ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Telugu Horoscope On December 22nd To December 28th 7th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published Sun, Dec 22 2024 5:48 AM | Last Updated on Sun, Dec 22 2024 11:33 AM

Weekly Horoscope Telugu 22-12-2024 To 28-12-2024

మేషం...
పనులు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతోషిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో కదలికలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల పరిచయం. ఆశ్చర్యరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, ఆకుపచ్చ రంగులు,  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం...
కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నయంగా కనిపిస్తుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల వ్యవహారాలలో పరిష్కారానికి చొరవ చూపుతారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. గృహం కొనుగోలు, నిర్మాణాలలో కొన్ని ప్రతిబంధకాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో  ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు. వారం ప్రారంభంలో విందువినోదాలు. భూలాభాలు. దైవదర్శనాలు. గులాబీ, నేరేడు రంగులు. ఆంజనేయస్వామిని పూజించండి.

మిథునం...
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం  మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం...
ఖర్చులు పెరిగి కొత్త రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.  నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, నీలం రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం...
ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రముఖులు మరింత సాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య....
అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. రుణభారాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

తుల...
నూతన ఉద్యోగాలు పొందుతారు. ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కీలకపోస్టులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. గణేశ్‌స్తోత్రాలు  పఠించండి.

వృశ్చికం...
చేపట్టిన పనులు స్వయంగా పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా కదులుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సోదరులు, మిత్రుల  నుంచి ఆహ్వానాలు అందుతాయి.  ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులు వచ్చే అవకాశం. రాజకీయవర్గాలకు అన్ని విధాలా కలసివచ్చే సమయం. వారం చివరిలో ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వైరం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
ముఖ్యమైన పనులు  నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీ ఆలోచనలు, నిర్ణయాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పుడో  చేజారిన పత్రాలు తిరిగి లభ్యమవుతాయి.  . వ్యాపారాలలో  పెట్టుబడులకు తగినంతగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాల మేరకు మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి  ఆశలు నెరవేరతాయి వారం ప్రారంభంలో మనశ్శాంతి లోపిస్తుంది. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.

మకరం.....
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల చేయూత లభిస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. అందరిలోనూ విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మిత్రుల నుండి ఒత్తిడులు. ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు. వేంకటేశ్వరస్తుతి మంచిది.

కుంభం...
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు,భూములు కొనుగోలు చేసే సమయం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

మీనం...
కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతారు. వివాహయత్నాలు సానుకూలం కాగలవు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు.  భూములు, వాహనాలు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అనుకున్న మేరకు పొందుతారు ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి.వారం చివరిలో మానసిక అశాంతి. అనారోగ్య సూచనలు. ఎరుపు, తెలుపు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement