ముంబై: గత నెల(సెప్టెంబర్)లో ప్రయివేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ యూటర్న్ తీసుకున్నాయి. దీంతో పెట్టుబడులు సగానికి తగ్గాయి. 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన 4.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి అధికమే అయినప్పటికీ ఆగస్ట్‌లో 10.9 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక త్రైమాసికవారీగా చూస్తే క్యూ3(జులై–సెప్టెంబర్)లో 3.4 రెట్లు జంప్‌చేసి 25.3 బిలియన్ డాలర్లను తాకాయి. ప్రధానంగా స్టార్టప్‌లలో పెట్టుబడులు జోరందుకోవడం ప్రభావం చూపినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల లాబీ ఐవీసీఏ సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో స్టార్టప్‌ల వాటా 39 శాతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసింది.
పెట్టుబడులు, అమ్మకాలు ఇలా
ఈ ఏడాది(2021)లో పీఈ, వీసీ పెట్టుబడులు 70 బిలియన్ డాలర్లకు చేరగలవని ఈవై నిపుణులు వివేక్ సోనీ అంచనా వేశారు. ఇక పెట్టుబడి విక్రయాలు 50 బిలియన్ డాలర్లను తాకే వీలున్నట్లు పేర్కొన్నారు. మరో కన్సల్టెన్సీ దిగ్గజం గ్రాంట్ థార్న్‌టన్ భారత్ సైతం డీల్స్‌పై రూపొందించిన నివేదికలో క్యూ3లో 597 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. వీటి విలువ 30 బిలియన్ డాలర్లుగా మదింపు చేసింది. రియలీ్ట, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మినహాయిస్తే పీఈ, వీసీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 23 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఈవై నివేదిక పేర్కొంది.
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
Published Fri, Oct 15 2021 4:26 AM | Last Updated on Fri, Oct 15 2021 4:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment