funds collection
-
మార్కెట్ నుంచి రూ.9.5 లక్షల కోట్లు - ప్రైమ్‌డేటాబేస్ రిపోర్ట్
ముంబై: దేశీ కార్పొరేట్ సంస్థలు గతేడాది (2023) మార్కెట్ నుంచి రూ. 9.58 లక్షల కోట్ల నిధులు సమీకరించాయి. 2022తో పోలిస్తే ఇది 26 శాతం అధికం. అప్పట్లో కార్పొరేట్ బాండ్ల ద్వారా కంపెనీలు రూ. 7.58 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైమ్‌డేటాబేస్ క్రోడీకరించిన గణాంకాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో 863 సంస్థలు బాండ్లను జారీ చేయగా 2023లో ఈ సంఖ్య 920కి పెరిగింది. రుణాలకు డిమాండ్ పెరగడం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీపరంగా సవాళ్లు నెలకొనడంతో మార్కెట్ బాట పట్టే కార్పొరేట్ల సంఖ్య పెరిగిందని ప్రైమ్‌డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా తెలిపారు. గతేడాది ఆర్థిక సంస్థలు, బ్యాంకులు అత్యధికంగా రూ. 4.72 లక్షల కోట్లు సమీకరించాయి. 2022లో నమోదైన రూ. 3.66 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ఇక ప్రైవేట్ రంగం నిధుల సేకరణ రూ. 3.18 లక్షల కోట్ల నుంచి 40 శాతం పెరిగి రూ. 4.45 లక్షల కోట్లకు చేరినట్లు హల్దియా చెప్పారు. మార్కెట్ల నుంచి కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా 41 శాతంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2022లో ఇది 38 శాతమేనని వివరించారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. 2023లో మార్కెట్ నుంచి అత్యధికంగా నిధులు సమీకరించిన సంస్థల్లో హెచ్డీఎఫ్సీ (రూ. 74,062 కోట్లు), నాబార్డ్ (రూ. 63,164 కోట్లు), పీఎఫ్సీ (రూ. 52,575 కోట్లు), ఆర్ఈసీ (రూ. 51,354 కోట్లు), ఎస్బీఐ (రూ. 51,080 కోట్లు) ఉన్నాయి. ఈ ఐదు సంస్థలు కలిసి మొత్తం రూ. 2.92 లక్షల కోట్లు సేకరించాయి (గతేడాది మార్కెట్ల నుంచి కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో 31 శాతం). 2022లో టాప్ 5 ఇష్యూయర్లు రూ. 1.96,276 కోట్లు సేకరించాయి (ఆ ఏడాది కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో 26 శాతం). రూ. 5.61 లక్షల కోట్ల మొత్తానికి (దాదాపు 59 శాతం) కూపన్ రేటు 7–8 శాతంగా ఉండగా, 16 శాతం నిధులకు (రూ. 1.55 లక్షల కోట్లు) 8–9 శాతం శ్రేణిలో ఉంది. 2023లో 404 సంస్థలు తొలిసారి మార్కెట్ నుంచి సమీకరించాయి. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 408గా నమోదైంది. పబ్లిక్ బాండ్ల ఇష్యూలు 175 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు 44 ఇష్యూల ద్వారా రూ. 18,176 కోట్లు సమీకరించాయి. 2022లో 29 ఇష్యూల ద్వారా రూ. 6,611 కోట్లు సమీకరించాయి. దేశీ కంపెనీలు విదేశీ మార్కెట్ల నుంచి రూ. 3.29 లక్షల కోట్లు సమీకరించాయి. 2022తో పోలిస్తే ఇది 4 శాతం అధికం. -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: గత నెల(సెప్టెంబర్)లో ప్రయివేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ యూటర్న్ తీసుకున్నాయి. దీంతో పెట్టుబడులు సగానికి తగ్గాయి. 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన 4.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి అధికమే అయినప్పటికీ ఆగస్ట్‌లో 10.9 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక త్రైమాసికవారీగా చూస్తే క్యూ3(జులై–సెప్టెంబర్)లో 3.4 రెట్లు జంప్‌చేసి 25.3 బిలియన్ డాలర్లను తాకాయి. ప్రధానంగా స్టార్టప్‌లలో పెట్టుబడులు జోరందుకోవడం ప్రభావం చూపినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల లాబీ ఐవీసీఏ సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో స్టార్టప్‌ల వాటా 39 శాతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసింది. పెట్టుబడులు, అమ్మకాలు ఇలా ఈ ఏడాది(2021)లో పీఈ, వీసీ పెట్టుబడులు 70 బిలియన్ డాలర్లకు చేరగలవని ఈవై నిపుణులు వివేక్ సోనీ అంచనా వేశారు. ఇక పెట్టుబడి విక్రయాలు 50 బిలియన్ డాలర్లను తాకే వీలున్నట్లు పేర్కొన్నారు. మరో కన్సల్టెన్సీ దిగ్గజం గ్రాంట్ థార్న్టన్ భారత్ సైతం డీల్స్‌పై రూపొందించిన నివేదికలో క్యూ3లో 597 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. వీటి విలువ 30 బిలియన్ డాలర్లుగా మదింపు చేసింది. రియలీ్ట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మినహాయిస్తే పీఈ, వీసీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 23 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఈవై నివేదిక పేర్కొంది. -
నిర్మాతలకు ఆర్థికసాయం కోసం విరాళాల సేకరణ
చెన్నై : తమిళ చిత్ర నిర్మాతల మండలి విరాళాలు సేకరిస్తోంది. స్థానిక అన్నాశాలైలో గురువారం మండలి కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యవర్గం కొన్ని తీర్మానాలను చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. తొలిసారిగా శాసనసభ్యుడిగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో నిర్మాతలను ఆర్థిక సాయంతో ఆదుకోవడానికి నిధిని సేకరించాలని నిర్ణయించారు. సేవ దృక్పథం కలిగిన వారు ఆర్థిక సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నిర్మాతల మండలి కోశాధికారి ఎస్. చంద్రప్రకాష్ జైన్ రూ.10 లక్షల సాయాన్ని అందించారు. విడుదలలో సమస్యలను ఎదుర్కొంటున్న చిత్రాలను ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదల చేయడానికి సహకరించాలని తీర్మానం చేశారు. -
రూ.75 కోట్లతో గివ్ ఇండియా ఫండ్
న్యూఢిల్లీ: విరాళాల ప్లాట్ఫార్మ్ ‘గివ్ ఇండియా’ రూ.75 కోట్ల ఆరంభ విరాళంతో ‘ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్’ను (ఐసీఆర్ఎఫ్) ఆరంభించింది. కరోనా కల్లోలానికి కుదేలవుతున్న వారిని ఆదుకోవడానికి ఐసీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించామని గివ్ ఇండియా తెలిపింది. కనీసం కోటిమందికైనా సాయమందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బిల్‌గేట్స్‌కు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, గూగుల్.ఓఆర్జీ, హెచ్ఎస్బీసీ ఇండియా, మ్యారికో, ఉబెర్ ఇండియా తదితర సంస్థలు విరాళాలు అందజేశాయని గివ్ ఇండియా డైరెక్టర్ గోవింద్ అయ్యర్ తెలిపారు. ఐసీఐసీఐ విరాళం రూ.100 కోట్లు: కరోనా వైరస్ కల్లోలాన్ని తట్టుకోవడానికి దేశం జరిపే పోరాటంలో భాగంగా రూ.100 కోట్లు విరాళం ఇచ్చినట్లు ఐసీఐసీఐ గ్రూప్ తెలిపింది. పీఎమ్ కేర్స్ ఫండ్‌కు రూ.80 కోట్లు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు రూ.20 కోట్ల మేర విరాళాన్ని ఐసీఐసీఐ బ్యాంక్, దాని అనుబంధ సంస్థలు ఇచ్చాయని పేర్కొంది. శామ్సంగ్ విరాళం రూ.20 కోట్లు కరోనా కల్లోలాన్ని తట్టుకోవడానికి శామ్సంగ్ ఇండియా రూ.20 కోట్ల విరాళం ఇవ్వనుంది. దీంట్లో భాగంగా పీఎమ్–కేర్స్ ఫండ్‌కు రూ.15 కోట్లు, యూపీ, తమిళనాడు రాష్ట్రాలకు రూ.5 కోట్లు ఇస్తామని శామ్సంగ్ ఇండియా తెలిపింది. -
బెజవాడలో సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ
సాక్షి, విజయవాడ: సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఫుడ్ కోర్ట్ వరకు సాగిన ర్యాలీలో వివిధ కళాశాలల ఎన్సీసీ క్యాడేట్లు పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆర్మ్డ్ ఫోర్స్ ఫండ్‌కు అందరూ కాంట్రిబ్యూషన్ చేయాలని కోరారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన సైనికుల కుటుంబాలకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల నుంచి ఈ ఫండ్‌కు కాంట్రిబ్యూషన్ ఇచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. -
ఆసుపత్రి శుభ్రం చేసిన మంత్రి
ఆదిలాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ నిధుల సేకరణ కోసం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న కూలీగా మారారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో కూలీ పని చేశారు. ఖానాపూర్ చెరువులో మట్టిని ఎత్తి టిప్పర్‌లో పోసినందుకు కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి రూ.లక్ష కూలీగా ఇచ్చారు. అనంతరం పట్టణంలోని శ్రీనివాసా నర్సింగ్ హోంలో ఆసుపత్రి శుభ్రపర్చగా.. డాక్టర్ అశోక్, డాక్టర్ రమ దంపతులు రూ.లక్ష అందజేశారు. అనంతరం అయ్యప్ప అర్థోపెడిక్ ఆసుపత్రిని మంత్రి శుభ్రం చేసి డాక్టర్ అనిల్ చిద్రాల నుంచి రూ.50 వేలు కూలీ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిధుల సేకరణ వెంటనే సాధ్యం కాదు
* ‘రుణమాఫీ’పై చేతులెత్తేసిన సుజనా చౌదరి కమిటీ * కనీసం రెండు నెలల సమయం పడుతుందని వెల్లడి * రేపు బ్యాంకుల సీఎండీలతో ముఖ్యమంత్రి భేటీ * రూ.6 వేల కోట్ల వరకు చెల్లింపు ప్రతిపాదన! సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీకి నిధుల సేకరణపై సుజనా చౌదరి కమిటీ చేతులెత్తేసింది. ఇప్పటికిప్పుడు రుణ మాఫీకి అవసరమైన నిధులు సేకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. రెండురోజుల క్రితం ఈ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. నిధుల సేకరణకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయితే కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు నిధుల సమీకరణ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, కనీసం రెండు నెలల సమయం పడుతుందని కమిటీ చెప్పింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రుణ మాఫీకి బడ్జెట్ నుంచి రూ.4,250 కోట్లు విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో తెలంగాణ సర్కారు బాటలోనే పయనించాలని నిర్ణరుుంచింది. ఇందులో భాగంగా బ్యాంకుల సీఎండీలతో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో సీఎం కూడా పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. రైతుల వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ప్రభుత్వం అనుసరించనున్న విధానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపా రు. బడ్జెట్లో రుణ మాఫీ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించినందున ఈ ఏడాది ఆ మేరకు లేదా అదనంగా మరో వెయ్యి కోట్లు విడుదల చేస్తామని, బ్యాంకులు రైతులందరి రుణాలను రెన్యువల్ చేయూలని ముఖ్యమంత్రి కోరనున్నట్లు తెలిపారు. ఇలా ఏడాదికి కొంత మొత్తం చొప్పున నాలుగేళ్ల కాలంలో మొత్తం చెల్లిస్తామని పేర్కొననున్నారు. పంటల బీమా గడువుతో పాటు ఖరీఫ్ సీజన్ పూర్తిగా ముగిసిన తరువాత ఇప్పుడు ఎంతో కొంత చెల్లిస్తామనడం.. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో స్పష్టం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. రుణ మాఫీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌కు ఐదు నుంచి పదేళ్ల పాటు ఎక్సైజ్ ఆదాయాన్ని మళ్లిస్తామని, ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌కు బ్యాంకులు ఎంతవరకు అప్పులు ఇవ్వగలవో చెప్పాలని కూడా ప్రభుత్వం కోరనుంది. ఈ విషయంలో బ్యాంకులు నుంచి వచ్చే స్పందన ఆధారంగానే కార్పొరేషన్ ఏర్పాటుపై ముందడుగు వేయాలని నిర్ణరుుంచింది. ప్రణాళికేతర వ్యయంలో కోత వీలుకాదు! రైతుల రుణ బకాయిల్లో ఎంతో కొంత మొత్తం బ్యాంకులకు చెల్లించాల్సి ఉన్నందున ప్రణాళికేతర వ్యయంలో 15 శాతం మేర కోత విధించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ అం శంపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రణాళికేతర పద్దులో విద్యుత్ , బియ్యం సబ్సిడీలతో పాటు సామాజిక పింఛన్లు, ఉద్యోగుల జీత భత్యాలు, స్కాలర్షిప్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వంటివి ఉన్నాయని, ఈ రంగాలకే సరిపడా కేటాయింపులు చేయనందున ఇప్పుడు కోతలు పెట్టే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.