ఎన్‌ఎస్‌డీఎల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఆరంభం | NSDL Payments Bank starts operations | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌డీఎల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఆరంభం

Published Tue, Oct 30 2018 12:45 AM | Last Updated on Tue, Oct 30 2018 12:45 AM

NSDL Payments Bank starts operations - Sakshi

ముంబై: ఎన్‌ఎస్‌డీఎల్‌ పేమెంట్స్‌ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించినట్టు ఆర్‌బీఐ తెలియజేసింది. 2014లో ఎన్‌ఎస్‌డీఎల్‌కు ఆర్‌బీఐ పేమెంట్స్‌ బ్యాంకు లైసెన్స్‌ జారీ చేసింది. ఆ ఏడా మొత్తంగా 11 సంస్థలకు పేమెంట్స్‌ బ్యాంకు లైసెన్స్‌లిచ్చింది.

వీటిలో ఇప్పటి వరకు ఎయిర్‌టెల్, పేటీఎం, ఫినో, ఆదిత్య బిర్లా ఐడియా, జియో, ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక, పేమెంట్స్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కాల్‌/ నోటీసు /టర్మ్‌ మనీ మార్కెట్‌లో బారోవర్‌ (రుణ గ్రహీత), లెండర్‌ (రుణదాత)గా పాల్గొనవచ్చని మరో నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ తెలియజేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement