Prakasam District Latest News
-
ప్రశాంతంగా నీట్ ●
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ ఒంగోలు సిటీ: జిల్లాలో ఆదివారం నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయం, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీలలో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 1473 మంది అభ్యర్థులకుగాను 1428 మంది పరీక్షలకు హాజరైనట్లు పరీక్షల నిర్వహణ సిటీ కోఆర్డినేటర్ మనీష్ తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ ను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేసి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో నీట్ పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచ్‌లు, బ్లూ టూత్, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్సును అనుమతించరాదన్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే హాల్లోకి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాల వెలుపల 144 సెక్షన్ అమలులో ఉందని, ఈ పరీక్షలు ముగిశాక ఆ పత్రాలు పటిష్ట భద్రతా నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నీట్ పరీక్ష కేంద్రం వద్ద డ్రోన్ కెమెరా తో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ వెంట ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు సిబ్బంది ఉన్నారు. -
సత్తాచాటిన నంద్యాల జిల్లా ఎడ్లు
బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన బండలాగుడు పోటీలు హోరా హోరీగా సాగాయి. ఈ పోటీలను వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు మేళతాళాలతో, శాలువ, పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. నంద్యాల జిల్లా సంజమాల మండలం ఆకుమళ్లకు చెందిన కాకర్ల నాగజ్యోతి ఎడ్లు 4444 అడుగుల దూరం మొదటి స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా కోసూరు మండలం బయ్యవరానికి చెందిన కడియం మణికంఠ ఎడ్లు 3918 అడుగులు, నంద్యాల జిల్లా రోళ్లపాడుకు చెందిన డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎడ్లు 3750 అడుగులు, గిద్దలూరు మండలం ముళ్లపాడుకు చెందిన కంచర్ల తనీస్ ఎడ్లు 3750 అడుగులు, కంభం మండలం ఎర్రబాలేనికి చెందిన వెంకటగిరి హేమలతానాయుడు ఎడ్లు 3328 అడుగులు దూరంలాగి రెండోవ, మూడోవ, నాల్గోవ స్థానంలో నిలిచాయి. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.12,500, రూ.12,500, రూ.5 వేల నగదు బహుమతులను దప్పిలి బ్రదర్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, జెడ్పీటీసీ బీవీ రాజయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆవుల శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెన్నా భాస్కర్‌రెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ కన్వీనర్ మల్లెల శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ దప్పిలి రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ బుగ్గారెడ్డి, నాయకులు రామిరెడ్డి, సిద్దారెడ్డి, కాశిరెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు సీనియర్ ఎడ్ల బండలాగుడు పోటీలు బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామస్వామి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా సోమవారం సీనియర్ ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు 1 నుంచి 8వ బహుమతులు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు,రూ. 15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలను అందజేస్తారన్నారు. పూర్తి వివరాలకు 77022 92595, 97058 94632, 91777 09989 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ప్రకాశం
39 /26సత్వర న్యాయంతోనే ఆదరణసత్వర న్యాయంతోనే ప్రజల నుంచి ఆదరణ పొందుతారని హైకోర్టు జడ్జి కే మన్మథరావు అన్నారు. 7గరిష్టం/కనిష్టంవాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చు.సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025– 8లో.. ఆధిపత్య పోరు..నిలిచిన నీరుపొన్నలూరు మండలం కొత్తపాలెంలో సీపీడబ్లూ ఎస్ స్కీంపై పెత్తనం కోసం తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరుతో నీటి సరఫరా నలిపేశారు. – 8లో.. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు చీమకుర్తి: దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం చీమకుర్తిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు పావులు కదుపుతోందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక కోడ్లను తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయన్నారు. అందుకు నిరసనగా చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం● గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి ● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఒంగోలు వన్‌టౌన్: మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన మైదాన ప్రాంత గిరిజన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రకారం రాష్ట్రంలో జనాభా 4.32 కోట్లయితే.. వారిలో ఎస్టీలు 25,34,795 మంది ఉన్నారన్నారు. ఎస్టీల్లో ప్రధానంగా యానాదులు, చెంచులు, ఎరుకలు, సుగాలీలు, కమ్మర్లు, కొండదొరలు, కోయలు, జాతాపులు, కోర్లు, సవర్లు, కొండ రెడ్లు, బగతలు.. ఇలా అనేక జాతులు ఉన్నారన్నారు. వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదన్నారు. రాష్ట్రంలో కమ్మ రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం ఇస్తున్న 7 అసెంబ్లీ సీట్లను ఏజెన్సీ ప్రాంత ఎస్టీలకే ఇస్తున్నారన్నారు. మైదాన ప్రాంతం వారిని పట్టించుకోవడంలేదన్నారు. రాయలసీమ, కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని మైదాన ప్రాంతాల గిరిజనులకు ఎస్టీ నియోజకవర్గాలను రిజర్వు చేయడం లేదన్నారు. ప్రధానంగా యానాదులు, ఎరుకలు, సుగాలీలు, చెంచులు, కమ్మర్లు తదితరులు వారిలో ఉంటారన్నారు. యానాదులు, ఎరుకలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఎస్టీలలో అత్యధికంగా యానాది కులస్తులు ఉన్నారని తెలిపారు. 5 లక్షల మందికిపైగా వారు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంత గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. ప్రతి జిల్లాలోనూ ఐటీడీఏ ఏర్పాటు చేసి బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందించాలన్నారు. ఎస్టీలకు రాజకీయ ప్రాతిఽనిధ్యం ఉండాలన్నారు. కార్యక్రమంలో బక్కా పరంజ్యోతి, పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు. -
సత్వర న్యాయంతోనే ప్రజల నుంచి ఆదరణ
● హైకోర్టు జడ్జి డాక్టర్ కె.మన్మథరావు ఒంగోలు: సత్వర న్యాయంతోనే ప్రజల నుంచి మంచి ఆదరణ పొందగలుగుతామని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కె.మన్మథరావు అన్నారు. ఒంగోలులోని జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఒంగోలు బార్ అసోసియేషన్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసుల పరిష్కారంలో ఇటు న్యాయమూర్తులు, అటు న్యాయవాదుల మధ్య మంచి వాతావరణం ఉండటం ద్వారానే సత్వర న్యాయం సాధ్యపడుతుందన్నారు. పాజిటివ్ దృక్పథంతో అందరికీ న్యాయవ్యవస్థ అందుబాటులో ఉందన్న భావన కలిగించాలంటే బార్ అండ్ బెంచ్ సంబఽంధాలే ముఖ్యమన్నారు. ప్రజలకు ఏం అవసరమో.. అదే అందించాలన్న ఆకాంక్షను ప్రతిఒక్కరూ కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఒంగోలు బార్ అసోసియేషన్ సభ్యుడిగానే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించానని, 33 ఏళ్లపాటు న్యాయవాదిగా కొనసాగి గత 3 సంవత్సరాలుగా హైకోర్టు జడ్జిగా సేవలందిస్తున్నానని అన్నారు. అనేక కేసులను సత్వరమే పరిష్కరించే అవకాశం తనకు రావడాన్ని గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. రోజుకు 30 నుంచి 40 ఉత్తర్వులను ఆంగ్లంలో ఇవ్వగలుగుతున్న తాను.. ఒక తెలుగులో తీర్పు ఇవ్వడానికి 42 రోజులు కృషిచేయాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ తెలుగులో తీర్పు ఇవ్వాలన్న ఆకాంక్షను కూడా తీర్చుకోగలిగానన్నారు. ఒంగోలులో ఓనమాలు నేర్చుకుని నేడు ఏపీ హైకోర్టు జడ్జిగా మంచి పేరు తెచ్చుకోగలిగానని, అందుకు మీ అందరి ఆశీర్వాదమే కారణమని అన్నారు. మంచి తీర్పులు ఇవ్వాలనే దృక్పథంతో నాకు ఉన్న నిర్ణయాలు, నా ముందు ఉన్న అంశాలు సంపూర్ణంగా పరిశీలించుకుని అంతరాత్మ సాక్షిగా తీర్పులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు బార్ అసోసియేషన్ పాత పాలకవర్గం ఒరవడికి మరింతగా మెరుగుల దిద్ది ఉన్నతమైన సేవలతో నూతన కార్యవర్గం కొనసాగాలని సూచిస్తూ వారిని అభినందించారు. 40 సంవత్సరాలుగా ఒంగోలు బార్ అసోసియేషన్‌లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కె.మన్మథరావును, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతిని ఒంగోలు బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానంతో పాటు నాగిశెట్టి మోహన్‌దాస్ అధ్యక్షతన ఒంగోలు బార్ అసోసియేషన్ రూపొందించిన టెలిఫోన్ డైరెక్టరీని ఆయన ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించి ప్రస్తుతం తెలంగాణలో జడ్జిగా పనిచేస్తూ మరణించిన ఎంజీ ప్రియదర్శినిని స్మరించుకుంటూ మౌనం పాటించారు. -
మండుటెండలో.. మిర్చి ఘాటులో..
● మిర్చి గ్రేడింగ్ పనుల్లో మహిళలు పెద్దారవీడు: మిర్చి కోతలు, కల్లాల్లో మిర్చి గ్రేడింగ్ చేయాలంటే కూలీలు చాలా అవసరం. మండలంలో ఓ వైపు భగభగమంటున్న భానుడు, మరో వైపు మిర్చి ఘాటులను పట్టించుకోకుండా మహిళలు తలకు గుడ్డ చుట్టుకుని మండు టెండలను అధిగమిస్తూ, ఘాటును భరిస్తూ కోతలు, గ్రేడింగ్ పనులు చేస్తున్నారు. చూసేవారంతా ఎండను తట్టుకొని ఎలా పనులు చేస్తున్నారు తల్లీ అంటున్నారు. మండలం పరిధిలో పెద్దారవీడు, గొబ్బూరు, ఓబులక్కపల్లి గ్రామాల్లో ఒక వైపు మిర్చి కోతలు, మరో వైపు కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి గ్రేడింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలీలకు మంచి నీటి సౌకర్యం రైతులు అందుబాటులో ఉంచుతున్నారు. ఎండలకు ఎంత నీరు తాగినా చాలటం లేదంటున్నారు మహిళలు. ప్రస్తుతం 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతను భరిస్తూ మహిళలు కూలి పనులు చేస్తున్నారు. -
చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్సు: దర్శిలో డీఎస్పీ కార్యాలయానికి అడ్డుగా ఉందనే సాకుతో భారీగా పోలీసులను మొహరించి మరీ ఓ దుకాణాన్ని తొలగించి చిరువ్యాపారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటనతో స్థానికులు సైతం అవాక్కయ్యారంటే అధికారులు, అధికార పార్టీ నేతల దాష్టీకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దర్శి డీఎస్పీ కార్యాలయం ప్రహరీకి రెండు అడుగుల లోపలకు ఉన్నప్పటికీ అడ్డంకి సాకుతో దుకాణాన్ని తొలగించడం కక్ష్యసాధింపులో భాగమేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితురాలు కొణతం అపర్ణ, ఆమె భర్త సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. దర్శి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం పక్కనున్న సూరే చెంచుసుబ్బారావు (టీచర్)కు చెందిన ఖాళీస్థలాన్ని అపర్ణ, సురేష్ అద్దెకు తీసుకున్నారు. అందులో సుమారు రూ.2 లక్షల పెట్టుబడితో విజయపార్లర్ కోసం రేకులతో ఓ దుకాణం నిర్మించుకున్నారు. నిర్మాణ సమయంలో చూస్తూనే ఉన్న డీఎస్పీ లక్ష్మీనారాయణ ఏమీ అడ్డుచెప్పలేదు. తీరా నిర్మాణం పూర్తయ్యాక దుకాణాన్ని తొలగించాలని అపర్ణ, సురేష్‌లకు హుకుం జారీ చేశారు. దీంతో మరుసటిరోజు సురేష్ తన వద్ద ఉన్న ప్రభుత్వ అనుమతుల పత్రాలను డీఎస్పీకి చూపించారు. వాటిని పరిశీలించి నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకోమని డీఎస్పీ చెప్పారు. కానీ, సురేష్‌ను వెంటనే సీఐ రామారావు పిలిపించి అక్కడి నుంచి ఆ దుకాణాన్ని తొలగించాలని, లేనిపక్షంలో అక్రమంగా కేసు బనాయించి జైలుకు పంపుతానని బెదిరించారు. అప్పటికే అన్నీ సిద్ధం చేసుకుని ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకున్న సురేష్, అపర్ణలకు ఏం చేయాలో అర్థంగాక అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా వారు కనికరించకపోగా, నగర పంచాయతీ కమిషనర్‌ను రంగంలోకి దించారు. శనివారం సాయంత్రం ట్రాక్టర్, పంచాయతీ సిబ్బందిని పిలిపించి పోలీసులను మొహరించి దుకాణాన్ని బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారు. నిలదీసిన స్థానికులు... దుకాణం తొలగించడాన్ని చూసిన స్థానిక ప్రజలు సైతం అక్కడకు వచ్చి ఇదేమి న్యాయమంటూ కమిషనర్‌ను నిలదీశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కార్యాలయానికి అడ్డుగా ఉందని తొలగిస్తున్నామని కమిషనర్ మహేష్ బదులిచ్చారు. దీంతో స్థానికులు అలా ఎలా తొలగిస్తారని భారీగా అక్కడకు చేరుకోవడంతో దర్శి డీఎస్పీ పరిధిలోని నలుగురు ఎస్సైలు, 20 మంది పోలీసులు జనాలను పక్కకు నెట్టి బంకును బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారు. కొలతలు వేసి అడ్డుగా ఉంటేనే బంకును తొలగించాలని, అలా కాకుండా ప్రైవేటు స్థలంలో ఉన్న బంకును తొలగించడం ఏమి న్యాయమంటూ కమిషనర్‌ను స్థానికులంతా నిలదీశారు. కనీసం ముందస్తు సమాచారంగానీ, నోటీసుగానీ ఇవ్వకండా ఉన్నపలంగా ఎలా తొలగిస్తారని ప్రజలు ప్రశ్నించినప్పటికీ ఆర్అండ్బీ స్థలంలో ఉందంటూ ఆర్అండ్బీ అధికారులు లేకుండానే నిర్ధారించారు. దీంతో స్థలం యజమాని సుబ్బారావు అక్కడకు చేరుకుని స్థలానికి కొలతలు వేయించగా, అతని స్థలంలోనే దుకాణం ఉందని రుజువైంది. చేసేదేమీ లేక దర్శి ఎస్సై మురళి అక్కడున్న ప్రజలపై లాఠీచార్జి చేస్తూ తిట్లపురాణం అందుకుని భయబ్రాంతులకు గురిచేశారు. కమిషనర్ కూడా తన సిబ్బంది ద్వారా షాపును పెకిళించి అక్కడి నుంచి బలంవతంగా తొలగించారు. రాత్రి 12.30 గంటల వరకు కమిషనర్ అక్కడే ఉండి బంకు తొలగింపు చర్యల్లో పాల్గొనడం ఆయన అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. ఒక సమయంలో కమిషనర్‌ను సైతం బాధితులు వేడుకున్నారు. తమ పొట్ట కొట్టొద్దంటూ చేతులెత్తి దండంపెట్టారు. కానీ, కనికరించకపోవడంపై స్థానికులు ఇదేమి కక్ష సాధింపు అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసి అధికారులు, పోలీసుల తీరును చీత్కరించుకుంటున్నారు. పోలీసు అధికారులు, నగర పంచాయతీ అఽధికారులు తమ నోటికాడి కూడు తీసివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు చొరవచూపి తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేసి జీవనాధారం కల్పించాలని అపర్ణ, సురేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. దర్శిలో డీఎస్పీ కార్యాలయానికి అడ్డుగా ఉందనే కారణంతో దుకాణం తొలగింపు మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంతో భారీగా పోలీసుల మొహరింపు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఒత్తిడి మేరకే తొలగించారని బాధితుల ఆరోపణ -
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
నాగులుప్పలపాడు: పిడుగు పడి గొర్రెల కాపరి మృతిచెందిన సంఘటన మండలంలోని ఈదుమూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, సమీపంలోని రైతులు తెలిపిన సమాచారం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి చీకటి మేఘాలు కమ్ముకోవడంతో పాటు తీవ్రమైన గాలి వీస్తూ స్వల్పంగా వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగులు పడటంతో ఈదుమూడి–మట్టిగుంట గ్రామాల మధ్య భీమన్నకుంట సమీపంలో గొర్రెలు కాస్తున్న ఈదుమూడి గ్రామానికి చెందిన కొండపి నాగమల్లేశ్వరరావు (40) అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన గతంలో ఓ ప్రమాదంలో తన చేతిని పోగొట్టుకుని దివ్యాంగుడయ్యాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వేధింపులు తాళలేక..
కరెంటు ఇవ్వండి సారూ.. ● పోలవరంలో మూడు రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా ● విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రాస్తారోకో ముండ్లమూరు (కురిచేడు): మండలంలోని పోలవరంలో మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం గంటపాటు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో బోర్లు పనిచేయక తాగేందుకు ప్రజలకు, మూగజీవాలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరాపురం వెళ్లి నీళ్లు తెచ్చుకుని గొంతు తడుపుకోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ జీవాలకు తాగునీరు లేక ఒక ఆవు చనిపోయిందని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవి ప్రాణంపోయిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా విద్యుత్ శాఖ అధికారులు వచ్చి మాట్లాడే వరకు రాస్తారోకో విరమించబోమని తేల్చిచెప్పారు. మండల టీడీపీ ఇన్చార్జి సోమేపల్లి శ్రీనివాసరావు రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడి విద్యుత్ పునరుద్ధరణ చేయిస్తానని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. కంభం: స్థానిక కాపవీధిలో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన షేక్ వలి (37) కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. మద్యం మత్తులో గొడవకు దిగడంతో అతని భార్యే కండువాను గొంతుకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అర్థవీడుకు చెందిన షేక్ వలి కంభం పంచాయతీ పరిధిలోని సాధుమియా వీధికి చెందిన మహిళను వివాహం చేసుకుని భార్యతో కలిసి కొంతకాలంగా కంభంలోని కాపవీధిలో నివాసం ఉంటున్నాడు. మృతుడు పెయింటింగ్ పనులకు వెవెళ్తుండగా, అతని భార్య రిజ్వాన కూలి పనులకు వెళ్తుంటుంది. మద్యానికి బానిసైన వలి తరచూ భార్యతో గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పనికి వెళ్లకుండా మద్యం సేవించి భార్యతో గొడవపడి ఇంట్లోనే పడుకున్నాడు. సుమారు రాత్రి 9 గంటల సమయంలో ఎంత నిద్రలేపినా లేవకపోవడంతో వెంటనే కంభం ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు. తొలుత పురుగుమంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, మద్యం సేవించి డీహైడ్రేషన్‌తో మృతి చెందాడని ప్రచారం జరిగింది. మృతుడి గొంతు వద్ద అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్యను విచారించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. మద్యం మత్తుకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవపడేవాడని, ఈ నేపథ్యంలో శనివారం భార్యతో గొడవపడి ఘర్షణకు దిగిన నేపథ్యంలో కండువాను భర్త మెడకు బిగించడంతో అతను ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుడి భార్య, బంధువులను విచారించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. డీఎస్పీ నాగరాజు దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. భర్తను హత్య చేసిన భార్య మద్యం మత్తులో గొడవకు దిగడంతో కండువా మెడకు చుట్టి హత్య కంభంలో అనుమానాస్పద స్థితిలో మృతి కేసులో ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
నిలిచిన నీరు!
ఆధిపత్య పోరు..గ్రామంలో ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్న మాజీ వలంటీర్సీపీడబ్ల్యూఎస్ స్కీం నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో కొత్తపాలెంలో అలంకారప్రాయంగా మారిన ఓవర్‌హెడ్ ట్యాంక్ పొన్నలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు తమ్ముళ్ల పిచ్చి చేష్టలతో గ్రామాల్లోని సామాన్య ప్రజలు అనేక రకాలుగా అవస్థలకు గురవుతున్నారు. అధికార పార్టీ కావడంతో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు. ఆఖరికి గ్రామాల్లోని స్కీం బావుల నుంచి ప్రజలకు అందించే నీటి విషయంలో కూడా పచ్చనేతలు పెత్తనం చలాయించాలని చూస్తున్నారు. వారి మధ్య ఆధిపత్య పోరుతో ప్రజలకు తాగునీరు, వాడుకనీరు లేకుండా పోయింది. పొన్నలూరు మండలంలోని రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే.. 1995–2000 మధ్య కాలంలో కొత్తపాలెం గ్రామంతో పాటు పొన్నలూరు మండలంలోని మరో ఎనిమిది గ్రామాలకు తాగునీరు, వాడుకనీటి కోసం రూ.1.60 కోట్లతో సీపీడబ్ల్యూఎస్ స్కీం ఏర్పాటు చేశారు. పంచాయతీలతో సంబంధం లేకుండా ఈ స్కీమ్ పనిచేసేందుకు ప్రత్యేకంగా టెండర్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహించే టెండర్లో స్కీంను దక్కించుకున్న వారు కొన్నేళ్లపాటు సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా తాగునీరు, వాడుకనీటిని తొమ్మిది గ్రామాల ప్రజలకు అందిస్తున్నారు. ఇటీవల ఈ స్కీమ్‌ను కొనసాగించేందుకు టెండర్ ఏర్పాటు చేయకుండా నిలిపివేశారు. ఆయా పంచాయతీలకు అప్పజెప్పి వదిలేశారు. దీంతో కొత్తపాలెం కాకుండా మిగిలిన ఎనిమిది గ్రామాల ప్రజలకు ఆయా పంచాయతీల్లో ఏర్పాటు చేసిన స్కీం బావుల నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరుతో అవస్థలు... ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తపాలెం గ్రామంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా నీళ్లు వదిలే పనిని స్థానిక తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు. గత మార్చి వరకు సక్రమంగానే పనిచేసి గ్రామస్తులకు నీళ్లు సరఫరా చేశారు. అయితే, రెండు నెలలుగా సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా నీళ్లు వదిలే విషయంలో స్థానిక తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. నీళ్లు వదిలే దగ్గర మేమంటే మేము పనిచేస్తామంటూ ఆధిపత్య పోరుతో రెండు నెలలుగా గ్రామస్తులకు తాగునీరు, వాడుకనీటిని సక్రమంగా అందించడం లేదు. ప్రతిరోజూ నీరివ్వాల్సి ఉండగా, అరకొరగా రోజు మార్చి రోజు నీళ్లు సరఫరా చేస్తుండటంతో గ్రామస్తులు చేసేదేమీ లేక సర్దుకునిపోతున్నారు. అయితే, నీళ్లు వదిలే దగ్గర తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో గత నాలుగు రోజుల నుంచి సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా గ్రామస్తులకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్‌తో నీరందించిన మాజీ వలంటీర్... కొత్తపాలెం గ్రామంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్యపోరుతో సీపీడబ్ల్యూఎస్ స్కీం నుంచి గత నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. స్థానిక మాజీ వలంటీర్ చావకూరి రాజా స్థానిక సర్పంచ్ మార్తాల వెంకటేశ్వరరెడ్డి సహకారంతో గ్రామంలో సొంతంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామస్తులకు ఇంటింటికి తిరిగి నీరు సరఫరా చేస్తున్నారు. కాగా, తెలుగు తమ్ముళ్ల నిర్వాకంతో నాలుగు రోజులుగా గ్రామంలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కొత్తపాలెంలో సీపీడబ్ల్యూఎస్ స్కీంపై పెత్తనం కోసం తెలుగు తమ్ముళ్ల మధ్య పోటీ టీడీపీ నేతల తీరుతో మూడు రోజులుగా నిలిచిన నీటి సరఫరా వేసవి కావడంతో నీటి కోసం గ్రామస్తులకు ఇబ్బందులునీళ్లు వదిలే వ్యక్తి రావడం లేదు కొత్తపాలెం గ్రామంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం నుంచి నీళ్లు వదిలే వ్యక్తి రాకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. గతంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం పర్యవేక్షణకు టెండర్ ద్వారా నిధులు కేటాయించేవారు. కొన్నేళ్లుగా టెండర్ ప్రక్రియ నిలిపివేశారు. దీంతో స్కీం పర్యవేక్షణకు డబ్బుల్లేవు. సీపీడబ్ల్యూఎస్ స్కీంను స్థానికంగా పంచాయతీలో కలిపి దాని ద్వారా గ్రామస్తులకు నీరు సరఫరా చేస్తాం. గ్రామస్తులు నీటి కోసం ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా వ్యక్తిని ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరిస్తాం. – మహీంద్రరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ -
అమరావతి రీలాంచ్ పేరుతో రూ.700 కోట్లు వృథా
ఒంగోలు సిటీ: అమరావతి రీలాంచ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఒంగోలుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చి చేసిందేమీ లేదని, ఆయన ఏదో ఇచ్చేస్తారని కూటమి నేతలు ఆర్భాటం చేశారని, అయితే ఆయన పవన్ కళ్యాణ్ చేతిలో చాక్లెట్ పెట్టారని ఎద్దేవా చేశారు. గతంలో న్యాయమూర్తుల పర్యవేక్షణలో రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు కేటాయిస్తూ వచ్చారని, మీరు అధికారంలోకి వచ్చాక దానికి స్వస్తి పలికి మీ సొంతవాళ్లకి పనులు కేటాయించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. చదరపు అడుగుకు రూ.1800 అయ్యే చోట రూ.10,065 ఖర్చు చేస్తూ ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని ఆరోపించారు. జాతీయ రహదారుల నిర్మాణాల విషయంలో కిలోమీటరుకు రూ.25 కోట్లకు ఇస్తుంటే.. మీరు రూ.60 కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంపద సృష్టించి ప్రజలకు లబ్ధి చేకూరుస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారని, ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే మీ ఇంట్లోవారికి సంపద సృష్టిస్తున్నారన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేశారని నాడు ప్రధాని మోదీ ఆరోపించారని, నేడు అమరావతిని ఏటీఎంగా మార్చేసుకున్నారని కారుమూరి ధ్వజమెత్తారు. అమరావతిలో చేపడుతున్న నిర్మాణాల్లో రూ.లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలుస్తూ దోచేస్తున్నారని విమర్శించారు. పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారన్నారు. భ్రమరావతి పేరుతో రైతులను గాలికొదిలేశారు.. భ్రమరావతి పేరుతో చంద్రబాబు రైతులను గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. ఫీజు రీయింబర్స్ కట్టకపోవడంతో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పెద్ద ఎత్తున హడావుడి చేశారని, నేడు అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని దోచేస్తుంటే ఆయన ఎందుకు నోరుమెదపడంలేదని కారుమూరి ప్రశ్నించారు. నాడు సీజ్‌ద షిప్ అన్నారు.. నేడేమో స్టార్ట్ ద షిప్ అన్న విధంగా పేదల బియ్యం అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు వాటాలు పంచుకుంటూ పోర్టుల ద్వారా బియ్యాన్ని తరలించేస్తున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లయిస్ మంత్రి రైతుల విషయంలో, బియ్యం దోపిడీ విషయంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం గాలికొదిలేసినా రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్ పాల్గొన్నారు. ప్రధాని వచ్చి పవన్ చేతిలో చాక్లెట్ పెట్టారు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటున్నారు ప్రతీ నియోజకవర్గంలోనూ రేషన్ మాఫియా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి ధ్వజం -
మృత్యుఘోష
వేకువన ● జాతీయ రహదారిపై నిమిషాల వ్యవధిలో మూడు ప్రమాదాలు ● ఐదుగురి దుర్మరణం, నలుగురికి గాయాలు ● వారిలో ఒకరి పరిస్థితి విషమం ● మృతులు నెల్లూరు, గుంటూరు జిల్లావాసులు ● నుజ్జునుజ్జయిన లారీ, కారు ● మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన తల్లీ కొడుకు ● గమ్యస్థానం చేరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిన బాబాయ్, అబ్బాయ్ ● సురక్షితంగా బయటపడిన రెండేళ్ల చిన్నారి వేకువజామున గం.4.50 సమయం.. ఒంగోలులో నిమిషాల వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాలతో జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఈ దారుణ ఘటనల్లో ఐదుగురు విగతజీవులు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలం చూపరులకు ఒళ్లుగగుర్పాటు కలిగించేలా ఉంది. చెల్లా చెదురైన లారీ, నుజ్జు నుజ్జయిన కారులో ఇరుక్కొని పోయిన మృతదేహాలతో భయకంపితంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు మీద వందలాది వాహనాలు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు, బాబాయ్, అబ్బాయ్ విగతజీవులయ్యారు. ఒంగోలు టౌన్: జాతీయ రహదారిపై ఒంగోలు సమీపంలోని కొప్పోలు ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాలతో నగరం ఉలిక్కిపడింది. వెంట వెంటనే మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించడం... ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం నిముషాల వ్యవధిలోనే జరిగిపోయింది. నలుగురికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటిన తరువాత కొద్ది దూరంలో టైరు పంక్చర్ కావడంతో ఒక లారీ ఆగి ఉంది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అదే సమయంలో ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఇటుక లోడుతో వస్తున్న ట్రాక్టర్, కారు, ఒక మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దానికి 500 మీటర్ల దూరంలో మరో ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి తిరుపతి వెళుతున్న కారును వెనక నుంచి వచ్చిన భారీ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. భర్త ఒంగోలులో...భార్య గుంటూరులో.. ఈ ప్రమాదంలో బూసి వినయ్ కుటుంబం పరిస్థితి దయనీయంగా ఉంది. తలకు తీవ్రంగా గాయాలైన వినయ్ కోమాలోకి వెళ్లి పోయారు. ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వినయ్ భార్య బూసి లావణ్యకు వెన్నెముకకు గాయం కావడంతో పాటుగా కాలు విరిగింది. దీంతో ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఈ దంపతుల రెండేళ్ల కుమారుడు లోక్షిత్ సురక్షితంగా బయటపడ్డాడు. అమ్మా నాన్నలు కనిపించకపోవడంతో ఆ చిన్నారి రోదిస్తుండడం స్థానికులను కలిచివేసింది. బాబాయ్..అబ్బాయ్ దుర్మరణం: నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి చెందిన రావినూతల బాబు (42), రావినూతల నాగేంద్ర (20) వరసకు బాబాయ్, అబ్బాయ్ అవుతారు. కోడిగుడ్లు తీసుకొని తెలంగాణలోని భువనగిరి నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. మరో రెండు గంటలు గడిస్తే గమ్యం చేరుకుంటారనగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొంది. ఒంగోలు–నెల్లూరు జాతీయ రహదారి మీద కొప్పోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి దాటగానే కొద్ది దూరం ప్రయాణించారో లేదో ఎదురుగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. కళ్లు తెరచి చూసే లోపలే పెద్ద శబ్దం వచ్చింది. కోడిగుడ్లన్నీ ఎగిరి రోడ్డు మీద పడ్డాయి. లారీ ముందు భాగం మొత్తం తుక్కుతుక్కయిపోయింది. లారీ డ్రైవర్ రవణయ్య అలియాస్ షేక్ రహీం (60)తో సహా బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరి తల పగిలిపోయి ఛిద్రమైంది. నాగేంద్రకు వచ్చే నెలలో వివాహం జరగనున్నట్లు సమాచారం. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో రోడ్డుపై బోల్తాపడిన కోడిగుడ్ల లారీ తల్లీ, కుమారుడు మృతి... పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తిరుమలశెట్టి కృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లావణ్యను అమరావతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బూసి వినయ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారి రెండేళ్ల బాబు లోక్షిత్‌కు పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు గుంటూరు నుంచి తిరుపతికి కారులో బయలు దేరారు. వినయ్ కారులో వారికి సైతం మొక్కు ఉండడంతో గుంటూరులో ఉంటున్న ఆర్ఎంపీ కృష్ణ పెద్ద అన్నయ్య కుమారుడు, ఒక ప్రైవేటు కాలేజీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన భార్య పావని(40), వారి చిన్నకుమారుడు చంద్రకౌశిక్ (15)లు సైతం ఎక్కారు. సరిగ్గా తెల్లవారుజామున గం.4.50 కు జాతీయ రహదారిపై ఒంగోలు చేరుకున్నారు. బైపాస్ నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగిన తరువాత కొద్ది దూరంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఉండడంతో కారు ఆపారు. అంతలోనే వేగంగా వచ్చిన ఒక భారీ కంటైనర్ ఢీ కొట్టింది. ముందున్న లారీ, వెనక ఉన్న కంటైనర్ల మధ్య చిక్కుకున్న కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకులు తిరుమలశెట్టి పావని, చంద్ర కౌశిక్ అక్కడికక్కడే మృతి చెందారు. భర్త వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం షాక్‌లో ఉన్న ఆయనకు నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చంద్రకౌశిక్ గత నెలలో విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 576 మార్కులు సాధించాడు. దీంతో తల నీలాలు సమర్పించేందుకు తిరుమల బయలుదేరగా మృత్యువు కబళించింది. తల్లీకుమారులు మృత్యువాత పడడంతో కొప్పురావూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్ఎంపీ కృష్ణ చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితమే వివాహం జరిగి ఇంటి ముందు వేసిన పందిరి కూడా తీయలేదు. ఇంతలోనే ఊహించని విషాదంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. -
పింఛన్లకూ బ్రేకులు
కంభం: పింఛన్ డబ్బులు పెంచామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా కొత్తగా ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయక పోవడంపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో అధిక శాతం మంది పేద, మధ్య తరగతి వారున్నారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు వితంతువులు కూడా పింఛన్లు మంజూరు చేయక పోవడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అవస్థలు పడుతున్నారు. తాజాగా స్పౌజ్ కేటగిరిలో పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా పింఛన్ పొందుతూ భర్త మృతి చెందిన మహిళలకు మాత్రమే ఈ కేటగిరిలో పింఛన్లు మంజూరు చేస్తారు. వివిధ కేటగిరిల్లో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. పింఛన్ల కోసం ఎదురుచూపులు కూటమి పాలనలో కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య సామాజిక పింఛన్‌దారు మరణిస్తే వారి భార్యలను స్పౌజ్ కేటగిరిలో పింఛన్ మంజూరుకు అర్హులుగా నిర్థారిస్తున్నారు. దీంతో ఎటువంటి పింఛన్ పొందని వ్యక్తి మరణించినా ఆ కుటుంబంలో అర్హులకు నిరాశ ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది వితంతువులు పింఛన్ పొందేందుకు అర్హులుగా ఉన్నారు. పింఛన్ల సంఖ్య పెంచకుండా ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు పింఛన్ల మంజూరులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనుసరించిన విధానమే సరైందని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. పింఛన్ బదలాయింపు వంటివి లేకుండా సచివాలయం, వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారు. భర్త చనిపోయిన వారికి వితంతు పింఛన్లు మరుసటి నెలలోనే మంజూరు చేసేలా చర్యలు తీసుకునే వారు. అదే విధంగా ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్ల మంజూరుకు అవకాశం కల్పించే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేక పోవడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారు.దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలి నా భర్త 2024 డిసెంబర్ 27వ తేదీన చనిపోయాడు. నేను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. భర్త చనిపోయి జీవనోపాధి కోల్పోయిన నాకు వితంతు పింఛను కూడా రావడం లేదు. ప్రభుత్వం స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. – పట్రా మార్తమ్మ, పాపినేనిపల్లి కొత్తగా దరఖాస్తుకు అవకాశం లేదు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య సామాజిక పింఛన్‌దారు మరణిస్తే వారి భార్యలకు స్పౌజ్ కేటగిరిలో పింఛన్ మంజూరు చేసేందుకు వెరిఫికేషన్ చేస్తున్నాం. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రస్తుతానికి అవకాశం లేదు. సర్వర్ ఓపెన్ అయితే అర్హులైన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. – వీరభద్రాచారి, ఎంపీడీఓ, కంభం -
ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా సబ్ జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు శనివారం కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది బాలురు, 30 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో నైపుణ్యం కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ జట్లకు పామూరులోని సెయింట్ మార్క్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శిక్షణ శిబిరం ఉంటుందన్నారు. 15 నుంచి 18వ తేదీ వరకు చిత్తూరులో జరిగే సబ్ జూనియర్స్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. ఎంపికలో జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి టి.సుబ్బారావు, కోశాధికారి ముప్పారపు జయకుమార్, మెంబర్ సయ్యద్ జిలానీబాషా, పలువురు పీడీలు పాల్గొన్నారు. -
రేపటి నుంచి చిల్డ్రన్ సమ్మర్ క్యాంపు
ఒంగోలు టౌన్: ప్రకాశం బాలోత్సవం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి చిల్డ్రన్ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ కమిటీ నాయకులు సీహెచ్ వినోద్, వీరాస్వామి తెలిపారు. శనివారం ఎల్బీజీ భవనంలో క్యాంపు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ మూడేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేసవి తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో చిన్నారులు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కొనిపోయి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా చేయాలన్న ఉద్దేశంతోనే సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడం, వారిలోని నైపుణ్యాల ఆధారంగా మరింతగా రాణించేందుకు తోడ్పాటు ఇస్తున్నట్లు చెప్పారు. సైన్స్ ప్రయోగాలు, మెమరీ గేమ్స్, మ్యాజిక్, పాటలు ఆటలు, కథలు నేర్పించడం, మహనీయుల జీవిత చరిత్రలను పరిచయం చేయనున్నట్లు చెప్పారు. 4 నుంచి 10వ తరగతి లోపు విద్యార్థులు రిజిస్ట్రేషన్ కోసం 94903 00412 ఫోన్ చేయాలని కోరారు. ప్రజా నాట్యమండలి నగర కార్యదర్శి ఇంద్రజ్యోతి, మ్యాజిక్ రామన్, జన విజ్ఞాన వేదిక నగర కార్యదర్శి రంగారెడ్డి పాల్గొన్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
కంభం: మద్యం తాగి ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి స్థానిక కాప వీధిలో జరిగింది. వివరాలు.. అర్థవీడుకు చెందిన షేక్ వలి (45) కంభం పంచాయతీ పరిధి సాధుమియా వీధిలో వివాహం చేసుకొని భార్యతో కలిసి కొంతకాలంగా కాప వీధిలో నివాసం ఉంటున్నాడు. పెయింటింగ్, ఇతర కూలి పనులకు వెళ్లే వలి మద్యానికి బానిసై తరుచూ భార్యతో గొడవపడే వాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చిన అతను నిద్రపోయాడని, చీకటి పడుతున్నా లేవక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మద్యం తాగిన అతను డీహైడ్రేషన్‌తో మృతి చెందాడా? ఇంకా ఏదైనా కారణంతో మృతి చెందాడా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
లక్ష్మీచెన్నకేశవునికి ప్రత్యేక పూజలు
మార్కాపురం టౌన్: పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి, కంభంరోడ్డులోని ప్రసన్న వేంకటేశ్వరస్వామికి అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్లకు అర్చక బృందం ఆధ్వర్యంలో అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణం, అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈవో జీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
చిన్నారులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకోవాలి
ఒంగోలు టౌన్: చిన్నారులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి సూచించారు. జిల్లా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతులు శనివారం 5వ రోజుకు చేరాయి. 65 మంది చిన్నారులు హాజరుకాగా వారితో కథలు చదివించారు. ఇంగ్లిష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లిష్, లూసిడా హ్యాండ్ రైటింగ్, యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆదిలక్షి తరగతులను సందర్శించారు. క్రాఫ్ట్ క్లాసులో పిల్లలు తయారు చేసిన వస్తువులు చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి విజ్ఞాన తరగతులతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. సెల్ఫోన్లు, ఆన్లైన్ గేమ్‌లతో చిన్నారుల విలువైన సమయం పాడు కాకుండా మంచి అలవాట్లతో చిన్నారులను తీర్చిదిద్దొచ్చన్నారు. వేసవి విజ్ఞాణ తరగతులకు హాజరయ్యేలా చిన్నారులను ప్రోత్సహించాలని తలిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా గ్రంథాలయ ఉపపాలకురాలు బొమ్మల కోటేశ్వరి మాట్లాడుతూ చిన్నారులకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే వారిలోని ఆలోచనలను మేలుకొల్పొవచ్చని చెప్పారు. చిన్నతనం నుంచే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దితే పెద్దయ్యాక బాధ్యత కలిగిన పౌరులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. శిరీష, టి.రవీంద్ర, డి.ప్రసాద్, ఆర్.విందుమణి, టి.శ్రీనివాసరావు, వెంకయ్య పాల్గొన్నారు. -
డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణ
ఒంగోలు టౌన్: నేరాల నియంత్రణలో డ్రోన్ కెమెరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, నేర స్థలాలను పరిశీలించేందుకు, ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు వీలవుతుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాల యజమాని రవికుమార్ శనివారం పోలీసు శాఖకు డ్రోన్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పోలీసుస్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతరా నేరాలకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగానే గుర్తించి అక్కడకు డ్రోన్లను పంపించినట్లు తెలిపారు. ప్రముఖుల బందోబస్తుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. డ్రోన్ కెమెరాలు పోలీసుల సామర్థ్యాన్ని మరింత మెరుగు పరుస్తుందన్నారు. రూరల్ సీఐ శ్రీకాంత్, మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య పాల్గొన్నారు. నేడు సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం ● ప్రారంభోత్సవానికి హాజరు కానున్న హైకోర్టు జడ్జిలు ● ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా జడ్జి భారతి సింగరాయకొండ: కొండపి నియోజకవర్గ ప్రజల కల అయిన సివిల్ జడ్జి (జూనియర్ విభాగం) కోర్టు ఆదివారం ఉదయం 9.30 గంటలకు స్థానికంగా ప్రారంభించనున్నట్లు సింగరాయకొండ బార్ అసోసియేషన్ తెలిపింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి టి.రాజశేఖరరావు, హైకోర్టు జడ్జిలు డాక్టర్ కె.మన్మథరావు, జి.రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ వై.లక్ష్మణరావు, జిల్లా జడ్జి భారతి, జిల్లాలోని అన్ని కోర్టుల జడ్జిలు పాల్గొంటారన్నారు. కోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లా జడ్జి భారతి స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 35 టన్నుల తెల్లరాయి పట్టివేత ● లారీ స్వాధీనం, పోలీసుస్టేషన్‌కు తరలింపు కొనకనమిట్ల: కనిగిరి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 35 టన్నుల తెల్లరాయి లారీని శనివారం రాత్రి భూగర్భ గనుల ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. మార్కాపురం భూగర్భ గనుల ఖనిజాభివృద్ధి సంస్థ డివిజన్ కార్యాలయం ఏజీ పోలిరెడ్డికి అందిన సమాచారం మేరకు ఆయన తన సిబ్బందితో వెళ్లి అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయి లోడు లారీని పట్టుకున్నారు. ఏజీ తెలిపిన వివరాల మేరకు కనిగిరి నుంచి హైదరాబాద్‌కు తెల్లరాయితో వెళ్తున్న లారీని కొనకనమిట్ల మండలం చినారికట్ల జంక్షన్ సమీపంలో తనిఖీ చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తెల్లరాయి లారీని స్వాధీనం చేసుకొని కొనకనమిట్ల పోలీసుస్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన రాయి, లారీ విషయంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పోలిరెడ్డి స్పష్టం చేశారు. టీఏ బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
సింగరాయకొండ: సార్.. మా బిడ్డ ఐశ్వర్య (3) కనబడటం లేదు.. రక్షించి మాకు అప్పగించడండి.. అంటూ తండ్రి చిలకూరి హరికృష్ణ ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగి రెండు రోజుల్లో కేసును ఛేదించిన సీఐ హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్రలను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 30వ తేదీ బుధవారం నుంచి కుమార్తె ఐశ్వర్య కనబడటం లేదని పాతసింగరాయకొండ పంచాయతీ బాలిరెడ్డినగర్‌కు చెందిన హరికృష్ణ ఈ నెల ఒకటో తేదీన ఎస్సై బి.మహేంద్రకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో సీఐ హజరత్తయ్య సూచనలతో దర్యాప్తు ప్రారంభించిన ఎస్సై మహేంద్ర పాప తప్పిపోయిన రైల్వేస్టేషన్ రోడ్డులోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. సీసీ కెమెరాలతో నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలేనికి చెందిన యువకుడు నరసింహం పాపను రైల్వేస్టేషన్ నుంచి పోలీస్‌స్టేషన్ సెంటర్‌కు వచ్చి కందుకూరు వైపు వెళ్లే బస్సు ఎక్కడాన్ని గుర్తించారు. వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు కరపత్రికలు కందుకూరు, వలేటివారిపాలెం తదితర ప్రాంతాల్లో పోలీసులు పంపిణీ చేశారు. ఈ ప్రయత్నంలో చివరికి నెల్లూరు జిల్లా వలేటివారిపాలెంలో ఉన్నట్లు సమాచారం అందటంతో అక్కడికి వెళ్లి పాపను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడు నరసింహను పట్టుకున్న ఎస్సై మహేంద్ర వివరాలు రాబట్టగా రైల్వేస్టేషన్ వద్ద ఐశ్వర్య నాయనమ్మ మద్యం తాగి పడిపోయిందని, దీంతో తనకు దిక్కుతోచక పాపను తీసుకెళ్లానే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పాడన్నారు. ఐశ్వర్యను తమకు అప్పగించిన ఎస్సై మహేంద్రను తల్లి శిరీష అభినందించారు. పాప తప్పిపోవడంతో రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా రోదించానని, ఏం చేయాలో అర్థం కాలేదని, చివరికి దేవుల్లా మా అమ్మాయిని మా ఒడికి చేర్చారని ఆమె కన్నీటి పర్యంతమైంది. కేసును పట్టుదలతో ఛేదించిన ఎస్సై మహేంద్రను మండల ప్రజలు అభినందించారు. కేసును రెండు రోజుల్లో ఛేదించిన పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఐశ్వర్య తల్లిదండ్రులు సింగరాయకొండ సీఐ, ఎస్సైను అభినందించిన ఎస్పీ -
మహా మేతగాళ్లు
కూటమి నేతలు.. నదీగర్భాలను ఇసుకాసురులు కుళ్లబొడిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, అక్రమార్కులు ఒక్కటై కొండపి నియోజకవర్గంలో పాలేరు, మన్నేరు, అట్లేరు నదులపై రాబందుల్లా వాలిపోయారు. భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అధికారం చేతిలో ఉందికదా అడిగేవాళ్లెవరు అంటూ రెచ్చిపోయారు. నిబంధనలు అతిక్రమించి నిత్యం వేలాది ట్రాక్టర్లలో వేల టన్నుల ఇసుకను దోచేశారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా సహజ సంపదను కొల్లగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల కనుసన్నల్లో జరుగుతున్న దోపిడీపై అధికారులు కిమ్మనడంలేదు. మంత్రి ఇలాఖాలో ఇసుక దోపిడీ సాక్షాత్తు మంత్రి స్వామి నియోజకవర్గంలోని జరుగుమల్లి, పొన్నలూరు, కొండపి, సింగరాయకొండ మండలాల్లో ఇసుక దందా జోరుగా జరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో స్థానికులు ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడంలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ట్రాక్టర్లకు అక్రమంగా ఇసుకను లోడ్ చేస్తూ భారీగా వసూలు చేస్తున్నారు. 10 కిలోమీటర్ల వరకే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లాలన్న నిబంధన ఉన్నా జరుగుమల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఒంగోలుకు వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. మైనింగ్, పోలీసు అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై అధికారులకు సవాల్ విసురుతున్నా. రీచ్‌ల వద్దకు వెళదాం. అక్రమ దందాను నిరూపిస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకునే దమ్ముందా..? ఆ ప్రాంతంలో పహారా పెడతారా... ప్రభుత్వ ఖనిజాలు దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా. అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోంది. ప్రభుత్వ ధనం లూటీ అవుతోంది. గతంలో ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వచ్చేది. ఖనిజ సంపదకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే ఇసుక దందాకు తెరతీశారు. కౌంటింగ్ పూర్తయిన క్షణం నుంచే పచ్చనేతలు రెచ్చిపోయారు. జిల్లాలో ఎక్కువ నదీ పరీవాహక ప్రాంతమున్న ఈ నియోజకవర్గంలోని సహజ వనరులపై కన్నేశారు. మొదట్లో జరుగుమల్లి మండలం సతుకుపాడు వద్ద ప్రభుత్వం ఇసుక స్టాకు పాయింట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ టన్ను రూ. 275 చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ట్రాక్టరు ఇసుకకు రూ.1500 చెల్లించి బయట మార్కెట్లో రూ. 5000 లకు విక్రయిస్తూ దోపిడీని షురూ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో రాత్రి పూట అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు ఎవరూ మామూళ్ల మత్తులో అడ్డగించలేకపోయారన్న ప్రచారం జరిగింది. అడపాదడపా అధికారులు అడ్డగించినా వారికి పనిచేసుకుంటావా లేక బదిలీ చేయాలా అన్న బెదిరింపులకు దిగారు అధికార పార్టీ నేతలు. నిబంధనలు మీరి... తమ పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవచ్చని ఎవరూ ఆపవద్దని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఇసుక కోసం వాహనం తీసుకుని నది వద్దకు వెళితే పచ్చనేతలు ట్రాక్టరుకు లోడింగ్ చేసిన దానికి రూ.300, తమ వాటా రూ.500 మొత్తం రూ.800 చెల్లించి మరీ ఇసుక తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అదేమని అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ట్రాక్టరును సీజ్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాక నదుల్లో మనుషులతోనే ఇసుకను ట్రాక్టరుకు లోడ్ చేయాలి తప్ప యంత్రాలను వాడకూడదన్న నిబంధనను కూడా టీడీపీ నేతలు గాలికి వదిలేశారు. యథేచ్ఛగా యంత్రాల ద్వారా ట్రాక్టర్లకు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. నదీపరివాహక ప్రాంతం నుంచి ఇంటి అవసరాలకు వాడుకోవాలే తప్ప వ్యాపారం చేయకూడదన్న నిబంధన కూడా ఉంది. కానీ దానిని ఒక్కరోజు కూడా అమలు కాలేదు. ప్రతి రోజు జరుగుమల్లి నుంచి 30 కిలోమీటర్లు ఉన్న ఒంగోలుకు రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఒంగోలు పరిధిలో ఇసుక స్టాకు పాయింట్లు ఉన్నప్పటికీ జరుగుమల్లి నుంచే ఇసుక అక్రమ రవాణా జరగటంతో అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయిఇటీవల ఒంగోలు, కొండపి లోని పచ్చపార్టీకి చెందిన అధినాయకుల అండదండలతో ద్వితీయశ్రేణి నాయకుల మధ్య గొడవలు జరిగిన సంగతి విదితమే. అధికార పార్టీ నేతలు అనుమతులు ఇవ్వాలి.. జరుగుమల్లి మండలం కామేపల్లి, సతుకుపాడు ప్రాంతంలో టీడీపీ నాయకుల ట్రాక్టర్లకే ఇసుక లోడింగ్ జరుగుతుంతోందని, ఇతరులు వెళితే టీడీపీ నేతల అనుమతి తప్పనిసరి తెలుస్తోంది. దీంతో కాలువలు, నదుల్లో ఇసుకను ఉచితంగా ఏవిధంగా తీసుకుని వెళ్లాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. అంతేకాక ఇష్టారాజ్యంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో పొలాలకు వెళ్లే రోడ్లన్నీ ధ్వంసమై ద్విచక్ర వాహనాలపై పొలాలకు వెళ్లలేకపోతున్నామని దీంతో కిలోమీటర్ల దూరం నడిచి పోవాల్సి వస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయా మండలాల పరిధిలో భూగర్భ జలాలు అడుగంటాయని, రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ఇసుక మింగేశారు కొండపి నియోజకవర్గంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా పాలేరు, మన్నేరు, అట్లేరు నదుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు టీడీపీ అధినాయకుని కనుసన్నల్లో అక్రమ రవాణా 24 గంటలు ఇసుక తరలిపోతున్నా చోద్యం చూస్తున్న అధికారులు నియోజకవర్గంలో అడుగంటుతున్న భూగర్భ జలాలుచోద్యం చూస్తున్న అధికారులుఈ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రాత్రి పూట టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరగగా, ప్రస్తుతం 24 గంటలూ ట్రాక్టర్ల ద్వారా దందా జోరుగా సాగుతోందని ప్రచారం. ప్రస్తుతం జరుగుమల్లి నుంచి ఒంగోలుకు ప్రతిరోజు సుమారు 300 వరకు, కామేపల్లి నుంచి కొండపి, ఇతర ప్రాంతాలకు సుమారు 300, పొన్నలూరు మండలం వేంపాడు, ఉప్పలదిన్నెప్రాంతాల నుంచి సుమారు 300, సింగరాయకొండ మండలం మన్నేరు, కొండపి మండలం అట్లేరు నుంచి సుమారు 100 కు పైగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం విక్రయిస్తున్న ధరల ఆధారంగా ఇప్పటి వరకూ నియోజకవర్గంలో దాదాపు రూ.100 కోట్లకు పైగా ఇసుక దందా సాగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వీరయ్య కేసులో పుకార్లు షికార్లు
ఒంగోలు టౌన్: తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య జరిగి రెండు వారాలు కావస్తోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు ఇప్పటికీ విచారణ దశలోనే ఉండడంతో రోజుకో రకంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరయ్య హత్యలో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా టీడీపీ నాయకులే కావడంతో కేసు విచారణ విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హత్య విచారణ ఆలస్యమవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వీరయ్య కేసులో ప్రధాన అనుమానితులను చాలా మందినే పోలీసులు విచారించారు. ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయినా ఇంకా కొలిక్కిరాలేదని చెబుతున్నారు. ఆ నలుగురూ నెల్లూరు వాళ్లేనా... ఏప్రిల్ 22వ తేదీన ఒంగోలులోని జాతీయ రహదారికి అనుకొని ఉన్న కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిని నలుగురు యువకులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఎస్పీ కార్యాలయం, తాలూకా పోలీసు స్టేషన్లకు కూత వేటు దూరంలో ఈ హత్య జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. హత్య తరువాత ఒక స్కూటీ మీద ఇద్దరు, మరో మోటారు బైకు మీద మరో ఇద్దరు నిందితులు పారిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ నలుగురిలో ఇద్దరు మాత్రం చీమకుర్తి సమీపంలో ఒక డాబా పక్కన స్కూటీని నిలిపివేసి కనిగిరి ఆర్టీసీ బస్సెక్కి పొదిలి వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మిగిలిన నిందితులు ఎటు వైపు వెళ్లారన్నది నిర్ధారణ కాలేదు. అయితే ఇప్పటి వరకు ఒంగోలు నగర శివారులోని కొప్పోలులో ఒక ప్రైవేటు పాఠశాల సమీపంలో నివశించే వ్యక్తి నేరుగా హత్యలో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎంత వరకు నిజమో పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. అసలు హత్యలో పాల్గొన్న నలుగురు కూడా నెల్లూరుకు చెందిన పాత నేరస్తులేనన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై తే నెల్లూరు నుంచి ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరి కోసం పోలీసులు విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలోని పలు పట్టణాల్లో గాలిస్తున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా తడ పరిసరాల్లో కూడా నిందితుడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొప్పోలు అనుమానితుడిపైనే ప్రధాన దృష్టి అయితే వీరయ్య చౌదరి హత్య జరిగినప్పటి నుంచి కొప్పోలుకు చెందిన వ్యక్తి మీదే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో అతడు స్వయంగా పాల్గొనడమే కాకుండా మిగతా నిందితులను కూడా అతడే సమకూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. హత్యకు ముందు నిందితులు నగరంలోని గుంటూరు రోడ్డులో ఒక లాడ్జీలో ఉన్నారని, వారికి కొప్పోలు వ్యక్తే భోజనాలను పంపించేవాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. హత్య జరిగిన తరువాత వైజాగ్ పారిపోయినట్లు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు అతడు వైజాగ్‌లోనే తలదాచుకునే ఉన్నాడో లేక ఎక్కడికై నా జారుకున్నాడో తెలియదు. అతడు దొరికితే కీలకమైన వ్యక్తులు దొరికే అవకాశం ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాత్రధారులంతా నెల్లూరు వాళ్లేనని ప్రచారం హత్య జరిగి రెండు వారాలు కావస్తున్నా దొరకని నిందితులు ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రధాన అనుమానితుడు -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకం
దర్శి (కురిచేడు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో జిల్లాకు చెందిన వారిని పలువురిని నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి శనివారం తెలిపారు. ఆమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసిందన్నారు. రాష్ట్ర స్టూడెంట్ వింగ్ జోనల్ ప్రెసిడెంట్‌గా దర్శికి చెందిన దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర అంగన్వాడీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా కనిగిరికి చెందిన తమ్మినేని సుజాత, కార్యదర్శిగా దర్శికి చెందిన కందిమళ్ల గీతాంజలి, రాష్ట్ర ఎంప్లాయీస్, పెన్షనర్ల వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా సంతనూతలపాడుకు చెందిన డాక్టర్ నెట్టా సంజీవరావు, కార్యదర్శి గా మార్కాపురానికి చెందిన గోనావత్ ధర్మా నాయక్, సంయుక్త కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన యనమదల స్వరూప్‌ను నియమించినట్లు ఆయన తెలిపారు. నేడు రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాల్గవ, ఐదవ బహుమతుల కింద రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేస్తారన్నారు. పూర్తి వివరాలకు 7702292595 నంబరుకు సంప్రదించాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలి ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: ఇళ్ల నిర్మాణాల పురోగతిలో ప్రతివారం స్పష్టమైన పురోగతి ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలపై ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో శనివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో కేటగిరీల వారీగా పురోగతిపై ఆమె ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ చెంచులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం చేస్తున్నందున ఆ డబ్బులను ఇళ్ల నిర్మాణాలకి లబ్ధిదారులు ఖర్చు పెట్టేలా చూడాలని ఆమె ఆదేశించారు. ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు సమన్వయంతో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఇకపై మండలాల వారీగా కాకుండా వచ్చే సమావేశం నుంచి గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని చెప్పారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఈఈలు, డీఈలు, ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ఒంగోలు సబర్బన్: ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోనని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఎంపీడీఓలు, ఏపీఓలు వీటికి సంయుక్తంగా జవాబుదారీ అని చెప్పారు. ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో శనివారం ఆమె ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యం మేరకు పనులు జరగకపోతే ఇద్దరిపైనా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ పథకం కింద జిల్లాలో నిర్వహిస్తున్న పనులు, వాటి పురోగతిని డ్వామా పీడీ వివరించారు. ఫారం పాండ్స్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు మే నెలను శ్రీఫారం పాండ్స్ మాసం్ఙగా ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దీనిపై కలెక్టరు మాట్లాడుతూ ఈ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పశ్చిమ ప్రాంతంలో, ముఖ్యంగా యర్రగొండపాలెం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నీటి తొట్టెల నిర్మాణాలను కూడా సత్వరమే పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. వాస్తవ గడువు గత నెలలోనే ముగిసినా ఇంకా వీటిని పూర్తి చేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక సమాధానం చెప్పి మ్యానేజ్ చేసుకుందాములే అనుకుంటే ఊరుకోనని కలెక్టర్ హెచ్చరించారు. ఉపాధి కోరిన అందరికీ పని కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పనుల గుర్తింపునకు సంబంధించిన అనుమతులు ముందుగానే తీసుకోవాలని చెప్పారు. -
హెచ్ఎం పదోన్నతుల్లో అవకతవకలు సవరించాలి
ఒంగోలు సిటీ: స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్మాస్టర్ పదోన్నతుల జాబితాలో అవకతవకలు సవరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ కిరణ్‌కుమార్‌ను కోరారు. స్థానిక ఎస్ఎస్ఏ కార్యాలయంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శనివారం డీఈఓ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా, జీవో నంబర్ 117 తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ స్కూల్ సిస్టెంట్ నుంచి హెచ్ఎంల పదోన్నతుల గురించి చర్చించారు. ఉర్దూ మైనర్ మీడియం సెక్షన్ కొనసాగించాలని, ఉర్దూ ఎస్జీటీ పోస్టును ఉంచాలని కోరారు. మార్కాపురం మున్సిపాలిటీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సీనియార్టీ లిస్టులో లోపాలను డీఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇటీవల మెడికల్ సర్టిఫికెట్ల జారీకి రిమ్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిబిరానికి హాజరుకాలేని వారికి మరో సారి అవకాశం కల్పించాల్సిందిగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. కమిషనర్ నుంచి ప్రొసీడింగ్ వచ్చిన వెంటనే అవకాశం కల్పిస్తామని డీఈఓ చెప్పారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై, లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్ రెడ్డి, శ్రీనివాసులు, పీవీ.సుబ్బారావు, పీఆర్టీయూ నాయకులు శ్రీనివాసరావు, ఎస్టీయూ నాయకులు చల్లా శ్రీను, నరసింహారెడ్డి, టీఎన్‌యూఎస్ నాయకులు ఆంజనేయులు, పండిత పరిషత్ నాయకులు రఘు, ఎస్ఏఎపీ నుంచి రఫీ, బీటీఏ నాయకులు వెంకట్రావు, మల్లిఖార్జునరావు, దిలీప్ చక్రవర్తి, ఏడీ లు వరప్రసాద్, ఉదయ భాస్కర్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ రెడ్డి, రమణయ్య, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
నేడు 5 కేంద్రాల్లో నీట్
ఒంగోలు సబర్బన్: నీట్ పరీక్షలు ఆదివారం జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ సందర్భంగా నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు మొత్తం 1,473 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయం, జవహర్ నవోదయ, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజి, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజి, డీఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూల్లను కేంద్రాలుగా ఎన్టీఏ ఎంపిక చేసిందన్నారు. ఈ 5 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగేందుకు భద్రతా పరమైన చర్యలతో పాటు అభ్యర్థులకు అవసరమైన రవాణా సౌకర్యం, పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిబిరాలు, విద్యుత్ అంతరాయం లేకుండా చూడటం, పారిశుధ్యం, దివ్యాంగులకు వీల్ చైర్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రశ్నపత్రాల ఓపెనింగ్, అభ్యర్థుల తనిఖీలు, తదితర విషయాల్లో ఎన్టీఏ మార్గదర్శకాలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్విజిలేటర్లకు అవసరమైన శిక్షణ గురువారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పరీక్షల సిటీ కో ఆర్డినేటర్‌కు ఆమె సూచించారు. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణాన్ని కల్పించే బాధ్యత ఆయా సెంటర్ల సూపరింటెండెంట్లపై ఉందన్నారు. పరీక్ష కేంద్రాల పరిశీలనలో కలెక్టర్‌తో పాటు డీఆర్ఓ బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు ఉన్నారు. నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభం -
మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్ ప్రారంభం
మార్కాపురం: 54వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కమలా సీబీఎస్సీ స్కూల్గ్రౌండ్స్లో చైర్మన్ పవన్, లయన్స్ క్లబ్ చైర్మన్ రామకృష్ణలు చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వలన మానసిక, శారీరక దృఢత్వంతోపాటు పోటీతత్వం అలవడుతుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజనేయులు, జిల్లా హ్యాండ్‌బాల్ సెక్రటరీలు రవికుమార్, శ్రీకాంత్, గణేష్, లక్ష్మణ్, మహబూబ్‌బాషా, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి చంద్రశేఖరరావు, సత్యప్రసాద్ పాల్గొన్నారు. -
వక్ఫ్ భూములు ఉఫ్!
ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ భూములు పొదిలి: వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలకు తావిస్తోంది. ఒకరిని చూసి మరొకరు వక్ఫ్ భూముల్లో పాగా వేస్తుండటంతో ఆస్తులు తరిగిపోవడంతోపాటు ఆదాయానికీ భారీగా గండి పడుతోంది. భూములు అన్యాక్రాంతమవుతున్న తీరుపై ముస్లింలు గగ్గోలు పెడుతున్నా సంబంధిత శాఖ అధికారులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి మండలానికి సంబంధించి ఒంగోలు రోడ్డులోని దర్గా దగ్గర కాలువ నుంచి మర్రిపూడి రోడ్డు వరకు, బుచ్చనపాలెం సమీపంలో కొంత మేర, కాటూరివారిపాలెం సమీపంలో మొత్తం 322.24 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 285, 325–1,325–2,325–3, 81–1, 407–2, 483–2, 806, 820, 885, 888–1, 888–2,888–4, 888–6, 889–1లో విస్తరించి ఉన్న ఈ భూములపై పర్యవేక్షణ కొరవడటంతో అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ఆపై తప్పుడు రికార్డులు సృష్టించి భూములు తమవని పేర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆక్రమణల జోరు.. ఒంగోలు–కర్నూలు రోడ్డులోని టైలర్స్ కాలనీ–రైల్వే బ్రిడ్జి మధ్యలో ఉన్న వక్ఫ్ భూములు ఎక్కువ భాగం ఆక్రమణకు గురయ్యాయి. గతంలో కొందరు ఆక్రమణదారులు చేసిన ప్రయత్నాలను అప్పటి అధికారులు అడ్డుకున్నారు. కానీ ప్రస్తుతం అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. అధికారులు కేవలం నోటీసులిచ్చేందుకు పరిమితం కావడం.. నోటీసులు షరా మామూలేననే ధోరణిలో ఆక్రమణదారులు ఉండటంతో విలువైన ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది. పొదిలిలో 52 మంది ఆక్రమణదారులకు అధికారులు నోటీసులు పంపించారు. మరో 40 మంది భూఆక్రమణదారులకు సైతం నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడలేదు. ఆక్రమిత భూములను గుర్తించి నిందితులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారులు లైట్ తీసుకోవడంపై స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ విచారణ వాయిదా వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతున్న తీరు, ఆక్రమణదారుల వ్యవహార శైలి గురించి పొదిలి పంచాయతీ వార్డు మాజీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు బాషా పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వక్ఫ్ సంస్థ భూములను కాపాడాలని కోరారు. దీంతో ఎట్టకేలకు డిప్యూటీ కలెక్టర్ ఇటీవల విచారణకు వచ్చారు. అయితే రికార్డులు అందుబాటులో లేవని, తహసీల్దార్ సెలవులో ఉన్నారనే కారణాలతో విచారణ వాయిదా వేశారు. మళ్లీ విచారణ ఎప్పుడు చేపడతారో స్పష్టత లేదు. ఆదాయానికి గండి వక్ఫ్ భూముల కౌలు వేలం ద్వారా ప్రతి సంవత్సరం లక్షల రూపాయల్లో ఆదాయం వస్తోంది. ఒక్కో ఏడాది రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఆదాయం వస్తున్నట్లు స్థానిక ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. ఈ ఆదాయంలో నుంచే పొదిలిలోని పెద్ద మసీదు నిర్వహణకు కొంత మొత్తాన్ని వినియోగిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతు పనులకు సైతం వక్ఫ్ భూముల ఆదాయం నుంచే ఖర్చు చేస్తూ వస్తున్నారు. అయితే భూములు అన్యాక్రాంతం అవుతుండటంతో కౌలు వేలం ఆదాయం తగ్గిపోతోంది. భూవివాదాల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టకపోగా సాధారణ విషయంగా పరిగణిస్తుండటంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది. ఆక్రమణలు తొలగించేంత వరకు పోరాటం వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తా. ఎన్నోమార్లు స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు ఆక్రమణలపై ఫిర్యాదు చేశా. కానీ వారు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ హైకోర్టు తీర్పును కూడా అధికారులు అమలు చేయడం లేదు. మళ్లీ కోర్టుకు వెళ్లయినా సరే అధికారులు చర్యలు తీసుకునేలా కృషి చేస్తా. – ముల్లా ఖాదర్‌బాషా, వైఎస్సార్ సీపీ నాయకుడు అధికారులు సహకరిస్తేనే ఆక్రమణల తొలగింపు ఆక్రమణల తొలగింపునకు సంబంధించి వ్యవహారం తుది దశకు చేరింది. కలెక్టర్, ఎస్పీని కలిసి పలుమార్లు విన్నవించాం. వారు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. స్థానిక అధికారులు, పోలీసుల అండతోనే ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. పని ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారు. వారు సహకరిస్తే త్వరలోనే ఆక్రమణలు తొలగిస్తాం. – అహ్మద్ బాషా, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ -
సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం
రేపు సింగరాయకొండలో సింగరాయకొండ: కొండపి నియోజకవర్గ ప్రజల కల అయిన సివిల్ జడ్జి కోర్టు(జూనియర్ విభాగం) ఆదివారం సింగరాయకొండలో ప్రారంభం కానున్నట్లు స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి టి.రాజశేఖరరావు, హైకోర్టు జడ్జిలు డాక్టర్ కె.మన్మథరావు, జి.రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ వై.లక్ష్మణరావు, జిల్లా జడ్జి భారతి పాల్గొంటారని వివరించారు. ఐదు మండలాలకు ప్రయోజనం సింగరాయకొండలో సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుతో సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు, కొండపి, పొన్నలూరు మండలాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ ఐదు మండలాల పోలీస్స్టేషన్లతో పాటు సింగరాయకొండ ఎకై ్సజ్ సర్కిల్ పోలీస్‌స్టేషన్ కూడా ఈ కోర్టు పరిధిలోకి వస్తుంది. ఐదు మండలాలు నూతన కోర్టు పరిధిలోకి రావడంతో కేసులు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరు, కొండపి మండలాలు కందుకూరు కోర్టు పరిధిలో, టంగుటూరు మండలం ఒంగోలు కోర్టు పరిధిలో ఉండేవి. ఈ కోర్టు ఏర్పాటుతో సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి కందుకూరు కోర్టుతో ఇక ఎటువంటి సంబంధం ఉండదు. ఈ కోర్టులో వచ్చే తీర్పులకు అప్పీలు చేసుకోవాలన్నా అప్పిలేట్ కోర్టుగా ఒంగోలు కోర్టు ఉంటుందని న్యాయవాదులు వివరించారు. ప్రస్తుతం ఐదు మండలాల్లో సుమారు 4 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. హాజరు కానున్న హైకోర్టు జడ్జిలు -
గేదె పొడిచి యువకుడి మృతి
దొనకొండ: బైకుపై వెళ్తున్న యువకుడిని గేదె పొడవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపేట గ్రామానికి చెందిన పోలు నతానియేలు (23) ద్విచక్ర వాహనంపై అదే గ్రామానికి చెందిన మరియబాబును ఎక్కించకుని కొనకనమిట్ల మండలం సిద్ధవరం గ్రామానికి వెళ్తున్నాడు. ఆరవల్లిపాడు సమీపంలో గేదెల గుంపులోని ఒక గేదె బైకుపై ఉన్న నతానియేలును పొడిచింది. ఆయన ఎడమ వైపు కాలర్ బోన్ కింద భాగంలో తీవ్ర గాయమైంది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. నతానియేలు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై త్యాగరాజు తెలిపారు. -
పిడుగుల వానకు మూగజీవాలు బలి
కనిగిరి రూరల్/కొమరోలు: కనిగిరి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతోపాటు పిడుగులు పడ్డాయి. దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. ఉదయం 6.30 గంటల సమయంలో మండలంలోని పోలవరం పంచాయతీ కలగట్ల సమీప పొలాల్లో నూకతోటి శివపార్వతమ్మకు చెందిన గొర్రెల మంద దొడ్డిపై పిడుగు పడింది. దీంతో 20 మేకలు మృతి చెందాయి. సుమారు రూ.5 లక్షల మేర నష్టం జరిగిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలాన్ని పశు వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అంకమ్మరాజు పరిశీలించారు. కొమరోలు మండలంలో.. కొమరోలు మండలంలో గురువారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. తాటిచెర్ల మోటు గ్రామంలో పిడుగు పడటంతో రెండు గేదెలు, రెండు దూడలు మృతిచెందాయి. రూ.3 లక్షల విలువైన పశువులు మృత్యువాత పడ్డాయని బాధిత రైతు గుమ్మళ్ల శింగరయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. మిద్దైపె నుంచి పడి వృద్ధురాలు.. పని నిమిత్తం మిద్దైపెకి ఎక్కిన ఓ వృద్ధురాలు బలమైన ఈదురు గాలుల ధాటికి కిందపడి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సర్విరెడ్డిపల్లె గ్రామానికి చెందిన గుడిమి సుశీలమ్మ(70) కుటుంబ సభ్యులతో కలిసి కొమరోలులోని గీతామందిరం వద్ద సొంత ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటోంది. గురువారం రాత్రి వర్షం మొదలయ్యే తరుణంలో మిద్దైపె ఆరబెట్టిన పసుపు కొమ్ములు తెచ్చేందుకు వెళ్లింది. అదే సమయంలో బలమైన గాలులు వీయడంతో అదుపుతప్పి మిద్దైపె నుంచి కిందపడింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన 108 అంబులెన్స్‌లో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుశీలమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుశీలమ్మకు భర్త, 8 మంది సంతానం ఉన్నారు. కనిగిరి మండలంలో 20 మేకలు మృతి కొమరోలు మండలంలో 2 గేదెలు, 2 దూడలు మృతి రెండు ఘటనల్లో బాధితులకు రూ.8 లక్షల మేర నష్టం ఈదురు గాలుల ధాటికి మిద్దైపె నుంచి పడి మరణించిన వృద్ధురాలు -
కౌంట్ డౌన్ ప్రారంభమైందా?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య జరిగి 12 రోజులైంది. ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నారు. హత్యకు గురైన వీరయ్య చౌదరి, హత్యకు ప్లాన్ చేసినట్లు చెబుతున్న ప్రధాన అనుమానితులంతా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడంతో ఈ కేసుపై ఎనలేని ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా హతుడు వీరయ్య చౌదరికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సన్నిహితుడు కావడం పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాన అనుమానితుడిగా ఉన్న అమ్మనబ్రోలు వాసి, టీడీపీ యువ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మనబ్రోలుకు చెందిన మరో టీడీపీ సానుభూతిపరుడైన హవాలా వ్యాపారి కోసం గాలిస్తున్నారు. హత్యలో ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్న కొప్పోలు వాసి కోసం వైజాగ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరితో పాటుగా దాదాపుగా 150 మందికి పైగా అనుమానితులను తీసుకొచ్చి విచారిస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఈ కేసు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. అమరావతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వచ్చి వెళ్లారు. మూడు రోజులుగా పోలీసులు పీఎం సభ బందోబస్తులో బిజీగా ఉన్నారు. ఆ పని కాస్త అయిపోవడంతో ఇక వీరయ్య చౌదరి కేసులో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర జాప్యం కావడంతో తమ వద్దనున్న నిందితులపై కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. నిందితులంతా టీడీపీ నాయకులే... టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. హత్యకు గురైన వీరయ్య చౌదరి టీడీపీలో చాలా క్రియాశీలక నాయకుడు. ఆయన హత్య కేసులో ఉన్న అమ్మనబ్రోలుకు చెందిన ప్రధాన అనుమానితుడు కూడా టీడీపీలో క్రియాశీలక నాయకుడు కావడం గమనార్హం. ఆయన తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అంతే కాకుండా సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటుగా ఈ హత్య కేసులో డబ్బులు సమకూర్చినట్లు ప్రచారం జరుగుతున్న మరో ప్రధాన అనుమానితుడు కూడా తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. హత్య చేసిన నిందితులకు డబ్బులు అందజేసినట్లుగా చెబుతున్న ఓ సిద్ధాంతి కూడా టీడీపీకి చెందినట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇలా పై నుంచి కింద దాకా ఈ హత్య కేసులో అంతా టీడీపీ వారే కావడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. అందుకే ఈ కేసు గురించి టీడీపీ ప్రజా ప్రతినిధులు ఎక్కడా నోరువిప్పి మాట్లాడడం లేదు. విచారణ ఆలస్యంపై అనుమానాలు... నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో విచారణ జాప్యం అవుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్రిల్ 22వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో వీరయ్య చౌదరి హత్య జరిగింది. హత్య జరిగిన రోజు రాత్రే రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒంగోలుకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోలీసు అధికారులతో మాట్లాడారు. హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరుసటి రోజు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు హోం మంత్రితో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు. మరుసటి రోజు వీరయ్య అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు వీరయ్య హంతకులను ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అసలు హంతకులు నేల మీద ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయితే కేసు లోతుల్లోకి వెళితే అంతా టీడీపీ నాయకులే ఉండడంతో పోలీసు అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని తెలుస్తోంది. అందువల్లనే కేసు విచారణ ఆలస్యమవుతోందా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు... వీరయ్య చౌదరి హత్య జరిగినప్పటి నుంచే టీడీపీ నాయకుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో హత్యకు గురైన నాయకుడు, హత్యకు ప్లాన్ చేసిన వారు టీడీపీ నాయకులే కావడంతో పార్టీ నాయకులు, శ్రేణుల గుండెల్లో రాయి పడ్డట్టయిందని చెబుతున్నారు. అంతేకాకుండా వీరయ్య హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ యువ నాయకుడితో జిల్లా ఎమ్మెల్యేలకు, ముఖ్యులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనుమానితుడితో కలిసి మాట్లాడిన వారిని, భోజనాలు చేసిన వారిని, ఫొటోలు తీయించుకున్న వారిని పోలీసులు విచారణకు పిలుస్తుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోందని చెప్పుకుంటున్నారు. కేసు ఫైనల్ అయ్యే వరకు ఈ నాయకులు నిద్ర పోయే పరిస్థితి కూడా లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద వీరయ్య చౌదరి కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని టీడీపీ శ్రేణులు బెంగపడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరయ్య చౌదరి హత్య కేసులో విచారణ పూర్తయినట్లేనా పోలీసుల అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు నిందితులంతా అధికార టీడీపీ వారే కావడంతో సర్వత్రా ఆసక్తి పోలీసుల అదుపులోనే ప్రధాన అనుమానితులు పాత్రధారుల కోసం కొనసాగుతున్న గాలింపు జిల్లా టీడీపీ నేతల్లో కలవరం -
మంత్రి గారికి ముహూర్తం కుదర్లేదట..!
మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్‌లో సుమారు నెలరోజుల క్రితం ఐసీయూ వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, అందులో 12 వెంటిలేటర్లను బిగించారు. వాటికి అనుసంధానంగా బీపీ మిషన్, పల్స్ మిషన్, ఆక్సోమీటర్లను అమర్చారు. అయితే సంబంధిత శాఖా మంత్రికి ముహూర్తం కుదరకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు అంబులెన్స్‌లో ఒంగోలుకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. మార్కాపురం జీజీహెచ్‌లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి సుమారు 72 మంది వైద్యులను, ప్రొఫెసర్లను నియమించారు. అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పశ్చిమ ప్రకాశంతోపాటు కనిగిరికి చెందిన వారు కూడా ఇక్కడికి వచ్చి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెడికల్ కాలేజీపై చిన్నచూపు చూడటంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. జీజీహెచ్‌లో పనిచేస్తున్న సుమారు 45 మంది వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. 500 పడకలతో ఏర్పాటుచేసిన జీజీహెచ్ వైద్యులు లేక, ఓపీ తగ్గి వెలవెలపోతోంది. మరోవైపు గత ప్రభుత్వంలోనే ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు మంజూరు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో వాటిని నిలిపివేశారు. పశ్చిమ ప్రకాశంలో నల్లమల అటవీ ప్రాంతం, ఘాట్ రోడ్డు ఎక్కువగా ఉండటంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అనంతపురం, విజయవాడ నేషనల్ హైవే, మార్కాపురం–ఒంగోలు స్టేట్ హైవే, దోర్నాల–శ్రీశైలం, దోర్నాల–ఆత్మకూరు, గిద్దలూరు–నంద్యాల, యర్రగొండపాలెం–మాచర్ల ఘాట్ రోడ్డు ఉంది. ఈ ప్రాంతంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి తీవ్ర రక్తస్రావమై క్షతగాత్రులు ప్రాణాపాయ స్థితిలో జీజీహెచ్‌కు వస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వారి ప్రాణాలను నిలబెట్టేందుకు ఐసీయూ వార్డుల్లో వెంటిలేటర్లు తప్పనిసరి. వీటితోపాటు పలువురు ఆత్మహత్యలకు పాల్పడటం, పురుగు మందు తాగడం తదితర కారణాలతో ప్రాణాపాయ పరిస్థితుల్లో జీజీహెచ్‌కు వస్తారు. వీరికి కూడా ప్రాణాలు నిలబెట్టేందుకు వెంటిలేటర్‌పై ఉంచాలి. అయితే ఐసీయూ వార్డులో వెంటిలేటర్లు ఏర్పాటు చేసి నెల రోజులు దాటినా ప్రజాప్రతినిధులకు డేట్ కుదరక ప్రారంభించకపోవడంతో జీజీహెచ్‌కు ప్రాణాపాయ స్థితిలో వచ్చినవారు ఒంగోలుకు వెళ్లాల్సిన పరిస్థితి. త్వరగా ఐసీయూ వార్డును ప్రారంభించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అన్నీ సిద్ధంగా ఉన్నా ముహూర్తం లేక ప్రారంభం కాని ఐసీయూ వార్డ్ జీజీహెచ్‌లో 12 వెంటిలేటర్ల ఏర్పాటు ప్రస్తుతం అత్యవసరమైతే ఒంగోలుకు తరలింపుత్వరలో ప్రారంభిస్తాం మార్కాపురం జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఐసీయూ వార్డ్, 12 వెంటిలేటర్లను త్వరలో ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తెస్తాం. జీజీహెచ్‌లో ప్రస్తుతం ఉన్న వైద్యులతోనే మంచి వైద్యసేవలు అందిస్తున్నాం. మందుల కొరత లేదు. – డాక్టర్ రామచంద్రరావు, సూపరింటెండెంట్, జీజీహెచ్, మార్కాపురం -
సీనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి కల్పించాలి
ఒంగోలు సిటీ: జిల్లాలో అర్హులైన జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించాల్సిందిగా డీఈవో కిరణ్‌కుమార్‌కు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.శివలీల శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా (పాత జిల్లా పరిధి)లో ఆరు నెలలుగా సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉందన్నారు. జూనియర్ అసిస్టెంట్‌కు సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో అసోసియేట్ ప్రెసిడెంట్ పీ.వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ చైతన్య, కోశాధికారి ఎస్.పేరయ్య ఉన్నారు. కిశోర బాలల రక్షణ ప్రధానం ● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: కిశోర బాలల రక్షణ చర్యలు ప్రధాన అజెండాగా పెట్టుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ కమిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కిశోర వికాసం పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు, బాలురు 11 నుంచి 18 సంవత్సరాల వయస్సున్న వారిని అభివృద్ధి చేయటమే కిశోర వికాసం లక్ష్యమన్నారు. వారి రక్షణ, సాధికారతను పెంపొందించడం, బాల్య వివాహాలను అడ్డుకోవటం, ఆరోగ్యం, విద్య, పోషణ నైపుణ్యాలు, భద్రత, ఉపాధికి అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి బి.హేన సుజన, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్, వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 4వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల సమ్మె ఒంగోలు టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలుఅందిస్తున్న విలేజి క్లినిక్‌ల్లో పనిచేస్తున్న సీహెచ్‌ఓల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరింది. జిల్లాలోని 538 మంది సీహెచ్‌ఓలు ఈ సమ్మెలో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యం.రాజేష్ తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా శాంతియుత నిరసనలు కొనసాగిస్తామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా తమకు ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, కార్యదర్శి ప్రసన్న, కో ఆర్డినేటర్ దీప్తి, కామేష్, నవీన్, రామాంజనేయులు పాల్గొన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగులు
మద్యం విక్రయాల విషయంలో నిబంధనలను ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా జిల్లా అంతటా మద్యం దుకాణాల్లో మందుబాబుల కోసం సిట్టింగులు ఏర్పాటు చేశారు. సౌకర్యాన్ని బట్టి మద్యం దుకాణానికి వెనక వైపు కుర్చీలు వేసి కూర్చోబెట్టి తాగిస్తున్నారు. చివరికి బెల్టుషాపుల్లో కూడా సిట్టింగు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. అయినా ఎకై ్సజ్ శాఖ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. మార్కాపురం ఎకై ్సజ్ ఏఈఎస్ మీద విపరీతంగా ఆరోపణలు వినవస్తున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాల మీద చర్యలు తీసుకోకుండా ముడుపులు తీసుకొని వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఆదాయం కోసం పేదల జీవితాలు బుగ్గి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మద్యం ధరలు పెంచి, దుకాణాల సంఖ్యను తగ్గించి, బెల్టుషాపులను నిరోధించాం. నిర్ధిష్టమైన సమయం పెట్టి మద్యం విక్రయాలను నియంత్రించాం. ఎన్నికల సమయంలో మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మద్యం రేట్లు మరింత పెంచారు. కూటమి ప్రభుత్వంలో ఊరూరా గొందులు, సందుల్లో కూడా బెల్టుషాపులు పెట్టి మరీ 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు పేదల జీవితాలను చంద్రబాబు బుగ్గి చేస్తున్నాడు. – బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
తీర్థం పేరుతో మత్తు మందు ఇచ్చి చోరీ
ఒంగోలు టౌన్: గృహదోషం ఉందని పూజలు చేయాలని తీర్థం పేరుతో మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఒంగోలులో సంచలనం సృష్టించింది. పోలీసులు కథనం ప్రకారం..నగరంలోని చైతన్య నగర్లో భూమిరెడ్డి గురుస్వామి రెడ్డి, ప్రసన్న దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో బ్రహ్మం గారి మాల పేరుతో కాషాయ దుస్తులు వేసుకున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైకు మీద వచ్చారు. భోజనానికి చందా అడగడంతో ప్రసన్న ఇంట్లోకి వెళ్లి రూ.100 తీసుకువచ్చారు. ఆ తరువాత వచ్చిన ఇద్దరు వ్యక్తులు గురుస్వామి రెడ్డిని పిలిచి నీ ఇంటికి గృహదోషం ఉందని, పూజలు చేయాలని చెప్పారు. అందుకు రూ.30 వేలు ఖర్చు అవుతుందని చెప్పగా..నమ్మిన ఆ దంపతులు రూ.20 వేలకు బేరమాడారు. పూజలో కూర్చున్న కషాయ వేషధారులు గురుస్వామిరెడ్డి దంపతులకు తీర్థం పేరుతో మత్తు మందు ఇచ్చారు. అది తాగిన ఆ దంపతులు మత్తులోకి వెళ్లిపోగా 5 గ్రాముల బంగారు ఉంగరం, రూ.5 వేలతో పరారయ్యారు. కొద్దిసేపటి తరువాత తేరుకొని చూడగా స్వాములు కనిపించలేదు. చోరీ జరిగిన విషయాన్ని తాలుకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కాషాయం దుస్తుల్లో ఉన్న నిందితులను గుర్తించినట్లు సమాచారం. గుర్రం యజ్నేష్ అంత్యక్రియలు పూర్తి ఒంగోలు టౌన్: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒంగోలుకు చెందిన మెడికో గుర్రం యజ్నేష్ (21) అంత్యక్రియలు గురువారం మధ్యహ్నం పూర్తయ్యాయి. యజ్నేష్ కుటుంబం నగరంలోని భాగ్యనగర్ రెండో లైను వాటర్ ట్యాంకర్ దగ్గర నివాసముంటారు. తండ్రి గురువీర్ డెయిరీ నిర్వహిస్తుంటారు. ఆయనకు ఇద్దరు సంతానం కాగా యజ్నేష్ పెద్ద కుమారుడు. పది, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. చదువుల్లో ఎంతో చురుగ్గా ఉండే యజ్నేష్ కుటుంబసభ్యులతో ఎంతో కలివిడిగా ఉండేవాడు. నెల్లూరులోని ఒక మెడికల్ కాలేజీలో చదువుతున్న యజ్నేష్ మెడిసిన్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కూడా మంచి మార్కులతో పాసయ్యాడని కుటుంబ సభ్యులు చెప్పారు. డాక్టర్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబం యజ్నేష్ అకాల మరణంతో విషాదంలో కూరుకుపోయింది. తల్లి మల్లీశ్వరిని ఓదార్చడం ఎవరితరం కావట్లేదు. -
ఘనంగా వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు
ఒంగోలు సిటీ: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చుండూరు రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా చుండూరు రవిబాబు మాట్లాడుతూ వైవీ సుబ్బారెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక బొమ్మరిల్లు అనాథ అశ్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పిల్లలతో కేక్ కట్ చేయించి పంచిపెట్టారు. అనంతరం చిన్నారులకు అన్నదానం చేశారు. ● వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ విభాగం అధ్యక్షుడు శేషారెడ్డి, లీగల్ సెల్ సిటీ ప్రెసిడెంట్ సంపత్‌కుమార్, కత్తి కోటేష్బాబు, పీవీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకోవడమే కూటమి నేతల పని
యర్రగొండపాలెం: రాష్ట్రాన్ని దోచుకోవడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. స్థానిక వినుకొండ రోడ్డులో ఉన్న వైష్ణవి గార్డెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్సీపీ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, వర్గ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటమి నాయకులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయటానికి, దగా చేయటానికి, అమ్మివేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కనీసం దేవాలయాల నిర్వహణ కూడా సక్రమంగా చేయడానికి చేతగాక భక్తులను బలితీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సింహాచలంలో వరాహ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం వెళ్లిన ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని తెలిసినా కాసుల కోసం ఆశపడి హడావుడిగా ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారని, చిన్నపాటి వర్షం, గాలికే ఆ గోడ కూలి భక్తులు బలయ్యారని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వ కాలంలో విజయవాడలో రిటైనింగ్‌వాల్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడారని, భారీ వర్షం కురిసినా ఆ గోడ చెక్కు చెదరకుండా ఆ ప్రాంత ప్రజలను రక్షించిందన్నారు. తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం ఆ సంఘటన మరువకముందే సింహాచలం సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, భక్తుల ప్రాణాలు తీసింది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో పాటు అడవుల్లో నివశిస్తున్న మూగజీవాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, తిరుపతిలో గోవులు మృత్యువాత పడినా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకుండా పోయిందన్నారు. అడవుల్లో జింకలను వేటాడినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుందని, అదే వాస్తవమైతే అటవీ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ బాధ్యత వహించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే తాటిపర్తి పుట్టినరోజును పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన అన్నా
మార్కాపురం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. ఈయన వెంట ఏపీ మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్తో పాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇంటి గోడపై పిడుగు ● 10 గృహాల్లో కాలిపోయిన విద్యుత్ పరికరాలు మార్కాపురం: పట్టణంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కురిసిన వర్షం ప్రభావం చూపింది. 5 గంటల సమయంలో జవహర్‌నగర్ కాలనీలో రిటైర్డు టీచర్ బి.వెంకటేశ్వరరెడ్డి ఇంటిబయట గోడలపై పిడుగు పడింది. ఆ తీవ్రతకు ఆయన ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలైన ఫ్రిజ్, టీవీ, ఏసీలతో పాటు సమీపంలో ఉండే మరో తొమ్మిది గృహాల్లో కూడా విద్యుత్ గృహోపకరణాలు కాలిపోయాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగు తీవ్రతకు గోడ సగభాగం దెబ్బతింది. అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి గిద్దలూరు రూరల్: అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణం సమీపంలోని హైవేరోడ్డులో చాణిక్యస్కూల్ వద్ద గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..రాచర్ల మండలం సత్యవ్యోలు గ్రామానికి చెందిన కత్తి కిషోర్(33) బైక్‌పై గిద్దలూరుకు వస్తున్న సమయంలో అంబులెన్స్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం తొలుత పట్టణంలోని ఏరియావైద్యశాలకు తరలించారు. వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సీఐ కె.సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మూడేళ్ల చిన్నారి అపహరణ సింగరాయకొండ: బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తానని చెప్పి మూడేళ్ల చిన్నారిని అపహరించారు. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..పాతసింగరాయకొండ పంచాయతీ బాలిరెడ్డినగర్‌కు చెందిన చిలకూరి రాజేశ్వరి బుధవారం మధ్యాహ్నం తన మనమరాలు చిలకూరి ఐశ్వర్యను తీసుకుని స్థానిక రైల్వేస్టేషన్ వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు కుర్రాళ్లు పాపను ఆడిస్తూ బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తానని చెప్పి తీసుకుని వెళ్లి తీసుకురాలేదు. ఆ కుర్రాడి కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి గురువారం ఉదయం పాత తండ్రి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. పాపను తీసుకెళ్లిన వ్యక్తి లింగసముద్రం అని నాయనమ్మ రాజేశ్వరి చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నాయనమ్మ రాజేశ్వరి బుధవారం పాపను తీసుకుని వచ్చి బొట్టుబిళ్లలు, డైపర్లు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని, ఎస్సై తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేసి పాపను రక్షించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఎస్సై పేర్కొన్నారు. -
అభివృద్ధిపై అన్నిశాఖలు దృష్టి సారించాలి
ఒంగోలు సబర్బన్: ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేయడంపై అన్ని శాఖల అధికారులు మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జోనల్ ఇన్చార్జి అధికారి ఎంటీ కృష్టబాబు సూచించారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఒంగోలులోని ప్రకాశం భవనంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరు, వాటి పురోగతిపై ఆయన సమీక్షించారు. శాఖల వారీగా సాధించిన పురోగతి గురించి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సామాజిక పెన్షన్లు – వికలాంగ పెన్షన్ల వెరిఫికేషన్, దీపం 2, సోలార్ విద్యుత్, రక్షిత మంచినీటి సరఫరా, వేసవిలో ఎదురయ్యే సవాళ్లు – పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, పీ–4 అమలు, మీ కోసం అర్జీలు, ఆడిట్ రీ సర్వే–పైలెట్, ఫేజ్–2 పురోగతి, హౌసింగ్, ఉపాధి హామీ పథకాలపై ప్రధానంగా కృష్ణబాబు చర్చించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు సరఫరా చేయడంతో పాటు నీటి నాణ్యత కూడా ముఖ్యమని చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆర్థికంగా స్థిరపడిన వారి వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకుంటే మార్గదర్శకులుగా గుర్తించి బంగారు కుటుంటాలకు అండగా ఉండేలా చూడవచ్చని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పల్లె పండుగ పనుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి విడుదలయ్యేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాను మెరుగైన స్థానంలో నిలపాల్సిన బాధ్యత అన్ని శాఖలపై ఉందన్నారు. ఆ దిశగా బలం, బలహీనతలను గుర్తెరిగి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రకాశం జిల్లా ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్వో బి.చినఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టరు సహదిత్ వెంకట త్రివినాగ్, సీపీఓ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి సంక్షేమ పథకాలన్నీ ప్రజల చెంతకు చేరాలి జిల్లా అధికారులతో సమీక్షలో రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు -
కార్మికుల పక్షపాతి.. వైఎస్ జగన్
● మే డే వేడుకల్లో వైఎస్సార్ సీపీ నాయకులు ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో కార్మికులకు ఎంతో మేలు చేశారని ఆ పార్టీ నాయకులు గుర్తు చేశారు. మే డే సందర్భంగా గురువారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గురవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మిక పక్షపాతి అని కొనియాడారు. తన హయాంలో అన్ని వర్గాల ఆర్థిక ప్రగతి కోసం నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులు శతాబ్దాలుగా పనిచేస్తున్నా వాళ్లు కార్మికవర్గ ఆలోచనా విధానానికే కట్టుబడి పనిచేశారన్నారు. అదే క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా దాదాపు 2 లక్షల 75 వేల కోట్ల రూపాయలను ఈ రాష్ట్రంలోని పేదలకు అందించి తాను పేదల వైపు ఉన్నానని స్పష్టం చేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదల కోసం ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయలేదని విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారన్నారు. కార్మిక దృక్పథంతో పనిచేస్తున్న వైఎస్సార్ సీపీవైపే ప్రజలు నిలబడి ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, కె.వి.ప్రసాద్, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు రొండా అంజిరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వర్లు, పాలడుగు రాజీవ్, పులుసు సురేష్‌బాబు, దేవ, శ్రీకాంత్, సన్నీ, పీటర్, రవీంద్రనాథ్‌రెడ్డి, మహేష్, కె.కోటియాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు పేరం ప్రసన్న, ఫాతిమా, మేరీకుమారి, వి.వాణి, బడుగు ఇందిర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అధినేత నమ్మకాన్ని వమ్ముచేయను
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని, పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులైన బత్తుల బ్రహ్మానందరెడ్డిని గురువారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు నూరు శాతం పాటుపడతానన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం బత్తుల నిరంతరం సేవలందిస్తున్నారని పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. అనంతరం జూపూడి ప్రభాకరరావు, చుండూరు రవిబాబు, మాదాసి వెంకయ్య, కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, తదితరులు బత్తుల బ్రహ్మానందరెడ్డిని శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. -
ఊపిరితీసి..!
పల్లె వైద్యం..గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న విలేజ్ క్లినిక్‌లను దెబ్బతీసే కుట్రలు, కుయుక్తులకు కూటమి ప్రభుత్వం తెరతీసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకం ప్రకారం దొడ్డిదారుల్లో చర్యలు చేపట్టింది. వైద్యపరంగా పేదలకు అండగా నిలుస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లకు ఇంక్రిమెంట్లు నిలిపివేసింది. అత్యవసర సమయాల్లో ఆదుకునే పీఎఫ్‌ను సైతం ఆపేసింది. చివరకు విలేజ్ క్లినిక్‌లకు ఇస్తున్న అద్దె కూడా చెల్లించడం లేదంటే.. పాలకుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోంది. ఎన్నికల ముందు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని గంగలో కలిపేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సీహెచ్‌ఓలు ఆందోళన పేరుతో రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా క్లినిక్‌లు మూతపడ్డాయి.● అధికారంలోకి వచ్చీరాగానే విలేజ్ క్లినిక్‌లపై కూటమి కుట్రలు ● భవనాలకు అద్దెలు చెల్లించకుండా వేధింపులు ● సీహెచ్ఓలకు ఇంక్రిమెంట్లు, పీఎఫ్ నిలిపివేత ● ఎస్యూరెన్స్ స్టాండర్స్ నిధులకు కోత ● సీహెచ్‌ఓలపై పడుతున్న ఆర్థిక భారం ● గత్యంతరం లేక సమ్మెకు దిగిన సీహెచ్‌ఓలు ● జిల్లాలో మూతపడిన 538 విలేజ్ క్లినిక్‌లు ● వారం రోజులుగా నిలిచిపోయిన వైద్య సేవలు ఆగిన వైద్య సేవలు, గ్రామీణ నీటి పరీక్షలు... సీహెచ్‌ఓల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత నెల 19వ తేదీ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత 24, 25 తేదీల్లో విజయవాడలో నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో 29వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో జిల్లాలోని విలేజ్ క్లినిక్‌లన్నీ మూతపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్య సేవలు నిలిచిపోయాయి. కేవలం వైద్య సేవలే కాకుండా ప్రతి బుధవారం అన్ని గ్రామాల్లో మంచినీటి నాణ్యతను సీహెచ్‌ఓలు పరిశీలిస్తుంటారు. రెండు వారాలుగా నీటి నాణ్యత పరీక్షలు కూడా ఆగిపోవడంతో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. అయినా సరే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దారుణమని గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 8వ తేదీ మార్కాపురం వచ్చిన సీఎం చంద్రబాబుకు విలేజ్ క్లినిక్లలోని సమసల్యను సీహెచ్‌ఓలు వివరించినా ఫలితం కనిపించలేదు. ఒంగోలు టౌన్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో పీహెచ్సీ, యూపీహెచ్‌సీలు, ఏరియా వైద్యశాలలు, జిల్లా వైద్యశాలల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చింది. వైద్య సిబ్బంది కొరత లేకుండా, మందులకు ఇబ్బంది లేకుండా చేసింది. అందులో భాగంగా 2019లో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది. జిల్లాలో 538 క్లినిక్‌లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించింది. ఈ క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు అందించడమే కాకుండా 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 104 రకాల మందులు అందించింది. మంచం మీద ఉన్న రోగులకు ఇంటి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించడంతో పాటు మందులు కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా విలేజ్ క్లినిక్‌ల వైద్య సేవలు కొనసాగాయి. కూటమి ప్రభుత్వం రావడంతో కష్టాలు మొదలయ్యాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకు గత పది నెలల్లో కూటమి ప్రభుత్వం చేయని కుట్రలు లేవని గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సెంటివ్‌లు ఇవ్వకుండా వేధింపులు... ఆయుష్మాన్ భారత్‌లో భాగంగాా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ కింద సీహెచ్‌ఓలను నియమించారు. నెలకు రూ.25 వేల జీతంతో పాటు రూ.15 వేల ఇంక్రిమెంట్, ఇన్సెంటివ్‌లు ఇచ్చే ఒప్పందం మీద నియామకాలు జరిగాయి. గత ఐదేళ్లలో అలాగే ఇచ్చారు కూడా. కానీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సెంటివ్‌లను నిలిపివేసింది. అద్దె చెల్లింపులు నిలిపివేత... జిల్లాలో 538 విలేజ్ క్లినిక్‌లు ఉండగా, వాటిలో 202 క్లినిక్‌లకు సొంత భవనాలు లేవు. దీంతో అద్దె భవనాలలో వాటిని నిర్వహిస్తున్నారు. వీటికి ప్రతినెలా అద్దె చెల్లించకుండా కూటమి పాలకులు నిఽలిపివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలంగా అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానులు ఒత్తిడి చేస్తున్నారని సీహెచ్‌ఓలు వాపోతున్నారు. చేసేదేమీ లేక కొందరు తమకు వచ్చే జీతాల నుంచే క్లినిక్‌ల అద్దెలు చెల్లిస్తుండటం గమనార్హం. అసలే జీతం నుంచి ఇన్సెంటివ్‌లను కోత కోసిన బాధలో ఉన్న సీహెచ్‌ఓల నెత్తి మీద అద్దెల భారం కూడా పడింది. ఇంతటితో ఆగకుండా ఎన్‌క్వాష్ ఖర్చు కూడా సీహెచ్‌ఓల మీద వేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏడాదికోసారి నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్స్ ద్వారా విలేజ్ క్లినిక్‌ల పనితీరును పరిశీలించడం జరుగుతుంది. దీనికి రూ.50 వేలు ఖర్చవుతుంది. కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏడాదికి కేవలం రూ.10 వేలిచ్చి చేతులు దులిపేసుకుంటుండడంతో మిగతా 40 వేల ఖర్చు కూడా సీహెచ్‌ఓలే సొంతంగా భరించాల్సి రావడం ఉద్యోగులకు తలకుమించిన భారంగా మారింది. చివరికి క్లినిక్‌ను శుభ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులను కూడా ఇవ్వకపోవడంతో సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మరికొందరైతే తామే స్వయంగా క్లినిక్‌ను శుభ్రం చేసుకుంటున్నారని, డిగ్రీలు చదివి, పీహెచ్‌డీలు చేసి చివరికి విలేజ్ క్లినిక్‌లను శుభ్రం చేసుకోవాల్సిన దయనీయ పరిస్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు. పదోన్నతులపై మౌనం... సీహెచ్ఓలకు పదోన్నతులిచ్చే అంశంపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సీహెచ్ఓలకు పదోన్నతులివ్వాల్సి ఉంది. ఈ మేరకు 2023 ఆగస్టు 29వ తేదీ 731 జీవో జారీ అయింది కూడా. సీహెచ్‌ఓలను రెగ్యులర్ చేయడానికి అవసరమైతే అసిస్టెంట్స్ సపోర్టు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీహెచ్‌ఓలు మండిపడుతున్నారు. ఇక, ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైన పీఎఫ్ సౌకర్యాన్ని కూడా నిలిపివేయడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. మహిళా సీహెచ్ఓలకు రక్షణ కల్పించాలి జిల్లాలో మొత్తం 538 మంది సీహెచ్‌ఓలు వుండగా వారిలో 438 మంది మహిళలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించే విషయంలో వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం అన్యాయం చేయడం బాధాకరం. ఇన్సెంటివ్‌లు ఇవ్వకుండా జీతంలో కోతలు పెట్టడం, విలేజ్ క్లినిక్‌లకు అద్దెలు కూడా చెల్లించపోవడం సరికాదు. – కల్వకుర్తి దీప్తి, సీహెచ్ఓ న్యాయమైన డిమాండ్ల కోసమే సమ్మె గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న సీహెచ్‌ఓల ప్రోత్సాహకాలు నిలిపివేయడం బాధాకరం. విలేజ్ క్లినిక్‌లను మరింత బలోపేతం చేయాల్సిన పరిస్థితిలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విచారకరం. పదినెలలుగా ఇన్సెంటివ్‌లు ఆపివేయడం, పదోన్నతుల్లో నిర్లక్ష్యం, ఇంక్రిమెంట్ సమస్య, పీఎఫ్ సౌకర్యం తీసేయడంతో అనివార్యంగా సమ్మెకు దిగాము. – మందగిరి రాజేష్, ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
హైవేపై అదుపుతప్పిన కారు
సీఎస్‌పురం(పామూరు): తల్లిని చూసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి కారు అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం పామూరు మండలంలోని కంభంపాడు, కోవిలంపాడు గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై కథనం మేరకు వివరాలు.. మండలంలోని అరివేముల గ్రామానికి చెందిన బాణాల కృష్ణ గత కొంతకాలంగా బెంగళూరులో కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఏప్రిల్ 28వ తేదీన కృష్ణ తన అత్తగారి ఊరైన కనిగిరి మండలంలోని బల్లిపల్లె వచ్చాడు. రెండు రోజులు అక్కడ గడిపి సీఎస్‌పురం మండలంలోని అరివేములలో ఉంటున్న తన తల్లిని చూసేందుకు కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో పామూరు మండలంలోని కంభంపాడు–కోవిలంపాడు మధ్య హైవేపై కారు అదుపుతప్పి రోడ్ మార్జిన్లో బోల్తా కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే మృతిచెందగా కారు నుజ్జునుజ్జయింది. మృతునికి భార్య నాగమణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై ఆర్.సుమన్ పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిమిషాల్లోనే ఇంటికి.. అంతలోనే విషాదం మరికొద్ది నిమిషాల్లో ఇంటికి వెళ్లి తన తల్లిని చూస్తాననుకున్న కృష్ణను ఊహించని రీతిలో మృత్యువు బలితీసుకుంది. కృష్ణ మృతితో స్వగ్రామంతోపాటు అత్తగారి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుమారుడి కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లి.. తన కుమారుడు ఇక ఎప్పటికీ తిరిగిరాడని తెలిసి గుండెలవిసేలా రోదిస్తోంది. ప్రమాదంలో ఒకరు దుర్మరణం తల్లిని చూసేందుకు వెళ్తుండగా ఘటన -
ఆవు పాల ధర పెంచాలి
కొత్తపట్నం: పాల ధరలు పడిపోవడంతో డెయిరీ నిర్వహణ భారంగా మారిందని వాటి యజమానులు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపట్నం మండలం రంగాయపాలెంలో కృష్ణం వెంకట్రావు 32 ఆవులతో నడుపుతున్న డెయిరీ ఫామ్‌ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. పెట్టుబడి, మిగులు ఆదాయం, కష్టనష్టాలు తెలుసుకున్నారు. డెయిరీ యమాజని కృష్ణం వెంకట్రావు మాట్లాడుతూ.. రూ.25 లక్షల పెట్టుబడి పెట్టానని, పాలపై వస్తున్న ఆదాయం ఈఎంఐలు, కూలి, దాణా ఖర్చులకు సరిపోవడం లేదని కలెక్టర్‌కు వివరించారు. గత ఏడాది లీటర్ ఆవు పాలు రూ.40 కాగా ఈ ఏడాది రూ.35కు పడిపోయిందని తెలిపారు. లీటరు పాలపై రూ.6 వరకు ధర పడిపోవడంతో డెయిరీ మూత వేసే యోచనలో ఉన్నట్లు మరో నిర్వాహకుడు షేక్ సిరాజ్ కలెక్టర్ ఎదుట ఆవేదన వెలిబుచ్చారు. లీటరు పాలకు రూ.40 దక్కేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ బంక్ బాయ్‌పై గంజాయి మత్తులో దాడి టంగుటూరు: గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులు పెట్రోల్ బంక్‌లో పనిచేసే యువకుడిపై దాడికి తెగబడ్డారు. బుధవారం రాత్రి టంగుటూరులో చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు సుధాకర్ ఒంగోలు జీజీహెచ్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అందిన సమాచారం మేరకు వివరాలు.. టంగుటూరులోని నయారా పెట్రోల్ బంకుకు గంజాయి మత్తులో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. పెట్రోల్ తాలూకు నగదు విషయంలో బంక్ పంప్ బాయ్ సుధాకర్‌తో గొడవకు దిగారు. బంక్‌లో ఉన్న పరికరాలతో మోదడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని, రిమ్స్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడని బంక్ సిబ్బంది తెలిపారు. సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది లీటరు రూ.40.. ఇప్పుడేమే రూ.34 ఇలాగైతే డెయిరీ ఫామ్‌లు మానుకుంటాం కలెక్టర్ ఎదుట డెయిరీ ఫామ్ యజమానుల ఆవేదన -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఇద్దరిని పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీ జనరల్ సెక్రటరీగా దర్శికి చెందిన కుమ్మిత అంజిరెడ్డి, సెక్రటరీగా గిద్దలూరుకు చెందిన వేమిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఒంగోలు: ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే నెలలో బాలురకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జి.ధనుంజయరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మంగమూరు రోడ్డులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లలోపు వయసు, 180 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలురు అర్హులని స్పష్టం చేశారు. మే 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9490382802ను సంప్రదించాలని సూచించారు. 3న బాస్కెట్‌బాల్ సబ్ జూనియర్ జట్ల ఎంపిక ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లా బాస్కెట్ బాల్ సబ్ జూనియర్ బాలబాలికల క్రీడా జట్ల ఎంపిక ఈనెల 3న కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి తొట్టెంపూడి సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2012 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఎంపికై న వారు ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు చిత్తూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంపికకు హాజరయ్యే బాలబాలికలు తమ వెంట పుట్టిన తేదీ ధ్రువపత్రం తీసుకురావాలని, వివరాలకు 9866126955ను సంప్రదించాలని సూచించారు. నీటి కుంటలో పడి వృద్ధురాలి మృతి హనుమంతునిపాడు: గేదెలకు నీరు తాపే క్రమంలో ప్రమాదవశాత్తు కుంటలో పడి ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. ఈ సంఘటన బుధవారం మండల కేంద్రమైన హనుమంతునిపాడు–మోరవారిపల్లి గ్రామాల మధ్య ఎర్రవాగులో చోటుచేసుకుంది. స్థానికల కథనం మేరకు.. మోరవారిపల్లి గ్రామానికి చెందిన కొండా సీతయ్య భార్య కొండా పుల్లమ్మ(77) తమ గేదెలను మేత కోసం ఎర్రవాగు వైపు తోలుకెళ్లింది. మధ్యాహ్నం సమయంలో గేదెలకు నీరు తాపేందుకు వాగులోని నీటి కుంట వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటి కుంటలో పడటంతో ఊపిరాడక మృతి చెందింది. రోడ్డు పనుల కోసం మట్టి తోలుతున్న జేసీజీ, టిప్పర్ డ్రైవర్లు నీటి కుంటలో తేలియాడుతున్న చీరను గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చి పరిశీలించి పుల్లమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. వృద్ధుడు ఆత్మహత్య జరుగుమల్లి(సింగరాయకొండ): అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం నందనవనంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గొడుగు మస్తాన్ సాహెబ్(85) గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని కలుపు నివారణకు వినియోగించే పురుగుమందు తాగారు. కుటుంబ సభ్యులు గుర్తించి 108 అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. ఏఎస్సై దంపతులకు ఎస్పీ సన్మానం ఒంగోలు టౌన్: పట్టుదల, కృషితో అంచెలంచెలుగా ఎదిగి బేస్తవారపేట ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన పి.నారాయణరెడ్డి సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ మరచిపోదని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో నారాయణ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. 35 ఏళ్ల పాటు పోలీసు శాఖలో సమర్థవంతంగా పనిచేస్తూ, క్రమశిక్షణతో విధులు నిర్వహించారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని, మంచిపేరే చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. శేష జీవితం కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్సై తిరుపతిస్వామి, ఏఎస్సై కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల నివారణే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకై క మార్గమని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగంతో కలిగే దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం చేయడంతోపాటు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు లేదని చెప్పారు. జిల్లా మీదుగా రవాణా అవుతున్న గంజాయిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం డ్రగ్స్ నియంత్రణపై రూపొందించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, డీఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మా నాయక్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పొట్ట కూటికి వెళ్లి అనంత లోకాలకు..
కొండపి: తిరుపతి నగరంలోని తిరుమలనగర్ తుడా క్వార్టర్స్‌లో ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన కొండపి మండలంలోని అనకర్లపూడిలో విషాదం నింపింది. మృత్యువాతపడిన ముగ్గురు కార్మికుల్లో ఇద్దరు అనకర్లపూడి వాసులు కావడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తన్నీరు వసంత్(40), కుంచాల శ్రీనివాస్(42) తమ కుటుంబాలతో కలిసి భవన నిర్మాణ పనుల నిమిత్తం తిరుపతికి వలస వెళ్లారు. తిరుపతి జిల్లా మంగళం పరిధిలోని తిరుమలనగర్‌లో తుడా క్వార్టర్స్‌లో హెచ్ఐజీ ఫ్లాట్ నంబర్ 63లో నిర్మిస్తున్న భవనంలో పనిచేస్తున్నారు. ఐదో అంతస్తులో నలుగురు మేసీ్త్రలు పూత పని చేస్తున్న క్రమంలో సారవ నుంచి ఓ కర్ర జారిపోవడంతో ఒక్కసారిగా కిందకు పడిపోయారు. ఈ ఘటనలో తన్నీరు వసంత్, కుంచాల శ్రీనివాసులు అక్కడికక్కడే మతి చెందారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. తన్నీరు వసంత్‌కు భార్య నారాయణమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుంచాల శ్రీనివాస్‌కు భార్య నారాయణమ్మ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాలు బుధవారం రాత్రి అనకర్లపూడి చేరుతాయని బంధువులు తెలిపారు. తిరుపతి తుడా లేఔట్ ప్రమాదంలో ముగ్గురు మృతి వారిలో ఇద్దరు వ్యక్తులు అనకర్లపూడి వాసులు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు -
ఘనంగా వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు
ఒంగోలు సిటీ: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదినం గురువారం కాగా ముందస్తుగా బుధవారం ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గా ఇన్చార్జులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల ఇన్చార్జులు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు, బీసీ నాయకుడు బొట్ల రామారావు, కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్ తదితరులు సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలో పాల్గొన్నారు. -
గింజకున్నా కొనట్లేదు!
సాక్షిప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా 32,425 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. అందుకుగాను 76,397 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అందులో కేవలం 10 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలన్నది లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ నిర్ణయించింది. జిల్లాలోని 27 మండలాల్లో 239 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 8,900 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. దిగుబడి వచ్చిన దానిలో సగానికి పైగా ధాన్యాన్ని రైతులు గిట్టుబాటు ధర రాకుండానే దళారులకు తెగనమ్ముకున్నారు. ఫలితంగా ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పండించిన ధాన్యానికి మద్దతు ధర పెంచి 25 నుంచి 30 శాతం అయినా కొనుగోలు చేస్తే రైతుకు కనీసం ఖర్చులైనా వస్తాయని చెబుతున్నారు. అప్పుడు రైతు కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉండేది. ప్రతికూల వాతావరణం...తీవ్ర నష్టం.. మరో పక్క వాతావరణం ప్రతి కూలించటంతో పాటు గాలీ, వాన బీభత్సం, వడగళ్ల వర్షం అన్నదాతను ఉక్కిరి బిక్కిరి చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన వర్షాలకు వరి పంట తీవ్రంగా దెబ్బతింది. పంట నష్టం సంభవించిన దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయే కానీ రైతుకు ఒరిగింది మాత్రం శూన్యం. పంట చేతికొచ్చిన దశలో ఇలాంటి ఇబ్బందులు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం ప్రభుత్వం ఇన్సూరెన్స్ అవకాశం కూడా కల్పించలేదు. దీనికితోడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మాలంటే రైతులు అనేక వ్యయ ప్రయాసలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డబ్బులు పెట్టుబడి పెట్టుకుని మిల్లుకు ధాన్యం రవాణా చేయాల్సి రావడం రైతుకు ఇబ్బందిగా మారింది. ఈ వరిస్థితుల్లో పలువురు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు దళారులు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ–క్రాప్ విధానంలో నమోదు చేసుకోని పంటను తక్కువ ధరకు అడుగుతున్నారు. రైతుకు దక్కని ధాన్యం మద్దతు ధర దిగుబడిలో 10 శాతం కూడా కొనుగోలు చేయని వైనం దళారీల చేతుల్లో దోపిడీకి గురవుతున్న అన్నదాత అందినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిలో రైతు ప్రభుత్వం నుంచి అందని సాయం ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అలా.. కూటమిలో ఇలా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అప్పటి రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా విక్రయించుకోవాలని కోరుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు రైతుల చుట్టూ తిరిగేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. తమ ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనాలని, గోనె సంచులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తూ వచ్చింది. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా మోసం.. 10 ఎకరాల్లో వరిపంట సాగు చేశాను. ప్రభుత్వం మద్దతు ధర రూ.2320 చొప్పున కొనుగోలు చేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాను. తీరా పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. దీంతో పంటను దళారులకు అత్యంత చవకగా అమ్ముకోవాల్సి వచ్చింది. వరి రైతులను ఈ ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. – కన్నెదారి వెంకటేశ్వర్లు, దాసరివారిపాలెం, నాగులుప్పలపాడు మండలం -
కీలక దశకు చేరిన విచారణ
ఒంగోలు టౌన్: దారుణ హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసు కీలక దశకు చేరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ హత్యకు సంబంధించి రోజుకో రకంగా కథనాలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. పోలీసు బృందాలు పొరుగు రాష్ట్రాలతో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కీలక నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నాయి. గత నెల 22వ తేదీ రాత్రి 7.30 గంటలకు వీరయ్య చౌదరి హత్య జరిగింది. దాదాపు పదిరోజులు అవుతోంది. ఇంకా కీలక నిందితుల ఆచూకీ లభించకపోవడం గమనార్హం. అయితే వారి బంధువుల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారని తెలుస్తోంది.12 మంది విచారణఇప్పటి వరకూ ఈ కేసులో దాదాపు వంద మందికి పైగా అనుమానితులను, నిందితుల బంధువులు, స్నేహితులు, హత్యకు గురైన వీరయ్యచౌదరి సన్నిహితులను, ఆయన స్వగ్రామానికి చెందిన పలువుర్ని పోలీసులు విచారించారు. అయితే నగర డీఎస్పీ కార్యాలయంలో బుధవారం రాత్రి 11 వరకు కూడా ఎస్పీ ఏఆర్ దామోదర్ దాదాపు 12 మందిని విచారించినట్టు సమాచారం. హత్యలో పాల్గొన్న కీలక నిందితుల బంధువులను, మిత్రులతో పాటు పలువురు అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారించినట్టు తెలిసింది. అమ్మనబ్రోలుకు చెందిన ప్రధాన అనుమానితుడి తల్లిదండ్రులతో పాటుగా అతడి సోదరుడిని విచారించినట్లు సమాచారం. అలాగే నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామానికి చెందిన ఒక నాయకుడిని, చినగంజాంకు చెందిన ఒక ఎంపీటీసీని కూడా విచారించినట్లు తెలుస్తోంది. నగరంలోని ఒక పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న కార్షాపీకి రోజూ ప్రధాన అనుమానితుడు వస్తుంటాడని, అక్కడి వారితో కలిసి హత్యకు ముందు భోజనం చేశాడని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్షాపీ మిత్ర బృందంలోని ఐదుగురిని విచారించినట్లు సమాచారం. ఒంగోలు మండలంలోని వెంకటరాజుపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఒక గృహప్రవేశం సందర్భంగా ప్రధాన అనుమానితుడితో కలిసి ఫొటో దిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో అతడిని కూడా విచారణకు పిలిపించారని తెలిసింది. వారితో పాటుగా హత్యతో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్న కొప్పోలు వ్యక్తి అక్కా బావలను విచారించినట్లు సమాచారం.రోజుకో చోట భోజనం...వీరయ్య హత్య కేసులో నిందితులు నగరంలోని గుంటూరు రోడ్డులో ఉన్న ఒక లాడ్జీలో ఉండి పది రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరగడం తెలిసిందే. అయితే నిందితులకు ప్రతి రోజు భోజనం తీసుకెళ్లి ఇచ్చినట్లు కొప్పోలు నిందితుడి బావమరిది అంగీకరించినట్లు ప్రచారంలో ఉంది. అయితే నిందితులు నేరుగా లాడ్జికి భోజనం తీసుకొని రాకుండా రోజుకో చోటకు తీసుకొని రమ్మని చెప్పేవారని సదరు వ్యక్తి పోలీసులకు వివరించినట్టు సమాచారం. అలాగే నిందితుల గురించి తనకు ఎలాంటి సమాచారం తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. వీరయ్య చౌదరి హత్యకేసులో నెల్లూరులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం ఒకే రోజు డీఎస్పీ కార్యాలయంలో 12 మందిని విచారించిన ఎస్పీ కీలక నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపునెల్లూరులో ఇద్దరిని అదుపులోకి..వీరయ్య హత్యలో నలుగురు పాల్గొన్నారని పోలీసులు మొదట నుంచి చెబుతున్నారు. అయితే స్కూటీ క్లూ తరువాత పాత్రధారులంతా ఒంగోలు, పరిసర ప్రాంతాలకు చెందిన వారేనని ప్రచారం జరిగింది. ఇప్పుడు నెల్లూరుకు చెందిన యువకులకు సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు చెప్పుకుంటున్నారు. బుధవారం నెల్లూరులో ఇద్దరు పాత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారు అసలు నిందితులు కాదని, హత్య జరిగిన తరువాత జరిగిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలీసు అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించకపోవడం గమనార్హం. -
కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం
మద్దిపాడు: కూటమి ప్రభుత్వం కళ్లు మూసుకుపోయి రైతులను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలోని పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్ల తీరును బుధవారం పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయనతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయించి మార్కెట్‌ను నిలబెట్టారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వాపోయారు. ఈ సంవత్సరం పొగాకు సరిగా పండలేదని, పంట ఖర్చులు విపరీతంగా పెరిగి పోయాయని తెలిపారు. కూలీ, బ్యారన్ల అద్దెలు పెంచేశారని, దీని వలన రైతులకు ఖర్చు పెరిగిందన్నారు. కోల్డ్ స్టోరేజిల్లో ఉంచిన పొగాకు రంగు మారిపోతుందని, వేలం కేంద్రాల్లో పొగాకును కంపెనీల బయ్యర్లు కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో పాటు అన్ని కంపెనీల వారు ఫ్లోర్లో కొనుగోలుకు రావడం లేదని తెలిపారు. వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన పొగాకు బేళ్లను నోబిడ్ చేయడం వలన రైతు ప్రత్యక్షంగా నష్టపోతున్నారని వివరించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పొగాకు, వరి, మిర్చి, శనగ పంటలు వేసిన రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలిచిందన్నారు. గత సంవత్సరం కేజీ పొగాకు రూ.360 ఉంటే ఈ ఏడాది కేవలం రూ.250కు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఒక ఎకరా పంటకు సుమారు రూ.2.50 నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చులు అవుతాయని, కౌలుకు తీసుకున్న రైతుకై తే మరో రూ.50 వేలు అదనంగా అవుతాయన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిందని, నాణ్యత కూడా లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల పక్షాన నిలిచి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి వారికి గిట్టుబాటు ధర కల్పించారన్నారు. అన్నిరకాల పంటలకు మద్దతు ధర ఇవ్వడానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్ ఫసల్ బీమా పథకం ద్వారా బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిందని, పంట నష్టపోయిన రైతులకు వారి ఖాతాల్లో పంట నష్టపరిహారం అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రీమియం కట్టకుండా వదిలేసిందని, రైతులే ప్రీమియం కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల సమస్యలపై వైఎస్ జగన్‌తో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే వచ్చే 15 రోజుల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. 2014–19 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో పలువురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పుడు కూడా ప్రతి పక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పొగాకు రైతుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రులు వచ్చి పరామర్శించి వారికి నష్ట పరిహారం ఇప్పించేందుకు కృషిచేశామని ఆయన గుర్తు చేశారు. పొగాకు, మిర్చి, వరి పంటలు వేసిన రైతుల దుస్థితి వర్ణనాతీతం పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోంది రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుంది రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ధర గిట్టుబాటు కావడంలేదంటూ మొరపెట్టుకున్న పొగాకు రైతులుసింహాచలంలో భక్తుల మృతిపై సంతాపం సింహాచలంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడంపై వైవీ సుబ్బారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతిలో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారని, ఇప్పుడు సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందారన్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే కార్యక్రమాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, గిద్దలూరు పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రసిడెంట్ కొమ్మూరి కనకారావు, వైఎస్ఆర్సీసీ రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి పేరాల చెన్నకేశవులు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్ఆర్సీపీ సంతనూతలపాడు అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాగులుప్పలపాడు అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మన్నం శ్రీధర్, గంటా ఆంజనేయరెడ్డి, డాకా పిచ్చిరెడ్డి, మద్దిపాడు మండల ఉపాధ్యక్షులు వాకా కోటిరెడ్డి, మండవ బాల చంద్రమౌళి, నాగులుప్పలపాడు మండల సీనియర్ నాయకుడు నలమలపు కృష్ణారెడ్డి, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, సంతనూతలపాడు జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, రైతు సంఘం నాయకులు పల్లకి సత్యన్నారాయణరెడ్డి, మహానందరెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బెజవాడ రాము, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నారా సుబ్బారెడ్డి, పోలినేని కోటేశ్వరరావు, పీ సంధ్య, రజనీకుమారి, సన్నపురెడ్డి రమణమ్మ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సీహెచ్‌ఓలను రెగ్యులర్ చేయాలి
ఒంగోలు టౌన్: ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లకు పైగా పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అనుబంధ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సీహెచ్‌ఓలు మోకాళ్లపై నిరసన తెలిపారు. అనంతరం కాలం సుబ్బారావు మాట్లాడుతూ.. బీఎస్సీ నర్సింగ్ నుంచి పీహెచ్డీ వరకు ఉన్నత చదువులనభ్యసించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకపోవడం విచారకరమన్నారు. సీహెచ్‌ఓల చేత నిర్ధిష్టమైన పనులు చేయించకుండా అడ్డగోలు పనులన్నీ చేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీహెచ్‌ఓల పీఎఫ్ సౌకర్యాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గత సంవత్సరం కాలంగా ఇంక్రిమెంట్లు, అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం సమ్మె చేస్తున్నామని ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యం.రాజేష్ చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు ఏ.నిర్మల, జీవన జ్యోతి, ప్రసన్న, సయ్యద్ గౌస్ పాల్గొన్నారు. జిల్లాలోని 538 మంది సీహెచ్‌ఓలు ఈ సమ్మెలో పాల్గొన్నారు. మోకాళ్లపై నిరసన తెలిపిన సీహెచ్‌ఓలు రెండో రోజుకు చేరిన సీహెచ్‌ఓల నిరవధిక సమ్మె -
ఎయిడెడ్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి
ఒంగోలు సిటీ: జిల్లాలో జీరో ఎన్రోల్ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే 49 మంది ఉపాధ్యాయులకు శాశ్వతంగా కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి కోరారు. డీఈఓ కార్యాలయంలో బుధవారం ఏడీ వరప్రసాద్‌ను కలిసి ఎయిడెడ్ టీచర్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్టూరు మండలం, రాజుపాలెం ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రభుత్వంలో విలీనమైందని, అక్కడ పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పై సమస్యలను సత్వరమే పరిష్కరించి ఎయిడెడ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని జిల్లా బాధ్యులు కోరారు. పాలిసెట్‌కు 5,387 మంది హాజరు ఒంగోలు సిటీ: పాలిసెట్ పరీక్షను బుధవారం 11 కేంద్రాల్లో నిర్వహించారు. ఒంగోలులో 7 కేంద్రాలు, మార్కాపురంలో 4 కేంద్రాల్లో పరీక్ష జరిగిందన్నారు. మొత్తం 4600 మంది విద్యార్థులకు గాను 3950 మంది పరీక్షకు హాజరయ్యారని, 85.86 శాతం హాజరు నమోదైందని ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శివప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాలురు 2932 మందికి గాను 2557 మంది పరీక్షకు హాజరుకాగా, 375 మంది గైర్హాజరయ్యారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 1668 మంది బాలికలకు గాను 1393 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా, 275 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మెప్మా మిషన్ మేనేజర్ కల్పన సస్పెన్షన్ ఒంగోలు సబర్బన్: జిల్లా మెప్మా కార్యాలయంలో మిషన్ మేనేజర్ గుట్లపల్లి కల్పనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఆ శాఖ మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భారతి ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. మదర్ థెరిస్సా వికలాంగుల సేవా సమితి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిషన్ మేనేజర్‌పై విచారణ చేపట్టారు. ఆమె అక్రమాలకు పాల్పడినట్లు మెప్మా పీడీ, ప్రత్యేక కమిటీలు ఇచ్చిన నివేదికల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని, ఆ స్థానానికి ఇన్చార్జ్ని నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు ● వాటిలో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు ● వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ఒంగోలు సబర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల (ఎంఎన్జీయూ) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్యాధికారులతో బుధవారం సమావేశమయ్యారు. జిల్లాలోని గిద్దలూరు, వై.పాలెం, కొండపి, మార్కాపురం, రిమ్స్ ఆస్పత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మెడికల్ అధికారులతో సమీక్షించి తగు సూచనలు ఇచ్చారు. జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించడం, పుట్టిన బిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు ప్రధాన ఉద్దేశమన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస నాయక్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ నిర్మల్ కుమార్, కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ రీసర్చ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి శ్రావ్య, గిద్దలూరు, వై.పాలెం, కొండపి, మార్కాపురం ఆస్పత్రుల వైద్యులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం నింపాలి
ఒంగోలు సిటీ: డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆంధ్రకేసరి యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాజమోహన్ రావు అన్నారు. స్థానిక ఆంధ్రకేసరి యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహించిన డ్రగ్స్ నియంత్రణ అవగాహనా ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి యూనివర్శిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్ రావు మాట్లాడుతూ సమాజాన్ని అంటురోగం మాదిరిగా పట్టి పీడిస్తున్న మద్యం మహమ్మారి, డ్రగ్స్ వినియోగం, గంజాయి, సిగిరెట్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను యువతీ యువకులైన విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదే సమయంలో వాటిని వినియోగించడం వల్ల కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ఇందులో భాగంగా డ్రగ్స్ వినియోగాన్ని సమాజానికి దూరం చేసేందుకు నాంది పలకాలన్నారు. విద్యార్థులు తొలుత తమ స్వగ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని నినాదాలు చేశారు. యూనివర్శిటీ నుంచి నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏకేయూ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లోరైడ్ సమస్యకు చరమగీతం ● 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ఒంగోలు సబర్బన్: ఫ్లోరైడ్ సమస్యకు చరమగీతం పాడితేనే వికసిత భారత్‌లో ప్రకాశం జిల్లా భాగస్వామ్యం కాగలదని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మెన్ లంకా దినకర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తొలుత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా తాగునీరు, ఫ్లోరైడ్ సమస్య, యర్రగొండపాలెం ఏస్పిరేషన్ బ్లాక్‌లో కేంద్ర పథకాల అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్షించామన్నారు. జిల్లాలో ఒక వైపు తాగు, సాగు నీరు ఇబ్బందులుంటే, పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఫ్లోరిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 729 పంచాయతీల్లోని 1,769 గ్రామాల్లో 1009 గ్రామాలు ఫ్లోరైడ్ సమస్యతో ఉన్నాయని, ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత తాగు నీటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. కనిగిరి పరిధిలో ఎక్కువగా 339, దర్శి పరిధిలో 120, మార్కాపురం పరిధిలో 113 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో 52 గ్రామాల్లో , కొండపిలో, ఎస్‌ఎన్‌పాడులో 25, ఒంగోలు మండలంలోని ఒక గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉందన్నారు. డయాలసిస్ సెంటర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు ద్వారా జిల్లాలో కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి సీఎస్ఆర్ నిధులను రాబట్టాల్సిన అవసరం ఉందన్నారు. 16 వ ఆర్ధిక సంఘం ప్రతినిధులకు ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాలకు అదనపు గ్రాంట్ ఇవ్వాలని కోరామన్నారు. కనిగిరి నియోజకవర్గం, కొండపిలోని మర్రిపూడి మండలంలో పూర్తి స్థాయిలో సురక్షిత తాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కనిగిరిలో ఒక డయాలసిస్ సెంటర్లో నెలకు 120 మందికి సేవలు అందిస్తున్నారని, ఇంకా ఎన్ని అవసరమో ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఓ వెంకటేశ్వర్లుతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు 1305 యూనిట్లు మంజూరు● ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్ మార్కాపురం: ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో జిల్లాకు 1305 యూనిట్లు మంజూరైనట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న 38 మండలాలు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి వీటిని మంజూరు చేశామన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లబ్ధిదారులు యూనిట్లు పొందిన తరువాత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈయన వెంట ఎంపీడీఓ శ్రీనివాసులు ఉన్నారు. -
పరిశీలకులుగా బత్తుల, జంకె, కదిరి
వైఎస్సార్ సీపీ ఒంగోలు, నెల్లూరు, విశాఖ పార్లమెంట్ల ఒంగోలు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం పార్లమెంట్లకు పార్టీ పరిశీలకులను నియమించారు. ఆమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకునిగా బత్తుల బ్రహ్మానంద రెడ్డిని నియమించారు. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లకు అనుసంధానంగా ఆయన పనిచేస్తారు. అదేవిధంగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకునిగా నియమించారు. జంకె వెంకట రెడ్డి గతంలో ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షునిగా పనిచేశారు. రెండుసార్లు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏపీఐఐసీ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్ సీపీ విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకుడిగా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావును నియమించారు. -
బాధ్యతగా పనిచేస్తేనే రైల్వేకు ఆదాయం
దొనకొండ: రైల్వే శాఖలో ప్రతి ఉద్యోగి బాధ్యతగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. స్థానిక రైల్వే ఫంక్షన్ హాల్లో మంగళవారం రైల్వే శాఖ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరు, ఇతర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు రైల్వే స్టేషన్లను రెండు నెలలకోసారి తనిఖీ చేస్తున్నామన్నారు. దొనకొండ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను రైల్వే ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించినపుడే రైల్వే శాఖకు ఆధాయం సమకూరుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులను సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సైమన్, సీఎస్ఈ భూపనిసింగ్, సీఈడీఈ తోరియా, సీఈటీఎస్ మోనికా వర్మ తదితర ఉన్నతాధికారులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. -
‘కంది’పోయిన సంక్షేమం
ఒక్కో సంక్షేమ పథకాన్నీ ఎత్తేస్తున్న కూటమి ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే కందిపప్పునకూ మంగళం పాడింది. గత నాలుగు నెలలుగా రేషన్‌షాపుల్లో కందిపప్పు ఇవ్వకుండా కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడంతో కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మే నెల కోటాలోనూ కందిపప్పు రాకపోవడంతో ఈనెల కూడా వాటి సరఫరా లేనట్లే. మరోవైపు ఈకేవైసీ కాలేదన్న నెపంతో రేషన్ లబ్ధిదారులకు పెద్ద ఎత్తున కోత పెడుతోంది. రాజధాని పేరుతో నిధులన్నీ అమరావతిలో కుమ్మరిస్తూ ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ప్రజలు మండిపడుతున్నారు.బేస్తవారిపేట: కూటమి సర్కారు పాలనలో రేషన్ లబ్ధిదారులకు సరఫరా చేసే కందిపప్పునకు ఎసరు పెట్టింది. కేవలం బియ్యం, పంచదార సరఫరాకే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేసింది. వరుసగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కందిపప్పు ఇవ్వకపోవడంతో కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో రేషన్ డిపోల ద్వారా అన్ని రకాల పప్పులు రాయితీ ధరలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో రేషన్ సరుకులు ఇవ్వలేకపోతున్నారు. బియ్యం తప్ప రెండో సరుకు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కొద్ది నెలలుగా కందిపప్పులో కోత విధిస్తూ అరకొరగా రావడంతో మొదట వచ్చిన వారికే అందేది. ప్రస్తుతం కందిపప్పు సరఫరాకు పూర్తిగా మంగళం పాడేశారు. ఈనెల కూడా గోదాములకు కందిపప్పు రాలేదు. పంచదార, బియ్యం రేషన్ దుకాణాలకు గోడౌన్ల నుంచి సరఫరా చేశారు. కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో కేజీ రూ.130–రూ.150 ఉంది. దీంతో రేషన్ దుకాణాల్లో కందిపప్పునకు డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం రేషన్‌కార్డుపై కిలో రూ.67 కు అందిస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలోనే నిధులన్నీ ఖర్చుపెడితే పేదల కడుపు నిండుతుందా అని ప్రశ్నిస్తున్నారు. బడాబాబుల లబ్ధికోసం పేదలకు కేటాయించాల్సిన డబ్బులన్నీ రాజధాని నిర్మాణం పేరుతో జేబుల్లో వేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో మొత్తం ప్రభుత్వ రేషన్ దుకాణాలు 1,392, రేషన్‌కార్డులు 6,76,160 ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఆయిల్, కందిపప్పు ధరలు ఆకాశాన్నంటడంతో కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వం రాయితీపై రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా చేయాలని కార్డుదారులు కోరుతున్నారు. ఈకేవైసీ గండం... జిల్లాలోని 38 మండలాల్లో 19,37,977 మందికి ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటికి 17,93,769 మంది చేయించుకున్నారు. ఇందులో 0–5 ఏళ్లలోపు పిల్లలు 18,861, 80 ఏళ్ల పైబడినవారు 1830 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రోగ్రెస్‌లో 85,355 మంది ఉన్నారు. 1,23,517 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సినవారు ఉన్నారు. వీరందరికీ మే నెలలో రేషన్ అందే పరిస్థితి లేదు. రేషన్ లబ్ధిదారులకు నాలుగు నెలలుగా నిలిచిన కందిపప్పు సరఫరా మే నెలకు కూడా విడుదలకాని కందిపప్పు కోటా కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న కార్డుదారులు లబ్ధిదారులకు బియ్యం, పంచదార మాత్రమే సరఫరా జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య 6,76,160 ఈ కేవైసీ చేయించుకోని 1,23,517 మందికి మే నెల రేషన్ లేనట్లే !మే నెల కందిపప్పు రాలేదు రేషన్‌కార్డుదారులకు మే నెలకు సరఫరా చేసేందుకు కందిపప్పు సరఫరా కాలేదు. ఈ నెల బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తాం. – సూరా రామనారాయణరెడ్డి, రేషన్ డీటీ -
‘నీట్’గా.. ప్రశాంతంగా.. పరీక్షలు నిర్వహించాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలో మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మే నెల 4న జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,473 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయం, జవహర్ నవోదయ, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజీ, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజీ, డీఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూల్లను కేంద్రాలుగా ఎన్టీఏ ఎంపిక చేసిందన్నారు. కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రశ్నాపత్రాల ఓపెనింగ్, అభ్యర్థుల తనిఖీలు, తదితర విషయాలలో ఎన్టీఏ మార్గదర్శకాలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్విజిలేటర్లకు అవసరమైన శిక్షణ గురువారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పరీక్షల సిటీ కో ఆర్డినేటర్‌కు ఆమె సూచించారు. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణాన్ని కల్పించే బాధ్యత ఆయా సెంటర్ల సూపరింటెండెంట్లపై ఉందన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కె.నాగేశ్వరరావు, డీఆర్ఓ బి. చిన ఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, డీపీఓ వెంకట నాయుడు, డీఈఓ కిరణ్‌కుమార్, సిటీ కో ఆర్డినేటర్, ఎన్టీఏ నోడల్ ఆఫీసర్ మనీష్ కుమార్, సెంటర్ సూపరింటెండెంట్లు, విద్యుత్, మున్సిపల్, వైద్య, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. రీ సర్వే ప్రక్రియ పటిష్టంగా చేయాలి ఒంగోలు సబర్బన్: జిల్లాల్లో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి జిల్లా అధికారులను ఆదేశించారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం రీసర్వే, ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్, వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాల్లో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రీసర్వే సమస్యలు, సిటిజన్ సర్వీసెస్, పీజీఆర్ఎస్ పరిష్కారంపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమైనదన్నారు. ఆయా దరఖాస్తులను, సమస్యలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ను కలిసిన వక్ఫ్‌బోర్డు సీఈఓ ఒంగోలు సబర్బన్: కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను వక్ఫ్ బోర్డు సీఈఓ షేక్ మహమ్మద్ అలీ మంగళవారం ప్రకాశం భవన్లో కలిశారు. ఒంగోలు వచ్చిన ఆయన కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని వక్ఫ్ భూముల స్థితిగతులపై సీఈఓ జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. -
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో చెప్పాలి?
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదో చెప్పాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి. ప్రభాకర్ ప్రశ్నించారు. స్థానిక మల్లయ్య లింగం భవనంలో మంగళవారం ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తక్షణమే రాష్టంలోని నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం తిరుపతి వేదికగా వచ్చే నెల 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన సమాఖ్య జిల్లా నాయకులు మరియదాసు, రాజు, వంశీ, మార్కు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా నేతృత్వంలో రెవెన్యూ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. మార్కాపురంలో జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్‌తో పాటు అధికారుల బృందం సివిల్ సప్లయీస్ గోడౌన్‌ను పరిశీలించారు. ఒంగోలులో ఒంగోలు తహశీల్దార్ నేలభట్ల వాసు ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్ఐ శ్రీకంఠ శ్రీనివాస రావుతో కూడిన అధకారుల బృందం నగరంలోని గోడౌన్లను తనిఖీ చేశారు. నగరంలోని బాణసంచా గోడౌన్లతో పాటు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్న సివిల్ సప్లయీస్ గోడౌన్లో ఉన్న స్టాకును పరిశీలించారు. గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లలో తనిఖీలు చేశారు. -
అడుగు ముందుకు పడని వీరయ్య కేసు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన టీడీపీ నాయకుడు వీరయ్యచౌదరి హత్య కేసులో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడడంలేదు. ఒంగోలులోని ఆయన కార్యాలయంలో వీరయ్య చౌదరి హత్యకు గురై మంగళవారానికి 8 రోజులు కావస్తోంది. చీమకుర్తిలో నిందితులు ఉపయోగించిన స్కూటీ దొరికిన తరువాత ఇంకేముంది..విచారణ పూర్తయినట్లేనని అంతా భావించారు. ఆ రోజంతా హడావుడిగానే సాగింది. అయితే కీలక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మినహా పెద్దగా పురోగతి సాధించలేదు. అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ యువ నాయకుడు ప్రధాన అనుమానితుడిగా నిర్ధారించినట్లు ప్రచారం జరిగింది. ముంగమూరు రోడ్డులో వీరయ్య హత్య కేసులో నిందితులు ఉపయోగించిన రెండో వాహనం మోటారు బైకును స్వాధీనం చేసుకున్న తరువాత కొప్పోలుకు చెందిన ఒక వ్యక్తిని ప్రధాన పాత్రధారుడిగా పోలీసులు విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఒక్కో వాహనం దొరికినప్పుడల్లా ఒకరి పేరు ప్రచారంలోకి వస్తుంది తప్పిస్తే అసలు నిందితులను పోలీసులు నిర్ధారించడంలేదని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ హత్యకేసులో సూత్రధారుడిగా భావిస్తున్న వారు పోలీసుల అదుపులోనే ఉన్నారు. పాత్రధారుడిగా చెబుతున్న వ్యక్తి కోసం వైజాగ్‌లో గాలిస్తున్నారు. అయితే అతను వైజాగ్‌లోనే ఉంటే రోజుల తరబడి గాలిస్తున్న పోలీసుల బృందం కనీసం ఒక చిన్న క్లూ కూడా సాధించలేకపోవడం గమనార్హం.మీడియాతో మాట్లాడిన ముప్ప సురేష్ఇదిలా ఉండగా వీరయ్య చౌదరి హత్య కేసులో మరో సూత్రధారుడిగా ప్రచారంలో ఉన్న బంగారు వ్యాపారి ముప్ప సురేష్ మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడడం సంచలనం సృష్టించింది. వీరయ్య చౌదరి హత్యతో తనకెలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. హత్య జరిగిన తరువాత మీడియాలో తనపేరు రావడంతో షాక్‌కు గురయ్యానని చెప్పారు. రాజకీయంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఆయనతో ఎదురుపడిన సందర్భాలు కూడా లేవని చెప్పడమే కాకుండా తాను ఎక్కడకూ పోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లు పోలీసులు ఆయన కోసం హైదరాబాద్‌లో గాలిస్తున్నట్లు చెప్పారు. కానీ ఆయన మాత్రం తానెక్కడకూ పోలేదని చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో మున్ముందు విచారణలో తెలియాల్సి ఉంది. నిన్నటి వరకు అనేక మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు మరో నలుగురిని తీసుకొచ్చి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.కొనసాగుతున్న రోజువారి విచారణ మరో నలుగురిని తీసుకొచ్చి విచారిస్తున్నట్లు ప్రచారం తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ టీవీ చానల్లో ముప్ప సురేష్ -
పొగబెట్టారు!
ధరలు కోసి..పొగాకు రైతులను ఆదుకోవాలి పొగాకు పంట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతోపాటు వ్యాపారులు, కంపెనీలు, పొగాకు బోర్డు అధికారుల ప్రోత్సాహంతో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. వాతావరణం సానుకూలంగా లేకపోవడం, కలుపు, మల్లె ఎక్కువగా వేయడంతో దిగుబడి బాగా తక్కువగా వచ్చింది. అయినా వ్యాపారులు రకరకాల సాకులు చెబుతూ తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించకపోవడం దారుణం. ప్రభుత్వం పట్టించుకోకపోతే చాలా కుటుంబాలు నష్టాల బారిన పడి కోలుకోని దుస్థితి దాపురిస్తుంది. తక్షణమే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయించాలి. – చుండూరి రవిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త టంగుటూరు పొగాకు వేలం కేంద్రంపెట్టుబడులు వస్తాయంతే.. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన దామచర్ల చిన్నరాజ మూడు బ్యార్నీలకు పొగాకు సాగు చేశాడు. ఇప్పటికి రెండు రౌండ్లు వేలం పూర్తవుతున్నా ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు. పొగాకు సాగు ఖర్చు ఎక్కువైంది. ఖర్చులకు తగ్గట్లు ధరలు లేవు. బోర్డు అధికారులు, పొగాకు కంపెనీల ప్రతినిధులు సిండికేట్ అయి ధరల పెరుగుదల విషయంలో చొరవ చూపడం లేదు. ఒకటి కౌలు బ్యార్నీ, రెండు సొంత బ్యార్నీలు, సొంత పొలం కావడంతో పెట్టిన పెట్టుబడి వరకు వస్తుంది. కౌలు రైతులకు మాత్రం లక్షల్లో నష్టాలు తప్పవు. ఇప్పటికై నా మేలిమి పొగాకుకే కాదు లోగ్రేడు పొగాకును కూడా సరైన ధరలకు కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలని చిన్నరాజ కోరుతున్నాడు. వేలంలో అన్ని పొగాకు కంపెనీలు పాల్గొనాలని, ధరలపై బోర్డు అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. పొగాకు రైతుల పరిస్థితి గందరగోళంగా ఉంది. వేలం కేంద్రాల్లో సరైన ధర లభించక దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంట చేతికొచ్చిన సమయంలో వ్యాపారులు ధర తగ్గించేసి కొనుగోళ్లు చేస్తుండడంతో రైతులు అల్లాడిపోతున్నారు. కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. అండగా నిలవాల్సిన బోర్డు అధికారులు, ప్రభుత్వం వీరిని గాలికి వదిలేయడంతో వ్యాపారులు సిండికేటై రైతును నట్టేట ముంచేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సంక్షోభంలోకి కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం రీజియన్ పరిధిలో ఆరేళ్ల కిందట 20 నుంచి 25 వేల ఎకరాల్లో మాత్రమే పొగాకు సాగు చేసేవారు. నాలుగేళ్లుగా పొగాకు పంటకు మంచి గిట్టుబాటు ధరలు రావడంతో పంట విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. పొగాకు బోర్డు ఈ ఏడాది 68,500 హెక్టార్లలో సాగుకు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని కంపెనీలు, దళారులు రైతులను ఎక్కువ పంట సాగుచేసేలా ప్రోత్సహించారు. ఆకాశమే హద్దు అంటూ ఊరించారు. పొగాకు బోర్డు అధికారులు కూడా 20 శాతం వరకు అధికంగా పంట వేసుకోవచ్చని చెప్పడంతో రైతులు గుడ్డిగా నమ్మారు. గత ఏడాది ఒక రైతుకు 35 క్వింటాళ్లు అనుమతి ఇవ్వగా ఈ ఏడాది 45 క్వింటాళ్లు అనుమతి ఇచ్చారు. దాంతో నాలుగు డబ్బులు వస్తాయన్న ఆశతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటసాగు చేశారు. ఈ ఏడాది సుమారు 88 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 105.27 మిలియన్ కిలోలకు పైగా పంట ఉత్పత్తి అంచనా వేయగా 162 మిలియన్ కిలోలుగా ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. సాగులోకి దిగిన బడుగు రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సన్నకారు, చిన్నకారు రైతులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, కౌలు రైతులు పొగాకు సాగులోకి దిగారు. పొగాకు పంటకు గిరాకీ ఉండడంతో అధిక కౌలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయటి వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని సాగు చేశారు. అయితే అధిక వర్షాలు మొదట్లోనే దెబ్బ తీశాయి. ఒకటికి రెండు సార్లు నాట్లు వేయాల్సి వచ్చింది. వర్జీనియా పొగాకు దిగుబడి 20 నుంచి 30 శాతం వరకు తగ్గింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల గోతికాడి నక్కల్లాంటి తీరు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నాణ్యత పేరుతో మోసానికి దిగిన వ్యాపారులు... ఎన్నో ఆశలు పెట్టుకొని పొగాకు సాగు చేసిన రైతుకు బోర్డు అధికారులు, వ్యాపారులు, దళారులు కలిసి టోపీ పెట్టే కుట్రలకు తెరలేపారు. అధికంగా సాగు చేశారని, నాణ్యత బాగా లేదని సాకులు చెబుతూ తక్కువ ధరలకు పొగాకు కొనుగోలు చేస్తున్నారు. మార్చి 10న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో దశల వారీగా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది బ్రైట్ ధర రూ.360 పలకగా ఈ ఏడాది రూ.280 కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. బ్రైట్ మీద ఏకంగా రూ.80 పైగా నొక్కేస్తున్నారు. అదికూడా మొత్తం పొగాకును ఒకే ధరకు కొనుగోలు చేయడం లేదు. వేలం కేంద్రాలకు వచ్చిన వాటిలో కేవలం 10 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ధరలకు అమ్ముకుంటే రైతులకు వచ్చేదేమీ లేదు. తీవ్రమైన నష్టాలకు గురికావల్సి వస్తుంది. నిర్లక్ష్యంగా కూటమి పాలకులు... పొగాకు వేలం ప్రారంభమై 50 రోజులు దాటింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. పంట విస్తీర్ణం, దిగుబడి, ప్రస్తుతం కొనుగోలు ధరలను సమీక్షించిన దాఖలాలు లేవు. పైగా మమ్మల్ని అడిగి సాగు చేశారా అంటూ అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్ చెప్పడంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పొగాకు బోర్డు అధికారులు అధిక సాగుకు ప్రోత్సహించడం వల్లే ఈ ఏడాది రైతులు అధికంగా సాగు చేశారన్న సంగతి తెలియకుండా జేడీ మాట్లాడడం వివాదాస్పదమైంది. గత ఏడాదికంటే తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నా ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఒకసారి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాటి ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా నిలబడింది. 2019–20లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మార్కెట్లో పోటీ పెరిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులు నష్టపోకుండా సరైన ధరలకు అమ్ముకుని లాభాలు మూటగట్టుకున్నారు. టీడీపీ పాలనలో ప్రతిసారి నష్టాలు మూటగట్టుకుంటున్న రైతులు వేలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా పుంజుకోని ధరలు రైతుల ఆందోళనను పట్టించుకోని కూటమి పాలకులు సిండికేట్లతో మోసపోతున్న పొగాకు రైతులు నాణ్యత పేరుతో మెజార్టీ బేళ్లను తిరస్కరిస్తున్న వ్యాపారులు ధరలు రాక ఉసూరుమంటూ వెనక్కి తీసుకుపోతున్న రైతులు ఆత్మహత్యలే శరణ్యమని వేదన వైఎస్సార్ సీపీ పాలనలో నాలుగేళ్లు లాభాల పంటవెనక్కిపోతున్న బేళ్లు... కూటమి పాలకుల రైతు వ్యతిరేక విధానాలతో చరిత్రలో మొదటిసారిగా వేలం కేంద్రానికి వచ్చిన బేళ్లు వందల సంఖ్యలో వెనక్కి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే బేళ్లు వెనక్కి వెళ్లేవి. కానీ ప్రస్తుతం ఒక్కో వేలం కేంద్రంలోనే వందల సంఖ్యలో బేళ్లు వెనక్కి వెళుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభమైన తరువాత ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడి పంట అక్కడే ఉంది. వ్యాపారులు, దళారుల సిండికేట్ మాయాజాలంతో రైతులు పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు కేవలం 9.2 మిలియన్ కేజీలో పొగాకు మాత్రమే కొనుగోలు చేసినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ఒక్క టంగుటూరు వేలం కేంద్రం నుంచే రోజుకు వందకు పైగా బేళ్లు వెనక్కి పోతున్నాయి. అయినప్పటికీ పాలకులు మొద్దునిద్ర వీడడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, జిల్లాకు చెందిన ఆరుగురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం రేపిందన్న విషయాన్ని గుర్తుచేసుకుని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక రంగంలోకి దిగి రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉదయ్‌కృష్ణారెడ్డికి సీఎం ప్రశంసలు
సింగరాయకొండ: సివిల్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 350వ ర్యాంకు సాధించిన మండలంలోని ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఎం ఉదయ్‌కృష్ణారెడ్డిని మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాలోకేష్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు అతని ప్రయాణం ధైర్యసాహసాలు, త్యాగం, అవిశ్రాంత సంకల్పం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. వెలిగొండ నిర్వాసితులకు న్యాయం చేయండి ● సబ్ కలెక్టర్ త్రివినాగ్‌కు వినతి మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గొట్టిపడియ, అక్కచెరువు, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల, లక్ష్మీపురం, కృష్ణానగర్, సాయిరామ్‌నగర్, లింగాపురం, సాయినగర్, చింతలముడిపి గ్రామాల్లోని నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని నిర్వాసితుల సంఘ కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి, ఒంటెద్దు చిన్న రంగారెడ్డి తదితరులు మంగళవారం సబ్‌కలెక్టర్ త్రివినాగ్‌కు వినతిపత్రం అందించారు. మళ్లీ ఆర్థిక సర్వే నిర్వహించి, అర్హులైన వారిని ఆర్ఆర్ ప్యాకేజీ జాబితాలో చేర్చాలని విన్నవించారు. ప్రాజెక్టు మిగులు పనులను త్వరగా పూర్తిచేసి కృష్ణా నీటిని విడుదల చేయాలని కోరారు. వీరి వెంట పలువురు నిర్వాసితులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి పెద్దారవీడు: ఎదురురెదురుగా వస్తున్న లారీ, ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని సానికవరం– మద్దలకట్ట గ్రామాల మధ్య రామకృష్ణ ధాన్య మందిరం దగ్గర మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపి న వివరాలు కర్నాటక రాష్ట్రం నుంచి ట్రాలీ ఆటో లోడుతో గుంటూరుకు వెళ్తుంది. గుంటూరు నుంచి లారీ లోడుతో కర్నూల్‌కు వెళ్తుంది. రామకృష్ణ ధ్యాన మందిరం దగ్గరకు రాగానే రెండు వాహనా లు ఢీకొట్టుకోవడంతో ట్రాలీ ఆటో డ్రైవర్ కిరణ్ (32) అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు కిరణ్ కర్నాటక రాష్ట్రం హుబ్లి దగ్గర లక్కహుండి గ్రామ వాసిగా గుర్తించారు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన డ్రైవర్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సర్టిఫికెట్.. డూప్లికేట్.!
సంతనూతలపాడు: రెవెన్యూ శాఖలో అవినీతి అక్రమాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్నతాధికారి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అడ్డదిడ్డంగా పనులు చేస్తున్నారు. లంచాలిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఏ పనైనా చేయడం, లంచాలు ఇవ్వకుంటే సక్రమంగా చేయాల్సిన పనులు కూడా నిలిపివేయడం వంటివి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాల్లో అనేక సేవలు నిలిచిపోవడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలే లక్ష్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అడ్డగోలుగా దోచుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఆయా సర్టిఫికెట్లను అడ్డం పెట్టుకుని మరికొన్ని అక్రమాలకు పాల్పడే వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల మద్దిపాడు తహసీల్దార్ సృజన్‌కుమార్, దొడ్డవరం వీఆర్వో కలిసి ఓ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం, తాజాగా సంతనూతలపాడు తహసీల్దార్ వేమూరి ఆదిలక్ష్మి గతేడాది మృతుడి కుటుంబంతో సంబంధం లేని మహిళకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మంజూరు చేయడం, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమనడంతో అనంతరం దాన్ని రద్దు చేయడం వంటివి జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ... సంతనూతలపాడు మండలానికి ఏ సంబంధం లేని కంభం మండలానికి చెందిన మన్నం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చనిపోగా, అతని కుటుంబానికి ఏ సంబంధం లేని సున్నం వెంకటలక్ష్మమ్మ అనే మహిళను కుమార్తెగా చేరుస్తూ సంతనూతలపాడు తహసీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేశారు. అతని భార్య మన్నం వెంకాయమ్మ పేరును కూడా కుటుంబ సభ్యుల జాబితాలో నమోదు చేసి ఆమె చనిపోయినట్లుగా పేర్కొన్నారు. అయితే, మృతులు మన్నం వెంకటేశ్వర్లు, మన్నం వెంకాయమ్మతో సున్నం వెంకటలక్ష్మమ్మకు ఏ సంబంధం లేదు. కానీ, మృతులకు వెంకటలక్ష్మమ్మ కుమార్తె అని ధ్రువీకరిస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. ఈ విషయం ఇటీవల సంతనూతలపాడు మండలంతో పాటు నియోజకవర్గంలోనే చర్చనీయాంశమైంది. మన్నం వెంకటేశ్వర్లుకు ఒంగోలు సమీపంలో విలువైన డీకే పట్టా స్థలం ఉండటంతో దాన్ని కాజేసేందుకు కొందరు వ్యక్తులు అక్రమంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం సున్నం వెంకటలక్ష్మమ్మ అనే మహిళ పేరుమీద దరఖాస్తు చేశారు. వాస్తవానికి మృతుడు మన్నం వెంకటేశ్వర్లు కుటుంబంతో సున్నం వెంకటలక్ష్మమ్మకు ఎలాంటి సంబంధం లేదు. కానీ, సున్నం వెంకటలక్ష్మమ్మ ద్వారా మన్నం వెంకటేశ్వర్లుకు చెందిన స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం గతేడాది సెప్టెంబర్ 2వ తేదీ దరఖాస్తు చేశారు. సంతనూతలపాడు తహసీల్దార్ అదే నెల 19వ తేదీ సర్టిఫికెట్ మంజూరు చేశారు. సరైన ఆధారాలు లేకుండా, విచారణ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడం వెనుక తహసీల్దార్ స్థాయిలో లక్షల రూపాయల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, మృతిచెందిన వ్యక్తికి సంబంధించిన ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నించిన సమయంలో అది తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అని తేలడంతో అసలు విషయం బయటకొచ్చింది. దీంతో ఎక్కడ తమ అవినీతి బయటపడుతుందోనని ఆ సర్టిఫికెట్‌ను తహసీల్దార్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. రిమార్క్స్ ఏమీ పెట్టకుండానే సర్టిఫికెట్‌ను రివోక్ చేయడం చర్చకు దారితీస్తోంది. అయితే, అప్పటికే ఆ సర్టిఫికెట్‌ను అడ్డం పెట్టుకుని అక్రమార్కులు ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయించుకున్నారు, మృతుడికి చెందిన స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా..లేదా..? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. తహసీల్దార్ కార్యాలయ అధికారులు తమ జేబులు నింపుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా జారీ చేస్తున్న సర్టిఫికెట్లను అడ్డం పెట్టుకుని విలువైన ఆస్తులను అక్రమార్కులు కాజేస్తుండటంతో రోజురోజుకూ జిల్లాలో వీరి బాధితులు పెరిగిపోతున్నారు. ఇలాంటివి జరగకుండా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందిపై కలెక్టర్, జేసీలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంతనూతలపాడులో అంగట్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు..! తహసీల్దార్ కార్యాలయం నుంచి అడ్డగోలుగా సర్టిఫికెట్ల మంజూరు మృతుడి కుటుంబానికి ఏ సంబంధం లేని మహిళకు సర్టిఫికెట్ జారీ చేసిన తహసీల్దార్ ఓ రిజిస్ట్రేషన్ కోసం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి మంజూరు చేసినట్లు ఆరోపణలు రిజిస్ట్రేషన్ సమయంలో బట్టబయలైన వ్యవహారం విషయం బహిర్గతం కావడంతో సర్టిఫికెట్‌ను రద్దు చేసిన వైనం మద్దిపాడు తహసీల్దార్ ఏసీబీకి దొరికిన విషయం మరవకముందే వెలుగులోకి మరో అంశం నన్ను తప్పుదోవ పట్టించి సర్టిఫికెట్ తీసుకున్నారు : సున్నం వెంకటలక్ష్మమ్మకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. దరఖాస్తుదారులు ఆధారాలుగా నకిలీ సర్టిఫికెట్లు చూపించి నన్ను తప్పుదోవ పట్టించారు. అందువలనే ఆమెకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మంజూరు చేశాం. అనంతరం అసలు విషయం తెలిసిన వెంటనే కలెక్టర్‌కు వివరణ రాసి సదరు సర్టిఫికెట్‌ను రద్దు చేశాం. వేమూరి ఆదిలక్ష్మి, తహసీల్దార్, సంతనూతలపాడు -
జిల్లా మాల ఉద్యోగుల సంఘ కమిటీ ఎన్నిక
ఒంగోలు వన్‌టౌన్: జిల్లా మాల ఉద్యోగుల సంఘ నూతన కమిటీని ఎన్నుకున్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో ఆదివారం రాత్రి ఎన్నికలు నిర్వహించారు. సంఘ నూతన జిల్లా అధ్యక్షుడిగా గోపతోటి శ్యాంసన్, గౌరవ అధ్యక్షుడిగా పీకా మధుసూదన్‌రావు, ప్రధాన కార్యదర్శిగా మద్దులూరి రమణయ్య, ఉపాధ్యక్షుడిగా చిడితోటి నరేంద్రకుమార్, పీ సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డీ థామస్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాజేంద్ర, కోశాధికారిగా టీ శ్రీకాంత్, సహాయ కోశాధికారిగా కే జాలయ్య, బీ నాగేంద్రవదన్, ఎస్ ఆనందరావు, మహిళా జిల్లా అధ్యక్షురాలుగా కే సుచరిత, ఎస్ యానాది, జే ఆనందరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కే రాజేంద్ర, డీ అంజయ్య, పీ వెంకట నారాయణ, లీగల్ అడ్వైజర్‌గా కే బాబురావును ఎన్నుకున్నారు. ప్రమాణస్వీకారం చేస్తున్న మాల ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గం -
ఇళ్లు లేని చోట సిమెంట్ రోడ్డా..!
ఎంపీ అనుమతిచ్చారు..అధికారులు వేశారు..నివాస గృహాలు ఉన్న చోట వదిలేసి ఇళ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసి ఔరా అనిపిస్తున్నారు కూటమి పాలకులు..మూడు నెలల కిందట కంభం మండలానికి రూ.60 లక్షల ఎంపీ నిధులు మంజూరయ్యాయి. అందులో భాగంగా హజరత్ గూడెం పంచాయతీ పరిధికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. హజరత్ గూడెం పంచాయతీ కంభం, కందులాపురం పంచాయతీల్లో కలసి పోయి ఉంటుంది. హైవే సమీపంలో, వాసవీ స్కూల్, గౌతమి స్కూల్ వెనుక వైపున, బస్టాండుకు హైవేకి మధ్యలో ఉండే గృహాల ద్వారానే హజరత్ గూడెం పంచాయతీకి అధికంగా పన్నులు వసూలయ్యేది. ఆ ప్రాంతాన్ని వదిలేసి ప్రస్తుతం హైవేపై ఉన్న ఫంక్షన్ హాలు పక్క వీధిలో రూ.10 లక్షలు వెచ్చించి 158 మీటర్ల సిమెంటు రోడ్డు వేశారు. అయితే ఆ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇదేంటని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తే..ఎంపీ కార్యాలయం నుంచే ఎక్కడ రోడ్డు వేయాలో పేరుతో సహా మంజూరై వచ్చిందని సమాధానమిస్తున్నారు. దీంతో వారు నివ్వెరపోతున్నారు. చాలా వీధుల్లో ఇళ్లు ఉన్నా సిమెంటు రోడ్లు వేయలేదని.. అసలు ఇళ్లు లేని చోట సిమెంటు రోడ్డు వేయడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిధులు ప్రజలకు ఉపయోగపడకపోతే ఎలా అంటూ వాపోతున్నారు.– కంభం -
డిప్యూటీ స్పీకర్ క్షమాపణలు చెప్పాలి
ఒంగోలు టౌన్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావును ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు చేత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు క్షమాపణ చెప్పిస్తారో లేక స్వయంగా బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలన్నారు. డిప్యూటీ స్పీకర్ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండు సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎంతోమంది రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసి పోయారని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కె మాబు మాట్లాడుతూ.. రఘురామకృష్ణరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరు గ్రామంలో 30 ఏళ్లకు పైగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనపై సీపీఎం కార్యదర్శి సందర్శించినందుకు డిప్యూటీ స్పీకర్ సంయమనం కోల్పోయి మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఒక జాతీయ పార్టీ నేతను పట్టుకొని బతికి పోయావు పో అంటూ బెదిరింపులకు దిగిన డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై కూటమి పాలకులు స్పందించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న నాయకుడు అప్రజాస్వామికంగా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో త్యాగం చేస్తున్న జాతీయ పార్టీ నాయకుల పట్ల డిప్యూటీ స్పీకర్ అనుచితంగా మాట్లాడడం క్షమార్హం కాదన్నారు. రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతికి స్వస్తి పలకాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ..రఘురామకృష్ణరాజు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసనలో పి.కల్పన, కంకణాల రమాదేవి, జీ.ఆదిలక్ష్మి, కాలం సుబ్బారావు, జాలా అంజయ్య, సీహెచ్ వినోద్, టి.మహేష్, తంబి శ్రీనివాసరావు, శ్రీరాం శ్రీనివాసరావు, తోట తిరుపతిరావు, భక్తసింగ్ రాజు, బీవీ రావు, కొత్తకోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వేసవి శిక్షణతో విజ్ఞానం, వికాసం
ఒంగోలు టౌన్: బాల్యం నుంచే పిల్లలకు గ్రంథాయాలకు వెళ్లేలా అలవాటు చేయాలని డీఈఓ అత్తోట కిరణ్ కుమార్ సూచించారు. సోమవారం ఒంగోలులోని జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులను ఆయన ప్రారంభించారు. డీఈఓ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా చిన్నారులు ప్రతి రోజూ గ్రంథాయాలకు వెళ్లి పుస్తకాలు చదివితే విజ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చన్నారు. గ్రామర్, స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పెయింటింగ్, పప్పెట్ మేకింగ్, డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా మానసిక వికాసం కలుగుతుందన్నారు. 40 రోజులపాటు సాగే వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవిలో చిన్నారులను శిక్షణ తరగతులకు పంపించాలని తలిదండ్రులకు సూచించారు. మంచి అలవాట్లే పిల్లల ఉన్నతికి కారణమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షకులతోపాటు గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. చిన్నారులకు గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేయాలి డీఈఓ కిరణ్ కుమార్ -
ఫోర్జరీ సంతకంతో బ్యాంక్ లోన్
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 69 ఫిర్యాదులు అందాయి. బాధితులతో నేరుగా మాట్లాడిన ఎస్పీ ఆయా సమస్యలపై సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, వన్‌టౌన్ సీఐ నాగరాజు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఒక కమర్షియల్ భవనాన్ని జిమ్ పేరుతో అద్దెకు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ సంతకాలతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకు నుంచి రుణం తీసుకుని మోసం చేశారని ఒంగోలుకు చెందిన బాధితుడు ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. రుణాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకు నుంచి నోటీసులు అందడంతో అసలు విషయం బయటపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రుణం తీసుకోవడమేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయారు. ● కుటుంబ అవసరాల కోసం ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి తనకు తెలిసిన ప్రభుత్వ ఉద్యోగిని ష్యూరిటీగా పెట్టి రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. రుణం తిరిగి చెల్లించే సమయంలో ఇటీవల మూసేసిన సిండికేట్ బ్యాంకు చెక్కు ఇచ్చి మోసం చేశాడని నగరానికి చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓట్లు వేయలేదని కొడుతున్నారు అర్థవీడు: టీడీపీకి కాకుండా వైఎస్సార్ సీపీకి ఓటు వేశారంటూ నాలుగు నెలుగా తరచూ గొడవపడుతూ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అర్థవీడు మండలంలోని చింతమెల్లెలపాడు గ్రామానికి చెందిన వేశపోగు రవి సోమవారం ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై గతంలో అర్థవీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈనెల 25న టీడీపీ వర్గీయులు కువ్వారపు నాగేంద్ర, మౌనిక, ఆనంద్, సలోమి, వేశపోగు నాగమ్మ, విజయ్, ముసలికాశయ్య మూకుమ్మడిగా తమ ఇళ్లపైకి వచ్చి వేశపోగు కళావతి, జ్వాలా, పెద్ద కాశయ్యపై గొడ్డలితో దాడి చేయగా ఒక్కొక్కరి తలపై 8 నుంచి 10 కుట్లు పడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్థవీడు పోలీసులు తమ వద్ద స్టేట్మెంట్ తీసుకుని కంభం ప్రభుత్వ వైద్యశాల నుంచి బలవంతంగా డిశ్చార్జి చేయించారని చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని, పలుమార్లు దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఎస్పీ ఎదుట వాపోయారు. ఎస్పీ దామోదర్‌కు బాధితుల ఫిర్యాదు పోలీస్ గ్రీవెన్స్‌కు 69 అర్జీలు -
పదిలో ఫెయిలైన వారికి ప్రత్యేక కార్యాచరణ
ఒంగోలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి మే 18వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తరగతులు నిర్వహించాలని డీఈఓ ఎ.కిరణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులు వంద శాతం హాజరయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించినట్లు తెలిపారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుని ఆదేశాలను తప్పక పాటించాలన్నారు. ఉపవిద్యాశాఖాధికారులు, ప్రత్యేక తరగతుల నిర్వహణపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన సూచనలు తెలిపాలన్నారు. ఉదయం 8 నుంచి 9.15 గంటల వరకు సోషల్/భాషలు, ఉదయం గం.9.15 నుంచి గం.10.15 వరకు సైన్స్ (పీఎస్, బయోలాజికల్ సైన్స్), ఉదయం గం.10.15 నుంచి గం.10.30 గంటల వరకు విరామం, ఉదయం గం.10.30 నుంచి గం.12 వరకు గణితం.. ఈ ప్రకారం ఉత్తీర్ణులు కాని విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రధానోపాధ్యాయులు తరగతుల షెడ్యూల్‌ను మార్పు చేసుకోవాలని తెలిపారు. ఉగ్రవాదుల దాడి..భారత లౌకికవాదంపై దాడే ఒంగోలు టౌన్: కశ్మీర్‌లోని పహెల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడి ఏకంగా దేశ లౌకికకత్వంపై చేసిన దాడేనని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ మాజీ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు విమర్శించారు. స్థానిక మల్లయ్య లింగం భవనంలో సోమవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో వారు మాట్లాడారు. పహెల్గామ్ దాడిని పిరికిపందల దాడిగా అభివర్ణించారు. కేవలం హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ముందే అనేక మంది హతమయ్యారని, వారి కుటుంబ సభ్యుల ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. మూడంచెల భద్రత కలిగిన జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారో సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మే 15 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు యువతరం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎం.యుగంధర్, పరుచూరి రాజేంద్ర, జీ.సంతోష్ కుమార్, కత్తి రవి, నాగ రాముడు, ప్రభాకర్, సుభాని తదితరులు పాల్గొన్నారు. -
జీతాలివ్వండి మహాప్రభో!
మార్కాపురం: నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో జీజీహెచ్‌లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారని, వెంటనే చెల్లించాలని సీఐటీయూ కార్యదర్శి డీకేఎం రఫీ డిమాండ్ చేశారు. జీజీహెచ్‌లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కు మద్దతుగా సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయం, జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కు పెండింగులో ఉన్న 4 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు. కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, అవి కూడా నెల నెలా చెల్లించకుంటే వారెలా బతకాలని ప్రశ్నించారు. వేతనాలు చెల్లించకుండా కార్మికులచేత పనిచేయిస్తున్న విజయవాడకు చెందిన ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్మికుల వేతనాల నుంచి పీఎఫ్ పేరుతో డబ్బులు కట్‌చేస్తూ వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం లేదని అన్నారు. జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబాల పోషించుకోలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పెండింగులో ఉన్న జీతాలను చెల్లించి పీఎఫ్ సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సుబ్బరాయుడు, శివారెడ్డి, సుబ్రహ్మణ్యం, రూబెన్, రాజు, స్వప్న, కొండమ్మ, మల్లిఖార్జున, నూర్జహాన్, మీరాంబి తదితరులు పాల్గొన్నారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వని కూటమి ప్రభుత్వం సబ్‌కలెక్టర్ కార్యాలయం, జీజీహెచ్ ఎదుట వర్కర్స్ ధర్నా -
ఉరేసుకుని కార్మికుడు మృతి
కనిగిరి రూరల్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి కనిగిరి మండలంలోని వంగపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వంగపాడు సమీపంలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో మెగా బేస్ క్యాంప్‌లో టిప్పర్ డ్రైవర్‌గా పశ్చిమబెంగాల్ రాష్ట్రం నసర్తాపూర్కు చెందిన హరిదయ రతన్‌దాస్ (49) పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాలు, సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బేస్ క్యాంప్‌లోని షెడ్ ఇనుప రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరివేసుకుని మృతిచెందాడు. ఆ మేరకు బేస్ క్యాంప్ పీఆర్ఓ ముండ్రు వినయ్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్కాపురం డివిజన్ పంచాయతీ అధికారిగా భాస్కర్‌రెడ్డి మార్కాపురం: మార్కాపురం డివిజన్ పంచాయతీ అధికారిగా ఎంవీ భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన పల్నాడులో పంచాయతీ అధికారిగా పనిచేస్తూ బదిలీపై మార్కాపురం డివిజన్లో నియమితులయ్యారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఎల్పీఓగా వై.భాగ్యవతి వ్యవహరిస్తున్నారు. -
జీవన ప్రమాణాలు పెంపొందేలా విజన్ ప్లాన్
ఒంగోలు సబర్బన్: ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందేలా నియోజకవర్గ స్థాయి విజన్ ప్లాన్‌ను రూపొందించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. ఒంగోలులోని ఎన్జీఓ హోంలో స్వర్ణాంధ్ర– 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా నియోజకవర్గాల విజన్ డాక్యుమెంట్ రూపకల్పన, ముఖ్య నిర్దేశిత లక్ష్యాలపై ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సంబంధించి సోమవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడారు. జిల్లా విజన్ ప్లాన్‌ను రూపొందించారన్నారు. నియోజకవర్గ స్థాయి పరిస్థితులను, వనరులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటికి తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆలోచించి, ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్‌ను తయారు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వటానికి వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక నియోజకవర్గంలో రానున్న సంవత్సరాల్లో ఏ సెక్టార్లో అభివృద్ధి, వృద్ధి రేటు ఎలా ఉంటుంది, వాటిని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాలపై నియోజకవర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ స్థాయి పరిస్థితులను, వనరులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటికి తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆలోచించి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఈ వర్క్ షాప్‌లో ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల సీపీఓలు వెంకటేశ్వరరావు, రఘురామయ్య, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సలహాదారు సీతాపతి, రెండు జిల్లాలకు చెందిన నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, సీవీఏపీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయి పరిస్థితులపై అధ్యయనం ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్వర్ణాంధ్ర–2047 విజన్ డాక్యుమెంట్‌పై వర్క్‌షాప్‌లో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా -
రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు
ముండ్లమూరు (కురిచేడు): సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ పెట్రేగిపోతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. పిల్లల పెళ్లిల్లు, చదువులు, ఇతర అవసరాల కోసం ప్రజలు దాచుకున్న నగదును దోచేస్తున్నారు. సంబంధిత బ్యాంకుల నుంచి ఖాతాదారులకు సకాలంలో మెసేజ్‌లు కూడా రాకపోతుండటంతో వెంటనే అప్రమత్తం కాలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మళ్లీమళ్లీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ముండ్లమూరులో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనంగా ఉంది. స్థానిక మోడల్ పాఠశాలలో సివిక్స్ బోధించే ఉపాధ్యాయుడు ఎర్రబోయిన వెంకట సుబ్బారావు తన కుమారుడు అబ్రాడ్‌లో చదువుతుండటంతో అతని చదువు కోసం బ్యాంకులో నగదు దాచుకున్నారు. ఆ నగదులో 5,18,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకుని ఖాతా ఖాళీ చేశారు. ఈ నెల 23వ తేదీ వెంకట సుబ్బారావు స్థానిక ఏపీజీబీ ఏటీఎంలో రెండు దఫాలుగా రూ.10,000, రూ.2,000 డ్రా చేశారు. అనంతరం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు అతని ఫోన్‌కు రూ.48,000 డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి వెంకట సుబ్బారావు ఆందోళనకు గురయ్యారు. దర్శి స్టేట్ బ్యాంకులో గల అతనికి ఖాతాకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ కోసం వెంటనే దర్శి వెళ్లారు. అక్కడున్న ఎస్బీఐ ఏటీఎంలో మినీ స్టేట్మెంట్ తీసుకున్నారు. అప్పుడుగానీ వెంకట సుబ్బారావుకు అసలు విషయం అర్థంకాలేదు. తాను నగదు డ్రా చేయకముందే మూడు సార్లు నగదు డ్రా చేసినట్లు మినీ స్టేట్మెంట్ రావడం చూసి నివ్వెరపోయారు. ఒకరోజు ముందుగానే ఒకసారి రూ.2.5 లక్షలు ఐడీబీఐ బ్యాంకుకు పంపినట్లు, మళ్లీ రూ.20 వేలు ఏటీఎం ద్వారా డ్రా చేసినట్లు, మూడోసారి రూ.2 లక్షలు ఐడీబీఐ బ్యాంకుకు పంపినట్లు మినీ స్టేట్మెంట్లో ఉంది. కానీ, వీటిలో ఏ ఒక్కదానికీ మెసేజ్ రాలేదు. తాను విత్ డ్రా చేసిన వాటికి కూడా మెసేజ్ రాలేదు. ఆ తర్వాత రూ.48,000 డ్రా చేసినట్లు మాత్రం మెసేజ్ వచ్చింది. కుమారుడి చదువు కోసం దాచుకున్న మొత్తంలో 5,18,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేయడంతో వెంకట సుబ్బారావు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని బ్యాంక్ అధికారులు, పోలీసులు... సైబర్ నేరగాళ్లు తన బ్యాంక్ ఖాతాలోని రూ.5,18,000 దోచేయడంపై ఉపాధ్యాయుడు వెంకట సుబ్బారావు ఈ నెల 24వ తేదీ దర్శి స్టేట్ బ్యాంకు మేనేజర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కానీ, అక్కడ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తన ఖాతా నుంచి నగదును సైబర్ నేరగాళ్లు ఏ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారనే వివరాలడిగినా స్పందించలేదని చెప్పారు. తన నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారని సర్టిఫికెట్ ఇవ్వమన్నా ఇవ్వలేదని, అకౌంటెంట్‌కు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన బ్యాంకు ఖాతాను బ్లాక్ చేయించినట్లు తెలిపారు. బ్యాంకు వారిపై నమ్మకం లేక ఈ నెల 25వ తేదీ ఆ ఖాతాలో ఉన్న మిగతా నగదును డ్రా చేసి జాగ్రత్త చేసుకున్నట్లు చెప్పారు. మొదటిసారి నగదు ట్రాన్స్ఫర్ కాగానే తన సెల్‌కు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చి ఉంటే వెంటనే అప్రమత్తమై బ్యాంకు ఖాతాను బ్లాక్ చేయించి కొంతవరకై నా నగదు నష్టపోకుండా కాపాడుకునేవాడినని, కానీ, మెసేజ్‌లు రావడం ఆలస్యం కావడం వలన పూర్తిగా నగదు నష్టపోవాల్సి వచ్చిందని సుబ్బారావు పేర్కొన్నారు. అనంతరం 1930కి ఫిర్యాదు చేశానని తెలిపారు. ముండ్లమూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. ఎస్సై లేరని, ఆయన వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకుంటామని సిబ్బంది చెప్పడంతో వెనక్కు వచ్చినట్లు ఆయన తెలిపారు. తన బ్యాంకు ఖాతా నుంచి మాయమైన నగదును సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ చేసి తనకు ఇప్పించాలని, తన కుమారుడి చదువు ఆగిపోకుండా ఆదుకోవాలని సుబ్బారావు విజ్ఙప్తి చేశారు. ఓ ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా ఖాళీ రూ.5,18,000 దోచేసిన వైనం కుమారుడి చదువు కోసం దాచుకున్న నగదు మాయం కావడంతో తీవ్ర ఆవేదనలో బాధితుడు -
ముగిసిన యూటీఎఫ్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు
ఒంగోలు సిటీ: యూటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు జిల్లా శాఖ రెండు రోజుల శిక్షణ తరగతులు శని, ఆదివారాల్లో పేస్ ఇంజినీరింగ్ కాలేజీ లో నిర్వహించామని జిల్లా ప్రధాన కార్యదర్శి డీ వీరాంజనేయులు తెలిపారు. శిక్షణ తరగతులను రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు ప్రారంభించారు. యూటీఎఫ్ భావజాలాన్ని సహాధ్యక్షుడు కే సురేష్ కుమార్ వివరించారు. విద్యారంగ పరిణామాలను ఎన్ నవకోటేశ్వరరావు, సంస్థ నిర్మాణాలను కర్తవ్యాలను కే శ్రీనివాసరావు, ఆడిట్ రికార్డు నిర్వహణపై ఎన్ చిన్నస్వామి, ఎం రాము అవగాహన కల్పించారు. ఆదివారం పెన్షన్ రూల్స్‌ను జే కేశవరాజు, లీవ్ రూల్స్‌ను రాష్ట్ర నాయకులు టీఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, బదిలీల చట్టం నిబంధనను ఎస్ రవి, సీపీఎస్ పెన్షన్, జెడ్పీ పీఎఫ్ లోన్స్, మెడికల్ బిల్స్‌పై ఎస్కే అబ్దుల్ హై, వర్తమాన రాజకీయాలను డీ వీరాంజనేయులు, మహిళా ఉద్యమం గురించి జీ ఉమామహేశ్వరి వివరించారు. మే 2వ తేదీ డీ రామిరెడ్డి తొమ్మిదో వర్ధంతి సభ, స్మారక ఉపన్యాసం దర్శిలో జరుగుతుందని, జయప్రదం చేయాలని కోరారు. ఒంగోలు రైల్వేస్టేషన్లో తనిఖీలు ఒంగోలు టౌన్: పహల్గామ్లో ఉగ్రదాడుల నేపథ్యంలో ఒంగోలులోని రైల్వేస్టేషన్లో జీఆర్పీ పోలీసులు ఆదివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్, ఎస్ఐ కె.మధుసూదనరావు పాల్గొని మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ (ఎంఎస్డీసీ) ద్వారా తనిఖీలు చేసి పలువురు అనుమానితులను గుర్తించారు. ఎటువంటి నేరాలకు పాల్పడకుండా వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి రైల్వే ప్లాట్‌ఫాం, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
పశ్చిమంపై శీతకన్ను
వెలుగొండను త్వరగా పూర్తిచేయాలి వెలుగొండ ప్రాజెక్టును ప్రభుత్వం త్వరగా పూర్తిచేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. పోలవరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో.. వెలుగొండకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వరద సీజన్లోనే కృష్ణా జలాలను వెలుగొండ ద్వారా ఈ ప్రాంతానికి అందించాలి. కనీసం రూ.1500 కోట్లు కేటాయిస్తేనే ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందుతాయి. ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చి త్వరగా ముంపు గ్రామాల ప్రజలను కాలనీలకు తరలించాలి. – సోమయ్య, సీపీఎం నాయకులు ఆగిన మెడికల్ కళాశాల భవనాలుపశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. వెలుగొండ ప్రాజెక్టు..మెడికల్ కాలేజీ..మార్కాపురం జిల్లా.. ఇలా ఏ ఒక్క అభివృద్ధి పనినీ పట్టించుకోకుండా తీరని ద్రోహం చేస్తోంది. వెలుగొండ ప్రాజెక్టుకు అరకొర నిధులు కేటాయించగా..మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపేసింది. ఇక మార్కాపురం జిల్లా చేస్తామన్న ఊసే మరిచిపోయింది. ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.మార్కాపురం: జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో గత ప్రభుత్వంలో వడివడిగా సాగిన అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి ప్రొఫెసర్లను నియమించారు. పెద్దదోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంజూరు చేశారు. పొదిలి పెద్దచెరువు నిర్మాణానికి రూ.50 కోట్లు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన మెడికల్ కళాశాల నిర్మాణం నిలిచిపోయింది. జిల్లా వైద్యశాల నుంచి జీజీహెచ్‌గా మారి అత్యున్నతమైన కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా పేద ప్రజలకు అందించే హాస్పిటల్‌కు నేడు రోగులు కరువయ్యారు. సుమారు 45 మందికి పైగా వైద్యులను బదిలీ చేసిన ప్రభుత్వం వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో వైద్యసేవల కోసం మళ్లీ యధావిధిగా గుంటూరు, ఒంగోలుకు వెళ్తున్నారు. ప్రస్తుతం 22 మంది వైద్యులు మాత్రమే సేవలు అందిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు కలిపి 75 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజీని అర్ధంతరంగా ఆపడంతో పాటు పీపీపీ విధానంలో చేస్తామంటూ చేసిన ప్రకటన కూడా వాస్తవ రూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వ తీరుపై ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలగా మారిన జిల్లా ఏర్పాటు: గత ఎన్నికలకు ముందు మార్కాపురాన్ని జిల్లాగా చేసి సీఎంగా మార్కాపురం వస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు హామీ నెరవేర్చకుండానే మార్చి 8న మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరయ్యారు. అప్పుడు కూడా ప్రజలు అడిగిన ప్రశ్నలకు కచ్చితంగా జిల్లా చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఎప్పట్లోగా చేస్తానని మాత్రం ప్రకటించలేదు. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. కలెక్టర్, ఎస్పీ, అగ్రికల్చర్, హార్టీకల్చర్, జేడీలు, వైద్యశాఖ డీఎంహెచ్ఓ, ఇతర సంక్షేమ శాఖల ఈడీలు ఇక్కడే ఉండి అభివృద్ధిని పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతోపాటు జిల్లా ఏర్పాటైతే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులొస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా మార్కాపురానికి వస్తుంది. హామీలు మరిచి అభివృద్ధికి పాతరేసిన కూటమి ప్రభుత్వం ఆగిన మెడికల్ కళాశాల నిర్మాణం జీజీహెచ్‌లో వైద్యుల కొరత వెలుగొండకు అరకొర నిధులు ఏర్పాటుకాని మార్కాపురం జిల్లామెడికల్ కాలేజీని పూర్తిచేయాలి రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని త్వరగా పూర్తిచేయాలి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలి. పీపీపీ విధానం వద్దు. జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. మార్కాపురాన్ని జిల్లా చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. – గాలి వెంకటరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు వెలుగొండకు అరకొర నిధులు అధికారంలోకి రాగానే వెలుగొండను పూర్తిచేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.309.13 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. ముంపు గ్రామాల ప్రజల ఆర్ఆర్ ప్యాకేజీల కోసం కనీసం రూ.1200 కోట్లు కేటాయించాలి. ప్రభుత్వం కేటాయించిన నిధులు సిబ్బంది జీతభత్యాలకు, అరకొర పనులకు మాత్రమే ఉపయోగపడతాయి. మరోవైపు ప్రాజెక్టును 2026కు పూర్తిచేస్తామని చెబుతున్నా నిధుల కేటాయింపు జరగకపోవడంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
కూటమి నేతలకే రుణాలు
బేస్తవారిపేట: కూటమి ప్రభుత్వం పథకాలకు అర్హతలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెట్టే అరకొర పథకాలు తమ పార్టీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలకే దోచిపెడుతోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కార్పొరేషన్ రుణాలు ఇస్తున్నట్లు ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రుణాల మంజూరులో నిజమైన లబ్ధిదారులకు ఈ పథకం అందనంత దూరంలో ఉంది. కూటమి నేతలు, కార్యకర్తలకే రుణాలన్నీ మంజూరు చేసే ఎత్తుగడ సాగుతోంది. ఇంటర్వ్యూలు లేకుండానే... అరకొరగా ఉన్న వివిధ కార్పొరేషన్ల రుణాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. జిల్లాలో ఎక్కువ శాతం మండలాల్లో ఇవేమీ జరుగలేదు. కొన్ని మండలాల్లో తూతూమంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. టీడీపీ నాయకులు చెప్పిన దరఖాస్తుదారుల గృహాల వద్దకు వెళ్లి పరిశీలించారు. మిగిలిన దరఖాస్తులను అటకెక్కించారు. విషయం తెలుసుకుని తమ దరఖాస్తులు పరిశీలించాలని కోరుతున్నా సరైన సమాధానం చెప్పడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. విస్తృత ప్రచారం: నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్ ఇస్తాం, ఆర్థికంగా స్థిరపడేందుకు రుణాలు మంజూరు చేస్తున్నామని విస్తృత ప్రచారం కల్పించారు. దరఖాస్తులు పెట్టుకోవాలని అధికారులతో పత్రిక ప్రకటనలు, సచివాలయాల్లో ఊదరగొట్టారు. ఇప్పుడు వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం తమ పార్టీ వారికే రుణాలు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. రాజకీయ అండలేని నిరుద్యోగుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని దోచుకునేందుకు దళారులు తయారయ్యారు. రుణాలు ఇప్పిస్తామంటూ దరఖాస్తుదారుల నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. తాము చెబితేనే లోన్ వస్తుందని కూటమి నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత ఉన్న అందరికీ రుణాలు మంజూరు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కార్పొరేషన్ల రుణాలన్నీ కూటమి నేతలు, కార్యకర్తలకే సిఫార్సుల మేరకు రుణాల మంజూరు ఇంటర్వ్యూలు లేకుండానే లబ్ధిదారుల ఎంపిక ఆందోళనలో నిరుద్యోగ యువత -
పొగాకు బ్యారన్ దగ్ధం
● రూ. 3 లక్షల మేర ఆస్తినష్టం కొనకనమిట్ల: మండలంలోని వద్దిమడుగు గ్రామంలో అగ్ని ప్రమాధం సంభవించి పొగాకు బ్యారన్ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అంకిరెడ్డి చెంచమ్మకు చెందిన పొగాకు బ్యారన్‌ను అదే గ్రామానికి చెందిన ఏరువ తిరుపతయ్య కౌలుకు తీసుకుని పొగాకు క్యూరింగ్ చేపట్టారు. బ్యారన్లో సుమారు 1100 పొగాకు అల్లుడు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మొద్దు గొట్టంపై అల్లుడు కర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బ్యారన్‌లోని టైర్లు, రేకులు, అల్లుడు కర్ర కాలిపోయాయి. మంటల ధాటికి బ్యారన్ గోడలు నెర్రలిచ్చాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న మార్కాపురం అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బ్యారన్ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్దమైంది. అల్లుడు కర్ర, బ్యారన్ మొత్తం రూ..3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. నోటికాడికి వచ్చింది బూడిదపాలు.. ఈ ఏడాది పొగాకు రైతుల పరిస్థితి ఆగమ్యగోచదరంగా ఉంది. ధరలు లేకపోవడంతో నష్టాలు తప్పేలా లేవు. ఈ పరిస్థితుల్లో బ్యారన్ కాలిపోవడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయింది. ప్రభుత్వం, పొగాకు బోర్డు అధికారులు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా పాలకవర్గం ఏకగ్రీవం
ఒంగోలు సిటీ: ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి నెల్లూరు జిల్లా ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.కిరణ్ కుమార్ తెలిపారు. నగరంలోని ఫైనాన్సియల్ కాంప్లెక్స్‌లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడి గా మార్కాపురం సబ్ ట్రెజరీ అధికారి ఎన్వీ కృష్ణ, కార్యదర్శిగా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న పీ అంక బాబు, సహాధ్యక్షునిగా గిద్దలూరు సబ్ ట్రెజరీ అధికారి పీవీఎల్ఎన్ వరకుమార్, మహిళా ఉపాధ్యక్షురాలిగా జిల్లా ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కే లావణ్య, ఉపాధ్యక్షులుగా జిల్లా ట్రెజరీ లో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా పనిచేస్తున్న బీ అక్కేశ్వర రావు, పొదిలి సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఎస్కే కరిముల్లా, కే వెంకటేశ్వర్లు, మహిళా సంయుక్త కార్యదర్శులుగా జిల్లా ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న పీ హేమలత, మిగతా సంయుక్త కార్యదర్శులుగా కనిగిరి సబ్ ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కే ప్రసాద్ చంద్ర, యర్రగొండపాలెంలో జూనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న డీ అనిల్, కోశాధికారిగా జిల్లా ట్రెజరీ లో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న కే రామకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కందుకూరు సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న సీహెచ్ ఫణీంద్ర, జిల్లా ట్రెజరీలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేస్తున్న ఐ కిషోర్ బాబు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉప ఎన్నికల అధికారిగా సీహెచ్ విజయ కృష్ణ, పరిశీలకులు గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డి.రమణా రెడ్డి వ్యవహరించారు. రాష్ట్ర నాయకులు పాముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ పటిష్టతపై దృష్టి సారించండి
● నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పిలుపు మార్కాపురం: వైఎస్సార్ సీపీ పటిష్టతపై దృష్టి సారించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మార్కాపురం నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పార్టీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించిన తీరును వివరించాలన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యాలు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్దామన్నారు. ప్రతి కార్యకర్తకూ తాను అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పార్టీలో కష్టపడిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. తాను ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తను గుర్తిస్తానన్నారు. కార్యకర్తలు నిరాశ, నిస్పృహలు వీడాలని సూచించారు. అందరం ఐకమత్యంగా ఉండి పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేద్దామన్నారు. పహల్గామ్ మృతులకు ఘన నివాళులు... కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఖండించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ ఇంటలెక్చువల్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మేడా బద్రీనాఽథ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్–2 అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు బుశ్శెట్టి నాగేశ్వరరావు, కొత్త కృష్ణ, చాటకొండ చంద్ర, సలీమ్, పార్టీ నాయకులు ఇస్మాయిల్, సురేష్, గుంటక చెన్నారెడ్డి, బొగ్గరపు శేషయ్య, సుంకయ్య, మందటి మహేశ్వరరెడ్డి, డీవీఆర్, బోడపాడు రమణారెడ్డి, కొండలు, కాల్వ దుర్గ, చాంద్‌బాషా, ఉస్మాన్, పి.విజయలక్ష్మి, సోషల్ మీడియా రఫీ, సీఎం ఖాశీం తదితరులు పాల్గొన్నారు. -
టైరు పంక్చరై లారీ బోల్తా
పెద్దారవీడు: వేగంగా వెళ్తున్న లారీ టైరు అకస్మాత్తుగా పంక్చర్ కావడంతో లారీ బోల్తా పడింది. పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు–తోకపల్లి గ్రామాల మధ్య ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సీతారామపురం గ్రామం నుంచి సజ్జల లోడు లారీ హైదరాబాద్ వైపు వెళ్తోంది. ఆ సమయంలో లారీ టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ కార్తీక్ వేగాన్ని అదుపుచేసి రోడ్డు పక్కన నిలిపేందుకు ప్రయత్నించగా, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి లారీ బోల్తాపడింది. లారీలో డ్రైవర్, క్లీనర్, ఇద్దరు కూలీలు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే మరో లారీలో సజ్జల బస్తాలు లోడ్ చేసి పంపించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి సింగరాయకొండ: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని మతిస్థిమితం లేని మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ లోపలి గేటు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఆర్టీసీ బస్సు బస్టాండ్ లోపలి గేటు గుండా వెళ్లే ప్రయత్నంలో ఆ సమయంలో బస్సుకు అడ్డంగా వచ్చిన మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి గురించి వివరాలు తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. ప్రాణం తీసిన ఈత సరదా ● నీటి కుంటలో పడి బాలుడు మృతి కనిగిరి రూరల్: ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన కనిగిరి మండలంలోని భూతంవారిపల్లిలో జరిగింది. భూతంవారిపల్లికి చెందిన సీ శ్రీను కుమారుడు చిన్ని (12) కంచర్లవారిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గ్రామానికి చెందిన తోటి స్నేహితుడితో కలిసి ఊరి చివర ఉన్న నీటి కుంట దగ్గరికి వెళ్లాడు. చిన్ని సరదాగా ఈత కొట్టేందుకు నీటి గుంతలో దిగాడు. గుంత లోతుగా ఉండటంతో లోపలికి వెళ్లిన చిన్ని తిరిగి పైకి రాలేదు. దీంతో పక్కనే ఉన్న బాలుడు ఆందోళన చెంది గ్రామస్తులకు తెలియజేశాడు. వారు వెంటనే వచ్చి నీటి కుంటలో నుంచి చిన్నిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదం అలముకుంది. -
కోటాలో కోత..!
నియోజకవర్గంలో రేషన్ కార్డులు 21860001,200టన్నులు ఆరు మండలాల్లో రేషన్ షాపులు రేషన్ పంపిణీ వాహనం కనిగిరిరూరల్: కూటమి ప్రభుత్వం పేదలపై కక్ష కట్టింది. గతంలో ఇస్తున్న పథకాలన్నింటినీ అటకెక్కించిన ప్రభుత్వం..ఇప్పుడు తాజాగా రేషన్ బియ్యంలోనూ కోత విధించింది. ప్రతి నెలా జిల్లాకు మంజూరయ్యే రేషన్ బియ్యం కోటాలో కోత పెట్టింది. ఒక్కసారిగా బియ్యం తక్కువ రావడంతో డీలర్లు ఆందోళన చెందారు. గత మూడు నెలల్లో జరిగిన బియ్యం పంపిణీని సగటుగా తీసుకోవడంతో పాటు మార్చి క్లోజింగ్ బ్యాలెన్స్ తీసి వేసి ఏప్రిల్‌కు బియ్యం కోటా మంజూరు చేసినట్లు సమాచారం. దీంతో వాస్తవ అలాట్మెంట్ కంటే దాదాపు 30 శాతం తగ్గించినట్లు వచ్చినట్లు తెలిసింది. 100 క్వింటాళ్లకు కేవలం 70 క్వింటాళ్లకు మాత్రమే రేషన్ దుకాణాలకు కేటాయించింది. అయితే ఈ విషయమై ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు. బియ్యం కోటా తక్కువగా రావడంతో డీలర్లు విచారించినా దీనిపై పట్టించుకునే వారే కరువయ్యారు. తమ్ముళ్లలో ‘పరేషాన్’ ఏప్రిల్ నెల బియ్యం కోటాలో కోత విధించడంతో రేషన్ డీలర్లుగా ఉన్న తమ్ముళ్లు పరేషాన్‌కు గురయ్యారు. వాస్తవానికి ప్రతి రేషన్ డీలర్ సుమారు 30 శాతం వరకు మిగుల్చుకుంటారు. 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం కేటాయిస్తే అందులో 70 నుంచి 75 శాతం మాత్రమే వాస్తవ పంపిణీ చేస్తారు. 10 నుంచి 15 శాతం మందికార్డులకు బియ్యం ఆయిపోయాయంటూ బియ్యానికి బదులు నగదు ఇచ్చి థంబ్ వేయించుకుంటారు. ప్రతి షాపులో కనీసం 20 శాతం సరుకు నిల్వలు ఉంటాయి. ప్రతి నెలా ప్రభుత్వానికి సేల్స్ అండ్ స్టాక్‌పై నివేదికలు ఇవ్వాలి. కానీ డీలర్లు మిగిలిన బియ్యాన్ని కేజీ రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఈ నెలలో రావాల్సిన బియ్యం కోటాలో 30 శాతం తక్కువ రావడంతో డీలర్లు ఏం చేయాలో ఆందోళన చెందారు. తగ్గిన బియ్యం కోటాను ఎలా పంపిణీ చేయాలో, ఎలా మిగుల్చుకోవాలో తెలియక తికమకపడ్డారు. కోటా కోతలో కొన్ని చోట్ల ఎండీయూ ఆపరేటర్లను, డీలర్లను కార్డుదారులు నిలదీసిన సంఘటనలూ ఉన్నాయి. . దీంతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి 10 శాతం అదనంగా కేటాయించి కార్డుదారులకు అరకొరగా పంపిణీ చేశారు. అయితే ఎక్కడా సమస్య బయటకు రాకుండా అధికారులు, డీలర్లు, అధికార పార్టీ నేతలు గప్‌చుప్‌గా వ్యవహారం నడిపించారు. కనిగిరిలో సుమారు 20 దుకాణాల వారు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల అనుమతితో అదనంగా 10 శాతం బియ్యాన్ని కేటాయించుకొని పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు, డీలర్ల మధ్య వార్... 30 శాతం తక్కువ కోటా కేటాయించడంపై డీలర్లు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 95 శాతం రేషన్ దుకాణాలను లాగేసుకొని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు కేటాయించింది. ఏళ్ల తరబడి రేషన్ దుకాణం నిర్వహిస్తున్న వారి వద్ద కూడా నిర్దాక్ష్ణ్యింగా లాక్కున్నారు. ప్రస్తుతం అధిక శాతం మంది డీలర్లు కూటమి నేతలే కావడంతో వారంతా అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో వచ్చే నెలలో గతంలో కేటాయించిన విధంగానే అలాట్మెంట్ చేస్తామని చెప్పి సర్దిచెప్పి పంపించారు. కేటాయింపు ఇలా.. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న రెండు ఎఫ్‌సీఐ గోడౌన్ల పరిధిలో ఏప్రిల్ నెల రేషన్ బియ్యం సరఫరాలో సుమారు 300 టన్నులు తగ్గించినట్లు తెలిసింది. కనిగిరి ఎఫ్‌సీఐ పరిధిలోని నాలుగు మండలాల రేషన్ షాపులకు 650 టన్నులకు 530 టన్నుల కేటాయించగా, పామూరు గోడౌన్ పరిధిలోని పామూరు, సీఎస్‌పురం మండలాల రేషన్ కార్డులకు సంబంధించి 520 టన్నులకు గాను 350 టన్నులు కేటాయింపులు చేసినట్లు సమాచారం. రెండు ఎఫ్‌సీఐ గోడౌన్ల పరిధిలో రేషన్ బియ్యం సరఫరా బియ్యం కోటాలో కోత విధించిన ప్రభుత్వం కార్డుదారులందరికీ అందని బియ్యం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్న రేషన్‌డీలర్లు తక్కువ బియ్యం రావడంతో అక్రమార్కులకు తగ్గిన వాటా ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలుకోతలు లేకుండా రేషన్‌ను అందజేయాలి: కూటమి ప్రభుత్వంలో అన్నింటిలో కోతలు పెడుతున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యంలోనూ కోత విధించడం దారుణం. ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే 300 టన్నులకు పైగా కోత విధించారు. ప్రభుత్వం విధానం మార్చుకోకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. – పందిటి మోహన్, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి) -
కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలి
● ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ఒంగోలు మెట్రో: కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో శ్రీ నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అండ్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి విశిష్ట పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ నటుడు మిడసల మల్లికార్జునరావుకు శనివారం అభినందన సభ నిర్వహించారు. కనమాల రాఘవులు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కళాకారులను ప్రభుత్వాలు గుర్తించి పురస్కారాలివ్వడం, అందులోనూ మిడసలకు పురస్కారం లభించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ నటుడు డాక్టర్ పరాంకుశం కేశవాచార్యులు మాట్లాడుతూ పౌరాణిక నాటకాలను ప్రజలు మెచ్చే విధంగా చేయడం, చేయించడంలో మిడసల అభినందనీయుడని కొనియాడారు. నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘ గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, కళామిత్రమండలి (తెలుగు లోగిలి) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు, శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్‌బాబు, తదితరులు పాల్గొని మిడసలను ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సీవీఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ అధ్యక్షుడు ఈదుపల్లి గురునాథం, కార్యదర్శి కె.రాధాకృష్ణ, కోశాధికారి ఆరిగ వీరప్రతాప్, సింహాద్రి జ్యోతిర్మయి, యు.వి.రత్నం, కొప్పోలు వెంకటేశ్వర్లు, మెడబలిమి సాంబశివరావు, దామవరపు ముసలయ్య, కోవెలకుంట్ల బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాజేష్ దంపతులు పాడిన పాటలు, చందూ డ్యాన్స్ అకాడమీ చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
జామాయిల్ తోట దగ్ధం
● రూ.4 లక్షల ఆస్తినష్టం ముండ్లమూరు (కురిచేడు): ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో జామాయిల్ తోట దగ్ధమై సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం సంభవించింది. తోట యజమాని అనుపర్తి జాన్‌ప్రభాకర్ కథనం మేరకు.. రెండు ఎకరాల్లో జాన్‌ప్రభాకర్ జామాయిల్ తోట సాగు చేశాడు. శుక్రవారం రాత్రి అగ్నికి తోట ఆహుతైంది. చేతికందే సమయంలో జామాయిల్ తోట అగ్నిప్రమాదానికి గురికావడంతో సుమారు రూ.4 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారా.. లేక బీడీ, సిగరెట్ తాగి పడేస్తే గాలికి అగ్గి రాజుకుని ప్రమాదం జరిగిందా..? అనే విషయం తెలియడం లేదన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కురిచేడు: స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సంధ్య వాటర్ సర్వీసింగ్ పాయింట్‌ను కూల్చివేసి దాని యజమాని కే మరియబాబును దుర్భాషలాడిన ఘటనపై కురిచేడు పోలీసుస్టేషనులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.శివ శనివారం తెలిపారు. మరియబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెదకోటిరెడ్డి, పత్తి శ్రీరంగ, అతని తమ్ముడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. పర్యాటకులపై ఉగ్రదాడి సిగ్గుచేటుమార్కాపురం: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం అమానుషమని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ శనివారం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పైశాచిక ఆనంద పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐజేయూ మాజీ సభ్యుడు కేవీ సత్యనారాయణ, జీఎల్ నరసింహారావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు డీ మోహన్‌రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అసోిసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాజీవలి, యూనియన్ జిల్లా కోశాధికారి డీ బాబి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ముండ్లమూరు చిన్నారికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు
ముండ్లమూరు (కురిచేడు): సంగీతంలో ఓ పదకొండేళ్ల చిన్నారి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. ముండ్లమూరు పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బి.ప్రేమానిధి కుమారుడు మణిరత్నపాల్ నిధి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. విజయవాడ హలెల్ మ్యూజిక్ స్కూలు ద్వారా సంగీతం నేర్చుకున్నాడు. గత డిసెంబరు నెలలో డీ అగస్టీన్ ఆధ్వర్యంలో 18 దేశాలలో 1,046 మందితో జరిగిన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు పోటీల్లో పాల్గొన్నాడు. తన స్వరాలు ఆలపించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. విజయవాడలోని మెట్రోపాలిటన్ మిషన్ చర్చిలో శుక్రవారం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును హలెల్ మ్యూజిక్ స్కూలు అధినేత డీ అగస్టీన్ దంపతుల చేతుల మీదుగా అందుకున్నాడు. గిన్నిస్ బుక్‌లో జాషువా పేరు నమోదు మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్‌లో డయాలసిస్ ఇన్చార్జిగా పనిచేస్తున్న దారా జాషువా అలియాస్ కుమార్ గిన్నిస్ బుక్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నారు. గతేడాది డిసెంబరు 1న విజయవాడలో జరిగిన ప్రపంచ స్థాయి సంగీత ప్రదర్శనలో హలెల్ మ్యూజిక్ స్కూల్ సంగీత కళాకారుల బృందం ఆధ్వర్యంలో జాషువా కీ బోర్డులో స్వరాలను 45 సెకన్లలో స్వరపరిచి గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఈ నెల 25న విజయవాడలో జరిగిన గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో పాస్టర్ అగస్టీన్ చేతుల మీదుగా మెడల్, గిన్నిస్ ధ్రువీకరణపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను చర్చి సభ్యులు, క్రైస్తవ సంఘాల సభ్యులు అభినందించారు. -
వేట నిషేధ భృతి ఎంతో అవసరం
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతి ఎంతో అవసరమని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో భృతి పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు తెలిపారు. మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 2025–26 సంవత్సరానికిగానూ 5,501 మంది సముద్ర మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున మొత్తం పదకొండు కోట్ల ఇరవై వేల రూపాయల లబ్ధి చేకూరనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని కొత్తపట్నం, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, నాగులుప్పలపాడు మండలాలకు చెందిన మత్స్యకారులకు ఈ భృతిని అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు పేరయ్య, మత్స్యకార సంఘాల ప్రతినిధులు తిరుపతిరావు, సున్నం తిరుపతి, రాయం శ్రీనివాసరావు, వివిధ మత్స్య కార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఒంగోలు సిటీ: ఉచిత విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం కోటా కింద పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు తల్లిదండ్రులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఏ కిరణ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి మే నెల 15వ తేదీలోగా ఆన్లైన్లో హెచ్‌టీటీపీ://ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగుల కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాలకు (బీసీ, మైనార్టీ, ఓసీ) చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఎవరికై నా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 18004258599ను సంప్రదించవచ్చన్నారు. అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు, పిల్లల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. సీబీఎస్ఈ, ఐబీ, ఐసీఎస్ఈ బడుల్లో ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి పిల్లలకు ఐదేళ్లు పూర్తయి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ పాఠశాలల్లో జూన్ 1 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా మే 16 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారన్నారు. లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21 నుంచి 24వ తేదీ మధ్య విడుదల చేస్తారని తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణను విడతల వారీగా జూన్ 2, 6, 12 తేదీల్లో విడుదల చేస్తారని చెప్పారు. విలువలతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు ● మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి రాజ్యలక్ష్మి ఒంగోలు సిటీ: చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ వలన జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం ఒంగోలులోని బాలసదన్‌ను ఆమె సందర్శించారు. అక్కడి విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన సదుపాయాలను పరిశీలించారు. బాలసదన్‌కు సంబంధించిన దస్త్రాలు, కార్యాలయ నిర్వహణ తీరును పరిశీలించారు. మరింత మెరుగైన సదుపాయాల కోసం సూచనలు చేశారు. చట్టపరంగా విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తోందని తెలిపారు. తదనంతరం శిశుగృహను న్యాయమూర్తి సందర్శించి అక్కడి నవజాత శిశువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.హేమలత, జూనియర్ సివిల్ న్యాయమూర్తి కే నికిత, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దినేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు
ఒంగోలు టౌన్: జిల్లాలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు శనివారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటళ్లు, లాడ్జిలు, రైల్వే, బస్ స్టేషన్లను తనిఖీ చేశారు. లాడ్జిలలో బసచేసిన వారి ఆధార్, ఇతర వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న వారి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిలలో బసచేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని యజమానులకు స్పష్టం చేశారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు తావిచ్చినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు ప్రదేశాలలో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. వాహనాలను తనిఖీ చేసి రోడ్డు భద్రత ఉల్లంఘనదారులపై ఎంవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించారు. -
హైదరాబాద్‌కు ఉదయం పూట బస్సు సౌకర్యం కల్పించాలి
మార్కాపురం బస్టాండులో ప్రయాణికుల సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. బస్టాండులో ప్లాట్‌ఫాంలను విస్తరించాలి. ఉదయం పూట 5 గంటలకు హైదరాబాద్‌కు, రాత్రిపూట విశాఖపట్నం, అన్నవరం, సింహాచలం, రాజమండ్రిలకు బస్సులు నడపాలి. ప్రస్తుతం శ్రీశైలం, తిరుపతి బస్సు పాత సర్వీసు కావడంతో బస్సులో కూర్చున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాలకు కొత్త సర్వీసులు ఏర్పాటు చేయాలి. బెంగళూరుకు ఇంద్ర బస్సు ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ బస్టాండులో క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. – ఆర్కేజే నరసింహం, జిల్లా ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు -
బస్టాండ్ విస్తీర్ణం: 2.18 ఎకరాలు
డిపోలో బస్సుల సంఖ్య: 102మార్కాపురం: మార్కాపురం బస్టాండ్ పశ్చిమ ప్రకాశం వాసులకు ఎంతో కీలకం. 1993లో బస్టాండ్‌ను ప్రారంభించారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటై 32 ఏళ్లు దాటినా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఏళ్లు గడుస్తున్నా.. పెద్ద ఎత్తున ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నా... ఆదాయం పెరుగుతున్నా.. సౌకర్యాల కల్పనలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికీ ఒంగోలు, కనిగిరి, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ప్లాట్‌ఫాం లేదు. ఫలితంగా బస్సులు ఆగినప్పుడు ఇబ్బందులు పడాల్సిందే. వర్షం పడినప్పుడు వర్షానికి తడుస్తూ, ఎండాకాలంలో ఎండకు ఎండుతూ బస్సులు ఎక్కాల్సిన దుస్థితి. డివిజన్ కేంద్రంగా ఉన్న ఇక్కడ నుంచి ప్రతి రోజు సుమారు అన్నీ ప్రాంతాలకు మార్కాపురం నుంచి 5 వేల మందికి పైగా ప్రజలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండులో రాత్రి, మధ్యాహ్న సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు భోజనం చేసేందుకు క్యాంటీన్ లేకపోవడంతో బిస్కెట్లు తిని టీ తాగి కడుపు నింపుకుంటున్నారు. కొంత మంది ఆర్టీసీ డ్రైవర్లు పెద్దారవీడు మండలం కుంట, కంభం, బేస్తవారిపేట మధ్య భోజనాల కోసం బస్సులు ఆపుతున్నారు. టైం కాని టైంలో భోజనానికి ఆపినా ప్రయాణికులు తినలేక పోతున్నారు. కనీస సౌకర్యాలు నిల్... బస్టాండులో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు, తెలంగాణ రాజధాని హైదరాబాద్, పొరుగు జిల్లాలు కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ప్రతి రోజూ 1500 మంది ప్రయాణికులు వెళ్లి వస్తుంటారు. ఈ బస్సులను బస్టాండు ప్రాంగణంలోనే నిలుపుతున్నా ప్లాట్‌ఫాం లేకపోవడంతో ఎండలో నిలబడి బస్సు వచ్చిన సమయానికి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతాలకు ఆదాయం ఉన్నప్పటికీ సౌకర్యాలు మాత్రం రవాణా శాఖ అధికారులు కల్పించలేదు. ఇక బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రయాణికులు పే అండ్ యూజ్ టాయిలెట్స్ వాడుతున్నా వాటి నిర్వహణ కూడా మరింత అధ్వానంగా తయారైంది. బస్టాండు ఆవరణలో ఉన్న నీళ్ల ట్యాపులు కూడా అరకొరగా వస్తూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడతాయి. అర్ధరాత్రి దాటితే బస్టాండుకులోకి రాని రాయలసీమ బస్సులు అర్ధరాత్రి దాటితే విజయవాడ నుంచి అనంతపురం, అనంతపురం నుంచి విజయవాడ మార్గమధ్యంలో ఉన్న పులివెందుల, కడప, రాయదుర్గం, హిందూపురం, నంద్యాల, బద్వేలు, ప్రొద్దుటూరు, తాడిపత్రి, ధర్మవరం, పెనుకొండ తదితర డిపోలకు చెందిన బస్సులు బస్టాండుకు రాకుండా మార్కాపురం మండలంలోని కుంట మీదుగా హైవేపై వెళ్లిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ రూట్లలో తిరిగే బస్సుల్లో ఎవరైనా మార్కాపురం పట్టణంలో దిగే ప్రయాణికులు ఉంటేనే బస్టాండుకు వస్తున్నాయి. లేకుంటే హైవేపై వెళ్లిపోతున్నాయి. ఉదయం పూట హైదరాబాద్ వెళ్లేందుకు మార్కాపురం డిపో నుంచి బస్సులు లేవు. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి విశాఖపట్నం, అన్నవరం, సింహాచలం, రాజమండ్రికి కూడా బస్సు సౌకర్యం లేదు. విజయవాడకు వెళ్లి ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. విజయవాడ– అనంతపురం హైవేతో పెరిగిన తాకిడి విజయవాడ–అనంతపురం హైవే రోడ్డు ఏర్పాటు తరువాత ప్రయాణికుల రాకపోకలు, బస్సుల రద్దీ కూడా పెరిగింది. ఇదే సమయంలో కర్నాటక నుంచి వచ్చే లారీలు కూడా దగ్గరి మార్గంగా అనంతపురం, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ మీదుగా విజయవాడ వెళ్తున్నాయి. మార్కాపురం డిపో నుంచి రాత్రి 9 గంటలు దాటిన తరువాత విజయవాడకు నేరుగా బస్సులు లేవు. రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే బస్సులు మార్కాపురం బస్టాండుకు వస్తేనే ప్రయాణికులు విజయవాడ వెళ్తున్నారు. లేకుంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. -
ప్రాణదాతలుగా పశువైద్యులు
ఒంగోలు సబర్బన్: మూగజీవాల పాలిట ప్రాణదాతలుగా పశు వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత పహల్గాంలో ఈనెల 22న ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. అనంతరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విజన్ డాక్యుమెంట్లో లైవ్ స్టాక్ సెక్టార్ రూ.9,735 కోట్ల జీడీపీతో మొదటి స్థానంలో ఉందన్నారు. అలాగే పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 17,525 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పి–4 విధానంలో వీరిని అభివృద్ధి చేసేలా 15 శాతం వృద్ధి రేటుతో ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ చెప్పారు. పాడి పరిశ్రమలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు తమ వంతు కృషి చేయాలన్నారు. పశు సంవర్ధక శాఖ సిబ్బందికి నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు కలెక్టర్ మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పశు సంవర్ధక శాఖ జేడీ డా.బేబీ రాణి, పశు సంవర్ధక శాఖ మార్కాపురం, ఒంగోలు ఉపసంచాలకులు డాక్టర్ రాఘవయ్య, డాక్టర్ రమేష్ బాబు, జిల్లా బహుళార్ధ పశు వైద్యశాల ఉపసంచాలకులు డాక్టర్ జగత్ శ్రీనివాసులు, ఐఎస్‌డీపీ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట రామిరెడ్డి, త్రోవగుంట ఏడీ బనవ శంకర్, జిల్లా పశువైద్యాధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బత్తుల బాలకృష్ణ, కోశాధికారి డాక్టర్ చంద్ర శేఖర్, రిటైర్డ్ పశు వైద్యాధికారులు డాక్టర్ తాతారావు, డాక్టర్ ఏసురత్నం, డాక్టర్ సోమయ్యతో పాటు వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచ వెటర్నరీ డే కార్యక్రమంలో కలెక్టర్ -
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
కనిగిరిరూరల్: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. స్థానిక టుబాకో బోర్డులో జరుగుతున్న వేలం కేంద్రాన్ని శనివారం వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి వెళ్లి ఆయన పరిశీలించారు. బయ్యర్లు, కంపెనీ ప్రతినిధులు, బోర్డు అధికారులతో పొగాకు రైతుల సమస్యలపై దద్దాల మాట్లాడారు. పొగాకుకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నామని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు దద్దాల నారాయణ వద్ద వాపోయారు. గిట్టుబాటు ధర కోసం పదే పదే బేళ్లను పొగాకు బోర్డు వద్దకు తీసుకుని రావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. అనంతరం దద్దాల నారాయణ యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాల పంటలకు మంచి గిట్టుబాటు ధరలు ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మార్క్‌ఫెడ్ అధికారులతో, టుబాకో బోర్డు ఉన్నతాధికారులతో మాట్లాడి పొగాకు రైతులకు లాభదాయక ధరలు కల్పించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కేజీ పొగాకు ధర రూ.360 గరిష్టం, కనిష్టం కేజీ ధర రూ.230 పలికిందని వివరించారు. నేటి కూటమి సర్కార్‌లో గరిష్ట ధర కనీసం రూ.280, కనిష్ట ధర కేజీ రూ.220కు మించడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సూచనల మేరకు పొగాకు రైతులకు న్యాయం జరిగేంత వరకు, గిట్టుబాటు ధర కల్పించేంత వరకు దశల వారీ ఆందోళనలు చేపడతామని నారాయణ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతంగుంట్ల సాల్మన్ రాజు, మాజీ ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, పోలక సిద్దారెడ్డి, ఆవుల భాస్కర్‌రెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, డాక్టర్ ఎస్కే నాయబ్ రసూల్, వైస్ చైర్మన్ ఆర్ మాణిక్యరావు, ఎస్కే రహీం, జీ బొర్రారెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తమ్మినేని సుజాత, అయిమోల్లా నాగమణి, వాకుమళ్ల రాజశేఖరరెడ్డి, కాస్తాల బాలాజీ, పోతిరెడ్డి రాజశేఖరరెడ్డి, తూము వెంకట కృష్ణారెడ్డి, నాగేంద్రారెడ్డి, ఆవుల తిరుపతిరెడ్డి, యర్రబల్లి దేవరాజ్, ఖాశింసా, గూడూరి అనీల్ కుమార్, షంషీర్, పరిమి వెంకట్రావ్, ప్రసాద్‌రెడ్డి, ఉమా శంకర్‌రెడ్డి, పలుకూరి భాస్కర్, చింతంగుంట్ల కిషోర్, ఎస్ వెంకటేశ్వర్లు చౌదరి, షకీలా, భారతీ తదితరులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ -
సూత్రధారులు మిగిలారు..
పాత్రధారులు ఓకే..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. గత మంగళవారం హత్య జరిగినప్పటి నుంచి అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. తొలుత లిక్కర్ మాఫియా నేపథ్యంలో హత్య జరిగిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత బియ్యం తగాదాల గురించి చర్చకు వచ్చింది. ఈ లోపు భూ వివాదాలు తెరమీదకు వచ్చాయి. రామాయపట్నం భూములని, వైజాగ్‌లోని రియల్ మాఫియా తగాదాలని, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో భూ వివాదాలని రకరకాలుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా హంతకులు స్థానికులు కాదని, బీహారీలని సైతం అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలుత పోలీసులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేశారు. మొత్తం 12 బృందాలు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు సైతం వెళ్లాయి. వీరయ్య చౌదరితో వ్యక్తిగత విభేదాలున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. రైస్ వ్యాపారులతో పాటుగా లిక్కర్, రియల్ వ్యాపారులను అనేక మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. హత్య జరిగిన తరువాత మూడు రోజుల పాటు పురోగతి కనిపించలేదు. ఎలాంటి కీలక ఆధారాలు లభ్యం కాలేదు. చీమకుర్తి దగ్గర ఎప్పుడైతే నిందితులు ఉపయోగించిన స్కూటీ దొరికిందో ఒక్కసారిగా విచారణ వేగం పుంజుకుంది. హత్య కేసులో అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ యువనేతను కీలక అనుమానితుడిగా భావించి విచారణ చేస్తున్నారు. అలాగే అమ్మనబ్రోలుకు చెందిన వ్యాపారి పాత్రపై కూడా ఆధారాలను సేకరిస్తున్నారు. ఇందు కోసం ఒక బృందం హైదరాబాద్‌కు వెళ్లినట్టు తెలిసింది. అలాగే సంతనూతలపాడు టీడీపీ వాట్సప్ గ్రూప్‌లో వీరయ్య చౌదరిని ఉద్దేసించి పెట్టిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రెండో వాహనం కూడా స్వాధీనం.. వీరయ్య హత్య కేసులో నిందితులు ఉపయోగించిన మోటారు బైకును సంతనూతలపాడులో శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మోటారు బైకు యజమాని ఎవరు, ఎక్కడి వ్యక్తి అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. శుక్రవారం చీమకుర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక దాబా వద్ద స్కూటీని స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. దీంతో హత్య కేసులోని రెండు వాహనాలు దొరికినట్టేనని చెప్పవచ్చు. స్కూటీ దొరికిన తరువాత విచారణ ఊపందుకున్నట్లే, మోటారు బైకును స్వాధీనం చేసుకున్న తరువాత మిగిలిన నిందితులంతా ఎక్కడివారనేది తేలినట్లు సమాచారం. హంతకులు నలుగురూ జిల్లా వారే... హత్యలో మొత్తం నలుగురు పాల్గొన్నట్లు పోలీసులు మొదట్నుంచి చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆ నలుగురు ఎవరనే దాని మీద రకరకాల చర్చ జరిగింది. భారీ మొత్తంలో సుపారీ ఇచ్చి హత్య చేయించారని ప్రచారం సాగింది. పొన్నూరు నుంచి కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించారు. చివరికి తేలిందేమిటంటే హంతకులంతా జిల్లాకు చెందిన వారేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నగరంలోని కొప్పోలు ప్రాంతానికి చెందిన వ్యక్తి హత్యలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. స్వయంగా అతడు హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడితో పాటు మిగిలిన ముగ్గురు కూడా జిల్లాకు చెందిన వారేనని సమాచారం. వీరంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరికి సంబంధించిన మొబైల్ ఫోన్లు స్విచాఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు రాత్రే వీరు పరారయ్యారు. చీమకుర్తిలోని జాతీయ రహదారిపై పోలీసుల హడావుడి కనిపించడంతో దానికి కొద్ది సమీపంలోనే ఒక దాబా వద్ద నిందితులు స్కూటీని నిలిపివేసి కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కి పొదిలి వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డయింది. ఇద్దరు పొదిలి వైపు వెళ్లినట్లు గుర్తించారు. మిగతా ఇద్దరు ఎటు వెళ్లారన్న దాని మీద స్పష్టమైన సమాచారం లేదని తెలుస్తోంది. వైజాగ్ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నా హైదరాబాద్, కర్నూలు వైపు వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నలుగురు దొరికితే వారి వెనక ఉన్న సూత్రధారుల గుట్టు రట్టవుద్దని పోలీసులు భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో పోలీసుల గాలింపు... వీరయ్య చౌదరి కేసులో ఒంగోలు పోలీసులు బృందాలుగా విడిపోయి విస్తృతంగా గాలిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లిన బృందాలు సాంకేతిక సమాచారాన్ని వినియోగించుకొని వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం. ఈ హత్యలో పాల్గొన్న కీలక నిందితుని తల్లిదండ్రులను, భార్యను పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించారు. వారితో నిందితుడు టచ్‌లో ఉన్నట్లు ఏమైనా ఆధారం దొరుకుతుందేమోనని ప్రయత్నం చేశారు. వారి నుంచి ఎలాంటి క్లూ లభించకపోవడంతో వారిని వదిలిపెట్టినట్లు సమాచారం. నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు: నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లతో పాటు షాపింగ్ మాళ్లు, వ్యాపార వాణిజ్య భవనాలను పూర్తిగా తనిఖీలు చేశారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, హోటళ్లు, లాడ్జీలను ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ తనిఖీలలో బాంబు స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ పాల్గొనడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. హంతకులు నలుగురూ జిల్లా వాసులే.. వారి కోసం విస్తృతంగా గాలింపు స్విచ్ఛాఫ్‌లో నిందితుల ఫోన్లు వారి బంధువులను సైతం విచారిస్తున్న పోలీసులు సంతనూతలపాడు వద్ద రెండో వాహనం స్వాధీనం శనివారం బైక్‌పై ఎస్పీ తనిఖీలుబైకు మీద ఎస్పీ గాలింపు చర్యలు: వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా మోటారు బైకు మీద తిరుగుతూ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నిందితులు తలదాచుకునేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో కూడా తిరిగారు. నిందితులను పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే ఎలాంటి సమాచారం లభించినా పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. -
రహదారులు రక్తసిక్తం
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి ఏడుగురికి గాయాలుకారు అదుపుతప్పి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అర్థవీడు మండలం చర్లోదొనకొండకు చెందిన చందా వెంకట రవీంద్రారెడ్డి (39) చెన్త్నెలో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ తిరుపతిలో స్థిరపడ్డాడు. భార్య లక్ష్మి, కుమార్తె అక్షరతో కలిసి కారులో తిరుపతి నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. పెంచికలపాడు వద్ద గేదెను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి హైవే కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట రవీంద్రారెడ్డి తీవ్రంగా గాయపడి స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్సై రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కారులో నుంచి రవీంద్రారెడ్డిని బయటకు తీశారు. కారు నుజ్జునుజ్జు అయింది. క్షతగాత్రులను 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మలేరియా నియంత్రణ అందరి బాధ్యత
ఒంగోలు సబర్బన్: మలేరియా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రకాశం భవన్ వద్ద అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్ నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతపై అందరూ శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ సౌకర్యాలు, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. ర్యాలీలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మధుసూదన్‌రావు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా -
సమీక్షకు కథలు చెప్పడానికి వస్తారా.?
ఒంగోలు సబర్బన్: మీరు చెప్పే కథలు వినడం కోసం ఇక్కడకు పిలిపించానా.. సమీక్షకు కథలు చెప్పడానికి వస్తారా.? అంటూ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో స్థానిక ప్రకాశం భవనంలో శుక్రవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య సమస్యల పరిష్కారంపై ఎందుకు దృష్టి సారించడంలేదని మండిపడ్డారు. పనిచేయడం కోసమే ప్రభుత్వం మీకు జీతాలిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ మందలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదంటూ హెచ్చరించారు. చెత్త తరలించేందుకు రిక్షాలు, క్లాప్ మిత్రలు, తాగునీటి వాటర్ ట్యాంకులు శుభ్రం చేయడం, క్లోరినేషన్, రోడ్ల వెంట చెత్త కుప్పల తొలగింపు తదితర అంశాలపై నిర్వహించిన సమీక్షలో అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దారవీడు పీఈఓ, వై.పాలెం ఎంపీడీఓకు షోకాజ్ నోటీసులు... సమావేశానికి పెద్దారవీడు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాజరు కాకపోవడంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. తన అధ్యక్షతన సమావేశం ఉన్నప్పటికీ పెద్దారవీడు అధికారి ఎందుకు రాలేదని డీపీఓ జి.వెంకట నాయుడుని ప్రశ్నించారు. తనకు కూడా ఎలాంటి సమాచారం లేదని ఆయన సమాధానమిచ్చారు. దీంతో పెద్దారవీడు ఈఓకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. యర్రగొండపాలెం ఈఓ కూడా రాకపోవడంపై కలెక్టర్ ప్రశ్నించారు. స్థానికంగా వేరే కార్యక్రమం ఉన్నందున తాను అనుమతిచ్చానని యర్రగొండపాలెం ఎంపీడీఓ చెప్పారు. దాంతో ఎంపీడీఓపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఓలు, ఎంపీడీఓలతో తాను సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే.. కనీసం తన దృష్టికి తీసుకురాకుండా ఈఓ గైర్హాజరుకు ఎలా అనుమతిస్తారంటూ ఎంపీడీఓను నిలదీశారు. యర్రగొండపాలెం ఎంపీడీఓకు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జెడ్పీ సీఈఓను కలెక్టర్ ఆదేశించారు. చెత్త తరలించడానికి రిక్షాల సమస్య ఉందని, నెలకు రూ.6000 జీతానికి క్లాప్ మిత్రలు పనిచేయడం లేదని పలువురు ఈఓలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రిక్షాల సమస్య పరిష్కారానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారా, ఉన్నతాధికారులకు తెలియజేశారా, అలాంటివేమైనా ఉంటే చెప్పండి, వాటి గురించి అలోచించకుండా ఇక్కడకు వచ్చి ఈ కథలు ఎందుకు చెబుతున్నారంటూ కలెక్టర్ మండిపడ్డారు. దీనికోసమా మిమ్మల్ని ఇక్కడకు పిలిపించింది, క్షేత్రస్థాయిలో మీరు ఉండి ఏం పనిచేస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాప్ మిత్రలకు ఇచ్చే వేతనాలను స్థానిక వనరుల నుంచే సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలన్నారు. తమ పరిధిలోని సమస్యలపై ఎంపీడీఓలు, డీఎల్పీఓలు దృష్టి పెట్టాలని ఆమె ఆదేశించారు. సమీక్ష సమావేశం అజెండా ముందుగానే చెప్పినప్పటికీ సరిగ్గా సన్నద్ధం కాకుండా మొక్కుబడి సమాధానాలు చెప్పడానికి వచ్చారా అని కలెక్టర్ ప్రశ్నించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇండికేటర్స్‌లో జిల్లా స్థానం పేలవంగా ఉంటే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వచ్చే శుక్రవారం నాటికి ఆయా ఇండికేటర్స్‌లో గణనీయమైన పురోగతి సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, పంచాయతీల ఈఓలు పాల్గొన్నారు. పారిశుధ్య సమస్యలపై ఎందుకు దృష్టి సారించడం లేదు పలువురు ఈఓలు, ఎంపీడీఓలపై కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆగ్రహం షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశం -
కారు ఢీకొని యువకుడు మృతి
యర్రగొండపాలెం: మోటారు సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి సమీపంలో గురువారం రాత్రి 12గంటల సమయంలో చోటుచేసుకుంది. యర్రగొండపాలేనికి చెందిన టి.దిలీప్(25) బైక్‌పై కుంట వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బోయలపల్లి డంపింగ్ యార్డు వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన దిలీప్‌కు స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.చౌడయ్య తెలిపారు. బైకులు ఢీకొని ఐదుగురికి గాయాలు యర్రగొండపాలెం: ఎదురెదురుగా వస్తున్న మోటారుసైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం యర్రగొండపాలెం మండలంలోని మురారిపల్లె చెరువుకట్ట వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. పుల్లలచెరువు మండలంలోని పిడికిటివానిపల్లె గ్రామానికి చెందిన ఏడుకొండలు, చెన్నయ్య, వెంకటేశ్వర్లు వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై యర్రగొండపాలెం వస్తున్నారు. అదే మండలంలోని నాయుడుపాలెం గ్రామానికి చెందిన అంజయ్య, ఏడుకొండలు యర్రగొండపాలెంలో తమ పనులు ముగించుకొని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. మురారిపల్లె చెరువుకట్ట వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుకొండలు, చెన్నయ్యకు తీవ్రంగా, మిగిలిన ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. -
లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి
సింగరాయకొండ: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతిచెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై మండలంలోని శానంపూడి జంక్షన్ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శానంపూడి జంక్షన్ వద్ద నలభై ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ రోడ్డు దాటుతుండగా, కావలి నుంచి ఒంగోలువైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఆమె తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని 108 అంబులెన్స్‌లో కందుకూరు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. -
పరిశ్రమలను ప్రోత్సహించాలి ●
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులు, ఏపీఐఐసీ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పాలసీ–2015, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), పీఎం విశ్వకర్మ యోజన, ఆంధ్రప్రదేశ్‌లో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పనితీరు (ఆర్‌ఏఎంపీ) పథకం కింద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్–కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఈఎస్డీపీలు), ఉద్యమ్ వర్క్‌షాప్, ఎంఎస్ఎంఈ సర్వే, ఇన్సెంటివ్ రిలీజ్, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థల సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ఉపాధి అవకాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కుకు అవసరమైన స్థల సేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. సమయం ఇచ్చి పనిచేయించుకోవాలిఒంగోలు సబర్బన్: రెవెన్యూ అధికారులకు సమయం ఇచ్చి పనిచేయించుకోవాలని, పారదర్శకంగా పనిచేయటానికి తహశీల్దార్లు సిద్ధంగా ఉన్నారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నెల్లూరు బస్టాండ్ సెంటర్లో ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా తహశీల్దార్లతో సమావేశంలో బొప్పరాజు ముఖ్య అతిథిగా మాట్లాడారు. తహశీల్దార్లు కష్టపడి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకోసం రాస్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తూ తహశీల్దార్లతో మమేకం అవుతున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తున్నామని చెప్పారు. తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలంటే కార్యాలయాలకు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలన్నారు. కొత్త కొత్త చట్టాలు చేస్తున్నారని, అందుకు అనుగుణంగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు, కార్యదర్శి వాసుదేవరావు, ఒంగోలు కార్యాలయ కార్యదర్శి ఊతకోలు శ్రీనివాస రావుతో పాటు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. -
సీఎం చంద్రబాబే న్యాయం చేయాలి
● టీడీపీ నేత భూకబ్జాపై బాధితుడి మొర ● సోషల్ మీడియాలో వీడియో వైరల్ మార్కాపురం: మార్కాపురం పట్టణ శివార్లలో ఉన్న తన భూమిని టీడీపీ నాయకుడు, మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి కబ్జా చేశాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని పట్టణంలోని తూర్పువీధికి చెందిన గొలమారి నారాయణరెడ్డి సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేశాడు. సర్వే నంబరు 1132/3 లో ఉన్న తన ఆస్తిని జీవీ సాయికుమార్‌రెడ్డి దగ్గర కొనుగోలుచేసి అనీల్కుమార్రెడ్డికి అమ్మాడన్నారు. అయితే ఈ ఆస్తి తన పేరుపై ఉందని, డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పినా వినకుండా తాము అధికారంలో ఉన్నామని చెబుతూ తమను బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రాణహాని జరిగితే వారే బాధ్యులని, మిగిలిన ఆస్తిని కూడా కబ్జా చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్, సబ్‌కలెక్టర్, తహశీల్దార్‌ను కోరుతున్నట్టు తెలిపారు. ఈ విషయమై పట్టణపోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నారాయణరెడ్డి కుమారుడు శివారెడ్డి తెలిపారు. తమ ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. టీడీపీ నేతల భూకబ్జాలపై ప్రజల నుంచి తీవ్రస్ధాయిలో నిరసన వ్యక్తమవుతోంది. వృద్ధురాలి పర్సు చోరీ గిద్దలూరు రూరల్: పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఓ వృద్ధురాలి నుంచి రూ.39 వేలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. పట్టణంలోని సీతారాములవారి ఆలయం వీధిలో నివాసం ఉంటున్న బత్తుల రంగలక్ష్మమ్మ అన్నా క్యాంటీన్ వద్ద భోజనం చేసేందుకు వెళ్లింది. భోజనం అనంతరం చేతిని శుభ్రం చేసుకునే క్రమంలో ఆమె వద్ద ఉన్న నగదుతో కూడిన పర్సును పక్కన పెట్టింది. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పర్సును అపహరించారు. -
ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి
● ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్ ఒంగోలు సిటీ: మూతపడిన ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వెంకట్రావు, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యర్రగొండపాలెం డీఎంబీసీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలోని 8 మంది, కొమరోలు నల్లగుంట ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఒకరు, నల్లగుంట ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు, గిద్దలూరు వివేకానంద ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు, గిద్దలూరు ఎస్పీజీ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఒకరు, కంభం శ్రీనివాస ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు, దొనకొండ ఇందిరా గాంధీ ఓరియంటల్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు, ఒంగోలు సమావేశం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఒకరు, ఒంగోలు హిందూ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఒకరు, మార్కాపురం శారద ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు, మార్కాపురం ఏబీఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు, ఒంగోలు జీ వీఎస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో 8 మంది, అర్ధవీడు ఎస్‌ఎస్‌ఆర్‌ఎం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు, అద్దంకి వేలమూరు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఒకరు, పమిడిపాడు ఆది ఆంధ్ర ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఒకరు చొప్పున మొత్తం 49 మంది ఉపాధ్యాయులు మూతపడిన ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్నారని వారికి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. వీటితో పాటు అదనంగా ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న ఎయిడెడ్ పాఠశాలల్లోని మిగులు ఉపాధ్యాయులు 205 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలోకి సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు జూన్‌లో సామూహిక గృహ ప్రవేశాలు ● జిల్లాలో 8,839 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి ● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో 3 లక్షల గృహాలకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన 8,839 ఇళ్ల నిర్మాణాలు మే 31 వ తేదీ నాటికి పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని మునిసిపల్ కమిషనర్లను, ఎంపీడీఓలను, గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు కేవలం 2,824 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేసి 32 శాతం మేర లక్ష్యాన్ని సాధించారన్నారు. ఇంకా 6,015 ఇళ్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు అందిస్తున్న 90 రోజుల పని దినాలు ప్రతి లబ్ధిదారునికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, మెప్మా పీడీ శ్రీహరి, ఒంగోలు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకువైద్య పరీక్షలు ఒంగోలు సిటీ: మే నెలలో జరగబోయే ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ వినియోగించుకోవాలనుకునే ఉపాధ్యాయులకు ఒంగోలు జీజీహెచ్‌లో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎ.కిరణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు 230 మంది ఉపాధ్యాయులు, రెండోరోజు 116 మంది ఉపాధ్యాయులు హాజరైనట్లు తెలిపారు. 26వ తేదీ చివరి రోజున మిగిలిపోయిన ఉపాధ్యాయులందరూ తప్పక హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. వైద్య పరీక్షలు పూర్తయిన ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు ఈ నెల 29 వ తేదీ నుంచి ఒంగోలు రిమ్స్‌లో వ్యక్తిగతంగా వచ్చి పొందాల్సిందిగా తెలిపారు. ఈ వైద్య పరీక్షలను ఒంగోలు డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, ఎంఈఓ కిషోర్‌బాబు పర్యవేక్షించినట్లు చెప్పారు. -
ప్రభుత్వం దృష్టి సారించాలి..
ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్లుగా తగ్గించేస్తున్నారు. ఇంపోర్టెడ్ మినరల్స్ ధరలు తగ్గాయి. దానికి తోడు సోయా ధరలు కూడా తగ్గాయి. అందుకు అనుగుణంగా రొయ్యల ధరలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామన్న హామీని టీడీపీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాలి. – దుగ్గినేని గోపీనాథ్, ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు -
ఆధిపత్యమా..ఆర్థిక లావాదేవీలా..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసు కీలక పురోగతి సాధించింది. దారుణ హత్య జరిగిన నాటి నుంచి వివిధ రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రధానంగా లిక్కర్, భూ, ఆర్థిక, రైస్ మాఫియా వివాదాలే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోలీసులు ఆ దిశగా ముమ్మర దర్యాప్తు చేశారు. అయితే శుక్రవారం చీమకుర్తి వద్ద హత్యకు వినియోగించిన స్కూటీ లభ్యం కావడంతో కేసు పురోగతి సాధించింది. దాదాపు కేసులో కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. హత్యకు సంబంధించి అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ యువనేత ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఆధిపత్య పోరు నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఆ దిశగా వివరాలను సైతం రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి టీడీపీ నేతల ప్రమేయం ఉందని తేలడంతో ఈ కేసు ఎటు దారి తీస్తుందోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా ఎలాంటి క్లూ లభించని పోలీసులు ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నారు. టీడీపీ నాయకుని హత్య జరిగిన సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి అనిత రాత్రికి రాత్రే ఒంగోలు వచ్చారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఇక్కడే గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అమ్మనబ్రోలు వచ్చి వీరయ్యకు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో వీరయ్య హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. 12కు పైగా బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎంత మంది అనుమానితులను విచారించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. విశాఖ, రామాయపట్నం, కావలి, బెంగళూరు, హైదరాబాద్ అంటూ అనేక ప్రాంతాల పేర్లు కూడా ప్రచారం జరిగింది. రకరకాల కథనాలు వచ్చాయి. ఈ కోణంలో జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా సుమారు 40 మంది వరకు అనుమానితులను తీసుకొచ్చి విచారణ చేశారు. అయినా పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. చివరికి ఘటనా స్థలాన్ని రెండోసారి కూడా ఎస్పీ ఏఆర్ దామోదర్ సందర్శించి మరోసారి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. 60 శాతం సీసీ కెమెరాలు..మలుపు తిప్పిన స్కూటీ.. ఈ హత్య కేసు పురోగతికి సంబంధించి 60 వాతం సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయని తెలుస్తోంది. మిగతా 40 శాతం చీమకుర్తి జాతీయ రహదారి పక్కన ఒక్క దాబా వద్ద హంతకులు వినియోగించినట్లు చెబుతున్న స్కూటీ దొరకడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టయింది. ముందుగా స్కూటీని పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. దాని మీద రక్తపు మరకలు ఉండటంతో పక్కనే ఉన్న వారిని విచారించారు. మూడు రోజులుగా ఆ స్కూటీ ఇక్కడ ఉన్నట్లు స్థానికులు చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు చీమకుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే రంగంలోకి దిగిన చీమకుర్తి పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్కూటీ మీద ఉన్న రక్తపు మరకలను వైద్య పరీక్షలు చేయించగా వీరయ్య చౌదరి రక్తంతో సరిపోయినట్లు తెలిసింది. దాంతో వెంటనే వాహన యజమాని కోసం ఆరా తీశారు. ఒంగోలు ఇస్లాంపేటలోని ఒక వ్యక్తి పేరు మీద వాహనం ఉన్నట్లు తెలుసుకొని అతడిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది. ఆ స్కూటీని అమ్మనబ్రోలుకు చెందిన వారికి విక్రయించానని చెప్పడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అయితే బండిని తన పేరు మీదే ఉందని చెప్పినట్లు తెలిసింది. దీంతో కథ వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలుకు చేరింది. ఆ గ్రామంలోనే టీడీపీ యువనేత ఈ హత్యకేసులో కీలకంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అతనిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఆధిపత్య కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వీరయ్య చౌదరి హత్య కేసు ఒక కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. హత్య జరిగిన రోజు నుంచే.... నిజానికి వీరయ్య చౌదరి హత్య జరిగిన రోజు రాత్రే అమ్మనబ్రోలుకు చెందిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల పాటు విచారించినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో వదిలిపెట్టినట్లు తెలిసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని, ఎప్పుడు పిలిచినా పోలీసు స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని చెప్పి పంపించినట్లు సమాచారం. ఇప్పుడు అతడే ప్రధాన నిందితుడని తెలిసి పోలీసులు విస్మయానికి గురయ్యారు. నిందితుడి స్వగ్రామం అమ్మనబ్రోలు అయినా ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో నివాసం ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అంజయ్య రోడ్డులో కార్యాలయం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. హత్యలో పాల్గొంది ఎక్కడి వారు.. వీరయ్య చౌదరి కేసులో మొత్తం నలుగురు నిందితులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అమ్మనబ్రోలుకు చెందిన ప్రధాన నిందితుడితో పాటుగా ఒంగోలుకు చెందిన మరొక వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. హత్యలో అతడు స్వయంగా పాల్గొన్నట్లు సమారం. అదేరోజు అతడు వైజాగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. వైజాగ్‌లో అతడిని పటు్ుట్కన్న పోలీసులు విమాన మార్గంలో విజయవాడకు తరలించి, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఒంగోలుకు తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి కూడా మరొక నిందితుడిని పోలీసులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. తెరపైకి కొత్త పేర్లు వీరయ్య చౌదరి హత్య కేసులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అమ్మనబ్రోలుకే చెందిన మరో వ్యక్తి సైతం ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా ఆయనకు, వీరయ్య చౌదరికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన ఆర్థిక మూలలను దెబ్బ తీసేందుకు వీరయ్య చౌదరి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రధాన నిందితుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. హత్య కేసులో పురోగతి కనిపించడంతో ఆ వివరాలను జిల్లా అధికారులు రాష్ట్ర హోం శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రెండు రోజుల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అమ్మనబ్రోలుకు వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమ్మనబ్రోలులో హై అలర్ట్ నాగులుప్పలపాడు: మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య నేపథ్యంలో గ్రామంలో హైఅలర్ట్ నెలకొంది. గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుని పేరు ఈ హత్య కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పోలీసులు కస్టడీలోనే ఉన్నట్లు తెలిసింది. వీరిరువురికి గ్రామంలో గతంలో వర్గపోరు ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ముదిరిపాకాన పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరే ఈ హత్యకు దారితీశాయా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుగానే పోలీసులు గ్రామంపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలు గ్రామంలో మొహరించాయి. ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం సాయంత్రం 6.40 ప్రాంతంలో గ్రామానికి వచ్చారు. టీడీపీ నేత కుటుంబ సభ్యులను విచారించారు. దాదాపు మూడు గంటల పాటు ఆయన గ్రామంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోనే ప్రతి ఒక్కరూ సహనంతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దన్నారు. చట్టప్రకారం నిందితులను పట్టుకుంటామన్నారు. ఎవరైనా క్షణికావేశంతో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వీరయ్య చౌదరి హత్య కేసును మలుపు తిప్పిన స్కూటీ అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ యువనేతే సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు పోలీసుల అదుపులో కీలక నిందితుడు అమ్మనబ్రోలులో హై అలర్ట్ ఈ హత్యలో టీడీపీ నేతల ప్రమేయం వెలుగు చూస్తుండడంతో ఆందోళనలో అధికార పార్టీ ముఖ్యనేతలు 60 శాతం సీసీ కెమెరాలు పట్టిస్తే.. మిగతా కేసును కొలిక్కి తెచ్చిన స్కూటీ కీలక ఆధారాలు లభ్యమవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు -
అలసత్వం వహిస్తే చర్యలు
ఒంగోలు సబర్బన్: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం డ్వామా అధికారులు, ఎంపీడీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేపట్టడానికి వేసవి అనుకూలం అయినందున పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలన్నారు. పనుల పురోగతిపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. లేబర్ మొబిలైజేషన్లో త్రిపురాంతకం, ముండ్లమూరు, తాళ్లూరు, హెచ్‌ఎంపాడు, గిద్దలూరు మండలాలు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయన్నారు. కూలీలకు రోజువారి సగటు వేతనం రూ.307 తగ్గకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పుల్లలచెరువు, పెద్డారవీడు, దోర్నాల, దొనకొండ, పామూరు, జరుగుమల్లి, పీసీపల్లి, తాళ్లూరు, వై పాలెం, అర్ధవీడు మండలాల్లో గత వారం కంటే ఈ వారం కూలీలకు రోజువారి సగటు వేతనం తగ్గిందని, ఈ మండలాల్లో సగటు వేతనం తగ్గడానికి కారణాలను కలెక్టర్ సంబంధిత ఎంపీడీఓలను, ఏపీఓలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన కారణాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల విధులపై కనీసం అవగాహన లేకుండా ఎలా పని చేస్తున్నారని నిలదీశారు. లక్ష్యం మేరకు పశువుల నీటి తొట్టెలు, ఫారం పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవసరమైన మేరకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బివై), జీవన జ్యోతి యోజన పథకాలను ఉపాధి హామీ కూలీలకు వర్తించేలా క్షేత్ర స్థాయిలో ఎంపీడీఓలు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో విధ్వంసక పాలన
● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పొన్నలూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దాడులు, కేసులతో విధ్వంసక పాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని సుంకిరెడ్డిపాలెంలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉత్సావాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఓట్లతో గెలిచిన తరువాత చెప్పిన వాగ్దానాలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలపై, సామాన్య ప్రజలపై దాడులు, కేసులు తప్పా అభివృద్ధి, సంక్షేమం శూన్యమన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, కూటమి పార్టీ నేతలకే రాష్ట్రంలో రక్షణ కరువైందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో దాడులు, కేసులు, అరాచకాలు, అవినీతి, ఊరూరా బెల్ట్ షాపుల తప్పా అన్ని వర్గాల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చంద్రబాబు చేస్తున్న అరాచక పాలనను ప్రజలు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, మేధావులు గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారన్నారు. మళ్లీ రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, సర్పంచ్ లెక్కల కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాచరణ కార్యదర్శి కాటా మాధవరావు, కొండపి నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచులు వరికూటి రామిరెడ్డి, వరికూటి బ్రహ్మారెడ్డి, లెక్కల వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వరికూట నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ఎనిమిరెడ్డి తిరుపాల్‌రెడ్డి, సర్పంచ్ మార్తాల వెంకటేశ్వరరెడ్డి, కాటా మల్లికార్జునరావు, దగ్గుమాటి శ్రీను, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా యువ ప్రకాశం ఒంగోలు సబర్బన్: విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఇంటర్న్ షిప్ కోసం జిల్లాలో ప్రత్యేకంగా యువ ప్రకాశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం యువ ప్రకాశం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇతర పథకాల గురించి అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ‘‘యువ ప్రకాశం’’ అనే కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసేందుకు వివిధ అంశాల్లో 30 రోజుల ఇంటర్న్ షిప్‌ను చేసేందుకు అవకాశం కల్పించించామని చెప్పారు. వాటర్ మేనేజ్మెంట్, హెల్త్, పంచాయతీ రాజ్, ఉపాధి కల్పనా అవకాశాలు, మహిళా, శిశు ఆరోగ్య కార్యక్రమాలు, రోడ్లు అండ్ భవనాల నిర్మాణ రీతులు, నగర అభివృద్ధి కార్యక్రమాలలో శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 14 నుంచి జూన్ 13 వరకు 30 రోజుల పాటు నిర్వహిస్తారన్నారు. ఆసక్తి కలిగిన వారు తమ పేర్లను మే 8 వ తేదీలోగా ఈ లింక్ ద్వారా హెచ్‌టీటీపీ//టీఐఎన్వై.సీసీ/జీఎస్ఐపీ కింద తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ ఇంటర్న్ షిప్ నోడల్ అధికారి, ఒంగోలు స్టెప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.శ్రీమన్నారాయణ తెలిపారు. ఇతర వివరాల కోసం కార్యాలయపు పని వేళల్లో స్వయంగా కానీ, ఫోన్ ద్వారా గానీ 9182891095, 9885544154 సంప్రదించవచ్చన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఇంటర్న్ షిప్ సౌకర్యం కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా -
సిండికేట్ల రొయ్యో!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్‌ను ఎక్స్‌పోర్టు చేస్తున్న ప్రాసెసింగ్ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్లుగా తగ్గించేస్తున్నారు. ఫీడు ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఆక్వా సాగు చేస్తున్న రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామన్న హామీని టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఎగ్గొట్టింది. అన్నీ తలచుకొని ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. ట్రంప్ సుంకాల పేరు చెప్పి ఎగుమతిదారులు అడ్డగోలుగా ధరలు తగ్గించేయడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 14 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. అందులో 12 వేల ఎకరాల్లో టైగర్ రొయ్య, రెండు వేల ఎకరాల్లో వనామీ రకాన్ని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి సాగు చేపట్టారు. నెల రోజుల నుంచి సాగుతో ఆక్వా రైతులు ముమ్మరంగా ఉన్నారు. మంచి ధరలు ఉండడంతో దాదాపు 30 టన్నుల సీడును తీసుకొచ్చి సాగు ప్రారంభించారు. ప్రారంభంలో మంచి ధరలు ఉన్నా సాగు ప్రారంభమయ్యాక రేట్లు పతనమయ్యాయి. ఇక మార్కెట్లో ఫీడు ధరలు తగ్గినా కంపెనీలు మాత్రం తగ్గించకపోవడం, సోయా ధరలు భారీగా తగ్గినా కేవలం రూ.3 లు తగ్గించడంతో రైతుకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. 20 రోజుల్లో భారీగా పడిపోయిన ధరలు: టైగర్ రొయ్యల ధరలు 20 రోజుల్లో భారీగా పడిపోయాయి. సాగు ప్రారంభానికి ముందు వరకు 20 కౌంట్ టైగర్ రొయ్యలు కిలో రూ.680 వరకు ధర పలికింది. ట్రంప్ టారిఫ్, వ్యాపారులు సిండికేట్ కావడంతో ఒక్క సారిగా కిలోకు రూ.100 తగ్గిపోయింది. ప్రస్తుతానికి ట్రంప్ టారిఫ్ సుంకం లేకపోయినా సిండికేట్ వ్యాపారులు ఏమాత్రం పెంచటం లేదు. దాంతో ఒక్కో రైతు లక్షల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెరిగిన లీజు, ఫీడ్, విద్యుత్ చార్జీలతో 100 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.220– రూ.250 వరకు ఖర్చవుతుంది. అదే 50 కౌంట్ కు చేరాలంటే కిలోకు రూ.330– రూ.350 వరకు, గరిష్టంగా 30 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.450– రూ.490 ఖర్చు అవుతోంది. మరి 20 కౌంటుకు రావాలంటే కిలోకు రూ.500లకు పైనే వ్యయం అవుతుంది. ఎకరా సాగుకు సీడ్, సాగుకు అవసరమైన హెల్త్‌కేర్ మినరల్స్, కరెంటు చార్జీలు, కూలీ ఖర్చులు అన్నీ కలుపుకుని సుమారు రూ.7 లక్షల వరకూ ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతుకు కష్టకాలమనే చెప్పాలి. రానున్న రోజుల్లో ధరలు మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. యూనిట్ విద్యుత్ రూ.1.50కే హామీ గాలికి.. ఆక్వాజోన్, నాన్ ఆక్వా జోన్ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్ విద్యుత్ రూ.1.50 కే సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర ఆక్వాకు సంబంధించిన పరికరాలపై అందిస్తామని కూడా నమ్మబలికారు. ఆ హామీని గాలికి వదిలేయటంతో రైతులు లక్షలాది రూపాయలు కరెంటు బిల్లుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆక్వా రైతుపై భారం మోయలేనంతగా పడుతోంది. ఆక్వాకు అండగా వైఎస్ జగన్... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ ఆక్వా రైతులకు అండగా నిలిచింది. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదుకుంది. కరోనా సమయంలో ధరలేక 100 కౌంట్ రూ.150 – రూ.180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. సంక్షోభ సమయంలో సీనియర్ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సమీక్షించి తగ్గకుండా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చులు భారం రైతులపై పడకుండా అడ్డుకుందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ధరలు తగ్గించేస్తూ ఆక్వా రైతులను ముంచేస్తున్న సిండికేట్లు 20 రోజుల్లో భారీగా పడిపోయిన ధరలు సాగుకు ముందు 20 కౌంట్ టైగర్ రొయ్య ధర రూ.680 నేడు రూ.580కి పతనం గుదిబండగా మారుతున్న కరెంటు చార్జీలు అందుబాటులోకి రాని ఫీడు, మినరల్ ధరలు ఆక్వా రైతును గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం జిల్లాలో 12 వేల ఎకరాల్లో టైగర్ రొయ్యల సాగు -
బెల్టుషాపులకు పితామహుడు చంద్రబాబు
ఒంగోలు టౌన్: ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ముఖ్యమంతి చంద్రబాబు నెలకు ఒకరిపై తప్పుడు కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు విమర్శించారు. చీప్ లిక్కర్, బెల్ట్ షాపులకు ఆద్యుడు చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులపై కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సారా వ్యతిరేక ఉద్యమం చేసిన ఎన్టీఆర్ వారసుడిగా వచ్చిన చంద్రబాబు మద్యం వ్యాపారులతో కుమ్మకై ్క మద్యం వ్యాపారానికి తలుపులు బార్లా తెరిచారని చెప్పారు. మద్య నిషేధం సమయంలో లిక్కర్ అవసరమని అనుకూల పత్రికలలో వార్తలు రాయించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. తెలుగుదేశం పాలనలో ఇంటింటికీ సీసా ఇచ్చి, ఎన్నికల సమయంలో పీకలదాకా తాగించి, తాగనోడు మనిషే కాదన్నట్లు మద్యం గురించి మాట్లాడారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పదవిలోకి రాకముందు గ్రామాల్లో ఎక్కడో దూరంగా సారా లభించేదని, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాతే ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులను పెట్టి మద్యం విక్రయించడం మొదలు పెట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలోని 30 శాతం షాపులను తీసేయించిందని, 4380 షాపులుండగా వాటిని 2934 షాపులకు తగ్గించిందని తెలిపారు. ఒక సమయం ప్రకారం మద్యం విక్రయాలు జరపారని, ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో కనీసం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని, చంద్రబాబు తీసుకొచ్చిన బ్రాండ్లనే విక్రయించారని తెలిపారు. మద్యం దందా సాగించే సిండికేట్ల వ్యవస్థకు పూర్తిగా చెక్ పెట్టారని, మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్ట్ షాపులను, 4380 పర్మిట్ రూంలను రద్దు చేశారని వివరించారు. మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు వస్తాయా, ప్రభుత్వం ద్వారా అమ్మితే లంచాలు వస్తాయో చెప్పాలన్నారు. రాజ్ కసిరెడ్డిని భయపెట్టి, లొంగదీసుకొని తప్పుడు కేసులు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో ఎమ్మెల్యేలకు షాపుల్లో వాటాలు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించిన ఆయన, ప్రస్తుతం క్వార్టర్ మీద రూ.10, పుల్ బాటిల్‌పై రూ.40 అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ఇదంతా ఎవరి జేబులకు చేరుతుందని నిలదీశారు. ఎవరైనా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తారని, విద్యార్థుల చదువులకు సహకరిస్తారని, నిరుపేదలకు వైద్యం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటారని చంద్రబాబు మాత్రం మద్యం వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడానికి ధరలను తగ్గిస్తానని చెప్పడం ఆయన వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పాలనా పరంగా అన్నీ విధాలుగా విఫలమైన ఆయన ప్రజల దృష్టిని మరల్చడానికి మద్యం కేసుల కుట్రలకు తెరదీశారని, దీన్ని ప్రజలు కూడా హర్షించరని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో ఊహాగానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో పార్టీ సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు పాలడుగు రాజీవ్ దేవా, నియోజకవర్గ విభాగం విద్యార్థి విభాగం అధ్యక్షుడు వేముల శ్రీకాంత్, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పులుసు సురేష్, సయ్యద్ ఖాదర్, తన్నీరు సాయి కృష్ణ, షేక్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. సారా వ్యతిరేక ఉద్యమాన్ని ఎన్టీఆర్ ప్రోత్సహిస్తే.. చంద్రబాబు రాగానే చీప్ లిక్కర్, బెల్ట్‌షాపులను ప్రవేశపెట్టడం నిజం కాదా ? హామీలు నెరవేర్చలేక నెలకో కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ తప్పుడు కేసులతో కుట్రలు చేస్తున్న కూటమి పాలకులు జగనన్న పాలనలో మద్య నిషేధం దిశగా పరిపాలన కూటమి పాలనతో బలవంతంగా మద్యం తాగిస్తున్న వైనం -
భార్గవిని అభినందించిన కలెక్టర్
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షల్లో 595 మార్కులు సాధించిన పుట్టా భార్గవిని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారులు భార్గవిని గురువారం కలెక్టర్ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ శాలువాతో భార్గవిని ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. టంగుటూరు మండలం ఆలకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భార్గవి 10వ తరగతి చదివింది. భార్గవి రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించగా, జిల్లాలో ప్రథమ ర్యాంకు సాధించినందుకు అందరూ ప్రశంసించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారి ఏ. కిరణ్ కుమార్‌ను ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయుని, ఉపాధ్యాయుడు కాకా వెంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యాయులు దామచర్ల శ్రీధర్, ముప్పా సురేష్, వెంకట్‌లను అభినందించారు. కార్యక్రమంలో ఒంగోలు ఉప విద్యాశాఖాదికారి ఏ.చంద్రమౌళి, టంగుటూరు ఎంఈఓ–2 తన్నీరు బాలాజీ ఉన్నారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 595 మార్కులు రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు, జిల్లాలో ప్రథమ ర్యాంకు -
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
జరుగుమల్లి(సింగరాయకొండ): జరుగుమల్లి మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన జోగులపర్తి వెంకట లక్ష్మి నిహారిక కామేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ 584 మార్కులు సాధించింది. చిన్నప్పటి నుంచి నిహారికకు చదవంటే ఎంతో ఇష్టం. తండ్రి సుబ్బారావు గ్రామంలో చిన్న రైస్‌మిల్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న నిహారిక చదువులో ఎప్పుడూ ముందుండేది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ఇచ్చే రూ.15 వేల అమ్మఒడి నిహారికకు ఎంతో ఉపయోగపడింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్బీ ప్యానెళ్ల ద్వారా విద్యాభ్యాసం ఎంతో ఉపకరించిందంటుంది నిహారిక. -
నల్లబర్లీకి గిట్టుబాటు ధర కల్పించాలి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో నల్ల బర్లీ పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని.. క్వింటాకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. గురువారం మల్లయ్య లింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లబర్లీ పొగాకు రైతుల పట్ల వ్యాపారులు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దోపిడికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గత ఏడాది సరాసరిన రూ.15 వేలకు కొనుగోలు చేస్తే, ఈ ఏడాది కేవలం రూ.3 నుంచి రూ.4 వేలకు మాత్రమే కొంటున్నారని మండిపడ్డారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే రైతులు అధికంగా పొగాకు పండించారని, అంతర్జాతీయంగా బర్లీ పొగాకు డిమాండ్ లేదని మాయమాటలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక విస్తీర్ణంలో సాగు చేయమన్నది కార్పొరేట్ శక్తుల తొత్తులే కదా అని నిలదీశారు. సాకులు చెప్తున్న కంపెనీలు.. నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాజమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బర్లీ పొగాకు సాగు చేసింది అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన కౌలు రైతులేనని తెలిపారు. గతేడాది వచ్చిన ధరలను చూసి ఎక్కువ భాగం పేద రైతులు వ్యవసాయంలోకి వచ్చారని, బంగారం తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేశారని చెప్పారు. నాడు ఏ కంపెనీలైతే అధిక విస్తీర్ణంలో పంట పండిచేందుకు ప్రోత్సహించారో ఇప్పుడదే కంపెనీలు అధిక విస్తీర్ణంలో పంట పండించారని సాకులు చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. వీరారెడ్డి, ఉపాధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి 30వ తేది వరకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలను ఇస్తామని, అప్పటికీ స్పందన లేకపోతే మే 5న చలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు నాయకులు వడ్డే హనుమారెడ్డి, పమిడి వెంకటరావు, భీమవరపు సుబ్బారావు, కోడూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మోసం చేస్తున్న కంపెనీలు పట్టించుకోకపోతే ‘చలో ముఖ్యమంత్రి’ -
వీధి కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సిందే
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను విధిగా చేపట్టాలని రీజినల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డీఎంఏ) హరికృష్ణ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. గురువారం ఒంగోలు వచ్చిన సందర్భంగా నగరంలో ఆయన పర్యటించారు. స్థానిక కొత్తమామిడిపాలెంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేసిన షల్టర్, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. జిల్లాలో మిగిలిన యూఎల్బీల నుంచి కూడా వీధి కుక్కలను ఆపరేషన్ల కోసం ఇక్కడికి తీసుకొస్తున్నారని ఆర్డీఎంఏ దృష్టికి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తీసుకెళ్లారు. వాటి కోసం ఇంకొన్ని బోనులను ఏర్పాటు చేసుకోవాలని ఆర్డీఎంఏ హరికృష్ణ ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు 20 నుంచి 25 కుక్కలకు ఆపరేషన్లు చేస్తున్నారని కమిషనర్ తెలపగా, కుక్కలను పట్టుకోవడానికి ఉపయోగిస్తున్న వలలను ఆర్డీఎంఏ హరికృష్ణ పరిశీలించారు. అనంతరం అదే ఆవరణలోని వర్మీకంపోస్ట్ కేంద్రాన్ని పరిశీలించారు. దానిని వెంటనే వాడుకలో తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆవరణ ప్రాంగణంలోనే తడి చెత్తను కంపోస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ పార్కును సందర్శించారు. పార్కులో గ్రీనరీని చూసి ఇలాంటి పార్కులను నగరంలో కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య, వైష్ణవి, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, సెంటర్ ఇన్చార్జి సూపర్వైజర్ బాబ్జి, కుక్కల ఆపరేషన్ డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు. పార్కును పరిశీలిస్తున్న ఆర్డీఎంఏ హరికృష్ణ, ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు ఒంగోలు నగరంలో పర్యటించిన ఆర్డీఎంఏ హరికృష్ణ -
మార్కెట్‌కి అనుగుణంగా బేళ్లను తీసుకురావాలి
టంగుటూరు: మార్కెట్‌కు అనుగుణంగా పొగాకు రైతులు వేలానికి బేళ్లను తీసుకురావాలని బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్‌కుమార్ అన్నారు. స్థానిక వేలం కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేళ్లను తీసుకువచ్చేటప్పుడు తేమ, వేడి లాంటివి లేకుండా చూసుకోవాలన్నారు. లోగ్రేడ్ పొగాకు, నీళ్లు కట్టిన పొగాకు, మొద్దు పచ్చ రకం పొగాకు వేలానికి తీసుకురావద్దని సూచించారు. వ్యాపారులు నో బిడ్స్ లేకుండా మంచి ధరలతో కొనుగోలు చేసేలా బయ్యర్లతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య, రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు,వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు.వడదెబ్బకు గుర్తు తెలియని వృద్ధుడు మృతిమార్కాపురం: వడదెబ్బకు గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..వివరాలు దరిమడుగు గ్రామం శివారులో ఒక సమాధి వద్ద సుమారు 70 ఏళ్ల వృద్ధుని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లినట్టు ఎస్సై అంకమరావు తెలిపారు. ఆ వృద్ధుడు బుధవారం ఉదయం నుంచి అదే ప్రాంతాల్లో తిరిగినట్టు స్థానికులు తెలిపారని, ఒంటిపై షర్టు ప్యాంటు ఉందని, వడదెబ్బకు మృతి చెందినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. స్థానికులు ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం తెలపాలని ఎస్సై తెలిపారు.35 వాహనాలు సీజ్కనిగిరిరూరల్: మైనర్ల డ్రైవింగ్‌పై గురువారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డీఎస్పీ పి.సాయిఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో మైనర్లు నడుపుతున్న 35 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ మాట్లాడుతూ ప్రమాదాల నుంచి మైనర్లను కాపాడేందుకు ఈ డ్రైవ్ చేపట్టామన్నారు. సీజ్ చేసిన బైక్ డేటాను స్టేషన్లలో భద్రపరుస్తామన్నారు. మళ్లీ మైనర్స్ బైక్ డ్రైవింగ్‌లో దొరికితే ఈ సారి వారి తల్లి దండ్రులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మైనర్ల డ్రైవింగ్‌పై వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఐ ఎస్కే ఖాజావలి, ఎస్సై మాధవరావు తదితరులు పాల్గొన్నారు.రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించండి● డీఆర్డీఏ పీడీ నారాయణమార్కాపురం టౌన్: ఎస్‌హెచ్‌జీ గ్రూపులు తీసుకున్న రుణాలను వెంటనే బ్యాంకులకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీఏ పీడీ నారాయణ అన్నారు. పట్టణంలోని డ్వాక్రా బజారులో గురువారం మార్కాపురం, యర్రగొండపాలెం క్లస్టర్ల పరిధిలోని సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఏఓలు మహిళల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలన్నారు. డీఆర్డీఏ ద్వారా అందిస్తున్న సేవలను, పథకాలను మహిళలకు వివరించాలన్నారు. సీ్త్రనిధి, ఉన్నతి పథకాల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. సెర్ఫ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తూ ఎస్‌హెచ్‌జీ గ్రూపులను యాక్టీవ్ చేయాలన్నారు. కార్యక్రమంలో సీ్త్రనిధి ఏజీఎం హర్షవర్ధన్, ఏరియా కో ఆర్డినేటర్ సుధాకర్, డీపీఎం సుబ్బారావు, మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల ఏపీఎంలు పిచ్చయ్య, రమేష్‌బాబు, గోపాల్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
పేదింట సరస్వతి రత్నాలు
ప్రతిభ ఎవరి సొత్తు కాదు..సాధన చేస్తే విజయాలు ఒడిలో వాలిపోతాయి. అందుకు నిదర్శనం ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎందరో పేదింటి విద్యార్థులు..కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఫలితాలు సాధించి ఔరా అనిపించారు. కనీస సౌకర్యాలు లేని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూలి పనులు చేస్తూ తమను చదివిస్తున్న తల్లిదండ్రుల రెక్కల కష్టానికి తగిన ఫలంగా రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. – సాక్షి నెట్వర్క్ మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి .. మర్రిపూడి: మండలంలోని శివరాయునిపేట దళితవాడకు చెందిన నిహారిక పదో తరగతిలో 586 మార్కులు సాధించింది. తండ్రి ఆంజనేయులు బేల్దారి మేసీ్త్ర ..తల్లి కూలి పనిచేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషిస్తున్నారు. పనికి వెళితేనే కుటుంబం గడిచేది. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న నిహారిక కష్టపడి చదివింది. ఒక్కో రోజు బస్సు సమయానికి రాకపోతే కాలనీ నుంచి పాఠశాలకు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లేది. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఎంతో ఆసరాగా నిలిచిందని నిహారిక తల్లిదండ్రులు తెలిపారు. -
ఎయిర్‌పోర్టుకు 1,080 ఎకరాల భూ సేకరణ
● జేసీ గోపాలకృష్ణ కొత్తపట్నం: మండలంలోని అల్లూరు–ఆలూరు మధ్యలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 1,080 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఏడీ సర్వేయర్ బాషా, కొత్తపట్నం తహసీల్దార్ మధుసూదన్‌రావు, మండల సర్వేయర్ సుధీర్‌బాబు, ఆర్ఐ వరప్రసాద్, వీఆర్వో బాలస్వామితో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో భూములను జేసీ పరిశీలించారు. కొప్పో లు దగ్గర్లోని నక్కలవారిపాలెం ఉత్తరం రోడ్డును పరిశీలించారు. అల్లూరు–ఆలూరు రోడ్డు, ఆలూరు పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొప్పోలు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 454, 457, 453లో 9 ఎకరాలతో పాటు అల్లూరు రెవెన్యూ పరిధిలో 2280, 2281, 2282, 2283 సర్వే నంబర్లు, ఆలూరు రెవెన్యూ పరిధిలోని 506, 507, 508, 513 సర్వే నంబర్లలో కలుపుకుని మొత్తం 1,080 ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌కు 744 ఎకరాలు సరిపోతుందని, భవిష్యత్‌లో వివిధ రకాల అవసరాల నిమిత్తం 336 ఎకరాలు అదనంగా సేకరించాల్సి ఉందని జేసీ అన్నారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. -
పొగాకు రైతుల కోసం పోరాడతాం
కొండపి: పొగాకు రైతులకు మద్దతు ధర లభించేంత వరకూ వారికి అండగా ఉండి పోరాడతామని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. గురువారం కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుతో కలిసి ఆదిమూలపు సురేష్ సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులను నిర్లక్ష్యం చేస్తోందని సురేష్ విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పొగాకు రైతులు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు పొందారని గుర్తుచేశారు. జిల్లాలో పొగాకుతో పాటు కంది, మిరప, శనగ రైతులు ఆయా పంటలకు మద్దతు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ప్రతిపక్షంగా తమ పోరాటాన్ని ఉధృతం చేసి రైతుల పక్షాన నిలబడతామని సురేష్ అన్నారు. ఆనాటి గడ్డు పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు : చుండూరి రవిబాబు 2015–16 కాలంలో టీడీపీ ప్రభుత్వంలో పొగాకు రైతులకు మద్దతు ధర లేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఈ సంవత్సరం కూడా అటువంటి గడ్డు పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. 2015–16లో పొగాకు రైతులకు మద్దతు ధర లేక నియోజకవర్గంలో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతులతో పొగాకు కేంద్రాలను ముట్టడిస్తే రైతులపై కేసులు పెట్టిన ఘనత ఆనాటి, ఇప్పటి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. రైతులు మూడు రకాలుగా నష్టపోతున్నారని తెలిపారు. దిగుబడి 30 శాతం తగ్గిందని, ధరలు 30 శాతం తగ్గాయని, 30 శాతం పెట్టుబడి పెరిగిందని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రవిబాబు వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారి తరఫున ఉద్యమం చేయడానికి వైఎస్సార్ సీపీ ముందుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను, ఏదో ఒక ఏజెన్సీని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. గోడు వెల్లబోసుకున్న రైతులు... కొండపి వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆదిమూలపు సురేష్, చుండూరి రవిబాబుతో పొగాకు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెట్లూరుకు చెందిన గుజ్జులు నాగిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ఇంతకన్నా తక్కువ నాణ్యత ఉన్న పొగాకును కేజీ 360 రూపాయలకు కొనుగోలు చేశారని తెలిపారు. దానికన్నా మెరుగైన పొగాకును ఈ సంవత్సరం కేవలం 250 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. దీనివలన తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఇలాంటి ధరల వలన రైతులకు నష్టం వాటిల్లుతోందని, ఏం చేయాలో అర్థంకావడం లేదని, అయోమయమైన పరిస్థితిలో రైతాంగం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులతో పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాకా పిచ్చిరెడ్డి, కొండపి మండల కన్వీనర్ ఆరికట్ల కోటిలింగయ్య, జేసీఎస్ కన్వీనర్ గొట్టిపాటి మురళి, పొగాకు ఉత్పత్తిదారుల కొండపి అధ్యక్షుడు నాగినేని భాస్కర్ చౌదరి, ఉపాధ్యక్షుడు బొక్కిసం సుబ్బారావు, స్టేట్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ రియాజ్, రైతు విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ రామచంద్రరావు, జిల్లా బీసీ సెల్ సెక్రటరీ మాచేపల్లి నాగయ్య, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు పుట్టా వెంకటరావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు షేక్ వన్నూరు, ఇంటలెక్చువల్ అధ్యక్షుడు భువనగిరి సత్యనారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు వసంతరావు, కల్చరల్ వింగ్ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు గంగాధర్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సుల్తాన్, కొండపి జెడ్పీటీసీ మారెడ్డి అరుణ వెంకటాద్రి, మర్రిపూడి జెడ్పీటీసీ సుధారాణి వెంకట్రావు, వైస్ ఎంపీపీ కోటరాజు, నియోజకవర్గ సీనియర్ నాయకులు రావురి ప్రవీణ్, బచ్చల కోటేశ్వరరావు, వేముల రమేష్, మసనం వెంకట్రావు, బోధ రమణారెడ్డి, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, పిన్నిక శ్రీనివాసులు, చింతపల్లి హరి, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, హరినారాయణ, ఇతర నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మద్దతు ధర దక్కేంత వరకూ అండగా ఉంటాం వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ -
ఆ మూడు నిమిషాలు ఏం జరిగింది.?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇంతకూ ఆ రోజు ఏం జరిగింది. ఎంత మంది లోపలకు వచ్చారు. ఆ మూడు నిమిషాల్లో జరిగిన ఘటనకు సంబంధించిన విషయాలేమిటి. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య జరిగిన తీరు, వివరాలను సేకరించేందుకు స్వయంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ రంగంలోకి దిగారు. హత్య జరిగి దాదాపు 48 గంటలు దాటినా చిన్నపాటి క్లూ కూడా లభించకపోవడంతో పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికితోడు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. వీరయ్య చౌదరి హత్యకు బలమైన కారణాలుండి ఉండొచ్చన్న దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధానంగా భూ వివాదాలతో పాటు మద్యం, ఆర్థిక వివాదాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కేసును స్వయంగా పరిశీలించేందుకు ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం సాయంత్రం ఘటన స్థలానికి వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ జరిపారు. హత్య జరిగిన సమయంలో కార్యాలయంలో వీరయ్య చౌదరి సహాయకుడితో పాటు ఆడిటర్, మహిళా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారి నుంచి ఎస్పీ పూర్తి వివరాలడిగి తెలుసుకున్నారు. ముగ్గురు నిందితులు లోపలకు వచ్చారని, ఎవరు మీరు, ఎందుకొచ్చారని ప్రశ్నించగా కత్తి చూపి బెదిరించారని, దాంతో తాము భయంతో చూస్తుండిపోయామని చెప్పినట్లు తెలిసింది. నిందితులు లోపలకు వచ్చినప్పుడు కుర్చీలో ఉన్న వీరయ్య చౌదరి లేచి నిలబడిన వెంటనే ఆయనపై కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసినట్లు వివరించారని తెలిసింది. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు నిందితులు గొంతు నుంచి ఛాతి, పొత్తి కడుపు, వీపు భాగంలో కత్తులతో కసితీరా పొడవడంతో ఆయన రక్తపు మడుగులో పడిపోయినట్లు చెప్పారని సమాచారం. ఒక్కొక్కరితో విడివిడిగా ఎస్పీ మాట్లాడి వివరాలు సేకరించారు. కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. భూ వివాదాలే కారణమా..? ఇప్పటి వరకు విచారణ జరుగుతున్న తీరును గమనిస్తే వీరయ్య చౌదరి హత్యకు భూ వివాదాలే ప్రధాన కారణం కావచ్చని భావిస్తున్నారు. వీరయ్య చౌదరికి జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు ప్రాంతాల్లో భూ వివాదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఓ భూ వివాదం ఉన్నట్లు సమాచారం. ఈ వివాదంలో ప్రత్యర్థులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వైజాగ్‌లోని భీమిలి, కోమలి, మధురానగర్ తదితర ప్రాంతాల్లోనూ భూ వివాదాలున్నట్లు సమాచారం. ఇక్కడ కూడా భూ వివాదానికి సంబంధించిన ఘర్షణ జరిగినట్లు చెబుతున్నారు. కర్ణాటకలోనూ రియల్ దందా చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వివాదాస్పద భూములు కొనుగోలు చేయడం ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. వాహనాలు ఏమయ్యాయి..? వీరయ్య చౌదరి హత్యకు ఉపయోగించిన స్కూటీ, మోటారు బైకు ఎక్కడి నుంచి వచ్చింది.. ఆ వాహనాలను సమకూర్చిందెవరు.. వాటిని ఎక్కడ వదిలిపెట్టి వెళ్లారన్న విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. హత్య తర్వాత నిందితులు ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పక్కన వున్న సుజాత నగర్ నుంచి బైపాస్‌లోకి వెళ్లి అక్కడి నుంచి వెంకటేశ్వర కాలనీలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దారిలో సీసీ కెమెరాలు పెద్దగా లేకపోవడం పోలీసుల విచారణకు అవరోధంగా మారింది. అయితే వెంకటేశ్వరకాలనీలో నుంచి ఎటువైపు వెళ్లారు.. తప్పించుకునేందుకు ఉపయోగించిన వాహనాలను ఎక్కడ విడిచిపెట్టారన్న సమాచారం ఇప్పటి వరకు పోలీసులు కనుగొనలేకపోవడం గమనార్హం. వీరయ్య చౌదరిని హత్య చేసిన తరువాత బయటకు వచ్చినప్పటి సీసీ ఫుటేజీలు మినహా పెద్దగా సాక్ష్యాలు లభించలేదు. విచారణ పరిధి జిల్లా దాటి రాష్ట్ర సరిహద్దులు దాటిపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ విసురుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పరిచయాలున్న నాయకుడి హత్య కావడంతో పాటు, సీఎం స్థాయిలో ఒత్తిడి వుండడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వీరయ్య చౌదరి కేసు విచారణకు రంగంలోకి ఎస్పీ దామోదర్ మూడు గంటలపాటు ప్రత్యక్ష సాక్షులను విచారించి వివరాల సేకరణ భూ వివాదాలతో పాటు అన్ని కోణాల్లో ముమ్మర దర్యాప్తు 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించినా పురోగతి లేదు హంతకులు ఉపయోగించిన వాహనాలు ఎక్కడివి 40 మందిని అదుపులోకి తీసుకున్నప్పటికీ... వీరయ్య చౌదరి హత్య జరిగిన రోజు రాత్రే పోలీసులు రంగంలోకి దిగారు. తొలుత ఆయన ఎంపీపీగా ప్రాతినిధ్యం వహించిన నాగులుప్పలపాడు గ్రామంలో కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద రైస్ మాఫియా హస్తం ఏమైనా ఉందా.? అనే కోణంలో విచారణ చేశారు. ఈ క్రమంలోనే పొన్నూరు నుంచి ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఒంగోలు తరలించారు. వారితో పాటు వీరయ్య చౌదరితో వివాదాలున్నట్లు భావిస్తున్న ప్రతిఒక్కరినీ పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు సమాచారం. మొత్తం మీద ఇప్పటి వరకు 40 మందిని విచారించగా ఎలాంటి క్లూ దొరకలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి వీరయ్య చౌదరి హత్య జరిగిన స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి మరిన్ని వివరాలడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. -
ఉగ్ర దాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన
ఒంగోలు సిటీ: జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఒంగోలులోని బాపూజీ మార్కెట్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో బుధవారం నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో సుమారు 26 మంది చనిపోయారని, 20 మంది క్షతగాత్రులు అయ్యారన్నారు. ఇది చాలా హేయమైన ఘటన అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాశ్మీరు చాలా సుందరమైన ప్రదేశమని, టూరిస్ట్‌లు ఈ ప్రాంతానికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. వాళ్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ చనిపోయిన మృతులకు నివాళులర్పిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించామన్నారు. భారతదేశపు ఐక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేయాలని పొరుగుదేశానికి చెందిన టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారన్నారు. చాలా కాలం తర్వాత ప్రశాంత వాతావరణంలో కాశ్మీరు అభివృద్ధి చెందుతుంటే పొరుగు దేశం చిచ్చుపెడుతోందన్నారు. భారతదేశం మొత్తం ఐక్యంగా ఉంటుందని, ప్రపంచానికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా మహిళా అధ్యక్షులు దుంపా రమణమ్మ, కార్పొరేటర్లు ఇమ్రాన్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు పేరం ప్రసన్న, ఎస్.రమణమ్మ, సాధం విజయలక్ష్మి, వి.వాణి, గాయం సావిత్రిదేవి, మేరీకుమారి, పిగిలి శ్రీను, ఆనం శ్రీనివాసరెడ్డి, ఎస్.వెంగారెడ్డి, చింతా సతీష్‌రెడ్డి, దుంపా చెంచిరెడ్డి, హోసింగ్‌బోర్డు చిన్న, కె.స్వామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మద్యం వాహనం బోల్తా
పొదిలి రూరల్: మండలంలోని సలకనూతల సమీపంలో మద్యం తరలించే వాహనం బోల్తాపడింది. దీంతో వాహనంలో ఉన్న మద్యం బాటిళ్లు కొన్ని పగిలిపోయాయి. మార్కాపురం నుంచి దర్శికి మద్యం లోడులో వెళుతున్న వాహనం ప్రమాదానికి గురై బోల్తా పడింది. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మద్యం బాటిళ్లు రోడ్డుపై చిందరవందరగా పడడంతో బాటిళ్లు కోసం కొంతమంది ఎగబడ్డారు. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కుక్కల దాడిలో 15 గొర్రెల మృతి తర్లుపాడు: కుక్కల దాడిలో 15 గొర్రెల మృతి చెందాయి. ఈ సంఘటన మండలంలోని గానుగపెంటలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. బాధితుడు అమ్మనబ్రోలు శ్రీను తెలిపిన వివరాల మేరకు..గ్రామ శివారులోని దొడ్లో మధ్యాహ్నం సమయంలో గొర్రెలను తోలి ఇంటికివచ్చిన సమయంలో కుక్కలు దాడి చేసి చంపినట్లు తెలిపారు. సుమారు రూ.1.20 లక్షల నష్టం జరిగినట్లు వివరించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా గ్రామంలో గత నెలలో కూడా కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందాయి. గ్రామంలో ఎక్కువగా గొర్రెలు పెంచుకుంటూ పలువురు జీవనాధారం సాగిస్తున్నారు. పంచాయతీ, వెటర్నరీ అధికారులు జోక్యం చేసుకుని కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని సర్పంచ్ పుచ్చకాయల బాలయ్య కోరారు. వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం కొత్తపట్నం: మలేరియా, డెంగీ వా్య్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి మధుసూదనరావు అన్నారు. స్థానిక పీహెచ్‌సీని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మలేరియా, డెంగీ వ్యాధుల గురించి రికార్డులు పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి డాక్టర్ రమ్యదీపికకు వివరించారు. ఏఎన్ఎంలు మలేరియా జ్వరాలను ఎలా గుర్తించారు, వారు సేకరించిన రక్త పూత నమూనాలు పరిశీలించారు. దోమల నివారణ చర్యలు, దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. జ్వరం వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ వ్యక్తిని జ్వరం తగ్గే వరకు నిఘా ఉంచాలన్నారు. డాక్టర్ రమ్య దీపిక, సబ్ యూనిట్ ఆఫీసర్ సాగర్, పి.శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, పీహెచ్ సూపర్వైజర్ పి.ప్రభాకర్, హెచ్వీ సులోచన తదితరులు పాల్గోన్నారు. 170 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత దొనకొండ: గ్రామాల్లో రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేసి నిల్వ చేసిన 170 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒంగోలు విజిలెన్స్ సీఐ రవిబాబు, ఎస్సై నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..దొనకొండకు చెందిన మాడిశెట్టి నారాయణ గ్రామాల్లోని రేషన్ డీలర్ల వద్ద బియ్యాన్ని కొనుగోలు చేసి స్థానిక బ్రాహ్మరావుపేటలోని సాయిబాబా గుడి సమీపంలో మాదాల రాము ఇంట్లో నిల్వ చేశాడు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం విజిలెన్స్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాధాక్రిష్ణకు సమాచారం అందజేశారు. బియ్యాన్ని గోడౌన్‌కు తరలించి డీటీ షేక్ సుష్మాకు అప్పగించారు. నారాయణపై 6ఏ కేసు నమోదు చేశారు. -
బియ్యం లావాదేవీలా.. భూ వివాదాలా..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, బాపట్ల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సంఘటన జరిగి 24 గంటలు పూర్తి కావస్తున్నా ఇంత వరకూ సరైన క్లూ లభించలేదని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంగళవారం రాత్రి వీరయ్య చౌదరి హత్య జరిగిన తరువాత రాత్రికి రాత్రే హోం మంత్రి అనిత ఒంగోలుకు వచ్చారు. జీజీహెచ్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అంతకు ముందే మంత్రులు బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి జీజీహెచ్‌కు చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అమ్మనబ్రోలులో జరిగిన వీరయ్య చౌదరి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ హత్యను అధికార పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. అనుమానితులను పోలీసు స్టేషన్‌కు తరలించి అన్నీ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బియ్యం వివాదాల కోణంలో గుంటూరు జిల్లా నిడుబ్రోలుకు చెందిన గోపి, అమీర్, అశోక్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే బాపట్ల జిల్లా వెదుళ్లపల్లికి చెందిన రైసుమిల్లు యజమానిని, నాగులుప్పలపాడుకు చెందిన ఒక వ్యాపారిని విచారిస్తున్నట్టు తెలిసింది.భూ వివాదాలే హత్యకు దారి తీశాయా...వీరయ్య చౌదరికి అనేక భూ వివాదాలతో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొంత కాలంగా పొరుగు రాష్ట్రమైన బెంగళూరు, తెలంగాణాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా ఆయనకు భూ వివాదాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అలాగే వైజాగ్, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా జిల్లా దోర్నాల వద్ద కూడా భూ వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రామాయపట్నం, గుడ్లూరు మండలంలోని భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో వివాదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ వివాదం ఏమైనా కారణమా అన్న కోణంలో ప్రత్యేక పోలీసులు బృందాలు ఆరా తీస్తున్నాయి. రెవెన్యూ అధికారులు అందరితో వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన వ్యక్తిపై సైతం నిఘా ఉంచినట్టు తెలిసింది.లిక్కర్ సిండికేట్‌తో వివాదాలు...తొలి నుంచి వీరయ్య చౌదరి మద్యం వ్యాపారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఆయనకు మద్యం వ్యాపారాలు ఉన్నాయి. మద్యం సిండికేట్లతో కూడా ఆయనకు వివాదాలు ఉన్నట్లు ప్రచారం. ఈ విషయంలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక మంత్రి వద్ద రాజీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ లిక్కర్ వివాదాలు ఆయనను వెన్నాడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసులో మద్యం సిండికేట్ల పాత్ర మీదా విచారణ జరుపుతున్నారు.రెక్కీ చేసిన తరువాతే హత్య జరిగిందా..వీరయ్య చౌదరి హత్యకు ముందు నిందితులు నగరంలోని ఒక హోటల్లో ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలిసినట్లు ప్రచారం జరుగుతోంది. పది రోజుల పాటు నగరంలో ఉన్న నిందితులు వీరయ్య చౌదరికి సంబంధించిన అన్నీ విషయాలను సేకరించినట్లు తెలిసింది. ఆయన రోజువారి కార్యకలాపాలు, ఒంటరిగా ఉండే సమయం లాంటి వివరాలను సేకరించినట్లు చెప్పుకుంటున్నారు. హత్యకు ముందు మూడు రోజుల పాటు ఆయన కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. హత్య జరిగిన రోజు కూడా నిందితులు వీరయ్య చౌదరిని అనుసరించినట్లు చెప్పుకుంటున్నారు. నాగులుప్పలపాడు పార్టీ నియామకాలకు సంబంధించి సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్‌ను వీరయ్య చౌదరి కలిసి చర్చించినట్టు సమాచారం. ఆపై 5 గంటల తరువాత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంటికి వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను పసిగట్టిన తరువాత వీరయ్య ఒంటరిగా ఉండే సమయాన్ని ఎంచుకొని హత్యకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. హత్య చేసిన తరువాత నిందితులు ఒక స్కూటీ, మోటారు బైకు మీద తప్పించుకొని పరారయ్యారని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు నిందితులు వచ్చారని, ఇద్దరు కింద కాపలా ఉండగా నలుగురు పై అంతస్తులోకి వెళ్లి హత్యకు పాల్పడ్డారని విశ్వసనీయ సమాచారం.నగరాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు...వీరయ్య చౌదరి హత్యను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తం 12 బృందాలను, 40 మంది పోలీసులను రంగంలోకి దించారు. నగరాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. నగరంలోని లాడ్జీలను తనిఖీలు చేస్తున్నారు. నాలుగు రోజులుగా లాడ్జిలకు వచ్చిన వారి వివరాలు, ఎంత మంది వచ్చారు. ఎన్ని రోజులు ఉన్నారు అనే విషయాలను సేకరిస్తున్నారు. వారి ఆధార్ కార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. లాడ్జిలతో పాటుగా నగరంలోని శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఒకటే మాట...వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత మీడియా ముందు ఒకే రీతిగా స్పందించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. జరిగిన విషయంపై వ్యాపార లావాదేవీలు, మద్యం సిండికేట్లతో ఉన్న వివాదాల గురించి సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పారు. నేరుగా వారే ఈ కేసును పర్యవేక్షిస్తుండడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ప్రైవేటు భూముల వివాదమే వీరయ్య చౌదరి హత్యకు పురికొల్పినట్లు ప్రచారం పక్కాగా రెక్కీ నిర్వహించి హతమార్చినట్టు సమాచారం నగరాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు లాడ్జీలు, కాలనీల్లో విస్తృతంగా తనిఖీలు అన్నీ కోణాల్లో సమగ్ర దర్యాప్తు రాత్రికి రాత్రి నగరానికి వచ్చిన హోం మంత్రి అనిత అమ్మనబ్రోలులో అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబుతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అధికార తెలుగుదేశం పార్టీలో అలజడి సృష్టించింది. సంచలనం రేకెత్తించిన ఈ హత్య కేసుకు సంబంధించి జిల్లాలో రకరకాల కథనాలు ప్రచారం జరుగుతున్నాయి. ప్రధానంగా భూ, లిక్కర్, పీడీఎస్ రైస్ వివాదాలే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చీకటి దారుల్ని వెలిగించే పుస్తకాలు
ఒంగోలు టౌన్: పుస్తకాలు జీవితంలోని చీకటిదారులను వెలిగించే దీపాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం పుస్తకాలను ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పుస్తకాలను చదవడం ఎంతో మంచి అలవాటని, దీని వల్ల మెదడు క్రియాశీలకంగా పనిచేస్తుందని, మానసిక వికాసాన్ని పెంపొదిస్తుందని తెలిపారు. ప్రపంచంలో పుస్తకాలు చదివి చెడిపోయిన వాళ్లు లేరని, విజేతలుగా ప్రసిద్ధి చెందిన వారంతా పుస్తకాలను చదివిన వారేనని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఉప పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, గ్రంథాలయ సిబ్బంది కృష్ణవేణి, శివకుమారి, శాంసన్, మృదుల్ కుమార్, ఇమ్మానుయేలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా టాపర్‌గా భార్గవి
టంగుటూరు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో జిల్లా ప్రథమ స్థానం సాధించింది. భార్గవిని విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, డిప్యూటీ డీఈఓ చంద్రమౌలేశ్వర్, ఎంఈఓ–2 తన్నీరు బాలాజీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి గొప్ప ఫలితం సాధించడానికి సమష్టికృషి చేసిన ప్రధానోపాధ్యాయులు వాకా వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులను వారు ప్రత్యేకంగా అభినందించారు. 43 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 39 మంది ఉత్తీర్ణత సాధించారు. 36 మంది ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఝాన్సీ రాణి విద్యా కమిటీ చైర్మన్ పున్నయ్య చౌదరి, ఉపాధ్యాయులు శ్రీధర్ బాబు, సురేష్,వెంకటరావు, సుబ్బారావు, చెన్నయ్య భూషణ్ రెడ్డి,సుభాషిని, విజయలక్ష్మి,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. కష్టపడుతూ..చదివిస్తూ.. పుట్ట వెంకట భార్గవి తల్లిదండ్రులు రామ్మోహన్రావు పెట్రోల్ బంక్ లో పంపు బాయ్ గా పని చేస్తుండగా, తల్లి టైలరింగ్ చేస్తూ చదివిస్తూ వచ్చింది. చదువులో ముందంజలో ఉన్న భార్గవిని పాలకూరపాడు ప్రభుత్వ పాఠశాలలో చదువు చక్కగా చెబుతున్నారని ఉద్దేశంతో టంగుటూరు నుంచి ఆలకూరపాడుకు మార్చారు. తల్లిదండ్రుల కష్టాన్ని గమనించిన భార్గవి ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో పట్టుదలతో చదివి జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించింది. ట్రిపుల్ ఐటీ సీటు వస్తే మంచి ఇంజినీర్ అవుతానని భార్గవి చెబుతోంది. జిల్లా ప్రథమ స్థానం రావడం ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
టెన్షన్ పెట్టిన చిన్నారులు
● రెండు గంటల తరువాత తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు ఒంగోలు టౌన్: నగరంలోని ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుకుంటున్న చిన్నారులు తప్పిపోయారు. రెండు గంటలకు పైగా గాలించిన తరువాత పోలీసులకు దొరికారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని అన్నవరప్పాడులో ఉన్న ఒక ప్రైవేట్ విద్యానికేతన్‌లో షేక్ ఇస్మాయిల్, కొంపసాల బిల్వనాథ్, అప్పాడిపాడు పార్ధులు మూడో తరగతి చదువుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు స్కూలు వదిలిపెట్టారు. పుస్తకాల సంచులను స్కూలులోనే ఉంచిన చిన్నారులు స్కూలు బయటకు వెళ్లారు. అలా వెళ్లిన వారు తిరిగి రాలేదు. ఈ లోగా తలిదండ్రులు వచ్చి తమ చిన్నారుల కోసం చూడగా స్కూలులో కనిపించలేదు. పాఠశాల స్బిబందిని అడిగితే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు, అంతలోనే ఎక్కడకు వెళ్లారంటూ చెప్పడంతో తలిదండ్రులు గుండెల్లో రాయి పడ్డట్టయింది. దీంతో పిల్లలు కనిపించకుండా పోయారన్న విషయం స్కూలు యాజమాన్యానికి తెలిసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు తలిదండ్రులు పిల్లల కోసం వీధుల వెంట గాలింపు మొదలు పెట్టారు. ఎక్కడకు వెళ్లినా పిల్లలు కనిపించకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. చివరకు టూటౌన్ పోలీసులకు తెలిపారు. వారు కూడా రంగంలోకి దిగి గాలించగా చివరికి బాలాజీనగర్‌లో అగ్రహారం రైల్వే గేటు వద్ద విద్యార్థులు కనిపించారు. టూటౌన్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు సమక్షంలో విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో చిన్నారుల తలిదండ్రులు, స్కూలు యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. తప్పిపోయిన పిల్లలను కేవలం రెండు గంటల వ్యవధిలోనే తలిదండ్రులకు అప్పగించడంలో సహకరించిన సీఐకు ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
సింగరాయకొండ: ముస్లింలను అణగదొక్కడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకువచ్చారని ముస్లిం నాయకులు, వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం హిందూ, ముస్లిం, మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ముస్లిం నాయకులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ద్వారా ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తరువాత క్రైస్తవ, హిందూ ఆలయ భూములను సైతం స్వాధీనం చేసుకుంటారన్నారు. మోడీ ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఆంధ్ర, బీహార్ రాష్ట్రాల ప్రభుత్వాలు బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. శాంతియుత ర్యాలీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పెద్ద మశీదు నుంచి ప్రారంభమై మినీ బైపాస్ రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, పోలీస్‌స్టేషన్ సెంటర్ మీదుగా కందుకూరు రోడ్డు సెంటర్ వరకు చేరి మానవహారంగా ఏర్పడ్డారు. అంతకు ముందు పోలీస్‌స్టేషన్ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ పూలే, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో హిందూ, ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దర్శి (కురిచేడు): వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దర్శిలో ముస్లింలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. గంగవరం రోడ్డులోని మర్కస్ మసీద్ నుంచి గడియార స్తంభం వరకు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ చేశారు. అనంతరం డీటీ దేవప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గడియార స్తంభం సెంటర్లో ముస్లిం పెద్దలు మాట్లాడుతూ దేశంలో ముస్లింల హక్కులు హరిస్తున్నారని, ముస్లింల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసుకున్న వక్ఫ్ భూములు, ఆస్తులను చట్టం రూపంలో ప్రభుత్వం దోచుకునేందుకు తెరతీసిందన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల నియామకం తమ హక్కులకు భంగం కలిగించేలా ఉందన్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింల విషయంలో మాత్రం మరోలా ఎందుకు వ్యవహరిస్తోందని, రాజ్యాంగంలో ఇచ్చిన మత స్వేచ్ఛను, మత కార్యకలాపాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం సరికాదన్నారు. వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మత పెద్దలు, మసీదుల ప్రతినిధులు, నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ముస్లింలు పాల్గొన్నారు. -
ఐపీఎస్ కల నెరవేరిన వేళ..
సింగరాయకొండ: గ్రూప్–1 పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్న ధృఢ సంకల్పంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి చివరి ప్రయత్నంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో 350 ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నాడు సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డి. చిన్నప్పుడే తండ్రి శ్రీనివాసులరెడ్డి, తల్లి జయమ్మలను పోగొట్టుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి, తమ్ముడు ప్రణయ్ రెడ్డి తో కలిసి నాయనమ్మ రమణమ్మ సంరక్షణలో ఉన్నాడు. రమణమ్మ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ తన ఇద్దరు మనవళ్లను చదివించింది. చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివిన ఉదయ్ కృష్ణారెడ్డి 2012వ సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి నెల్లూరు జిల్లా గుడ్లూరు మండల పోలీస్‌స్టేషన్ లో ఉద్యోగంలో చేరాడు. తరువాత రామాయపట్నం మైరెన్ కానిస్టేబుల్‌గా బదిలీ అయ్యాడు. ఆ సమయంలో మైరెన్ సీఐ దురుసు ప్రవర్తనతో ఆవేదన చెంది ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలని నిశ్చయించుకుని కఠోర కృషి చేశాడు. గత సంవత్సరం సివిల్స్‌లో 780 మార్కులు సాధించి ఐఆర్ఎంఎస్కు ఎంపికయ్యాడు. కానీ చిన్నప్పటి నుంచి సివిల్స్ లో ర్యాంకు సాధించి కలెక్టర్ లేదా ఎస్పీ కావాలన్న కోరికతో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి 2019వ సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వెళ్లి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఇప్పటికి నాలుగు సార్లు పరీక్షలు రాయగా మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినప్పటికీ 9 మార్కులు తగ్గాయి. రెండో సారి, మూడో సారి పరీక్షలకు ప్రిపేర్ అయినప్పటికీ ప్రిలిమ్స్ దశలోనే వెనుదిరిగాడు. నాలుగో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 780 వ ర్యాంకు, 5వ సారి చివరి ప్రయత్నంలో 350 మార్కులు సాధించి ఐపీఎస్ కావాలన్న తన కోరిక తీర్చుకున్నాడు. దీనిపై ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఐఏఎస్కానీ, ఐపీఎస్ కానీ కావాలన్నది తన కోరికని ఈ ర్యాంకు ప్రకారం ఐపీఎస్‌కు ఎంపికవుతానని, ఐఏఎస్‌కు ఎంపిక కావటానికి 10 శాతం అవకాశాలున్నాయని వివరించాడు. ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, గ్రామస్తులు అభినందించారు. -
పొగాకు రైతులకు న్యాయం చేయాలి
మద్దిపాడు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు బోర్డులో జరుగుతున్న వేలంపాటను మంగళవారం ఆయన పరిశీలించారు. రైతులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏ పంట వేసిన రైతు కూడా కూటమి ప్రభుత్వంలో సంతోషంగా లేరని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రైతులు తమ పంటలకు మద్దతు ధరలు లేక దళారులపాలై విలవిల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరి పంట వేసిన రైతులు పంటను అమ్ముకోలేకపోతున్నారని, అదేవిధంగా గత ఏడాది మంచి ధర పలికిన మిర్చికి ఈ సంవత్సరం ధరలు లేక రైతులు విలవిల్లాడిపోతున్నారని అన్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకొచ్చి మిర్చి రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తే ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి మిర్చి క్వింటాకు రూ.11 వేల మద్దతు ధరను ఇస్తామని చెప్పి ఆ విషయాన్ని గాలికి వదిలేశారన్నారు. ఈ ప్రాంతంలో పండే శనగ, మొక్కజొన్న పంటలకు కూడా సరైన మద్దతు ధర లేక దళారులు అతి తక్కువ ధరకు అడుగుతున్న క్రమంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో పొగాకు వ్యాపారులు సిండికేట్ అయి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొగాకు రైతుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసి, మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల పొగాకును చివరి కేజీ వరకు కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. ఆ తరువాత వరుసగా మూడేళ్ల పాటు రైతులు సరైన గిట్టుబాటు ధర పొందారన్నారు. గతంలో క్వింటా ధర రూ.36 వేల వరకు కొనుగోలు చేసిన పొగాకు కంపెనీలు ఇప్పుడు రూ.23 వేలకే కొనుగోలు చేయడానికి తటపటాయిస్తున్నాయని అన్నారు. వేలం కేంద్రానికి తీసుకొచ్చిన పొగాకు బేళ్లు సగానికి పైగా నోబిడ్ అవ్వడం అత్యంత దారుణం అని, పొగాకు పంట వేసిన కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసి, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే అవసరమైతే ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆయన రైతులకు మద్దతు ధర కల్పించలేని కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ వేలం కేంద్రం ఫ్లోర్లో బైఠాయించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు పోలవరపు శ్రీమన్నారాయణ, దుంప చెంచిరెడ్డి, సీనియర్ నాయకులు గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, నల్లమలుపు కృష్ణారెడ్డి, వాకా కోటిరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గుంతోటి రవి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు బి.శ్రీరామ్ మూర్తి, గుడ్డపాతల రవి, మద్దా లక్ష్మీనారాయణ ఉన్నారు. వెల్లంపల్లి పొగాకు బోర్డు వద్ద బైఠాయించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నిరసన -
3 నిమిషాల్లో!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార పార్టీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి (49) దారుణ హత్య ఒంగోలు నగరంలో సంచలనాన్ని రేకెత్తించింది. నగర ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. పక్కా ప్రణాళికతో బైకులపై వచ్చిన నలుగురు యువకులు కేవలం మూడు నిమిషాల్లోనే హత్య చేసి పరారయ్యారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరగడంతో పోలీసులు సైతం ఉలిక్కిపడ్డారు. దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న నగరంలో టీడీపీ నాయకుడి దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది. ఎస్పీ దామోదర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.పక్కా ప్రణాళికతో..పక్కా ప్రణాళికతో నలుగురు యువకులు రాత్రి 7.33 నిమిషాలకు వీరయ్య చౌదరి కార్యాలయంలోకి ప్రవేశించి కేవలం మూడు నిమిషాల్లో 25 చోట్ల కొడవళ్లతో దాడి చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్ వెళ్లిన ఆయన మంగళవారం ఉదయమే తిరిగి వచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం వరకు వీరయ్య చాలా బిజీగా గడిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఆ తరువాత అక్కడ నుంచి నేరుగా వెళ్లి బైపాస్ మీద బండికి పెట్రోలు కొట్టించుకొని ఆఫీసుకు వెళ్లినట్లు తెలిసింది. సాయంత్రం 6.30 తరువాత ఆయన మంగమూరు రోడ్డులోని కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే హంతకులు అక్కడకు చేరుకున్నట్లు సమాచారం. వీరయ్య చౌదరి కార్యాలయంలోకి వెళ్లిన కాసేపటి తరువాత సరిగ్గా గం.7.33 కు హంతకులు లోపలకు వెళ్లారు. లోపల ఉన్న ముగ్గురు కార్యాలయ సిబ్బందిని కత్తులు చూపి బెదిరించి పక్కనే ఉన్న గదిలోకి నెట్టివేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తలుపులు తీయడానికి ప్రయత్నిస్తే చంపేస్తామని వారిని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ లోపు కార్యాలయంలో ఏదో గొడవ జరుగుతున్నట్లు భావించిన వీరయ్య బయటకు రాగానే హంతకులు వేటకొడవళ్లతో దాడి చేసినట్లు సమాచారం. మొదట గొంతు మీద పొడిచినట్లు చెబుతున్నారు. గొంతు నుంచి గుండెల వరకు 15 పోట్లు పొడిచారని, తరువాత పొత్తి కడుపులోకి మరో 10 పోట్లు పొడిచిన తర్వాత వీరయ్య చనిపోయాడని నిర్ధారించుకున్నాకే హంతకులు అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. చేయి తిరిగిన హంతకులే ఈ హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హంతకులు 25 సంవత్సరాల వయసు లోపు వారేనని, వచ్చిన వారు స్పష్టంగా తెలుగులోనే మాట్లాడారని విశ్వసనీయ సమాచారం. మధ్యాహ్నం ఒకసారి హంతకులు ఆఫీసుకు వచ్చి రెక్కీ నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది.హత్యకు కారణమేమిటి...?వీరయ్య చౌదరి హత్యకు కారణమేమిటన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాలో మద్యం వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది. సిండికేట్లతో కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నారని, కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల బెంగళూరులో కొన్న ఒక భూమి వివాదం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో హత్య జరిగిందని ప్రచారం ఉంది. అలాగే రామాయపట్నం పోర్టుకు సమీపంలో వివాదాస్పద భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అది కూడా కారణం కావచ్చన్న ప్రచారం సాగుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కొంతమందితో ఈయనకు వివాదాలు ఉన్నట్టు తెలిసింది. మొత్తం వీరయ్య చౌదరి హత్యకు కారణాలు స్పష్టంగా తెలియడం లేదు.12 బృందాలతో ముమ్మర గాలింపు...వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సాయంత్రం గం.7.33 సమయంలో బైకుల మీద వచ్చిన నలుగురు యువకులు లోపలకు వెళ్లి వీరయ్య చౌదరిని హత్య చేసి గం.7.36 కల్లా బైకుల మీద పరారయ్యారని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 40 మందితో 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అన్నీ కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. ఎప్పటికప్పుడు దర్యాప్తు ప్రగతిపై సమీక్షిస్తామని, వీలైనంత త్వరగా కేసునే ఛేదించడానికి కృషి చేస్తామని తెలిపారు.ఉలిక్కిపడిన ఒంగోలు...దశాబ్దాల కాలంలో ఇలాంటి హత్య జరగడం ఇదే తొలిసారి కావడంతో ఒంగోలు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైగా ఒక అధికార పార్టీ నాయకుడు హత్యకు గురి కావడం, ఎస్పీ ఆఫీసుకు కూత వేటు దూరంలో హత్య జరగడం చర్చనీయాంశమైంది. నలుగురు హంతకులు నగరంలోకి ప్రవేశించి పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేయడంపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీరయ్య చౌదరి హత్య వార్త తెలిసిన వెంటనే పార్టీ అభిమానులు, ఆయన అనుచరులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జీజీహెచ్ వద్దకు చేరుకున్నారు. దాంతో స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఈ హత్య నేపథ్యంలో నేడు హోంమంత్రి అనిత జిల్లాకు వస్తున్నట్లు సమాచారం.ఈదర హరిబాబుకు గుండెపోటు...హత్యకు గురైన వీరయ్య చౌదరి మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు మేనల్లుడు. ఆయన హత్య వార్త తెలిసిన వెంటనే హరిబాబు జీజీహెచ్ వద్దకు వచ్చారు. కాసేపటికే ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నట్లు సమాచారం.పంచాయతీ వార్డు సభ్యునిగా..నాగులుప్పలపాడు: ఒంగోలులో దారుణ హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు స్వయానా మేనల్లుడు కావడంతో తొలుత అమ్మనబ్రోలు గ్రామంలో నాయకుడిగా ఎదగగలిగారు. ఈ క్రమంలో 2013–18 కాలంలో అమ్మనబ్రోలు గ్రామ పంచారయతీలో వార్డు సభ్యునిగా గెలిచి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 2014 లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో చవటపాలెం గ్రామ ఎంపీటీసీగా గెలిచి నాగులుప్పలపాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా పూర్తి కాలం పనిచేశారు. ఈ క్రమంలో టీడీపీలో ఉన్న పరిచయాలతో ప్రస్తుతం బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య ముప్పవరపు సుచరిత, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరయ్య చౌదరి భార్య సుచరిత కూడా చవటపాలెం ఎంపీటీసీగా పనిచేస్తుండగా, కుమారుడు ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు.పక్కా ప్రణాళికతోనే దారుణ హత్య మొదట గొంతుపై పొడిచి ఆ తరువాత 25 పోట్లు పొడిచి హత్య చేసినట్లు సమాచారం సుపారీ హత్యగా ప్రచారం హత్యతో ఉలిక్కిపడిన ఒంగోలు నగరం 12 బృందాలతో ప్రత్యేక గాలింపు పోలీసు అదుపులో ముగ్గురు? ప్రత్యేకంగా పర్యవేక్షించిన ఎస్పీ దామోదర్ మేనల్లుడి హత్యతో మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు గుండెపోటుఒంగోలు జీజీహెచ్ దగ్గర గుమిగూడిన వీరయ్య చౌదరి బంధుమిత్రులు -
ఎవరి ఎజెండా వారిది!
నగరాభివృద్ధిలో కీలక భూమిక పోషించే నగరపాలక సంస్థ స్థాయీ సంఘం (స్టాండింగ్ కమిటీ) ఎన్నికలు అధికార కూటమిలో కాకరేపుతున్నాయి. ప్రస్తుతం కూటమి పార్టీలకు కౌన్సిల్లో పూర్తి మెజార్టీ ఉంది. స్థాయీ సంఘం కాలపరిమితి పూర్తయి ఏడాది కావొస్తున్నా కొత్త కమిటీ కొలువు దీరకపోవటానికి అధికార కూటమిలో లుకలుకలే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారింది. జనసేన, బీజేపీలకు సైతం అవకాశం ఇవ్వాల్సి వస్తుందన్న కుట్రతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదన్న ప్రచారం కార్పొరేషన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.జనసేన సభ్యులకు ఇవ్వటం ఇష్టం లేకనే... స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే కౌన్సిల్లో బలమున్న జనసేన సభ్యులకు ఇవ్వలేకనే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు మోకాలడ్డుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదుగురిలో కనీసం జనసేన సభ్యులకు ఇద్దరికై నా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అది ఇష్టంలేకనే ఎమ్మెల్యే ఎన్నికల నోటిఫికేషన్‌కు అడ్డుతగులుతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేని కాదని కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చే సాహసం చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి సభ్యులు రెండు పార్టీలు కలుపుకుంటే మేయర్‌తో కలిపి 46 మంది అయ్యారు. వారిలో టీడీపీకి చెందిన వారు 25 మంది కాగా జనసేనకు చెందిన వారు 21 మంది ఉన్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్సార్సీపీని వీడి జనసేనలోకి వెళ్లగానే 20 మంది కార్పొరేటర్లు ఆయన వెంటే జనసేనలోకి వెళ్లారు. ఎన్నికలు పెడితే ఐదుగురూ కూటమి సభ్యులే గెలుస్తారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మరిచిపోయారు. నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే కార్పొరేషన్లో స్థాయీ సంఘానిదే కీలక భూమిక. నగరాభివృద్ధి కంటే రాజకీయాలే కూటమి నాయకులకు ముఖ్యమైనట్టున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీలకు ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్లో పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. అయితే స్థాయీ సంఘం ఎన్నికలంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రస్తుతం కూటమి పార్టీల్లో భాగస్వాములుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వీరి ఇద్దరి మధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్థాయీ సంఘం వేస్తే 21 సభ్యులున్న జనసేనకు స్థానం కల్పించాల్సి వస్తుంది. అందుకే ఈ కమిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఇష్టపడడంలేదని తెలుస్తోంది. నగరపాలక సంస్థలోని కార్పొరేటర్లలో ఐదుగుర్ని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. ఇందుకు సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇంత వరకూ అలాంటిదేమి జరగలేదు. ఇప్పటి వరకు మూడు కమిటీలు: ఒంగోలు నగర పాలక సంస్థ ఏర్పడిన నాటి నుంచి మూడు స్టాండింగ్ కమిటీలు పనిచేశాయి. అవి కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పనిచేశాయి. ఒక్కో స్టాండింగ్ కమిటీ ఏడాది పాటు ఉంటుంది. నగర పాలక సంస్థలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 10 మందికి ఒకరు చొప్పున స్టాండింగ్ కమిటీ సభ్యుడ్ని ఎన్నుకుంటారు. అంటే ఐదుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికవుతారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 50 మంది కార్పొరేటర్లలో 43 మంది వైఎస్సార్సీపీ వాళ్లే. మిగతా సభ్యుల్లో ఆరుగురు టీడీపీకి చెందిన వారు, ఒక్కరు జనసేనకు పక్షాన ఉన్నారు. ప్రభుత్వం మారగానే పరిస్థితి మారిపోయింది. ఇక స్టాండింగ్ కమిటీ లేనట్లే.... నగర పాలక సంస్థకు ఇక స్టాండింగ్ కమిటీలు లేనట్టేనని తెలుస్తోంది. ఎందుకంటే 2026 మార్చి 18వ తేదీతో పాలక మండలి కాల పరిమితి ముగుస్తుంది. స్టాండింగ్ కమిటీ 2024 జూన్ మాసంతో కాల పరిమితి పూర్తయింది. స్టాండింగ్ కమిటీ కాల పరిమితి ఏడాది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థాయీ సంఘాలను ఏర్పాటు చేస్తే ఆగస్టు నాటికి కాలపరిమితి పూర్తయ్యేది. తరువాత రెండో కమిటీకి అవకాశం ఉండేది. అలాంటిది ఆగర్భ శతృవు బాలినేని శ్రీనివాస రెడ్డితో పొసగలేక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్టాండింగ్ కమిటీ వేయటానికి సుముఖత చూపటం లేదు. బాలినేని జనసేన పార్టీలో చేరినా ఇప్పటి వరకు వీళ్లిద్దరూ ఒకే వేదికను పంచుకున్నది కూడా లేదు. కూటమి పార్టీల్లో విభేదాలు నగరాభివృద్ధికి అవరోధంగా మారాయనడంలో సందేహం లేదు. ఒంగోలు కార్పొరేషన్లో కూటమి పార్టీల మధ్య వర్గ పోరు స్టాండింగ్ కమిటీ కాల పరిమితి పూర్తయి ఏడాది ఇప్పటికీ వెలువడని నోటిఫికేషన్ జనసేన సభ్యులు కూడా ఎక్కువగా ఉండటంతో ముందుకు రాని ఒంగోలు ఎమ్మెల్యే ప్రస్తుతం కౌన్సిల్లో టీడీపీ 25, జనసేన 21, వైసీపీకి 4 కార్పొరేటర్లు నగరంలో కుంటుపడుతున్న అభివృద్ధినగరాభివృద్ధిలో కీలకపాత్ర నగరాభివృద్ధిలో స్థాయీ సంఘం పాత్ర కీలకం. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నెలలో 4 సార్లు కమిటీ సమావేశం కావచ్చు. మేయర్, కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్టాంగింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనాలి. నగరం అభివృద్ధికి సంబంధించి ఆ సమావేశాల్లో చర్చ జరుగుతుంది. రూ.40 లక్షల వరకు ఈ కమిటీ ఆమోద ముద్ర వేయవచ్చు. రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు స్టాండింగ్ కమిటీకి పవర్ ఉంది. రూ.10 లక్షల లోపు అయితే కమిషనర్ అనుమతి సరిపోతుంది. కౌన్సిల్ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది. స్టాండింగ్ కమిటీకి అలాంటి నిబంధనలు ఏమీ లేవు. స్టాండింగ్ కమిటీ లేకపోవటంతో మేయర్ ద్వారా ముందస్తు అనుమతులు తీసుకుని అభివృద్ధి పనులను చేపట్టి తరువాత వాటిని కౌన్సిల్ ఆమోదింప చేసుకుంటున్నారు. దాంతో వర్కుల్లో వచ్చే పర్సెంటేజీలు పాలక మండలి ప్రధాన నేతతో పాటు అధికారులకు పంట పండుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా ఎక్సెస్లే కాబట్టి నియోజకవర్గ ముఖ్య నేతను ప్రసన్నం చేసుకుని జేబులు నింపుకుంటున్నారు. -
పరిహారం..ప్రశ్నార్థకం.!
కనిగిరిరూరల్: ఎన్‌హెచ్ 565 బైపాస్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.. రోడ్డు పనులు కూడా చివరి దశకు చేరాయి.. భూమి నష్టపోతున్న బాధితులకు నష్టపరిహారం మాత్రం అందలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నష్టపరిహారం అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా కనిగిరి బైపాస్ భూ బాధితుల నష్టపరిహారం ప్రశ్నార్థకంగా మారింది. తొలి విడతలో బడా రైతులకు భూ పరిహారం అందించిన అధికారులు.. చిన్న, సన్నకారు రైతులకు భూ నష్టపరిహారం అందించే విషయంలో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సెంటు నుంచి 5 సెంట్ల వరకు భూములు, ప్లాట్లు కోల్పోయిన బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. 48 మంది సన్నకారు రైతుల పరిహార జాబితా వెనక్కి..? ఏ శాఖ అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ 48 మంది చిన్న భూ బాధిత రైతుల పరిహార జాబితా వెనక్కి వచ్చినట్లు తెలిసింది. భూసేకరణ సెక్షన్ అధికారులు అలసత్వంతో గత నెలలో ఫైల్ పంపించడం వల్లే వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ వాలిడ్ ఫైనాన్షియల్ ఇయర్ అనే కారణం చూపుతూ జాతీయ రహదారుల అథారిటీ పరిహారం జాబితాకు తిప్పి పంపింది. అయితే మార్చిలోనే తాము ఫైల్ పెట్టామని, పరిహార జాబితా శాంక్షన్ కాకుండా ఎందుకు వెనక్కి పంపారో తెలియదని కలెక్టరేట్ లోని ల్యాండ్స్ సెక్షన్ అధికారులు బుకాయిస్తున్నారు. రెండు శాఖల మధ్య పొంతన లేని సమాధానాలు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. కనిగిరిలో ఎన్‌హెచ్ 656 రోడ్డు నిర్మాణ సమయంలో భూ బాధితులందరికీ న్యాయం చేస్తామని, అభివృద్ధిని ఎవరూ అడ్డు కోవద్దని, ప్రతి ఒక్కరికీ పరిహారం ఇప్పిస్తామని డివిజన్, జిల్లా స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహించి రోడ్డు పనులు సాఫీగా జరిగేలా చూశారు. కానీ చిన్న చితకా రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో మాత్రం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు. ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షణ చేయకపోవడంతో 48 మంది సంబంధించిన పరిహార జాబితా వెనక్కి వచ్చినట్లు తెలిసింది. జాతీయ రహదారుల సంస్థ( నేషనల్ హైవే అథారిటీ) పరిహారం కోసం బాధితులు రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్‌హెచ్ అధికారులు తిప్పి పంపిన ఫైల్‌తో పాటు ఇంకా క్లెయిమ్స్ పెట్టని భూ బాధితులు మరి కొందరున్నారు. బైపాస్ రోడ్డు బాధితులకు సంబంధించి సుమారు రూ .13 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా 60 శాతం కూడా పరిహారం చెల్లింపులు పూర్తి కాలేదని సమాచారం. తమకు రావాల్సిన పరిహారంపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు దృష్టి సారించి న్యాయం చేయాలని సన్న, చిన్న కారు భూ బాధితులు కోరుతున్నారు. ఎస్‌హెచ్ 565 భూ బాధితుల్లో హై టెన్షన్ పూర్తి కావస్తున్న రోడ్డు నిర్మాణం..దక్కని పరిహారం ఫైనాన్షియల్ ఇన్ వాలిడ్ సాకుతో 48 మందికి మొండిచెయ్యితహసీల్దార్ ఏమంటున్నారంటే.. దీనిపై స్థానిక తహసీల్దార్ రవి శంకర్‌ను సాక్షి వివరణ కోరగా ఇన్వాలిడ్ ఫైనాన్షియల్ ఇయర్ కారణంతో ఫైల్ వెనక్కి వచ్చినా... మళ్లీ ఫైల్‌ను రీ శాంక్షన్‌కు పంపిస్తామన్నారు. దీని వల్ల బాధితులకు ఎటువంటి నష్టం జరగదన్నారు. త్వరలోనే హైవే రోడ్డు బాధితులందరికీ పరిహారం నిధులు పడుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి
ఒంగోలు వన్‌టౌన్: ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమ బాట పడతామని మాల ఉద్యోగుల సంఘం, మాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ అశోక్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాలలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను చీల్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రపన్నాయన్నారు. పిఠాపురంలో మాలలను గ్రామ బహిష్కరణ చేయడాన్ని ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై మౌనం దాల్చడం కుల వివక్షేనన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వర్గీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎం శాంతారావు, కే ఏడుకొండలు, బీ రాజు, పీ మాల్యాద్రి, వై రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్
● ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ మార్కాపురం: గంజాయి విక్రయించే వారిపై, పదే పదే గంజాయి కేసులో అరెస్టు అయిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఏఈఎస్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. మార్కాపురం, కంభం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి ఎకై ్సజ్ స్టేషన్ల సీఐలతో నాటుసారా, గంజాయి, నాన్ డ్యూటీపెయిడ్ మద్యంపై సమీక్ష నిర్వహించారు. నాటుసారా తయారుచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదే పదే ఈ కేసుల్లో అరెస్టు అయ్యేవారిపై పీడీ యాక్టు పెట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్ హేమంత నాగరాజు, ఎన్ఫోర్సుమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ, ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్, మార్కాపురం ఏఈఎస్ బాలయ్య, సీఐ వెంకటరెడ్డి, ఎస్సై గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డగోలుగా నరికేద్దాం..!
పీసీపల్లి: కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలకు కొదవ లేకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యాన్ని అలుసుగా చేసుకొని గ్రామాల్లో టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని గుంటుపల్లి సర్వే నంబర్ 5లో పదేళ్ల క్రితం ప్రభుత్వం 70 ఎకరాల్లో జామాయిల్ మొక్కలు నాటింది. ప్రస్తుతం జామాయిల్ చెట్లు ఏపుగా పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతల కన్ను ఈ చెట్లపై పడింది. గత 10 రోజులుగా 70 ఎకరాల్లోనూ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జామాయిల్ చెట్లను నరికేస్తున్నారు. టన్ను రూ.6 వేల నుంచి రూ.7 వేల చొప్పున అడ్డగోలుగా అమ్మేసి జేబులు నింపుకుంటున్నారు. ఒక లారీకి 20 నుంచి 25 టన్నుల కర్ర లోడ్ చేయవచ్చు. ఇలా లారీ కర్రను రూ.1.50 లక్షలకు విక్రయిస్తూ రోజుకు రెండు లారీల చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ నరికివేతకు అధికారుల అండ 70 ఎకరాల్లో అక్రమంగా జామాయిల్ నరికేసి తరలిస్తున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనిపై గ్రామస్తులు అటవీ, రెవెన్యూ శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ వైపు ఎవరూ రాకుండా అధికారులు కిందిస్థాయి సిబ్బందిని సైతం పహారా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు, అక్రమార్కులు కుమ్మకై ్క ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అటవీ భూముల్లో అక్రమంగా జామాయిల్ నరికివేత 70 ఎకరాల్లో నరికి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు రోజుకు రెండు లారీల కర్ర తరలింపు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు -
విద్యుదాఘాతానికి ఇద్దరు దుర్మరణం
పెద్దదోర్నాల: వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతానికి ఇద్దరు మృతి చెందారు. నివాసగృహంలో ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా చేతికి వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురై యువకుడు దుర్మరణం మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గంటవానిపల్లెలో సోమవారం జరిగింది. ఘటనలో యలకపాటి ఏసుదానం (40) మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు .. యలకపాటి ఏసుదానం తన ఇంట్లోని టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా హై ఓల్టేజీ వచ్చింది. ఈ క్రమంలో ఫ్యాన్ వైర్ చేతికి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకుతరలించారు. మృతునికి భార్య, కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏసుదానం మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మార్కాపురం: విద్యుదాఘాతానికి వెస్ట్ బెంగాల్ కార్మికుడు మృతి చెందాడు. రూరల్ ఏఎస్సై శ్రీనివాసరావు వివరాల మేరకు..వెస్ట్బెంగాల్రాష్ట్రం లోని మాల్దా జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన షేక్ రబూల్ (24) విద్యుత్ కార్మికునిగా పనిచేస్తూ ఇటీవల మార్కాపురం మండలం తిప్పాయిపాలెం గ్రామం వద్ద జరుగుతున్న 11 కేవీ విద్యుత్‌లైను పనులకు వచ్చాడు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం పనిచేస్తుండగా తీగలకు విద్యుత్‌సరఫరా వచ్చి షాక్‌కు గురయ్యాడు. వెంటనే జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకోం
ఒంగోలు టౌన్: గుండాయపాలెం ఎంపీటీసీ ఐలా వాణి భర్త ఏడుకొండలపై తప్పుడు ఫిర్యాదులు చేసిన వారు అంతకు రెండింతలు అనుభవిస్తారని, తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తే ఊరుకోమని వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్చార్జి చుండూరు రవిబాబు హెచ్చరించారు. గుండాయపాలెం ఎంపీటీసీ ఐలా వాణి భర్త ఏడుకొండలు అక్రమ అరెస్టు, నిర్భందాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు, లీగల్ సెల్ న్యాయవాదులతో కలిసి మంగళవారం మధ్యా హ్నం తాలుకా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి గాయపడిన వారిని అరెస్టు చేయడమేంటని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగంలో తాము పనిచేస్తున్నామని సంగతిని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. అర్ధరాత్రి అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించడమేంటని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని ఎక్కడ ఉంచారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. బాధిత కుటుంబం, న్యాయవాదులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారని, పోలీసుల కస్టడీలో ఉన్న వారితో కలిసి మాట్లాడాల్సి ఉందని చెప్పారు. అసలు ఏడుకొండలపై ఏ కేసు పెట్టారో, ఎందుకు నిర్బంధించారో, ఎక్కడున్నారో అడుగుతుంటే సమాధానం చెప్పకపోతే ఎలా అని నిలదీశారు. సాయంత్రం లోగా పోలీసులను కోర్టులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులపై పెట్టిన కేసుల వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. వారిపై ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఏడుకొండలు కుటుంబం గొడవలకు దూరంగా ఉంటారని, వివాదాలంటే అమడ దూరం పారిపోయే అమాయకులపై కూటమి నాయకులు దాడి చేయడం దారుణమన్నారు. ఈ విషయం గురించి గుండాయపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొందరినీ అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని, ఇదంతా ఒంగోలు రాజకీయమని చెబుతున్నారని తెలిపారు. ఈ కేసుల వెనుక ఉన్న ఒంగోలు వ్యక్తులు ఎవరో చెప్పాలన్నారు. ఎంపీటీసీ ఐలా వాణి మాట్లాడుతూ గ్రామంలోని రామాలయం సెంటర్లో షాపులో ఉన్న మాపై పెదసింగి వెంకటేశ్వర్లు అనే టీడీపీ నాయకుడు వచ్చి దాడి చేసి కొట్టారని చెప్పారు. దాడిలో గాయాలయ్యాయని సీఐకి చెప్పినా పట్టించుకోకపోగా, బాగానే ఉందిగా అన్నాడని తెలిపారు. తన భర్తకు షుగర్ వుందని, నిన్నటి నుంచి మందులు కానీ, ఆహారం ఇవ్వలేదని, ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి రవణమ్మ, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, తాతా సరసింహరావు, మలిశెట్టి దేవ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకు రెండింతలు అనుభవిస్తారు టీడీపీ జీతాలు ఇవ్వడం లేదన్న సంగతి పోలీసులు గ్రహించాలి బాధితులకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవిబాబు హెచ్చరిక -
డెయిరీ భూములను పరిశీలించిన జేసీ
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీ భూములను జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భూములను అత్యవసరంగా సర్వే చేసి వాటి హద్దులను, హద్దురాళ్లను ఏర్పాటు చేయాలని రెవిన్యూ, సర్వే అధికారులను ఆదేశించామన్నారు. ఈ సందర్భంగా కొంతమంది తమకు పేర్నమిట్ట సర్వే నెంబర్ 140లో ఇంటి నివేశన స్థలాలను రిజిస్టర్ డాక్యుమెంట్లు ద్వారా కొనుగోలు చేశామని జాయింట్ కలెక్టర్‌కు దృష్టికి తీసుకొచ్చారు. డాక్యుమెంట్లను తీసుకొని పరిశీలించి తగు చర్యలను తీసుకోవాల్సిందిగా ఒంగోలు ఆర్డీఓను, సంతనూతలపాడు తహశీల్దార్‌ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, సంతనూతలపాడు తహసీల్దార్, సర్వే, భూ రికార్డుల అధికారులు ఉన్నారు. బస్టాండ్‌లో గడువు తీరిన కూల్‌డ్రింక్స్ విక్రయం ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రం ఒంగోలు ఆర్టీసీ డిపోలో గడువు తీరిన కూల్ డ్రింక్స్ విక్రయించడం మంగళవారం కలకలం సృష్టించింది. ఉప్పుగుండూరుకు చెందిన మహిళ రెండు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ డిపోకు వచ్చింది. బస్సు వచ్చిన హడావుడిలో డిపోలోని ఒక షాపులో కూల్ డ్రింక్ కొనుక్కొని వెళ్లి బస్సెక్కింది. బస్సులో డ్రింక్ తాగిన కొద్దిసేపటికి ఆమెకు కడుపులో తిప్పడం మొదలైంది. అనుమానం వచ్చి కూల్ డ్రింక్ బాటిల్ తీసి చూడగా దానిపై తేదీ మించి మూడు నెలల కావస్తోంది. ఇది గమనించిన ఆమె ఆందోళనకు గురైంది. తిరిగు ప్రయాణంలో ఆదివారం ఒంగోలులో బస్సు దిగింది. కూల్ డ్రింక్ షాపు యజమాని వద్దకు వెళ్లి అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకో..అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. డిపో అధికారులకు ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో చేసేదేమి లేక వెళ్లిపోయారు. ప్రతి బాటిల్‌పై 10 రుపాయలు అదనంగా తీసుకుంటూ కూడా ఇలా గడువుతీరిన కూల్ డ్రింకులను విక్రయించడం దుర్మార్గమని బాధిత మహిళ వాపోయారు. ఈ విషయం గురించి డిపో మేనేజర్ డి.శ్రీనివాసులును వివరణ అడిగితే షాపును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ప్రభాకర్ రావు దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతానికి తాను చీరాలలో ఉన్నానని, ఒంగోలు వచ్చిన తర్వాత తనిఖీ చేసి చర్యలు తీసుకుంటానని తెలిపారు. గడువు తీరిన వస్తువులను విక్రయించిన దుకాణాదారుడిని కఠినంగా శిక్షించాలని ప్రయాణికులు కోరుతున్నారు. శిక్షణ హాజరు 75 శాతం ఉంటేనే కుట్టు మిషన్లు ఒంగోలు వన్‌టౌన్: కుట్టు శిక్షణకు హాజరు 75 శాతం ఉంటేనే ఉచితంగా కుట్టు మిషన్లు మంజూరు చేస్తామని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 5363 మందికి కుట్టుపై శిక్షణ ఇస్తామన్నారు. దీనిలో భాగంగా దర్శి మండలంలో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి 288 మందికి కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దర్శి సచివాలయం 5 పరిధిలోని శివాజీనగర్‌లో, దర్శి సచివాలయం 2 పరిధిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలకు కుట్టు మిషన్లను ఉచితంగా అందించడమే కాకుండా భవిష్యత్తులో స్వయం శక్తితో ఎదిగేందుకు వీలుగా సబ్సిడీ రుణాలు కుడా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
జగనన్నకే సాధ్యం
సంక్షేమ పథకాల అమలుమార్కాపురం: ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం జగనన్నకే సాధ్యమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ మంత్రి సురేష్ అన్నారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పట్టణంలోని అమ్మవారిశాల బజారులో వైఎస్సార్ సీపీ విద్యుత్ ప్రభపై ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే జగనన్నే సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి నెలా ఒక ఇంటికి వెళ్లి పరామర్శించి వారికి ఇల్లు మంజూరు చేస్తే ప్రజలందరికీ ఇళ్లు ఇచ్చినట్టేనా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మనసుతో కుల, మత, ప్రాంత, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చారన్నారు. జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలు, పోర్టులు నిర్మిస్తే వాటిని ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఏ సీఎం అయినా రాష్ట్రానికి మెడికల్ సీట్లు కావాలని కేంద్రాన్ని కోరతారని, మన రాష్ట్రానికి 750 మెడికల్ సీట్లు వస్తే చంద్రబాబు వెనక్కి పంపారన్నారు. ప్రజలు కాదు..ఈవీఎంలే ఓడించాయి. వైఎస్సార్ సీపీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓడించలేదని, ఈవీఎంలే ఓడించాయని పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. కేవలం 10 నెలల కాలంలోనే ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇంత రాత్రయినా కూడా ఇన్ని వేల మంది ప్రజలున్నారంటే వైఎస్సార్ సీపీపై ఎంతటి అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. నేను గెలిచినా.. ఓడినా మీ మధ్యనే ఉంటా.. మీ ఆత్మీయతను అభిమానాన్ని స్వీకరిస్తా. వచ్చే ఎన్నికల్లో జగనన్నను సీఎంగా గెలిపించుకుందామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసుకుందామన్నారు. మాజీ మంత్రి సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 10 నెలల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కులం, మతం, ప్రాంతం చూడకుండా అభివృద్ధి పనులు చేస్తే కూటమి నేతలు మాత్రం వైఎస్సార్ సీపీ వారికి పనులు చేయమని చెప్పారన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్ల విలువైన భూమిని 99 పైసలకు ప్రభుత్వం ఇస్తోందని, అదే క్వార్టర్ బాటిల్‌ను రూ.99లకు అమ్ముతోందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తానని, మార్కాపురం జిల్లా చేస్తామని హామీఇచ్చి 10 నెలలు కావస్తున్నా ఇంత వరకూ అమలు కాలేదన్నారు. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయనని, ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు మాట్లాడుతూ తాను గెలిచినా.. ఓడినా.. ప్రజల మధ్యనే ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, అన్నా కృష్ణచైతన్య, మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, పొల్యూషన్ బోర్డు మాజీ సభ్యుడు వెన్న హనుమారెడ్డి, మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు జెడ్పీటీసీలు నారు బాపన్‌రెడ్డి, ఏడుకొండలు, ఇందిర, ఎంపీపీలు లక్ష్మీదేవి కృష్ణారెడ్డి, భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, మురళీకృష్ణ యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వైవీరావు, పీఎల్పి యాదవ్, కౌన్సిలర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు. అందరం సమష్టిగా మళ్లీ జగనన్ననుసీఎం చేసుకుందాం 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఒక్క హామీనైనా అమలు చేశారా..? పార్టీ నేతలు కారుమూరి, చెవిరెడ్డి, బూచేపల్లి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, అన్నా, సురేష్, చంద్రశేఖర్ -
గడియార స్తంభం తొలగించొద్దు
● కలెక్టర్‌కు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వినతి దర్శి(కురిచేడు): దర్శికి తలమానికంగా ఉన్న గడియార స్తంభాన్ని తొలగించవద్దని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గడియార స్తంభాన్ని ఏర్పాటు చేశారని, అప్పటి పంచాయతీ అధికారులు, రోడ్లు భవనాల శాఖాధికారుల అనుమతి తీసుకొని నిర్మించిన ఈ రోడరీ గడియార స్తంభం దర్శికి తలమానికంగా నిలిచిందన్నారు. పాతికేళ్ల గొప్పచరిత్ర కలిగిన గడియార స్తంభాన్ని ఇప్పటికప్పుడు ఆకస్మాత్తుగా తొలగించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అకారణంగా గడియార స్తంభం తొలగిస్తే దర్శి ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. గడియార స్తంభాన్భి యధాస్థితిలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య మార్కాపురం టౌన్: మానసిక, అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని జగదీశ్వరీ ధియేటర్ రోడ్డు బాలగురవారెడ్డి బజారులో జరిగింది. కాలనీలో నివాసం ఉండే సింగరి కాశీరావు (52) కొంత కాలంగా మానసిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మెడలో గొలుసు చోరీ మార్కాపురం: రథోత్సవం సందర్భంగా స్వామిని చూసేందుకు వచ్చిన మహిళ మెడలో గొలుసు చోరీకి గురైంది. ఈ మేరకు పట్టణ పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే..మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన కాళంగి బాలరాజు భార్య కాళంగి వెంకట పిచ్చమ్మ చెన్నకేశవస్వామి వారి రథోత్సవాన్ని తిలకించేందుకు రథం వద్దకు వచ్చి టెంకాయ కొట్టి బయటకు వచ్చి చూసుకోగా మెడలో మూడు తులాల గొలుసు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై లాఠీచార్జి గిద్దలూరు రూరల్: పట్టణంలోని అర్బన్ కాలనీలో నివాసం ఉంటున్న ధన్‌రాజ్, రాముడు ఇరువర్గాలకు చెందిన వారు గత రెండు రోజుల క్రితం ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. గాయాలపాలై గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులు సోమవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ కె.సురేష్ సిబ్బందితో లాఠీచార్జి చేసి ఘర్షణను అదుపులోకి తీసుకువచ్చారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. -
అంతర్‌జిల్లాల దొంగలు అరెస్టు
సింగరాయకొండ: గంజాయి అక్రమ రవాణాతో పాటు దేవాలయాలు, గృహాలే లక్ష్యంగా చోరీకి పాల్పడుతూ జిల్లాలో సుమారు 70 దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల సొత్తు, నాలుగున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ హజరత్తయ్య వివరాలు వెల్లడించారు. పేర్నమిట్టకు చెందిన చిడితోటి మధుబాబు, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రాకూరి దుర్గారావు, గుంటూరు జిల్లా లాలాపేట ఏరియాలోని పట్నం బజారులో నివసిస్తున్న తెలంగాణ రాష్ట్రం యాదగిరి గుట్ట మండలం యదగిరిపల్లి గ్రామానికి చెందిన పత్తి రవి, సింగరాయకొండ మండలం గుజ్జల యలమందారెడ్డినగర్కు చెందిన కుంచాల గురవమ్మలను అదుపులోకి తీసుకున్నామన్నారు. మధుబాబుపై తాళ్లూరు పోలీసుస్టేషన్లో మూడు, జరుగుమల్లిలో రెండు, అద్దంకిలో ఒకటి, నాగులుప్పలపాడులో రెండు, పొదిలిలో ఒకటి, వినుకొండలో ఒకటి, కందుకూరు రూరల్‌లో ఒక కేసు ఉన్నాయి. రాకూరి దుర్గారావుపై తాళ్లూరులో రెండు, కందుకూరు రూరల్‌లో ఒక కేసు, పత్తి రవికి మద్దిపాడులో ఒకటి, సింగరాయకొండలో రెండు కేసులు ఉన్నాయన్నారు. మధుబాబు అంతర్‌జిల్లాల్లో సుమారు 70 వరకు చోరీలకు పాల్పడ్డాడన్నారు. ముఖ్యంగా దేవాలయాలే లక్ష్యంగా చోరీకి పాల్పడి ఆలయంలో ఉన్న గంట, ఇత్తడి సామాను, విగ్రహాలు, దేవుని మండపం, శిలాతోరణాలు ఇలా ఏ వస్తువుని వదలకుండా చోరీ చేసేవాడన్నారు. ఇళ్లలోకి చోరీకి వచ్చినప్పుడు బంగారం, వెండి వస్తువులతో పాటు విలువైన ఫర్నీచర్, రిఫ్రిజరేటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చోరీ చేస్తాడని వివరించారు. ఈ కేసులో అరెస్టు అయిన నలుగురిలో ఒకరైన వృద్ధురాలు కుంచాల గురవమ్మ పోలీస్‌స్టేషన్ సెంటర్లో శనక్కాయలు అమ్ముకుంటూ జీవించేది. శనక్కాయల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవటంతో రైలులో రాజమండ్రి వెళ్లి గంజాయి కేజీ రూ.1,500 కొనుగోలు చేసి ఇక్కడ రూ.5 వేలకు విక్రయిస్తుందని తెలిపారు. వృద్ధురాలి వద్ద మధుబాబు, దుర్గారావు, రవికుమార్‌లు కేజీ గంజాయి రూ.5 వేల కొనుగోలు చేసి విక్రయించేవారు. సోమవారం వీరు ముగ్గురు గురవమ్మ వద్దకు వచ్చి గంజాయి కొనుక్కొని వెళుతుండగా వారిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ హజరత్తయ్య వివరించారు. కేసులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర, సిబ్బందిని ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. దేవాలయాలే లక్ష్యంగా చోరీలు నలుగురు నిందితులు అరెస్టు గంజాయి రవాణాలో సిద్ధహస్తులు రూ.10 లక్షల చోరీ సొత్తు, నాలుగున్నర కేజీల గంజాయి స్వాధీనం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ హజరత్తయ్య -
కదిలొచ్చిన దేవదేవుడు
మార్కాపురం టౌన్: స్థానిక లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం అశేషజనవాహిని మధ్య కన్నుల పండువగా జరిగింది. వేలాదిగా భక్తులు స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్నారు. జై చెన్నకేశవా.. జైజై చెన్నకేశవా.. గోవిందా నామస్మరణలతో స్వామి వారిని దర్శించుకుని రథచక్రాలకు టెంకాయలు, గుమ్మడికాయలను కొట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రథం బయలుదేరినప్పటి నుంచి మళ్లీ తిరిగి యథాస్థానం చేరే వరకు భక్తులు పోటీపడి రథాన్ని ముందుకు లాగి తమ భక్తిని చాటుకున్నారు. పట్టణంతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా పాల్గొని స్వామి వారి రథోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి రథయాత్ర ప్రారంభమై మెయిన్ బజార్, పాత బస్టాండ్, నాయుడు వీధి మీదుగా యథా స్థానానికి చేరింది. సాయంత్రం 5 గంటల నుంచే పట్టణానికి వేలాది మంది భక్తుల రాక మొదలైంది. జెండా ఊపి రథోత్సవాన్ని అధికారులు ప్రారంభించారు. ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవం ఏర్పాట్లు జరిగాయి. స్వామివారిని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సబ్‌కలెక్టర్ త్రివినాగ్, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సీనియర్ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఒంగోలు, మార్కాపురం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, కందుల నారాయణరెడ్డి, బీజేపీ, జనసేన ఇన్చార్జిలు పీవీ కృష్ణారావు, ఇమ్మడి కాశీనాథ్ తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. భద్రత ఏర్పాట్లు: పట్టణంలో రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు ఆధ్వర్యంలో సీఐ సుబ్బారావు తోపాటు మరో ఐదుగురు సీఐలు, ఎస్సైలు సైదుబాబు, రాజమోహన్‌రావు, అంకమరావు, అహరోన్లతో పాటు 14 మంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుల్స్, స్పెషల్ పార్టీల పోలీసులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. కన్నుల పండువగా చెన్నకేశవుని రథోత్సవం తిలకించిన లక్షలాది మంది భక్తులు -
హామీలు నెరవేర్చలేనన్న ఏకై క సీఎం చంద్రబాబు
యర్రగొండపాలెం: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడని, అధికారంలోకి వచ్చాక ఈ సూపర్ సిక్స్ నేను చేయలేను, నాకు చేతకాదని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబేనని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సోమవారం ఆయన మాట్లాడారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. మన నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. మనందరి లక్ష్యం ఒక్కటేనని, 2029లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవటం, ఎమ్మెల్యే తాటిపర్తిని మళ్లీ 30 వేల మెజార్టీతో గెలిపించడమేనని, మేము ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలో టీడీపీకి ఏ మాత్రం అభిమానం లేకపోయినా అధికారం ఉందన్న అహంకారంతో ఎంపీపీ పీఠాన్ని అధిష్టించాలనుకొని చతికిల పడ్డారని అన్నారు. ఒక ఎంపీటీసీ ఆళ్ల ఆంజనేయరెడ్డిని జైల్లో పెట్టించి, ఇంకొక ఎంపీటీసీ కృష్ణను ఇంట్లో అరెస్ట్ చేసి, మరొక ఎంపీటీసీ సృజనను తీసుకొనివెళ్లి వాళ్ల ఇంట్లోనే పెట్టుకొని ఎన్నో కుయుక్తులు పన్నారని అన్నారు. మండల పరిషత్‌లో సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలని, వైఎస్సార్ సీపీ జెండా మనకు అండగా ఉందని గ్రామాల్లో తెలపాలన్నారు. విశాఖలో అత్యంత ఖరీదైన భూమి మాత్రం ఎకరా 99 పైసలు, క్వార్టర్ మద్యం బాటిల్ మాత్రం రూ.99 అని.. ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం చేసే పని అన్నారు. ఇక్కడ గెలిచిన ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్‌లకు సంబంధం లేకుండా, తీర్మానాలు లేకుండా పనులు చేసుకుంటూ పోతూ ఉంటే తాము ఊరుకునే ప్రసక్తేలేదని, దెబ్బకు దెబ్బ తీస్తామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ కార్యకర్తలతోనే పార్టీ నడుస్తుందని, అటువంటి కార్యకర్తలకు జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పేదలకు ఏ ఒక్క పథకం అందడంలేదని, రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నూతనంగా ఎంపికై న ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, కార్యదర్శి కె.ఓబులరెడ్డి, వైపాలెం ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీలు యేర్వ చలమారెడ్డి, వాగ్యా నాయక్, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, పి.కృష్ణారెడ్డి, జి.వెంకట రమణారెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్, బూత్ కన్వీనర్ల నియోజకవర్గ అధ్యక్షుడు ఒంగోలు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మను అభినందించిన కారుమూరి, చెవిరెడ్డి త్రిపురాంతకం ఎంపీపీగా పదవీ స్వీకారం చేస్తున్న ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డిని సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. వారితోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు సుబ్బమ్మతోపాటు ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీటీసీ సభ్యులు సృజన, కృష్ణలను వారు అభినందించారు. ముందుగా బస్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తనను అభినందించటానికి తమ ఇంటి వద్దకు వచ్చిన వారికి సుబ్బమ్మ శాలువకప్పి ఘనంగా సన్మానించారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి -
వాట్సప్ గవర్నెన్స్‌పై అవగాహన పెంచండి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: మన మిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్, శక్తి యాప్‌లను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్, శక్తి యాప్ అవగాహన కార్యక్రమాలు, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు పని దినాలు కల్పించాలన్నారు. ఆదివారం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో ఏ..ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, డీపీఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు పాల్గొన్నారు. -
మత్తు.. భవిత చిత్తు!
నగరంలో ఎటు చూసినా గంజాయేగంజాయిపై ఉక్కుపాదం.. పట్టణాల్లో గంజాయి సేవిస్తున్న వారిపై నిఘా ఉంచాం. వారి ద్వారా సరఫరాదారుల వివరాలు సేకరిస్తున్నాం. గంజాయికి సంబంధించి పాత కేసులు ఉన్న వారిని పిలిపించి వివరాలు సేకరిస్తున్నాం. డాగ్ స్క్వాడ్లతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. గంజాయికి బానిసలు కావొద్దు..జీవితాలు నాశనం చేసుకోవద్దు అంటూ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను సైతం భాగస్వాములను చేస్తున్నాం. – ఏఆర్ దామోదర్, ఎస్పీ ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టుతో కలకలం.. ఇటీవల టంగుటూరు పరిధిలో గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్న ఒక ఇంజినీరింగ్ విద్యార్థిని అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. వల్లూరు సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థి వైజాగ్ నుంచి 5 కిలోల గంజాయి తీసుకొచ్చి హాస్టల్లో ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని జైలుకు పంపించారు. జిల్లాను గంజాయి మత్తు కమ్మేస్తోంది. పట్టణం..పల్లె అనే తేడా లేకుండా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చిల్లర కొట్లు..కాలేజీల పరిసరాల్లో సులువుగా లభ్యమవుతోంది. జిల్లా కేంద్రం మొదలు పశ్చిమ ప్రకాశం అంతటా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, బీఈడీ, డిగ్రీ, ఇంటర్మీడియెట్ కళాశాల విద్యార్థులే టార్కెట్‌గా దీనిని విక్రయిస్తున్నట్టు సమాచారం. పోలీసులు దాడులు చేస్తున్నా విక్రయాలు మాత్రం ఆగడంలేదు. కొంతమంది పోలీసులు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ఒంగోలు టౌన్: గంజాయి అమ్మకాలకు జిల్లా అడ్డాగా మారుతోంది. గతంలో పట్టణాల్లో మాత్రమే దొరికే గంజాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు గంజాయి దొరకని మండల కేంద్రం లేదు. యువకులు గంజాయికి అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. గంజాయికి బానిసలైన యువకులు చేతిలో డబ్బులు లేక దొంగతనాలకు వెనుకాడడం లేదు. జైలుపాలై కన్నవారికి కడగండ్లు మిగిల్చుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కొండపి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి నియోజకవర్గాల పరిధిలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ మార్కాపురంలోని ఎస్టేట్ ఏరియాలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పది రోజుల వ్యవధిలో ఒడిశాకు చెందిన అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేశారు. రైల్వే బ్రిడ్జి కింద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. గత నెలలో గిద్దలూరు పట్టణంలో తెలంగాణ నుంచి వచ్చి విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. దర్శి పట్టణంలోని చౌడవరం రోడ్డుతో పాటుగా తూర్పు గంగవరం, ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ మండలాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. దొనకొండలో రైలు మార్గంగుండా గంజాయి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలంలో ఊరి బయట ఉన్న ఒక సినిమా హాలు పరిసరాల్లో, తిరుమల నగరి కాలనీతో పాటుగా కొలుకుల, వీరభద్రాపురం, త్రిపురాంతకం మండంలంలోని నడిగడ్డ తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. 6 నెలల క్రితం యర్రగొండపాలెంలో గంజాయి కేసులో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. గతంలో కూడా ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ పేరుతో యర్రగొండపాలెం, త్రిపురాంతకం, దోర్నాల పోలీసు స్టేషన్లకు తిప్పినట్లు తెలుస్తోంది. ఎక్కువగా 15 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు గంజాయి బారిన పడుతుండటంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి మత్తులో రోడ్డు ప్రమాదాలు: ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గంజాయి ప్రభావం కనిపిస్తోంది. అనేక మంది యువకులు గంజాయి తాగిన మత్తులో వేగంగా వాహనాలు నడపడం, ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమైపోయింది. అర్ధరాత్రిళ్లు రోడ్డు మీదకు వచ్చి వేగంగా వాహనాలు నడుపుతూ అదుపుతప్పి పడిపోతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుని తల్లిదండ్రులకు కన్నీరు మిగుల్చుతున్నారు. కనిగిరి మండలంలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. బీచుల్లో జోరుగా విక్రయాలు జిల్లాలో కొత్తపట్నం, పాకల, కరేడు, ఈతముక్కలలో బీచ్‌లు, మల్లవరం డ్యామ్ ఉన్నాయి. శని, ఆదివారాలు వస్తే చాలు జిల్లాలో ఉన్న బీచుల్లో యువత సందడి కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే బీచ్‌లకు వచ్చే యువతీ యువకులను టార్గెట్ చేసుకొని కొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మైరెన్ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నారు. రాత్రి ప్రయాణాల్లో గంజాయి గొడవ... జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి చుట్టు పక్కల గ్రామాలకు, పట్టణాలకు రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఒంగోలు సమీప గ్రామాలకు నైట్ హాల్ట్ బస్సులు వెళుతుంటాయి. వినుకొండ, నరసరావుపేట, అద్దంకి, నెల్లూరు నుంచి కూడా నైట్ హాల్ట్ బస్సులు ఒంగోలుకు వస్తుంటాయి. ఇక ఒంగోలు మీదుగా రోజుకు వందకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. బస్సులు, రైళ్లలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా రాత్రి పూట ప్రయాణాల్లో గంజాయి, మద్యం తాగిన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒక్కోసారి ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మార్కాపురం నుంచి ఒంగోలు వస్తున్న ఒక ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎక్కిన వ్యక్తి గంజాయి మత్తులో ఒక మహిళ పక్కన కూర్చొని అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు ఇంజినీరింగ్, మెడికల్, ఇంటర్ విద్యార్థుల టార్గెట్‌గా అమ్మకాలు పశ్చిమ ప్రకాశంలో గంజాయి జోరు సెలవు రోజుల్లో బీచుల్లో విక్రయం కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టామంటున్న ఎస్పీ దామోదర్ జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఎటు చూసినా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నగర శివారులోని ఇంజినీరింగ్ కాలేజీల పరిసరాల్లో జోరుగా గంజాయి విక్రయిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. టంగుటూరు మండలం ఒంగోలు శివారు ప్రాంతంలోని ఒక దేవాలయం సమీపంలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే కొత్త కూరగాయల మార్కెట్ సమీపంలోని రెండు బిల్డింగులను అడ్డాగా చేసుకొని గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా, ఆర్టీసీ బస్టాండు సమీపంలోని పలు లాడ్జీల్లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ డిపో లోపలకు వెళ్లే దారిలో మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న షాపుల్లో కూడా గంజాయి లభ్యమౌతున్నట్లు సమాచారం. చింతల, కొప్పోలు టిడ్కో గృహాల ఎదురుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వదిలేశారు. అక్కడ ఖాళీ స్థలంలో గంజాయి తాగడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. కమ్మపాలెం ఫ్లై ఓవర్ కింద దశరాజుపల్లికి వెళ్లే దారిలో, అగ్రహారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ పక్కన, ఎఫ్‌సీఐ గోడౌన్ పరిసరాల్లో, రైలు పేట మొదటి లైనులోని ఒక బీడీ బంకులో, క్లౌవ్ పేట, గోపాల్ నగర్ 4వ లైను ఖాళీ స్థలాల్లో, గోపికృష్ణ థియేటర్ సమీపంలో గంజాయి అమ్మకాలు, సేవించడం జరుగుతున్నట్లు సమాచారం. రైల్వే స్టేషన్ పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్లు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. -
ఆన్లైన్ అర్జీలను కూడా పరిశీలించాలి
ఒంగోలు సబర్బన్: ఆన్లైన్లో వచ్చే అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో మీ కోసం భవన్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలన్నారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. మీ కోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లో అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని స్పష్టం చేశారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ‘మీ కోసం’ కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క ఆర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, వరకుమార్, డిప్యూటీ కలెక్టర్ పార్ధసారథితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గడువులోగా అర్జీలను పరిష్కరించాలి మీ కోసంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా -
పొగాకు రైతులను ఆదుకోవాలి
● వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు డిమాండ్ ఒంగోలు టౌన్: మార్కెఫెడ్ను రంగంలోకి దింపి పొగాకు రైతులను ఆదుకోవాలని, లేకుంటే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన త్రోవగుంట వద్ద ఉన్న పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని పార్టీ నాయకులు, పొగాకు రైతులతో కలిసి సందర్శించి అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేకుంటే పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడి వచ్చిందని ధరలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. మన రాష్ట్రంలో అధిక వర్షాలతో ఒకటికి రెండు సార్లు నాట్లు వేశారని, కలుపు పెరగడం, మల్లె వేయడం వల్ల దిగుబడి తక్కువగా వచ్చిందన్నారు. పంట ఖర్చులు పెరిగాయని, కూలి రేట్లు కూడా పెరిగాయని రైతులు చాలా నష్టపోయారని వివరించారు. ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, నిరుపేద రైతులు అధిక కౌలుకు బ్యార్నీలు తీసుకొని పంట వేశారని, ప్రస్తుత మార్కెట్ మాయాజలంలో నెగ్గుకురాలేక కంట కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017–18లో నాటి తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే జరగడంతో అనేక మంది పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతదేహాలను పొగాకు బోర్డు వద్ద పెట్టి రైతులు ఆందోళనకు దిగారని, రైతులకు మద్దతుగా నిలబడి ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెట్టి వేధించారని చెప్పారు. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు నాటి పరిస్థితే పునరావృతమయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేస్తేనే రైతులు నష్టాల ఊబి నుంచి బయట పడతారని చెప్పారు. పొగాకు రైతులు తొందరపడి తక్కువ ధరలకు పంటను అమ్ముకోవద్దన్నారు. అవసరమైతే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతులకు అండగా వచ్చి నిలబడతారని తెలిపారు. త్వరలోనే రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పొగాకు బోర్డును సందర్శించి రైతులతో మాట్లాడతారని తెలిపారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ధరల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, నాగులప్పలపాడు మండల అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, మద్దిపాడు మండల ఉపాధ్యక్షుడు కోటిరెడ్డి, పలువురు ఎంపీపీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ర్యాలీ
కంభం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఉదయం కంభం పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. స్థానిక జామియా మసీదు వద్ద నుంచి ముస్లింలు జాతీయ జెండాలు, ఫ్లకార్డులు చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. జామియా మసీదు సెంటర్ నుంచి సర్కిల్ కార్యాలయం, చౌక్సెంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మీదుగా కందులాపురం కూడలి వరకు ర్యాలీ సాగింది. కందులాపురం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి వక్ఫ్‌సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. శాంతీర్యాలికి ప్రజాసంఘాల సంఘీభావం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతిర్యాలీకి ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, పీఏఎఫ్, సీఐటీయూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపాయి. ఈ సంధర్భంగా ఎమ్మార్పీయస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి షాలెం రాజు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులు పూర్తిగా ముస్లింలకు సంబంధించినవేనని, అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ముస్లిం మత పెద్దలు పరిష్కరించుకుంటారన్నారు. టీటీడీ, ఇతర కమిటీల్లో ముస్లింలకు స్థానం కల్పించనప్పుడు పూర్తిగా ముస్లింలకు సంబంధించిన వక్ఫ్‌లో ముస్లింమేతరులకు ఎలా అధికారాలు కట్టబెడతారని ప్రశ్నించారు. వెంటనే వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల నాయకులు జయరాజ్, అన్వర్, ఇబ్రహీం, అబ్రహం, ముస్లిం పెద్దలు ప్రభుత్వ హాజీ ఆరీఫ్, ముఫ్తీ యాసీన్, కలాం, సయ్యద్ జాకీర్ హుస్సేన్, డిష్మున్నా, సయ్యద్ ఖాసిం, సయ్యద్ సలీం తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం: వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ముస్లింలు పెద్ద ఎత్తున్న శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాలు, మసీదుల నుంచి వచ్చిన ముస్లింలు స్థానిక బస్టాండ్ సెంటర్లోని నూరాని మజీద్ వద్దకు చేరుకున్నారు. కొంతమంది జాతీయ పతాకాలు, మరి కొంతమంది చట్టానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించి మార్కాపురం–మాచర్ల రోడ్డులో కదం తొక్కారు. వక్ఫ్‌ను కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజా స్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. ముస్లిం పెద్దలు, మౌలానాలు హిదాయతుల్లా, మహమ్మద్ ఉసేన్, యునిస్, జుబేర్, షేక్ జిలాని, సయ్యద్ షాబీర్, సయ్యద్ జబీవుల్లా, ఎం.కరీముల్లా బేగ్, షేక్ ఇస్మాయిల్, అమానుల్లాబేగ్, ఫజుల్, రఫీ, మస్తాన్‌వలి, షేక్ కాశింపీరా, షేక్ వలి, మహమ్మద్ కాశిం, కాశింబాష పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
కనిగిరిరూరల్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని.. వెంటనే రద్దు చేయాలని పలువురు ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు ను పార్లమెంటులో ఆమోదించడాన్ని నిరసిస్తూ కనిగిరిలో జమియత్ ఏ–ఉలమా, అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం కనిగిరిలో మహా నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అగ్రభాగాన సుమారు 200 మీటర్ల జాతీయ పతాకాన్ని తీసుకుని ముస్లిం యువత నడిచారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు సయ్యద్ యాసిన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. దేశంలో బీజేపీ సర్కార్ ముస్లింలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు సభ్యులుగా ముస్లిమేతరులను నియమించటం, ఎవరైతే వక్ఫ్ బోర్డుకు తమ ఆస్తులను, ధనాన్ని దానం చేయదల్చారో వారు ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరిస్తున్నట్లుగా తగిన ఆధారాలు చూపించటం, వక్ఫ్ ఆస్తుల మీద ఏదైనా వివాదాలు వస్తే ట్రిబ్యునల్ కు కలెక్టర్ స్థాయి అధికారిని నియమించటం, రాష్ట్ర బోర్డు అధికారాలను తగ్గించి పూర్తిస్థాయి అధికారాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం, ఈ చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఆరు నెలల్లోపు కేంద్ర ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు సంబంధిత పత్రాలు సమర్పించకపోతే ఆ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించటం, వక్ఫ్ పరిరక్షణ లో పారదర్శకత లేదని కలెక్టర్లకు పూర్తి బాధ్యత కల్పించటం, తదితర అంశాలతో ప్రభుత్వ జోక్యం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం ధార్మిక విషయాల్లో జోక్యం చేసుకొని తప్పుడు ఆలోచన విధానంతో ఈ అమెండ్మెంట్ చట్టం ను తీసుకొచ్చిందని తీవ్రంగా ఎండగట్టారు. మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, అంజుమున్ ఏ ఇస్లామియా కమిటీ అధ్యక్షుడు ఎస్ అహమ్మద్ హుస్సేనీ, మాజీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడు రోషన్ సందాని, ముఫ్తీలు, మౌలానాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం వెంటనే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ స్థానిక షాదీ ఖానా వద్ద నుంచి ఎమ్మెస్సార్ రోడ్డు, వైఎస్సార్ రోడ్డు, పామూరు బస్టాండ్ వరకు సాగింది. అనంతరం వివిధ డిమాండ్లతో వినతి పత్రాన్ని ఆర్డీఓ జీ కేశవర్ధన్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో జమియత్ ఉలమా, అంజుమన్ ఏ కమిటీ ఇస్లామియా కమిటీ, వివిధ సంఘాల నాయకులు ఎస్డీ షాహిద్, ఎస్కే డాక్టర్ రసూల్, ఎస్కే ఖాజా, ఎస్కే జంషీర్ అహమ్మద్, గుడిపాటి ఖాదర్, ఎస్కే ఫిరోజ్, ఎస్కే మస్తాన్‌వలి, ముస్తాఫా, పీసీ కేవవులు, మీరావలి, నాయబ్ రసూల్, రహీంబాష, ఆరీఫ్, ముస్లిం యూత్, వివిధ మసీద్ కమిటీల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. కనిగిరిలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మహా నిరసన శాంతి ర్యాలీ -
గరుడ వాహనంపై విష్ణుమూర్తిగా చెన్నకేశవుడు
మార్కాపురం టౌన్: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి గరుడ వాహనోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున గరుడ వాహనంపై శ్రీమహావిష్ణువు అలంకారంలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడోత్సవం రోజున శ్రీ మహావిష్ణువు అలంకారంలో చెన్నకేశవస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. నగరోత్సవంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తల్లి కుందురు సుబ్బమ్మ, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మాజీ ఆలయ చైర్మన్ పి.కేశవరావు, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, పురప్రముఖులు, అధికారులు, ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. నేడు రథోత్సవం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి అత్యంత వైభవంగా రథోత్సవం సోమవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని జయప్రదం చేయాలని కోరారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు నేడు చెన్నకేశవుని రథోత్సవం -
క్రీస్తు పునరుత్థానం..లోకానికి పర్వదినం
ఏసుక్రీస్తు సమాధి నుంచి తిరిగి పునరుత్థానం చెంది..లోకానికి తన మహిమను చాటిన ఈస్టర్ పర్వదినాన్ని జిల్లాలోని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలుచోట్ల క్రైస్తవ యువకులు రంగులు చల్లుకుంటూ, బాణసంచా కాల్చుతూ క్రీస్తు ప్రతిమలతో ఉత్సాహంగా ర్యాలీలు నిర్వహించారు. గతించిన తమ ఆత్మీయుల సమాధులను అలంకరించి వారిని స్మరించుకున్నారు.ఒంగోలు కొండపై ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు– 8లో -
ఈదురు గాలులకు అపార నష్టం
గిద్దలూరు రూరల్: ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో మండలంలోని వెల్లుపల్లె, వెంగళ్‌రెడ్డి పల్లె, జయరాంపురం గ్రామాల్లోని పొగాకు, బొప్పాయి, అరటి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 6 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ముండ్లపాడు ఏఈ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించారు. గాలివానతో పంట పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సిమెంట్ దిమ్మెల మీద నుంచి కిందిపడిపోయాయి. దీంతో వ్యవసాయ బోర్లకు సంబంధించి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల పనులు సత్వరమే చేస్తామని ఏఈ తెలిపారు. గాలులతో వర్షం కురవడంతో కొన్ని ప్రాంతాల్లో అరటి చెట్టు నేలకొరిగాయి. వెల్లుపల్లె గ్రామానికి చెందిన వీరంరెడ్డి హనుమంతారెడ్డి రైతు పొగాకు పంట నేలకొరగడంతో సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లింది. 5 ఎకరాల పొగాకు పంటలో ఎండిన పొగాకును బేళ్లుగా కట్టేందుకు ఉంచిన పందిళ్లు పూర్తిగా నేలమట్టమై వర్షంతో పొగాకు తడిసి పనికిరాకుండా పోయిందని రైతు వాపోయాడు. విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్టు కొమ్మలు సైతం రోడ్లకు అడ్డంగా పడ్డాయి. ప్రభుత్వం నష్టపోయన వారిని ఆదుకోవాలని రైతులు కోరారు. -
దగా డీఎస్సీ
ఉపాధ్యాయ లెక్కల్లో తిరకాసులు.. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన పాఠశాలల ప్రకారం ఉండాల్సిన ఉపాధ్యాయుల వివరాలకు సంబంధించి చేస్తున్న ప్రకటనలు సత్యదూరమని టీచర్ల సంఘాలు విమర్శిస్తున్నాయి. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునః ప్రారంభమై ఆగస్టు నాటికి విద్యార్థుల సంఖ్య నిర్ధారితమవుతుందని, ఆ ప్రకారం పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల లెక్కతేలుతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటిస్తున్న నూతన విధానం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు బతికి బట్టకట్టే పరిస్థితి లేదని, కేవలం ప్రైవేటు పాఠశాలలకే ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆరోపిస్తున్నారు. -
బీచ్ కబడ్డీ ఉమ్మడి ప్రకాశం జిల్లా పురుషుల జట్టు ఎంపిక
చినగంజాం: బీచ్ కబడ్డీ ఉమ్మడి ప్రకాశం జిల్లా పురుషుల జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించారు. మే నెల 2 వ తేదీ నుంచి కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొననున్నట్లు అంతర్జాతీయ క్రీడాకారుడు, కోచ్ ఎం.గిరిబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి పోటీల్లో పాల్గొనే సీ్త్ర, పురుషుల జట్టులకు ప్రయాణపు ఖర్చులు, ఇతర ఖర్చులు చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. చినగంజాం గ్రామంలో గత 15 సంవత్సరాలుగా స్వచ్చందంగా కబడ్డీ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్న బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు మరపాల గిరిబాబు, క్లబ్ కార్యవర్గ సభ్యులను ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ ఎన్ చంద్రమోహన రెడ్డి, ప్రెసిడెంట్ కుర్రా భాస్కరరావు, కార్యదర్శి వై పూర్ణచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, ట్రజరర్ డీ రమేష్, బీ నాగాంజనేయులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పురుషుల జట్టు ఇదీ.. గాలి లక్ష్మారెడ్డి, జీ సమరసింహారెడ్డి, జీ బాలకృష్ణారెడ్డి, కే వెంకటేష్, వై రాజశేఖర్ రెడ్డి, కే ప్రసాద రెడ్డి, బీ భరత్ రెడ్డి, కే హరిప్రసాద్‌రెడ్డి, కే రామాంజిరెడ్డి, జీ లక్ష్మారెడ్డి, పీ బ్రహ్మారెడ్డి, బీ సురేష్ రెడ్డి, ఎన్ ఉమామహేశ్వరరావు, పీ వినీత్ రెడ్డి, కే బ్రహ్మయ్య, కోచ్ యం గిరిబాబు, మేనేజర్ బోగిరెడ్డి నాగాంజనేయులు రెడ్డి.