ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope Telugu 24-11-2024 To 30-11-2024 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published Sun, Nov 24 2024 5:53 AM | Last Updated on Sun, Nov 24 2024 10:19 AM

Weekly Horoscope Telugu 24-11-2024 To 30-11-2024

మేషం...
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. నలుపు, నీలం రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృషభం...
సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. ఉద్యోగార్థుల యత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు.  విష్ణుధ్యానం చేయండి.

మిథునం...
కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరులు,సోదరీలతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు గతం కంటే ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం...
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బంధువర్గం మీపై ఒత్తిడులు పెంచుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిం^è ండి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి చికాకులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం...
ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. కార్యజయం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. విద్యార్థుల్లో నైరాశ్యం తొలగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.

కన్య....
ఏ పని చేపట్టినా  విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువర్గంతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబంలో గౌరవిస్తారు. వ్యాపారాల విస్తరణలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

తుల...
సన్నిహితులతో వివాదాలు తీరి ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  «ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.æ మిత్రుల నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు.  కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
అనుకున్న పనులు క్రమేపీ పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. తెలుపు, నేరేడు రంగులు.  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం....
సమస్యల పరిష్కారంలో వ్యక్తిగత చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి పలుకుబడి పెరుగుతుంది.  బంధువులను కలుసుకుని ఉత్సాహవంతంగా గడుపుతారు.  వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఉన్నత స్థాయి నుంచి పిలుపు అందుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. పసుపు, ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం...
కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో పురోగతి సా«ధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

మీనం....
ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదాలు తొలగి లబ్ధి చేకూరుతుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. యుక్తి, మేథస్సుతో సమస్యలను అధిగమిస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. . వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement