
హీరోగా యు-టర్న్!
‘లెజెండ్’తో జగపతిబాబు కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. అప్పటివరకూ హీరోగా నటించిన ఆయన విలన్‌గా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. హీరోగా ఫీమేల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జగపతిబాబు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, డ్రస్సింగ్ స్టైల్, స్టైలిష్ యాక్టింగ్‌తో విలన్‌గా కూడా ఫీమేల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వరుసగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేస్తున్న ఆయన హీరోగా మళ్లీ యు-టర్న్ తీసుకుంటున్నారు. జగపతిబాబు హీరోగా నటించబోయే కొత్త చిత్రం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఈ సినిమాను నిర్మించనున్నారు. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇక, తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ కుమారస్వామి నిర్మించిన ‘జాగ్వార్’లో జగపతిబాబు విలన్‌గా నటించారు. ‘జాగ్వార్’తో నాకో మంచి మిత్రుడు లభించాడని కుమారస్వామిని ఉద్దేశించి ఇటీవల ఆడియో వేడుకలో జగపతిబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.