
బాలీవుడ్ బ్యూటీ శ్రీజిత డె పెళ్లికి ముహూర్తం ఆసన్నమైంది.

జర్మన్ ప్రియుడు మైఖేల్‌తో మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ అయింది.

నిజానికి వీరిద్దరూ 2021లో నిశ్చితార్థం చేసుకున్నారు. గతేడాది జర్మనీలో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో వీరి హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా శ్రీజిత డె.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపైనా నటించింది. కసౌటీ జిందగీకే, ఉత్తరన్, నజర్, లాల్ ఇష్క్.. ఇలా పలు సీరియల్స్ చేసింది.

తష్ణనన్, లవ్ కా ద ఎండ్, మాన్‌సూన్ షూట్‌అవుట్, రెస్క్యూ చిత్రాల్లో యాక్ట్ చేసింది.

హిందీ బిగ్‌బాస్ 16వ సీజన్‌లో పాల్గొంది. నక్సల్‌బరి అనే వెబ్ సిరీస్‌లోనూ తళుక్కుమని మెరిసింది.







