మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఊరట చెందుతారు. మీ ఆలోచనలు ఎదుటవారికి ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం, విదేశీ విద్యావకాశాలు. వ్యాపారాలు క్రమేపీ పురోగమిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల ఆశలు ఫలించే సమయం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. మహావిష్ణు ధ్యానం చేయండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
వ్యవహారాలు ముందుకు సాగక డీలా పడతారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. చాకచక్యం, ఓర్పుతో ముందడుగు వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితిలో కాస్త మెరుగుదల కనిపించినా రుణాలు తప్పవు. కోర్టు కేసులకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక సమాచారంతో నిరాశ చెందుతారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాల కృషి అంతగా ఫలించదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు తొలగి ముందుకు సాగుతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో గౌరవం విశేషంగా పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.. కొన్ని విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో బంధువర్గంతో తగాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఊరట లభిస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమై సహాయపడతారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబసభ్యులతో తగాదాలు. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. దూరపు బం«ధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యత ఏర్పడి ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి, హోదాలలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల కాలం. వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కొత్త రుణాల వేటలో నిమగ్నమవుతారు. పనులు నత్తనడకన సాగుతూ ఉంటాయి. కుటుంబసభ్యులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. ఇతరులకు హామీలపై తొందరపాటు వద్దు. మీరు తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేకత ఎదురై కలత చెందుతారు. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగండి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితుల ప్రభావంతో మందకొడిగా సాగుతారు. పారిశ్రామికవర్గాల శ్రమ వృథా కాగలదు. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
మొదట్లో ఉన్న హుషారు క్రమేపీ తగ్గుతుంది. ముఖ్యమైన పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తుల వివాదాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి కొన్ని చిక్కులు తప్పవు. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వీరికి అన్నీ విజయాలే చేకూరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు యోగించేకాలం. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా మీకు ఎదురుండదు. పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో ముందుకు సాగుతారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు సంతోషదాయకమైన సమాచారం రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. నేరేడు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన సొమ్ము కూడా అందుతుంది. కొన్ని వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. వివాహ,. ఉద్యోగయత్నాలు సానుకూలం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు నూతన పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక విషయాలలో గందరగోళం. రుణదాతల నుంచి ఒత్తిడులు తీవ్రతరమవుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కష్టం మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మితంగా మాట్లాడడం ద్వారా కొన్ని సమస్యలను తప్పించుకోగలుగుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కీలక నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేరు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో పనిభారం మరింతగా పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. వాహనయోగం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఏ పని చేపట్టినా ముందుకు సాగక నిరాశచెందుతారు. మీ శ్రమ వృథాగా మారుతుంది. సోదరులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. నిరుద్యోగుల కృషి కొంత మేర ఫలిస్తుంది. నిర్ణయాలు వాయిదా వేయడం ఉత్తమం. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. నేరేడు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కూడా ఒత్తిడులు రావచ్చు. అనారోగ్య సూచనలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. మనోధైర్యం, మంచితనంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు క్రమేపీ కొంత అనుకూలస్థితి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారినా అవసరాలకు కొంత సొమ్ము అందుకుంటారు. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రమపడాలి. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి వివాదాలు, లేనిపోని సమస్యలు తప్పవు. వారం మధ్యలో వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment