టీఆర్‌ఎస్ ప్లీనరీలో కేశవరావు
సాక్షి, మేడ్చల్: దేశ రాజకీయాల్లో సమూల మార్పు రావాలని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో ‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’ అనే మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్లీనరీ ద్వారా నూతక శకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. 14 సంవత్సరాల పాటు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా ఏర్పడిదంటే కారణం కేసీఆరేనని కొనియాడారు.
అన్ని రాష్ట్రాలను కేంద్రం ఒకే పద్ధతిలో చూడటం లేదని ఆరోపించారు. దేశం రాజకీయాల్లో సమూల మార్పు రావాలన్నారు. కొన్ని అంశాల్లో కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నిఎదుర్కోవడానికి ఫెడరల్ ఫ్రంట్‌గా ఏర్పడి ముందుకు పోవాలని సూచించారు. దేశ రాజకీయాల్లో సమైక్య స్ఫూర్తి వర్ధిల్లాలని, కేంద్ర నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. దేశంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కి అభినందనలు తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్‌కు అందరూ మద్దతు పలకాలని కేకే కోరారు. ఈ తీర్మానాన్ని ఎంపీ వినోద్ కుమార్‌తో పాటు టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ బలపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment