trs pleanary
-
దేశం ముందుకు పోవాలంటే కొత్త రాజకీయ శక్తి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ‘ఈ దేశం సరైన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే, రాజ్యాంగం ఉన్నది ఉన్న ట్టుగా అమలు కావాలంటే, అంబేడ్కర్ స్ఫూర్తి నిజం కావాలంటే.. రాజ్యాంగంలో మౌలిక మార్పు లు చేర్పులు చేసుకుని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతో, కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవి ర్భవించాలి. సందర్భానుసారంగా స్పందించే దేశం ఇది. బుద్ధిగాలిన దేశం కాదు.. బుద్ధి జీవుల దేశం. తెలంగాణకు అవసరమైన నాడు గాలిదుమారం పుట్టించి టీఆర్ఎస్ వచ్చినట్టే.. దేశానికి అవసర మైన నాడు కూడా భూకంపం పుట్టించి, తుపాను సృష్టించి ఈ దుర్మార్గాలను తరిమివేసే ఒక శక్తి తప్పకుండా పుడుతుంది. అందులో టీఆర్ఎస్ కూడా ఉజ్వలమైన పాత్ర పోషిస్తుంది..’ అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం జరిగిన ప్లీనరీకి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏర్పాటు మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పోషించనున్న పాత్ర, రాష్ట్రంలో సంక్షేమ, సాగునీటి పథకాల గురించి వివరించారు. రాజ కీయ ఫ్రంట్లతో, ఎవరినో గద్దె దింపి, మరెవరికో అధికారం కట్టబెట్టాలనే లక్ష్యంతో కాకుండా ప్రజల జీవన స్థితిగతుల మార్పు కోసం దేశానికి ప్రత్యా మ్నాయ ఎజెండా కావాలని ఉద్ఘాటించారు. భారత ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉండాలన్నారు. అది దేశాన్ని అద్భుతమైన ప్రగతి పథంలో ముం దుకు తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఉపన్యాసం ఆయన మాటల్లోనే.. దేశం అన్నిరంగాల్లో నాశనమై పోయింది దేశం అన్ని రంగాల్లో నాశనమై పోయింది. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు పోయిన సర్కారే మంచిగా ఉండే.. అని మాట్లాడుతున్నారు. నిరుద్యో గం పెరిగింది. ఆకలి పెరిగింది. రైతులు ఇబ్బందు ల్లో ఉన్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా యి. పరిశ్రమలు మూతపడ్డాయి. ఇన్ని సమస్యలతో దేశం సతమతమవుతుంటే.. దీనిపై దృష్టి పెట్ట కుండా.. విద్వేషం.. ద్వేషం.. ఒక పిచ్చి రేపుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం అన్ని పార్టీలను ఏకతాటి పైకి తేవాలని ఇటీవల ఢిల్లీలో కొందరు నాతో అన్నారు. నేను కాదన్నాను. మార వలసింది ప్రభుత్వాలు కాదు. ప్రజల స్థితి గతులు. ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు.. కూటమి కాదు..ఎల్లయ్యను, మల్లయ్యను ప్రధానిని చేయడా నికి రాజకీయ ఎజెండా కాదు.. ప్రత్యా మ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలి. నూతన ఆర్థిక, వ్యవ సాయ, పారిశ్రామిక విధానం కావాలి. ఆ దారులు వెతకాలి. అందుకు అవసరమైన వేది కలు తయారు కావాలి. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి. దేశ పరిస్థితిపై చర్చ జరగాలి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు దాటినా.. ఇంకా ఒక రాష్ట్రంలో ఒక పూట తిండి తినే పరిస్థితి, రేషన్ బియ్యం ఇస్తే సంతోషించే స్థితి ఉండడం దౌర్భాగ్యం. 1980 వరకు భారత్ జీడీపీ చైనా కన్నా ఎక్కువ. 30 ఏళ్లల్లో చైనా ఎక్కడికి వెళ్లింది? ప్రపం చంలో రెండో అతిపెద్ద శక్తిగా ఎదిగింది. మన దేశం లో 44 కోట్ల ఎకరాల సాగుభూమి, నదులు, సహజ వనరులు ఉండి ఎందుకిలా ? దీనిపై చర్చ జరగాలి. తెలంగాణకు 11 రాష్ట్రాల నుంచి వలసలు 2000 సంవత్సరంలో నేను తెలంగాణ అని మాట్లా డితే.. ఏం పని లేదా అని కొందరు అన్నారు. సంకల్పంతో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఆ భగవంతు డికి దండం పెట్టి బయలుదేరి తెలంగాణ సాధిం చాం. అంతేకాదు.. సాధించిన తెలంగాణను దేశా నికి రోల్‌మోడల్‌గా నిలిచేలా చేశాం. పాలమూరు జిల్లాలో పల్లె పల్లె నుంచి ముంబైకి బస్సులు నడి చేవి. ప్రజలు వలసలు పోయేవారు. ఇవాళ వల సలు రివర్స్ అయ్యాయి. 11 రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వలసలు వస్తున్నారు. తెలంగాణలో పని పుష్కలంగా దొరుకుతోంది. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. జాతిపితను దూషించడమా..? జాతిపిత గాంధీని దూషిస్తున్నారు. ఏ దేశం కూడా ఇలాంటి దూషణలు చేయదు. ఇదేం దుర్మార్గం. స్వాతంత్య్రం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని దుర్భాషలాడటమా? ఆయనను చంపిన హంతకులను పూజించడమా? ఇదేం సంస్కృతి? ఎందుకు ఈ విద్వేషం. ఏం ఆశించి దీన్ని రగుల్చుతున్నారు. ఎందుకీ రకమైన మత పిచ్చి లేపుతున్నారు. మత విద్వేషాలు మంచిది కాదు. కుటిల రాజకీయాలు చేసి, పదవుల కోసం విధ్వంసం చేయడం తేలికనే. అరి కట్టాలంటే ఎంత శ్రమ కావాలి?. మతం పేరుతో దుర్మార్గపు రాజకీయాలు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరుకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుంది అక్కడ 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలున్నాయి. పరోక్షంగా మరో 30 లక్షల మంది బతుకుతున్నా రు. దీని వెనుక ఎంతో కృషి ఉంది. కానీ ఇటీవల హిజాబ్, హలాల్.. పూలు, పండ్లు కొనొద్దు అంటూ విద్వేషాలు రేపుతున్నారు. మతం పేరుతో దుర్మా ర్గపు రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎవరికీ మం చిది కాదు. అమెరికాలో మనోళ్లు 13 కోట్ల మంది ఉన్నారు. మీరు మా మతస్తులు, కులస్తులు కాదు అని పంపిస్తే ఈ కేంద్రం ఉద్యోగాలు ఇస్తదా? మహాత్ముడు కలలుగన్నది ఈ దేశమేనా? దేశ రాజధానిలో దేవుని పేరుమీద జరిగే ఊరేగింపులో కత్తులు, తుపాకులతో చెలరేగిపోయారు. ఈ భారతదేశమేనా మనకు కావాల్సింది. మహాత్ముడు కలలుగన్నది ఈ దేశమేనా? ఇదేనా ప్రజలు కోరుకు నేది. ఈ దేశం ఇట్లనే నాశనం కావాల్నా? లేక టీఆర్ఎస్గా మనం కూడా ఒక పాత్ర పోషిం చాల్నా? మన శక్తిని ప్రదర్శించి ఈ దుర్మార్గాన్ని నిలువరించి ఒక మార్గాన్ని చూపెట్టాల్నా? ఇలాంటి ప్రశ్నలు మన ముందున్నాయి. సింగపూర్‌కు ఉన్న తెలివి మనకు లేదు ఏమీ లేని సింగపూర్ అద్భుత ఫలితాలు సాధి స్తోంది. వాళ్లు మట్టిని కూడా ఇండోనేసియా నుంచి నౌకల్లో తెచ్చుకుంటారు. నీళ్లు కొనుక్కుంటారు. కూరగాయలు కూడా వాళ్ల దగ్గర పండవు. ఆ దేశంలో ఏమీ లేదు. కానీ అక్కడ ఎందుకంత అభి వృద్ధి జరిగింది? వాళ్లకు ఏమీ లేకున్నా తెలివి ఉం ది. మన దగ్గర అన్నీ ఉన్నా... వాటిని ఉపయోగిం చుకునే తెలివి లేదు. ఇది నిప్పులాంటి నిజం.. హేతుబద్ధమైన వాదం.. కఠోరమైన వాస్తవం. నీటి యుద్ధాలు ఎందుకు? దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉండే నీటిలభ్యత 65 వేల టీఎంసీలు. మరికొన్ని టీఎంసీల లెక్కలు తేలాల్సి ఉంది. 65 వేల టీఎంసీలకు గాను కేవలం 30 వేల టీఎంసీల లోపే దేశం వాడుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. కావేరి జలాల కోసం తమిళనాడు– కర్ణాటక మధ్య, సింధు–సట్లెజ్ నదీ జలాల కోసం పంజాబ్–హరియాణా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది? తాగు, సాగునీరు లేక దేశం ఎందుకు అల్లాడుతోంది? మనకు నీరు, ఖనిజ సంపద, అటవీ సంపద, మేథోసంపత్తి లేదా? ఎందుకు దేశం ఇలా కునారిల్లుతోంది? ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరముంది. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ 80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది సభ్యులతో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న పార్టీ టీఆర్ఎస్. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి, రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న పార్టీ. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరూ బద్ధలు కొట్టలేని కంచుకోట. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజలదే. ఇది ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు. దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే ఎవర్ని పట్టుకొని ఏడ్వాలో కూడా తెలవని పరిస్థితి. రాష్ట్ర అస్తి త్వమే ఆగమయైపోయే పరిస్థితి. ఒక దిక్కుతోచని సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగసిపడింది. అపజ యాలు, అవమానాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాం. అవార్డులు మన పనితీరుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు, అవార్డులు, రివార్డులే మన పని తీరుకు నిదర్శనం. నిన్న (మంగళవారం) విడుదల చేసిన అవార్డుల్లో దేశంలో అతి ఉత్తమమైన పది గ్రామాలు తెలంగాణవే అని కేంద్రం ప్రకటించింది. కేంద్రం నుంచి అవార్డు రానటువంటి విభాగం తెలంగాణలో లేదు. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాళ జలభాండాగారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామప్రాజెక్టు పూర్తి చేసుకుంటే తెలంగాణలో కరువు ఉండనే ఉండదు. చుట్టూ అంధకారంలో మణిదీపంలా తెలంగాణ ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. పంటలు ఎండి పోతున్నాయి. మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. ఇలా చుట్టూ అంధకారం ఉంటే తెలంగాణ మాత్రం ఒక మణిదీపంలా వెలుగుతున్నది. ఏడేళ్ల క్రితం మనకు కూడా కరెంట్ కోతలే. కానీ మనం ఆ సమస్యను అధిగ మించాం. వెలుగు జిలుగుల తెలంగాణగా తీర్చి దిద్దుకున్నాం. తెలంగాణలా దేశం పని చేసి ఉంటే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబై నుంచి కోల్‌కతా వరకు 24 గంటల కరెంట్ ఉండేది. దళితబంధు... ప్రపంచానికే ఆదర్శం అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే స్థిరమైన నిర్ణయంతో, అవగాహనతో.. ఈ దేశానికే పాఠం నేర్పే బృహత్తరమైన కొత్త సిద్ధాంతానికి శ్రీకారం చుడుతున్నాం. ఓట్ల కోసం కాకుండా.. అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని సృష్టించే విధంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఇది దేశానికి, ప్రపంచానికే ఆదర్శంగా నిలవబోతుంది. పదిహేడున్నర లక్షల దళిత కుటుంబాలకు దశల వారీగా పది లక్షల ఆర్థిక సాయం అందజేస్తాం. ప్రభుత్వ లైసెన్స్‌లు ఇచ్చే అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ఆ గవర్నర్ ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.. మహారాష్ట్ర ప్రభుత్వం 12 మంది ఎమ్మెల్సీల కోసం కేబినెట్ తీర్మానం చేసి పంపిస్తే గవర్నర్ ఒక ఏడాది పాటు ఆయన దగ్గర్నే పెట్టుకు న్నాడు. తమిళనాడు అసెంబ్లీ బిల్లు పాస్ చేసి పంపిస్తే ఆ రాష్ట్ర గవర్నర్ వింత ధోరణితో ప్రవర్తించాడు. బెంగాల్, మహా రాష్ట్ర, తమిళ నాడు, కేరళలో గవర్నర్ల పంచా యితీ ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రజలకు మంచి పని చేయాలని భావిం చారు. 200 మంది ఎమ్మెల్యేలతో అధికారం లోకి వచ్చారు. కానీ దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియో గించి, స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ ఆర్‌ను పదవి నుంచి తొలగించారు. కానీ ఏం జరిగింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి.. తిరిగి ఎన్టీ ఆర్‌ను అదే సింహాసనం మీద కూర్చో బెట్టారు. ఎన్టీఆర్‌తో దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ గవర్నర్.. అవమానం పడి ఇక్కడ్నుంచి తొలగించబడ్డారు. దాన్నుంచి ఈ దేశం గుణపాఠం నేర్చుకోవాలి. ప్రజల కోసం రాజ్యాంగమా? లేక దానికి ఉల్టానా? పల్లెలకు శోభ తెచ్చాం.. కఠిన నిర్ణయం తీసుకుని తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాం. హరితహారంలో 85 శాతం మొక్కలు దక్కకుంటే టీఆర్ఎస్ వారైనా సర్పంచ్, గ్రామ కార్యదర్శి ఉద్యోగాలు పోతాయని చెప్పాం. పల్లె ప్రగతి పేరిట ఏటా రెండు, మూడు సార్లు డ్రైవ్ పెట్టాం. మంత్రులు, ఎమ్మెల్యేలను దీనిలో భాగస్వామ్యం చేశాం. అందుకే ఈ ఫలితాలు వచ్చాయి. మన దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. అన్నిరంగాల్లో నాశనమై పోయింది. అనేక సమస్యలతో సతమతమవుతోంది. లక్ష్యం లేని దేశం గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ 40 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులే ఉన్నాయి. ఇవి మారాలి. దేశం లక్ష్యం ప్రజల సామూహిక లక్ష్యం కావాలి. పట్టుదలతో పురోగతి సాధించాలి. జాతిపిత గాంధీని దూషిస్తున్నారు. ఎందుకీ విధమైన మతపిచ్చి లేపుతున్నారు. మతం పేరిట దేశంలో సాగుతున్న విద్వేష పూరిత రాజకీయాలకు ఫుల్స్టాప్ పడాలి. దేశానికి కావలసింది కత్తుల కోలాటాలు, తుపాకుల చప్పుళ్లు కాదు... కరెంటు, సాగునీరు, తాగునీరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో అందరూ సమానత్వంతో జీవించే పరిస్థితులు. – కేసీఆర్ ప్లీనరీలో 13 తీర్మానాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వ హించిన ప్లీనరీలో 13 తీర్మానాలను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రవేశ పెట్టారు. వాటిని మరి కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు బలపరిచారు. ఆ తీర్మానాలు ఏమిటంటే... ► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన. ►దేశ విస్తృత ప్రయోజనాలరీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక భూమిక పోషించాలి. ►ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తున్న కేంద్రం వైఖరిని నిరసించాలి. ధరలు నియంత్రించాలి. ►చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించి అమలు చేయాలి. ►దేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. ►బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీ వర్గాల జనగణన జరపాలి. ►తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ చేసిన బిల్లును కేంద్రం ఆమోదించాలి. ►రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలి. డివిజిబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలి. ►నదీజలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిర్ణయించాలి. ఈ మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం సూచించాలి. ►రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలి. ►రాష్ట్రంలో నవోదయ విద్యాలయా లను, వైద్య కళాశాలలను కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలి. ►దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ►చేనేత వస్త్రాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలి. టీఆర్ఎస్ ప్లీనరీ సైడ్‌లైట్స్.. ► ప్లీనరీ వేదికకు సమీపంలో టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ అతిథులను కట్టిపడేసింది. ► సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రదర్శించిన లఘు చిత్రం ఆకట్టుకుంది. ► కాళేశ్వరం ప్రాజెక్టుపై డిస్కవరీ చానల్లో ప్రసారమైన డాక్యుమెంటరీనిప్రదర్శించారు. ► ధూం..ధాం కళాకారులు పాడిన పాటలు అందరిలో జోష్ నింపాయి. ► సీఎం కేసీఆర్ ఉదయం 11:06 గంటలకు వేదికపైకి రాగానే దేశ్ కీ నేత కేసీఆర్ నినాదాలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. కేటీఆర్ మాట్లాడుతుంటే కార్యకర్తల నినాదాలు హోరెత్తాయి. ► వేదికపై కేసీఆర్ ముందుగా పార్టీ పతాకం ఆవిష్కరించారు. అనంతరం అమరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లికి పూలు సమర్పించారు. ► కేసీఆర్ ప్రసంగం సమయంలో ఒక కార్యకర్త విజిల్ వేయగా.. ఈలల గోల ఏమిటంటూ చురకలంటించారు. ► ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తన ప్రసంగంలో పిట్టకథలు చెప్పగా అందరూ కథలు చెబితే సభాసమయం సరిపోదని కేసీఆర్ అన్నారు. ► పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచన మేరకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ► కొందరు పార్టీ వీరాభిమానులు ఒంటిపై కేసీఆర్, కేటీఆర్ పేర్లను రంగులతో రాసుకుని సభాప్రాంగణంలో కలియ దిరిగారు. సిద్దిపేటకు చెందిన గజిబిన్కర్ మనోహర్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫొటోలు, ప్రభుత్వ పథకాలతో కూడిన ఫ్లెక్సీలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తెలంగాణ భవన్లో... ► తెలంగాణ భవన్లో 40 అడుగుల పార్టీ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి గుర్రం పవన్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 21 కిలోల కేక్‌ను కేటీఆర్ కట్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
GHMC: మేయర్ సహా మంత్రులకు జీహెచ్ఎంసీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ నుంచి ట్విట్టర్ ద్వారా ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఇతర నిబంధనల అతిక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(సీఈసీ) ఫిర్యాదుల స్వీకరణను పునరుద్ధరించింది. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేందుకు, వారికి పెనాల్టీలు వేయకుండా ఉండేందుకేనని ప్రజల నుంచి ముఖ్యంగా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సర్వర్ అప్డేషన్ కోసమని సీఈసీ పేర్కొన్నా ప్రజలు విశ్వసించలేదు. ప్రతిపక్ష రాజకీయపార్టీలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. ► తాజాగా ట్విట్టర్ ఖాతా తెరిచి ఇన్ని రోజుల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ చలానాలతో పెనాల్టీలు విధించారు. ఈ పెనాల్టీల విధింపులో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. పెనాల్టీల విధింపు ఇంకా కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు జారీ అయినా పెనాల్టీల్లో ఆయా నాయకులకు పడ్డ మొత్తం పెనాల్టీలు దాదాపుగా దిగువ విధంగా ఉన్నాయి. (వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్) ► ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో ఫ్లెక్సీల ఏర్పాటుకు ఈ పెనాల్టీలు విధించారు. అందరికంటే ఎక్కువగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.3 లక్షలకు పైగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.1.60 లక్షలకు పైగా పెనాల్టీలు పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట రూ.2.20 లక్షలు, మంత్రి చామకూర మల్లారెడ్డికి రూ.10 వేలు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావుకు రూ.10 వేలు, కాలేరు వెంకటేశ్‌కు రూ.25 వేలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి రూ.60వేలు పెనాల్టీలు పడ్డాయి. కార్పొరేటర్ రాగం సుజాత రూ.2 లక్షలు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?) -
కేసీఆర్.. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడావో..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాలు, ఇతర ఉద్యమకారులు, వ్యవస్థల మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలకు మాత్రమే ఆయన పరిమితం అవుతున్నారని విమర్శించారు. ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ తీవ్రంగా ఖండిచారు. ఆయనే గొప్ప అనే విధంగా కేసీఆర్ భాష్యం ఉంటోందన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లోకి రాక ముందు సరిహద్దులో యుద్ధవిమానాల పైలట్‌గా చేయడం తన అదృష్టమని ఉత్తమ్ చెప్పారు. ప్రజా జీవితంలో నిస్వార్ధంగా పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ మీద పడి దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ‘నేను, నా భార్య ప్రజా జీవితానికి అంకితం అయ్యాం. మాకు పిల్లలు లేరు. కుటుంబం లేదు. ఇద్దరం ప్రజా జీవితానికే అంకితం అయ్యాం. కేసీఆర్ నీ లాగా.. క్యారెక్టర్ లేని పనులు చేసి రాజకీయాల్లోకి రాలేదు నేను. మళ్ళీ పిచ్చి, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఎక్కువ తెలివి ఉపయోగించకు. 500 కోట్ల రూపాయల జాగాలో 60 కోట్ల రూపాయలు పెట్టి ఎవడబ్బ సొమ్మని ప్రగతి భవన్ కట్టావ్. సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది కదా. మీ అబ్బ సొత్తు కాదు. జవాబుదారీ తనం ఉండాలి. దేశం ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి ఇల్లు కట్టుకోలేదు. ప్రధాని ఇల్లు కూడా ఇట్లా ఉండదు. ప్రజల సొమ్ము దుబారా చేస్తూ.. విలాస జీవితం అవసరమా?. విలాసమైన ఇల్లు, కోట్ల రూపాయల కార్లు.. అంత పెద్ద విలాసవంతమైన ఇల్లు,మన సొమ్ముతో పెళ్లి, పేరంటాలకు ప్రైవేట్ జెట్ విమానాల్లో వెళ్తున్నారు. పనికిరాని చైనా ట్రిప్‌కి ప్రైవేటు జెట్ విమానాలు అవసరమా?. చనిపోయిన రైతులకు, అమరవీరులకు ఇవ్వడానికి పైసలు ఉండవు. సబ్సిడీ ఇవ్వడానికి, బీసీలు, ఎస్సి, ఎస్టీలకు భూమి ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులుండవు. ప్రజల సొమ్ము కోసం ప్రశ్నించడం ప్రతిపక్ష కర్తవ్యం. కేసీఆర్ తెలంగాణా ముసుగులో అవినీతికి పాల్పడుతోంది. బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, దోపిడీ దార్లు మాత్రమే ప్రగతి భవన్ వస్తున్నారు. సామాన్య ప్రజలకు ఎంట్రీ లేదు. తెరాస ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేదు. సినిమా వాళ్లకు, బ్రోకర్లకు తాకట్టు పెడుతున్నారు. సంచులు మోసేది మీరా? మేమా?. ఎన్ని గదులున్నాయో నీకే తెలుసు. లక్ష స్క్వేర్ ఫీట్లలో ఇల్లు కట్టావా? లేదా?. సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చింది. ఫెడరల్ ఫ్రంట్ అంట ఈయన తీస్మార్ ఖాన్ అంట. చైనాను మనల్ని పోల్చుతారా. ఇక్కడ పరిస్థితి ఏమిటో తెలుసా?. తెలంగాణలో టీఆర్ఎస్కే ఎంపీ సీట్లు రావు. ఇంకా ఫెడరల్ ఫ్రంట్ ఏందీ?. తెలంగాణను ఏం ఉద్ధరించావో చెప్పు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ 4 నెలల్లో ఇస్తాం అని అన్నారు. 4 ఏళ్లు గడచిపోయాయి. కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదు. ఇప్పటివరకూ 10 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా కట్టలేదు. ప్లీనరీ సందర్బంగా చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను బొంద పెట్టడం ఖాయం. దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం పెట్టు చాలు. క్యాంపస్‌లోకి పోలేని వ్యక్తి.. దేశాన్ని నడుపుతాడట.’ అంటూ ఉత్తమ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. -
ప్లీనరీకి తరలిన టీఆర్ఎస్ నాయకులు
సంస్థాన్‌నారాయణపురం : హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీకి మండల కేంద్రం నుంచి పలువురు టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బోల్ల శివశంకర్, పాశం ఉపేందర్‌రెడ్డి, చండూరు మార్కెట్ చైర్మన్ కరంటోతు జగ్రాంనాయక్, రాచకొండ రాజు, నలపరాజు రమేష్, కడ్తాల కృష్ణ, సుర్వి యాదయ్య, వీరమళ్ల వెంకటేష్, పందుల శంకరయ్య ఉన్నారు. మోత్కూరు : హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీని శుక్రవారం మోత్కూరు నుంచి పలువురు నాయకులు తరలివెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొణతం యాకూబ్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పొన్నెబోయిన రమేష్, ఎంపీటీసీ జంగ శ్రీను, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ కొండ సోమల్లు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు బయ్యని పిచ్చయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు దబ్బటి శైలజ, పట్టణ అధ్యక్షురాలు కట్ట ఇంద్రజ్యోతి, మార్కెట్ డైరెక్టర్ బొల్లపల్లి వెంకటయ్య, ఓయూ జేఏసీ నాయకులు మర్రి అనిల్, నాయకులు నర్సింహ తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ : హైదరాబాద్‌లోని కొంపెల్లిలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి మండలంలోని టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం భారీగా తరలి వెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ వెస్ చైర్మన్ చిరందాసు ధనుంజయ, గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్, ముత్యాల భూపాల్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, గుండెబోయిన అయోధ్య, ముప్పిడి శ్రీనివాస్, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, కొత్త పర్వతాలు, జింకల కృష్ణ, సుర్వి మల్లేష్, ఎండి.బాబాషరీఫ్, వీరమళ్ల సత్తయ్య, డీఆర్. రాము, బొడిగె బాలకృష్ణ, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, శంకర్, ఖలీల్ ఉన్నారు. రామన్నపేట : హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీకి రామన్నపేట నుంచి పలువురు నాయకులు శుక్రవారం తరలివెళళ్లారు. పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ప్లీనరీకి వెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు గంగుల వెంకటరాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, బందెల రాములు, బత్తుల కృష్ణగౌడ్, గంగుల కృష్ణారెడ్డి, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, ఆకవరపు మధుబాబు, ముక్కాముల దుర్గయ్య, రామిని రమేష్, గుత్తా నర్సిరెడ్డి, జెల్లా వెంకటేశం, ఎడ్ల మహేందర్‌రెడ్డి, నంద్యాల భిక్షంరెడ్డి, లక్ష్మణ్, ఎండీ నాజర్, పురుషోత్తంరెడ్డి ఉన్నారు. -
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తా
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, మా ఎమ్మెల్యేలంతా వజ్రాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కితాబిచ్చారు. బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌లో ఉన్న వారందరూ తెలంగాణ బిడ్డలేనని వ్యాఖ్యానించారు. కొంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్, బీజేపీలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. కేసీఆర్ ఇప్పటికే దీనిపై పథకం రూపొందించామన్నారు. ఈ 29న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఈ దేశం మరికొన్ని నెలల్లో సరికొత్త పాలనను చూడబోతుందన్నారు. కర్ణాటకలో ఎన్నికలు రాగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కావేరీ జలాల విషయమై కొత్త నాటకాలకు తెర తీశారంటూ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం చేతగానితనంలోనే నీటి సమస్యలు కొనసాగుతున్నాయని.. 'ప్రతి రైతుకు నీళ్లు.. ప్రతి ఎకరాకు నీళ్లు' అనేది ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యమని కేసీఆర్ వెల్లడించారు. 'తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. దేశంలో రోజు మొత్తం కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. విద్యుత్ సరఫరాపై కొందరు కావాలనే విమర్శిస్తున్నారు. 2 వేల కోట్ల రూపాయలతో తాగునీటి సమస్యను పరిష్కరించాం. హైదరాబాద్‌లో ఇప్పుడు తాగునీటి సమస్య లేదు. భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తి చేశాం. త్వరలో పాస్‌బుక్‌లు రైతులకు అందజేస్తాం. రిజిస్ట్రేషన్ల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. త్వరలో ధరణి పేరుతో కొత్త విధానం తీసుకొస్తాం. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు లేకుండా చేశాం. తెలంగాణ వ్యాప్తంగా సారాను నిర్మూలించాం. గొర్రెల పథకం విజయవంతం అయింది. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అభివృద్ధి నిధులు అందజేశామని' సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
‘హైదరాబాద్ కేంద్రంగా భూకంపం పుట్టిస్తా’
సాక్షి, హైదరాబాద్ : దేశానికి ఏదో చేయాలనే ఆలోచన నుంచి పుట్టిన ఫెడరల్ ఫ్రంట్ ఓ ప్రకంపనలా జాతీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోందని పార్టీ ప్లీనరీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. కూనగా ప్రస్థానాన్ని ఆరంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) దేశ రాజకీయాల గురించి ఆలోచించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ‘ప్రాణం బక్కపలుచనిదైనా దేశానికి ఏదో చేయాలనే తపన. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత కేసీఆర్ అంటే ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌లకు భయం పట్టుకుంది. మొండివాడు కదా.. పట్టుకుంటే వదలడని వారి భయం. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషించాలని, నేను నాయకత్వం వహించాలని నాయకులు కోరారు. నన్ను నాయకుడిగా తీర్మానించారు. గత ఏడాదిన్నర నుంచి కేంద్రం ప్రభుత్వ వైఖరిని చూసిన తర్వాత ఈ దేశంలో జరగవలసింది జరగడం లేదు అని అర్థమైంది. ఈ మాట నేను ఆషామాషీగా చెప్పడం లేదు. ఎన్నో కఠోరమైన విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. నాకు 64 ఏళ్ల వయసు వచ్చింది. అందరం కలసి తెలంగాణ సాధించుకున్నాం. మా పని మేం చేసుకుంటూ వెళ్తున్నాం. లోటు లేకుండా ఉన్నాం. కానీ ఇక్కడ పుట్టాం కాబట్టి దేశం బాగు కోసం కూడా పోరాడాలి అనిపించింది. ఈ దేశానికి మంచి దారి చూపించడానికి ప్రయత్నిస్తాం. ఎవరికి భయపడం. కేసీఆర్ మోదీ ఏజెంట్ అని రాహుల్, మీ ఫ్రంట్‌కు టెంటే లేదు అని మోదీ అంటున్నారు. మాకు టెంటే లేనప్పుడు మీకు భయం దేనికి?. సిగ్గపడాలి స్వతంత్రం వచ్చి 71 ఏళ్లు గడిచాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 66 ఏళ్లు పాలించింది. 11 ఏళ్ల పాటు బీజేపీ, ఐదున్నర ఏళ్ల పాటు వేరే ప్రధానులు ఉన్నారు. వాళ్లను కూడా ఈ పార్టీలు బతకనివ్వలేదు. ఒకరితో విసుగొస్తే మరొకరికి పట్టం కడతారు ప్రజలు అనే విధంగా కాంగ్రెస్, బీజేపీల ఆలోచనా ధోరణి ఉంది. అదే వీళ్లకు బాగా అలవాటు అయిపోయింది. కాంగ్రెస్, బీజేపీల నిషా నుంచి దేశ ప్రజలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవం ఏంటో అందరూ తెలుసుకోవాలి. కర్ణాటకలో ఎన్నికల వల్ల కావేరి నీటిపై వివాదం నడుస్తోంది. కావేరి వివాద పరిష్కారంపై బీజేపీ అసలు ఆలోచించడం లేదు. ఏంటని ప్రశ్నిస్తే దేశంలో నీటి యుద్ధాలు ఎప్పటినుంచో ఉంటున్నాయని సమాధానం ఇస్తున్నారు. మన దేశంలో 65,500 టీఎంసీల నీరు నదుల్లో ఉంది. హిమనీ నదాల ద్వారా 3 వేల టీఎంసీలు, భూటాన్ ప్రాంతం నుంచి మరో 3 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నిజాయితీ ఉంటే నా ప్రశ్నకు కేంద్రం జవాబు చెప్పాలి. నన్ను విమర్శించే ముందు 70 వేల టీఎంసీల నీరు లభ్యత ఉంటే మీరేం చేస్తున్నారో చెప్పండి. కేవలం 40 కోట్ల ఎకరాల్లో దేశవ్యాప్తంగా పంటలు పండుతున్నాయి. దేశంలో లభ్యత ఉన్న నీటిని ధర్మం ప్రకారం పంచితే 30 వేల టీఎంసీల నీరు మిగులుతుంది. పారిశ్రామిక అవసరాలను 5 వేల టీఎంసీలు వాడినా.. మిగులు 25 వేల టీఎంసీలు ఉంటుంది. నీటి వివాదాలపై ఏర్పాటు చేస్తున్న ట్రైబ్యునల్స్ తీర్పులకు దశాబ్దాల పాటు సమయం పడుతోంది. ఈ లోగా జనరేషన్లు మారిపోతున్నాయి కానీ కష్టాలు తీరడం లేదు. ట్రైబ్యునల్ ఏర్పాటుకు ముందు 6 నెలల్లో తీర్పు ఇవ్వాలని కేంద్రం ముందు చెప్పకూడదా?. చెప్పరు. రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడానికి ఇలా చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ‘హర్ ఎకర్ మే పానీ.. హర్ కిసాన్ కే పానీ’ అనే నినాదంతో దేశ ప్రజల్లోకి వెళ్తుంది. దేశంలో దీన్ని అమలు చేసి చూపిస్తాం. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి నడుంబిగిస్తోంది కాచుకోండి. కాంగ్రెస్, బీజేపీ డైలాగ్స్ వింటే పెద్దగా ఉంటాయి. అంతర్జాతీయ సరుకులు రవాణా చేసే లారీ ఎక్స్‌ప్రెస్ హైవేలపై విదేశాల్లో 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. మన తెలివికి 26-36 కి.మీ వేగంతో వెళ్తున్నాయి. చైనాలో లక్ష 23 వేల కి.మీ దూరం పాటు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఉంటే.. మనదేశంలో మాత్రం 2 వేల కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి. ఎవరి అసమర్ధత ఇది?. ఎవరి చేతగానీ తనం ఇది?. గూడ్స్ రైళ్ల వేగం చైనాలో గంటకు 80 కిలోమీటర్లు. మనదేశంలో కేవలం 24 కిలోమీటర్లు. ఇది మనవాళ్ల ప్రతిభ. మనదేశంలో లక్షదీవులు ఉన్నా.. టూరిజం కోసం విదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి. విదేశాలు ఇక్కడ ఎన్జీవోలకు డబ్బు ఇచ్చి పిల్స్ వేయిస్తే.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం మనకు చేత కావడం లేదు. హైదరాబాద్‌లో సగం ఉండే సింగపూర్‌లోని పోర్టులో 4 కోట్ల కంటైనర్లను హ్యాండిల్ చేస్తారు. మన పక్క దేశం చైనా 19 కోట్ల కంటైనర్లను పోర్టుల్లో హ్యాండిల్ చేస్తోంది. మనకు ప్రకృతి సిద్ధంగా అద్భుతమైన పోర్టులు ఉండి కూడ ఒక కోటి కంటైనర్లను కూడా హ్యాండిల్ చేయలేని దుస్థితి. కేవలం 87 లక్షల కంటైనర్లను హ్యాండిల్ చేస్తున్నాం. దుఃఖం కలిగేది ఎక్కడంటే ప్రజలకు స్టోరీలు చెబుతూ.. ‘గరీబీ హఠావో’ లాంటి పనికిమాలిన నినాదాలు ఇవ్వడం. చైనా వాళ్లు బంగారం ఏమైనా తింటున్నారా?. 1968లో భారత ఆర్థిక వ్యవస్థ 180 బిలియన్ డాలర్లు. 2016లో చైనా ఆర్థిక వ్యవస్థ 9,504 బిలియన్ డాలర్లు. మనం ఆర్థిక వ్యవస్థ కేవలం 2,405 బిలియన్ డాలర్లు. ఈ మూడు దశాబ్దాల్లో మనం ఏం చేస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ, ఆరోగ్య శాఖలు కేంద్ర ప్రభుత్వానికి దేనికి?. అవి మీ దగ్గర ఎందుకు ఉండాలో ఒక్క కారణం చెప్పండి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పథకం ఉంది ఎక్కడో నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామంలో ప్రధానమంత్రి వచ్చి పలుగు, పార చేతబట్టి రోడ్డు వేస్తారా?. మరి ఇక్కడి నాయకులు ఏం చేయాలి. వ్యవసాయం ఆయా ప్రాంతాలను బట్టి ఉంటుంది. కేంద్రానికి వ్యవసాయంతో పనేంటి. దేశ రక్షణపై, అంతర్జాతీయ దౌత్యంపై కేంద్రం దృష్టి పెట్టాలి. దాదాపు 5 లక్షలకు పైగా సైనికులు రోజు అట్టుడుకుతున్న కశ్మీర్లో దేవుడా అంటూ పని చేస్తున్నారు. మీ సత్తా అక్కడ చూపించండి. అన్ని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల పారదర్శకత లోపిస్తుంది. విదేశాల్లో రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయి. మన సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్తే కంపు కొడుతుంటుంది. మనకు ఇదే వైకుంఠం. ఇదే కైలాసం. దేశంలో ఏ ఎయిర్‌పోర్టుకు పోయినా రన్ వేలు లేవు. గంటల కొద్దీ విమానం గాలిలో తిరగాలి. అనవసరమైన అసమర్ధ విధానాలు ఈ దేశంలో కొలువుదీరి ఉన్నాయి. మన దేశం ఏ రంగంలో బావుంది చెప్పండి. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చంద్రస్వాములు, స్వాములు, సన్నాసులు, ఆశారాంలు, డేరాలు, నీరవ్, లలిత్మోడీలను పెంచి పోషించాయి. ఇదంతా మన కర్మ. ఇంత చేసినా మళ్లీ ఆహా కాంగ్రెస్, ఓహో బీజేపీ అని డబ్బా కొట్టాలా?. ఇవి సాగవు. త్వరలో స్టాలిన్, అఖిలేఖ్లతో భేటీ.. అతి త్వరలో డీఎంకే నాయకుడు స్టాలిన్‌ను కలబోతున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు. దేశం మొత్తం పక్షిలాగా తిరిగి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్‌తో గుణాత్మక మార్పులు తెస్తామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ సాధన అనంతరం దేశం కోసం పోరాడటానికి డైమండ్స్ లాంటి నాయకులు రెడీగా ఉన్నారు. ‘మీరందరూ దేశం కోసం పోరాడండి. తెలంగాణను వదిలిపెట్టను. హైదరాబాద్ కేంద్రంగానే భూకంపం పుట్టిస్తానని చెబుతున్నా. గులాబీ పరిమణాలను భారతదేశ నలుమూలలకు వ్యాపించజేస్తా. అద్భుతమైన నిర్మాణాలతో భారత్‌ను తీర్చిదిద్దుతాం. ఏం లేవని మనం వెనకబడ్డాం. అన్ని ఉన్నాయి. పాలకులకు దమ్ము లేదు. దేశ ఎకానమీని అధ్యాయనం చేసే శక్తి వారికి లేదు. ఇప్పటికే అతి విలువైన 7 దశాబ్దాలు పోయాయి. దేశ రాజకీయాల్లో ప్రభావశీలమైనటువంటి ప్రాతపోషిస్తా.’ అని కేసీఆర ప్లీనరీలో అన్నారు. -
తెలంగాణను సృష్టించిందే టీఆర్ఎస్ పార్టీ
-
ఉత్తమ్ నీ ముక్కు నేలకు రాస్తావా : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డుతోందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ 17వ ప్లీనరీ వేదికగా దుయ్యబట్టారు. బస్సు యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని తూర్పారబట్టారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ నాయకుల వద్ద సంచులు మోసిన ఉత్తమ్.. టీపీసీసీ ఎలా వచ్చిందో గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. టీపీసీసీ అనే పేరు రావడానికి కారణం గులాబీ జెండా అని మర్చిపోవద్దని సూచించారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిందే టీఆర్ఎస్. 14 ఏళ్ల అలుపెరగని పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. అబద్దాలు చెప్పడానికి కూడా తెలివి కావాలి. ఉత్తమ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు అవమానపడ్డారు. అయినా తెలివి లేదు. ఎట్లా మాట్లాడాలో తెలీదు. 50 నుంచి 100 గదులతో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నాడని యాత్ర చేస్తూ చెబుతున్నారు. ఉత్తమ్ నీకు ఇదే నా సవాల్. మొత్తం మీడియాను తీసుకుని నువ్వు ప్రగతిభవన్‌కు రా. 15 గదుల కంటే ఎక్కువ లేకపోతే అక్కడే నీ ముక్కును నేలకు రాసి వెళ్లాలి. 16 గదులు ఉన్నా ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, నేను తిరిగి కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకొచ్చాం. అవన్నీ మేం తెచ్చినవే కొత్తగా వీళ్లేం తెచ్చారు అన్నారు. నేను అప్పుడు బేగంపేట విమానాశ్రయం వద్దే ఉంటా నిరూపిస్తే రాజీనామా చేస్తా అని సవాల్ చేశా. తోకముడిచిన ఉత్తమ్ రాలేదు. ప్రజలు ఏం జరగుతుందో గమనించాలి. కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా హైదరాబాద్‌లోని పెద్దాసుపత్రుల్లో ప్రజలు చచ్చిపోతే అంబులెన్స్‌లో దించిరావాలని మీ జీవితంలో అనుకున్నారా?. రాష్ట్రంలో కంటి తుడుపుగా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల కోసం 500 కళాశాలలను ప్రారంభించింది. ఎప్పుడైనా మీ జీవితంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కట్టించాలని ఆలోచించారా?. మేం చేస్తుంటే మీ కళ్లు ఓర్వలేకపోతున్నాయి. 2014లో ప్రజల ముందు పెట్టిన మెనిఫెస్టోను నూరు శాతం అమలు చేసిన దేశంలోని ఏకైక పార్టీ టీఆర్ఎస్. రాష్ట్రానికి ఇన్ని చేస్తున్న టీఆర్ఎస్ను చూసి కాంగ్రెస్ సిగ్గుపడాలి. ప్రాజెక్టులపై 250 కేసులు పెడతారా. తెలంగాణ బాగుపడుతుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి.’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. -
తెలంగాణ ప్రజలు గుండె తీసి ఇచ్చారు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : 2001లో ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని ప్రారంభించిన సమయంలో మొటికలు విరిచిన వారు, అయ్యే పనేనా ఇది అన్న సంఘటనలు చాలా ఉన్నాయని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం కొంపల్లిలో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. అనేక అనుమానాలను పటాపంచెలు చేస్తూ.. 14 ఏళ్లుగా మిశ్రమ ఫలితాలను సాధిస్తూ ఆత్మవిశ్వాసంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నానని, తిరిగి తెలంగాణ రాజధాని హైదరాబాద్ గడ్డమీదే అడుగుపెడతానని చెప్పి అలానే చేశానని గుర్తు చేశారు. ‘ఒక స్పష్టమైన ప్రకటనతో 2014 ఎన్నికల బరిలోకి దిగాం. తెలంగాణ ప్రజలు వాళ్ల గుండె తీసి టీఆర్ఎస్ చేతిలో పెట్టారు. అందుకు ప్రతిగా నీతి, నిజాయితీగా నోరు, కడుపు కట్టుకుని పని చేస్తున్నాం. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా దేశంలో నిజాయితీగా పని చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే. ప్రభుత్వ రంగ సంస్థలకు విద్యుత్ ప్రాజెక్టు అప్పజెప్పడంపై జాతీయ నాయకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందాయి. సంక్షేమ కార్యక్రమాల ఫలాలను రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా అందుకుంటున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని అనేక సాహస కార్యాలను తెలంగాణ ప్రభుత్వం తలపెడుతోంది. అనేక ఏళ్లు గిరిజన బిడ్డలు తండాలు, గ్రామాలను పంచాయితీలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 4 వేల తండాలను పంచాయితీలు చేసింది. ఎన్నో ఏళ్లుగా వివిధ రాజకీయ పార్టీలు ఈ మేరకు హామీలను ఇచ్చి నిలబెట్టుకోలేకపోయాయి. మాటిచ్చి తండాలను పంచాయితీలు చేసిన పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఓ చరిత్రాత్మక నిర్ణయం. పరిపాలన సంస్కరణలలో భాగంగా 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేశాం. ప్రజలు కొత్త జిల్లాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనికి వందల కిలోమీటర్లు వెళ్లే భారం వారికి తప్పింది. బెంగుళూరులో దేవెగౌడతో మాట్లాడిన సమయంలో తెలంగాణ పథకాల ప్రస్తావన వచ్చింది. అవే పథకాలను కర్ణాటకలో కూడా అమలు చేయమని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ లాంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇది మంచి శుభ పరిణామం. దేశంలో ట్రాఫిక్ పోలీసులకు లైఫ్ రిస్క్ అలవెన్సులు 30 శాతం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంగన్వాడీలు, ఆశావర్కర్లకు, హోంగార్డులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)లో తొలిస్థానంలో ఉంద’ని కేసీఆర్ రాష్ట్ర విజయాల గురించి ప్లీనరీలో చెప్పుకొచ్చారు. -
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు
సాక్షి, మేడ్చల్: దేశ రాజకీయాల్లో సమూల మార్పు రావాలని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’ అనే మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్లీనరీ ద్వారా నూతక శకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. 14 సంవత్సరాల పాటు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా ఏర్పడిదంటే కారణం కేసీఆరేనని కొనియాడారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఒకే పద్ధతిలో చూడటం లేదని ఆరోపించారు. దేశం రాజకీయాల్లో సమూల మార్పు రావాలన్నారు. కొన్ని అంశాల్లో కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నిఎదుర్కోవడానికి ఫెడరల్ ఫ్రంట్‌గా ఏర్పడి ముందుకు పోవాలని సూచించారు. దేశ రాజకీయాల్లో సమైక్య స్ఫూర్తి వర్ధిల్లాలని, కేంద్ర నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. దేశంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కి అభినందనలు తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్‌కు అందరూ మద్దతు పలకాలని కేకే కోరారు. ఈ తీర్మానాన్ని ఎంపీ వినోద్ కుమార్‌తో పాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ బలపరిచారు. -
ఈరోజు రాత్రి టెన్త్ ఫలితాలు.. విద్యార్థులకు ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ కారణంగా తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడనున్నాయి. వాస్తవానికి శుక్రవారం ఉదయం టెన్త్ ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. దానిని రాత్రి 7 గంటలకు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయాన్నే టీఆర్ఎస్ ప్లీనరీ జరగనుండటంతో ఉదయం నుంచి సీఎం, మంత్రులు సహా అధికార పార్టీ గణమంతా రోజంతా అక్కడే బిజీగా ఉండనున్నారు. దీంతో ఫలితాలను వెల్లడించేందుకు ఉదయం అనువైన సమయం కాదని వాయిదా వేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఫలితాలను విడు దల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొంది. సచివాలయంలోని డీ బ్లాక్‌లో టెన్త్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,76,388 మంది కాగా, బాలికలు 2,62,479 మంది ఉన్నారు. సాయంత్రం ఫలితాలతో విద్యార్థులకు ఇక్కట్లు! పదో తరగతి ఫలితాలను రాత్రి విడుదల చేయనుండటంతో విద్యార్థులు ఫలితాలను చూసుకునేందుకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్నెట్ కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ ప్లీనరీ ఉన్నందున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచనల మేరకు అధికారులు ఫలితాల వెల్లడి సమయాన్ని మార్పు చేశారు. పదో తరగతి ఫలితాల కోసం - ఇక్కడ క్లిక్ చేయండి ఫలితాల కోసం.. www.sakshieducation.com www.sakshi.com వెబ్సైట్లను చూడొచ్చు -
గులాబీ పార్టీలో.. పండుగ వాతావరణం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గులాబీ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరగనున్న టీఆర్ఎస్ 17వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తోంది. ఏటా ఏప్రిల్ 27వ తేదీన జరిగే ప్లీనరీలోనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికలు ఏడాది లోపే ఉండడంతో ఈ ప్లీనరీకి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ప్రతినిధుల సభకు హాజరయ్యేందుకు పార్టీ నాయకులు ఉత్సాహ పడుతున్నారు. నాలుగేళ్లు పాటు సాగిన టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు, వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన కార్యక్రమాలపై ప్రగతి నివేదికలను పార్టీ కార్యకర్తలకు అందివ్వనున్నారు. పార్టీ, ప్రభుత్వం జోడెడ్ల మాదిరిగా కలిసి సాగాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పదే పదే చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు, ప్రజల్లో ప్రచారం చేసేందుకు పార్టీ యంత్రాంగాన్ని వినియోగించుకోనున్నారని చెబుతున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పార్టీ ప్లీనరీ ఉండదని, దీంతో ఈ ప్లీనరీ పా ర్టీకి ప్రత్యేకమైనదని అంటున్నారు. ఈ కారణంగానే కీలకమైన ఈ ప్లీనరీలో పాల్గొనేం దుకు నల్లగొండ ఉమ్మడి జిల్లా నాయకులు, ద్వితీయ శ్రేణి, పార్టీ తరఫున వివిధ పదవుల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల, పార్టీ పదవుల్లో ఉన్నవారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గానికి నూరు మందికి ఆహ్వానం టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో మొత్తంగా 15వేల మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొంటారని, ఆ మేరకే ఆహ్వానాలు ఉన్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు. దీంతో జిల్లాల వారీగా ఇచ్చిన కోటాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈసారి ప్రతి నియోజకవర్గానికి వంద మందికే ఆహ్వానాలు పంపారని, ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తంగా 1200 మందికి ఆహ్వానాలు అందాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రతిసారి నిర్ధిష్టంగా కొంత మందికే ఆహ్వానాలు ఇస్తున్నా, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలోనే ప్లీనరీకి హాజరవుతున్నారని చెబుతున్నారు. ఈసారి కూడా ఆహ్వానాలకు రెండింతల మంది ప్లీనరీకి తరలిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 12 స్థానాల్లో టీఆర్ఎస్ చేతిలో ఎనిమిది మంది (చేరికల ఎమ్మెల్యేలు సహా) ఎమ్మెల్యేలు ఉన్నారు. కోదాడ, హుజూర్నగర్, నల్లగొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జులు ఉన్నారు. ప్లీనరీకి హాజరయ్యేందుకు తమకు పాసులు ఇప్పించాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇన్చార్జులపై ఒత్తిడి పెరిగిందని పేర్కొంటున్నారు. వీరే కాకుండా జిల్లానుంచి మరికొందరు కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండలి చైర్మన్, సభ్యులు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరే కాకుండా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ప్రాతిని ధ్యం వహిస్తున్నవారు. పార్టీ అనుంబంధ సంఘాల్లో ఉన్న వారు ఇలా.. వివిధ పదవుల్లో ఉన్న నేతలంతా ప్లీనరీకి హాజరుకావడానికి సిద్ధమవుతున్నారు. ప్లీనరీలో పాల్గొనడం ప్రత్యేకతగా భావిస్తున్న కేడర్ ఈ మేరకు తమ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా ప్లీనరీలో పా ల్గొనే వారి జాబితాల తయారీ, ఇతర ఏర్పాట్లతో జిల్లా టీఆర్ఎస్లో సందడి నెలకొంది. -
కేసీఆర్‌ను నిలదీయండి: పొన్నం
సాక్షి, న్యూఢిల్లీ : ప్లీనరీ నిర్వహించాలని చూస్తోన్న టీఆర్ఎస్ పార్టీ హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు అమలుయ్యయో ఆ వివరాలను ప్రజలకు అందజేయలన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు హెడ్ రెగ్యులేటరీలు కట్టి మొత్తం టీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ నీరో చక్రవర్తిలా ప్రత్యామ్నాయ ఫ్రంట్ అంటూ బెంగాల్, బెంగళూరులకు తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత రుణభారం ప్రజలపై మోపడం వాస్తవం కాదా అని పొన్నం ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం సాధించిందో ప్రశ్నించండి అంటూ ప్లీనరీకి హాజరయ్యే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్న కేసీఆర్ పొగటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ తన పేరును కల్వకుంట్ల నరసింహన్‌గా మార్చుకోవాలని పొన్నం ఎద్దేవా చేశారు. -
ప్రతిష్టాత్మకంగా.. ప్లీనరీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 17 వసంతాలు పూర్తి చేసుకుని 18వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్‌లోని కొంపెల్లి జీబీఆర్ గార్డెన్లో నిర్వహించనున్న ప్లీనరీకి ఉమ్మడి జిల్లా పరిధి నుంచి నేతలను తరలించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ప్లీనరీకి పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నా.. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందికి మించకుండా ప్రతినిధులను మాత్రమే తీసుకురావాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి 1300 మందికి మాత్రమే ప్రతినిధులుగా ప్లీనరీలో పాల్గొనే అవకాశం లభించనుంది. ఆయా నియోజకవర్గాలకు చెందినప్రజాప్రతినిధులు, ముఖ్యులు 100 మందికి మా త్రమే అనుమతి ఉండడంతో మిగతావారు సహకరించాలని పార్టీ పెద్దలు ఇప్పటికే కేడర్‌కు సూచించా రు. గతంలో జరిగిన ప్లీనరీల కన్నా భిన్నంగా ఈ దఫా జరిగే ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతోపాటు జాతీయ అంశాలపై చర్చించి దేశానికే దిక్సూచీలా తీర్మానాలు ఉండేలా కసరత్తు జరుగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తెరపైకి వచ్చిన నేపథ్యంతోపాటు మరో యేడాదిలో జరగనున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులకు ప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు వేదికగా ఉపయోగించుకోనున్నారు. సక్సెస్ కోసం ప్రజాప్రతినిధుల కసరత్తు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్లీనరీని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయమై ఇప్పటికే ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తున్నారు. మంగళవారం టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల ఇన్చార్జిలు గూడూరి ప్రవీణ్, కర్ర శ్రీహరి, వై.సునీల్‌రావు తదితర నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్లీనరీకి డెలిగేట్స్ తరలింపు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్వేత ఇంటర్నేషనల్ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నియోజకవర్గానికి 100మంది చొప్పున 1300 మంది ప్లీనరీకి హాజరయ్యేలా చూస్తామన్నారు. ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో ప్లీనరీ నిర్వహణపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలను కూడగట్టి మద్దతు పొందిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పేందుకు ప్లీనరీని వేదికగా ఉపయోగించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై రాష్ట్రానికి దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు వస్తున్న సందర్భంగా ఇక్కడి అభివృద్ధిని కీర్తిస్తూ ప్రశంసలు కురిపిస్తుండడాన్ని అవకాశంగా తీసుకుని నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లేలా ప్రతినిధులకు దిశానిర్దేశనం చేయనున్నారు. ప్లీనరీ సమావేశాలకు ప్రత్యేకత ఈనెల 27న హైదరాబాద్‌లో నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని మాజీమంత్రి, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ బస్వరాజు సారయ్య అన్నారు. ఈసారి నిర్వహించే 15వ పార్టీ ప్లీనరీకి ప్రత్యేకత ఉందని, దేశానికి దిశానిర్ధేశనం చేసేలా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని శ్వేత ఇంటర్నేషనల్ హోటల్లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అలుపెరుగని నేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర నిర్వహించనున్నారన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన మరింత కీలకపాత్ర వహించనున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ శ్రీకారం చుట్టిన తరుణంలో నిర్వహించే ప్లీనరీపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతుందని బస్వారాజు సారయ్య పేర్కొన్నారు. ఈ ప్లీనరీకి ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది ప్రతినిధులకు ఆహ్వానం ఉంటుందని, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఈ సారి కేవలం ప్రతినిధుల సభను మాత్రమే నిర్వహిస్తున్నందున తక్కువ మందికే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. -
కర్ణాటక తీర్పు తేలాక..!
సాక్షి, హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరే పార్టీలు, ఆ పార్టీ అధినేతలతో దశలవారీగా భేటీ కావడానికి ఇప్పటికే సీఎం రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. అయితే, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, జాతీయస్థాయిలోని పలు పరిణామాలతో ఫ్రంట్ కార్యకలాపాలను కొంతకాలం నెమ్మదిగా నడిపించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నెలాఖరులో నిర్వహించాల్సిన టీఆర్ఎస్ ప్లీనరీపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ట్రెండ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ‘‘కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎంతో కొంత ఉంటుంది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు జనతాదళ్(ఎస్) పోటీపడుతున్నాయి. ఆ రాష్ట్రంలో పూర్తిగా రెండు జాతీయ పార్టీల ఆధిపత్యమే ఉంటుందా? ప్రాంతీయ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందా అనేది మాకు ఆసక్తి కలిగించే అంశమే. ప్రాంతీయ పార్టీకి కర్ణాటక ప్రజలు పట్టం కడతారా? జాతీయ పార్టీల వైపే మొగ్గు చూపుతారా? అనేది గమనిస్తున్నాం. ఈ ఫలితాలు వచ్చే దాకా వేచి చూస్తాం. ఫలితాలు వచ్చేదాకా ఫెడరల్ ఫ్రంట్ కార్యకలాపాల్లో వేగం తగ్గించాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు’’అని టీఆర్ఎస్కు చెందిన ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. ఒడిశా పర్యటన వాయిదా? ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒడిశాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు గతంలో వెల్లడించాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భువనేశ్వర్‌లో ఈ వారంలోనే భేటీ అయ్యేందుకు వెళ్తారని సీఎం కార్యాలయ వర్గాలు చెప్పాయి. అయితే కూటమి కార్యకలాపాలపై నెమ్మదిగా వెళ్లాలన్న నిర్ణయంలో భాగంగా కేసీఆర్ పర్యటన వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఒడిశా పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు పర్యటన ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వంటివారితోనూ సమావేశమవుతారని పార్టీ వర్గాలు గతంలో వెల్లడించినా.. ఇప్పుడా ప్రస్తావన తేవడం లేదు. దేశంలోని మిగిలిన ప్రాంతీయ పార్టీల ముఖ్యులతోనూ ఇప్పట్లో సమావేశాలు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయస్థాయి నేతల్లేకుండానే ప్లీనరీ టీఆర్ఎస్ ప్లీనరీ ఈ నెల 27న కొంపల్లిలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సుమారు 15 వేల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావానికి ఈ ప్లీనరీని వేదికగా చేసుకుంటారని పార్టీ వర్గాలు ముందుగా వెల్లడించాయి. అయితే ప్లీనరీని పార్టీ వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ నిర్వహించబోయే సభను రాజకీయ ప్రయోజనం లేకుండా నిర్వహించడానికి కేసీఆర్ విముఖత వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద సభ నిర్వహించినా, ఆ సభ ఊపును ఏడాదిపాటు కొనసాగించడం సాధ్యం కాదని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా ఎన్నికల సమరశంఖాన్ని పూరించినట్టుగా ఉంటుందనే అంచనాతో ఉన్నారు. దీంతో పార్టీ 17వ ప్లీనరీని పార్టీ ప్రతినిధులతో సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. -
ఆసుపత్రి శుభ్రం చేసిన మంత్రి
ఆదిలాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ నిధుల సేకరణ కోసం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న కూలీగా మారారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో కూలీ పని చేశారు. ఖానాపూర్ చెరువులో మట్టిని ఎత్తి టిప్పర్‌లో పోసినందుకు కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి రూ.లక్ష కూలీగా ఇచ్చారు. అనంతరం పట్టణంలోని శ్రీనివాసా నర్సింగ్ హోంలో ఆసుపత్రి శుభ్రపర్చగా.. డాక్టర్ అశోక్, డాక్టర్ రమ దంపతులు రూ.లక్ష అందజేశారు. అనంతరం అయ్యప్ప అర్థోపెడిక్ ఆసుపత్రిని మంత్రి శుభ్రం చేసి డాక్టర్ అనిల్ చిద్రాల నుంచి రూ.50 వేలు కూలీ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'తలసాని స్థాయిని తగ్గించలేదు.. పెంచాం'
వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే ఇటీవల ఆయనను ఆ శాఖ నుంచి మార్చడం, అంతగా ప్రాధాన్యంలేని శాఖలు కేటాయించడంపై అన్ని వర్గాల్లో జరుగుతున్న చర్చలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముక్తాయింపునిచ్చే ప్రయత్నం చేశారు. తలసాని స్థాయిని తగ్గించలేదని, పెంచామని అన్నారు. బుధవారం ఖమ్మంలో జరుగుతోన్న టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. తలసాని శాఖ మార్పులపై వివరణ ఇచ్చారు. 'శాఖల్లో మార్పుతో తలసాని స్థాయిని తగ్గించలేదు. పెంచాం. ఆయనతో అన్నీ చర్చించాకే మార్పులను ఖరారు చేశాం. అయినా తలసాని ప్రజా నాయకుడు. ఆయనకు పదవులతో సంబంధంలేదు' అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల కిందట జరిగిన శాఖల మార్పుల్లో ముఖ్యమంత్రి తన దగ్గరున్న శాఖలకు అదనంగా గ్రామీణ నీటి సరఫరా, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలు తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించి.. పశు సంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఇవన్నీ ప్రస్తుతం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరున్నాయి. వీటిని తొలగించడంతోమిగిలిన వ్యవసాయ శాఖకు అదనంగా సహకార శాఖను పోచారానికి అప్పగించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తనయుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు, జూపల్లి కృష్ణారావుల శాఖల్లోనూ మార్పులు చేశారు. కేటీఆర్‌కు మున్సిపల్, ఐటీలకుతోడు పరిశ్రమలు, గనులు, ఎన్నారై వ్యవహారాలు దక్కగా, జూపల్లికి పంచాయతీరాజ్ శాఖను కట్టబెట్టారు. పంచాయితీ రాజ్ లో అంతర్భాగంగా ఉండి, ఇప్పుడు ప్రత్యేక శాఖగా మార్చిన గ్రామీణ నీటి సరఫరా శాఖను కూడా సీఎం తనవద్దే ఉంచుకున్నారు. హరీశ్ నిర్వహిస్తోన్న గనులు, భూగర్భ వనరుల శాఖను మరొకరికి అప్పగించారు. (చదవండి: కేటీఆర్‌కు ప్రమోషన్... తలసానికి డిమోషన్..)