సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సస్పెండ్‌కు గురయిన పోలీసు అధికారులకు ఊరట లభించింది. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం ఆతనితో కలసి పలువురు పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నయీమ్‌కు అండగా నిలిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్‌తోపాటు ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. తాజాగా వీరిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో వారు శుక్రవారం డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment