సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి లొంగిపోయిన గుడ్సా ఉసెండి మావోయిస్టు విప్లవోద్యమానికి తీరని ద్రోహం చేశాడని మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్‌కమిటీ (డీకేజెడ్‌సీ) కార్యదర్శి రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న మండిపడ్డాడు. మీడియాకు ఆడియో క్యాసెట్ ద్వారా సోమవారం ఒక ప్రకటనను రామన్న విడుదల చేశాడు. సుదీర్ఘ కాలం మావోయిస్టు విప్లవోద్యమంలో కొనసాగిన ఉసెం డికి పార్టీ తగిన గుర్తింపునిచ్చిందని తెలిపారు.
కానీ, రాజకీయంగా అనైతికతకు పాల్పడ్డ ఉసెండి ప్రభుత్వం విదిల్చే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి లొం గిపోయాడని ఆరోపించారు. అతని వెంట లొంగిపోయిన సంతోషి ఆయన భార్య కాదని, ఆమె మావోయిస్టు దళ సభ్యురాలని పేర్కొన్నారు. ఉసెండి మొ దటి భార్య సబిత గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిందని, తర్వాత పార్టీ అనుమతితో రాజీని పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం రాజీ మావోయిస్టు దళంలోనే కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఉద్యమానికి ఉసెండి ద్రోహం చేశాడు: రామన్న
Published Tue, Jan 14 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement