u-turn
-
ఎఫ్‌పీఐల స్పీడ్
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా అమ్మకాల బాటలో సాగిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు. దేశీ స్టాక్స్‌లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. వెరసి ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు రూ. 24,454 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అక్టోబర్‌లో కొత్త రికార్డుకు తెరతీస్తూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో కొంత వెనకడుగు వేసి రూ. 21,612 కోట్ల అమ్మకాలకు పరిమితమయ్యారు. అయితే సెపె్టంబర్లో అంతక్రితం 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇకపై యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు, వడ్డీ రేట్లు, రాజకీయ భౌగోళిక అంశాల ఆధారంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు నమోదుకానున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. -
Mahadev app case: సీఎం బఘేల్‌కు డబ్బు పంపలేదు
రాయ్‌పూర్: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్‌చేసిన నగదు కొరియర్ ఆసిమ్ దాస్ తాజాగా మాటమార్చాడు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్ల నగదు పంపించారని విచారణలో అతడు అంగీకరించాడని ఈడీ వెల్లడించడం తెల్సిందే. ఆసిమ్ తన లాయర్ షోయబ్ అల్వీ ద్వారా మరో వాంగ్మూలమిస్తూ ఈడీ డైరెక్టర్, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ‘‘ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవానికి సీఎం బఘేల్సహా ఏ రాజకీయనేతకూ నేను డబ్బులు అందజేయలేదు. ఈడీ అధికారులు ఇంగ్లిష్‌లో ఉన్న వాంగ్మూలంపై బలవంతంగా నా సంతకం చేయించుకున్నారు. నాకు ఇంగ్లిష్ రాదు. ఎవరో వచ్చి డబ్బు సంచులు కారులో పెట్టి వెళ్లిపోయాడు. డబ్బుతో నేను హోటల్రూమ్కి వెళ్లగానే ఈడీ అధికారులొచ్చి అరెస్ట్‌చేశారు. కేసులో నన్ను కావాలనే ఇరికించారని నాకప్పుడు అర్ధమైంది’’ అని దాస్ వివరించారు. -
‘మహా’ ట్విస్ట్; మాట మార్చిన ఏక్నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతోంది. శివసేన చీలిక వర్గానికి నేతృత్వం వహించిన ఏక్నాథ్ షిండే మరో ట్విస్ట్ ఇచ్చారు. తమతో ఏ జాతీయ పార్టీ సంప్రదింపులు జరపడం లేదని పేర్కొంటూ యూ టర్న్ తీసుకున్నారు. శక్తివంతమైన జాతీయ పార్టీ తమకు సాయం చేస్తోందని చెప్పిన మరుసటి రోజే ఆయన మాట మార్చడం గమనార్హం. గురువారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో తన వర్గం ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘మనమంతా ఐక్యంగా ఉండాలి. మనం చేసిన తిరుగుబాటును ఓ జాతీయ పార్టీ ప్రశంసించింది. మనకు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ముందుకు వచ్చింది. ఆ జాతీయ పార్టీ మహాశక్తివంతమైనద’ని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఆయన మాట మార్చారు. శివసేన చీలిక వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తుందా అన్న ప్రశ్నపై.. ఓ టీవీ చానల్‌తో షిండే శుక్రవారం మాట్లాడుతూ.. ‘ఓ మహాశక్తి మాకు ఇస్తుందని నేను చేసిన వ్యాఖ్యలు బాలాసాహెబ్ ఠాక్రే, ఆనంద్ డిఘేలను ఉద్దేశించినవ’ని జవాబిచ్చారు. కాగా, మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంతో మతకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. శివసేన పార్టీ అంతర్గత వ్యవహారంలో వేలు పెట్టబోమని తెలిపింది. బీజేపీ కుటిల యత్నాలు: కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రేను పదవి నుంచి దించేందుకు బీజేపీ కుటిల యత్నాలు చేస్తోందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయనను గద్దె దించేందుకు బీజేపీ చేయని కుట్రలు లేవు. మహా వికాస్ ఆఘాడీ సర్కారు సామాన్యుల విశ్వాసాన్ని చూరగొనడంతో కాషాయ పార్టీ కడుపుమంటతో రగిలిపోతంద’ని తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే అనైతికంగా వ్యవహరించారని, అపవిత్ర పొత్తు పెట్టకున్నందుకు ఆయన ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. (క్లిక్: ఏక్నాథ్ షిండే తొలగింపు చెల్లుతుంది!) -
తగ్గేదేలే... ఈసారి గర్వంగా మెలేశాడు
భోపాల్: తగ్గేదేలే... సస్పెండ్ చేసినా సరే బారు మీసం తీయనంటే తీయనని భీష్మించిన మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ రాకేశ్ రాణా పంతమే నెగ్గింది. మీసం నా ఆత్మగౌరవానికి ప్రతీకన్న ఆయన సగర్వంగా మీసం తిప్పాడు. పోలీసు శాఖ రాణాపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మధ్యప్రదేశ్‌లో పోలీసు రవాణా విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేశ్ రాణాను మీసాలు, తలపై జుట్టును తగ్గించాలని.. అలా పెంచడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు హెచ్చరించినా.. అతను ఖాతరు చేయలేదు. దాంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వార్తకు బాగా ప్రాచుర్యం లభించడంతో పోలీసు శాఖ యూటర్న్ తీసుకుంది. రాణాను సస్పెండ్ చేసే అధికారం లేకున్నా ఏఐజీ ప్రశాంత్ శర్మ... ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారని, అందువల్ల రాకేశ్ రాణాను తిరిగి విధుల్లో చేర్చుకుంటున్నట్లు పోలీసు హెడ్‌క్వార్టర్స్ డీఐజీ (పర్సనల్) ఉత్తర్వులు జారీచేశారు. -
కేంద్రమంత్రి యూ టర్న్..‘ ఆ చట్టాలు మళ్లీ తెచ్చే ప్రశ్నే లేదు’
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట మార్చారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటన తర్వాత పార్లమెంట్ సాక్షిగా రద్దయిన సాగు చట్టాలను భవిష్యత్‌లో అమల్లోకి తెస్తామని నర్మగర్భంగా మాట్లాడిన మంత్రి రెండ్రోజులకే యూ టర్న్ తీసుకున్నారు. ఉపసంహరించుకున్న ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన లేదని ఆయన ఆదివారం స్పష్టంచేశారు. మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక వ్యవసాయ సంబంధ కార్యక్రమంలో శుక్రవారం తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని, అసలు ఈ గందరగోళానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ వ్యవసాయ కార్యక్రమంలో నేను మాట్లాడింది వేరు. ‘రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆ వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గాం. రైతు సంక్షేమం విషయంలో ముందడుగు వేస్తాం’ అని మాత్రమే నేను అన్నాను. చట్టాల విషయంలో కాదు. ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన మోదీ సర్కార్‌కు ఎంత మాత్రం లేదు’’ అని తోమర్ వివరణ ఇచ్చారు. ‘ రైతు సంక్షేమానికి మేలుబాటలు పరుస్తూ 2006లో స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులను పట్టించుకోని వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు ఇలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్‌పై తోమర్ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఆ చట్టాల తరహాలో కొత్త చట్టాలను తేవాలని మోదీ సర్కార్ యోచిస్తోందని కాంగ్రెస్ విమర్శించడం తెల్సిందే. ఎన్నికల తర్వాత దొడ్డిదారిన తెస్తారు: కాంగ్రెస్ రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక బీజేపీ ప్రభుత్వం ఈ పనికి పూనుకుంటుందని పేర్కొంది. అందుకే, ఎన్నికల్లో బీజేపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చింది. -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: గత నెల(సెప్టెంబర్)లో ప్రయివేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ యూటర్న్ తీసుకున్నాయి. దీంతో పెట్టుబడులు సగానికి తగ్గాయి. 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన 4.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి అధికమే అయినప్పటికీ ఆగస్ట్‌లో 10.9 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక త్రైమాసికవారీగా చూస్తే క్యూ3(జులై–సెప్టెంబర్)లో 3.4 రెట్లు జంప్‌చేసి 25.3 బిలియన్ డాలర్లను తాకాయి. ప్రధానంగా స్టార్టప్‌లలో పెట్టుబడులు జోరందుకోవడం ప్రభావం చూపినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల లాబీ ఐవీసీఏ సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో స్టార్టప్‌ల వాటా 39 శాతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసింది. పెట్టుబడులు, అమ్మకాలు ఇలా ఈ ఏడాది(2021)లో పీఈ, వీసీ పెట్టుబడులు 70 బిలియన్ డాలర్లకు చేరగలవని ఈవై నిపుణులు వివేక్ సోనీ అంచనా వేశారు. ఇక పెట్టుబడి విక్రయాలు 50 బిలియన్ డాలర్లను తాకే వీలున్నట్లు పేర్కొన్నారు. మరో కన్సల్టెన్సీ దిగ్గజం గ్రాంట్ థార్న్టన్ భారత్ సైతం డీల్స్‌పై రూపొందించిన నివేదికలో క్యూ3లో 597 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. వీటి విలువ 30 బిలియన్ డాలర్లుగా మదింపు చేసింది. రియలీ్ట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మినహాయిస్తే పీఈ, వీసీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 23 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఈవై నివేదిక పేర్కొంది. -
అప్పుడలా..ఇప్పుడిలా..
-
మోదీ ‘టైమ్’ మారింది
న్యూయార్క్: ప్రధాని మోదీ భారత విభజన సారథి (ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అంటూ ఆయనను విమర్శిస్తూ రెండు వారాల క్రితం (సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు) కథనం ప్రచురించిన ప్రముఖ టైమ్ మేగజీన్.. ఎన్నికల ఫలితాలు రాగానే మాట మార్చింది. గత 5 దశాబ్దాల్లో మోదీలా దేశాన్ని ఎవ్వరూ ఏకం చేయలేకపోయారంటూ మోదీని ప్రశంసిస్తూ తాజాగా మరో కథనాన్ని ప్రచురించింది. పాత కథనాన్ని పాకిస్తాన్ మూలాలున్న ఆతీష్ తసీర్ అనే జర్నలిస్టు రాయగా, తాజా కథనాన్ని భారత్‌కు చెందిన మనోజ్ లాద్వా రాశారు. లండన్ కేంద్రంగా పనిచేసే ఇండియా ఇన్కార్పొరేషన్ గ్రూప్ అనే మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవోనే ఈ మనోజ్. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ప్రధానిగా మోదీ’ అనే ప్రచార కార్యక్రమంలో పరిశోధన, విశ్లేషణ విభాగానికి మనోజ్ నేతృత్వం వహించారు. మోదీ సమాజంలో మతపరమైన విభజన తీసుకువచ్చారని ఆతీష్ తసీర్ వ్యాసం ద్వారా ఆరోపించిన టైమ్ మేగజీన్.. ఎన్నికల్లో మోదీ భారీ విజయం సాధించడంతో ఆ పత్రిక తన రూటు మార్చుకోవాల్సి వచ్చింది. మోదీ విభజన వాది కాదు, దేశాన్ని ఏకతాటిపైన నడిపించిన నాయకుడు అంటూ మనోజ్ రాసిన సంపాదకీయంలో టైమ్ ప్రశంసించింది. కుల, మత, వర్గ సమీకరణల్ని అధిగమించి మరీ మోదీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు, సీట్లు, ఓట్లు పెంచుకున్నారని విశ్లేషించింది. క్షేత్రస్థాయి అధ్యయనంలో విదేశీ మీడియా విఫలం భారత్‌లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేయడంలో పశ్చిమ దేశాల మీడియా విఫలమైందని మనోజ్ అభిప్రాయపడ్డారు. ‘మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రకులాల ఆధిపత్యం పెరిగిందని అందరూ భావించారు. వెనుకబాటు కులాలే ఒక్కటై మోదీకి జేజేలు పలికాయి. ఒక వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం, ఉద్యోగ వర్గాలకు ప్రతి«నిధిగా ఆయన కనిపించడం, నిరుపేదలు అత్యధికంగా ఉన్న భారత్‌లో మోదీపై ఉన్న వ్యక్తిగత కరీష్మాయే ఆయనను రెండోసారి అధికార అందలాన్ని ఎక్కించింది. పాలనలో మోదీ విధానాలపై ఎన్నో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఆయనను విపక్ష పార్టీలు విమర్శించాయి. అయినా భారత ఓటర్లు ఏకమై ఆయనకే పట్టంగట్టారు. ఈ స్థాయిలో ఓటర్లు ఒక్కటై ఒక వ్యక్తిని చూసి ఓటు వేయడం 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి’ అని మేగజీన్ వ్యాసంలో పేర్కొంది. -
నన్ను మార్చివేసిన పాత్ర అది: సమంత
సాక్షి, తమిళసినిమా: జెస్సీని జీవితంలో మరవలేను అంటున్నారు సమంత అక్కినేని.. పుట్టినిల్లు చెన్నైను వదిలి మెట్టినిల్లు హైదరాబాద్‌లో మకాం పెట్టిన ఈ అమ్మడు.. వివాహానంతరం సక్సెస్ఫుల్ హీరోయిన్‌గానే కాదు అగ్ర కథానాయికగా కూడా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్న సమంత ఇటీవల తన సినీ అనుభవాలను పంచుకున్నారు. నటీనటులకు ఏ పాత్ర ఎంతగా నచ్చుతుందో చెప్పలేమని, అయితే, పాత్రలను సులభంగా చేయగలమని ఎప్పుడూ నటులు భావించరాదని సమంత చెప్పారు. సుదీర్ఘ తన సినీప్రయాణంలో తాను నటించిన ప్రతి పాత్ర తనకు ముఖ్యమైనదేనని తెలిపారు. చేసే పాత్రను అర్థం చేసుకుని.. ఆ పాత్రగా మారడానికి ప్రయత్నిస్తానని, అలా సినిమాల్లోని పాత్రల ద్వారా జీవితంలోని మంచిచెడులను దగ్గరగా చూశానని, చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. తాను నటించిన ‘ఏ మాయ చేశావే’ చిత్రంలోని జెస్సీ పాత్రను జీవితంలో మరవలేనని, తననే మార్చిన పాత్ర అది అని సమంత పేర్కొన్నారు. నటిగా తాను నిలదొక్కుకోవడానికి జెస్సీ పాత్రనే కారణమని చెప్పారు. ఈ సినిమా తర్వాతనే సమంతకు ఎలాంటి పాత్రలను ఇవ్వాలన్నది దర్శకులు ఆలోచించడం మొదలెట్టారని, మంచి పాత్రలు రావడానికి ఆ చిత్రమే కారణమని తెలిపారు. అప్పటినుంచి పాత్రల ఎంపికలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించినట్లు చెప్పారు. ఆ ప్రయాణమే నటిగా తననీ స్థాయిలో నిలబెట్టిందని తెలిపారు. యూటర్న్ చిత్రం తరువాత ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి సమంత సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రం కోసం 70 ఏళ్ల బామ్మగా మారడానికి ఆమె సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
భయపెడుతూనే మెసేజ్ ఇచ్చారు – ఎంపీ కవిత
‘‘యు టర్న్’ సినిమా నేను చూడలేదు కానీ.. నా పిల్లలు చూసి చాలా బావుందన్నారు. ఓ వైపు భయపెడుతూనే చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడానికి సమంత భయపడటం లేదు. ‘రంగస్థలం’లో తన పాత్రకు, ‘యు టర్న్’లోని పాత్రకు చాలా తేడా ఉంది. తను బ్రిలియంట్ యాక్ట్రెస్. కొత్త కాన్సెప్ట్ సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు’’ అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమంత ప్రధాన పాత్రలో, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. పవన్‌కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో సమంత మాట్లాడుతూ– ‘‘నా గత సినిమాలతో పోల్చితే ‘యు టర్న్’కి మంచి స్పందన వచ్చింది. సినిమా బావుందని క్రిటిక్స్ అభినందిస్తున్నారు. నందినీరెడ్డిగారికి మా సినిమాతో సంబంధం లేకపోయినా నాలుగు రోజులు వచ్చి నాతో కూర్చుని సపోర్ట్ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇక్కడి నుంచి ఇంకా మంచి సినిమాలు, గర్వపడే సినిమాలు చేస్తా’’ అన్నారు. ‘‘సమంత బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు పవన్‌కుమార్. ‘‘సమంత, పవన్‌కుమార్ లేకపోతే ఈ సినిమా లేదు. మా చిత్రం ఇంత సక్సెస్ కావడం హ్యాపీ’’ అన్నారు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు. -
సమంత అద్భుతమైన నటి.. అన్నది ఎవరో తెలుసా!
సాక్షి, తమిళసినిమా: నటి సమంత అద్భుతమైన నటి.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా.. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భూమిక. వివాహానంతరం కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఆమె.. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చారు. నటనకు అవకాశమున్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె తాజా చిత్రం యూటర్న్.. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గురువారం తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై రెండు భాషల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించిన భూమిక తన అనుభవాలను పంచుకున్నారు. ‘కళాకారులెవరైనా వైవిధ్యమైన, చాలెంజ్తోకూడిన పాత్రల్లో నటించినప్పుడే గుర్తింపు పొందుతారు. ఆత్మసంతృప్తి దొరుకుతుంది. ‘యూటర్న్’ చిత్రంలో నేను ఇంతవరకూ చేయని విభిన్నమైన పాత్రలో నటించాను. నా పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ఆమె తెలిపారు. ఇక, యూటర్న్‌లో ప్రధాన పాత్ర పోషించిన సమంతను భూమిక ప్రశంసల్లో ముంచెత్తారు. సమంత బ్రహ్మాండమైన నటి కితాబిచ్చారు. షూటింగ్లో చాలా చలాకీగా ఉంటారని, ఈ చిత్రంలో తను చాలా బాగా నటించారని అన్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల గురించి స్పందిస్తూ ఇంతకుముందు కూడా తాను ఈ తరహా చిత్రాల్లో నటించానని, ఇకముందు కూడా నాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తానని చెప్పారు. తమిళంలోనూ తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని, మంచి కథ, పాత్ర బాగుంటే నటిస్తానని, అలాంటి చిత్రాలే ప్రేక్షకుల మధ్యకు చేరతాయన్నారు. తాను 1999లో నటిగా పరిచయం అయ్యానని, సినీ రంగంలోకి వచ్చి సుమారు 20 ఏళ్లు అవుతుందని భూమిక తెలిపారు. జయాపజయాలను ఎలా జీర్ణించుకోవాలో తన తల్లిదండ్రులు నేర్పించారని, కాబట్టి అవి తనను బాధించవని అన్నారు. -
నాకు ఇష్టమైన ప్లేస్ అదే
ఫ్యాన్స్ అంటే సమంతకు చాలా అభిమానం. అందుకే వీలు కుదిరినప్పుడల్లా తనతో మాట్లాడే అవకాశం ఇస్తుంటారు. వీకెండ్లో ఫ్యాన్స్‌కి అలాంటి ఫీస్ట్‌నే ఇచ్చారు. మీరేం అడిగినా ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీ అంటూ ట్వీటర్ ద్వారా ప్రశ్నలు సంధించే చాన్స్ ఫ్యాన్స్‌కి ఇచ్చారు. వాటిలో కొన్ని... ► ‘యు టర్న్’ సినిమాలో మీ పాత్ర పేరు? రచన ► ఈ పాత్ర కోసం మళ్లీ ముక్కు కుట్టించుకున్నారా ? లేదు. అది కేవలం పెట్టుడు నోస్ రింగ్ మాత్రమే. ► ఆదివారాలు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు. హ్యాపీగా ఇంట్లో ఉండటమే. ► ‘యు టర్న్’ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం? దర్శకుడు పవన్ కుమార్. అతను తీసిన కన్నడ ‘లూసియా’ చూసి అతనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ► ఈ సినిమాలో మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా? అవును. ► వరుసగా అద్భుతమైన పాత్రలు, సినిమాలు చేస్తున్నారు. ఎలా కుదురుతోంది? మంచి పాత్రల కోసం వెతకడం, కొన్ని వాటంతట అవే రావడం. రెండూ జరుగుతున్నాయి. ► ఫ్యూచర్లో కూడా ఇలానే కొత్త కొత్త పాత్రలు చేయండి. థ్యాంక్యూ. తప్పకుండా. ► సినిమా సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ? వండర్ఫుల్. ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు దేవుడికి రుణపడి ఉంటాను. ► సెలబ్రిటీ అయ్యాక కామన్ ఉమెన్‌గా ఉండడం మిస్ అవుతున్నారా ? నా లైఫ్ ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటుంది. అలాగే కంటిన్యూ చేస్తాను. ► మీ లైఫ్‌లో పెద్ద యు టర్న్ మూమెంట్ ఏంటి? సినిమాల్లోకి రావాలనుకోవడం. ► సూపర్ హీరోస్లో ఎవరంటే ఇష్టం? అవెంజెర్స్ లేదా జస్టిస్ లీగ్? అవెంజర్స్. ► జుట్టు షార్ట్‌గా కట్ చేశారు. ఫీల్ అయ్యారా? అస్సలు లేదు. క్యారెక్టర్ కోసం అలా చేయడం నాకు భలే ఇష్టం ► అటు ఫ్యామిలీ, ఇటు ప్రొఫెషన్.. రెంటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఫ్యామిలీ, వర్కే మన మేంటో తెలియజేస్తాయి. మిగతావేవీ కాదు. అందుకే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటాను. ► మీకు బాగా ఇష్టమైన ప్లేస్? ఇల్లు ► మీరు పోషించిన వాటిలో బెస్ట్ రోల్ ఏంటి? ఇంకా లేదు. మంచి క్యారెక్టర్స్ చేయాలని అత్యాశ ఎక్కువ. అందుకే అలా అంటున్నాను. ► మీ మామ నాగార్జున గారి గురించి ఒక్క మాటలో చెప్పండి.. స్పూర్తి కలిగించే వ్యక్తి. ► హీరోయిన్స్‌లో ఎవరైనా మీకు కాంపిటీషన్ అని ఫీల్ అవుతారా? హీరోయిన్స్ అందరూ కలసికట్టుగా ఉండాలి. ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ, ఎంకరేజ్ చేసుకోవాలి. కలసి ఉంటేనే కదా బలం. -
ప్యాకేజీ కావాలని బాబే అడిగారు
-
సిక్సర్
రయ్ రయ్ మంటూ కెరీర్లో దూసుకెళ్తున్నారు సమంత. అయితే ఈ ఏడాది ఆమె కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పవచ్చు. ఆల్రెడీ ‘రంగస్థలం’, ‘మహానటి’(తమిళంలో ‘నడిగయర్ తిలగం’), ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ తాజాగా ‘యు టర్న్’ సినిమాలో తన షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్ కూడా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ‘‘ఇంకో సినిమా (యు టర్న్) షూటింగ్‌ను కంప్లీట్ చేశా. ఇక డబ్బింగ్ స్టార్ట్ చేయాలి’’ అన్నారు సమంత. ఈ సినిమాకు సోమవారం నుంచి సమంత డబ్బింగ్ చెప్పనున్నారు. తమిళంలో శివకార్తీకేయన్ హీరోగా ‘సీమరాజా’, విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమాలను కూడా కంప్లీట్ చేశారు సమంత. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యాయన్నది పక్కన పెడితే ఈ ఏడాది ఇప్పటి వరకూ సమంత అరడజను సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేసి సిక్సర్ కొట్టారు. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. సో.. ఈ సినిమానే సమంత నెక్ట్స్ చిత్రం అని ఊహిస్తున్నారు సినీ లవర్స్. -
ఎల్బీనగర్ చౌరస్తా రేపటి నుంచి మూసివేత
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తా రేపటి నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యూ టర్న్ ఏర్పాటుతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించే క్రమంలో కూడళ్లలో యు టర్న్ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలు కూడళ్లలో యూ-టర్న్ పద్ధతి సఫలమైన నేపథ్యంలో నిత్యం వేలాది వాహనాలతో బారులుతీరే ఎల్బీనగర్ కూడలిలోనూ ఈ పద్ధతిని ఆదివారం నుంచి అవలంభించబోతున్నట్లు తెలిపారు. మెట్రో రైలుతోపాటు, స్కైవే పనులు సైతం జరుగుతున్నందున ఈ చౌరస్తాలో వాహనదారులకు ఇబ్బంది కలుగని రీతిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ రమేష్, అదనపు డీసీపీ దివ్యచరణ్రావు, ఏసీపీ శ్రీధర్‌లు ఎల్బీనగర్ చౌరస్తాను పరిశీలించారు. ఇక్కడ యు టర్న్ ఎంత మేరకు సఫలమవుతుందోనని అంచనా వేశారు. ఈ మేరకు ఆదివారం నుంచి ఎల్బీనగర్ కూడలిని మూసివేసి ఇటు ఎల్పీటీ మార్కెట్, అటు డీమార్ట్ ముందు యు టర్న్ తెరుస్తారు. అయితే, హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిలో యథావిధిగా రాకపోకలు ఉంటాయి. విజయవాడ నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్ చౌరస్తా దాటాక డీ మార్ట్ వద్ద కుడివైపు యు టర్న్ తీసుకోవాలి. దిల్సుఖ్నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్డువైపు వెళ్లే వాహనాలు చౌరస్తా దాటాక ఎల్పీటీ మార్కెట్ వద్ద కుడివైపు యు టర్న్ తీసుకోవాలి. ఉప్పల్ నుంచి సాగర్ రోడ్డు, దిల్సుఖ్నగర్ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్ చౌరస్తాలో ఎడమవైపు మలుపు తీసుకుని ఎల్పీటీ మార్కెట్ వద్ద కుడివైపు యూ టర్న్ తీసుకోవాలి. సాగర్ రోడ్డు నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు చౌరస్తాలో ఎడమవైపు మలుపు తిరిగి డీ మార్ట్ వద్ద యు టర్న్ తీసుకోవాలి. ప్రధానంగా ఆర్టీసీ బస్సులను కూడలి, యు టర్న్‌కు సమీపంలో ఆపరాదని.. విజయవాడ వెళ్లే బస్సులను ఆరెంజ్ ఆస్పత్రి ముందు నిలపాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీధర్ సూచించారు. -
డేటాలీక్‌పై జియో యూ టర్న్
న్యూడిల్లీ: వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అత్యంతర భద్రం, డేటా లీక్ కాలేదంటూ ప్రగల్భాలు పలికిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ యూ టర్న్ తీసుకుంది. తమ వినియోగదారుల సమాచారం లీక్ అయిందంటూ పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపింది. డేటా మేజర్ లీక్ అయిందంటూ జియో తమకు ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి బుధవారం తెలిపారు. తమ కంప్యూటర్ వ్యవస్థలోకి అక్రమ చొరబాట్లు జరిగాయంటూ ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రిలయన్స్ జియో ఆరోపించిందని దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ కస్టమర్ల సమాచారం భారీగా లీక్ అయిందన్న వార్తలను నమ్మొద్దంటూ కొట్టిపారేసిన జియో, డేటాలీక్‌ను అధికారికంగా ధృవీకరించినట్టయింది. ఈ వ్యవహారంపై బెంగళూరుకు చెందిన వెబ్ భద్రతా సలహాదారు ఆకాష్ మహాజన్ స్పందిస్తూ డేటాలీక్ అనేది కంపెనీ భద్రతా డొల్లతనాన్ని ప్రదర్శిస్తుందన్నారు. అందుకే ఇండియాలో చాలా కంపెనీలు డేటా ఉల్లంఘనలను తరచూ అంగీకరించడం లేదని పేర్కొన్నారు. కాగా మాజిక్ ఏపీకే వెబ్సైట్లో జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం ఆందోళన రేపింది. వినియోగదారుల ఈమెయిల్, ఆధార్‌నెం, మొబైల్ నంబర్లను ఈ వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. మరోవైపు లీకేజీకు సంబంధించి రాజస్థాన్‌కు ఇమ్రాన్ చింపా అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు చింపాను ముంబైకి తరలించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 66 లోని సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ యొక్క 379 సెక్షన్. ప్రకారం కేసు నమోదు చేశారు. దాదాపు 12 కోట్ల మంది జియో వినియోగదారులు తన ఆధార్ కార్డ్ నమోదు ద్వారా జియో సిమ్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. -
ధోనిపై కామెంట్స్.. హర్ష్ యూటర్న్
పుణే: మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీ, ఆటతీరుపై విమర్శలు చేసిన రైజింగ్ పుణె జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా యూటర్న్ తీసుకున్నారు. అత్యుత్తమ ఫినిషర్ అంటూ ఆకాశానికెత్తారు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో పుణెను ‘మిస్టర్ కూల్’ గెలిపించాడు. 31 బంతుల్లో 61 పరుగులు బాదాడు. దీంతో ధోనిపై హర్ష్ గోయెంకా ప్రశంసలు కురిపించారు. ‘ధోని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మళ్లీ ఫామ్ లోకి రావడం గొప్పగా అన్పిస్తోంది. అతడిని మించిన ఫినిషర్ లేడ’ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. హర్ష్ గోయెంకా తాజా వ్యాఖ్యలపై ధోని అభిమానులు ట్విటర్ లో కామెంట్లు పెట్టారు. ధోని ధనాధన్ ఇన్నింగ్స్ హర్ష్ కు చెంపదెబ్బ అని, అడవికి రాజు ఎవరో తేలిపోయిందని వ్యాఖ్యానించారు. హర్ష్.. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, ధోని జట్టు నుంచి వెళ్లిపోవాలని కొద్ది రోజుల క్రితం ఆయన కోరుకున్నారని గుర్తు చేశారు. ఇంతకుముందు ధోనిపై చేసిన వ్యాఖ్యలను తమకెంతో బాధ కలిగించాయని, అతడిపై తమకున్న అభిమానాన్ని ఎవరూ చెరిపివేయలేరని ఫ్యాన్స్ స్పష్టం చేశారు. ‘అడవికి రాజు ఎవరో అనేది స్మిత్ నిరూపించాడు. ధోనిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్. అతడిని కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయం’ అని హర్ష్ చేసిన ట్వీట్ పై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. -
నాటోపై ట్రంప్ యూ టర్న్!
వాషింగ్టన్: ఉత్తర అట్లాంటిక్ దేశాల కూటమి (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్– నాటో)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. నాటోకి కాలం చెల్లిపోయిందని ఇటీవల వ్యాఖ్యానించిన ట్రంప్.. తాజాగా నాటో ప్రాముఖ్యాన్ని కోల్పోలేదని మాటమార్చారు. సిరియా విషయంలో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌తో కలసి వైట్‌హౌజ్‌లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నాటో పనితీరుపై గతంలో విమర్శలు చేశాను. కానీ ప్రస్తుతం వారు కూడా ఉగ్రవాదంపై పోరాడుతున్నారు. గతంలో దానికి కాలం చెల్లిందని చెప్పాను. కానీ నాటో ప్రాముఖ్యం కోల్పోలేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాకీయులకు నాటో సాయమందించాలని కోరారు. ఇప్పటి వరకు రష్యా–అమెరికా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని.. నాటో, అమెరికాతో కలసి రష్యా ముందుకు సాగితే అద్భుతంగా ఉంటుందన్నారు. రానున్న కాలంలో నాటో మిత్రదేశాలతో కలసి పని చేస్తామని చెప్పారు. వలసలు, ఉగ్రవాదం లాంటి సమస్యలను నాటో దేశాలతో కలసి ఎదుర్కొంటామన్నారు. సిరియాలో ప్రజలు, చిన్నారులను సాయన ఆయుధాలతో ఊచకోత కోయడాన్ని ప్రతి దేశమూ ఖండించాలన్నారు. అక్కడి ఉగ్రవాదులను అంతమొందించి అంతర్యుద్ధానికి ముగింపు చెప్పాలని, శరణార్థులను తిరిగి సొంత గూటికి పంపాలన్నారు. కాగా, త్వరలో బ్రసెల్స్‌లో జరగనున్న నాటో సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది. -
U టర్న్
-
నోట్లరద్దు పై చంద్రబాబు యూటర్న్
-
‘ఒబామాకేర్’పై ట్రంప్ యూటర్న్
చట్టాన్ని కొనసాగించనున్నట్లు సంకేతాలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. ఒబామా హెల్త్‌కేర్ చట్టాన్ని కొన్ని మార్పులతో కొనసాగించనున్నట్లు సంకేతాలిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒబామా ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని రద్దు చేస్తానని ట్రంప్ చెప్పడం తెలిసిందే. అరుుతే శ్వేతసౌధంలో గురువారం ఒబామాతో మట్లాడాక ట్రంప్ స్వరం మారినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆరోగ్య సంరక్షణ చట్టం రద్దును పునఃపరిశీలించాలని ట్రంప్‌తో భేటీలో ఒబామా కోరినట్టు పేర్కొంది. ‘ఒబామా కేర్ మార్పులతో కొనసాగించడమో రద్దు చేయడమే చేస్తాం. ఒబామాపై గౌరవంతో ఆయన సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని భేటీ తర్వాత ట్రంప్ అన్నారు. హామీల అమలుపై దృష్టి.. ట్రంప్ తన ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐసిస్‌ను ఓడించడంతో పాటు మెరుగైన అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, భారీ మౌలిక పెట్టుబడుల ద్వారా ఉద్యోగాల కల్పనపై చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ గెల్చిన వెంటనే ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మౌలిక అవసరాల ప్రాజెక్టుల ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను తొలగించడం కన్నా ఐసిస్‌ను ఓడించడంపైనే తమ దృష్టి ఉన్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ముగిసి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదర్చగలమని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్‌కు పదవీగండం: ప్రొఫెసర్ జోస్యం న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని అంచనా వేసి చెప్పిన ప్రొఫెసర్ అలన్ లిక్ట్మ్యాన్ మరో ఆసక్తికరమైన జోస్యం చెప్పారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే త్వరలోనే ఆయనను రిపబ్లికన్ పార్టీ సదస్సు అభిశంసించి ఆయన స్థానంలో తమకు విశ్వాసపాత్రమైన, అదుపులో ఉండే నేతను ఎన్నకునే అవకాశం ఉందని అలన్ పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న మైక్ పెన్స వంటి నేత వైపు రిపబ్లికన్ పార్టీ మొగ్గు చూపొచ్చని అలన్ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్‌లో కథనం ప్రచురితమైంది. ఆగని నిరసనలు పోర్ట్‌ల్యాండ్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తగడంటూ చేపట్టిన నిరసనలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించారుు. పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ట్రంప్ విజయాన్ని నిరసిస్తూ వీధులకెక్కారు. న్యూయార్క్‌లోని ట్రంప్ ఇంటి ఎదుట కూడా ఆందోళనలు జరిగాయి. తొలుత ఒరెగాన్, కాలిఫోర్నియా, ఫిలడల్ఫియా, లాస్ ఏంజెలిస్, ఫ్లోరిడాల్లో భారీగా జరిగిన నిరసనలు.. శుక్రవారం డెన్వర్,బాల్టిమోర్ తదితర ప్రాంతాలకు విస్తరించారుు. పోర్ట్‌ల్యాండ్‌లో బేస్‌బాల్ బ్యాట్‌తో రోడ్డుపైకి వచ్చిన 4 వేలమందికి పైగా ఆందోళనకారులు కొన్ని హోటళ్లు, దుకాణాల్లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్‌తోపాటు పార్కింగ్ చేసి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. -
హీరోగా యు-టర్న్!
‘లెజెండ్’తో జగపతిబాబు కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. అప్పటివరకూ హీరోగా నటించిన ఆయన విలన్‌గా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. హీరోగా ఫీమేల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జగపతిబాబు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, డ్రస్సింగ్ స్టైల్, స్టైలిష్ యాక్టింగ్‌తో విలన్‌గా కూడా ఫీమేల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వరుసగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేస్తున్న ఆయన హీరోగా మళ్లీ యు-టర్న్ తీసుకుంటున్నారు. జగపతిబాబు హీరోగా నటించబోయే కొత్త చిత్రం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఈ సినిమాను నిర్మించనున్నారు. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇక, తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ కుమారస్వామి నిర్మించిన ‘జాగ్వార్’లో జగపతిబాబు విలన్‌గా నటించారు. ‘జాగ్వార్’తో నాకో మంచి మిత్రుడు లభించాడని కుమారస్వామిని ఉద్దేశించి ఇటీవల ఆడియో వేడుకలో జగపతిబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
మెట్టుగూడ జంక్షన్ క్లోజ్డ్
హైదరాబాద్ : సికింద్రాబాద్ తార్నాక, మెట్టుగూడ వద్ద ట్రాఫిక్ అవాంతరాలను తొలగించే దిశగా పోలీసులు జంక్షన్లను ఆదివారం మూసివేశారు. దీంతో ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేందుకు మార్గం ఏర్పడింది. జంక్షన్లను మూసివేసి సమీపంలోనే యూ టర్న్‌లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు సిగ్నల్స్ కోసం ఆగే పని లేకుండా ముందుకు వెళ్లేందుకు వీలు కల్పించారు. -
గే సెక్స్ పై ఆర్ఎస్ఎస్ యూటర్న్
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ యూటర్న్ తీసుకుంది. సజాతీయుల సంబంధాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. గే సెక్స్ ను నేరంగా పరిగణించిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మాట మార్చింది. గే సెక్స్ నేరం కాదని, అనైతికమని, దానికి శిక్ష కంటే మానసిక చికిత్స అవసరమని పేర్కొంది. 'స్వలింగ సంపర్కం నేరం కాదు. సమాజంలో అదో అనైతికమైన పని. స్వలింగ సంపర్కానికి పాల్పడినవారిని శిక్షించాల్సిన అవసరం లేదు. మానసిక సంబంధమైన సమస్యగా గుర్తించి, వారికి చికిత్స అందించడం అవసర'మని ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హెసబాలె తన అభిప్రాయాన్ని శుక్రవారం ట్వీట్ చేశారు. స్వలింగ సంపర్క దృక్పథాన్ని నేరంగా చూడకూడదని, వారిలో మార్పు తేవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తూ అమలవుతున్న ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. -
ఫరూక్ యూటర్న్.. కొనసాగుతున్న సస్పెన్స్!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతితో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించడం సంచలనం రేపింది. దీంతో తెరవెనుక బీజేపీ-ఎన్సీ సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా యూటర్న్ తీసుకొన్నారు. బీజేపీతో తాము పొత్తు పెట్టుకుంటామని తాను ఎన్నడూ అనలేదంటూ ఆయన మాట మార్చారు. మరోవైపు ఎన్సీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. సిద్ధాంతపరమైన విబేధాలు ఉన్న బీజేపీతో ఎన్సీ ఎట్టిపరిస్థితుల్లో చేతులు కలుపబోదని పేర్కొన్నారు. మరోవైపు గతంలో మాదిరిగానే బీజేపీ-పీడీపీ కూటమి మళ్లీ కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందా అన్నది స్పష్టం కావడం లేదు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై పీడీపీ అధినాయకురాలు మహబూబా ముఫ్తీ పార్టీ సీనియర్ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. పాత మిత్రుడు బీజేపీతో కలిసి వెళ్లాలా? లేక కొత్త స్నేహ హస్తం చాటుతున్న కాంగ్రెస్‌తో జట్టు కట్టాలా అన్నది ఈ సమావేశంలో మహబూబా నిర్ణయించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
ఎన్డీఏ యూటర్న్‌లపై కాంగ్రెస్ పుస్తకం..
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మరో పుస్తకాస్త్రాన్ని సంధిస్తోంది. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన పలు హామీలు, వాటిల్లో యూటర్న్ తీసుకున్న అంశాలతో కూడిన బుక్‌లెట్‌ను సోమవారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో నల్లధనం సహా 24 అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న యూటర్న్లు ఉంటాయని తెలిసింది. -
విభజన బిల్లు పై సిఎం యూటర్న్
-
'బీజేపీ యూటర్న్ తీసుకుంటే విభజన ఆగుతుంది'
తిరుమల: విభజనపై బీజేపీ తన విధానం మార్చుకుంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఆపే శక్తి కేంద్రంలోని ప్రతిపక్ష బీజేపీకి ఉందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ యూటర్న్ తీసుకుంటే రాష్ట్రం విడిపోదని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు న్యాయం జరగాలంటే యూటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లేవారంతా అధికారం కోసమే వీడుతున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలు గౌరవవించకుంటే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. మంత్రుల బృందం (జీవోఎం)ను మరోసారి కలిసి తమ అభిప్రాయాలు తెలియజేయనున్నట్టు కృపారాణి వెల్లడించారు.