ఆసుపత్రి శుభ్రం చేసిన మంత్రి | Minister Ramanna cleans hospitals, paid lucrative Rs.2.5 lakh wage | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి శుభ్రం చేసిన మంత్రి

Published Mon, Apr 17 2017 7:33 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

ఆసుపత్రి శుభ్రం చేసిన మంత్రి

ఆసుపత్రి శుభ్రం చేసిన మంత్రి

ఆదిలాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ నిధుల సేకరణ కోసం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న కూలీగా మారారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో కూలీ పని చేశారు. ఖానాపూర్‌ చెరువులో మట్టిని ఎత్తి టిప్పర్‌లో పోసినందుకు కాంట్రాక్టర్‌ సుబ్బారెడ్డి రూ.లక్ష కూలీగా ఇచ్చారు.

అనంతరం పట్టణంలోని శ్రీనివాసా నర్సింగ్‌ హోంలో ఆసుపత్రి శుభ్రపర్చగా.. డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ రమ దంపతులు రూ.లక్ష అందజేశారు. అనంతరం అయ్యప్ప అర్థోపెడిక్‌ ఆసుపత్రిని మంత్రి శుభ్రం చేసి డాక్టర్‌ అనిల్‌ చిద్రాల నుంచి రూ.50 వేలు కూలీ అందుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనిషా, డీసీసీబీ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement