ramanna
-
కరోనా దెబ్బకు మావోల మాత్రల వేట
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత పట్టణాలు, పల్లెలకే కాదు.. దండకారణ్యానికి పాకుతోంది. అడవుల్లో ఉండే మావోయిస్టుల్లోనూ కరోనా భయం పెరిగిపోతోంది. దళసభ్యులు కరోనా వ్యాధి బారిన పడితే.. ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా మాత్రల కొనుగోలుపై దృష్టిపెట్టారు. లాక్డౌన్ ఎత్తివేసిన దరిమిలా..పలువురు మావోయిస్టులు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో పలువురు మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ కోసం పలు సమావేశాలు నిర్వహించగా పోలీసులు భగ్నం చేసి వారిపై కేసులు కూడా నమోదు చేశారు. జనారణ్యంలో తిరిగిన పలువురు మావోయిస్టులు దండకారాణ్యానికి వెళ్లాక జబ్బుల బారిన పడుతుండటం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. దీంతో అది కరోనా కావొచ్చన్న అనుమానంతో మందులు తెప్పించుకుంటున్నారు. పలు మారుమూల ప్రాంతాల్లో అనుమానాస్పద, కొత్త వ్యక్తులు కరోనా చికిత్సకు వాడే మందులను భారీగా కొనుగోలు చేస్తున్నారని, ఇలా సేకరించిన మందులు తెలంగాణతోపాటు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీజనల్ వ్యాధులా.. కరోనానా? ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ ప్రహార్ మొదలైంది. గోదావరిలో నీటి ప్రవాహలు పలు చోట్ల తగ్గడంతో మావోయిస్టులు పలువురు తెలంగాణలో తలదాచుకునేందుకు వచ్చారు. వారితోపాటు పలుయాక్షన్ టీములు వచ్చాయి. వారి కోసం పోలీసులు కూంబింగ్ జరిపారు. అదే సమయంలో లాక్డౌన్ తీవ్రతరం కావడం, జనాల కదలికలు పూర్తిగా ఆగిపోవడంతో మావోలూ ఆగిపోయారు. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం కొందరు రిక్రూట్మెంట్ కోసం పలువురిని కలిశారు. ఇలా కలిసిన వారిలో చాలామంది సభ్యులు ప్రస్తుతం జ్వరాల బారిన పడుతున్నారు. దీనికితోడు రుతుపవనాల వల్ల కురుస్తున్న వర్షాలతో జలుబు, దగ్గు, చలిజ్వరాలు వంటి సీజనల్ వ్యాధులూ మొదలయ్యాయి. ఫలితంగా తమలోనూ కరోనా వచి్చందేమోనన్న ఆందోళన మావోయిస్టుల్లో మొదలైంది. దీంతో సామాజిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు ధరిస్తున్నారు. అయితే, పరిశుభ్రత విషయంలో వీరికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం. దోమలు, అపరిశుభ్ర వాతావరణం వీరి ఆరోగ్యానికి ప్రతికూలంగా మారుతోందని తెలిసింది. అనుమానాస్పద వ్యక్తుల కారణంగానే.. ఆన్లైన్లో కరోనాకి వాడే మందుల వివరాలు లభ్యమవుతుండటంతో మావోయిస్టులు ముందు జాగ్రత్తగా ఆ మందులను సేకరిస్తున్నారు. సానుభూతిపరులు, కొరియర్ల ద్వారా మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు జ్వరం కోసం పారాసిటమాల్‌తోపాటు, జింక్, విటమిన్–డీ. విటమిన్–సీ మాత్రలు, యాంటిబయాటిక్స్, యాంటి వైరల్ డ్రగ్స్‌ను కొనుగోలు చేయిస్తున్నారు. ఇవన్నీ తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌లో ఉండే మావోలకు చేరుతున్నాయని సమాచారం. ఒక్కరి కోసం కాకుండా..ఎక్కువ మొత్తంలో కావడంతో ఆ సమాచారం పోలీసులకు వెళ్లింది. దీంతో వారంతా ఇప్పుడు ఆస్పత్రులు, మెడికల్ షాపులు, ఫార్మా డీలర్లపై నిఘా పెట్టారు. కేంద్ర కమిటీ సభ్యుడి భార్యకు కరోనా ఇటీవల గుండెపోటుతో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామన్న భార్య సుమిత్రకు కరోనా సోకింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మొదుకుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెహకావలి దండకారణ్యంలో ఆమెకు కరోనా వచ్చింది. ఈ విషయాన్ని మావోయిస్టు దండకారణ్య కమిటీ ఓ లేఖ ద్వారా వెల్లడించింది. దీంతో ఆమెను దళం నుంచి బయటికి పంపగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. -
మావో నేత రామన్న దంపతుల అరెస్టు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు నేత రామన్నను మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షాలో భార్య పద్మతో సహా అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయన దండకారణ్య జోనల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మావోయిస్టుల పత్రిక జన్కార్కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఆయనపై రూ.25 లక్షలు, భార్య పద్మపై రూ.6 లక్షలు రివార్డు ప్రకటించాయి. రామన్న అసలు పేరు, స్వస్థలం ఏది అనేది తెలియరాలేదు. -
రామన్న నేతృత్వంలోనే..!
దుమ్ముగూడెం(భద్రాచలం): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లపై చేసిన తాజా దాడి రాష్ట్రంలోని 4 జిల్లాలకు నేతృత్వం వహిస్తున్న దండకారణ్య కార్యదర్శి రామన్న సారథ్యంలోనే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. సుక్మా జిల్లా చింతల్నార్ వద్ద ఆరేళ్ల క్రితం 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బలితీసుకున్న మావోయిస్టుల దాడిలోనూ ఆయనే కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 40 ఏళ్ల క్రితం దండకారణ్యంలోకి ప్రవేశించిన రామన్న కీలకనేతగా ఎదుగుతూ వచ్చారు. ఛత్తీస్‌లో వామపక్ష తీవ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సల్వాజుడుం, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలతో విస్తృత కూంబింగ్ సాగిస్తున్నాయి. మూడేళ్ల నుంచి ధర్మపేట, గొల్లపల్లి, ఎలకనగూడెం, దుమ్ముగూడెం మండల సరిహద్దులోని పైడిగూడెం, గౌరారం గ్రామాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి గాలింపు జరుపుతున్నారు. గ్రామస్తులకు వివిధ రకాల సరుకులు, యువకులకు క్రీడా సామగ్రి ఇస్తూ వారిని ఆకర్షిస్తున్నారు. ఫలితంగా మావోల షెల్టర్ జోన్‌గా ఉన్న దండకారణ్యం కాస్తా పోలీసుల చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మావోయిస్టులు తమ మనుగడ కోసం వ్యూహాత్మకంగా పోలీసులపై మెరుపు దాడులకు దిగుతున్నారు. ఈ ఏడాది మార్చి 11న బెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసి 12 మందిని చంపేశారు. -
ఆసుపత్రి శుభ్రం చేసిన మంత్రి
ఆదిలాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ నిధుల సేకరణ కోసం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న కూలీగా మారారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో కూలీ పని చేశారు. ఖానాపూర్ చెరువులో మట్టిని ఎత్తి టిప్పర్‌లో పోసినందుకు కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి రూ.లక్ష కూలీగా ఇచ్చారు. అనంతరం పట్టణంలోని శ్రీనివాసా నర్సింగ్ హోంలో ఆసుపత్రి శుభ్రపర్చగా.. డాక్టర్ అశోక్, డాక్టర్ రమ దంపతులు రూ.లక్ష అందజేశారు. అనంతరం అయ్యప్ప అర్థోపెడిక్ ఆసుపత్రిని మంత్రి శుభ్రం చేసి డాక్టర్ అనిల్ చిద్రాల నుంచి రూ.50 వేలు కూలీ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలికపై పెదనాన్న దాష్టీకం
► ఐదు నెలలుగా అత్యాచారం ► గర్భం దాల్చిన వైనం ► కడుపులోనే శిశువు మృతి మండ్య : ఓ బాలికపై పెదనాన్నే అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా మళవళ్లి తాలూకా హలగూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హలగూరు గ్రామానికి చెందిన రామన్న(50), అతని తమ్ముడు పక్కపక్క ఇళ్లలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో తమ్ముడి కుమార్తె (14)పై రామన్న కన్నేశాడు. మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఐదు నెలలుగా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. గురువారం సాయంత్రం బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షించి బాలిక ఐదు నెలల గర్భిణీ అని, గర్భంలోనే శిశువు మృతి చెందిందని చెప్పారు. దీంతో వారు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత బాలికను మెరుగైన చికిత్స కోసం మండ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్)కు తరలించారు. సమాచారం అందుకున్న హలగూరు పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలిక నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ దుర్మరణం
కళ్యాణదుర్గం : వైద్యం కోసం వెళుతున్న ఆయన్ను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. కళ్యాణదుర్గం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబదూరు వీఆర్ఏ రామన్న (54) దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. రామన్నకు బీపీ, షుగర్ ఉన్నాయి. భార్య అక్కమ్మకు అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం ఆమెతోపాటు తనూ వైద్యం చేయించుకునేందుకు రామన్న శుక్రవారం డీజిల్ ఆటోలో కళ్యాణదుర్గానికి బయల్దేరారు. కళ్యాణదుర్గం సమీపంలోకి రాగానే పంది అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. డ్రైవర్ పక్కన కూర్చున్న రామన్నపై ఆటో మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కళ్లెదుటే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
బేస్ క్యాంపులపై మావోల దృష్టి?
రంగంలోకి అగ్రనేత రామన్న.. దుమ్ముగూడెం: ఓ పక్క మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో భారీగా సహచరులను కోల్పోవడం.. ఇంత కాలం తమకు షెల్టర్ ఇచ్చిన దట్టమైన అటవీ ప్రాంతాల్లో పోలీసులు బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు నేపథ్యంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మావోయిస్టు అగ్రనేత, దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి రామన్న రంగంలోకి దిగినట్లు సమాచారం. దండకారణ్యంలో ఉనికి కోల్పోవడానికి బేస్ క్యాంప్‌లే కారణమని భావిస్తున్న మావోరుుస్టులు.. వాటిని ఎలా అడ్డుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తమ మనుగడకు బేస్‌క్యాంపులు అడ్డుగా ఉన్నాయని భావిస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనేత రామన్న వాటిపై దాడి చేయడానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది గ్రహించిన పోలీస్ నిఘా వర్గాలు బేస్ క్యాంపుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిసింది. -
జాలి లేని దేవుడు
నిరుపేదలే అయినా వారి మధ్య ప్రేమానురాగాలకు కొదువ లేదు. పెళ్లైనప్పటి నుంచి ఆ దంపతులు ఒకరికి మరొకరు తోడై నిలిచారు. వీరి వైవాహిక జీవితంలో నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. పొద్దు పొడిచినప్పటి నుంచి పొద్దు గూకే వరకు ఆ ఇంటి పెద్ద దిక్కు కష్టపడే వాడు. భర్తకు తోడుగా ఆమె కూడా కూలీ పనులకు వెళ్లేది. అయితే ఏడాది కిందట భర్త అనారోగ్యంతో మరణించాడు. ఒకవైపు భర్త వియోగం..మరోవైపు పిల్లల భవిష్యత్తు ఆమెను కుంగదీశాయి. ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. అమ్మనైనా బతికించుకుందామనుకున్న ఆ బిడ్డల మొరను దేవుడు ఆలకించినట్టు లేడు. వారి నుంచి అమ్మనూ దూరం చేశాడు. ఆస్పరి: ఆస్పరిలోని ఇందిరానగర్‌కాలనీకి చెందిన చిన్నరామన్న(52), నీలమ్మ(48) దంపతులు. కూలినాలీ చేసుకుని తమ ఆరుగరు బిడ్డలతో జీవితాన్ని కొనసాగించేవారు. ఏడాది కిందట అనారోగ్యంతో చిన్నరామన్న మరణించగా, తాజాగా సోమవారం నీలమ్మ కూడా అనారోగ్యంతో కన్నుచూసింది. దీంతో వారి పిల్లలు రేణుక, తాయమ్మ, నాగమణి, శైలజతో పాటు పరశురాముడు, మహేశ్ దిక్కులేని వారయ్యారు. తల్లిని బతికించుకునేందుకు... పెద్ద దిక్కు లేని నీలమ్మ తమ బిడ్డలకు బడికి పంపేం దుకు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో పంపేది కాదు. ఇప్పుడిప్పుడే చేతికంది వస్తున్న ఇద్దరు కొడుకులను తన వెంట కూలి పనులకు పిల్చుకెళ్లేది. అంతలోనే ఆమె కూడా అనారోగ్యంతో మంచం పట్టింది. దీనికి తోడు ఏడు పదులు నిండిన పెద్దనాన్న పెద్దరామన్న పోషణ భారం కూడా వారిపైనే పడింది. తల్లికి వైద్యం చేయించేందుకు మరో మార్గం లేక ఆమె ఇద్దరు బిడ్డలను పగలంతా కష్టించి తెచ్చిన అరకొర డబ్బులతోనే వైద్యం చేయించేవారు. దీని కోసం వారు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేసేవారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. దేవుడు చిన్నచూపు చూశాడు. తమ తల్లి కష్టపడకపోయినా చాలు కళ్లముందుంటే చాలనుకున్న ఆ పిల్లల మొరను దేవుడు ఆలకించినట్టు లేడు. సోమవారం రాత్రి ఆమె కూడా భర్త చెంతకే వెళ్లిపోయింది. తమ తల్లి మృతదేహం వద్ద ఆ పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ‘దేవుడా ఎంత పని చేశావ్.. మాపై ఎందుకింత పగబట్టావ్.. ఏ పాపం ఎరుగని మాపైనా నీ పగ..? మా నాన్నాను తీసుకెళ్లింది చాలక ఇప్పుడు మా అమ్మనూ తీసుకెళ్తే మేం అనాథలుగా బతకాలా?’అంటూ నీలమ్మ బిడ్డలు పొగిలి పొగిలి ఏడ్వడం అక్కడికి వచ్చిన వారి కళ్లు ద్రవించేలా చేసింది. ప్రభుత్వమే ఆదుకోవాలి నీలమ్మ, చిన్నరామన్న మరణంతో అనాథలైన వారి ఆరుగురు పిల్లలను ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కాగా విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ దొరబాబు మంగళవారం గ్రామానికి చేరుకుని నీలమ్మ అంత్యక్రియల కోసం ఆ కుటుంబానికి తనవంతు సాయంగా ఆర్థిక సహయం అందించారు. -
ఉద్యమానికి ఉసెండి ద్రోహం చేశాడు: రామన్న
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి లొంగిపోయిన గుడ్సా ఉసెండి మావోయిస్టు విప్లవోద్యమానికి తీరని ద్రోహం చేశాడని మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్‌కమిటీ (డీకేజెడ్‌సీ) కార్యదర్శి రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న మండిపడ్డాడు. మీడియాకు ఆడియో క్యాసెట్ ద్వారా సోమవారం ఒక ప్రకటనను రామన్న విడుదల చేశాడు. సుదీర్ఘ కాలం మావోయిస్టు విప్లవోద్యమంలో కొనసాగిన ఉసెం డికి పార్టీ తగిన గుర్తింపునిచ్చిందని తెలిపారు. కానీ, రాజకీయంగా అనైతికతకు పాల్పడ్డ ఉసెండి ప్రభుత్వం విదిల్చే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి లొం గిపోయాడని ఆరోపించారు. అతని వెంట లొంగిపోయిన సంతోషి ఆయన భార్య కాదని, ఆమె మావోయిస్టు దళ సభ్యురాలని పేర్కొన్నారు. ఉసెండి మొ దటి భార్య సబిత గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిందని, తర్వాత పార్టీ అనుమతితో రాజీని పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం రాజీ మావోయిస్టు దళంలోనే కొనసాగుతున్నట్లు వెల్లడించారు.