US Decides To Rejoin UNESCO After 5 Years Hiatus, Details Inside - Sakshi
Sakshi News home page

యునెస్కోలోకి మళ్లీ అమెరికా!

Published Tue, Jun 13 2023 5:09 AM | Last Updated on Tue, Jun 13 2023 9:47 AM

US decides to rejoin UNESCO after 5-year hiatus - Sakshi

పారిస్‌: అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతులు, ప్రపంచదేశాలతో సత్సంబంధాల్లో ‘పెద్దన్న’ అనే పేరు కోసం తమతో పోటీపడుతున్న చైనాను నిలువరించేందుకు అమెరికా మరో అడుగు ముందుకేసింది. యునెస్కోలోని చైనా పలుకుబడిని తగ్గించేందుకే అమెరికా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కృత్రిమ మేథ, సాంకేతిక విద్య వంటి అంశాల్లో యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా పాటించే ప్రమాణాలు, విధాన నిర్ణయాలను తనకు అనువుగా మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇటీవల అమెరికా ఉన్నతాధికారి ఒకరు ఆరోపించడం తెల్సిందే.

దీంతో యునెస్కోలో తాజా సభ్యత్వం కోసం అమెరికా రంగంలోకి దిగుతోంది. యునెస్కోలో అమెరికా మళ్లీ చేరబోతున్నట్లు ఆ దేశ అధికారులు సోమవారం ప్రకటించారు. గతంలో పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకునే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా యునెస్కో నుంచి తప్పుకుంటానని బెదిరించింది. 2017లో నాటి ట్రంప్‌ సర్కార్‌ యునెస్కో నుంచి వైదొలగింది. ఆనాటి నుంచి దాదాపు రూ.5,100 కోట్ల విరాళాలు ఆపేసింది. తాజాగా ఆ నిధులన్నీ చెల్లిస్తామంటూ యునెస్కో మహిళా డైరెక్టర్‌ జనరల్‌ ఆండ్రీ ఆజౌలేకు అమెరికా ఉన్నతాధికారి రిచర్డ్‌ వర్మ లేఖ రాశారు. గతంలో యునెస్కోకు అమెరికానే అతిపెద్ద దాతగా ఉండేది. ఇది యునెస్కోకు చరిత్రాత్మక ఘటన అంటూ అమెరికా తాజా నిర్ణయాన్ని ఆండ్రీ స్వాగతించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement