

బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. గత నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ డిసెంబర్ 21న పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు యశ్ వీర్‌తో ఏడడుగులు వేసింది.

ఈ వేడుకకు బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్లు వచ్చి సందడి చేశారు. సోనియాతో క్లోజ్‌గా ఉన్న పృథ్వీ వచ్చాడు, కానీ నిఖిల్ రాలేదు. దీంతో అతడెందుకు రాలేడని పలువురూ ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలో సోనియా తన హల్దీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియో కింద కూడా నిఖిల్‌ను ఎందుకు పిలవలేదు? అని ఓ నెటిజన్ ప్రశ్నించింది.

అందుకామె బిగ్‌బాస్ 8లో పాల్గొన్న అందరినీ తన పెళ్లికి ఆహ్వానించానంది. అందులో కొందరే రాగలిగారు. వారివల్ల నా పెళ్లి రోజు మరింత స్పెషల్‌గా అనిపించింది అని చెప్పుకొచ్చింది.

కాగా బిగ్‌బాస్ హౌస్‌లో సోనియా.. నిఖిల్, పృథ్వీలను పెద్దోడు, చిన్నోడు అని పిలుస్తూ వారితోనే ఎక్కువగా ఉండేది.

ముఖ్యంగా నిఖిల్‌ను తన గుప్పిట్లో పెట్టుకుందన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది.

తీరా షో నుంచి ఎలిమినేట్ కాగానే నిఖిల్ మాస్క్ వేసుకున్నాడని విమర్శించింది. అతడిని నానా మాటలంది.

బహుశా దీనివల్ల పెద్దోడు ఈ పెళ్లికి రాలేకపోవచ్చని కొందరు, పనిలో బిజీగా ఉండటంతో రాకపోవచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.











