
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు నేత రామన్నను మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షాలో భార్య పద్మతో సహా అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయన దండకారణ్య జోనల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
మావోయిస్టుల పత్రిక జన్‌కార్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఆయనపై రూ.25 లక్షలు, భార్య పద్మపై రూ.6 లక్షలు రివార్డు ప్రకటించాయి. రామన్న అసలు పేరు, స్వస్థలం ఏది అనేది తెలియరాలేదు.