సాక్షి, హైదరాబాద్: ‘ఈ దేశం సరైన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే, రాజ్యాంగం ఉన్నది ఉన్న ట్టుగా అమలు కావాలంటే, అంబేడ్కర్ స్ఫూర్తి నిజం కావాలంటే.. రాజ్యాంగంలో మౌలిక మార్పు లు చేర్పులు చేసుకుని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతో, కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవి ర్భవించాలి. సందర్భానుసారంగా స్పందించే దేశం ఇది. బుద్ధిగాలిన దేశం కాదు.. బుద్ధి జీవుల దేశం. తెలంగాణకు అవసరమైన నాడు గాలిదుమారం పుట్టించి టీఆర్‌ఎస్ వచ్చినట్టే.. దేశానికి అవసర మైన నాడు కూడా భూకంపం పుట్టించి, తుపాను సృష్టించి ఈ దుర్మార్గాలను తరిమివేసే ఒక శక్తి తప్పకుండా పుడుతుంది. అందులో టీఆర్‌ఎస్ కూడా ఉజ్వలమైన పాత్ర పోషిస్తుంది..’ అని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం జరిగిన ప్లీనరీకి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఏర్పాటు మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్ పోషించనున్న పాత్ర, రాష్ట్రంలో సంక్షేమ, సాగునీటి పథకాల గురించి వివరించారు. రాజ కీయ ఫ్రంట్‌లతో, ఎవరినో గద్దె దింపి, మరెవరికో అధికారం కట్టబెట్టాలనే లక్ష్యంతో కాకుండా ప్రజల జీవన స్థితిగతుల మార్పు కోసం దేశానికి ప్రత్యా మ్నాయ ఎజెండా కావాలని ఉద్ఘాటించారు. భారత ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉండాలన్నారు. అది దేశాన్ని అద్భుతమైన ప్రగతి పథంలో ముం దుకు తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఉపన్యాసం ఆయన మాటల్లోనే..
దేశం అన్నిరంగాల్లో నాశనమై పోయింది
దేశం అన్ని రంగాల్లో నాశనమై పోయింది. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు పోయిన సర్కారే మంచిగా ఉండే.. అని మాట్లాడుతున్నారు. నిరుద్యో గం పెరిగింది. ఆకలి పెరిగింది. రైతులు ఇబ్బందు ల్లో ఉన్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా యి. పరిశ్రమలు మూతపడ్డాయి. ఇన్ని సమస్యలతో దేశం సతమతమవుతుంటే.. దీనిపై దృష్టి పెట్ట కుండా.. విద్వేషం.. ద్వేషం.. ఒక పిచ్చి రేపుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం అన్ని పార్టీలను ఏకతాటి పైకి తేవాలని ఇటీవల ఢిల్లీలో కొందరు నాతో అన్నారు. నేను కాదన్నాను. మార వలసింది ప్రభుత్వాలు కాదు. ప్రజల స్థితి గతులు. ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు.. కూటమి కాదు..ఎల్లయ్యను, మల్లయ్యను ప్రధానిని చేయడా నికి రాజకీయ ఎజెండా కాదు.. ప్రత్యా మ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలి. నూతన ఆర్థిక, వ్యవ సాయ, పారిశ్రామిక విధానం కావాలి. ఆ దారులు వెతకాలి. అందుకు అవసరమైన వేది కలు తయారు కావాలి. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి.
దేశ పరిస్థితిపై చర్చ జరగాలి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు దాటినా.. ఇంకా ఒక రాష్ట్రంలో ఒక పూట తిండి తినే పరిస్థితి, రేషన్ బియ్యం ఇస్తే సంతోషించే స్థితి ఉండడం దౌర్భాగ్యం. 1980 వరకు భారత్ జీడీపీ చైనా కన్నా ఎక్కువ. 30 ఏళ్లల్లో చైనా ఎక్కడికి వెళ్లింది? ప్రపం చంలో రెండో అతిపెద్ద శక్తిగా ఎదిగింది. మన దేశం లో 44 కోట్ల ఎకరాల సాగుభూమి, నదులు, సహజ వనరులు ఉండి ఎందుకిలా ? దీనిపై చర్చ జరగాలి.
తెలంగాణకు 11 రాష్ట్రాల నుంచి వలసలు
2000 సంవత్సరంలో నేను తెలంగాణ అని మాట్లా డితే.. ఏం పని లేదా అని కొందరు అన్నారు. సంకల్పంతో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఆ భగవంతు డికి దండం పెట్టి బయలుదేరి తెలంగాణ సాధిం చాం. అంతేకాదు.. సాధించిన తెలంగాణను దేశా నికి రోల్‌మోడల్‌గా నిలిచేలా చేశాం. పాలమూరు జిల్లాలో పల్లె పల్లె నుంచి ముంబైకి బస్సులు నడి చేవి. ప్రజలు వలసలు పోయేవారు. ఇవాళ వల సలు రివర్స్ అయ్యాయి. 11 రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వలసలు వస్తున్నారు. తెలంగాణలో పని పుష్కలంగా దొరుకుతోంది. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి.
జాతిపితను దూషించడమా..?
జాతిపిత గాంధీని దూషిస్తున్నారు. ఏ దేశం కూడా ఇలాంటి దూషణలు చేయదు. ఇదేం దుర్మార్గం. స్వాతంత్య్రం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని దుర్భాషలాడటమా? ఆయనను చంపిన హంతకులను పూజించడమా? ఇదేం సంస్కృతి? ఎందుకు ఈ విద్వేషం. ఏం ఆశించి దీన్ని రగుల్చుతున్నారు. ఎందుకీ రకమైన మత పిచ్చి లేపుతున్నారు. మత విద్వేషాలు మంచిది కాదు. కుటిల రాజకీయాలు చేసి, పదవుల కోసం విధ్వంసం చేయడం తేలికనే. అరి కట్టాలంటే ఎంత శ్రమ కావాలి?.
మతం పేరుతో దుర్మార్గపు రాజకీయాలు
పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరుకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుంది అక్కడ 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలున్నాయి. పరోక్షంగా మరో 30 లక్షల మంది బతుకుతున్నా రు. దీని వెనుక ఎంతో కృషి ఉంది. కానీ ఇటీవల హిజాబ్, హలాల్.. పూలు, పండ్లు కొనొద్దు అంటూ విద్వేషాలు రేపుతున్నారు. మతం పేరుతో దుర్మా ర్గపు రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎవరికీ మం చిది కాదు. అమెరికాలో మనోళ్లు 13 కోట్ల మంది ఉన్నారు. మీరు మా మతస్తులు, కులస్తులు కాదు అని పంపిస్తే ఈ
కేంద్రం ఉద్యోగాలు ఇస్తదా?
మహాత్ముడు కలలుగన్నది ఈ దేశమేనా?
దేశ రాజధానిలో దేవుని పేరుమీద జరిగే ఊరేగింపులో కత్తులు, తుపాకులతో చెలరేగిపోయారు. ఈ భారతదేశమేనా మనకు కావాల్సింది. మహాత్ముడు కలలుగన్నది ఈ దేశమేనా? ఇదేనా ప్రజలు కోరుకు నేది. ఈ దేశం ఇట్లనే నాశనం కావాల్నా? లేక టీఆర్‌ఎస్‌గా మనం కూడా ఒక పాత్ర పోషిం చాల్నా? మన శక్తిని ప్రదర్శించి ఈ దుర్మార్గాన్ని నిలువరించి ఒక మార్గాన్ని చూపెట్టాల్నా? ఇలాంటి ప్రశ్నలు మన ముందున్నాయి.
సింగపూర్‌కు ఉన్న తెలివి మనకు లేదు
ఏమీ లేని సింగపూర్ అద్భుత ఫలితాలు సాధి స్తోంది. వాళ్లు మట్టిని కూడా ఇండోనేసియా నుంచి నౌకల్లో తెచ్చుకుంటారు. నీళ్లు కొనుక్కుంటారు. కూరగాయలు కూడా వాళ్ల దగ్గర పండవు. ఆ దేశంలో ఏమీ లేదు. కానీ అక్కడ ఎందుకంత అభి వృద్ధి జరిగింది? వాళ్లకు ఏమీ లేకున్నా తెలివి ఉం ది. మన దగ్గర అన్నీ ఉన్నా... వాటిని ఉపయోగిం చుకునే తెలివి లేదు. ఇది నిప్పులాంటి నిజం.. హేతుబద్ధమైన వాదం.. కఠోరమైన వాస్తవం.
నీటి యుద్ధాలు ఎందుకు?
దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉండే నీటిలభ్యత 65 వేల టీఎంసీలు. మరికొన్ని టీఎంసీల లెక్కలు తేలాల్సి ఉంది. 65 వేల టీఎంసీలకు గాను కేవలం 30 వేల టీఎంసీల లోపే దేశం వాడుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. కావేరి జలాల కోసం తమిళనాడు– కర్ణాటక మధ్య, సింధు–సట్లెజ్ నదీ జలాల కోసం పంజాబ్–హరియాణా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది? తాగు, సాగునీరు లేక దేశం ఎందుకు అల్లాడుతోంది? మనకు నీరు, ఖనిజ సంపద, అటవీ సంపద, మేథోసంపత్తి లేదా? ఎందుకు దేశం ఇలా కునారిల్లుతోంది? ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరముంది.
తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్‌ఎస్
80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది సభ్యులతో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న పార్టీ టీఆర్‌ఎస్. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి, రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న పార్టీ. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరూ బద్ధలు కొట్టలేని కంచుకోట. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజలదే. ఇది ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్‌ఎస్ పార్టీ. అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు.
దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ
రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే ఎవర్ని పట్టుకొని ఏడ్వాలో కూడా తెలవని పరిస్థితి. రాష్ట్ర అస్తి త్వమే ఆగమయైపోయే పరిస్థితి. ఒక దిక్కుతోచని సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగసిపడింది. అపజ యాలు, అవమానాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాం.
అవార్డులు మన పనితీరుకు నిదర్శనం
కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు, అవార్డులు, రివార్డులే మన పని తీరుకు నిదర్శనం. నిన్న (మంగళవారం) విడుదల చేసిన అవార్డుల్లో దేశంలో అతి ఉత్తమమైన పది గ్రామాలు తెలంగాణవే అని కేంద్రం ప్రకటించింది. కేంద్రం నుంచి అవార్డు రానటువంటి విభాగం తెలంగాణలో లేదు. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాళ జలభాండాగారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామప్రాజెక్టు పూర్తి చేసుకుంటే తెలంగాణలో కరువు ఉండనే ఉండదు.
చుట్టూ అంధకారంలో మణిదీపంలా తెలంగాణ
ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. పంటలు ఎండి పోతున్నాయి. మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. ఇలా చుట్టూ అంధకారం ఉంటే తెలంగాణ మాత్రం ఒక మణిదీపంలా వెలుగుతున్నది. ఏడేళ్ల క్రితం మనకు కూడా కరెంట్ కోతలే. కానీ మనం ఆ సమస్యను అధిగ మించాం. వెలుగు జిలుగుల తెలంగాణగా తీర్చి దిద్దుకున్నాం. తెలంగాణలా దేశం పని చేసి ఉంటే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబై నుంచి కోల్‌కతా వరకు 24 గంటల కరెంట్ ఉండేది.
దళితబంధు... ప్రపంచానికే ఆదర్శం
అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే స్థిరమైన నిర్ణయంతో, అవగాహనతో.. ఈ దేశానికే పాఠం నేర్పే బృహత్తరమైన కొత్త సిద్ధాంతానికి శ్రీకారం చుడుతున్నాం. ఓట్ల కోసం కాకుండా.. అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని సృష్టించే విధంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఇది దేశానికి, ప్రపంచానికే ఆదర్శంగా నిలవబోతుంది. పదిహేడున్నర లక్షల దళిత కుటుంబాలకు దశల వారీగా పది లక్షల ఆర్థిక సాయం అందజేస్తాం. ప్రభుత్వ లైసెన్స్‌లు ఇచ్చే అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.
ఆ గవర్నర్ ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి..
మహారాష్ట్ర ప్రభుత్వం 12 మంది ఎమ్మెల్సీల కోసం కేబినెట్ తీర్మానం చేసి పంపిస్తే గవర్నర్ ఒక ఏడాది పాటు ఆయన దగ్గర్నే పెట్టుకు న్నాడు. తమిళనాడు అసెంబ్లీ బిల్లు పాస్ చేసి పంపిస్తే ఆ రాష్ట్ర గవర్నర్ వింత ధోరణితో ప్రవర్తించాడు. బెంగాల్, మహా రాష్ట్ర, తమిళ నాడు, కేరళలో గవర్నర్ల పంచా యితీ ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రజలకు మంచి పని చేయాలని భావిం చారు. 200 మంది ఎమ్మెల్యేలతో అధికారం లోకి వచ్చారు. కానీ దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియో గించి, స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ ఆర్‌ను పదవి నుంచి తొలగించారు. కానీ ఏం జరిగింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి.. తిరిగి ఎన్టీ ఆర్‌ను అదే సింహాసనం మీద కూర్చో బెట్టారు. ఎన్టీఆర్‌తో దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ గవర్నర్.. అవమానం పడి ఇక్కడ్నుంచి తొలగించబడ్డారు. దాన్నుంచి ఈ దేశం గుణపాఠం నేర్చుకోవాలి. ప్రజల కోసం రాజ్యాంగమా? లేక దానికి ఉల్టానా?
పల్లెలకు శోభ తెచ్చాం..
కఠిన నిర్ణయం తీసుకుని తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాం. హరితహారంలో 85 శాతం మొక్కలు దక్కకుంటే టీఆర్‌ఎస్ వారైనా సర్పంచ్, గ్రామ కార్యదర్శి ఉద్యోగాలు పోతాయని చెప్పాం. పల్లె ప్రగతి పేరిట ఏటా రెండు, మూడు సార్లు డ్రైవ్ పెట్టాం. మంత్రులు, ఎమ్మెల్యేలను దీనిలో భాగస్వామ్యం చేశాం. అందుకే ఈ ఫలితాలు వచ్చాయి.
మన దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. అన్నిరంగాల్లో నాశనమై పోయింది. అనేక సమస్యలతో సతమతమవుతోంది. లక్ష్యం లేని దేశం గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ 40 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులే ఉన్నాయి. ఇవి మారాలి. దేశం లక్ష్యం ప్రజల సామూహిక లక్ష్యం కావాలి. పట్టుదలతో పురోగతి సాధించాలి.
జాతిపిత గాంధీని దూషిస్తున్నారు. ఎందుకీ విధమైన మతపిచ్చి లేపుతున్నారు. మతం పేరిట దేశంలో సాగుతున్న విద్వేష పూరిత రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పడాలి. దేశానికి కావలసింది కత్తుల కోలాటాలు, తుపాకుల చప్పుళ్లు కాదు... కరెంటు, సాగునీరు, తాగునీరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో అందరూ సమానత్వంతో జీవించే పరిస్థితులు. – కేసీఆర్
ప్లీనరీలో 13 తీర్మానాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వ హించిన ప్లీనరీలో 13 తీర్మానాలను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రవేశ పెట్టారు. వాటిని మరి కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు బలపరిచారు. ఆ తీర్మానాలు ఏమిటంటే...
► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన.
►దేశ విస్తృత ప్రయోజనాలరీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కీలక భూమిక పోషించాలి.
►ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తున్న కేంద్రం వైఖరిని నిరసించాలి. ధరలు నియంత్రించాలి.
►చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించి అమలు చేయాలి.
►దేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి.
►బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీ వర్గాల జనగణన జరపాలి.
►తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ చేసిన బిల్లును కేంద్రం ఆమోదించాలి.
►రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలి. డివిజిబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలి.
►నదీజలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిర్ణయించాలి. ఈ మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం సూచించాలి.
►రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలి.
►రాష్ట్రంలో నవోదయ విద్యాలయా లను, వైద్య కళాశాలలను కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలి.
►దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి.
►చేనేత వస్త్రాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలి.
టీఆర్‌ఎస్ ప్లీనరీ సైడ్‌లైట్స్..
► ప్లీనరీ వేదికకు సమీపంలో టీఆర్‌ఎస్ ఉద్యమ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ అతిథులను కట్టిపడేసింది.
► సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రదర్శించిన లఘు చిత్రం ఆకట్టుకుంది.
► కాళేశ్వరం ప్రాజెక్టుపై డిస్కవరీ చానల్‌లో ప్రసారమైన డాక్యుమెంటరీనిప్రదర్శించారు.
► ధూం..ధాం కళాకారులు పాడిన పాటలు అందరిలో జోష్ నింపాయి.
► సీఎం కేసీఆర్ ఉదయం 11:06 గంటలకు వేదికపైకి రాగానే దేశ్ కీ నేత కేసీఆర్ నినాదాలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. కేటీఆర్ మాట్లాడుతుంటే కార్యకర్తల నినాదాలు హోరెత్తాయి.
► వేదికపై కేసీఆర్ ముందుగా పార్టీ పతాకం ఆవిష్కరించారు. అనంతరం అమరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లికి పూలు సమర్పించారు.
► కేసీఆర్ ప్రసంగం సమయంలో ఒక కార్యకర్త విజిల్ వేయగా.. ఈలల గోల ఏమిటంటూ చురకలంటించారు.
► ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తన ప్రసంగంలో పిట్టకథలు చెప్పగా అందరూ కథలు చెబితే సభాసమయం సరిపోదని కేసీఆర్ అన్నారు.
► పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచన మేరకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
► కొందరు పార్టీ వీరాభిమానులు ఒంటిపై కేసీఆర్, కేటీఆర్ పేర్లను రంగులతో రాసుకుని సభాప్రాంగణంలో కలియ దిరిగారు. సిద్దిపేటకు చెందిన గజిబిన్కర్ మనోహర్ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫొటోలు, ప్రభుత్వ పథకాలతో కూడిన ఫ్లెక్సీలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
తెలంగాణ భవన్‌లో...
► తెలంగాణ భవన్‌లో 40 అడుగుల పార్టీ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. పద్మారావు నగర్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి గుర్రం పవన్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 21 కిలోల కేక్‌ను కేటీఆర్ కట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment