ఈ రాశి వారికి వారంలో ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి | Weekly Horoscope In Telugu 26-12-2021 to 01-01-2022 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి వారంలో ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి

Published Sun, Dec 26 2021 7:35 AM | Last Updated on Sun, Jan 2 2022 10:21 AM

Weekly Horoscope In Telugu 26-12-2021 to 01-01-2022 - Sakshi

వార ఫలాలు ఫోటో స్టోరీస్‌..

మేషం... మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. భూములు కొనుగోలులో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది.

వృషభం...కొన్ని వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో నెలకొన్న విభేదాలు క్రమేపీ పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు  బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం...ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబసభ్యుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం మధ్యలో సన్నిíß తులతో కలహాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం...ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినా రుణయత్నాలు తప్పవు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమపడాల్సివస్తుంది. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. కొత్త పరిచయాలు కాస్త ఊరటనిస్తాయి. కుటుంబసభ్యులు మీ అభిప్రాయాలను తిరస్కరించవచ్చు, అయినా మనోధైర్యం వీడవద్దు. 
వ్యాపార లావాదేవీలు అంతంతగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నేరేడు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం...ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. అందరిలోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. తోటి వారి సాయం తీసుకుని ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచమయవుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చాకచక్యంగా వ్యవహరించి గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య...ఉత్సాహంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. క్రియాశీల వ్యవహారాలలో అటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కొన్ని ఆహ్వానాలు అంది ఆశ్చర్యపడతారు. కొన్ని కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. రాజకీయవర్గాల చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో కలహాలు. పసుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల...ఆర్థికంగా క్రమేపీ మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ఆశలు నెరవేరతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వస్తులాభాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. కళారంగం వారికి నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కరించుకుంటారు. సమాజ సేవలో పాలుపంచుకుంటారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని పదవి రావచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. దుర్గాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...మీపై బంధువులు మరిన్ని బాధ్యతలు మోపవచ్చు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నెలకొన్న స్థబ్దత తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. నిర్ణయాలు మార్చుకుంటారు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం...ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. పారిశ్రామికవర్గాలకు కొన్ని అంచనాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. బంధువులతో తగాదాలు. తెలుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం...కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. కుటుంబసభ్యులతో మరింత ఆప్యాయత, ప్రేమగా మసలుకుంటారు. భూవివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహకరమైన సమాచారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. మిత్రులతో తగాదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం...ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరి ఖర్చులు అధిగమిస్తారు. సంఘంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు సఫలమవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనసౌఖ్యం. సేవాదృక్పథంలో ముందుకు సాగుతారు. విద్యార్థులు అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించి పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో అనారోగ్యం. సోదరులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement