రంగంలోకి అగ్రనేత రామన్న..
దుమ్ముగూడెం: ఓ పక్క మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో భారీగా సహచరులను కోల్పోవడం.. ఇంత కాలం తమకు షెల్టర్ ఇచ్చిన దట్టమైన అటవీ ప్రాంతాల్లో పోలీసులు బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు నేపథ్యంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మావోయిస్టు అగ్రనేత, దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి రామన్న రంగంలోకి దిగినట్లు సమాచారం.
దండకారణ్యంలో ఉనికి కోల్పోవడానికి బేస్ క్యాంప్‌లే కారణమని భావిస్తున్న మావోరుుస్టులు.. వాటిని ఎలా అడ్డుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తమ మనుగడకు బేస్‌క్యాంపులు అడ్డుగా ఉన్నాయని భావిస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనేత రామన్న వాటిపై దాడి చేయడానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది గ్రహించిన పోలీస్ నిఘా వర్గాలు బేస్ క్యాంపుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిసింది.
బేస్ క్యాంపులపై మావోల దృష్టి?
Published Thu, Nov 3 2016 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement