తిరిగి సొంత పార్టీలోకి చేరిన వైఎస్‌ఆర్‌సీపీ నేత | YSRCP MLA Kodali Nani Slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

తిరిగి సొంత పార్టీలోకి చేరిన వైఎస్‌ఆర్‌సీపీ నేత

Published Sun, Dec 31 2017 4:38 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

YSRCP MLA Kodali Nani Slams CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, గుడివాడ : ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ రవికాంత్‌ తిరిగి సొంత పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను ఆయన మీడియా సమక్షంలో బయట పెట్టారు. త్వరలోనే టీడీపీ నేతలు తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. చం‍ద్రబాబు వైఎస్సార్‌సీపీ నాయకులను ప్రలోభ పెట్టి రాజకీయం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement