకు ఆరంభం
ముంబై: ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించినట్టు ఆర్బీఐ తెలియజేసింది. 2014లో ఎన్ఎస్డీఎల్కు ఆర్బీఐ పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ జారీ చేసింది. ఆ ఏడా మొత్తంగా 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్‌లిచ్చింది. వీటిలో ఇప్పటి వరకు ఎయిర్టెల్, పేటీఎం, ఫినో, ఆదిత్య బిర్లా ఐడియా, జియో, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కాల్/ నోటీసు /టర్మ్ మనీ మార్కెట్లో బారోవర్ (రుణ గ్రహీత), లెండర్ (రుణదాత)గా పాల్గొనవచ్చని మరో నోటిఫికేషన్లో ఆర్బీఐ తెలియజేసింది. -
నెల రోజుల్లో ఎన్ఎస్డీఎల్ పేమెంట్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించనుంది. ఆర్బీఐ నుంచి తుది అనుమతులు రావాల్సి ఉందని.. మరో నెల రోజుల్లో ముంబై కేంద్రంగా సేవలను ప్రారంభిస్తామని ఎన్ఎస్డీఎల్ సీఎండీ జి.వి.నాగేశ్వర్ రావు చెప్పారు. పోటీ పేమెంట్ బ్యాంకింగ్ సంస్థలతో పోలిస్తే మెరుగైన సేవలందించేందుకు యాప్ ఆధారిత బ్యాంకింగ్ సేవలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. నగదు లావాదేవీలతో పాటూ వాలెట్, సినిమా, ట్రావెల్ టికెట్లు ఇతరత్రా సేవలను వినియోగించుకునే వీలుంటుందని నాగేశ్వర్ రావు వెల్లడించారు. స్టడీ సర్టిఫికెట్లు డిజిటల్ రూపంలో.. ఎన్ఎస్డీఎల్ నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) సేవలను కూడా అందిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు చెందిన అన్ని సర్టిఫికెట్లు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చడమే దీని పని. ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఖాతా ఉంటుంది. ఇది అకడమిక్ స్థాయిలో పూర్తిగా ఉచితమని.. ఆ తర్వాత రుణాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం వినియోగిస్తే మాత్రం కొంత చార్జీ ఉంటుందని రావు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని సీబీఎస్ఈతో పాటూ 40 యూనివర్సిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయని.. ఇప్పటివరకు 50 లక్షల సర్టిఫికెట్లను భద్రపరిచామని తెలియజేశారు. మరో 300 యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోనున్నామని.. వచ్చే రెండేళ్లలో దేశంలోని అన్ని విద్యా సంస్థలూ ఎన్ఏడీలో భాగస్వాములవుతాయని ధీమావ్యక్తం చేశారు. ఎన్ఏడీతో నకిలీ, ఫోర్జరీ సర్టిఫికెట్ల సమస్య ఉండదని.. పైగా విదేశీ విద్యా, రుణాల మంజూరు త్వరితగతిన పూర్తవుతుందని చెప్పారాయన. స్టాక్ మార్కెట్లో తెలంగాణ నుంచి రూ.5,400 కోట్లు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో రోజుకు నగదు ప్రవాహం రూ.45 వేల కోట్లుగా ఉంటుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి 11–12 వేల కోట్లుంటుందని కొటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (కేఎస్ఎల్) సీఎండీ కమలేశ్ రావు తెలిపారు. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ నుంచి రూ.5,400 కోట్లు ఉంటుందని.. ఇందులో 10 శాతం నగదు ప్రవాహం కోటక్ నుంచి జరుగుతుందని కమలేశ్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో కేఎస్ఎల్కు 16 లక్షల మంది కస్టమర్లున్నారని.. 18 నెలల్లో రెండింతలకు చేర్చాలని లకి‡్ష్యంచామని పేర్కొన్నారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ అనుబంధ సంస్థే ఈ కేఎస్ఎల్.. బుధవారమిక్కడ ఫ్రీ ఇంట్రాడే ట్రేడింగ్ సేవలను ప్రారంభించింది. వార్షిక సబ్స్క్రిప్షన్ చార్జీ రూ.999. -
ఎన్ఎస్ డీఎల్, సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ల ఖాతాలు: 2.5 కోట్లు
ముంబై: ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ డిపాజిటరీల్లోని మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు ఫిబ్రవరి నెల చివరి నాటికి 2.5 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి చివరికి మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 2.33 కోట్లుగా ఉంది. గతనెల చివరి నాటికి ఎన్ఎస్డీఎల్ వద్ద 1.45 కోట్ల ఖాతాలు (గతేడాది ఖాతాలు 1.38 కోట్లు), సీడీఎస్ఎల్ వద్ద 1.06 కోట్ల ఖాతాలు (గతేడాది ఖాతాలు 95.2 లక్షలు) ఉన్నాయి. 2015 మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 18.64 లక్షలమేర పెరిగితే.. 2014 మార్చి నెల నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 14.9 లక్షలమేర పెరిగింది. ఇది క్యాపిటల్ మార్కెట్స్పై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుదలను ప్రతిబింబిస్తోందని నిపణులంటున్నారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) ఖాతాల్లో ఇన్వెస్టర్లు వారి సెక్యూరిటీలను (షేర్లు, డిబెంచర్స్, బాండ్స్) ఎలక్ట్రానిక్ రూపంలో డిపాజిట్ చేసుకోవచ్చు. -
సీఎస్‌డీఐతో ఎన్ఎస్డీఎల్ ఒప్పందం
ముంబై: నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్), సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ ఆఫ్ ఐరన్ (సీఎస్డీఐ) మధ్య ఎంఓయూ కుదిరింది. దీని ప్రకారం... ఇరు డిపాజిటరీ సంస్థలు మెక్సికో నగరంలో జరుగనున్న వరల్డ్ ఫోరమ్ ఆఫ్ సీఎస్డీఎస్ (డబ్ల్యూఫ్సీ 2015) సమావేశంలో వివిధ సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ సంస్థల మధ్య పరస్పర అవగాహన కోసం కలిసి పనిచేస్తాయి. బిజినెస్ అభివృద్ధికి సీనియర్ మేనేజ్మెంట్ మధ్య రెగ్యులర్ సమావేశాల నిర్వహణ, సెక్యూరిటీస్ మార్కెట్స్పై అవగాహన కోసం స్టాఫ్ మార్పిడి, ట్రైనింగ్ వంటి అంశాలు దీన్లో ఉన్నాయి.