డీమెటీరియలైజ్‌డ్(డీమ్యాట్) రూపంలో ఉన్న మొత్తం సెక్యూరిటీల విలువ రూ. 500 లక్షల కోట్లను తాకినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్‌ఎస్‌డీఎల్) వెల్లడించింది. 2024 సెప్టెంబర్‌కల్లా 6 లక్షల కోట్ల డాల ర్లకు చేరినట్లు తెలిపింది.
తొలి రూ. 100 లక్షల కోట్ల మార్క్‌ను 18ఏళ్లలో అంటే 2014 జూన్‌లో అందుకున్నట్లు తెలియజేసింది. తదుపరి ఆరేళ్ల కాలంలో 2020 నవంబర్‌కల్లా విలువ రెట్టింపై రూ. 200 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో డీమ్యాట్ సెక్యూరిటీలు 4ఏళ్లలోనే రూ. 500 లక్షల కోట్లయ్యింది.
కృతజ్ఞతలు
ఈ చరిత్రాత్మక మైలురాయికి కారణమైన ఇన్వెస్టర్లు, మార్కె ట్ పార్టిసిపెంట్లు, నియంత్రణ సంస్థలు తదితరులకు కృతజ్ఞతలు.
– ఎస్.గోపాలన్, ఎన్‌ఎస్‌డీఎల్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment