Ravikanth
-
ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం!
మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్ -
ఇక చాలు ఆపండి.. నేను ఆమె భర్తను కాదు: నటుడు
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది అంబిక. సీనియర్ హీరోయిన్ రాధ సోదరి అయిన ఈ మలయాళ నటి తన సొంత భాషతో పాటు తమిళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ యాక్ట్ చేసింది. దొంగలు బాబోయ్ దొంగలు, మా నాన్నకు పెళ్లి, రాయుడు, నేటి గాంధీ, కొండవీటి సింహాసనం, మనసు పలికే మౌనరాగం.. ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం బుల్లితెరపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.రెండు పెళ్లిళ్లు?1988లో ఎన్నారై ప్రేమ్‌కుమార్‌ను పెళ్లాడగా వీరికి ఇద్దరు కుమారులు సంతానం. వ్యక్తిగత విభేదాల కారణంగా 1996లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2000వ సంవత్సరంలో నటుడు రవికాంత్‌ను పెళ్లాడగా 2002లో విడాకులు తీసుకున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వికీపీడియాలోనూ ఈ విషయం రాసి ఉండటంతో అందరూ అదే నిజమని భావిస్తున్నారు.భార్యాభర్తలుగా నటించినంత మాత్రాన..తాజాగా ఈ ప్రచారంపై నటుడు రవికాంత్ స్పందించాడు. 'నేను అంబిక భర్తనంటూ ప్రచారం చేస్తున్నారు. మేమిద్దరం పలు సినిమాల్లో భార్యాభర్తలుగా నటించినంత మాత్రాన నిజంగానే దంపతులమైపోతామా? మేమిద్దరం పక్క పక్క ఇంట్లోనే నివసిస్తాం. కాబట్టి షూటింగ్ ఉన్నప్పుడు రెండు కార్లు తీయకుండా ఒకే కారులో వెళ్తుంటాం. భార్యాభర్తలు కలిసొస్తున్నారంటూ అందరూ సరదాగా ఆటపట్టిస్తుంటారు.నేను ఆమె భర్తను కాదుఅంతేకానీ మేము పెళ్లి చేసుకోలేదు. అంబిక.. ప్రేమ్‌కుమార్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో ఉండేది. షూటింగ్స్ కోసం వచ్చి వెళ్తుండేది.. అంతే! నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు. తన భర్తను కానే కాదు' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా రవికాంత్ తమిళంలో సరోజ, బిర్యానీ, అభిమన్యు, మానాడు వంటి చిత్రాల్లో అలరించాడు. ప్రస్తుతం మలర్ అనే సీరియల్ చేస్తున్నాడు.చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు -
హాంగ్‌కాంగ్‌లో బుజ్జాయిలతో భోగిపండ్లు
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య స్థాపించక ముందు నుంచే దాదాపు రెండు దశాబ్దాలుగా భోగిపండ్లు వేడుకని చేస్తున్న, వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తమ సంతోషాన్ని తెలుపుతూ ఈ సంవత్సర నిర్వహించిన భోగిపండ్ల సరదాల విశేషాలు తెలిపారు. ముఖ్య అతిధులు స్థానిక యునెస్కో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీ తిరునాచ్ దంపతులు మరియు బాలవిహార్ గురువు శ్రీమతి చిత్ర జికేవీ దంపతులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా పిల్లలకు భోగి పండ్లు పొసే అంశాన్ని కొనసాగించారు. పిల్లలు సందడిగా చాకోలెట్లు ఏరుకొంటూ, మరి కొందరు అవి తినే ప్రయత్నం చేస్తుంటే వారి అమ్మ నాన్నలు వద్దని ఆరాట పడుతుంటే చూడ ముచ్చట కొలిపింది. మరింత ఆనందంగా కొనసాగింది పిల్లల కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం. ముఖ్య అతిధులు కూడా పిల్లలకు భోగి పండ్లు పోసీ ఆశీర్వదించి చాలా సంతోశాన్ని తెలిపారు. తమకి ఇటువంటి అనుభవం ఎప్పుడు కలగలేదని అన్నారు. అలాగే మరి కొందరూ.. తమకి ఈ వేడుక అనుభవం తొలిసారిదని, తమ పిల్లలకి అందరితో కలిపి చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కార్యవర్గ సభ్యులందరు శ్రీమతి రమాదేవి, శ్రీ రమేష్, శ్రీ రాజశేఖర్ అలాగే శ్రీమతి మాధురి అధ్యక్షులు శ్రీమతి జయతో కలసి కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. విచ్చేసిన సభ్యులందలందరితో పాటు కొందరు పిల్లలు కూడా తమ వంతు సహాయాన్నిఈ కార్యక్రమ నిర్వాహణలో అందించారు. ఈ విషశేషాలను తమ కెమెరాలో అద్భుతమైన జ్ఞాపకికాలుగా అందించారు శ్రీ రవికాంత్. వచ్చే వారం తమ వార్షిక తెలుగు కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామని, పిల్లలు తమ సంగీత నాట్య కళలను ప్రదర్శించనున్నారని ఉత్సాహంగా తెలిపారు. ఆత్మీయ పాఠకులందరికి మా హాంగ్ కాంగ్ తెలుగు వారి సంక్రాతి పండుగ శుభాకాంక్షలు! ఇవి చదవండి: సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్' -
స్వార్థం లేనిదే స్నేహం
ఇశ్రాయేలీయులను, యూదులను పరిపాలించిన సౌలు కుమారుడు యోనాతాను, సౌలు వద్ద ఉన్న దావీదుతో స్నేహం చేశాడు. ఒక రాజ కుమారుడు సాధారణమైన వ్యక్తితో స్నేహం చేయడం వెనుక అతని హృదయ స్వచ్ఛత కనిపిస్తుంది. స్నేహం అంటే కలిసి తిరగడం, అల్లరి చేయడం అనే ఈ తరం వారికి తెలుసు, కానీ స్నేహం అంటే త్యాగం అనే విషయం ఇప్పటి తరానికి నేర్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వీరుడైన దావీదు తన రాజ్యాన్ని ఎక్కడ ఆక్రమిస్తాడో అని అనుకున్న సౌలు దావీదును చంపడానికి ఆలోచిస్తున్నాడు. అయితే తన కుమారుడైన యోనాతానుతో దావీదుకున్న స్నేహం గురించి అతనికి తెలియదు కనుక ఆ విషయాన్ని యోనాతానుతోనే చెప్పాడు. దావీదును చంపాలన్న ఆలోచన తన తండ్రి చేస్తున్నాడని తెలిసిన యోనాతాను, ఎలాగైనా తన స్నేహితుడిని రక్షించాలనుకున్నాడు. ఆ విషయాన్ని దావీదుకు తెలియజేసి ‘‘నీవు రహస్యస్థలంలో దాగి ఉండు’’ అని అతనిని తన తండ్రి యొద్దనుండి రక్షించిన గొప్ప స్నేహితుడు యోనాతాను. దావీదును యోనాతాను రక్షించడం వెనుక ఎలాంటి స్వార్థం లేదు, కేవలం దావీదు తన స్నేహితుడు అంతే, దావీదును సౌలు చంపితే ఆ రాజ్యానికి రాజు యోనాతాను కావచ్చు. అయినా ఆ రాజ్యం కంటే కూడా తన స్నేహితుడే తనకు ముఖ్యమని దావీదును కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని గొప్ప స్నేహితుడు యోనాతాను, తన కుమారుడే తన శత్రువైన దావీదును రక్షిస్తున్నాడని తెలిసికొన్న సౌలు ‘నీవే దావీదును నా వద్దకు రప్పించమని’ యోనాతానుతో చెప్పినపుడు తన స్నేహితుని కోసం తండ్రినే ఎదిరించి దావీదు వద్దకు పోయి కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చి తన తండ్రి ఉద్దేశ్యం అంతా అతడికి వివరించి దావీదు ప్రాణాన్ని కాపాడి అతడిని అక్కడినుండి తప్పించాడు, ఆ విడిపోతున్న సందర్భంలో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చిన సందర్భంలో యోనాతాను దావీదుతో చేసుకున్న నిబంధన ఎంతో గొప్పది, ఇలాంటి స్నేహం మనం ఇప్పుడు చూడగలమా? ఇలాంటి స్నేహితులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నారా? అసలు స్నేహం అనే పదానికి అర్థం కూడా మార్చివేసిన ఒక భయంకరమైన సందర్భంలో మనం ఉన్నాం. రాజ్యాలను విడిచి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ స్నేహానికి వారిచ్చిన విలువ ఎంత గొప్పదో కదా! తరువాత రోజుల్లో యోనాతాను మరణించాక దావీదు తన పరిపాలన కాలంలో దివ్యాంగుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును వెదికించి అతడికి రావలసినదంతా ఇప్పించి అతడు ఇక ఎప్పటికి తనతో కలిసి తన బల్లపైనే భోజనం చేయాలని కోరుకున్నాడు. ఇదంతా తన స్నేహితుడైన యోనాతానును బట్టే. యోనాతాను మరణించినా అతడి స్నేహాన్ని మరచిపోకుండా అతని కుమారుడికి మేలు చేసిన దావీదుది ఎంత గొప్ప హృదయమో కదా! ఇలాంటి స్నేహితులు మనకుంటే ఎంత బావుంటుంది! మనకు మంచి స్నేహితుడు దొరకాలంటే ముందు మనం మంచి స్నేహితులమై ఉండాలి. అప్పుడే మనకు యోనాతాను, దావీదులాంటి స్నేహితులు దొరుకుతారు. – రవికాంత్ బెల్లంకొండ -
బహుమానం
సిరియా రాజ్య సైన్యాధిపతి నయమాను కుష్టువ్యాధిగ్రస్తుడు. ఆ వ్యాధిని బాగుచేయగల భక్తుడు షోమ్రోను పట్టణంలో ఉన్నాడని చెప్పినపుడు నయమాను ఆ భక్తుడైన ఎలీషాను కలుసుకున్నాడు. ఎలీషా చెప్పినట్లు ఝెరికో నదిలో ఏడుమార్లు మునగగానే ఆ కుష్టువ్యాధి నయమైపోయింది. వెంటనే నయమాను ఎలీషా వద్దకు వెళ్లి బహుమానం తీసుకోవాలని బలవంతం చేశాడు. దేవుని భక్తుడైన ఎలీషా ఎంతమాత్రమును ఒప్పక ఆ బహుమానాన్ని తీసుకోకుండా నయమానును పంపివేశాడు. ఇదంతా గమనిస్తున్న ఎలీషా శిష్యుడైన గెహాజీ తన గురువైన ఎలీషా ఆ నయమాను ఇచ్చే బహుమానాన్ని తీసుకోకపోవడం చూసి మనసులో బాధపడి ఆ బహుమానాన్ని ఎలాగైనా తాను తీసుకోవాలనుకున్నాడు. వెంటనే నయమాను వద్దకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తుకొస్తున్న గెహాజీని చూసిన నయమాను అతడు ఎలీషా సేవకుడని గుర్తించి రథాన్ని దిగగానే గెహాజీ తనను ఎలీషా పంపాడనీ, మొదట ఆ బహుమానాన్ని వద్దన్నా తరువాత తీసుకోవడానికి మనసు కలిగి తనను పంపాడని అబద్ధం చెప్పి ఆ ధనాన్ని తీసుకొని ఏమీ ఎరగనట్లుగానే తిరిగి తన గురువైన ఎలీషా వద్దకు వచ్చాడు. గురువుగారైన ఎలీషా గెహాజీని నీవెక్కడనుండి వస్తున్నావని అడిగినపుడు కూడా అతడు తాను చేసిన పనిని గురించి చెప్పలేదు. అప్పుడు భక్తుడైన ఎలీషా అంతా గ్రహించి నీవు దీనిని చేశావు కాబట్టి నయమానుకు ఉన్న కుష్టువ్యాధి నీకు కలుగుతుందని చెప్పగానే గెహాజీకి కుష్టు కలిగి అక్కడనుండి వెళ్లిపోయాడు. ఎక్కడో సిరియా రాజ్య సైన్యాధిపతియైన నయమాను తనకున్న కుష్టును తగ్గించుకోవడానికి భక్తుని వద్దకు వస్తే, ఆ భక్తుని వద్ద సేవకునిగా ఉన్న గెహాజీ ధనం మీద దృష్టిని నిలిపి ఆ వ్యాధిని తాను తెచ్చుకున్నాడు. గెహాజీకి ధనం ఉంది కానీ అనుభవించడానికి శరీరం సరిగా లేదు. ఉన్నదానితో తృప్తి పడకుండా తనది కానిదానికోసం పరిగెత్తి దురాశతో కుష్టువ్యాధిని కొనితెచ్చుకున్న గెహాజీ మనస్తత్వం ఒకవేళ మనలో ఉంటే ఆ మనస్తత్వాన్ని మనం చంపివేయాలి. ఎందుకంటే దురాశ మనతో ఎంతటి దుష్కార్యాన్నైనా చేయిస్తుంది. – రవికాంత్ బెల్లంకొండ -
టీడీపీ నేతల ప్రలోభాల వల్లే..
-
తిరిగి సొంత పార్టీలోకి చేరిన వైఎస్ఆర్సీపీ నేత
సాక్షి, గుడివాడ : ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి సొంత పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను ఆయన మీడియా సమక్షంలో బయట పెట్టారు. త్వరలోనే టీడీపీ నేతలు తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. చంద్రబాబు వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభ పెట్టి రాజకీయం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. -
పార్టీ మారినందుకు చెప్పు దెబ్బ
-
పార్టీ మారినందుకు చెప్పు దెబ్బ
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో శనివారం రగడ జరిగింది. వైఎస్సార్సీపీ టిక్కెట్టుపై గెలిచి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీని వీడి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రవికాంత్ చెప్పుతో కొట్టారు. పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కౌన్సిల్ హాల్ లో గందరగోళం ఏర్పడింది. -
కాల్‌మనీ వ్యాపారి రవికాంత్ అరెస్ట్
విజయవాడ : ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో అధికార టీడీపీకి చెందిన కాల్‌మనీ వ్యాపారి మండవ రవికాంత్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు కృష్ణలంకలోని రవికాంత్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం బాధితులకు మద్దతుగా ధర్నా చేశారు. కాల్‌మనీ పేరుతో 10 మంది మహిళలను రూ. కోటి వరకు మోసం చేశాడని ఆయా సంఘాలు ఆరోపించాయి. రవికాంత్‌కు అండగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు వారు డిమాండ్ చేశారు. -
స్పందోలిక మన్‌డోలిక
ఆటపాటలు తప్ప అన్యం ఎరుగని బాల్యం.. జీవితాంతం ఏదో రూపంలో తొంగి చూస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలో.. బుజ్జాయిగా అమ్మతో దిగిన ఫొటోనో కనిపిస్తే మనసు కాసేపు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోతుంది. ఆనాటి గుర్తులను తడిమి వర్తమానంలోకి వచ్చిన మనుషులు కాసేపు అవే జ్ఞాపకాలల్లో సేదతీరుతారు. కానీ కళను ఒంటబట్టించుకున్న ఈ మనిషి మాత్రం.. ఆనాటి జ్ఞాపకాలను అంతే ఫ్రెష్‌గా మళ్లీ ఆవిష్కరిస్తున్నాడు. రవికాంత్ ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ సాధించాడు. బొమ్మలు గీస్తాడు.. తయారు చేస్తాడు కూడా. తన జ్ఞాపకానికి కళను మేళవించి.. ఆ కళకు చరిత్రను రంగరించి బొమ్మల రూపంలో ప్రజెంట్ చేస్తున్నాడు. ఒక్కోసారి ఒక్కో థీమ్ తీసుకుని.. దాన్ని అన్ని కోణాల్లో నేటి తరానికి చూపుతున్నాడు. రవికాంత్ తండ్రి టీచర్, ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫర్. ఆయన స్టూడియోలో పిల్లలు ఫొటో దిగడానికి ఊగే కీలుగుర్రం ఒకటి ఉండేది. చిన్నప్పుడు దానిపై సరదాగా స్వారీ చేసిన రవికాంత్‌కు ఈ మధ్య ఆ రోజులు గుర్తొచ్చాయి. వింతగా తోచిన ఆనాటి జ్ఞాపకాన్ని.. గొప్పగా చూపాలనుకున్నాడు. కీలుగుర్రాల పుట్టపూర్వోత్తరాల కోసం చరిత్రలోకి తొంగి చూశాడు. వాటి పుట్టిల్లు బెంగళూరు, మైసూర్ మధ్య ఉన్న చెన్నపట్న అని తెలుసకున్నాడు. అక్కడికి వెళ్లి వాటి గురించి తెలుసుకుని రకరకాల కీలుగుర్రాల మినియేచర్ పెయింటింగ్స్ వేశాడు. కొయ్యలతో కీలుగుర్రాల నమూనాలు తీర్చిదిద్దాడు. వీటన్నింటినీ వాటి చరిత్రతో సహా.. స్పందోలిక (ద రాకింగ్ హార్సెస్) పేరుతో బంజారాహిల్స్‌లోని ట్రైడెంట్ హోటల్లో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. గుర్రాల ఐతిహాసక విశిష్టతను, చారిత్రాత్మక ప్రశస్తిని తెలియజేస్తూ కాన్వాస్‌పై రంగులద్దాడు. పోస్ట్ మాడర్నిజంతో గుర్రాల నేపథ్యాన్ని ఆవిష్కరించాడు. గురువారంతో ఈ ప్రదర్శన ముగుస్తుంది. ఫొటోలు.. ఫోజులు.. తన మదిలో మెదిలిన ఆ పాత గుర్తులను కమనీయంగా చూపడం రవికాంత్‌కు కొత్తకాదు. 90వ దశకంలో ఫొటో స్టూడియోకు వెళ్లి ఫొటోలు దిగడం అంటే చాలామంది ఓ పండుగలా ఫీలయ్యేవాళ్లు. సెల్ఫీలు, రిల్ఫీలు దిగుతున్న ఈ స్మార్ట్ జమానాకు నాటి ఫొటో ఫోజుల సంగతి తెలియజేసేందుకు రవికాంత్ విభిన్న ప్రయోగం చేశాడు. ఆనాటి ఫొటోలు.. ఫోజులు ఎలా ఉండేవో.. తనకొచ్చిన కళతో కళ్లముందుంచాడు. ఆ తర్వాత మహారాజులకు రాచఠీవి తెచ్చే కాస్ట్యూమ్స్ గురించి ఆలోచన రాగానే.. ఆ థీమ్‌ను ఎంచుకుని వారి గెటప్స్పై ఓ ప్రదర్శన నిర్వహించాడు. -
‘కోల్గేట్’ దర్యాప్తు అధికారికి రాష్ట్రపతి పతకం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 24 మంది ప్రతిభావంతులైన అధికారులకు ప్రకటించిన రాష్ట్రపతి పతకాల జాబితాలో బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తునకు నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు పునర్నియమించిన డీఐజీ రవికాంత్ కూడా ఉన్నారు. పెరల్స్ గ్రూప్ బ్యాంకింగ్ సేవల మోసం కేసులో ఇన్చార్జిగా ఉన్న సీబీఐ జేడీ రాజీవ్ శర్మ, కాశ్మీర్‌లోని షోపియన్‌లో ఇద్దరు మహిళల హత్యకేసును దర్యాప్తు చేసిన డీఐజీ రతన్ సంజ య్లు కూడా రాష్ట్రపతి పతకాలు అందుకోనున్నారు. టట్రా ట్రక్కుల స్కాంపై దర్యాప్తుకు నేతృత్వం వహించిన అధికారులకూ రాష్ట్రపతి పోలీసు పతకాలు దక్కాయి.