బాలికపై పెదనాన్న దాష్టీకం
Published Sat, Mar 25 2017 5:54 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
► ఐదు నెలలుగా అత్యాచారం
► గర్భం దాల్చిన వైనం
► కడుపులోనే శిశువు మృతి
మండ్య : ఓ బాలికపై పెదనాన్నే అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా మళవళ్లి తాలూకా హలగూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హలగూరు గ్రామానికి చెందిన రామన్న(50), అతని తమ్ముడు పక్కపక్క ఇళ్లలో నివాసముంటున్నారు.
ఈ క్రమంలో తమ్ముడి కుమార్తె (14)పై రామన్న కన్నేశాడు. మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఐదు నెలలుగా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. గురువారం సాయంత్రం బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షించి బాలిక ఐదు నెలల గర్భిణీ అని, గర్భంలోనే శిశువు మృతి చెందిందని చెప్పారు. దీంతో వారు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత బాలికను మెరుగైన చికిత్స కోసం మండ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్)కు తరలించారు. సమాచారం అందుకున్న హలగూరు పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలిక నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement