ఇంట్లో తల్లితో..
దర్శి: ఎక్కడున్నా పండగకు ఇంటికొస్తే ఆ ఆనందమే వేరు. బంధువులు, స్నేహితులతో కలిసి గడిపే ఆ క్షణాలు ఎన్నటికీ మరువలేని తీపి గురుతులు..!! దర్శి మండలం తూర్పు వీరాయపాలేనికి చెందిన ముప్పరాజు వెంకట రవి ఏడేళ్లుగా ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశంలో లుసాకా కాప్టెల్ సిటీలో ఎర్త్ మూవింగ్ ఎక్విప్‌మెంట్స్ ఆపరేషనల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఏటా డిసెంబర్ నెలాఖరులో వచ్చి సంక్రాంతి పండగకు బంధువులతో ఆనందంగా గడిపి వెళ్తుంటారు. తాను ఎన్నారై అని మరచిపోయి పిండి దంచడం, పిండి వంటకాల తయారీలో సహాయం చేయడం లాంటి పనుల్లో నిమగ్నమై పండగ వాతావరణాన్ని ఆశ్వాదిస్తున్నారు. స్నేహితులు, బంధువులకు ఆఫ్రికా నుంచి బహుమతులు తీసుకువచ్చి ఇస్తుంటారు. అంతే కాదు తమ పొలంలో పంటలను పరిశీలించి సూచనలు సలహాలు ఇస్తుంటారు.
ప్రభుత్వ పనితీరు బాగుంది: ముప్పరాజు వెంకటరవి
మాది కమ్మ సామాజిక వర్గం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో భూ ఆక్రమణలు జరిగాయి. మా గ్రామంలో రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేశాయి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవు. కక్ష సాధింపులు లేవు. వలంటీర్లు అందరికీ పథకాలు అందిస్తున్నారు.
మా గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పండగ చేసుకుంటున్నాం. చంద్రబాబు హయాంలో వర్షాలు లేక, పంటలు పండక విదేశాల్లో ఉద్యోగానికి వెళ్లా. ప్రస్తుతం రైతుల పరిస్ధితి బాగానే ఉంది. నేను ఉద్యోగంలో బాగానే స్ధిరపడ్డాను. ఇక్కడకు వచ్చినప్పుడు వ్యవసాయంపై మక్కువతో మా పొలాలు కూడా చూసుకుంటుంటా. సంక్రాంతి తర్వాత ఆఫ్రికా వెళ్లి మళ్లీ ఏడాదికి వస్తా.
Comments
Please login to add a commentAdd a comment