శ్రీమతి జయతో కలసి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి రమాదేవి, శ్రీ రమేష్, శ్రీమతి మాధురి, తదితరులు
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య స్థాపించక ముందు నుంచే దాదాపు రెండు దశాబ్దాలుగా భోగిపండ్లు వేడుకని చేస్తున్న, వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తమ సంతోషాన్ని తెలుపుతూ ఈ సంవత్సర నిర్వహించిన భోగిపండ్ల సరదాల విశేషాలు తెలిపారు.
ముఖ్య అతిధులు స్థానిక యునెస్కో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీ తిరునాచ్ దంపతులు మరియు బాలవిహార్ గురువు శ్రీమతి చిత్ర జికేవీ దంపతులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా పిల్లలకు భోగి పండ్లు పొసే అంశాన్ని కొనసాగించారు. పిల్లలు సందడిగా చాకోలెట్లు ఏరుకొంటూ, మరి కొందరు అవి తినే ప్రయత్నం చేస్తుంటే వారి అమ్మ నాన్నలు వద్దని ఆరాట పడుతుంటే చూడ ముచ్చట కొలిపింది.
మరింత ఆనందంగా కొనసాగింది పిల్లల కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం. ముఖ్య అతిధులు కూడా పిల్లలకు భోగి పండ్లు పోసీ ఆశీర్వదించి చాలా సంతోశాన్ని తెలిపారు. తమకి ఇటువంటి అనుభవం ఎప్పుడు కలగలేదని అన్నారు. అలాగే మరి కొందరూ.. తమకి ఈ వేడుక అనుభవం తొలిసారిదని, తమ పిల్లలకి అందరితో కలిపి చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
కార్యవర్గ సభ్యులందరు శ్రీమతి రమాదేవి, శ్రీ రమేష్, శ్రీ రాజశేఖర్ అలాగే శ్రీమతి మాధురి అధ్యక్షులు శ్రీమతి జయతో కలసి కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. విచ్చేసిన సభ్యులందలందరితో పాటు కొందరు పిల్లలు కూడా తమ వంతు సహాయాన్నిఈ కార్యక్రమ నిర్వాహణలో అందించారు. ఈ విషశేషాలను తమ కెమెరాలో అద్భుతమైన జ్ఞాపకికాలుగా అందించారు శ్రీ రవికాంత్. వచ్చే వారం తమ వార్షిక తెలుగు కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామని, పిల్లలు తమ సంగీత నాట్య కళలను ప్రదర్శించనున్నారని ఉత్సాహంగా తెలిపారు. ఆత్మీయ పాఠకులందరికి మా హాంగ్ కాంగ్ తెలుగు వారి సంక్రాతి పండుగ శుభాకాంక్షలు!
ఇవి చదవండి: సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్'
Comments
Please login to add a commentAdd a comment