
ఘనంగా వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు
ఒంగోలు సిటీ: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చుండూరు రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా చుండూరు రవిబాబు మాట్లాడుతూ వైవీ సుబ్బారెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక బొమ్మరిల్లు అనాథ అశ్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పిల్లలతో కేక్ కట్ చేయించి పంచిపెట్టారు. అనంతరం చిన్నారులకు అన్నదానం చేశారు.
● వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ విభాగం అధ్యక్షుడు శేషారెడ్డి, లీగల్ సెల్ సిటీ ప్రెసిడెంట్ సంపత్‌కుమార్, కత్తి కోటేష్‌బాబు, పీవీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.