ఇద్దరమే ఉన్నా ప్రజాసమస్యలపై నిలదీస్తాం | Suspension lift on TTDP mlas, demands Madhavaram Krishna rao | Sakshi
Sakshi News home page

ఇద్దరమే ఉన్నా ప్రజాసమస్యలపై నిలదీస్తాం

Published Fri, Nov 14 2014 1:23 PM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

ఇద్దరమే ఉన్నా ప్రజాసమస్యలపై నిలదీస్తాం - Sakshi

ఇద్దరమే ఉన్నా ప్రజాసమస్యలపై నిలదీస్తాం

హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ... ప్రజాసమస్యలపై గళమెత్తి పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తుందని విమర్శించారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినంత మాత్రాన తాము వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.

సభలో ఇద్దరు ఎమ్మెల్యేలమే ఉన్నామని...అయినా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తనకు, ఆర్ కృష్ణయ్యకు బడ్జెట్పై మాట్లాడే అవకాశం కల్పించాలని ఆయన స్పీకర్కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సభ్యుల సస్పెన్షన్పై ఈ రోజు సాయంత్రం గవర్నర్ను కలుస్తామని తెలిపారు. సభ సజావుగా సాగనీయడం లేదని గురువారం 10 మంది టీటీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ వారం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ సహచరులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement