suspension lift
-
చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, విజయవాడ: చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. పెండ్యాల శ్రీనివాస్‌ని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు అవినీతి కేసుల్లో పలు ఆరోపణలు ఉన్న శ్రీనివాస్‌పై తదుపరి చర్యలు నిలిపేసి పోస్టింగ్ ఇస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.గత టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారైన సంగతి తెలిసిందే. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేసింది.2014-19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్‌గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది.నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడదల చేసింది. ఈ జాబితాలోనే గోషామహల్ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రకటించింది. చదవండి: దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. సీపీఐకి ఎదురుదెబ్బ! -
తగ్గేదేలే... ఈసారి గర్వంగా మెలేశాడు
భోపాల్: తగ్గేదేలే... సస్పెండ్ చేసినా సరే బారు మీసం తీయనంటే తీయనని భీష్మించిన మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ రాకేశ్ రాణా పంతమే నెగ్గింది. మీసం నా ఆత్మగౌరవానికి ప్రతీకన్న ఆయన సగర్వంగా మీసం తిప్పాడు. పోలీసు శాఖ రాణాపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మధ్యప్రదేశ్‌లో పోలీసు రవాణా విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేశ్ రాణాను మీసాలు, తలపై జుట్టును తగ్గించాలని.. అలా పెంచడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు హెచ్చరించినా.. అతను ఖాతరు చేయలేదు. దాంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వార్తకు బాగా ప్రాచుర్యం లభించడంతో పోలీసు శాఖ యూటర్న్ తీసుకుంది. రాణాను సస్పెండ్ చేసే అధికారం లేకున్నా ఏఐజీ ప్రశాంత్ శర్మ... ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారని, అందువల్ల రాకేశ్ రాణాను తిరిగి విధుల్లో చేర్చుకుంటున్నట్లు పోలీసు హెడ్‌క్వార్టర్స్ డీఐజీ (పర్సనల్) ఉత్తర్వులు జారీచేశారు. -
గహ్లోత్, పైలట్ షేక్‌హ్యాండ్!
జైపూర్: రాజస్తాన్ కాంగ్రెస్‌లో గత నెల రోజులుగా నెలకొన్న సంక్షోభం సమసి పోయింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, తిరుగుబాటు నేత సచిన్ పైలట్ కలసిపోయారు. గహ్లోత్ అధికారిక నివాసంలో గురువారం పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండే, రణ్‌దీప్ సూర్జెవాలా, అజయ్ మాకెన్‌ల సమక్షంలో ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి ముందు ఈ భేటీ జరిగింది. పైలట్‌తో పాటు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లపై విధించిన సస్పెన్షన్‌ను కూడా పార్టీ ఎత్తి వేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని ఆరోపిస్తూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, వారి సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే గురువారం ట్వీట్ చేశారు. సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేసి.. పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తూ జూలై 14న జరిగిన సీఎల్పీ భేటీకి హాజరుకాకపోవడంతో నాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న పైలట్‌ను, పర్యాటక మంత్రిగా ఉన్న విశ్వేంద్ర సింగ్‌ను పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. పైలట్‌ను పీసీసీ చీఫ్ పదవి నుంచి సైతం తొలగించారు. తనతో పాటు తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేలను పైలట్ గురుగ్రామ్‌లోని ఒక హోటల్లో ఉంచారు. అనంతరం, ఇటీవల అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో భేటీ అయిన అనంతరం మళ్లీ పార్టీ గూటికి పైలట్ తిరిగొచ్చారు. పైలట్ వర్గం ఎమ్మెల్యేలు కూడా జైపూర్ తిరిగి వచ్చారు. గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు జైసల్మేర్ నుంచి జైపూర్ వచ్చి, ఇక్కడి ఫెయిర్మాంట్ హోటల్లో ఉన్నారు. ఆగస్ట్ 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేవరకు వారు అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అపార్థాలను క్షమించాలి.. మరచిపోవాలి కాంగ్రెస్ పార్టీలో అపార్థాలు చోటు చేసుకుంటూనే ఉంటాయని, వాటిని క్షమించి మరచిపోయి, ముందుకు సాగుతూ ఉండాలని ముఖ్యమంత్రి గహ్లోత్ వ్యాఖ్యానించారు. ‘నెల రోజులుగా కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయి. దేశం, రాష్ట్రం, ప్రజాస్వామ్యం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాటిని క్షమించి, మరచిపోయి, ముందుకు సాగాలి’ అని గహ్లోత్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర ఆట దేశంలో సాగుతోందని బీజేపీపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. ‘దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను ఒకటొకటిగా కూల్చే కుట్ర జరుగుతోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్‌లలో అదే జరిగింది. ఈడీ, సీబీఐ, ఐటీ, న్యాయవ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు’ అని వరుస ట్వీట్లు చేశారు. విశ్వాస పరీక్ష నేటి నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. గెహ్లోత్ అధ్యక్షతన గురువారం జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, అందుకు కొన్ని గంటల ముందే, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తామని విపక్ష బీజేపీ ప్రకటించింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని బీజేపీ శాసనసభాపక్ష భేటీ అనంతరం అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా ప్రకటించారు. ‘కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. ఇవన్నీ అసెంబ్లీలో లేవనెత్తుతాం’ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారమే అవిశ్వాస తీర్మానం పెడతామని రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతిశ్ పూనియా తెలిపారు. ‘గహ్లోత్ సర్కారు కోమాలో ఉంది. ప్రభుత్వం స్థిరంగా లేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’ అని బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ పేర్కొన్నారు. -
నయీం కేసులో ఆ ముగ్గురికి ఊరట
సాక్షి, హైదరాబాద్: నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన మరో ముగ్గురు అధికారులపై రాష్ట్ర పోలీస్ శాఖ సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సస్పెన్షన్‌లో ఉన్న ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రాజగోపాల్, మస్తాన్‌వలీ తిరిగి విధుల్లో చేరారు. ఏసీపీ చింతమనేని శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేశారు. అదే విధంగా ఇన్స్పెక్టర్ రాజగోపాల్ నార్త్‌జోన్ ఐజీ కార్యాలయంలో, మస్తాన్‌వలీ వెస్ట్‌జోన్ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. సస్పెన్షన్‌కు ముందు ఏసీపీ శ్రీనివాస్ నగర కమిషనరేట్‌లోని సీసీఎస్‌లో పనిచేయగా, రాజగోపాల్ కొత్తగూడెం ఇన్స్పెక్టర్గా, మస్తాన్‌వలీ సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. కొద్ది రోజుల క్రితమే అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌రావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన పోలీస్ శాఖ.. తాజాగా మిగిలిన ముగ్గురిపై ఎత్తివేయడంతో మొత్తం ఐదుగురు అధికారులు తిరిగి విధుల్లో చేరారు. అయితే వీరిలో ఎవరికి కూడా ఇప్పటివరకు పోస్టింగ్‌లు కేటాయించలేదు. వీరితో పాటు అదనపు ఎస్పీ సునీతారెడ్డి సైతం ఇటీవల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసి వెయిటింగ్లో ఉన్నారు. పోలీస్ శాఖ వీరందరికీ త్వరలోనే పోస్టింగులు కల్పించనున్నట్లు తెలిసింది. -
నయీమ్ కేసులో వారికి ఊరట
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సస్పెండ్‌కు గురయిన పోలీసు అధికారులకు ఊరట లభించింది. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం ఆతనితో కలసి పలువురు పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నయీమ్‌కు అండగా నిలిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్‌తోపాటు ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. తాజాగా వీరిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో వారు శుక్రవారం డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు. -
ఇద్దరమే ఉన్నా ప్రజాసమస్యలపై నిలదీస్తాం
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ... ప్రజాసమస్యలపై గళమెత్తి పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తుందని విమర్శించారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినంత మాత్రాన తాము వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. సభలో ఇద్దరు ఎమ్మెల్యేలమే ఉన్నామని...అయినా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తనకు, ఆర్ కృష్ణయ్యకు బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం కల్పించాలని ఆయన స్పీకర్‌కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సభ్యుల సస్పెన్షన్‌పై ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. సభ సజావుగా సాగనీయడం లేదని గురువారం 10 మంది టీటీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ వారం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ సహచరులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. -
'సస్పెన్షన్ ఎత్తివేత... సచివాలయంలో పోస్టింగ్'
ఏపీఎన్జీవో సభలో తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిని సచివాలయంలోనే పోస్టింగ్ ఇస్తున్నట్లు ఆదేశాలలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ... ఏపీఎన్జనీవోలు గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన నగరంలోని లాల్ బహద్దుర్ స్టేడియంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన కానిస్టేబుళ్లు శ్రీనివాసగౌడ్, శ్రీశైలం ముదిరాజ్‌ల జై తెలంగాణ అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఇరుసభలు ఆమోదించడంతోపాటు రాష్ట్రపతి రాజముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పనులు చకచక జరిగిపోయాయి. తెలంగాణ ఆవిర్బావానికి జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమ ప్రాంతానికి చెందిన కానిస్టేబుళ్లపై నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.