డీమ్యాట్ ఖాతా కావాలా? | want's Demat Account? | Sakshi
Sakshi News home page

డీమ్యాట్ ఖాతా కావాలా?

Published Mon, Feb 1 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

డీమ్యాట్ ఖాతా కావాలా?

డీమ్యాట్ ఖాతా కావాలా?

డీ మ్యాట్  అంటే...
కొనుక్కున్న షేర్లను దాచుకునే  ఒక ఎలక్ట్రానిక్ ఖాతా. అయితే దీన్లో షేర్లను కొని దాచిపెట్టుకోవాలన్నా... ఇందులో ఉన్న షేర్లను విక్రయించాలన్నా... అందుకు ట్రేడింగ్ ఖాతా కావాలి. క్రయవిక్రయాలకు డబ్బులుండాలి కనక ఈ ట్రేడింగ్ ఖాతాలోకి డబ్బులు వెయ్యాలన్నా, తియ్యాలన్నా ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలి. ఈ సేవలు మూడు విధాలుగా పొందవచ్చు.
 
1. కొన్ని బ్యాంకులు సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలన్నిటినీ కలిపి ఇచ్చే 3 ఇన్ 1 స్టాక్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్లకు సంబంధించి రీసెర్చ్ రిపోర్టులివ్వటంతో పాటు ఏ షేర్లను కొనాలి? వేటిని విక్రయించాలి? వంటి సూచనలు కూడా ఇస్తుంటాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఎస్‌బీఐ వంటి బ్యాంకులతో పాటు కోటక్ సెక్యూరిటీస్ వంటి ఆర్థిక సంస్థలూ ఈ 3 ఇన్ 1 సేవలందిస్తున్నాయి.
 
2. ఇక రెండో తరహా స్టాక్ బ్రోకర్ల విషయానికొస్తే... ఇవి కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్స్‌ను మాత్రమే అందిస్తాయి. వీటికి మనకు ఖాతా ఉన్న బ్యాంకు తాలూకు సేవింగ్స్ అకౌంట్‌ను జత చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ట్రేడింగ్ ఖాతాలోకి నగదు వేయటం, అందులోంచి నగదు తీసుకోవటం వంటివి కాస్తంత ఆలస్యమవుతాయి. ఇండియా ఇన్ఫోలైన్, ఏంజెల్, షేర్‌ఖాన్, వెంచురా వంటి పలు సంస్థల్ని ఈ తరహావిగా చెప్పొచ్చు.
 
3. ఈ మధ్యకాలంలోనే మూడో రకం బ్రోకరేజ్ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇవి చిన్న ఇన్వెస్టర్లను, చిన్న ట్రేడర్లను దృష్టిలో పెట్టుకుని... లావాదేవీలతో సంబంధం లేకుండా స్థిరమైన ఫీజులు లేదా చాలా తక్కువ చార్జీలతో సేవలందిస్తున్నాయి. అందుకే వీటిని డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలుగా పేర్కొంటున్నారు.
 
మూడింట్లో ఏది ఉత్తమం?
ఈ మూడింట్లో ఏది ఉత్తమమనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. కానీ అదంతా మీరు నిర్వహించే లావాదేవీలు, ఇన్వెస్ట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దీర్ఘకాలిక దృష్టితో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారైతే ఏ బ్రోకరేజ్ సంస్థను ఎంచుకోవాలన్న విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్లు ఎదురు చూస్తారు. ఏడాదిలో 30 నుంచి 40 లావాదేవీలకు మించవు. ఇలాంటి వారు ఫీజులు, చార్జీల గురించి ఆలోచించాల్సిన పని లేదు.

వీరు చక్కని సర్వీసులు అందించే 3 ఇన్ 1 బ్రోకర్‌ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే కొనాలనుకున్న వెంటనే కొనుగోలు చేయొచ్చు. పెపైచ్చు విక్రయించిన వెంటనే డబ్బులు ఖాతాలోకి వస్తాయి. బ్యాంకుల్లోనే కనక డబ్బుకు భద్రత కూడా ఉంటుంది. అటు ఇన్వెస్ట్ చేస్తూ ఇటు ట్రేడింగ్ కూడా చేసేవారైతే... రెండు బ్రోకింగ్ అకౌంట్స్‌ను తీసుకోవటం మంచిదన్నది నిపుణుల సలహా. ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ కోసమైతే మరొకటి ట్రేడింగ్ కోసం. అలా కాకుండా కేవలం ఇంట్రాడే ఎఫ్ అండ్ వో ట్రేడింగ్ మాత్రమే చేసేవారైతే డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలకేసి చూడొచ్చు.

ఇవన్నీ కాకపోతే చెల్లించే వార్షిక  ఫీజులు ఆధారంగా కూడా బ్రోకింగ్ సంస్థలకు రేటింగ్ ఇవ్వవచ్చు. ఇందుకోసం చాలామంది ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. ఏడాదిలో చెల్లించే చార్జీలు రూ. 3,000 మించకపోతే మరో ఆలోచనేదీ లేకుండా ఆ బ్రోకింగ్ సంస్థలో కొనసాగవచ్చు. అదే చెల్లించే ఫీజులు రూ. 3,000 నుంచి రూ. 6,000 మధ్యలో ఉంటే అందులో ఎఫ్ అండ్ వో లావాదేవీల సంఖ్య ఎక్కువగా ఉంటే అప్పుడు రెండో బ్రోకింగ్ సంస్థ కేసి చూడండి. ఇక రూ.6,000 పైన చెల్లిస్తుంటే తప్పకుండా డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ తలుపు తట్టండి.
 
ట్రేడింగ్, డీమ్యాట్ మాత్రమే అయితే..!
త్రీ ఇన్ ఒన్ సేవలందించే బ్యాంకులతో పోలిస్తే కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ సేవలందించే బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు చాలా తక్కువే. ఎందుకంటే వీటిలో సేవింగ్స్ ఖాతాలోంచి అప్పటికప్పుడు డబ్బులు వేయటం, ఆ ఖాతాలోకి విత్‌డ్రా చేసుకోవటం ఉండదు. అయితే ఒకేసారి ఏక మొత్తంలో నగదు కేటాయించి, భారీగా ట్రేడింగ్ చేసేవారికి ఛార్జీల భారం తగ్గుతుంది కనక ఇవి మంచివనే చెప్పొచ్చు. దాదాపు ప్రతి బ్రోకింగ్ సంస్థా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను (సాఫ్ట్‌వేర్) అందిస్తుంది కనక లావాదేవీలు నెమ్మదిగా జరగటం వంటి ఇబ్బందులేవీ ఉండవు. కొన్ని ప్రధాన సంస్థల బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు..
 
డిస్కౌంట్ బ్రోకింగ్...
పూర్తి స్థాయి సేవలందించే బ్రోకింగ్ సంస్థను ఎంచుకుంటే ట్రేడింగ్‌లో వచ్చే లాభాల్లో అత్యధికం వాటి జేబుల్లోకే పోతాయి. ఒకపక్క ట్రేడింగ్ లాట్ సైజులు పెరిగి ప్రీమియంలు పెరిగిపోతే... మరో పక్క వచ్చిన స్వల్ప లాభాలు బ్రోకింగ్ సంస్థలకు కట్టడానికే సరిపోవడం లేదన్నది ట్రేడర్ల మాట. అందుకే వీరు డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలవైపు చూస్తున్నారు. ఇవి సాధ్యమైనంత వరకు తక్కువ లేదా స్థిరమైన రేట్లకే ఎన్ని లావాదేవీలైనా నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తాయి.

జీరోదా, ఆర్‌కేఎస్‌వీ, ఇండియన్ ట్రేడింగ్ లీగ్, ట్రేడ్‌జిని వంటివి ఈ రంగంలోని ప్రధాన సంస్థలు. వీటిలో చాలా సంస్థలు అకౌంట్ ఓపెనింగ్‌కి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. వీటిల్లో ఉండే ప్రధానమైన లోపం... లో బ్యాండ్‌విడ్త్. దీనివల్ల మార్కెట్లు బాగా పెరిగిన, లేదా పడిన సమయాల్లో పొజిషన్లను వదిలించుకోవడం కష్టమవుతుంది. మిగిలిన పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలతో పోలిస్తే కస్టమర్ సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వివిధ సంస్థల ఛార్జీలివీ...
 
తక్కువ చార్జీలకే సేవలందిస్తున్న సంస్థలు    
డిస్కౌంట్ బ్రోకరేజీలుగా రంగంలోకి త్రీ ఇన్ వన్ సేవలకు చార్జీలూ ఎక్కువే    ట్రేడింగ్ చేసేవారికి కొన్ని బెటర్; ఇన్వెస్టర్లకైతే ఇంకొన్ని మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర్నుంచి ముగిసే వరకు ఏదో ఒక షేరు కొనటమో... అమ్మటమో చేస్తూనే ఉంటాడు సుబ్బు. రూపాయి, బంగారం, ఇతర కమోడిటీలు... ఇలా దేన్నీ వదలడు. అన్నిట్లోనూ ట్రేడింగ్ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మార్కెట్లు కదులుతున్న పరిమిత శ్రేణిని కూడా ట్రేడింగ్‌కు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు.

ఈ భారీ ఒడిదుడుకులను క్యాష్ చేసుకుంటూ లాభం జేబులో వేసుకుంటున్నాడు. కానీ తీరా బ్యాంక్ బ్యాలెన్స్‌లో చూస్తే... ఆ స్థాయి లాభాలు కనిపించడం లేదు. దీనికి కారణమేంటో తెలుసా..? వస్తున్న లాభాలన్నీ బ్రోకరేజ్ చార్జీలు  చెల్లించడానికే సరిపోతున్నాయి. ఒక్క సుబ్బు మాత్రమే కాదు. రోజూ భారీగా ట్రేడింగ్ చేసే వారిలో చాలా మంది పరిస్థితి ఇదే. అందుకే ఇలాంటి వారిని ఆకర్షించడానికిపుడు అనేక డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలు పుట్టుకొచ్చాయి. అసలీ డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలంటే ఏంటి? వీటిలో ఉండే లాభనష్టాలేంటి? ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో ఎవరికి ఎలాంటి బ్రోకింగ్ సంస్థలు బాగుంటాయి? ఎవరి దగ్గర డీమ్యాట్ ఖాతా తెరిస్తే బెటర్? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం...
 
ఫీజులు పరిశీలించుకోండి...
కొన్ని ప్రధాన బ్రోకింగ్ సంస్థల ఫీజులు, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఆయా బ్రోకరేజ్ సంస్థలు వసూలు చేసే సగటు చార్జీలు. ఖాతాదారులు నిర్వహించే లావాదేవీల స్థాయిని బట్టి ఇవి మారిపోతుంటాయి కూడా.
 
వీటిల్లో లాభనష్టాలివీ...
పై బ్యాంకులకు సంబంధించిన ఖాతాల్లో ట్రేడింగ్ చేసేవారిని సంప్రదించినపుడు వివిధ రకాల వ్యాఖ్యలు వినిపించాయి. ఐసీఐసీఐ వరకూ చూస్తే సాఫీగా ట్రేడింగ్ చేసుకునే ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు కూడా ఇది సరైన ప్లాట్‌ఫామ్‌గానే చెప్పాలి. ఎందుకంటే సైట్‌నే విగేషన్, నగదు లావాదేవీల వేగం వంటివన్నీ దీన్లో బాగుంటాయి. కాకపోతే ఛార్జీలు మాత్రం కాస్త ఎక్కువ. పెపైచ్చు ట్రేడింగ్ చేసేవారు మొత్తం సొమ్మును ట్రేడింగ్‌కు కేటాయించి, సేవింగ్స్ ఖాతాలో కనీస నగదు నిల్వలుంచని పక్షంలో వారికి ఛార్జీల బాదుడు మామూలుగా ఉండదు.

ట్రేడింగ్‌లో సంపాదించేదంతా ఈ ఖర్చులకే పోతుందని వాపోయిన వారూ ఉన్నారు. హెచ్‌డీఎఫ్‌సీది కూడా ఇదే గొడవ. సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వలు ఉంచాల్సిన అవసరం దీన్లోనూ ఉంది. కోటక్ సెక్యూరిటీస్‌ది మామూలుగానే మిగతా వాటితో పోలిస్తే కాస్త ఎక్కువ ఛార్జీల వ్యవహారం. యాక్సిస్ బ్యాంకుకు సంబంధించి ఛార్జీలు కాస్త తక్కువే అయినా... ఇది ట్రేడింగ్ చేసేవారికి ఎంతమాత్రం పనికిరాదు. ఎందుకంటే దీన్ని యాక్సిస్ చేసుకోవటమే చాలా స్లో కనక... ఒకసారి షేర్లు కొన్ని కొన్నాళ్ల పాటు వదిలేసేవారికైతే మంచిదనే చెప్పొచ్చు. ఎస్‌బీఐ కూడా ఇలాంటి సేవలందిస్తున్నా... యాక్సిస్ మాదిరే ట్రేడింగ్ చేసేవారికి చాలా ఇబ్బందని చెప్పొచ్చు.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement