డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్‌ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నామినీ పేరును జతచేయాలనే నిబంధనను సడలిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది.
గతంలో సెబీ జారీ చేసిన నియమాల ప్రకారం..డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్‌ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నామినీ పేరును తప్పకుండా జతచేయాలి. నామినీ అవసరం లేనివారు (ఆప్ట్ ఔట్ ఆఫ్ నామినేషన్) అని ఎంచుకోవాలి. ఇందులో ఏదో ఒకటి జూన్ 30లోపు తెలియజేయాల్సి ఉంది. ఆయా వివరాలు సమర్పించని వారి డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు జూన్30 తర్వాత పనిచేయవని సెబీ గతంలో చెప్పింది.
ఈ నిబంధనలను మరోసారి పరిశీలించాలని సెబీకి మార్కెట్ వర్గాల నుంచి భారీగా అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని సెబీ తన పాత ఆదేశాలన్ని సడలిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మదుపు చేస్తున్న డీమ్యాట్ ఖాతాదారులు, ఫండ్ మదుపరులు నామినేషన్ వివరాలు తెలియజేయకపోయినా వారి ఖాతాల విషయంలో ఎలాంటి చర్యలుండవని సెబీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు భౌతిక రూపంలో షేర్ల సర్టిఫికెట్లు ఉన్న వారికీ డివిడెండ్, వడ్డీ, ఇతర చెల్లింపులతోపాటు, అవసరమైన సేవల విషయాలన్నీ నామినేషన్‌తో సంబంధం లేకుండా అందించాలని పేర్కొంది.
నామినీ జత చేయడంపై సెబీ సడలింపు ఇచ్చినా తప్పకుండా డీమ్యాట్, ఫండ్ పెట్టుబడిదారులు ఆయా వివరాలు నమోదు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు కాబట్టి ఏక్షణం ఏదైనా జరగొగ్గచ్చు. మనం ఉన్నా..లేకపోయినా మనం కష్టపడి సంపాదించికున్న పెట్టుబడులు, లాభాలను నామినీకు చెందేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment