తొలి వారంలో రూ. 24,454 కోట్లు
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా అమ్మకాల బాటలో సాగిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు. దేశీ స్టాక్స్‌లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. వెరసి ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు రూ. 24,454 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.
అక్టోబర్‌లో కొత్త రికార్డుకు తెరతీస్తూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో కొంత వెనకడుగు వేసి రూ. 21,612 కోట్ల అమ్మకాలకు పరిమితమయ్యారు. అయితే సెపె్టంబర్‌లో అంతక్రితం 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇకపై యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు, వడ్డీ రేట్లు, రాజకీయ భౌగోళిక అంశాల ఆధారంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు నమోదుకానున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment