vara Phalalu
-
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...పనులు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతోషిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో కదలికలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల పరిచయం. ఆశ్చర్యరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, ఆకుపచ్చ రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.వృషభం...కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నయంగా కనిపిస్తుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల వ్యవహారాలలో పరిష్కారానికి చొరవ చూపుతారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. గృహం కొనుగోలు, నిర్మాణాలలో కొన్ని ప్రతిబంధకాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు. వారం ప్రారంభంలో విందువినోదాలు. భూలాభాలు. దైవదర్శనాలు. గులాబీ, నేరేడు రంగులు. ఆంజనేయస్వామిని పూజించండి.మిథునం...కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం...ఖర్చులు పెరిగి కొత్త రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.సింహం...ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రముఖులు మరింత సాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.కన్య....అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. రుణభారాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.తుల...నూతన ఉద్యోగాలు పొందుతారు. ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కీలకపోస్టులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. గణేశ్స్తోత్రాలు పఠించండి.వృశ్చికం...చేపట్టిన పనులు స్వయంగా పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా కదులుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సోదరులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులు వచ్చే అవకాశం. రాజకీయవర్గాలకు అన్ని విధాలా కలసివచ్చే సమయం. వారం చివరిలో ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వైరం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీ ఆలోచనలు, నిర్ణయాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పుడో చేజారిన పత్రాలు తిరిగి లభ్యమవుతాయి. . వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంతగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాల మేరకు మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి వారం ప్రారంభంలో మనశ్శాంతి లోపిస్తుంది. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.మకరం.....ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల చేయూత లభిస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. అందరిలోనూ విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మిత్రుల నుండి ఒత్తిడులు. ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు. వేంకటేశ్వరస్తుతి మంచిది.కుంభం...ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు,భూములు కొనుగోలు చేసే సమయం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.మీనం...కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతారు. వివాహయత్నాలు సానుకూలం కాగలవు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. భూములు, వాహనాలు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అనుకున్న మేరకు పొందుతారు ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి.వారం చివరిలో మానసిక అశాంతి. అనారోగ్య సూచనలు. ఎరుపు, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.. -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శివపంచాక్షరి పఠించండి.వృషభం....కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వాహనయోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.మిథునం...అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కర్కాటకం...కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.సింహం...నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు మరింత అనుకూలత. వారం చివరిలో వివాదాలు. అనుకోని ఖర్చులు. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కన్య...అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహాన్నిస్తారు. సంఘంలో మరింత పేరు గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.తుల....ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక కీలకమైన కేసు పరిష్కారమవుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.వృశ్చికం..ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. . ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.ధనుస్సు...అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త అనుమతులు లభిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. గణేశాష్టకం పఠించండి.మకరం...కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు శివాష్టకం పఠించండి.కుంభం...విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.మీనం....ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అందరినీ మాటలతో ఆకట్టుకుంటారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. రాఘవేంద్రస్తుతి మంచిది. -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.మానసిక అశాంతి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయస్వామిని స్మరించండి.వృషభం...పనులు సజావుగా పూర్తికాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. అందరిలోనూ మీ ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. బంధువర్గం నుండి ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.మిథునం...కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో విజయాలు సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వారం చివరిలో దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు, విష్ణుద్యానం చేయండి.కర్కాటకం....నూతన వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. పసుపు, గోధుమ రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.సింహం...దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మిత్రులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. కళారంగం వారికి నూతనోత్సాహం, సన్మానయోగం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.కన్య...ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యదీక్షాపరులై విజయాలు సాధిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ధనలాభం. ఆస్తి వివాదాలు తీరి లాభం చేకూరుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. కొందరికి ప్రమోషన్లు సైతం లభిస్తాయి. కళాకారులకు పురస్కారాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.తుల...పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. సోదరులు, మిత్రులతో లేనిపోని వివాదాలు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. నిరుద్యోగుల యత్నాలు కొంతవరకూ సఫలం. వారం మధ్యలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు. కొత్త పరిచయాలు. నీలం,ఆకుపచ్చ రంగులు,ఆదిత్య హృదయం పఠించండి.వృశ్చికం..ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింతగా పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. జీవితాశయం నెరవేరుతుంది. సోదరులతో వివాదాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు లభించవచ్చు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. గులాబీ, పసుపు రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.ధనుస్సు...దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలై అవసరాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారవచ్చు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారు ఆశించిన ప్రగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. ఆకుపచ్చ, గోధుమ రంగులు, గణేశాష్టకం పఠించండి.మకరం...అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. బంధువులు, మిత్రుల సలహాలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానాలు, విశేష గౌరవం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. కాఫీ, నేరేడు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కుంభం...ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక చింతన. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వారం చివరిలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. నీలం, తెలుపు రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి.మీనం....వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. మానసిక అశాంతి. తెలుపు, గులాబీ రంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. నలుపు, నీలం రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.వృషభం...సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. ఉద్యోగార్థుల యత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.మిథునం...కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరులు,సోదరీలతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.కర్కాటకం...ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బంధువర్గం మీపై ఒత్తిడులు పెంచుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిం^è ండి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి చికాకులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.సింహం...ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. కార్యజయం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. విద్యార్థుల్లో నైరాశ్యం తొలగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.కన్య....ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువర్గంతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబంలో గౌరవిస్తారు. వ్యాపారాల విస్తరణలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. గణేశ్ స్తోత్రాలు పఠించండి.తుల...సన్నిహితులతో వివాదాలు తీరి ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. «ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.æ మిత్రుల నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...అనుకున్న పనులు క్రమేపీ పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.ధనుస్సు...కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. తెలుపు, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.మకరం....సమస్యల పరిష్కారంలో వ్యక్తిగత చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి పలుకుబడి పెరుగుతుంది. బంధువులను కలుసుకుని ఉత్సాహవంతంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఉన్నత స్థాయి నుంచి పిలుపు అందుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. పసుపు, ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కుంభం...కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో పురోగతి సా«ధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.మీనం....ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదాలు తొలగి లబ్ధి చేకూరుతుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. యుక్తి, మేథస్సుతో సమస్యలను అధిగమిస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. . వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి. -
ఈ రాశివారికి వారం ప్రారంభంలో ధనలబ్ధి
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఊరట చెందుతారు. మీ ఆలోచనలు ఎదుటవారికి ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం, విదేశీ విద్యావకాశాలు. వ్యాపారాలు క్రమేపీ పురోగమిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల ఆశలు ఫలించే సమయం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. మహావిష్ణు ధ్యానం చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) వ్యవహారాలు ముందుకు సాగక డీలా పడతారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. చాకచక్యం, ఓర్పుతో ముందడుగు వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితిలో కాస్త మెరుగుదల కనిపించినా రుణాలు తప్పవు. కోర్టు కేసులకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక సమాచారంతో నిరాశ చెందుతారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాల కృషి అంతగా ఫలించదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు తొలగి ముందుకు సాగుతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో గౌరవం విశేషంగా పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.. కొన్ని విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో బంధువర్గంతో తగాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఊరట లభిస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమై సహాయపడతారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబసభ్యులతో తగాదాలు. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. దూరపు బం«ధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యత ఏర్పడి ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి, హోదాలలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల కాలం. వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కొత్త రుణాల వేటలో నిమగ్నమవుతారు. పనులు నత్తనడకన సాగుతూ ఉంటాయి. కుటుంబసభ్యులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. ఇతరులకు హామీలపై తొందరపాటు వద్దు. మీరు తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేకత ఎదురై కలత చెందుతారు. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగండి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితుల ప్రభావంతో మందకొడిగా సాగుతారు. పారిశ్రామికవర్గాల శ్రమ వృథా కాగలదు. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) మొదట్లో ఉన్న హుషారు క్రమేపీ తగ్గుతుంది. ముఖ్యమైన పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తుల వివాదాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి కొన్ని చిక్కులు తప్పవు. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వీరికి అన్నీ విజయాలే చేకూరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు యోగించేకాలం. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా మీకు ఎదురుండదు. పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో ముందుకు సాగుతారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు సంతోషదాయకమైన సమాచారం రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. నేరేడు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన సొమ్ము కూడా అందుతుంది. కొన్ని వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. వివాహ,. ఉద్యోగయత్నాలు సానుకూలం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు నూతన పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక విషయాలలో గందరగోళం. రుణదాతల నుంచి ఒత్తిడులు తీవ్రతరమవుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కష్టం మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మితంగా మాట్లాడడం ద్వారా కొన్ని సమస్యలను తప్పించుకోగలుగుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కీలక నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేరు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో పనిభారం మరింతగా పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. వాహనయోగం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఏ పని చేపట్టినా ముందుకు సాగక నిరాశచెందుతారు. మీ శ్రమ వృథాగా మారుతుంది. సోదరులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. నిరుద్యోగుల కృషి కొంత మేర ఫలిస్తుంది. నిర్ణయాలు వాయిదా వేయడం ఉత్తమం. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. నేరేడు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కూడా ఒత్తిడులు రావచ్చు. అనారోగ్య సూచనలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. మనోధైర్యం, మంచితనంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు క్రమేపీ కొంత అనుకూలస్థితి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారినా అవసరాలకు కొంత సొమ్ము అందుకుంటారు. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రమపడాలి. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి వివాదాలు, లేనిపోని సమస్యలు తప్పవు. వారం మధ్యలో వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి. -
ఈ రాశి వారికి వారంలో ఆర్థికంగా మరింత ప్రగతి ఉంటుంది
మేషం ఆర్థిక పరిస్థితి నిరాశ పర్చినా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. æ మిత్రులను కలుసుకుని కీలక విషయాలపై చర్చిస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం కొన్ని సమస్యలు, వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి రాగలదు. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన, గృహయోగాలు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు, బాధ్యతలు తగ్గుతాయి. రాజకీయవేత్తలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఎరుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మిథునం కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. పరిచయాలు పెరుగుతాయి. అదనపు రాబడి ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకోని పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. అయినవారితో కలహాలు. ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం కొన్ని పనులు కొంత నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఆలోచనలు కలసివస్తాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. కళారంగం వారికి ఒత్తిడుల నుంచి విముక్తి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. సింహం ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఒక వివాదం నుంచి నేర్పుగా బయటపడతారు. స్థిరాస్తి కొంటారు. వ్యాపారాలు çలాభిస్తాయి, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. కన్య పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు ఆశించినరీతిలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ముఖ్య వివాదాలు తీరతాయి. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. తుల చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. పాతమిత్రుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాల నుంచి కొంత బయటపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఆర్థికంగా మరింత ప్రగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రావచ్చు. కళాకారులకు కృషి ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్య, కుటుంబ సమస్యలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలతో కుస్తీపడతారు. విద్యార్థులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. నిరుద్యోగులు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బదిలీ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. ధనుస్సు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కదలికలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సకాలంలో విస్తరిస్తారు. ఉద్యోగవిధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నేరేడు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు అన్ని విధాలా కలసివచ్చే కాలం. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గుతుంది. కళాకారులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. గులాబీ, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కుంభం యత్నకార్యసిద్ధి. కుటుంబసభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొంటారు. వివాహయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పైస్థాయి నుంచి పిలుపు రావచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. సోదరులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నలుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. -
ఈ రాశి వారికి వారంలో ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి
వార ఫలాలు ఫోటో స్టోరీస్.. మేషం... మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. భూములు కొనుగోలులో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది. వృషభం...కొన్ని వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో నెలకొన్న విభేదాలు క్రమేపీ పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం...ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబసభ్యుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం మధ్యలో సన్నిíß తులతో కలహాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటకం...ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినా రుణయత్నాలు తప్పవు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమపడాల్సివస్తుంది. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. కొత్త పరిచయాలు కాస్త ఊరటనిస్తాయి. కుటుంబసభ్యులు మీ అభిప్రాయాలను తిరస్కరించవచ్చు, అయినా మనోధైర్యం వీడవద్దు. వ్యాపార లావాదేవీలు అంతంతగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నేరేడు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. సింహం...ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. అందరిలోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. తోటి వారి సాయం తీసుకుని ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచమయవుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చాకచక్యంగా వ్యవహరించి గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి. కన్య...ఉత్సాహంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. క్రియాశీల వ్యవహారాలలో అటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కొన్ని ఆహ్వానాలు అంది ఆశ్చర్యపడతారు. కొన్ని కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. రాజకీయవర్గాల చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో కలహాలు. పసుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల...ఆర్థికంగా క్రమేపీ మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ఆశలు నెరవేరతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వస్తులాభాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. కళారంగం వారికి నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం...వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కరించుకుంటారు. సమాజ సేవలో పాలుపంచుకుంటారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని పదవి రావచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. దుర్గాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు...మీపై బంధువులు మరిన్ని బాధ్యతలు మోపవచ్చు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నెలకొన్న స్థబ్దత తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. నిర్ణయాలు మార్చుకుంటారు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. మకరం...ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. పారిశ్రామికవర్గాలకు కొన్ని అంచనాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. బంధువులతో తగాదాలు. తెలుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కుంభం...కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. కుటుంబసభ్యులతో మరింత ఆప్యాయత, ప్రేమగా మసలుకుంటారు. భూవివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహకరమైన సమాచారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. మిత్రులతో తగాదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. మీనం...ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరి ఖర్చులు అధిగమిస్తారు. సంఘంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు సఫలమవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనసౌఖ్యం. సేవాదృక్పథంలో ముందుకు సాగుతారు. విద్యార్థులు అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించి పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో అనారోగ్యం. సోదరులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. -
ఈ వారంలో ఈ రాశి వారు లక్ష్యాలు సాధిస్తారు
వారఫలాలు (17.01.21 నుంచి 23.01.21 వరకు) మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడినా అధిగమించి ముందడుగు వేస్తారు. ఆస్తుల విషయంలో సోదరులతో అవగాహనకు వస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. సోదరులు, మిత్రుల చేయూతతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. స్థిరాస్తి లాభం కలుగుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో నెలకొన్న సబ్దత తొలగుతుంది. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. వివాహయత్నాలలో కొంత వెనుకబాటు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాల యత్నాలలో కదలికలు ఉంటాయి. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు. సన్నిహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణయత్నాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. రాజకీయవర్గాలకు ఒక కీలక సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వారం చివరిలో ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆశయాలు సాధిస్తారు. ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన పనుల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి నూతనోత్సాహం, కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో కొన్ని సమస్యలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనుల్లో అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలు పదిమందితో పంచుకుంటారు. భూముల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. ఇతరులకు సైతం సహాయపడతారు. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో అనుకున్న బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. సోదరులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఎంతగా శ్రమించినా నిరుద్యోగులకు ఫలించదు. ఆరోగ్యం మందగిస్తుంది, కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మోస్తారు. కళారంగం వారికి కొత్త చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నేరేడు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చాకచక్యంగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పేరు గడిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. -
వారంలో ఈ రాశివారికి ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది
వారఫలాలు (10.01.21 నుంచి 16.01.21 వరకు) మేషం.. అత్యవసరంగా చేపట్టిన కొన్ని పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తీరి ఒడ్డునపడతారు. పారిశ్రామికవర్గాలకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం... రుణవిముక్తి కోసం చేసే యత్నాలు కొంత సఫలమవుతాయి. క్రమేపీ అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. చేపట్టిన పనులు కష్టసాధ్యమైనా ఎవరి సహాయం లేకుండా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మిథునం... పలుకుబడి కొంత పెరుగుతుంది. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల కొనుగోలులలో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాల విస్తరణలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. నేరేడు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం... వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. బంధువుల నుంచి పిలుపు అందుతుంది. చాకచక్యంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. సింహం.... కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి లాభం కలిగే సూచనలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. ధనవ్యయం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య... కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగల సూచనలు. పారిశ్రామికవర్గాలకు అన్నింటా విజయమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. తుల... ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. నిర్ణయాలు సకాలంలో తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూవివాదాలు తీరతాయి. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు. వారం చివరిలో బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. గులాబీ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం... కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తాయి. పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు ఫలించే సమయం. వారం చివరిలో బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. ధనుస్సు... వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కష్టసాధ్యమైనా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఎరుపు, చాక్లెట్ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. మకరం... కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులకు అవకాశం. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం చివరిలో ఆరోగ్య భంగం. ధనవ్యయం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. కుంభం... ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వ్యాపారాలు కొంత మేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మీనం.... ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆరోగ్యం గతం కంటే కుదుటపడి ఊరట చెందుతారు. వ్యాపారాల విస్తరణ సాఫీగా సాగుతుంది. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. -
వారంలో ఈ రాశివారికి బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
వారఫలాలు (03.01.21 నుంచి 09.01.21 వరకు) మేషం... చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. వాహన, గృహయోగాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఆశాజనకమైన కాలం. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. వృషభం... కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతో విభేదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మిథునం... ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. రుణాలు చేస్తారు. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వేడుకలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. కళారంగం వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం... వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తగ్గే సూచనలు. కళారంగం వారి యత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. కన్య.... చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనసౌఖ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల... కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం, అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం.. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి విషయాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు, భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి. ధనుస్సు... పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. చిరకాల కోరిక నెరవేరే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. మకరం... దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి మరిన్ని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. కుంభం.. అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ప్రత్యర్థులు సైతం సహాయపడతారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. సోదరులతో వివాదాలు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి. మీనం... నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి. -
వారఫలాలు (15నవంబర్ నుంచి 21 నవంబర్ 2020 వరకు)
మేషం: ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. మీ ఆలోచనలు ఇతరులకు సైతం ఉపకరిస్తాయి. ఆర్థికంగా బలం పొందుతారు. రుణబాధల నుంచి క్రమేపీ ఒడ్డునపడతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. బంధువిరోధాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. వృషభం: అనుకున్న వ్యవహారాలు లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. కొన్ని విషయాలలో సహనం పాటించడం మంచిది. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ సత్తా నిరూపించుకునే సమయం. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలమైన సమయమని చెప్పాలి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. ఒక సంఘటన మీలో కొంత మార్పులు తీసుకురావచ్చు. ఆర్థిక విషయాలు మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: ఏ పని చేపట్టినా ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒప్పందాలు కొన్ని రద్దు చేసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు. వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనంగా బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి విషయంలో వివాదాలు నెలకొనవచ్చు. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. కొన్ని కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలలో సామాన్యలాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవం. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కన్య: కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతనోత్సాహం. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. ధనవ్యయం. పసుపు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: పరిచయాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో చక్కదిద్దుతారు. ఆస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. వ్యూహాత్మకంగా వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత పనిఒత్తిడులు తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు కొంత దూరంగా ఉండండి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడులు ఉండవచ్చు. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగవు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. ధనుస్సు: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో విభేదిస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమ వృథా కాగల సూచనలు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొత్త సమస్యలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి. మకరం: శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. అనుకున్న పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు. కోర్టు కేసులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విస్తరణ కార్యక్రమాలు నిలిపివేస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. వాహనయోగం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కుంభం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. పెద్దల సలహాల మేరకు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనూహ్యంగా మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మీనం: వ్యయప్రయాసలు తప్ప వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకున్నదొక్కటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. సన్నిహితులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా మారుతుంది. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఓర్పు, నేర్పుతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడే అవకాశం. కళారంగం వారికి కొత్త చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. సోదరుల నుంచి ధనలాభం. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. -
వారఫలాలు (సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త పనులు చేపట్టి అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపిం^è దు. ఆస్తుల వివాదాలు కొంత నిరాశ పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలలో కొంత ప్రగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. రాజకీయవేత్తల కృషి కొంత ఫలించే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమాధిక్యం. ఎరుపు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) మొదట్లో ఇబ్బంది పడినా క్రమేపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా పరపతి పెరుగుతుంది. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. మిత్రులతో మరింత సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుని ఊరట చెందుతారు. ఉద్యోగవర్గాలకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్యణ్యాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు కొంత కలసివస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు క్రమేపీ సర్దుకుంటాయి. ఆస్తుల ఒప్పందాలలో వాయిదా పడతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. అనుకున్న కాంట్రాక్టులు దక్కే సూచనలు. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి శ్రమ పడ్డా ఫలితం దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన కొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆశించినంతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని రుణాలు సైతం తీరే అవకాశం. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాల విస్తరణ యత్నాలు సఫలమవుతాయి, లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అమితోత్సాహం, శుభవార్తలు. వారం చివరిలో అనారోగ్యం, దూరప్రయాణాలు. గులాబీ, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ప్రముఖులతో ఊహించని పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగి పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత. రాజకీయవర్గాలకు విశేష యోగదాయకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. రుణాలు కొంతమేర తీరతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరి ఒడ్డునపడతారు. ఉద్యోగలాభం.. సోదరులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన పోస్టులు సాధిస్తారు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. కొన్ని ముఖ్య కాంట్రాక్టులు చేజారవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వివాదాలు నెలకొని సమస్యగా మారవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో స్వల్ప అవాంతరాలు. కుటుంబసభ్యుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. వారం మధ్యలో ధనప్రాప్తి. శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తీరతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. వాహనసౌఖ్యం. ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు కార్యసిద్ధి. వారం చివరిలో ఆరోగ్యభంగం. సోదరులతో అకారణంగా విభేదాలు. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా అద్భుతమైన వాగ్ధాటితో ఆకట్టుకంటారు. కొన్ని వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమై ఊరట చెందుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, పదవులపై కొత్త ఆశలు. వారం ప్రారంభంలో సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. నేరేడు, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. అతిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇతరుల సమస్యలు సైతం పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తొలగుతుంది. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి. -సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
వారఫలాలు (26 జూలై నుంచి 1 ఆగస్టు 2020)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాలను కొంతమేర పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కళారంగం వారికి కొన్ని అవకాశాలు దక్కే ఛాన్స్. వారం చివరిలో అనారోగ్యం. దూరప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు పూర్తి కాగలవు. ఇంటాబయటా ఎదురుండదు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు మరింత ఉత్సాహం. ఆస్తి వ్యవహారాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు మారవచ్చు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టిసారిస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా ధనలాభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు ఉంటాయి. ఉద్యోగులు చిక్కుల నుంచి బయటపడతారు, అయితే కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల వారు సమస్యల నుంచి గట్టెక్కుతారు. వారం మధ్యలో భూవివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటిలో శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆప్తుల నుంచి వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘసేవలో పాలుపంచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి అత్యంత నేర్పుగా బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. విస్తరణపై దృష్టి పెడతారు. ఉద్యోగాలలో మీ సమర్థత చాటుకుంటారు. రాజకీయవర్గాలకు సమస్యలు కొన్ని తీరి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చేపట్టిన కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కొన్ని నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేనిస్థితి. ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు కలసిరాక నిరాశ చెందుతారు. కొన్ని విషయాలలో శ్రమ వృథా కాగలదు. సహాయం పొందిన వారే సమస్యలు సృష్టించవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో ప్రతిష్ఠంభన. లాభాలు కూడా స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి ఎంత శ్రమపడ్డా లాభం ఉండదు. వారం మధ్యలో మిత్రుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) బంధువులు, మిత్రులతో రెట్టించిన ఉత్సాహంతో గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు. ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తినిస్తాయి. అందరిలోనూ మీ నైపుణ్యాన్ని చాటుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని స్మరించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. జీవితాశయం నెరవేరి ఊరట చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. భూములు, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో ఆశించిన మేర లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు శ్రమ కొంతమేర ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పరిచయాలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు ఒక కీలక సమాచారం రాగలదు. గృహ నిర్మాణయత్నాలలో కొంతమేర కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, మీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు మరింత వేగంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగుతుంది. ఉద్యోగాలలో చిక్కులు తొలగి సంతోషంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ధనప్రాప్తి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఇంటి నిర్మాణయత్నాలు ప్రారంభించే వీలుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న సమయానికి విస్తరణ పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఉన్నతాధికారుల ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీరు కోరుకున్న విధంగా మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు. అనుకోని ధనవ్యయం. నలుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు తగిన ప్రణాళిక రూపొందిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. పాతమిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. -సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
వార ఫలాలు (ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత చికాకులు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి, ఆశించిన పెట్టుబడులలో అవాంతరాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళాకారులకు చికాకులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆనుకోని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. సన్నిహితులతో మాటపట్టింపులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. అనుకోని ఇంటర్వ్యూలు అందుతాయి. మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు అధిగమిస్తారు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక,రాజకీయరంగాల వారికి పట్టింది బంగారమే. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు కాస్త నెమ్మదిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు ,సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఎటువంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు కొనుగోలు యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. సోదరుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు కొంత కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
రాశి ఫలాలు (సౌరమానం) 13-07-2019
జన్మనక్షత్రం తెలియదా?నో ప్రాబ్లమ్!మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (జులై 13 నుంచి19 వరకు) మీ రాశి ఫలితాలు-డా‘‘ మైలవరపు శ్రీనివాసరావుజ్యోతిష్య పండితులు మేషం(మార్చి 21 –ఏప్రిల్ 19) చేస్తున్న వృత్తిలో ఇష్టం లేనితనం క్రమ క్రమంగా పెరుగుతూ వెళ్లే అవకాశముంది.ఏది మనకీ మన కుటుంబానికీ భోజనాన్ని అందిస్తోందో ఆ వృత్తిపట్ల విముఖతను చూపడం సరికాదు.ఒకవేళ అనుకున్నంత లాభాలు రాని పక్షంలో ఎక్కడ లోపమో గమనించుకుని ఆ నిర్వహణ లోపాన్ని సరిదిద్దుకోండి తప్ప వృత్తిని కాలదన్నుకోకండి.కొంతకాలంపాటు అనుభవాన్ని గడించిన ఈ వృత్తి నైపుణ్యాన్నీ మెళకువలనీ తోసిరాజంటూ మరో వృత్తిని చేపట్టదలిస్తే దాంట్లో ఒక స్థాయికి వచ్చేసరికి ఎంతో కాలం వృథా అవుతుంది.అన్నిటికీ మించి దీన్ని మానేద్దామనే దృక్పథం మంచిది కాదు. దొర్లుతున్న బంతిలా నిలకడతనం ఉండదు. గమనించుకోండి.ఉద్యోగస్థులకి అసంతృప్తి ఉండే అవకాశముంది. ఏదో ఉద్యోగాన్ని చేస్తున్నాను. జీతం బాగానే వస్తోంది. అయినా ఉద్యోగ సంతృప్తి లేదంటూ అదేదో ఓ గొప్పగా మాట్లాడుతుంటారు. ఏ తీరు నీచ/ హేయ ఆనందకరమైన ఉద్యోగం వచ్చినా చాలనే వ్యక్తులు ఎందరున్నారో గమనించుకుని ఉద్యోగమంటూ ఉన్న మీరెంత అదృష్టవంతులో పరిశీలించుకోండి.కుటుంబం నడవడానిక్కావలసిన జీతం ధర్మబద్ధంగా వస్తే చాలు– అంతే అనుకోండి.బంధుమిత్రులు మిమ్మల్నెంతో ఉదారబుద్ధితో గౌరవిస్తుంటే చూసీ చూడనట్లు ఉదాసీనతను చూపడం ఏమాత్రమూ సరికాదు. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. లౌకిక పరిహారం: వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీకు అన్నాన్ని పెడుతున్నాయని గమనించుకోండి. అలౌకిక పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం మంచిది. వృషభం (ఏప్రిల్ 20 –మే 20) మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఎత్తులు పల్లాలు గుంటలు గొప్పులు.. ఇలా ఎన్నెన్ని వస్తాయో దానికి సిద్ధపడి కదా ప్రయాణం చేస్తున్నాం. అదే తీరుగా జీవన క్రమంలో నిష్కారణంగా నిందలు ఒక్కోసారి తీవ్రమైన అపనిందలు, అపకీర్తిని మూటకట్టించే గట్టి నిందలు మీకు రావచ్చు– అష్టమశని కారణంగా. రావలసిన అపనింద ఎలాగూ వచ్చేసింది కాబట్టి దానిలో నిజమెంతో ఆలోచించుకుని, మీదే ధర్మమైనవేళ– నింద అనేది కేవలం అసూయా పగా ద్వేషం అనేవాటివల్లే కలిగిందని మీకు అర్థమైన పక్షంలో నిర్భయంగా నలుగురిలో నిలబెట్టి ఆ చాడీని పుట్టించిన వ్యక్తిని నిలదీయండి. అతడే గనుక మీకు లభ్యపడకపోతే ఆ గృహిణికి వివరించి చెప్పండి పరిస్థితిని. ప్రస్తుత దశలో ఇలా చేసినందువల్ల ఇబ్బంది మీకు కలుగదు. నింద తొలగిపోవడమే కాక, వీనితో జాగ్రత్తగా ఉండాలనే భావం కలుగుతుంది అందరికీ. దురదృష్టవశాత్తూ కుటుంబంలో అనైకమత్య పరిస్థితులు గోచరించవచ్చు. ఐకమత్యం దెబ్బతినడానికి కారణం నోటిమాటే కాబట్టి అదుపు చేసుకుని మాట్లాడండి. కుటుంబపు పెద్ద మీరే గనక అయినట్లయితే మీరే తగ్గి ఓ మాటని పడి ఉండండి తప్పదు. కారణం మీరు కుటుంబాన్ని ఓ కట్టగా కట్టి రక్షించాల్సిన వ్యక్తి కాబట్టి. అంతే తప్ప అసమర్థునిగా ఉండవలసిందని కాదు దీనర్థం. ఏదో ప్రయోజనం ఉండబోతోందనుకుంటూ దూరభార ప్రయాణాలని చేస్తారు కాని అది వ్యర్థ ప్రయాణం మాత్రమే కావచ్చు. ఈ సారి ఆలోచించుకుని మాత్రమే వెళ్లండి. ఒకరికి తోడు కోసమే వెళ్లడం, దూరదూర బాంధవ్యాన్ని కలుపుకుందామనే దృష్టితో అంతంత ప్రయాణాలని శారీరక శ్రమతో చేయడం అవసరం కాదేమో! లౌకిక పరిహారం: నిందని వేస్తే నిరూపించగల ధర్మం ఉండటే విడవకండి. నిరూపించండి. అలౌకిక పరిహారం: దుర్గాదేవీ స్తుతి మంచిది గ్రహణ కాలంలో. మిథునం(మే 21 –జూన్ 20) తమదే తప్పు– అని తెలిసిన సహోద్యోగులూ కింది ఉద్యోగులూ వాద వివాదాలకి రారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు. ఆధ్యాత్మిక దృష్టి బాగా పెరిగే అవకాశముంది. మంచిదే. అయితే దేంట్లోనూ అతి అనేది పనికిరాదు. కాబట్టి ఓ ఆర్థిక ప్రణాళిక వేసుకుని పుణ్యక్షేత్ర దర్శనాలూ దానధర్మాలూ చేయండి తప్ప రుణాన్ని తీసుకుని మరీ ఈ కార్యక్రమాలని నిర్వహించడం వల్ల కుటుంబంలో ఇబ్బందులు అనైకమత్యం ఏర్పడవచ్చు. లోపల అనారోగ్యం పెరుగుతోందనే యథార్థాన్ని గమనించి తగిన ఔషధ సేవని చేయడం మంచిది తప్ప ఉదాసీన దృష్టితో ఉండకండి. గోటితో పోగొట్టుకోండి. గొడ్డలి దాకా పరిస్థితిని పెంచుకోకండి. ఉద్యోగాన్ని మారదలచడమనేది మీకు ఉద్యోగంలో సంతృప్తి లేదనే భావంతో– కలగవచ్చు. అయితే నూతనోద్యోగ ప్రాప్తి ప్రస్తుతానికి లేని కారణంగా కొనసాగి తీరాల్సిందే ప్రస్తుత ఉద్యోగంలో. ఇక్కడ ఉన్నంతసేపూ నిరాసక్తితో పని చేయడం కంటే ఆ ఉన్నంతకాలమూ ఉత్సాహంతో ఉండడం మంచిది కదా! తప్పదు. ఉండాల్సిందే! వాద వివాదాలకి ఎప్పుడూ ఇష్టపడని మీరు మీ స్వేచ్ఛ, మీ పట్టుదలా కారణంగా తప్పక వాద వివాదాల్లోకి దిగుతారు. అయితే ఆ వాదం మరింత పెరిగి న్యాయస్థానం దాకా వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తపడి తీరాలి. ఇటువైపు వారూ అటువైపు వారూ రెచ్చగొట్టి మొత్తానికి మిమ్మల్ని న్యాయస్థానం వరకూ సాగనంపి చేతులు దులుపుకుంటారు. మీ వైపుకి ఏ ఒక్కరూ సాక్ష్యానికి రారని గమనించి వాదాన్ని తగ్గించుకోండి. లౌకిక పరిహారాలు: వాద వివాదాలు వద్దు. నోటిని అదుపులో ఉంచుకోక తప్పదు. అలౌకిక పరిహారం: గ్రహణ సమయంలో ఆంజనేయ స్తుతిని చేస్తూ ఉండండి. కర్కాటకం(జూన్ 21 –జూలై 22) మీకున్న రంగంలో కీర్తీ ప్రతిష్ఠా సభలూ సన్మానాలూ అనుకుంటూ మీరు సాగిపోతూండడం మంచిదే అయినా, మీకున్న కుటుంబాన్ని ఈ ధోరణిలో పట్టించుకోలేని తనం కారణంగా కుటుంబంలో వ్యతిరేకత పెరిగిపోతూ ఉండచ్చు. భోజనంలో ఎలా అన్ని పదార్థాలనీ ఎలా ఒక పరిమితితో స్వీకరిస్తూ ఆ మొత్తాన్ని భోజనంగా అనుకుంటూ తింటామో అలాగే కుటుంబపు పెద్దగా అన్నిటికీ అందరికీ సమతౌల్యాన్ని మీరు అందిస్తూ ఉండాల్సిందే! గమనించుకోండి. ఒక సందర్భంలో మీకు అన్యాయం జరిగిందని అనిపిస్తే వేగంగా దూసుకునిపోయే స్వభావం మీది. అయితే అంతలోనే ఎందుకీ వివాదం? అనే దృక్పథంతో ఆగిపోయి మౌనంగా చింతిస్తూ ఉండే స్వభావం కూడా మీది. నిజానికి ఈ దృక్పథమే మంచిది ఈ యుగంలో విశేషించి ప్రస్తుతపు మీ దశలో కూడా. అలాగే ఉన్నట్లయితే సమస్య పరిష్కారమయ్యేదెలా అని దిగులు పడకండి. ఎదుటివారికి వినే అవకాశమున్న సమయాన్ని గమనించుకుని మీదైన మాటలతో వివరించి చెప్పే సమయం వస్తుంది. పరిష్కరించుకోగలుగుతారు. ఆ సమర్థతా అదృష్టం ఉన్న దశ మీది. వాహన విషయంలో భద్రతని పాటించండి. వీలైనంత వరకూ వీధి భోజనాలని మాని చల్లబడినా రుచి కొంత తగ్గిందనిపించినా ఇంటి భోజనమే శ్రేయస్కరమనే మాటని మర్చిపోకండి. దానికి కారణం అనారోగ్యం లోపల ఉంది కాబట్టి అది ప్రస్తుతానికి సామాన్య స్థితిలో ఉంది. భయపడకండి. నివారించుకునే ప్రయత్నాల్లో ఇంటి భోజనం ఒక ఔషధమని భావించి తగున్యాయం చేసుకోండి. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం లేదు. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చే అవసరం కూడా తప్పిపోయింది. సంతోషించండి. లౌకిక పరిహారం: ఇంటి భోజనమనేది రాబోయే అనారోగ్యానికి ప్రథమ ఔషధం. అలౌకిక పరిహారం: గ్రహణ సమయంలో వైద్యుడైన శివుణ్ణి స్తుతిస్తూ ఉండండి. సింహం(జూలై 23 –ఆగస్ట్ 22) న్యాయస్థానంలో అన్ని అభియోగాలూ పూర్తిగా వీగిపోయాయి కదా! అనే ఆనందంతో పాటు ఒకే ఒక్కటి ఇంకి మిగిలి ఉంది అనే చిన్న చింత మీకు ఉంటుంది. ఈ సమస్యని వీలైతే న్యాయస్థానపు ప్రాంగణం బయట సామరస్యంగా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవడం మంచిది. తాడుని మరింత గట్టిగా లాగద్దు. చేస్తున్న వృత్తి ఉద్యోగాల విషయంలో తగిన సమయపాలన తప్పనిసరి అని గుర్తించండి. తోటి ఉద్యోగుల నిఘా నేత్రాలు మీ మీద లేరనే భ్రమలో ఉండకండి. ఒక వ్యక్తి ఎదుగుదల అనేది అతరులకి కిట్టని పని. కంటకంగా ఉంటుంది కూడా. అయినా తీసుకునే జీతానికో, వస్తున్న ఆదాయానికో తగినంత న్యాయాన్ని చేకూర్చడం మీ విధివ, కర్తవ్యం కాదా? పరిశీలించుకోండి. తల్లిద్రండులు వృద్ధులై ఉంటే తేలికపాటి ఆరోగ్య పరీక్షలని చేయించండి. అది అవసరం. ఉన్నతాధికారులతో వాగ్వివాదాలు వద్దు. మీదే నిజంగా పొరపాటయ్యుంటే అంగీకరించడానికి వెనుకాడకండి. తేలికగా బయటపడిపోగలుగుతారు. ఋణం ఇచ్చిన ఋణదాతల నుండి ఒత్తిడి మరింతగా ఉండకపోవచ్చు గాని ఒత్తిడి మాత్రం రావచ్చు. ఒకసారంటూ అడగడం ప్రారంభమయిందంటే మరి కొన్నాళ్లకి ఒకటికి రెండు మార్లు అడిగే స్థితి, ఆ మీదట ఒత్తిడిగా మారి తీరుతుంది. ముందుకి ముందే జాగ్రత్తపడి, ఫలానా నాటి వరకూ తీర్చలేనని వాళ్లు అంగీకరించేలా మాట్లాడుకోవడం మంచిది. ఆలసించకండి. లౌకిక పరిష్కారం: పెద్దలకి తేలికపాటి ఆరోగ్య పరీక్షలను చేయించండి. అలౌకిక పరిహారం: గ్రహణకాలంలో గణపతిని ఆరాధించంది. కన్య(ఆగస్ట్ 23 –సెప్టెంబర్ 22) అర్ధాష్టమ (4వ ఇంట) స్థానంలో శని ఉన్న కారణంగా ఏవేవో తెలియని చికాకులు కలిగిస్తూనే ఉంటాడు. శని ఎప్పుడూ హాని చేసే స్వభావం కలవాడు కాడు కాబట్టి ఇటు పక్క లౌకికంగా ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ఉండడం, అటు పక్క శనికి భయపడుతూ ఆరాధించడం అనే రెంటి వల్ల అనిష్టాన్ని తొలగించుకోగలుగుతారు. ఆరోగ్యంలోమార్పులు కనిపిస్తూ ఉండచ్చు. కొద్దిగా జాగ్రత్త పడండి. లోహ వ్యాపారులకి – బంగారం, వెండి, ఇత్తడి, రాగి కంచు... వ్యాపారస్థులకి మంచి ఆదాయం వస్తుంది. అయితే వచ్చిన లాభం మొత్తాన్ని మళ్లీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టేయడం ప్రస్తుతం సరికాదు. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అవి ఫలించకపోయినంత మాత్రాన నిరాశ పొందకండి. ప్రయత్నిస్తూనే ఉండడమనేది మీరు చేస్తున్నంతసేపూ మీది దోషం కాబోదు. అనుకూలించే సమయం మరి కొంత కాలంలో ఉంది. పోటీ పరీక్షలకి సిద్ధం కండి. మీ పిల్లలని పట్టించుకుంటూ ఉండండి. కుటుంబంతో ఎక్కువసేపు గడుపుతూ ఉండాలనే ఆలోచనలతో ఉండండి. చాల సమస్యలు పరిష్కరింపబడతాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో సమస్యలన్నీ కేవలం పరస్పర సంబంధాలని తగినంతగా కలిగి ఉండకపోవడం – ప్రయత్నం కూడా చేయకపోవడము. క్రయవిక్రయాల్లో మంచి లాభం మీకు వస్తోందనే యదార్థాన్ని గమనించి మిత్రులు, ఆర్తులు, బందువులు... ఎవరైనా ధనసహాయానికి ప్రార్థిస్తే ఆలోచించి తగినంత సహాయపడడం మంచిదే. సోదరులతో ఎక్కువ సౌభ్రాత్ర సహకారం ఉంటుంది. లౌకిక పరిష్కారం: శని వల్ల ఏ కష్టం దుఃఖం లభిస్తుందోనని భయపడకండి. రంఅలౌకిక పరిహా: లలితా సహస్ర నామాలని గ్రహణ కాలంలో పఠించండి. తుల(సెప్టెంబర్ 23 –అక్టోబర్ 22) మంచి అనుకూల కాలం నడుస్తోంది కాబట్టి ఉద్యోగంలో పదవీ ఉన్నతీ దాంతోపాటు వేతనం కూడా పెరగడమే మరింత అదృష్టం కలిసొస్తే మీకు అనుకూల ప్రదేశానికి బదిలీ కూడా అయ్యే అవకాశం ఉండచ్చు. మీ సంతానం ఎక్కడ చదువుకుంటున్నారో అక్కడికే మీ ఉద్యోగం దాదాపుగా ఉండే కారణంగా ఒకే ఇంట్లో ఉండచ్చు. ఇంతవరకూ పడిన మానసిక శ్రమ తొలగిపోతూ ఉండే కాలం ఇది. అయితే అవసరమయిన ఆలోచనల భారంతో జ్ఞాపకశక్తి క్రమ క్రమంగా తగ్గుదలకి వెళ్లచ్చు. ఈ సందర్భంలో నిరుత్సాహ పరులతో జీవితంలో ఏవో కారణాలతో ఓడిపోయిన వారితో సాహచర్యాన్ని పెంచుకోకుండా ఉండండి. చలి బాగా ఉన్న ప్రాంతంలో చిన్న చలిమంట వద్ద ఉండడం మంచిది. అస్తమానం జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాననే ధ్యాసతోనే ఉంటే ఇప్పుడున్న జ్ఞాపకశక్తి కూడా పోయే అవకాశముంది కాబట్టి ఆ దిశగా ఆలోచించకండి. ఎంత ఆర్థికంగా ముందంజంలో ఉన్నప్పటికీ దానికి దాదాపుగా సరిపోయినంత ఆర్థిక వ్యయం కూడా ఉండే కారణంగా మానసికంగా ఆర్థికపరమైన ఉత్సాహంతో ఉండకపోవచ్చు. పోనీ ఆ ద్రవ్యం అవసరమైన తీరులో ప్రయోజనాత్మకమైన పద్ధతిలో వ్యయం ఔతోందా? అని ఆలోచిస్తే న్యాయస్థానానికీ ఇతరమైన ఖర్చులకీ రాకపోకలకీ... ఇలా ఔతుండే కారణంగా చాలా మనోవ్యధగా ఉంటుంది. అనుక్షణం పై అధికారుల ఒత్తిడితో వృత్తి ఉద్యోగ వ్యాపారాలని చేస్తూ సంపాదించే దాన్ని ఇలా వ్యయం చేయాల్సి వస్తోందా? అనే నిరుత్సాహంతో ఉంటారు. ఇక కొద్ది కాలమే ఇలా ఉంటారు. లౌకిక పరిహారం: నిరుత్సాహపరులూ, భయాన్ని నూరిపోసే వారికీ దూరంగా ఉండండి. అలౌకిక పరిహారం: గ్రహణ కాలంలో ఎంత వీలైతే అంతగా శనిని ఆరాధించండి. వృశ్చికం(అక్టోబర్ 23 – నవంబర్ 21) నిలకడలేని తీరులో ఉద్యోగ వ్యాపారాల్లో రోజుకొక చోట చొప్పున విశేషంగా ప్రయాణాలు తప్పనిసరి అవుతుంటాయి. అన్ని ప్రయాణాలూ సౌకర్యాలూ ఆనంద దాయకంగానూ పెద్దలతో పరిచయాలని పెంపొందించేవిగానూ అనిపిస్తే, మరికొన్ని ప్రయాణాలు చెప్పలేనంత శారీరక శ్రమకి గురి చేసేవి అవుతూ ఉంటాయి. శారీరక శ్రమ నిద్రవల్లనో పదిమందితో గడపడం వల్లనో వినోద విహారాల వల్లనో తొలగచ్చు గాని, మనోవ్యధ మాత్రం 2013 మధ్య నుండీ ఉన్న సందర్భంగా తొలగే పరిస్థితి కనిపించక చక్కటి శయ్యమీద పడుకున్నా ఎగుడు దిగుడుల మీద పడుకున్న రీతిగా అనిపించక తప్పదు. అయినా భరించక తప్పదు. కొంతకాలం మాత్రమే. సంతానం విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు. ఈ మనోవ్యధ కారణంగా ఆ సంతోషాన్ని అనుభవించకలేకపోవచ్చు. మరికొందరి విషయంలోనైతే సంతానాన్ని చూపించకుండా శత్రువర్గం (భార్య/భర్త) వాళ్లు వ్యవహరిస్తుండడం అదనపు మనోవ్యధకి కారణం ఔతూ ఉండచ్చు. మాటల్లో కాఠిన్యం ఏమాత్రమూ సరికాదు. వీలయినంత వరకూ ఆచితూచి మాట్లాడటం, వాగ్దానాలని చేయకపోవడం మంచిది. అడ్డుండి ఎవరికో సొమ్మునిప్పించడం, హామీలనియ్యడం, సాక్షి సంతకాలని చేయడం వంటివి పూర్తిగా ప్రమాదకరం. మీరు ఆ స్థాయి జాగ్రత్తలతోనే వ్యవహరిస్తున్నారనేది యథార్థమే అయినా మరోమారు సూచించడం దీని లక్ష్యం. మీరు ఏ నిర్ణయాన్ని చేయబోతున్నారనే విషయాన్ని దానికి సంబంధించిన వ్యక్తికి మాత్రమే తెలియజేస్తూ గోప్యతని పాటించినట్లయితే అది కార్య సాఫల్యానికి తోడ్పడుతుంది. పదిమందికీ చాటుకోవడం సరికాదు. లౌకిక పరిహారం: గోప్యతని పాటించండి. ఆచితూచి మాట్లాడండి. అలౌకిక పరిహారం: శనిస్తోత్రాన్ని కనీసం 108 మార్లు గ్రహణ కాలంలో పఠించండి. ధనుస్సు(నవంబర్ 22 – డిసెంబర్ 21) ఎదురు చూసిన ద్రవ్యం తప్పక అనుకోకుండా ఎక్కువ మొత్తంలో లభించే అవకాశముంది. ఈ ఆనందాన్ని పంచుకోవడంలో భాగంగా ఓ తెలియరాని వ్యక్తికి తెలియజేసినందువల్ల – వారి నుండి అప్పుకి సంబంధించిన అభ్యర్థన వచ్చి – మానసిక సంక్షోభం ఏర్పడవచ్చు. దిగులు పడకండి. వారికి రుణాన్ని ఇయ్యనే ఇయ్యరు. అయితే మైత్రి మాత్రం దెబ్బ తినవచ్చు. నష్టం లేదు. ప్రయాణాల్లో వస్తు జాగ్రత్త తప్పనిసరి. అతి ముఖ్యమైనది ధనం కాదు. ముఖ్యమైన పత్రాలు ఏమున్నాయో వాటి విషయంలో జాగ్రత్తని పాటించక తప్పదు. తల్లివైపు బంధువుల నుండి పూర్తి సహాయం సహకారం లభిస్తూండడంతో చెప్పలేనంత మాన సిక ధైర్యం లభిస్తూ ఉంటుంది. ఆ బాంధవ్యాన్ని నిలుపుకోండి. గోచారస్థితి శుభాశుభమిశ్రమంగానే ఉన్న కారణంగా చేపట్టిన ప్రతి పనీ లాభదాయకంగా ముగుస్తుందని భావించకండి. చేయవలసిన ప్రతి ప్రయత్నానికీ తగిన దానికి మించిన జాగ్రతని పాటిస్తూనే ఉండాలని భావించండి. వ్యవసాయదారులకి అనుకూల వాతావరణం ఉండకపోవచ్చు. కొనుగోలు చేసిన విత్తనాలూ యంత్రపరికరాలూ అలాగే మరికొన్ని వస్తువులూ.. పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అలాగే అదనులో చేసుకోవలసిన పనులకి కొన్ని ఆటంకాలు ఏర్పడి చేయవలసినంత స్థాయిలో పొలం పనులని చేసుకోలేకపోవచ్చు. దాంతో మరొకరికి కౌలుకీయాలనే అభిప్రాయానికి బలంగా రావచ్చు. ఆలోచించుకోండి. లౌకిక పరిహారం: వస్తువుల జాగ్రత్త ప్రయాణాల్లో అవసరం. అలౌకిక పరిహారం: వినాయక ధ్యానాన్ని గ్రహణకాలంలో చేయండి. మకరం(డిసెంబర్ 22 – జనవరి 19) వ్యాపారంలో నష్టాలు వస్తున్నా లేక ఎక్కువ వ్యాపారం సాగకున్నా అదే విధంగా వృత్తి ఉద్యోగాల్లో కూడ మానసిక శ్లేషమన్పించినా దైవ ప్రార్థన అవసరమనే మాట నిజమే కాని, నిరంతరం దైవచింతనలోనే గడపాలనే ‘అతి’ మంచిది కాదు. అలాటి పరిస్థితే గనుక ఉంటే తగ్గించుకోవాలి ఆ ఆలోచనని. మానవ ప్రయత్నానికి దైవకృప అవసరం తప్ప కేవలం దైవప్రార్ధన అనేది ఫలితాన్నీయలేదు. కష్టకాలమని తెలిసినప్పటికీ కూడ దాన ధర్మాలని చేస్తూ ఉంటారు. అదెంతవరకూ సమంజసమో యోచించుకోండి. దేనికైనా ఓ ప్రణాళిక అనేది అవసరమని గుర్తించండి. తెలివితేటలతో దూర–భార ప్రయాణాలని మానుకుంటారు. శారీరక మానసిక ఉత్సాహం ఈ కారణంగా లభిస్తుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుండి రావాలసిందిగా ఆహ్వానం అదినా ప్రస్తుత పరిస్థితిలో కదిలి వెళ్లడం, చేతి నిండుగా పనికోసం వెదుక్కుంటున్న ఈ పరిస్థితిల్లో అక్కడికి వెళ్లి ఖాళీ చేతితో (పనిలేకుండా ఉండడం) కాలాన్ని గడపడం అంత సరికాదు. వినోదం విహారమనేది పనులు ముగించుకున్నాక చేయాల్సిన పనులు తప్ప పనివేళలో వాటి మీద దృష్టి ఉండడం సరికాదు. చుట్టుపక్కలవారితో తగుమాత్రపు పరిచయమే మంచిది తప్ప విశేష పరిచయాలు కాదు. అనుకోని ఖర్చులైతే ఏమీ రావుగాని ఉన్నా సొమ్ము మాత్రం కొంత ఎక్కువస్థాయిలోనే వ్యయమౌతూ ఆర్థికమైన లోటుని స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉంటుంది. రుణమిచ్చే వారున్నారు కదా అని వెంటనే రుణాన్ని తీసుకున్నట్లయితే ప్రస్తుతం మీ దశ ప్రకారం సొమ్ముకి తగ్గ వ్యయం తప్పనిసరి అయిపోతుంది. జాగ్రత! లౌకిక పరిహారం: రుణం తీసుకోవద్దు. అలౌకిక పరిహారం: గ్రహణకాలంలో దుర్గాస్తుతి మంచిది. కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వ్యాపారంలో పోటీతత్త్వం ఉంటుంది. దాన్లో మీరు ముందంజలో ఉంటారు. పిల్లల వివాహాలక్కావలసిన బంగారు, వెండి, పట్టు బట్టలు వంటి వాటిని చక్కగా సమీకరించుకుంటూ ఉంటారు. అహంకారం దర్పం గర్వం మాత్రం సరికాదు. మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారనే ఆనందంతో మీ బంధుగణంలో ఎవరినో ఒకర్ని చదివించాలనే ఆలోచనతో ఆర్థిక సహాయాన్ని చేస్తారు. అలాగే ఆప్తుల్లో ఒకరికి వైద్య వ్యయపరంగా సహాయం చేస్తారు. తీర్థయాత్ర దృష్టి ఉంటుంది గాని కుటుంబపరమైన బాధ్యతా నిర్వహణలో అది ఈ వారంలో సాధ్యపడకపోవచ్చు. కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులతో మాటామాటకి దిగే స్థితి గోచరిస్తోంది. తద్ద్వారా కొన్ని అతిముఖ్య విషయాలు పదిమందికీ తెలిసే అవకాశమేర్పడుతోంది. గట్టిగా ప్రయత్నించి కుటుంబరహస్య గోప్యతని పాటించని పక్షంలో సంపాదించిన ద్రవ్యానికి సంబంధించిన లెక్కలనీ వివరాలనీ చెప్పుకోవలసిన పరిస్థితి రావచ్చు. ఎవరినీ తూలనాడకండి. గౌరవించండి. అనుకూలంగా మాట్లాడండి తప్ప సూచనలనీ సలహాలనీ అవతలివారు వింటున్నారు గదాని చెప్తూ వెళ్లిపోకండి. అదే తీరుగా మీ సంతానాన్ని కూడ ఎవరెవరితో అతి సమీపంగా వాళ్లు మసులుతున్నారో ఓ కంట కనిపెడుతూ వాళ్ల దృక్పథం – ప్రవర్తనల్లో ఏ మార్పు ఎవరి నుండి దిగుమతి అవుతుందో గ్రహించుకోండి. వాద వివాదాలకి దూరంగా ఉండండి. లౌకిక పరిహారం: కుటుంబరహస్య గోప్యత అవసరం. అలౌకిక పరిహారం: గ్రహణకాలంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఉత్తమం. మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) సంతానం గాని ఇంకా విద్యాభ్యాస దశలోనే గాని ఉంటే ఒకరి ప్రవర్తన మానసికంగా ఇబ్బందిని కల్గిస్తూ ఉండచ్చు. చదువు పట్ల నిరాసక్తిని కలిగి ఉండచ్చు. ఎప్పుడైనా వ్యక్తి మానసికంగా ఉత్సాహంగా లేక నిరాసక్తతతో ఉంటే దానిక్కారణం ఆ వ్యక్తి లోపల పెరగడం కోసం ప్రయత్నిస్తున్న అనారోగ్యమే అనేది నిస్సంశయమైన విషయం. కాబట్టి తేలికపాటి వైద్యపరీక్షలని చేయించి విశ్వసనీయ వైద్యునితో – అవసరమని అన్పించిన పక్షంలో చికిత్స చేయించండి. ప్రధాన విద్యకంటె వేరైన క్రీడలు చిత్ర లేఖనం మొక్కల్ని పెంచడం.. వంటి వాటిలో ఆసక్తిని చూపిస్తున్న ధోరణి మెల్లగా సంతానానికి ఒంటపట్టచ్చు. జాగ్రత! ఇలాటి విద్యేతర కార్యక్రమాలకి ఉత్సాహాన్ని కల్గిస్తూ ఉండేవాళ్లు తమ పిల్లల్ని కూడ అలాగే ప్రోత్సహిస్తూ ఉన్నారా? అని గమనిస్తే మీరు ఏం చేయాల్సి ఉందో అర్ధమౌతుంది. భార్యాభర్తల అనుబంధమనేది మరింతగా వృద్ధి పొందాలంటే గొంతుని తగ్గించి మాట్లాడుకోవడం, సంసార విషయాలు మాత్రమే కాకుండా లోకాభిరామాయణాన్ని సంభాషించుకోవడం మంచిదనే విషయం మీకు అర్థమౌతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్థులై ఉండి ఎవరి ఉద్యోగ కష్టాన్ని మరొకరికి చెప్పుకోవడం మాత్రమే చేసుకుంటుంటే పిల్లలు ఏకాకులుగా అవుతూ మీ ఇద్దరి మధ్య మాట్లాడుకునే అంశం వాళ్లకంటూ లేక చదువు పట్ల నిరాసక్తులౌతారు. అదే మీ కుటుంబంలో ఉండచ్చేమో! పుట్టింటి వారి నుండి రావలసిన తోటల పంటల ఆదాయం ఒక్కసారికి ఆలస్యమైతే వెంటనే ప్రతిస్పందించేస్తూ తొందరపాటుతనాన్ని చూపద్దు. సంయమనం పాటించండి. లౌకిక పరిహారం: పిల్లలు విద్యేతతరమైన వాటిలో ఆసక్తిని చూపకుండా జాగ్రతపడండి. అలౌకిక పరిహారం: గ్రహణకాలంలో సరస్వతీ ప్రార్థనని చేయండి. -
టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) సంయమనం పాటించడం ద్వారా సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. సానుకూల దృక్పథంతో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. మిత్రుల సహకారంతో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. వ్యసనాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతికి అవరోధాలు ఎదురు కావచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో జాప్యం తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు అందుకుంటారు. లక్కీ కలర్: రాగి రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్త పనులు ప్రారంభించడానికి పూర్తి సానుకూలమైన సమయం. ఇప్పటి వరకు ప్రణాళికలకే పరిమితమైన పనులను ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టండి. సత్ఫలితాలను పొందగలరు. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. పని మీద మరింతగా దృష్టి సారిస్తారు. పురోగతిలో వేగం పెంచుకోవడానికి కృతనిశ్చయంతో దూసుకుపోతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న బంధువులను ఆదుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఏర్పడిన అపార్థాలు తేలికగా సమసిపోతాయి. లక్కీ కలర్: నీలం మిథునం (మే 21 – జూన్ 20) అనవసరంగా అభద్రతాభావానికి లోనవుతారు. మీ అతిజాగ్రత్త ఇతరులకు చాదస్తంగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని భయాల వల్ల చిన్న చిన్న విషయాల్లో కూడా నిర్ణయాలను జాప్యం చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలకు కూడా అతిగా చింతిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయలేకపోతారు. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం కొంత ఊరటనిస్తుంది. ఆత్మస్థైర్యం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. లక్కీ కలర్: నేరేడు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇంతకాలం ఎలాంటి విజయాల కోసం అర్రులు చాస్తూ వచ్చారో, అలాంటి విజయాలను అందుకుంటారు. చాలా విషయాల్లో చెక్కుచెదరని పట్టుదలతో ఉంటారు. కోరుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనిలో భాగంగా దూరప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులపై మంచి లాభాలను అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. పెద్దలను సంతోషపెడతారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) జీవితంలో అనూహ్యమైన మార్పులు ఎదురవుతాయి. ఈ మార్పులతో ఉద్విగ్నత చెందుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట తారసపడే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాలు మీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. పెరిగిన బాధ్యతలకు తగినట్లుగానే ఆదాయం కూడా పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. తీరిక దొరక్కపోవడం వల్ల భోజనాన్ని నిర్లక్ష్యం చేసే సూచనలు, ఫలితంగా ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. మార్పులను స్వీకరించడం ద్వారా అభివృద్ధిలో వేగాన్ని పెంచుకుంటారు. లక్కీ కలర్: జేగురు రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) త్వరలోనే దశ తిరగబోతోంది. ఒక అద్భుతమైన కొత్త అవకాశం అనుకోకుండా అందివస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన ఘనవిజయాలు మీ శ్రమను మరిపిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నాయకత్వ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమలో పడతారు. ప్రియతముల సమక్షం ఉత్సాహాన్నిస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ గణనీయంగా పెరుగుతుంది. లక్కీ కలర్: తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: లేత గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: మీగడ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: ముదురాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: ఇటుక రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: పసుపు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు: 1 నవంబర్ నుంచి 7 నవంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభదాయకమైన కాలం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. గులాబి, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. విద్యార్థులకు నిరుత్సాహపూరితం. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు సామాన్యం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, లేతనీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకుని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) యుక్తితో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. సేవా కార్య క్రమాలు చేపడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు తొలగు తాయి. వ్యాపార విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతులు. తెలుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభిస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. మనసులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొంత జాప్యం జరిగినా వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుంచి ప్రశంసలు. ఇంటి నిర్మాణయత్నాలు కలిసి వస్తాయి. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు విశేష ఆదరణ, సన్మానాలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పట్టింది బంగారమే. కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టు కుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి. చాక్లెట్, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మొదట్లో కొన్ని చికాకులు, సమస్యలు వచ్చినా క్రమేపీ తొలగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకమే. సంఘంలో గౌరవ మర్యాదలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. ఎరుపు, ఊదా రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు అవార్డులు. తెలుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గంతో విభేదాలు తొలగుతాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. నీలం, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) చేపట్టిన పనులు సజావుగానే పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుని ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా గడుస్తుంది. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు