సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, మా ఎమ్మెల్యేలంతా వజ్రాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కితాబిచ్చారు. బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌లో ఉన్న వారందరూ తెలంగాణ బిడ్డలేనని వ్యాఖ్యానించారు.