
భోపాల్: తగ్గేదేలే... సస్పెండ్ చేసినా సరే బారు మీసం తీయనంటే తీయనని భీష్మించిన మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ రాకేశ్ రాణా పంతమే నెగ్గింది. మీసం నా ఆత్మగౌరవానికి ప్రతీకన్న ఆయన సగర్వంగా మీసం తిప్పాడు. పోలీసు శాఖ రాణాపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మధ్యప్రదేశ్‌లో పోలీసు రవాణా విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేశ్ రాణాను మీసాలు, తలపై జుట్టును తగ్గించాలని.. అలా పెంచడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు హెచ్చరించినా.. అతను ఖాతరు చేయలేదు. దాంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వార్తకు బాగా ప్రాచుర్యం లభించడంతో పోలీసు శాఖ యూటర్న్ తీసుకుంది. రాణాను సస్పెండ్ చేసే అధికారం లేకున్నా ఏఐజీ ప్రశాంత్ శర్మ... ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారని, అందువల్ల రాకేశ్ రాణాను తిరిగి విధుల్లో చేర్చుకుంటున్నట్లు పోలీసు హెడ్‌క్వార్టర్స్ డీఐజీ (పర్సనల్) ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment