rejoin
-
మళ్లీ బీజేపీలోకి గాలి జనార్దనరెడ్డి
సాక్షి, బెంగళూరు: మైనింగ్ వ్యాపారి, కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష(కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి మళ్లీ కాషాయ పారీ్టలోకి చేరబోతున్నారు. కేఆర్పీపీని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆ పారీ్టలో చేరనున్నట్లు ఆదివారం మీడియాకు తెలిపారు. నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానమంత్రిగా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. బళ్లారిలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బి.శ్రీరాములుకు మద్దతు తెలిపారు. బీఎస్ యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జనార్దనరెడ్డి, ఆ తర్వాత మైనింగ్ కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. కేఆర్పీపీని సొంతంగా ఏర్పాటు చేసి, 2023 ఎన్నికల్లో పోటీ చేశారు. -
మళ్లీ రాజకీయాల్లోకి తమిళిసై
సాక్షి, చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, అన్నామలై, ఎల్.మురుగన్ సమక్షంలో పారీ్టలో చేరారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ్యత్వ కార్డును అందజేశారు. గవర్నర్‌గా చేసి మళ్లీ రాజకీయాల్లోకి రావడమేంటని విపక్ష పారీ్టలు, అధికార డీఎంకే చేస్తున్న విమర్శలపై అన్నామలై స్పందించారు. ‘‘ రాజ్యాంగబద్ధ విశిష్ట పదవుల్లో కొనసాగి కూడా తర్వాత సాధారణ కార్యకర్తలా పనిచేసే సదవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుంది. ఇతర రాజకీయ పారీ్టల్లో పనిచేసి తర్వాత గవర్నర్ అయిన వారు మళ్లీ సాధారణ జీవితం కోరుకోరు. వాళ్లకు అత్యున్నత పదవుల్లో కొనసాగడమే ఇష్టం. కానీ బీజేపీ నేతలు అందుకు పూర్తి భిన్నం’ అని ఆయన అన్నారు. -
ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఉద్యోగం
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభుత్వ డాక్టర్ దీపక్ ఘోగ్రా(43)కు రాష్ట్ర హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన మళ్లీ ఉద్యోగంలో చేరడానినికి అంగీకరించింది. దీపక్ భారతీయ ట్రైబల్ పార్టీ టికెట్‌పై దుంగార్పూర్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. పరాజయం పాలైతే ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో దీపక్ ఓడిపోతే మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. -
యునెస్కోలోకి మళ్లీ అమెరికా!
పారిస్: అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతులు, ప్రపంచదేశాలతో సత్సంబంధాల్లో ‘పెద్దన్న’ అనే పేరు కోసం తమతో పోటీపడుతున్న చైనాను నిలువరించేందుకు అమెరికా మరో అడుగు ముందుకేసింది. యునెస్కోలోని చైనా పలుకుబడిని తగ్గించేందుకే అమెరికా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కృత్రిమ మేథ, సాంకేతిక విద్య వంటి అంశాల్లో యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా పాటించే ప్రమాణాలు, విధాన నిర్ణయాలను తనకు అనువుగా మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇటీవల అమెరికా ఉన్నతాధికారి ఒకరు ఆరోపించడం తెల్సిందే. దీంతో యునెస్కోలో తాజా సభ్యత్వం కోసం అమెరికా రంగంలోకి దిగుతోంది. యునెస్కోలో అమెరికా మళ్లీ చేరబోతున్నట్లు ఆ దేశ అధికారులు సోమవారం ప్రకటించారు. గతంలో పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకునే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా యునెస్కో నుంచి తప్పుకుంటానని బెదిరించింది. 2017లో నాటి ట్రంప్ సర్కార్ యునెస్కో నుంచి వైదొలగింది. ఆనాటి నుంచి దాదాపు రూ.5,100 కోట్ల విరాళాలు ఆపేసింది. తాజాగా ఆ నిధులన్నీ చెల్లిస్తామంటూ యునెస్కో మహిళా డైరెక్టర్ జనరల్ ఆండ్రీ ఆజౌలేకు అమెరికా ఉన్నతాధికారి రిచర్డ్ వర్మ లేఖ రాశారు. గతంలో యునెస్కోకు అమెరికానే అతిపెద్ద దాతగా ఉండేది. ఇది యునెస్కోకు చరిత్రాత్మక ఘటన అంటూ అమెరికా తాజా నిర్ణయాన్ని ఆండ్రీ స్వాగతించారు. -
తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్ఎస్లోకి తిరిగి వలసలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలను.. తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఈ మేరకు చేరికల కోసం స్వయంగా ఆయనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు బీజేపీని గట్టి దెబ్బ కొట్టాలనే ఆలోచన చేసినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు నేతలు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది టీఆర్ఎస్. స్వయంగా ఉద్యమ నేతలకు కేసీఆరే ఆహ్వానం అందించినట్లు అధికారిక సమాచారం. ఇప్పటికే దాసోజు శ్రవణ్ చేరిక ఖరారుకాగా.. స్వామిగౌడ్, జితేందర్‌రెడ్డిలో సైతం టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. వీళ్లతో పాటు నాటి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలందరికీ తిరిగి పార్టీలోకి ఆహ్వానం అందించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఉద్యమ నేతల్లో కొందరికి స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. అంతేకాదు.. వాళ్లకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని మాటిస్తున్నట్లు తెలుస్తోంది. స్వామిగౌడ్ చేరిక దాదాపు ఖాయమైందని టీఆర్ఎస్ శ్రేణులు చెప్తుండగా.. జితేందర్‌రెడ్డితో చర్చల కోసం నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డితోనూ సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీని వీడిన వాళ్లను తిరిగి ఆహ్వానించడం ద్వారా.. బీజేపీ వలస రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రత్యర్థులకు వ్యూహాలను దెబ్బ కొట్టవచ్చని గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ రచించినట్లు స్పష్టమవుతోంది. -
West Bengal: మళ్లీ టీఎంసీలోకి వస్తాం.. వినతుల వెల్లువ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడిన నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎన్నికల్లో తృణమూల్ ఓటమి, బీజేపీ గెలుపు ఖాయమని నమ్మి కాషాయ కండువాలు కప్పుకున్న నాయకులంతా ఇప్పుడు ‘బ్యాక్ టు హోం’ ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు నాయకులు మళ్లీ మమత కరుణ కోసం అంతర్గత ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరైతే బహిరంగంగానే ‘తప్పనిసరై’ బీజేపీలోకి వెళ్లామని ప్రకటనలు చేస్తున్నారు. ‘కరోనా సంక్షోభ సమయంలో రాజకీయాలు సరికాదని రాష్ట్ర ప్రజలు సరైన, స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు’ అని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన టీఎంసీ మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మళ్లీ తనను టీఎంసీలోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సొనాలి గుహ కోరారు. ‘ఒకవైపు, రాష్ట్రం కరోనాతో అల్లకల్లోలమవుతుంటే, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చేపట్టింది. నారద కేసులో టీఎంసీ నేతలను అరెస్ట్ చేసింది. అదే రోజు నేను బీజేపీని వదిలేశాను’ అని ఫుట్‌బాల్ మాజీ ఆటగాడు, బషిర్హట్ దక్షిణ్ ఎమ్మెల్యే దీపేందు బిశ్వాస్ మమతకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. టీఎంసీలోకి మళ్లీ వస్తామని బహిరంగంగా ఆకాంక్ష వ్యక్తం చేసిన నాయకుల్లో సరళ ముర్ము కూడా ఉన్నారు. మరోవైపు, ఒకప్పుడు టీఎంసీలో నెంబర్ 2 స్థాయి నేత, ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ మౌనం అందరినీ ఆకర్షిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ విజయం ఖాయమైనప్పటి నుంచీ.. ఆయన నుంచి రాజకీయ ప్రకటనలేవీ రాలేదు. అయితే, బీజేపీలోనే కొనసాగుతానని ఒక ట్వీట్ మాత్రం చేశారు. ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి రాబోతున్నారనే వార్తలు ఇటీవల ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ కోవిడ్‌తో బాధపడుతున్న ముకుల్ రాయ్ భార్య కృష్ణను ఇటీవల కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ తరువాత, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆసుపత్రికి వెళ్లడం, ఆ మర్నాడే ప్రధాని మోదీ ముకుల్ రాయ్‌కు ఫోన్ చేసి పరామర్శించడం వెంటవెంటనే జరిగాయి. కోవిడ్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ముకుల్ రాయ్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. -
ఫస్ట్ అవర్‌లో హ్యాపీగా జాయిన్ కండి...
అందరూ శుక్రవారం (నేడు) ఫస్ట్ అవర్‌లో హ్యాపీగా జాయిన్ కండి. కార్మికులను చేర్చుకోవాలని ఆర్టీసీకి ఇప్పుడే లిఖితపూర్వకమైన ఉత్తర్వులు ఇస్తం. ఆర్టీసీ మీ సంస్థ. మీరు బతకాలని కోరుతున్నం. ఈ సమస్య సుఖాంతం అవుతదని నేను ఆశిస్తున్న. మీకు ఏ యూనియన్ సహాయపడదు. యూనియన్ లేకపోతే ఎట్లా అని మీకు అనుమానం ఉంటది. యాజమాన్యం వేధింపులు భరించాలా? అని అనుకోకండి. మీకు డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ పెడతా. సానుభూతితో వ్యవహరించే సీనియర్ మంత్రిని ఇన్చార్జిగా పెడతా. సమ్మె ప్రక్రియలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒక వ్యక్తికి వీలైతే ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగమిస్తం. వారు మా బిడ్డలు. వారిని కాపాడుకుంటం. వాళ్లను గాలికి వదలం. వారి కుటుంబాలకు తక్షణ సహాయం కూడా చేస్తం. తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న. గత నాలుగైదేళ్ల నుంచి రూపాయి కూడా చార్జీ పెంచలేదు. కానీ సంస్థ మనది. కార్మికులు మన బిడ్డలు. వారు కూడా బతకాలి. వాళ్లు మనలో భాగమే. కొంత చార్జీల భారం పెంచుతం. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినట్లయితే సంస్థకు ఏటా రూ. 750 కోట్ల అదనపు ఆదాయం వస్తది. కొంత నష్టాన్ని కూడా పూడుస్తది. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు విని పెడదారి పడుతున్నరు. చెడిపోతున్నరు. సంస్థను దెబ్బతీస్తున్నరు. జీవితాలు పాడుచేసుకుంటున్నరు. లేని టెన్షన్‌కు గురవుతున్నరు. ప్రధాన సమస్య అదే. దాని వల్ల ఈ రోజు అసంబద్ధమైన డిమాం డ్లతో అనాలోచితమైన సమ్మెను ఇంత దూరం తెచ్చిండ్రు. సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తుపై బెంగతో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొండంత భరోసా ఇచ్చారు. సమ్మె చేసిన కార్మికులందరినీ ఎలాంటి షరతుల్లేకుండా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ‘అందరూ శుక్రవారం (నేడు) ఫస్ట్ హవర్లో హ్యాపీగా జాయిన్ కండి. కార్మికులను చేర్చుకోవాలని ఆర్టీసీకి ఇప్పుడే లిఖితపూర్వకమైన ఉత్తర్వులు ఇస్తం. ఆర్టీసీ మీ సంస్థ. మీరు బతకాలి కోరుతున్నం. ఈ సమస్య సుఖాంతం అవుతదని నేను ఆశిస్తున్న’అని సీఎం పేర్కొన్నారు. ‘ఎన్నో సంస్థలను కాపాడినం. ఎంతో మందికి అన్నం పెట్టినం. వీళ్లను (ఆర్టీసీ కార్మికులను) బజార్లో పడేసి మనం జేసేది ఏముంటది? ఒక చాన్స్ ఇచ్చి చూద్దాం మనం’’అని మంత్రులందరూ విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ఆర్టీసీ అంశంపై కేసీఆర్ స్పందన ఆయన మాటల్లోనే... ఎలాంటి షరతులు పెట్టట్లేదు... బాధ్యత గల సీఎంగా, తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని (ఆర్టీసీ కార్మికులను) మా బిడ్డలుగా భావించి రోడ్డున పడేయవద్దని చెబుతున్న. జాయిన్ కండి. ఎటువంటి కండిషన్లు మీకు పెట్టం. మీరు ఉద్యోగ భద్రత, యాజమాన్యం నుంచి వేధింపులు లేకుండా రక్షణ కోరుకోవడంలో తప్పులేదు. కానీ క్రమశిక్షణారాహిత్యంతో మేము చెడగొడుతా ఉంటం.. మీరు కాపాడండి అంటే మిమ్నల్ని భగవంతుడూ కాపాడలేడు. మీరు ముందల పడటానికి, సంసారం నడపడానికి ప్రభుత్వం నుంచి రేపు తెల్లారే వరకు ఓ రూ.100 కోట్లు (ఆర్టీసీ తక్షణ అవసరాల కోసం కేబినెట్ నిర్ణయం మేరకు రూ.100 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ గురువారం రాత్రి ఉత్తర్వులిచ్చింది.) ఇస్తం. కొంత చార్జీలు పెంచుతాం... తెలంగాణ ప్రజలకూ విజ్ఞప్తి చేస్తున్న. టీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చాక ఒకే ఒకసారి ఆర్టీసీ చార్జీలు పెంచినం. గత నాలుగైదేళ్ల నుంచి రూపాయి కూడా పెంచలేదు. కానీ సంస్థ మనది. కార్మికులు మన బిడ్డలు. వారు కూడా బతకాలి. వాళ్లు మనలో భాగమే. కొంత చార్జీల భారం పెంచుతం. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినట్లయితే సంస్థకు ఏటా రూ. 750 కోట్ల అదనపు ఆదాయం వస్తది. కొంత నష్టాన్ని పూడుస్తది. చార్జీలు పెంచుకోవడానికి ఎండీకి అధికారమిస్తూ ఇప్పుడే ఆదేశాలిస్తం. ప్రజలు మానసికంగా సిద్ధం కావాలి కాబట్టి వచ్చే సోమవారం నుంచి పెంచిన చార్జీలు వసూలు చేసుకోవచ్చు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒక వ్యక్తికి వీలైతే ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగమిస్తం. వారు మా బిడ్డలు. వారిని కాపాడుకుంటం. వాళ్లను గాలికి వదలం. వారి కుటుంబాలకు తక్షణ సహాయం కూడా చేస్తం. వారికి ఆడపిల్ల ఉన్నా, అబ్బాయి ఉన్నా ఎవరూ లేక తల్లిదండ్రులు ఉన్నా వారు ఏ రకమైన ఉద్యోగానికి అర్హులైతే ఆ ఉద్యోగాన్ని కల్పిస్తం. మాకు ఆ మానవత్తం ఉంది. వారికి ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలనుకున్నాం.. బస్సులు ప్రైవేటు చేస్తమని మేము అనుకున్నది వేరు. బయట సన్నాసులు ప్రచారం చేసింది వేరు. వాస్తవానికి మాకు సంపూర్ణ అధికారం ఉంది. ఈ రోజు మేము అనుమతులివ్వొచ్చు. ఏదో కక్షపూరితంగా సాధించే ఉద్దేశాలు, ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పూర్తిగా ఆర్టీసీ లేదు. 35 వేల ప్రైవేటు బస్సులకు అనుమతులిచ్చిర్రు. బీజేపీ పాలించే ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది వేలు ఆర్టీసీ బస్సులుంటే 25 వేల ప్రైవేటు బస్సులున్నయి. ప్రైవేటు పర్మిట్లను పెట్టుబడిదారులు, షావుకార్లకు ఇవ్వదలుచుకోలేదు. ఒకవేళ సంస్కరణలు తెచ్చి ఆర్టీసీలో కొద్ది మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటే నలుగురైదుగురిని కలిపి పర్మిట్లు ఇద్దామనుకున్నం. యూనియన్లదే పూర్తి బాధ్యత.. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు విని పెడదారి పడుతున్న రు. చెడిపోతున్నరు. సంస్థను దెబ్బతీస్తున్నరు. జీవితాలు పాడుచేసుకుంటుర్రు. ప్రధాన సమస్య అదే. దాని వల్ల ఈ రోజు అసంబద్ధమైన డిమాండ్లతో అనాలోచితమైన సమ్మెను ఇంత దూరం తెచ్చిండ్రు. దీనికి పూర్తి బాధ్యత వారే వహించాలి. ఈ బాధ, అవస్థకు, ప్రయాసకు ఇంకెవరూ బాధ్యత వహించరు. సీజే ఒక్కరే కన్సర్న్ చూపించారు.. నిజంగా కార్మికుల గురించి కొద్దిగా సిన్సియర్‌గా ఆలోచన చేసినవారు ఎవరైనా ఉన్నారంటే హైకోర్టు చీఫ్ జస్టిసే. నాకు మొన్న రాజ్‌భవన్‌లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్పారు. వాళ్లు పేద కార్మికులు, వారిని బతికించే ప్రయత్నం చేయండి అని. ఆయన బెంచి మీద అదే చెప్పిండు. పాపం వీళ్ల బతుకులేమిటి? యూనియన్ వాడు ఎవడో.. వీడు ఎవడో కానీ అమాయకులు సస్తున్నరు అని కన్సర్న్ చూపించినరు. ఫైనల్‌గా అతి ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన పరిధిలో ఆయన ఆదేశాలిచ్చిండు. అతి చేసింది అంతా యూనియన్ నేతలు, ప్రతిపక్షాలే. ఇక్కడొచ్చి డంకీలు కొడ్తరా? .. ఇక్కడున్న ఓ కేంద్ర మంత్రి, నలుగురు బీజేపీ ఎంపీలు మొన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రవాణాను ప్రైవేటీకరణ చేసే చట్టానికి ఓటేశారు. కానీ ఇక్కడకొచ్చి డంకీలు కొడ్తరా? ఇంత ఆత్మవంచననా? ఇంకా కార్మికులను మభ్యపెడ్తున్నరు. ఢిల్లీ తీసుకెళ్తం. ఎల్లయ్య నుంచి అపాయింట్మెంట్ ఇప్పిస్తమని. ఢిల్లీ ఎల్లయ్య ఏం చేస్తడు? ఏం ఉంటది వాళ్ల చేతిలో? కేంద్రం వాటా ఉంది అంటున్నారు. కేంద్రం వాటా మాకు ఎంత తేలుతదో లెక్క తీస్తున్నం. కేంద్రం మీద కచ్చితంగా కోర్టుకు వెళ్తం. 1955లో ఏదో రూ. 10 కట్టి పొత్తు కలిశారు తప్ప సమైక్య రాష్ట్రంలో లేదా తెలంగాణలో ఆర్టీసీకి కేంద్రం ఏకాణ ఇచ్చింది లేదు. వాళ్ల 31 శాతం వాటా ప్రకారం ఆడనుంచి ఈడదాకా లెక్కలు తీస్తే రాష్ట్రం పెట్టిన పెట్టుబడులకు కేంద్రం నుంచి రూ. 22 వేల కోట్లు రావాలి. రేపు నోటీసులిస్తం వారికి. తుపాకీతో కొడ్తమంటే మళ్లీ కనిపిం చరు రిటర్న్కల్ల. మేము పైసలు కడ్తం. వీళ్లు కనబడతారు? ఒక ఐదు రూపాయిలు ఇస్తరండి వాళ్లు? రూ. 5 వేల కోట్లు ఇవ్వమంటే ఇస్తరా? శుష్కప్రియాలు శూన్య హస్తాలు, తియ్యపుల్లటి మాటలు, రాజకీయ చలిమంటలు కాసుకోవడం తప్ప ఇవాళ మళ్లీ వస్తరా? కేంద్ర ప్రభుత్వం వస్తదా? ఎవరైతే బీజేపీ నాయకులు జబ్బలుచరుచుకొని మాట్లాడుతున్నరో ఓ 500 కోట్లు తెస్తరా... ఇస్తరా? ఆర్టీసీని కాపాడుతారా? ఇది రాజకీయమా? కార్మికుల బతుకులతో ఆడుకుంటరా? వారంలో సమావేశమవుతా.. వచ్చే నాలుగైదు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలవాల్సి ఉంది. మన ఐఐఎం ఫైల్ ప్రాసెస్ అయినట్టు తెలిసింది. నేను ఢిల్లీ వెళ్లి వచ్చేలోగా లేదా వెళ్లి వచ్చిన తెల్లారి లేదా వచ్చే వారంలోగా ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిపించి నేనే మాట్లాడతా. ఆర్టీసీలో ఏం జరుగుతోందో నేనే స్వయంగా వారికి చెబుతా. ఆర్టీసీలో నిజమైన పరిస్థితుల గురించి, కాలం చెల్లిన బస్సుల గురించి కార్మికులకు తెలుసా? తెలియదా? యూనియన్ల నషాలోపడి కొట్టుకొపోతున్నరా? నాకు తెలియదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, బస్సుల స్థితి, అప్పులకు సంబంధించి కేబినేట్ మీటింగ్‌లో అధికారులు సమర్పించిన పత్రాలను తెలుగులో ముద్రించి మొత్తం 49 వేల మంది కార్మికులకు ఇస్తం. మీరు చదువుకోండి. వాస్తవాలు తెలుసుకుని మానసికంగా సిద్ధమై మీటింగ్‌కు రండి. ఇక్కడ అందరం కలిసి మంచిగా మాట్లాడి భోజనం చేసి ఒక నిర్ణయం తీసుకుందాం. క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా ఆర్టీసీని లాభాల్తో తెస్తం. ప్రతి సింగరేణి కార్మికుడు రూ. లక్షా 60 వేల బోనస్ తీసుకున్నరు. ఏటా రూ. 40, 50 వేల బోనస్ ఎలా సంపాధించుకోవచ్చో నేనే చూపెడతా. నా మాట వింటే మీరు అలా లాభపడుతారు. ఇంత చెడగొట్టి ఇంత నాశనం చేసిన యూనియన్లను మాత్రం మేము ఈ భేటీకి రానీయం. 10–19 మంది చనిపోవడానికి కారణమైనటువంటి యూనియన్లను క్షమించదలుచుకోలేదు. ఇద్దరు చొప్పున వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ మీకు డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ పెడతా. సానుభూతితో వ్యవహరించే సీనియర్ మంత్రిని ఇన్చార్జిగా పెడతా. ప్రతి నెలా యథావిధిగా నిర్ణీత తేదీలో సమావేశం జరిగేలా ఏర్పాట్లు చేస్తా. యాజమాన్యం మిమ్మల్ని వేధించకుండా చూస్తా. సంస్థ వేరు, కార్మికులు వేరు అనే అభిప్రాయాన్ని యూనియన్లు కల్పించాయి. సంస్థ మీది. సంస్థ మనుగడలో మీ బతుకు ఉన్నది. సంస్థ మునిగిన తర్వాత మీరు ఎక్కడ ఉంటరు? మీకు ఇది అవగతం కావాలనే కఠినంగా వ్యవహరించా. ఉన్మాదంలో పడకండి: 20 ఏళ్ల కింద రవాణా మంత్రి గా ఆర్టీసీని రూ. 13.80 కోట్ల నష్టాల నుంచి రూ. 14.50 కోట్ల లాభంలోకి తెచ్చా. ఆర్టీసీకి అది స్వర్ణయుగం. అకస్మాత్తుగా రామారావు అనే యూనియన్ నేత 11 రోజుల సమ్మె చేసిండు. తర్వాత ఆయన సమ్మె విరమణకు గౌరవప్రదమైన రిట్రీట్ కావాలి అన్నడు. నీ మొఖం కూడా చూడనని అన్నా. మా యూనియన్ బతకాలి కదా అందు కే సమ్మె చేసినట్లు తర్వాత నాతో అన్నాడు. సంస్థ బతికి ఉంటే కదా నీ యూనియన్ బతికి ఉండేది అన్న. యూనియన్ బతకాలన్న ప్రక్రియలో సంస్థను చంపితే ఎలా? ఇప్పుడు కూడా ఇదే ఉన్మాదం. ఉన్మాదంలో పడి మీ బతుకులు పాడు చేసుకోవద్దు. తాత్కాలికంగా పనిచేసిన మిత్రులున్నరో వారికి కృతజ్ఞతలు చెబుతున్న. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ గురించి ఆలోచన చేస్తం. ఎవరి పొట్టా కొట్టలేదు.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పొట్టలు నింపినం తప్ప ఎవరి పొట్టలూ కొట్టలె. దేశం మొత్తంలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న అంగన్వాడీ టీచర్లు, హోంగార్డులు, ఆశ వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులకు మూలవేతనంలో 30 శాతం రిస్క్ అలవెన్స్ ఇస్తున్న, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే ప్రధాని ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా ఇవ్వడం లేదు. బజార్లో పడేసింది ప్రతిపక్షాలు, యూనియన్లే ప్రతిపక్షాలు, యూనియన్ నేతలు కార్మికులకు లేని భరోసా కల్పించి బజార్ల పడేశారు. ఇవాళ చివరకు లేబర్ కోర్టుకు రెఫర్ చేస్తే ఏం ఉందండి? సెక్షన్ 22 (1ఏ), 1 (బీ) ప్రకారం ఇప్పటికే కార్మికులు చట్టవ్యతిరేక సమ్మెలో ఉన్నరు. ఇంకా ఏ లేబర్ కోర్టు ప్రకటించాల్సిన అవసరం లేదు. మేం తలుచుకుంటే ఒక్క క్షణంలో లేబర్ కోర్టుకు రెఫర్ చేయగలం. అటోమెటిక్‌గా సమ్మె అక్రమమని డిక్లేర్ చేస్తరు. తర్వాత ఏంది? చాలా ఇబ్బంది వస్తది. బతుకులు పోతయి. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఏం అవసరముంది? మేము ఆర్టీసీ కార్మికుల పొట్టగొడతామా? వారి ఉద్యోగాలు తీసేస్తమా? కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది: కె. లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమస్యను కేంద్రం తీవ్రంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, అలాగే పరోక్షంగా నితిన్ గడ్కరీ ప్రైవేటీకరణకు ఒప్పుకోకపోవడం వంటి అంశాలు రాష్ట్ర మంత్రి మండలి, ముఖ్యమంత్రిపై ప్రభావం చూపాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ వ్యవహారశైలే కారణమన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడిన అంశాలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేలా కేంద్రంపై నింద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్టీసీ కార్మికులవి పేద బతుకులని, వారికి అన్యాయం చేయవద్దని ఒక ప్రత్యేక సమావేశంలో అన్నారని, ఈ వ్యాఖ్యలు కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమని చెప్పారు. -
కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేం ద్రం తరఫున కేసీఆర్‌ను కోరుతున్నామన్నారు. మన కార్మికులు, తెలంగాణ బిడ్డలు అన్న దృక్పథంతో సీఎం వ్యవహరించాలని కోరారు. శనివారం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిస్తూ, ఆర్టీసీ సమ్మె పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందని, ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ బిడ్డలన్న ఆలోచనను సీఎం కేసీఆర్ చేయాల్సి ఉందన్నారు. సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేయడం పట్ల కార్మికులను అభినందిస్తున్నట్లు చెప్పారు. కాగా, వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ను పాకిస్తాన్ నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. -
లేఖ ఇచ్చినా డ్యూటీ దక్కలేదు
సాక్షి, హైదరాబాద్ : సమ్మెలో ఉండి తిరిగి విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల్లో కొం దరి పరిస్థితి అయోమయంలో పడింది. ఈనెల ఐదవ తేదీ అర్ధరాత్రి లోపు విధు ల్లో చేరినవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పెట్టిన గడువుకు 495 మంది విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతూ లేఖలు ఇచ్చారు. వారిలో 220 మందే ఇప్పుడు విధులకు హాజరవుతున్నారు. మిగిలిన 275 మందిని సమ్మెలో ఉన్నట్టుగానే అధికారులు పరిగణిస్తున్నారు. వీరు సమ్మెలోకి వెళ్లకుండా విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. అధికారులనుంచి పిలుపు రాకపోవటంతో వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరు విధుల్లో చేరుతున్నట్లు సమర్పించిన లేఖ లు తమకు అందలేదని డిపో మేనేజర్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి వేతనాల్లేక ఇబ్బంది పడుతున్నందున, ఇప్పుడు డ్యూటీలో లేనట్టుగా అధికారులు పరిగణిస్తే ప్రస్తుత నెల వేతనం కూడా అందదన్న ఆందోళనతో ఉన్నారు. అసలేం జరిగింది.. ఈనెల 2న సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ప్రకటనకు తొలిరెండ్రోజులు కార్మికుల నుంచి స్పందనలేదు. పనిచేస్తోన్న డిపోలోనే కాకుండా ఏ డిపోలో లేఖ ఇచ్చినా స్వీకరిస్తామని, కలెక్టరేట్లు, పోలీసు స్టేషన్లు, ఆర్డీఓ కార్యాలయాలు..ఇలా కొన్ని ప్రత్యామ్నాయ కార్యాలయాలను ప్రకటించారు. చివరిరోజు ఎక్కువ మంది కార్మికులు ఆయా ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో అందజేశారు. ఈ లేఖల్లో కొన్ని మాత్రమే సంబంధిత డిపోలకు చేరగా, మిగతావి అందలేదు. ఇప్పుడదే ఈ గందరగోళానికి కారణమైంది. సమ్మె నుంచి బయటకొచ్చి ధైర్యం చేసి లేఖలిచ్చినా, అధికారులకు చేరకపోవటంతో వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. తమకు గడువులోపు లేఖలు అందినవారినే విధుల్లోకి తీసుకున్నామని, లేఖలిచ్చి విధులకు రాని వారి ని, లేఖలు ఇవ్వనివారిని సమ్మెలోనే ఉన్నట్టుగా పరిగణిస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. -
డిస్మిస్డ్ కార్మికులకు ‘ఒక్క అవకాశం’
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థల్లో పలు కారణాలతో డిస్మిసైన ఉద్యోగులకు ‘ఒక్క అవకాశం’లభించింది. మళ్లీ కొలువుల్లో చేరేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు సింగరేణి సంస్థ యాజమాన్యం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. 2000–18 మధ్య కాలంలో డిస్మిసైన 356 మంది కార్మికులు తిరిగి ఉద్యోగాలు పొందనున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో శుక్రవారం సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు సమక్షంలో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. గుర్తింపు సంఘం ఈ విషయాన్ని పలుమార్లు యాజమాన్యం, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం సానుకూలంగా స్పందించడంతో ఒప్పందానికి మార్గం ఏర్పడింది. దీర్ఘకాలంగా గైర్హాజరు, అనారోగ్య కారణాల వల్ల విధులకు హాజరుకాకపోవడంతో ఈ కార్మికులను సంస్థ అప్పట్లో తొలగించింది. -
సాక్షి మళ్లీ శిబిరానికి....
న్యూఢిల్లీ: జాతీయ శిక్షణ శిబిరంలో తిరిగి చేరేందుకు భారత మహిళా స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అనుమతించింది. సమాచారం ఇవ్వ కుండా శిబిరం నుంచి నిష్క్రమించడంతో మొదట ఆగ్రహించిన సమాఖ్య వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మొత్తం 25 మంది మాట మాత్రమైనా చెప్పకుండా, సంబంధిత వర్గాల అనుమతి లేకుండానే శిబిరం నుంచి జారుకున్నారు. ఇందులో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి (62 కేజీలు)తో పాటు సీమా (50 కేజీలు), కిరణ్ (76 కేజీలు) ఉన్నారు. ఈ ముగ్గురు ఇటీవలే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించారు. బుధవారం లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐ ఆదేశించగా సాక్షి... రక్షాబంధన్ వేడుకలో పాల్గొనేందుకే శిబిరం నుంచి పయనమైనట్లు వివరించింది. దీనిపై డబ్ల్యూఎఫ్ఐ ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమె తిరిగి శిబిరంలో కొనసాగేందుకు అనుమతిచ్చారు. -
నయీమ్ కేసులో వారికి ఊరట
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సస్పెండ్‌కు గురయిన పోలీసు అధికారులకు ఊరట లభించింది. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం ఆతనితో కలసి పలువురు పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నయీమ్‌కు అండగా నిలిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్‌తోపాటు ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. తాజాగా వీరిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో వారు శుక్రవారం డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు. -
తిరిగి సొంత పార్టీలోకి చేరిన వైఎస్ఆర్సీపీ నేత
సాక్షి, గుడివాడ : ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి సొంత పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను ఆయన మీడియా సమక్షంలో బయట పెట్టారు. త్వరలోనే టీడీపీ నేతలు తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. చంద్రబాబు వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభ పెట్టి రాజకీయం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. -
సొంతగూటికి దొంతి మాధవరెడ్డి
దిగ్విజయ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నర్సంపేట ఎమ్మెల్యే సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. పార్టీ బలోపేతానికే మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను ఆయన ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కండువాకప్పి దొంతిని కాంగ్రెస్‌లోకి దిగ్విజయ్ ఆహ్వానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు బలరాంనాయక్, వివేక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యతో కలిసి దొంతి మాధవరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేలకు తగినన్ని నిధులు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరారు. -
మళ్లీ విధుల్లోకి కోదండరామ్
సుదీర్ఘ సెలవు తర్వాత ఓయూలో రిపోర్టు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ సారథి ప్రొఫెసర్ కోదండరామ్ మళ్లీ అధ్యాపకుడిగా అవతారం ఎత్తనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆయన కళాశాల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిపోర్ట్ కూడా చేశారు. మరో రెండు రోజుల్లో సికింద్రాబాద్ పీజీ కళాశాలలో రాజనీతిశాస్త్ర అధ్యాపకునిగా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. 2015 సెప్టెంబర్‌లో ఆయన అధ్యాపకుడిగా పదవి విరమణ చేయనున్నారు. 2009 నవ ంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడిన మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు 2010లో అధ్యాపక విధులకు సెలవు పెట్టారు. ప్రస్తుతం పోలవరం ముంపు బాధితులకు అండగా పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు ఉద్యమ వ్యూహరచన చేస్తూనే మరో వైపు మధ్యమధ్యలో ఆరు మాసాల పాటు విద్యార్థులకు పాఠాలు బోధించారు. -
కిరణ్ కు సాయిప్రతాప్ షాక్
-
కాంగ్రెస్ గూటికి కాకా తనయులు!
-
కాంగ్రెస్ గూటికి కాకా తనయులు!
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ టీఆర్ఎస్ను వీడనున్నారా? మళ్లీ సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? జోరందుకుంటున్న ఈ ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ను ఆయన ఇంటికెళ్లి కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా మామూలు కారులో దిగ్విజయ్ ఇంటికెళ్లడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై వివేక్, వినోద్‌లు డిగ్గీ రాజాతో చర్చించినట్టు సమాచారం. గంటకు పైగా సమావేశమయ్యారు. వీరిద్దరూ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వివేక్, వినోద్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఖండించకపోవటం విశేషం. వివేక్ తాజా ఎంపీ కాగా, వినోద్ మాజీ మంత్రి. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు.