DEMAT
-
డీమ్యాట్ సెక్యూరిటీలు రూ. 500 లక్షల కోట్లు
డీమెటీరియలైజ్డ్(డీమ్యాట్) రూపంలో ఉన్న మొత్తం సెక్యూరిటీల విలువ రూ. 500 లక్షల కోట్లను తాకినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్) వెల్లడించింది. 2024 సెప్టెంబర్‌కల్లా 6 లక్షల కోట్ల డాల ర్లకు చేరినట్లు తెలిపింది.తొలి రూ. 100 లక్షల కోట్ల మార్క్‌ను 18ఏళ్లలో అంటే 2014 జూన్‌లో అందుకున్నట్లు తెలియజేసింది. తదుపరి ఆరేళ్ల కాలంలో 2020 నవంబర్‌కల్లా విలువ రెట్టింపై రూ. 200 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో డీమ్యాట్ సెక్యూరిటీలు 4ఏళ్లలోనే రూ. 500 లక్షల కోట్లయ్యింది. కృతజ్ఞతలుఈ చరిత్రాత్మక మైలురాయికి కారణమైన ఇన్వెస్టర్లు, మార్కె ట్ పార్టిసిపెంట్లు, నియంత్రణ సంస్థలు తదితరులకు కృతజ్ఞతలు. – ఎస్.గోపాలన్, ఎన్ఎస్డీఎల్ ఎండీ -
నామినీ నిబంధనలు సడలించిన సెబీ
డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నామినీ పేరును జతచేయాలనే నిబంధనను సడలిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది.గతంలో సెబీ జారీ చేసిన నియమాల ప్రకారం..డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నామినీ పేరును తప్పకుండా జతచేయాలి. నామినీ అవసరం లేనివారు (ఆప్ట్ ఔట్ ఆఫ్ నామినేషన్) అని ఎంచుకోవాలి. ఇందులో ఏదో ఒకటి జూన్ 30లోపు తెలియజేయాల్సి ఉంది. ఆయా వివరాలు సమర్పించని వారి డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు జూన్30 తర్వాత పనిచేయవని సెబీ గతంలో చెప్పింది.ఈ నిబంధనలను మరోసారి పరిశీలించాలని సెబీకి మార్కెట్ వర్గాల నుంచి భారీగా అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని సెబీ తన పాత ఆదేశాలన్ని సడలిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మదుపు చేస్తున్న డీమ్యాట్ ఖాతాదారులు, ఫండ్ మదుపరులు నామినేషన్ వివరాలు తెలియజేయకపోయినా వారి ఖాతాల విషయంలో ఎలాంటి చర్యలుండవని సెబీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు భౌతిక రూపంలో షేర్ల సర్టిఫికెట్లు ఉన్న వారికీ డివిడెండ్, వడ్డీ, ఇతర చెల్లింపులతోపాటు, అవసరమైన సేవల విషయాలన్నీ నామినేషన్‌తో సంబంధం లేకుండా అందించాలని పేర్కొంది.నామినీ జత చేయడంపై సెబీ సడలింపు ఇచ్చినా తప్పకుండా డీమ్యాట్, ఫండ్ పెట్టుబడిదారులు ఆయా వివరాలు నమోదు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు కాబట్టి ఏక్షణం ఏదైనా జరగొగ్గచ్చు. మనం ఉన్నా..లేకపోయినా మనం కష్టపడి సంపాదించికున్న పెట్టుబడులు, లాభాలను నామినీకు చెందేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. -
‘న్యూ ఇయర్ నుంచి జరిగే మార్పులు ఇవే’.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
మరికొద్ది రోజుల్లో 2023 ముగిసి.. 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో రోజూవారి జీవితంతో ముడిపడి ఉన్న ఆర్ధికపరమైన అంశాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా బ్యాకింగ్, స్టాక్ మార్కెట్ మార్కెట్, బ్యాంక్ లాకర్, ఆధార్‌లో మార్పులు వంటి అంశాలు ఉన్నాయి. అయితే, డిసెంబర్ 31 ముగిసి న్యూఇయర్‌లోకి అడుగు పెట్టిన అర్ధరాత్రి నుంచి చోటు చేసుకునే మార్పుల కారణంగా ఎలాంటి ఆర్ధికరపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే డిసెంబర్ నెల ముగిసే లోపు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాటిల్లో ప్రధానంగా డీమ్యాట్ అకౌంట్‌కు నామిని : మీరు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా.. లేదంటే కొత్త ఏడాది నుంచి మొదలు పెట్టాలనే ప్రణాళికల్లో ఉంటే మాత్రం తప్పని సరిగా డీమ్యాట్ అకౌంట్లో నామిని వివరాల్ని అందించాల్సి ఉంటుంది. సాధారణంగా పెట్టుబడిదారులు స్టాక్స్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా.. సెక్యూరిటీస్‌ని అమ్మాలన్నా, కొనాలన్నా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 లోపు నామినీ వివరాల్ని అందించపోతే ఇకపై మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసేందుకు అర్హులు, పైగా స్టాక్స్‌ను అమ్మలేరు, కొనలేరు. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ : ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ లాకర్ అగ్రమిమెంట్లో డిసెంబర్ 31,2023లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత బ్యాంకుల్ని సంప్రదించాలి. నిబంధనల్ని పాటించకపోతే లాకర్ ఫ్రీజ్ అవుతుంది. ఖాతాదారుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్బీఐ డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉంటుందని అంచనా. ఆధార్ కార్డ్‌లో మార్పులు : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డ్‌లో ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే ఉచితంగా చేసుకోవచ్చని సెప్టెంబర్ 14, 2023 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఆధార్ కార్డ్‌దారుల సౌలభ్యం మేరకు ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఆధార్‌లో మార్పులు చేసుకోవాలంటే రూ.50 సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 సర్వీస్ ఛార్జీ అంటే సులభంగా తీసుకోవద్దు. దేశంలో రోజూవారి కార్మికులు ఎంత సంపాదిస్తున్నారని తెలుసుకునేందుకు ప్లీటాక్స్ ఆనే సంస్థ సర్వే చేసింది. ఆ సర్వేలో దినసరి కూలి రూ.178 అని తేలింది. కాబట్టే డిసెంబర్ 31 లోపు ఆధార్‌లో మార్పులు ఉంటే చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. సిమ్ కార్డ్‌లో మార్పులు : వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ తీసుకోవడం మరింత సులభతరం కానుంది. ఇప్పుడు మనం ఏదైనా టెలికాం కంపెనీ సిమ్ కార్డ్ కావాలంటే పేపర్లకు పేపర్లలో మన వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇకపై ఈ ప్రాసెస్ అంతా అన్లైన్లోనే జరుగుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) తెలిపింది. కెనడాలో మారనున్న నిబంధనలు : ఈ నిర్ణయంతో జనవరి 1 నుంచి భారత్‌తో పాటు ఇతర దేశాల విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందే అని చెప్పుకోవాలి. కెనడాలో చదువుకునేందుకు స్టడీ పర్మిట్ కావాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్ధుల వద్ద 10వేల డాలర్లు ఉంటే సరిపోయేదు. కానీ జనవరి 1,2024 ఆ మొత్తాన్ని 20,635 డాలర్లకు పెంచింది. ఈ నిబంధన జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. -
అన్ని ప్రైవేట్ కంపెనీల షేర్లు డీమ్యాట్‌లోనే.. ఎంసీఐ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల సెక్యూరిటీల విషయంలో పారదర్శకతను పెంచే దిశగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఐ) కీలక ఆదేశాలిచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి ప్రైవేట్ కంపెనీలన్నీ డీమ్యాట్ (డిజిటల్) రూపంలోనే సెక్యూరిటీలను జారీ చేయాలని ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. చిన్న సంస్థలు, ప్రభుత్వ రంగ కంపెనీలకు దీన్నుంచి మినహాయింపునిచ్చింది. కొన్ని సంస్థలు భౌతిక ఫార్మాట్లో జారీ చేసే షేర్లకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకునే అవకాశాలను కట్టడి చేసేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడనున్నాయి. కంపెనీల చట్టం కింద ప్రస్తుతం రిజిస్టరయిన 14 లక్షల పైచిలుకు ప్రైవేట్ సంస్థలపై దీని ప్రభావం పడవచ్చని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ ఆనంద్ జయచంద్రన్ తెలిపారు. సాధారణంగా షేర్ల జారీకి సంబంధించి కంపెనీల చట్టం 2013 కింద ప్రైవేట్ కంపెనీలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిలో షేర్‌హోల్డర్ల సంఖ్య 200కు మించి ఉండకూడదు. నోటిఫికేషన్ ప్రకారం 2024 సెప్టెంబర్ తర్వాత నుంచి ప్రైవేట్ సంస్థలు షేర్ల జారీ, బైబ్యాక్, బోనస్ ఇష్యూ లేదా రైట్స్ ఆఫర్ మొదలైనవన్నీ డీమ్యాట్ రూపంలోనే జరగాలి. నాలుగు కోట్ల రూపాయల వరకు పెయిడప్ షేర్ క్యాపిటల్, రూ. 40 కోట్ల వరకు టర్నోవరు ఉన్న చిన్న సంస్థలకు, కొన్ని పరిమితులకు లోబడి, మినహాయింపు ఉంటుంది. మరోవైపు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ (ఎల్ఎల్పీ)ల నిబంధనలను కూడా ఎంసీఏ సవరించింది. వీటి ప్రకారం .. ఏర్పాటైన తేదీ నుంచి ప్రతి ఎల్ఎల్పీ తమ భాగస్వాముల చిరునామా, పాన్ నంబరు మొదలైన వివరాలతో ఒక రిజిస్టర్‌ను నిర్వహించాలి. -
వీడియోకాన్ ఫౌండర్ అకౌంట్ల అటాచ్మెంట్.. సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: రూ. 5.16 లక్షల జరిమానా బకాయిలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌కు చెందిన బ్యాంక్, డీమాట్, మ్యుచువల్ ఫండ్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు (సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్), మ్యుచువల్ ఫండ్ సంస్థలకు సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతించవచ్చని పేర్కొంది. క్వాలిటీ టెక్నో అడ్వైజర్స్, క్రెడెన్షియల్ ఫైనాన్స్, సుప్రీం ఎనర్జీ వంటి సంస్థలతో తనకున్న పెట్టుబడులు, సంబంధం గురించి వెల్లడించకుండా, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ ఏడాది మార్చిలో ధూత్‌కు సెబీ రూ. 5 లక్షల జరిమానా విధించింది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఇదీ చదవండి ➤ ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్‌కు సీఈవోగా అంజలీ సూద్ దీంతో అసలుతో పాటు రూ. 15,000 వడ్డీ, రికవరీ వ్యయాల కింద మరో రూ. 1,000 కలిపి మొత్తం రూ. 5.16 లక్షలు బాకీ చెల్లించాలని అటాచ్మెంట్ నోటీసులో సెబీ ఆదేశించింది. వీడియోకాన్ గ్రూప్ సంస్థలకు రుణ సదుపాయాలు కల్పించినందుకు ప్రతిగా అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా పనిచేసిన చందా కొచర్, ఆమె భర్తకు ధూత్ ప్రయోజనం చేకూర్చారని (క్విడ్ ప్రో కో) ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. -
ఇక షేర్లన్నీ డీమ్యాట్‌లోనే..!!
న్యూఢిల్లీ: కాగితం రూపంలో ఉన్న ఫిజికల్ షేర్ల పట్ల వాటాదారుల్లో ఇప్పటికీ మమకారం పోలేదు.! లిస్టెడ్ కంపెనీల్లో 98.6 శాతం కంపెనీలకు ఫిజికల్ షేర్ సర్టిఫికెట్ కలిగిన వాటాదారులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. డిజిటల్ రూపంలోకి షేర్లను మార్చుకునే అవకాశాన్ని చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినా, ఇప్పటికీ కొంత మంది ఫిజికల్ షేర్లను మార్చుకోకుండా ఉండిపోవడం గమనార్హం. డీమ్యాట్ రూపంలో షేర్లను కలిగి ఉండేందుకు కొంత మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అవకాశం లేని రోజుల్లో వాటాలన్నీ ఫిజికల్ సర్టిఫికెట్ల రూపంలోనే ఉండేవి. నాడు జారీ చేసిన వాటాల్లో కొన్ని అదే రూపంలో, డీమ్యాట్ మోడ్‌లోకి మారకుండా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటువంటి వాటాల విలువ 2018 డిసెంబర్ నాటికి రూ.2.9 లక్షల కోట్లు ఉంటుందని క్యాపిటలైన్ డేటా ఆధారంగా అంచనా. అయితే, అంతకుముందు త్రైమాసికంలో ఉన్న రూ.3.8 లక్షల కోట్లతో పోలిస్తే తగ్గినట్టు తెలుస్తోంది. సెబీ గడువుతో కాస్త కదలిక 2018 డిసెంబర్ నాటికి 927 కంపెనీలకు సంబంధించి డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ సహా ఇన్స్ట్రుమెంట్లను విశ్లేషించి చూడగా, 914 కంపెనీల్లో ఫిజికల్ రూపంలో వాటాలు ఉన్నట్టు తెలిసింది. మార్చి త్రైమాసికంలోనూ ఈ పరిస్థితి మారి ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్చి క్వార్టర్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న 21 కంపెనీల వాటాదారుల వివరాలను విశ్లేషించి చూడగా ఫిజికల్ వాటాలు ఉన్నట్టు స్పష్టమైంది. అయితే, ఇటీవలి కాలంలో కాస్త కదలిక వచ్చిందని, సెబీ గడువు విధించడంతో చాలా మంది ఫిజికల్ రూపంలో ఉన్న షేర్లను డీమ్యాట్ రూపంలోకి మార్చుకునేందుకు ముందుకు వస్తున్నట్టు ఏంజెల్ బ్రోకింగ్ సీఈవో వినయ్ అగర్వాల్ తెలిపారు. షేర్లను బదిలీ చేసుకోవాలనుకుంటే డీమ్యాట్ రూపంలోకి మార్చుకునేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 1ని గడువుగా సెబీ నిర్ణయించింది. షేర్ల మార్పిడి మినహా డీమ్యాట్ రూపంలో ఉంటే తప్ప మరొకరి పేరిట బదిలీకి అనుమతించకూడదని సెబీ గతేడాది మార్చి 28న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు గత నెల 27న సెబీ నోట్ కూడా విడుదల చేసింది. డీమ్యాట్ రూపంలో ఉంటే తప్ప సాధారణ వ్యాపార ప్రక్రియలో భాగంగా ట్రాన్స్ఫర్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ సందర్భాల్లో అవకాశం... వారసత్వంగా తమ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న వాటిని తమ పేరుపైకి మార్చుకునేందుకు డీమ్యాట్ రూపంలో లేకపోయినా సరే ఇకపైనా అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ తరహా మార్పుల గురించి, షేర్లను డీమ్యాట్‌లోకి మార్చుకోవాలన్న విషయం తెలియదని కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు పవన్‌కుమార్ విజయ్ తెలిపారు. తగినంత అవగాహన కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మార్పుల గురించి అందరికీ తెలిసేలా చూడాలన్నారు. ‘‘ఇక చాలా కేసుల్లో ఫిజికల్ రూపంలో ఉన్న వాటాల విలువ పెద్ద స్థాయిల్లో లేకపోవడం మరో అంశం. దీంతో వారసత్వంగా వచ్చిన షేర్లను, డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవడంలో ఉన్న ప్రయాసల దృష్ట్యా ఫిజికల్ రూపంలోనే కొనసాగిస్తున్నారు’’అని వినయ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఆటో తదితర రంగాల్లోని కంపెనీల్లో ఇలా ఫిజికల్ వాటాలున్నాయి. వీటిల్లో ప్రభుత్వరంగ, ప్రైవేటు కంపెనీలు సైతం ఉండడం గమనార్హం. ఫిజికల్ షేర్ల బదిలీలో ఉన్న సమస్య, మోసాల నివారణకు గాను షేర్ల డీమ్యాట్ దిశగా కృషి చేయాలన్నది సెబీ బోర్డు అభిప్రాయం. -
కొత్త షేర్ల జారీ డీమ్యాట్ రూపంలోనే
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని కంపెనీలు కొత్త షేర్లను వచ్చే నెల 2 నుంచి డీమ్యాట్ రూపంలోనే జారీ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ కంపెనీలు డీ మ్యాట్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలోనే షేర్లను బదిలీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమ నిధుల వరదను నిరోధించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. పారదర్శకతను మరింతగా పెంచడానికి, ఇన్వెస్టర్ల రక్షణ నిమిత్తం, కార్పొరేట్ రంగంలో మంచి వాతావరణం సృష్టించడం లక్ష్యాలుగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డీమ్యాట్ రూపంలో షేర్లను జారీ చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని సదరు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగితం రూపంలోని షేర్ల వల్ల అవి చోరీకి గురికావడం, చినిగిపోవడం, మోసాలకు గురికావడం వంటి సమస్యలు ఉంటా యని వివరించింది. డీమ్యాట్ రూపంలో షేర్ల జారీ వల్ల ఈ సమస్యలుండవని పేర్కొంది. -
డీమ్యాట్‌తో బహుళ ప్రయోజనాలు
సాక్షి మదుపరుల అవగాహన సదస్సులో సీడీఎస్ఎల్ ఆర్ఎం సాక్షి, విశాఖపట్నం: ‘దేశ జనాభా 121 కోట్లు దాటింది. బ్యాంకు ఖాతాలు 46 కోట్లు. సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్ల పైనే. అయితే డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2.50 కోట్లే. స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి ముందుగా ఉండాల్సింది డిమ్యాట్ ఖాతానే. దీనివల్ల బహుళ ప్రయోజనాలున్నాయి.’ అని సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ అన్నారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆదివారం విశాఖలో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సులో ఆయన పలు విలువైన సూచనలు అందించారు. ఆదాయపు పన్నుశాఖ జారీ చేసిన పాన్‌కార్డు ఉన్న వ్యక్తులెవరైనా డీమ్యాట్ ఖాతాను ప్రారంభించేందుకు వీలుందని, ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను భద్రపర్చుకోవచ్చని వివరించారు. డీమ్యాట్ ఖాతాదారులు తప్పనిసరిగా నామినీని పేర్కొనాలని, అనుకోనిదేదైనా జరిగితే ఖాతాలో ఉన్న షేర్లను నామినీ ఖాతాలోకి వెంటనే బదిలీ చేయవచ్చన్నారు. స్టాక్ మార్కెట్లో అవగాహనతో మదుపు చేస్తే ఇతర పెట్టుబడి పథకాల కన్నా అధికంగానే రాబడి ఉంటుందని, చిన్న వయసు నుండే పెట్టుబడులు ప్రారంభించి, దీర్ఘకాలం కొనసాగించాలని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో మార్కెట్ మరింత వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా ఈక్విటీల్లో మదుపు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కోటక్ మ్యూచువల్ ఫండ్ ఏపీ, తెలంగాణా హెడ్ టి.విజయకుమార్, షేర్‌ఖాన్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ కృష్ణమూర్తి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మదుపు ప్రయోజనాలను వివరించారు. సదస్సులో అధిక సంఖ్యలో మదుపరులు పాల్గొన్నారు. తమ సందేహాలను మదుపరులు నిపుణులను అడిగి తెలుసుకున్నారు. -
డీమ్యాట్ ఖాతా కావాలా?
డీ మ్యాట్ అంటే... కొనుక్కున్న షేర్లను దాచుకునే ఒక ఎలక్ట్రానిక్ ఖాతా. అయితే దీన్లో షేర్లను కొని దాచిపెట్టుకోవాలన్నా... ఇందులో ఉన్న షేర్లను విక్రయించాలన్నా... అందుకు ట్రేడింగ్ ఖాతా కావాలి. క్రయవిక్రయాలకు డబ్బులుండాలి కనక ఈ ట్రేడింగ్ ఖాతాలోకి డబ్బులు వెయ్యాలన్నా, తియ్యాలన్నా ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలి. ఈ సేవలు మూడు విధాలుగా పొందవచ్చు. 1. కొన్ని బ్యాంకులు సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలన్నిటినీ కలిపి ఇచ్చే 3 ఇన్ 1 స్టాక్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్లకు సంబంధించి రీసెర్చ్ రిపోర్టులివ్వటంతో పాటు ఏ షేర్లను కొనాలి? వేటిని విక్రయించాలి? వంటి సూచనలు కూడా ఇస్తుంటాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎస్బీఐ వంటి బ్యాంకులతో పాటు కోటక్ సెక్యూరిటీస్ వంటి ఆర్థిక సంస్థలూ ఈ 3 ఇన్ 1 సేవలందిస్తున్నాయి. 2. ఇక రెండో తరహా స్టాక్ బ్రోకర్ల విషయానికొస్తే... ఇవి కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్స్‌ను మాత్రమే అందిస్తాయి. వీటికి మనకు ఖాతా ఉన్న బ్యాంకు తాలూకు సేవింగ్స్ అకౌంట్‌ను జత చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ట్రేడింగ్ ఖాతాలోకి నగదు వేయటం, అందులోంచి నగదు తీసుకోవటం వంటివి కాస్తంత ఆలస్యమవుతాయి. ఇండియా ఇన్ఫోలైన్, ఏంజెల్, షేర్‌ఖాన్, వెంచురా వంటి పలు సంస్థల్ని ఈ తరహావిగా చెప్పొచ్చు. 3. ఈ మధ్యకాలంలోనే మూడో రకం బ్రోకరేజ్ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇవి చిన్న ఇన్వెస్టర్లను, చిన్న ట్రేడర్లను దృష్టిలో పెట్టుకుని... లావాదేవీలతో సంబంధం లేకుండా స్థిరమైన ఫీజులు లేదా చాలా తక్కువ చార్జీలతో సేవలందిస్తున్నాయి. అందుకే వీటిని డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలుగా పేర్కొంటున్నారు. మూడింట్లో ఏది ఉత్తమం? ఈ మూడింట్లో ఏది ఉత్తమమనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. కానీ అదంతా మీరు నిర్వహించే లావాదేవీలు, ఇన్వెస్ట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దీర్ఘకాలిక దృష్టితో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారైతే ఏ బ్రోకరేజ్ సంస్థను ఎంచుకోవాలన్న విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్లు ఎదురు చూస్తారు. ఏడాదిలో 30 నుంచి 40 లావాదేవీలకు మించవు. ఇలాంటి వారు ఫీజులు, చార్జీల గురించి ఆలోచించాల్సిన పని లేదు. వీరు చక్కని సర్వీసులు అందించే 3 ఇన్ 1 బ్రోకర్‌ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే కొనాలనుకున్న వెంటనే కొనుగోలు చేయొచ్చు. పెపైచ్చు విక్రయించిన వెంటనే డబ్బులు ఖాతాలోకి వస్తాయి. బ్యాంకుల్లోనే కనక డబ్బుకు భద్రత కూడా ఉంటుంది. అటు ఇన్వెస్ట్ చేస్తూ ఇటు ట్రేడింగ్ కూడా చేసేవారైతే... రెండు బ్రోకింగ్ అకౌంట్స్‌ను తీసుకోవటం మంచిదన్నది నిపుణుల సలహా. ఒకటి ఇన్వెస్ట్మెంట్ కోసమైతే మరొకటి ట్రేడింగ్ కోసం. అలా కాకుండా కేవలం ఇంట్రాడే ఎఫ్ అండ్ వో ట్రేడింగ్ మాత్రమే చేసేవారైతే డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలకేసి చూడొచ్చు. ఇవన్నీ కాకపోతే చెల్లించే వార్షిక ఫీజులు ఆధారంగా కూడా బ్రోకింగ్ సంస్థలకు రేటింగ్ ఇవ్వవచ్చు. ఇందుకోసం చాలామంది ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. ఏడాదిలో చెల్లించే చార్జీలు రూ. 3,000 మించకపోతే మరో ఆలోచనేదీ లేకుండా ఆ బ్రోకింగ్ సంస్థలో కొనసాగవచ్చు. అదే చెల్లించే ఫీజులు రూ. 3,000 నుంచి రూ. 6,000 మధ్యలో ఉంటే అందులో ఎఫ్ అండ్ వో లావాదేవీల సంఖ్య ఎక్కువగా ఉంటే అప్పుడు రెండో బ్రోకింగ్ సంస్థ కేసి చూడండి. ఇక రూ.6,000 పైన చెల్లిస్తుంటే తప్పకుండా డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ తలుపు తట్టండి. ట్రేడింగ్, డీమ్యాట్ మాత్రమే అయితే..! త్రీ ఇన్ ఒన్ సేవలందించే బ్యాంకులతో పోలిస్తే కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ సేవలందించే బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు చాలా తక్కువే. ఎందుకంటే వీటిలో సేవింగ్స్ ఖాతాలోంచి అప్పటికప్పుడు డబ్బులు వేయటం, ఆ ఖాతాలోకి విత్‌డ్రా చేసుకోవటం ఉండదు. అయితే ఒకేసారి ఏక మొత్తంలో నగదు కేటాయించి, భారీగా ట్రేడింగ్ చేసేవారికి ఛార్జీల భారం తగ్గుతుంది కనక ఇవి మంచివనే చెప్పొచ్చు. దాదాపు ప్రతి బ్రోకింగ్ సంస్థా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను (సాఫ్ట్వేర్) అందిస్తుంది కనక లావాదేవీలు నెమ్మదిగా జరగటం వంటి ఇబ్బందులేవీ ఉండవు. కొన్ని ప్రధాన సంస్థల బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు.. డిస్కౌంట్ బ్రోకింగ్... పూర్తి స్థాయి సేవలందించే బ్రోకింగ్ సంస్థను ఎంచుకుంటే ట్రేడింగ్‌లో వచ్చే లాభాల్లో అత్యధికం వాటి జేబుల్లోకే పోతాయి. ఒకపక్క ట్రేడింగ్ లాట్ సైజులు పెరిగి ప్రీమియంలు పెరిగిపోతే... మరో పక్క వచ్చిన స్వల్ప లాభాలు బ్రోకింగ్ సంస్థలకు కట్టడానికే సరిపోవడం లేదన్నది ట్రేడర్ల మాట. అందుకే వీరు డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలవైపు చూస్తున్నారు. ఇవి సాధ్యమైనంత వరకు తక్కువ లేదా స్థిరమైన రేట్లకే ఎన్ని లావాదేవీలైనా నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తాయి. జీరోదా, ఆర్కేఎస్వీ, ఇండియన్ ట్రేడింగ్ లీగ్, ట్రేడ్జిని వంటివి ఈ రంగంలోని ప్రధాన సంస్థలు. వీటిలో చాలా సంస్థలు అకౌంట్ ఓపెనింగ్‌కి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. వీటిల్లో ఉండే ప్రధానమైన లోపం... లో బ్యాండ్‌విడ్త్. దీనివల్ల మార్కెట్లు బాగా పెరిగిన, లేదా పడిన సమయాల్లో పొజిషన్లను వదిలించుకోవడం కష్టమవుతుంది. మిగిలిన పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలతో పోలిస్తే కస్టమర్ సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వివిధ సంస్థల ఛార్జీలివీ... తక్కువ చార్జీలకే సేవలందిస్తున్న సంస్థలు డిస్కౌంట్ బ్రోకరేజీలుగా రంగంలోకి త్రీ ఇన్ వన్ సేవలకు చార్జీలూ ఎక్కువే ట్రేడింగ్ చేసేవారికి కొన్ని బెటర్; ఇన్వెస్టర్లకైతే ఇంకొన్ని మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర్నుంచి ముగిసే వరకు ఏదో ఒక షేరు కొనటమో... అమ్మటమో చేస్తూనే ఉంటాడు సుబ్బు. రూపాయి, బంగారం, ఇతర కమోడిటీలు... ఇలా దేన్నీ వదలడు. అన్నిట్లోనూ ట్రేడింగ్ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మార్కెట్లు కదులుతున్న పరిమిత శ్రేణిని కూడా ట్రేడింగ్‌కు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ఈ భారీ ఒడిదుడుకులను క్యాష్ చేసుకుంటూ లాభం జేబులో వేసుకుంటున్నాడు. కానీ తీరా బ్యాంక్ బ్యాలెన్స్‌లో చూస్తే... ఆ స్థాయి లాభాలు కనిపించడం లేదు. దీనికి కారణమేంటో తెలుసా..? వస్తున్న లాభాలన్నీ బ్రోకరేజ్ చార్జీలు చెల్లించడానికే సరిపోతున్నాయి. ఒక్క సుబ్బు మాత్రమే కాదు. రోజూ భారీగా ట్రేడింగ్ చేసే వారిలో చాలా మంది పరిస్థితి ఇదే. అందుకే ఇలాంటి వారిని ఆకర్షించడానికిపుడు అనేక డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలు పుట్టుకొచ్చాయి. అసలీ డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలంటే ఏంటి? వీటిలో ఉండే లాభనష్టాలేంటి? ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో ఎవరికి ఎలాంటి బ్రోకింగ్ సంస్థలు బాగుంటాయి? ఎవరి దగ్గర డీమ్యాట్ ఖాతా తెరిస్తే బెటర్? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... ఫీజులు పరిశీలించుకోండి... కొన్ని ప్రధాన బ్రోకింగ్ సంస్థల ఫీజులు, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఆయా బ్రోకరేజ్ సంస్థలు వసూలు చేసే సగటు చార్జీలు. ఖాతాదారులు నిర్వహించే లావాదేవీల స్థాయిని బట్టి ఇవి మారిపోతుంటాయి కూడా. వీటిల్లో లాభనష్టాలివీ... పై బ్యాంకులకు సంబంధించిన ఖాతాల్లో ట్రేడింగ్ చేసేవారిని సంప్రదించినపుడు వివిధ రకాల వ్యాఖ్యలు వినిపించాయి. ఐసీఐసీఐ వరకూ చూస్తే సాఫీగా ట్రేడింగ్ చేసుకునే ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు కూడా ఇది సరైన ప్లాట్‌ఫామ్‌గానే చెప్పాలి. ఎందుకంటే సైట్‌నే విగేషన్, నగదు లావాదేవీల వేగం వంటివన్నీ దీన్లో బాగుంటాయి. కాకపోతే ఛార్జీలు మాత్రం కాస్త ఎక్కువ. పెపైచ్చు ట్రేడింగ్ చేసేవారు మొత్తం సొమ్మును ట్రేడింగ్‌కు కేటాయించి, సేవింగ్స్ ఖాతాలో కనీస నగదు నిల్వలుంచని పక్షంలో వారికి ఛార్జీల బాదుడు మామూలుగా ఉండదు. ట్రేడింగ్‌లో సంపాదించేదంతా ఈ ఖర్చులకే పోతుందని వాపోయిన వారూ ఉన్నారు. హెచ్డీఎఫ్సీది కూడా ఇదే గొడవ. సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వలు ఉంచాల్సిన అవసరం దీన్లోనూ ఉంది. కోటక్ సెక్యూరిటీస్ది మామూలుగానే మిగతా వాటితో పోలిస్తే కాస్త ఎక్కువ ఛార్జీల వ్యవహారం. యాక్సిస్ బ్యాంకుకు సంబంధించి ఛార్జీలు కాస్త తక్కువే అయినా... ఇది ట్రేడింగ్ చేసేవారికి ఎంతమాత్రం పనికిరాదు. ఎందుకంటే దీన్ని యాక్సిస్ చేసుకోవటమే చాలా స్లో కనక... ఒకసారి షేర్లు కొన్ని కొన్నాళ్ల పాటు వదిలేసేవారికైతే మంచిదనే చెప్పొచ్చు. ఎస్బీఐ కూడా ఇలాంటి సేవలందిస్తున్నా... యాక్సిస్ మాదిరే ట్రేడింగ్ చేసేవారికి చాలా ఇబ్బందని చెప్పొచ్చు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
బీమాకూ ఆన్లైన్ ఖాతా
హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగిన రాఘవకి ఇప్పుడు ఉద్యోగరీత్యా వైజాగ్‌కి బదిలీ అయ్యింది. అక్కడికి వెళ్ళి స్థిరపడిన తర్వాత తీసుకున్న వివిధ బీమా కంపెనీ పథకాల్లో చిరునామా మార్పించుకునే సరికి తలప్రాణం తోకకొచ్చింది. ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులు అక్కర్లేదు అంటోంది నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ. ఒక్కసారి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ ప్రారంభించి అందులో చిరునామా మార్పించుకుంటే మీ దగ్గర పది బీమా కంపెనీల పాలసీలున్నా వాటన్నింటిలోనూ చిరునామా మారిపోతుంది. ఇలా బహుళ ప్రయోజనాలను అందించే ఈ-పాలసీల గురించి సమగ్ర సమాచారమే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం.. షేర్లను కాగితరహిత రూపంలో ఎలక్ట్రానిక్ విధానంలో భద్రపర్చుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ ఎలా ఉందో ఇప్పుడు బీమా పథకాలను దాచుకోవడానికి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. అదే రిపాజిటరీ సర్వీస్ లేదా ఈ-పాలసీలు. ఇప్పటికే తీసుకున్న పాలసీల దగ్గర నుంచి కొత్తగా తీసుకోబోయే పాలసీల వరకు అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో అంటే డీమ్యాట్ తరహాలో భద్రపర్చుకోవచ్చు. ప్రస్తుతానికి కేవలం జీవిత బీమా కంపెనీలకు అది కూడా మీకు ఎలక్ట్రానిక్ రూపంలో లేక ఫిజికల్ (కాగితం) రూపంలో తీసుకునే అవకాశాన్ని ఐఆర్డీఏ కల్పించింది. ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీలను తీసుకుంటే ప్రయోజనాలు ఏంటి? ఈ-పాలసీలు ఏవిధంగా తీసుకోవాలి? పాత పాలసీలను ఈ-పాలసీలుగా ఎలా మార్చుకోవాలన్న అన్న అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం... ప్రయోజనాలు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల పాల సీలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ ఒకే అకౌంట్లో భద్రపర్చుకునే అవకాశం ఈ-పాలసీ ద్వారా కలుగుతుంది. ఎలక్ట్రానిక్ అకౌంట్ ద్వారానే పాలసీల ప్రీమియంలు చెల్లించవచ్చు. అలాగే చిరునామా మారినా లేక ఏ ఇతర వివరాల్లో మార్పులు చేయాలన్నా ప్రతీ బీమా కంపెనీకి తిరగనవసరం లేకుండా కేవలం ఈ-అకౌంట్లో ఆ వివరాలను అందిస్తే ఆటోమేటిక్‌గా మిగిలిన పాలసీల్లో కూడా మారిపోతాయి. ఒక్కసారి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ నంబర్‌ను కలిగి ఉంటే పాలసీ తీసుకున్న ప్రతీ సందర్భంలోనూ ‘నో యువర్ క్లయింట్’ (కేవైసీ) నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉండదు. అంటే ఒకసారి ఆన్లైన్ అకౌంట్ తెరిస్తే పాలసీ తీసుకునేటప్పుడు అడిగే నివాస ధ్రువీకరణ, ఆదాయధ్రువీకరణ, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన తలనొప్పులు పోతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకేచోట బీమాకు సంబంధించిన అన్ని సేవలనూ పొందొచ్చన్నమాట. వీటన్నింటికంటే ముఖ్యమైనది డాక్యుమెంట్లు పోతాయన్న భయం ఉండదు. మొన్న ఉత్తరాఖండ్ వరదల్లో ఇళ్లకుఇళ్లే కొట్టుకుపోవడంతో బీమా క్లెయిమ్ చేసుకుందామంటే కాగితాలు కూడా లేకుండా పోయాయి. అదే ఈ-అకౌంట్ ఉంటే ఇలాంటి ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. అందుకు ఈ-అకౌంట్ ప్రారంభించేటప్పుడే తదనంతరం ఈ-అకౌంట్ వివరాలను చూడటానికి, నిర్వహించడానికి ఎవరికి అనుమతించవచ్చని ముందే అడుగుతారు. అంటే ఒక విధంగా నామినీ కిందన్న మాట. ఇక్కడ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అంటారు. అకౌంట్ హోల్డర్‌కి జరగరానిది ఏమైనా జరిగితే ఈ అకౌంట్‌పై హక్కులు ఆ వ్యక్తికి బదలాయించబడతాయి. ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ కావాలి... ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే ముందుగా మీకు ఈ- ఇన్సూరెన్స్ అకౌంట్ ఉండాలి. ఇందుకోసం ఐఆర్డీఏ ఐదు ఇన్సూరెన్స్ రిపాజిటరీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ ఐదు సంస్థల్లో ఏదో ఒక దాంట్లో అకౌంట్ ప్రారంభించవచ్చు. బీమా కంపెనీలు ఈ రిపాజిటరీ సంస్థలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఆ విధంగా మీ బీమా కంపెనీ ఎంచుకున్న రిపాజిటరీ సంస్థ నుంచి కాని లేదా మీకు నచ్చిన రిపాజిటరీ సంస్థ నుంచైనా అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. కాని ఈ అకౌంట్ ప్రారంభించాలంటే మాత్రం పాన్‌కార్డు కాని ఆధార్ కార్డు కాని తప్పనిసరిగా ఉండాలి. అకౌంట్‌ను ప్రారంభించాలంటే ముందుగా మీకు నచ్చిన రిపాజిటరీ సంస్థ లేదా బీమా కంపెనీకి చెందిన వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గరలోని రిపాజిటరీ కార్యాలయం లేదా బీమా ఏజెంట్ దగ్గర నుంచైనా వీటిని పొందవచ్చు. ఈ అప్లికేషన్‌ను పూర్తి చేసి వీటితోపాటు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఐడీ ప్రూఫ్, నివాస ధ్రువపత్రం, పాన్ కార్డు లేదా ఆధార్‌కార్డు కాపీలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఏడు పనిదినాల్లోగా రిపాజిటరీ సంస్థ యూనిక్ ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్‌ను ఇవ్వడం జరుగుతుంది. తదుపరి లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఈ-నంబర్‌ను కోట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆన్లైన్లో అకౌంట్ నిర్వహించుకోవడానికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి కేవలం ఒక ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్‌ను మాత్రమే కలిగి ఉంటాడు. అంటే ఐదు రిపాజిటరీ సం స్థల్లో కేవలం ఒకదాం ట్లోనే అకౌంట్‌ను తెరవగలడు. ఒక దాంట్లో అకౌంట్ తెరిచిన తర్వాత మిగిలిన రిపాజిటరీలు అకౌంట్‌ను తెరవడానికి దరఖాస్తు చేస్తే తిరస్కరిస్తాయి. ఈ-అకౌంట్‌తోనే మిగిలిన అన్ని బీమా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ-అకౌంట్ ప్రారంభించడానికి ఎలాంటి రుసుములు చెల్లించనవసరం లేదు. పాత పాలసీలు మార్చుకోవాలంటే.. మీరు అకౌంట్ తెరిచిన రిపాజిటరీ సంస్థలోనే కాగితం రూపంలో ఉన్న పాత పథకాలను ఈ-పాలసీలుగా మార్చుకోవడానికి ఒక ప్రత్యేక అప్లికేషన్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీ యునిక్ ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ నంబర్‌తోపాటు మీ దగ్గర ఉన్న వివిధ బీమా పథకాల పాలసీ నెంబర్లు పొందుపర్చి దాఖలు చేస్తే పాత పాలసీలన్నీ కూడా ఈ-పాలసీలుగా మారిపోతాయి. లేకపోతే మీ బీమా కంపెనీకి యునిక్ ఈ-ఇన్సూరెన్స్ నంబర్‌ను తెలియచేస్తూ, పాలసీలన్నింటినీ ఈ-అకౌంట్లోకి మార్చమని దరఖాస్తు చేసుకున్నా చాలు. ఇలా మార్చిన దానికి కూడా ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు. దీనికయ్యే ఖర్చులన్నీ ఆయా బీమా కంపెనీలే భరిస్తాయి. ఇన్సూరెన్స్ రిపాజిటరీ సంస్థలు కార్వీ ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఎన్ఎస్డీఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఎస్‌హెచ్‌సీఐఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కామ్స్ రిపాజిటరీ సర్వీసెస్ సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం