వార ఫలాలు (ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు) | Weekly Horoscope 9 February To 15 February In 2020 | Sakshi
Sakshi News home page

వార ఫలాలు (ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు)

Published Sun, Feb 9 2020 9:17 AM | Last Updated on Sun, Feb 16 2020 12:38 PM

Weekly Horoscope 9 February To 15 February In 2020 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో  పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత చికాకులు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి, ఆశించిన పెట్టుబడులలో అవాంతరాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళాకారులకు చికాకులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆనుకోని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. సన్నిహితులతో మాటపట్టింపులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. అనుకోని ఇంటర్వ్యూలు అందుతాయి. మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి.  వ్యాపారాలలో కొన్ని సమస్యలు అధిగమిస్తారు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు.  సంఘంలో  విశేష గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక,రాజకీయరంగాల వారికి పట్టింది బంగారమే. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులు కాస్త నెమ్మదిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు ,సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఎటువంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు కొనుగోలు యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు  క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. సోదరుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు కొంత కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement