
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణయింది. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా తిరిగిన వారు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
దాన్యం కొనుగోలు అంశంపై ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ బృందంతో పాటు ఢిల్లీకి వెళ్లిన కేశవరావు తిరిగి వచ్చాక తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ బృందం సభ్యునిగా ఢిల్లీకి వెళ్లిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కరోనా బారిన పడటం తెలిసిందే.