
కారు ఢీకొని యువకుడు మృతి
యర్రగొండపాలెం: మోటారు సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి సమీపంలో గురువారం రాత్రి 12గంటల సమయంలో చోటుచేసుకుంది. యర్రగొండపాలేనికి చెందిన టి.దిలీప్(25) బైక్‌పై కుంట వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బోయలపల్లి డంపింగ్ యార్డు వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన దిలీప్‌కు స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.చౌడయ్య తెలిపారు.
బైకులు ఢీకొని ఐదుగురికి గాయాలు
యర్రగొండపాలెం: ఎదురెదురుగా వస్తున్న మోటారుసైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం యర్రగొండపాలెం మండలంలోని మురారిపల్లె చెరువుకట్ట వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. పుల్లలచెరువు మండలంలోని పిడికిటివానిపల్లె గ్రామానికి చెందిన ఏడుకొండలు, చెన్నయ్య, వెంకటేశ్వర్లు వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై యర్రగొండపాలెం వస్తున్నారు. అదే మండలంలోని నాయుడుపాలెం గ్రామానికి చెందిన అంజయ్య, ఏడుకొండలు యర్రగొండపాలెంలో తమ పనులు ముగించుకొని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. మురారిపల్లె చెరువుకట్ట వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుకొండలు, చెన్నయ్యకు తీవ్రంగా, మిగిలిన ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

కారు ఢీకొని యువకుడు మృతి